ట్రాఫిక్ అంతరాయానికి సీఎం క్షమాపణలు | karnataka CM siddaramaiah sorry for traffic jam in bangalore | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ అంతరాయానికి సీఎం క్షమాపణలు

Published Mon, Aug 17 2015 7:44 PM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

ట్రాఫిక్ అంతరాయానికి సీఎం క్షమాపణలు

ట్రాఫిక్ అంతరాయానికి సీఎం క్షమాపణలు

బెంగళూరు: ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పారు. తన వల్ల బెంగళూరు వాసులకు ట్రాఫిక్ చిక్కులు ఏర్పడినందుకు చింతిస్తున్నానని అన్నారు.

త్వరలో జరగబోయే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో బెంగళూరు వాసులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై విమర్శలు రావడంతో సీఎం సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పారు. ఇదిలావుండగా బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో సొంత రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన సినీ తారలను ఉపయోగించుకునేందుకు కేపీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని రమ్యా, భావనతో పాటు చిరంజీవి, ఖుష్భును ఆహ్వానించినట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement