Reduced prices
-
పెట్రో ధరలు తగ్గించే యోచనలో కేంద్రం!
న్యూఢిల్లీ: అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి కాస్తంత ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే ఉద్దేశంతో ప్రజలకు పెట్రో ధరల భారం తగ్గించనుందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.6–10 తగ్గించాలని మోదీ సర్కార్ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోదీ ఆమోదం కోసం పంపించారని వార్తలొచ్చాయి. అయితే ఈ ధరల సవరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చాలా నెలలుగా ప్రభుత్వరంగ రిటైల్ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గించలేదు, పెంచలేదు. గత ఆర్థికసంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై పడేశాయి. దీంతో అప్పుడు ధరలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆమేరకు రిటైల్ అమ్మకం ధరలను సంస్థలు తగ్గించలేదు. దాంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.58,198 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకున్నాయి. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8 , లీటర్ డీజిల్ ధర రూ.6 తగ్గింది. కొద్ది నెలలుగా కీలక రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచలేదని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరింత తగ్గించనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
పెట్రో ధరల తగ్గింపుపై ప్రధాని మోదీ స్పందన
న్యూఢిల్లీ: దేశంలో చాలా కాలం తర్వాత తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు చేశారు. దీంతో పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 మేర తగ్గుతుందని ఆమె ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల ప్రయోజనాలే తమకు తొలి ప్రాధాన్యమంటూ ఆయన సదరు ట్వీట్లో వ్యాఖ్యానించారు. శనివారం తీసుకున్న కీలక నిర్ణయాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గేలా తీసుకున్న నిర్ణయంతో పలు రంగాలకు సానుకూల ప్రభావం లభించనుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో దేశ ప్రజలకు ఊరట లభించనుందని, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్వీట్‌కు నిర్మలా సీతారామన్ పెట్రో ధరలను తగ్గిస్తూ చేసిన ట్వీట్‌ను ఆయన జత చేశారు. It is always people first for us! Today’s decisions, especially the one relating to a significant drop in petrol and diesel prices will positively impact various sectors, provide relief to our citizens and further ‘Ease of Living.’ https://t.co/n0y5kiiJOh — Narendra Modi (@narendramodi) May 21, 2022 Ujjwala Yojana has helped crores of Indians, especially women. Today’s decision on Ujjwala subsidy will greatly ease family budgets. https://t.co/tHNKmoinHH — Narendra Modi (@narendramodi) May 21, 2022 -
భారీ పెట్రో ఉపశమనం
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల మంటతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఈ తగ్గింపు దోహదపడుతుందని అన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున తగ్గిపోతే వాస్తవంగా క్షేత్రస్థాయిలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.9.5, డీజిల్ ధర రూ.7 చొప్పున తగ్గుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.లక్ష కోట్ల భారం పడుతుందన్నారు. రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలని నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.200 చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏడాదిలో 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. 9 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ ఇవ్వడం వల్ల కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.6,100 కోట్ల భారం పడనుంది. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్æ డ్యూటీ తగ్గింపు ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ రూ.96.67 పలుకుతోంది. కేంద్ర పన్నుల తగ్గింపుతో ఆదివారం ఈ ధరలు వరుసగా రూ.95.92, రూ.89.67కు పడిపోనున్నాయి. పీఎం ఉజ్వల యోజన కింద ఢిల్లీలో సిలిండర్ రేటు రూ.1,003 ఉంది. రూ.200 రాయితీతో రూ.803కే పొందవచ్చు. పెట్రో, వంట గ్యాస్ ధరల భారంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ప్లాస్లిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి సరుకుల కోసం మనం ఎక్కువగా విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. అందుకే దిగుమతి చేసుకొనే ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల మన దేశంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయన్నారు. అంతేకాకుండా ఇనుము, ఉక్కు ధరలను సైతం తగ్గించడానికి వీలుగా ఆయా ముడి సరుకులపై కస్టమ్స్ పన్ను తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఉక్కుకు సంబంధించి కొన్ని ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించబోతున్నట్లు తెలిపారు. కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. దేశీయ అవసరాలకు సరిపడా సిమెంట్‌ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు నిర్మల ప్రకటించారు. సిమెంట్ ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. కాగా, స్టేట్ ట్యాక్స్ లీటర్ పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 చొప్పున తగ్గిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని పాక్షికంగానే తగ్గించిందని విమర్శించింది We are reducing the Central excise duty on Petrol by Rs 8 per litre and on Diesel by Rs 6 per litre. This will reduce the price of petrol by Rs 9.5 per litre and of Diesel by Rs 7 per litre: Union Finance Minister Nirmala Sitharaman (File Pic) pic.twitter.com/13YJTpDGIf — ANI (@ANI) May 21, 2022 ప్రజలే మాకు ప్రథమం: ప్రధాని మోదీ తమ ప్రభుత్వానికి ప్రజలే ప్రథమం అని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజా ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నేపథ్యంలో ఆయన శనివారం ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల వివిధ రంగాలపై సానుకూల ప్రభావం పడుతుందన్నారు. ఎరువులపై అదనంగా రూ.1.10 లక్షల కోట్ల రాయితీ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ పునద్ఘాటించారు. పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ చర్యల ఫలితంగానే తమ హయాంలో సగటు ద్రవ్యోల్బణం గత ప్రభుత్వాల కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించామన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయన్నారు. అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ మన దేశంలో సరుకుల ధరలను అదుపులో ఉంచామని గుర్తుచేశారు. ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయాయని, ఈ భారం మన రైతులపై పడకుండా ఎరువులపై సబ్సిడీకి రూ.105 లక్షల కోట్లకు అదనంగా రూ.1.10 లక్షల కోట్లు కేటాయించామన్నారు. -
ధరాఘాతం నుంచి ఊరట.. అదుపులోకి వస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు మరో శుభవార్త ! వరుసగా రెండో నెల కూడా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) తగ్గింది. ద్రవ్యల్బణానికి ముఖ్యమైన సూచీల్లో ఒకటిగా చెప్పుకునే డబ్ల్యూపీఐ తగ్గనుండటంతో క్రమంగా ధరలు దిగివస్తాయనే ఆశలు కలుగుతున్నాయి. 2021 జులైకి సంబంధించి డబ్ల్యూపీఐ 11.12 శాతంగా నమోదు అయ్యింది. గతేడాది ఇదే నెలకు సంబంధఙంచి డబ్ల్యూపీఐ 12.07 శాతంగా నమోదైంది. ఈ మేరకు కేంద్రం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ వివరాలు వెల్లడించింది. గతేడాదిలో పోల్చితే ఒక శాతం పెరగాల్సి ఉండగా తగ్గింది. ఇక ఆహర ధాన్యాలకు సంబంధించి గతేడాది 6.66 శాతం ఉండగా ఈసారి అది 4.46 శాతానికి పడిపోయింది. ఫ్యూయల్, పవర్ సెక్డార్లో 32.85 శాతం నుంచి 2602 శాతానికి తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. గతంలో కోవిడ్ కారణంగా ప్రయాణికుల రద్దీ నియంత్రణకు ధరలు పెంచిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్, హైదరాబాద్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50 నుంచి రూ.20కి తగ్గించారు. మిగతా స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10కి తగ్గిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేరుగా కౌంటర్ వద్ద, లేదా యూటీఎస్ యాప్, క్యూఆర్ స్కాన్ ద్వారా తీసుకోవచ్చని కూడా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
పలు మెడికల్ పరికరాలపై భారీ తగ్గింపు..!
న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు మెడికల్ పరికరాల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పల్స్ ఆక్సిమీటర్లు, బీపీ చెకింగ్ మెషిన్, నెబ్యూలైజర్, డిజిటల్ థర్మో మీటర్,గ్లూకో మీటర్ వంటి మెడికల్ పరికరాలకు కరోనా నేపథ్యంలో గణనీయంగా డిమాండ్ పెరిగింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఐదు మెడికల్ పరికరాలపై ట్రేడ్ మార్జిన్‌ను ప్రభుత్వం పరిమితం చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. దీంతో పలు మెడికల్ పరికరాల ధరలు గణనీయంగా తగ్గనున్నట్లు తెలిపారు. ఈ ధరలు జూలై 20 నుంచి అమలులోకి వస్తుందన్నారు. 2022 జనవరి 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ధరలు అమలులో ఉండనున్నాయి. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, సంబంధిత పరికరాల ధరలను నియంత్రించే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ), ప్రైజ్ టూ డిస్ట్రిబ్యూటర్ (పిటిడి) స్థాయిలో 70 శాతం ధరలను పరిమితం చేసింది. పరిశ్రమల సంఘాలైన ఫిక్కీ, అద్వామెడ్, అమ్చామ్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఐదు మెడికల్ పరికరాలకు చెందిన 684 ఉత్పత్తులు, 620 ఇతర ఉత్పత్తులు ఎమ్ఆర్పీ ధరల్లో సుమారు 88 శాతం తగ్గనున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి కోవిడ్-19 సంబంధిత మెడికల్ ఉత్పత్తులను తగ్గించిన విషయం తెలిసిందే. పీపీఈ కిట్, మాస్క్‌లు, పల్స్ ఆక్సిమీటర్లు, బీపాప్ యంత్రాలు, శానిటైజర్లు, ఇతర పరికరాలతో సహా కోవిడ్-19 ముఖ్యమైన వస్తువులపై ఆదాయపు మంత్రిత్వ శాఖ పన్ను మాఫీ చేసింది. అంతేకాకుండా రెమ్‌డెసివిర్, హెపారిన్ సహా అన్ని కరోనావైరస్ మెడిసిన్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. In larger public interest, Government caps Trade Margin for 5 Medical Devices, effective from July 20; -Pulse Oximeter -Blood Pressure Monitoring Machine -Nebulizer -Digital Thermometer -Glucometer It will hugely reduce prices of Medical devices.https://t.co/4YA2zay5yl — Mansukh Mandaviya (@mansukhmandviya) July 24, 2021 -
ఊరట : పసిడి నేల చూపులు
ముంబై : కొండెక్కిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధరలు పడిపోయాయి. గతవారం బండారం ధరలు రికార్డు స్ధాయిలో 56,000 రూపాయలకు చేరినప్పటి నుంచి పసిడి ఒడిదుడుకులతో సాగుతోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు ఈరోజూ దిగివచ్చాయి. ఎంసీఎక్స్‌లో శుక్రవారం పదిగ్రాముల బంగారం 415 రూపాయలు పతనమై 52,515 రూపాయలకు తగ్గింది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలూ దిగివచ్చాయి. కిలో వెండి ఏకంగా 2377 రూపాయలు తగ్గి 68,700 రూపాయలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1952 డాలర్లకు దిగివచ్చింది. ఈ వారం బంగారం ధరలు 4 శాతం మేర తగ్గాయి. కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ను నమోదు చేశామని రష్యా ప్రకటించిన అనంతరం ఇన్వెస్టర్లు బంగారంలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక మరికొద్ది రోజులు బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగి ఆపై నిలకడగా పెరుగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్, ఆర్థిక అనిశ్చితి, అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌లతో ఈ ఏడాది బంగారం ధరలు ఇప్పటికే 30 శాతం పెరగడం గమనార్హం. చదవండి : బంగారం కొండ దిగుతోంది -
భారీగా దిగివచ్చిన బంగారం
ముంబై : ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. కరోనా భయాలు పసిడి డిమాండ్‌ను తగ్గిస్తాయనే ఆందోళన బులియన్ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. సంక్షోభ సమయంలో షేర్లు, కరెన్సీల వైపు మదుపుదారులు మొగ్గుచూపడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం రూ 492 తగ్గి రూ 43,350 పలికింది. ఇక కిలో వెండి రూ 379 పతనమై రూ 39,419కి దిగివచ్చింది. కరోనా ఆందోళనతో మరికొన్ని రోజులు హాట్మెటల్స్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: మెరిసిన బంగారం.. -
రుణ రేట్లను తగ్గించిన యూనియన్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్.. మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను స్వల్పంగా తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వడ్డీరేటును 0.10 శాతం తగ్గించింది. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.70 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. ఆరునెలల ఎంసీఎల్ఆర్ను 8.50 శాతానికి కుదించింది. మరోవైపు బేస్‌రేటును 0.10 శాతం తగ్గించింది. 9.10 శాతం నుంచి 9 శాతానికి బేస్‌రేటును కుదించినట్లు బ్యాంక్ తెలిపింది. -
‘పెట్రో’ ధరను రూ.2 తగ్గించిన కర్ణాటక
బెంగళూరు: పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఈ ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు. కలబురిగిలో సోమవారం ఆయన మాట్లాడుతూ..‘సామాన్యుడికి భారంగా మారిన పెట్రో ధరలను తగ్గించాలని తమ జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై అమ్మకం పన్ను 3.25, 3.27% చొప్పున తగ్గనుంది. ఇది ప్రస్తుతం 32%, 21 శాతంగా ఉంది’ అని వివరించారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.80, డీజిల్ రూ.76.21గా ఉంది. మహారాష్ట్రలో లీటర్ పెట్రోలు రూ.91 ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోలు ధర రూ.90కు చేరుకుంది. ముంబై మినహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోలు ధర దేశంలోనే అత్యధికంగా రూ.91కి ఎగబాకింది. పెట్రోలు, డీజిల్‌లపై సర్‌చార్జితో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా 39% వరకు వ్యాట్ వసూలు చేస్తోంది. -
ఆగస్ట్‌లో తగ్గిన సేవల రంగం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీయ సేవల రంగం కార్యకలాపాలు 21 నెలల గరిష్ట స్థాయి నుంచి ఆగస్ట్‌లో తగ్గుముఖం పట్టాయి. నూతన ఆర్డర్లు తగ్గడం, అదే సమయంలో కంపెనీలు ఉద్యోగులను పెంచుకోవడంతో ఉత్పత్తి వ్యయం ఎగిసేందుకు దారితీసినట్టు నెలవారీ సర్వేలో తెలిసింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జూలైలో 54.2 శాతానికి చేరగా, ఆగస్ట్‌లో 51.5 శాతానికి తగ్గింది. ఆగస్ట్‌లో నూతన ఆర్డర్ల రాక మూడు నెలల్లోనే కనిష్టంగా ఉంది. సేవల రంగం వృద్ధి గరిష్టానికి చేరి చల్లబడినట్టు ఈ గణాంకాలు సంకేతాలిస్తున్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ అనలిస్ట్ ఆష్నా దోధియా తెలిపారు. ఇక సీజన్‌వారీగా సర్దుబాటు చేసిన నికాయ్ ఇండియా కాంపోజిట్ (సేవలు, తయారీ) పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ సైతం జూలైలో 54.1 శాతం కాగా, ఆగస్ట్‌లో 51.9 శాతానికి తగ్గింది. తయారీ, సేవలు రెండింటిలోనూ వృద్ధి బలహీనంగా ఉందని ఇది తెలియజేస్తోంది. ఇన్పుట్ వ్యయానికి సంబంధించి ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల్లోనే బలంగా ఉందని తేలింది. సానుకూల అంశం ఏమిటంటే వ్యాపార విశ్వాసం ఈ ఏడాది మే నెల తర్వాత అధిక స్థాయికి చేరింది. -
భారీగా తగ్గిన ఇంటర్ పుస్తకాల ధరలు!
ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పుస్తకాల ధరలు భారీగా తగ్గాయి. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో పుస్తకాల నాణ్యత పేరుతో ధరలను విపరీతంగా పెంచిన అధికారుల వైఖరితో తెలుగు అకాడమి తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన పలుమార్లు చర్చించి పుస్తకాల ధరలు తగ్గించాలని నిర్ణయించారు. మరోవైపు పుస్తక విక్రేతలు ఇప్పటికే పాత ధరలతో కొనుగోలు చేసిన పుస్తకాల ధరలను కూడా తగ్గించి... వారు ఎక్కువగా చెల్లించిన సొమ్ము మేరకు అదనంగా పుస్తకాలను ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఇతర వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని పుస్తకాల ధరలు తగ్గుతున్నాయి.