దేశీయ మల్టీకమోడిటీ ఎక్చ్సేంజ్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర రూ.49000 దిగువున కదలాడుతోంది. ఎంసీఎక్స్‌లో శుక్రవారం ఉదయం సెషన్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.15ల స్వల్ప లాభంతో రూ.48893 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. ఈ వారంలో రూ.49,348 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకిన తర్వాత, బంగారం ధర ముందుకు కదిలేందుకు సంశయిస్తోంది. కోవిడ్-19 కేసులు శరవేగంగా పెరుగుతున్నప్పటికీ.., ఆర్థికవ్యవస్థ రికవరీ ఆశలతో ఈక్విటీ మార్కెట్లలో ఇప్పటికీ కొంత సానుకూల వాతావరణం నెలకొనే ఉంది. ఫలితంగా నేడు బంగారం ధర పరిమితి శ్రేణిలో కదలాడుతున్నాయి. నిన్నరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సరికి ఔన్స్ బంగారం ధర రూ.281లు నష్టాన్ని చవిచూసి రూ.48878 వద్ద ముగిసింది.
పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలహీనతలు రానున్నరోజుల్లో బంగారానికి డిమాండ్‌ను పెంచుతాయని బులియన్ నిపుణులు భావిస్తున్నారు. బంగారానికి అప్‌సైడ్‌లో రూ.49,050-49,300వద్ద కీలక నిరోధ స్థాయిని కలిగి ఉంది. డౌన్‌సైడ్‌లో 48,330 వద్ద కీలక మద్దతు ధర ఉందని వారు అంచనా వేస్తున్నరు.
అంతర్జాతీయంగా స్వల్ప లాభాల్లో:
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర శుక్రవారం స్వల్పలాభంతో ట్రేడ్ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ బంగారం ధర 2.50డాలర్లు స్వల్పంగా పెరిగి రూ.1,806.30 వద్ద ట్రేడ్ అవుతోంది. అర్థిక అగ్రరాజ్యమైన అమెరికాలో గురువారం ఒక్కరోజే అత్యధికంగా 60వేల కరోనా కేసులు నమోదు కావడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక చర్యల్లో భాగంగా బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
Comments
Please login to add a commentAdd a comment