‘రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుంది. అంతసేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటాం. బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది’ బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఇటీవల ఎక్స్‌లో ఓ మహిళ పెట్టిన పోస్ట్ ఇది. ఇండియా ఐటీ క్యాపిటల్‌గా పేరుగాంచిన బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యం. బెంగళూరు వాసులు రోడ్డు మీదకు వచ్చారంటే నరకప్రాయమే. ట్రాఫిక్ రద్దీతో గంటలకొద్దీ రోడ్లపై గడపాల్సి ఉంటుంది. తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతుంటారు. జోకులు, సెటైర్లు కూడా షేర్ చేస్తుంటారు.
బెంగళూరు మెట్రో సిటీలో జనాభా అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతంలో బెంగళూరు మహా నగరంలో దాదాపు 1.4 కోట్ల మంది నివసిస్తున్నారు. పెరుగుతున్న జనాభా కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా అధికం కావడంతో ట్రాఫిక్ రద్దీ నానాటికీ ఎక్కువవుతోంది. నగర రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా ఎక్కడా చూసినా ట్రాఫిక్ జామ్‌లే దర్శనమిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ట్రాఫిక్‌ను నియంత్రించే వ్యూహాత్మక, సమగ్ర విధానం చాలా అవసరమని బెంగళూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చేయాల్సిన వాటి గురించి బెంగళూరు వాసి ఒకరు ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తావించడం ఆలోచింపజేస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం 1.05 కోట్ల ప్రైవేటు వాహనాలు ఉండగా, గత అక్టోబర్ నెలలో కొత్తగా 70 వేల ప్రైవేటు వెహికిల్స్ రోడ్డెక్కినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీకి ఎక్కువగా (87.6 శాతం) ప్రైవేటు వాహనాలు కారణమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బెంగళూరులో ట్రాఫిక్ మరింత నరకప్రాయం అవుతుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 5 ఏళ్లలో చేపట్టాల్సిన చర్యలు..
1. బెంగళూరు జనాభాలో ప్రస్తుతం 10 శాతం మంది మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఈ సంఖ్యను 70 శాతానికి పెంచాలి.
2. ఆర్టీసీ బస్సు, మెట్రో రైలు, సైకిల్ రైడ్ వంటి బహుముఖ ప్రయాణాలను ప్రోత్సహించాలి.
3. ఆక్రమణలు తొలిగించి వీధులను ప్రయాణానికి అనువుగా మార్చాలి. పాదచారులు ఏ ఆటంకాలు లేకుండా నడిచేలా ఉండాలి.
చదవండి: ఇండియా సిలికాన్ సిటీలో సిగ్నల్ దాటాలంటే చుక్కలే
4. బెంగళూరులో బస్సుల సంఖ్య పెంచాలి. పెద్ద బస్సులతో పాటు మినీ బస్సులు కూడా అవసరం. నివాస ప్రాంతాల నుంచి మెట్రో రైలు, పెద్ద బస్సులకు అనుసంధానంగా మినీ బస్సులు నడపాలి.
5. నగరంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ, ఎక్కువ మంది ప్రయాణించేలా మెట్రో రైలు పరిధిని విస్తరించాలి. సబర్బన్ రైలు సేవలను కూడా విస్తృతం చేయాలి.
6. ఫుట్‌పాత్‌లు, సైకిల్, బస్ లేన్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా చూడాలి.
BENGALURU city is now home to 1.4 crore people & 1.05 crore private vehicles
The city added around 70k new private vehicles in the last month, with Private vehicles now dominating 87.6% of traffic
Steps needed to be taken during the next 5 years as a major priority for the city… pic.twitter.com/ulagWNybVR— Karnataka Weather (@Bnglrweatherman) November 21, 2024
Comments
Please login to add a commentAdd a comment