
మోదీ ఆహ్వానాన్ని తిరస్కరించిన సీఎం
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చైనా పర్యటనకు వెళ్లడం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. పంచాయతీ ఎన్నికల కారణంగా వెళ్లలేకపోతున్నానని చెప్పారు. ప్రధాని నుంచి తనకు ఆహ్వానం ఆలస్యంగా అందిందని అన్నారు. సీఎం పదవి అధిష్టించిన రెండేళ్ల తర్వాత సిద్ధరామయ్య పంచాయతీ ఎన్నికల పరీక్ష ఎదుర్కొబోతున్నారు. మే 29, జూన్ 2న కర్ణాటకలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
కాగా మోదీ ఆఫర్ ను సిద్ధరామయ్య కదనడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చిలో స్వచ్ఛభారత్ అభియాన్ టాస్క్ ఫోర్స్ కు కన్వీనర్ గా ఉండాలని కోరగా ఆయన తిరస్కరించారు. సభ్యుడిగా మాత్రమే ఉంటానని చెప్పారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు మోదీ చైనాలో పర్యటించనున్నారు.