ముంబై : కరోనా ధాటికి షేర్లు, కరెన్సీ కకావికలమవుతుంటే బంగారం ధరలు సైతం దిగివస్తున్నాయి. మహమ్మారి విజృంభణతో కొనుగోళ్లు పడిపోయిన క్రమంలో పసిడి ధర పతనమైంది. డెడ్లీ వైరస్ విస్తృత వ్యాప్తితో ప్రజలు నగదు నిల్వల వైపు మొగ్గుచూపడంతో చుక్కల్లో విహరించిన యల్లోమెటల్ దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పతనమవడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం ధర రూ 534 తగ్గి రూ 39,710 పలికింది. ఇక కిలో వెండి రూ 534 పతనమై రూ 34,882కు పడిపోయింది. (కరోనా : ఫేస్‌బుక్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్)
చదవండి : 5 రోజుల్లో 5000 తగ్గి మళ్లీ ఎగిసిన పసిడి
Comments
Please login to add a commentAdd a comment