స్ట్ర్రెయిన్‌ ఎఫెక్ట్‌- పసిడి, వెండి హైజంప్‌ | Gold, Silver prices jumps in MCX and New york Comex | Sakshi
Sakshi News home page

స్ట్ర్రెయిన్‌ ఎఫెక్ట్‌- పసిడి, వెండి హైజంప్‌

Published Mon, Jan 4 2021 10:36 AM | Last Updated on Mon, Jan 4 2021 3:15 PM

Gold, Silver prices jumps in MCX and New york Comex - Sakshi

న్యూయార్క్/ ముంబై: కరోనా కొత్త స్ట్ర్రెయిన్‌ కారణంగా బ్రిటన్‌లో ఓవైపు కఠిన లాక్‌డవున్‌ ఆంక్షలను అమలు చేస్తుంటే.. మరోపక్క టోక్యోసహా పలు ప్రాంతాలలో జపాన్‌ సైతం ఎమర్జెన్సీ విధించనున్న వార్తలు పసిడికి ఒక్కసారిగా డిమాండ్‌ను పెంచాయి.  దీంతో న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1.6 శాతం పుంజుకుని 1926 డాలర్లకు ఎగసింది. ఇది 8 వారాల గరిష్టంకాగా.. ఈ బాటలో దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ రూ.565 బలపడింది. విదేశీ మార్కెట్లో వెండి మరింత అధికంగా 3 శాతం జంప్‌చేయగా.. దేశీయంగానూ రూ. 1,400 పెరిగింది. గత వారం అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు మెరుస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ రూపు మార్చుకుని వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా మళ్లీ సంక్షోభ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనలు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు బులియన్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా.. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడికి నేటి ట్రేడింగ్‌లో 1914-1928 డాలర్ల వద్ద రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్‌ డైరెక్టర్‌ మనోజ్‌ జైన్‌ అంచనా వేశారు. ఇదేవిధంగా 1884-1870 డాలర్ల వద్ద సపోర్ట్స్‌ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ట్రేడింగ్‌ వివరాలు చూద్దాం.. చదవండి: (9వ రోజూ జోరు- సెన్సెక్స్‌@ 48,000)

లాభాలతో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 565 బలపడి రూ. 50,809 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ ధర కాగా.. తొలుత రూ. 50,300 వద్ద హుషారుగా ప్రారంభమైన పసిడి తదుపరి 50,892వద్ద గరిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ రూ. 1,394 జంప్‌చేసి రూ. 69,517 వద్ద కదులుతోంది. రూ. 68,499 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 70,259 వరకూ దూసుకెళ్లింది. (2021లో పెట్టుబడికి 6 స్టాక్స్‌)

హుషారుగా
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్‌ 31 డాలర్లు(1.35 శాతం) పెరిగి 1,926 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 1.3 శాతం బలపడి 1,923 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 3.1 శాతం జంప్‌చేసి 27.22 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా..  వెండి మార్చి ఫ్యూచర్స్‌ ధరలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement