ముంబై : ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. కరోనా భయాలు పసిడి డిమాండ్‌ను తగ్గిస్తాయనే ఆందోళన బులియన్ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. సంక్షోభ సమయంలో షేర్లు, కరెన్సీల వైపు మదుపుదారులు మొగ్గుచూపడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం రూ 492 తగ్గి రూ 43,350 పలికింది. ఇక కిలో వెండి రూ 379 పతనమై రూ 39,419కి దిగివచ్చింది. కరోనా ఆందోళనతో మరికొన్ని రోజులు హాట్‌మెటల్స్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment