BBMP
-
బీబీఎంపీ బోర్ల స్కాం.. రెండోరోజూ ఈడీ తనిఖీలు
బనశంకరి: బెంగళూరు మహానగర పాలికెలో బోరుబావుల తవ్వకం, ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు పథకంలో 2016–2019 మధ్య కోట్లాది రూపాయల అక్రమాల ఆరోపణలపై ఈడీ అధికారులు రెండవ రోజు బుధవారం కూడా తనిఖీలు కొనసాగించారు. పాలికె చీఫ్ ఇంజినీర్ బీఎన్.ప్రహ్లాద్రావ్ ఆఫీసులో సోదాలు చేశారు. బీబీఎంపీ చీఫ్ అకౌంటెంట్ బీనా ను విచారించారు. పాలికె ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 8 వలయాల చీఫ్ ఇంజినీర్లను పాలికె ఆఫీసుకు పిలిపించి కూలంకుషంగా సమాచారం రాబట్టారు. బొమ్మనహళ్లి, ఆర్ఆర్.నగర, మహదేవపుర, యలహంక, దాసరహళ్లి నియోజకవర్గాల్లోని 68 వార్డుల్లో 9,558 బోర్‌వెల్స్ తవ్వారు. దీంతో పాటు 976 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని బీబీఎంపీ అధికారులు లెక్కలు చూపారు. కానీ వెయ్యి బోర్లను తవ్వకుండానే తప్పుడు లెక్కలు చూపించి కోట్లాదిరూపాయల్ని కైంకర్యం చేశారని ఆరోపణలున్నాయి. మొత్తం రూ.400 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. -
బెంగళూరు ట్రాఫిక్.. ఇలా చేస్తే నో టెన్షన్!
‘రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుంది. అంతసేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటాం. బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది’ బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఇటీవల ఎక్స్‌లో ఓ మహిళ పెట్టిన పోస్ట్ ఇది. ఇండియా ఐటీ క్యాపిటల్‌గా పేరుగాంచిన బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యం. బెంగళూరు వాసులు రోడ్డు మీదకు వచ్చారంటే నరకప్రాయమే. ట్రాఫిక్ రద్దీతో గంటలకొద్దీ రోడ్లపై గడపాల్సి ఉంటుంది. తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతుంటారు. జోకులు, సెటైర్లు కూడా షేర్ చేస్తుంటారు.బెంగళూరు మెట్రో సిటీలో జనాభా అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతంలో బెంగళూరు మహా నగరంలో దాదాపు 1.4 కోట్ల మంది నివసిస్తున్నారు. పెరుగుతున్న జనాభా కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా అధికం కావడంతో ట్రాఫిక్ రద్దీ నానాటికీ ఎక్కువవుతోంది. నగర రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా ఎక్కడా చూసినా ట్రాఫిక్ జామ్‌లే దర్శనమిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ట్రాఫిక్‌ను నియంత్రించే వ్యూహాత్మక, సమగ్ర విధానం చాలా అవసరమని బెంగళూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చేయాల్సిన వాటి గురించి బెంగళూరు వాసి ఒకరు ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తావించడం ఆలోచింపజేస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం 1.05 కోట్ల ప్రైవేటు వాహనాలు ఉండగా, గత అక్టోబర్ నెలలో కొత్తగా 70 వేల ప్రైవేటు వెహికిల్స్ రోడ్డెక్కినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీకి ఎక్కువగా (87.6 శాతం) ప్రైవేటు వాహనాలు కారణమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బెంగళూరులో ట్రాఫిక్ మరింత నరకప్రాయం అవుతుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 5 ఏళ్లలో చేపట్టాల్సిన చర్యలు..1. బెంగళూరు జనాభాలో ప్రస్తుతం 10 శాతం మంది మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఈ సంఖ్యను 70 శాతానికి పెంచాలి.2. ఆర్టీసీ బస్సు, మెట్రో రైలు, సైకిల్ రైడ్ వంటి బహుముఖ ప్రయాణాలను ప్రోత్సహించాలి.3. ఆక్రమణలు తొలిగించి వీధులను ప్రయాణానికి అనువుగా మార్చాలి. పాదచారులు ఏ ఆటంకాలు లేకుండా నడిచేలా ఉండాలి.చదవండి: ఇండియా సిలికాన్ సిటీలో సిగ్నల్ దాటాలంటే చుక్కలే4. బెంగళూరులో బస్సుల సంఖ్య పెంచాలి. పెద్ద బస్సులతో పాటు మినీ బస్సులు కూడా అవసరం. నివాస ప్రాంతాల నుంచి మెట్రో రైలు, పెద్ద బస్సులకు అనుసంధానంగా మినీ బస్సులు నడపాలి.5. నగరంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ, ఎక్కువ మంది ప్రయాణించేలా మెట్రో రైలు పరిధిని విస్తరించాలి. సబర్బన్ రైలు సేవలను కూడా విస్తృతం చేయాలి.6. ఫుట్‌పాత్‌లు, సైకిల్, బస్ లేన్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా చూడాలి. BENGALURU city is now home to 1.4 crore people & 1.05 crore private vehiclesThe city added around 70k new private vehicles in the last month, with Private vehicles now dominating 87.6% of trafficSteps needed to be taken during the next 5 years as a major priority for the city… pic.twitter.com/ulagWNybVR— Karnataka Weather (@Bnglrweatherman) November 21, 2024 -
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో.. సిగ్నల్ దాటాలంటే చుక్కలే
సాక్షి బెంగళూరు: ఐటీ ఇండస్ట్రీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. నగర వాసులకు ట్రాఫిక్ అనేది నేడు అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా మారింది. రద్దీ సమయాల్లో ఒక్కో ట్రాఫిక్ సిగ్నల్ దాటాలంటే రెండు మూడు సార్లు ఆగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రశాంత వాతావరణం, నిండైన పచ్చదనంతో ఒకప్పుడు ఉద్యాననగరంగా గుర్తింపు పొందిన బెంగళూరులో ప్రస్తుతం జనాభా సంఖ్య కంటే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతూ రావడంతో ప్రస్తుతం నగరంలో రోడ్ల సమర్థ్యానికి మించి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో 1.40 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. దీంతో రోడ్ల విస్తరణకు బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికె) అడుగులు వేస్తోంది. దశాబ్ద కాలంలో మారిన నగరం..శరవేగంగా విస్తరిస్తున్న మహానగరం కావడం, కాంక్రీటీకరణ, అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ తదితర కారణాల వల్ల బెంగళూరు గడిచిన దశాబ్ద కాలంలో ఎంతో మారిపోయింది. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా మెట్రో, ఫ్లయ్వోవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినప్పటికీ ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరకడంలేదు. రోడ్ల విస్తరణ అభివృద్ధికి కావాల్సిన స్థలాన్ని స్వాదీనం చేసుకునేందుకు అవసరమైన ఆరి్థక వనరులు బీబీఎంపీ వద్ద లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఒక మహిళ ఇటీవల ఎక్స్‌లో చేసిన చిన్న పోస్టు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుందని, అంత సేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటారని, బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉందంటూ ఇక్కడి ట్రాఫిక్ని ఎద్దేవా చేస్తూ అనఘ అనే మహిళ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ ట్వీట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ ట్వీట్‌కు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో భారీ చర్చకు తెరతీసింది. అయితే బెంగళూరు ట్రాఫిక్ రద్దీకి ఆమె ట్వీట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని, నగరవాసులను ఎవ్వరిని కదిలించినా ఇలాంటి ట్రాఫిక్ వ్యథలు వందల కొద్దీ చెబుతారని నెటిజన్లు అంటున్నారు.బీబీఎంపీ పరిధిలో రహదారుల పొడవు: 12,878 కి.మీఇందులో ఆర్టిరియల్, సబ్ ఆర్టిరియల్ (అధిక సామర్థ్యంగల) రోడ్లు: 1344.84 కి.మీ నగరంలో రిజిష్టర్ అయిన వాహనాల సంఖ్య: 1.40 కోట్లుటామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారందేశంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 1ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 6నగరంలో సగటున 10 కి.మీ ప్రయాణించేందుకు పట్టే సమయం: 28 నిమిషాలు -
‘వాళ్లు నేరస్తులు కాదు..’ ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో సైన్‌బోర్డు, నేమ్ప్లేట్లల వ్యవహారం విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే. కన్నడ భాషలోనే సైన్ బోర్డులు పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. అయితే ఆందోళనకు దిగిన నిరసనకారులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప మండిపడ్డారు. అరెస్ట్ చేయబడిన నిరసనకారులు నేరస్తులు కాదని.. వారంతా కన్నడ భాష పరిరక్షకులని అన్నారు. కన్నడ భాషలనే నేమ్ ప్లేట్లు, సైన్ బోర్డులు పెట్టాలని నిరసన కారులు చేసిన డిమాండ్ ఆమోదయోగ్యమైందని తెలిపారు. వారిని ఎందుకు అరెస్ట్ చేశారలో తనకు ఇప్పటికీ అర్థం కావటంలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసిన నిరసన కారులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. ఇక కర్ణాటకలో వ్యాపారస్తులు తప్పనిసరిగా కన్నడ భాషలోనే సైన్ బోర్డులు పెట్టుకోవాలని అన్నారు. అయితే నిరసకారులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. నిరసన తెలిపేవారికి తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ.. చట్టం తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని తెలిపారు. చదవండి: ‘కన్నడ’ బోర్డుల రగడ -
‘కన్నడ’ బోర్డుల రగడ
బనశంకరి: వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయంపై దర్శనమిచ్చే సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్ల(నామఫలకాల)లో 60 శాతం బోర్డులు కన్నడలోనే ఉండాలనే బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) నిబంధన తాజాగా బెంగళూరు నగరంలో బోర్డుల విధ్వంసానికి దారితీసింది. కన్నడ నగరంలో వ్యాపారం చేసే వారు ఎవరైనా సరే తమ కార్యాలయం బోర్డును కన్నడ భాషలోనే పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. ఇంగ్లి‹Ùలో కనిపించిన ప్రతీ సైన్‌బోర్డును ధ్వంసంచేశారు. కొన్నింటిపై నలుపు రంగు పూశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేఆర్వీ కనీ్వనర్ టీఏ నారాయణ గౌడను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదంపై బృహత్ బెంగళూరు మహానగర ఉన్నతాధికారి తుషార్ గిరినాథ్ స్పందించారు. సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడలోనే ఉండాలన్న నిబంధనను ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి తెస్తామని, నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. -
భానురేఖ మృతిపై.. విస్తుపోయేలా నివేదిక
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన భానురేఖ(23).. బెంగళూరు అండర్‌పాస్ వరదలో చిక్కుకుని మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. రాజకీయంగానూ విమర్శలకు దారి తీసిన ఈ ఘటనపై.. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించగా, ఇంటర్నల్ రిపోర్టులో విస్తుపోయేలా విషయాలను చేర్చింది బెంగళూరు మహానగరపాలక సంస్థ. భానురేఖ మృతికి.. ఆమె స్వీయతప్పిదమే కారణమంటూ నివేదికను సిద్ధం చేసింది బీబీఎంపీ(బృహత్ బెంగళూరు మహానరగ పాలిక)!.‘‘ ఆ సమయంలో కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ కింద నీరు చేరింది. డ్రైవర్ అక్కడే ఉన్న బారికేడ్లను పట్టించుకోకుండా ముందుకు పోనిచ్చారు. ఆ సమయంలో కొందరు అక్కడే ఉండి కేకలు వేస్తూ వద్దని వారించారు. డ్రైవర్‌ను అడ్డుకునే అవకాశం ఉన్నా.. భానురేఖ ఆ పని చేయలేదు’’ అని బీబీఎంపీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భానురేఖ మృతికి తమ పౌర సేవల విభాగం ఏమాత్రం కారణం కాదని, ఇందులో తమ తరుపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం లేదని బీబీఎంపీ పేర్కొంది. అలాగే.. ఘటన నాడు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి ఎండుటాకులు, చెట్ల కొమ్మలు నేలరాలాయని, వర్షంతో కలిసి అవి కేఆర్ అండర్‌పాస్ వద్ద నీరు నిలిచిపోవడానికి కారణం అయ్యాయని తెలిపింది. అండర్‌పాస్‌ల కింద వాననీరు నిలిచిపోకుండా ఉండేందుకు అక్కడ డ్రైనేజీలను నిర్మించాల్సిన అవసరం ఉందని నివేదికలో అభిప్రాయపడింది బెంగళూరు మహానగరపాలక సంస్థ. అయితే కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ.. దాని కెపాసిటీకి మించి నీరు రావడం, ఆకులు.. కొమ్మలు అడ్డుపడడంతో నీరు నిలిచిపోయిందని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ నివేదికకు సంబంధించిన కాపీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఘటనకు ముమ్మాటికీ నగరపాలక సంస్థనే కారణమంటూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై భానురేఖ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీబీఎంపీ తోపాటు డ్రైవర్ హరీష్ గౌడ నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని హలసూరు గేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది భానురేఖ కుటుంబం. సాక్షి, కృష్ణా: బెంగళూరులో ఊహించని రీతిలో ప్రాణం పొగొట్టుకున్న భానురేఖకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మృతదేహం డీకంపోజ్ కాకుండా భద్రపరిచి.. స్వస్థలం తేలప్రోలుకు తరలించగా.. ఇవాళ(మంగళవారం) ఉదయం అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు భానురేఖ మృతదేహానికి ఏపీ పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు, పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
నోయిడా ట్విన్ టవర్స్ ఎఫెక్ట్.. ఐటీ విప్రో, ఎకోస్పేస్ భవనాలు కూల్చివేత!
బనశంకరి: బెంగళూరులో వరద బాధిత ప్రాంతాల్లో బీబీఎంపీ, రెవెన్యూ శాఖలు చేపట్టిన కబ్జా కట్టడాల తొలగింపు మంగళవారం రెండవరోజుకు చేరుకుంది. రాజకాలువలు ఆక్రమించుకుని నిర్మించిన భవనాలు, ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. దీంతో రియల్ వ్యాపారులు, కట్టడ యజమానుల్లో కలవరం మొదలైంది. జాబితాలో ప్రముఖ సంస్థలు, వ్యక్తులు - మహదేవపుర వలయంలో వివిధ బిల్డర్లు, ఐటీ పార్కులవారు ఆక్రమణలకు పాల్పడిన స్థలాల జాబితాను బీబీఎంపీ విడుదల చేసింది. - బాగమనె టెక్ పార్కు, రెయిన్బో డ్రైవ్ లేఔట్, విప్రో, ఎకో స్పేస్, బెళ్లందూరు, హుడి, సొణ్ణెహళ్లి గోపాలన్, దియా పాఠశాల, కొలంబియా ఏషియా ఆసుపత్రి, న్యూ హొరైజన్ కాలేజీ, ఆదర్శ రిట్రీట్, ఏషియన్ దివ్యశ్రీ, ప్రెస్టేజ్, సాలార్పురియా, నలపాడ్ డెవలపర్స్‌తో పాటు మహమ్మద్ నలపాడ్ కు చెందిన ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. అడ్డుగా 700 కట్టడాలు సుమారు 700 కు పైగా అక్రమ కట్టడాలు నగరవ్యాప్తంగా వర్షం నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయని , కంపెనీలు కబ్జాకు పాల్పడిన స్థలాలను తొలగిస్తామని బీబీఎంపీ అధికారులు తెలిపారు. 2.5 నుంచి 5 మీటర్ల ప్రభుత్వ స్థలం రాజకాలువకు వదిలిపెట్టాలి. ఇందులో ప్రముఖులు ఆక్రమణకు పాల్పడిన స్థలాలు ఉన్నాయని, వీటిని తొలగించి రక్షణ గోడను నిర్మిస్తామని అధికారులు తెలిపారు. మహదేవపుర వలయంలో శాంతినికేతన్ లేఔట్, స్పైసి గార్డెన్, పాపయ్యరెడ్డి లేఔట్, చల్లఘట్ట రాజకాలువ ఆక్రమణల ఏరివేత చేపట్టారు. 30 జేసీబీలతో కూల్చివేతలు రెండోరోజు 30కి పైగా జేసీబీలతో మహదేవపుర, యలహంక వలయాల పరిధిలో కట్టడాలను కూల్చారు. శాంతినికేతన్ లేఔట్లో భారీ భవంతులను బుల్డోజర్ ద్వారా కూల్చివేశారు. మున్నకోళాల సరిహద్దుల్లో 7 ఆక్రమణలను తొలగించారు. తొలగించాలని అనేక ఇళ్లు, దుకాణాలు ముందు రెవెన్యూ అధికారులు మార్కింగ్ వేశారు. భారీ పోలీస్ భద్రత మధ్య రెండు కిలోమీటర్ల పొడవు గల రాజకాలువపై నెలకొన్న ఆక్రమణలను పడగొట్టారు. యలహంక వలయంలో జక్కూరు, అల్లాలసంద్ర, కోగిలు, అట్టూరు, సింగాపుర, దొడ్డబొమ్మసంద్ర, హెబ్బాళ, నవనగర, రాచేనహళ్లితో పాటు సుమారు 30 చెరువులు కబ్జాకు గురయ్యాయి. రియల్టర్లు, నేతలు కుమ్మక్కై చెరువులు మింగేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఆక్రమణదారులు పలుకుబడి కలిగినవారు కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. నలపాడ్ అకాడమి తొలగింపు నిలిపివేత మరోవైపు ఆక్రమణల తొలగింపు వద్ద ఎమ్మెల్యే హ్యారిస్ తనయుడు, కాంగ్రెస్ నేత మహమ్మద్ నలపాడ్ పడవ వేసుకుని ధర్నా చేసి హల్చల్ చేశారు. ఆక్రమణల జాబితాలో నలపాడ్ ఆస్తులు కూడా ఉన్నాయి. మహమ్మద్ నలపాడ్ అకాడమి తొలగింపును అధికారులు నిలిపివేశారు. పనులు చేస్తున్న సిబ్బందిని హ్యారిస్ పీఏ నిలిపివేయాలని ఒత్తిడి చేశాడు. గేటు వద్ద అడ్డుకున్నాడు. దీంతో కూల్చివేతను నిలిపివేశారు. శివాజీనగర: బెంగళూరులో అక్రమ భవనాల తొలగింపు పై మంగళవారం విధాన సౌధలో రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ మాట్లాడుతూ... వీటి వెనుక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బెంగళూరులో ప్రభుత్వ స్థలాలను, చెరువులను ఆక్రమించుకొని అనేక అతిపెద్ద భవనాలు నిర్మించుకున్నారని, అలాంటి భవనాలను ఎలా తొలగిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి ఎంతటివారైనా సరే తొలగిస్తామని, నోయిడా తరహాలో అక్రమ భవనాలకు పేలుడుతో సమాధానం చెబుతామన్నారు. ఆక్రమణదారులకు ఘాటైన హెచ్చరిక చేశారు. గత ప్రభుత్వాలవి నాటకాలు ఆక్రమణల విషయంలో గత ప్రభుత్వాలు నాటకీయంగా వ్యవహరించాయని, అయితే తమ అధికారంలో అలా జరగదని, ఐటీకి చెందిన 30 కంపెనీలు ఆక్రమణలకు పాల్పడ్డాయని, తమ శాఖ జాబితా సిద్ధం చేసి బీబీఎంపీకి ఇచ్చామన్నారు. మినహాయింపు లేదు ఐటీ–బీటీ కంపెనీలకు ఎలాంటి మినహాయింపు లేదని, పెద్దవారు, చిన్నవారు అనేది లేదని, రెవెన్యూ శాఖ, బీబీఎంపీ, బీడీఏ సంయుక్త కార్యచరణ చేపడుతాయి. వరదలు తమకు గుణపాఠం చెప్పింది. బాగమనె పార్కుకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. పెద్దవారు చిన్నవారు అంటూ చూడమని మంత్రి తెలిపారు. విల్లాలు, విద్యాసంస్థలనూ వదలం రాజకాలువ ఆక్రమించుకొన్న భవనాలపై బీబీఎంపీ జాబితా సిద్ధం చేయగా, 600 అక్రమ భవనాల తొలగింపునకు ఆదేశించాం, రాజకాలువ తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయని, మహదేవపుర భాగంలో బీబీఎంపీ రాజకాలువ అక్రమణలు తొలగిస్తోందని, విల్లాలు, విద్యా సంస్థ, ఇళ్లు నేలమట్టమవుతాయి. రైన్బో డ్రైవ్ లేఔట్లో జిల్లా యంత్రాంగం సర్వే జరుపగా, కాలువను ఆక్రమించుకొని విల్లాలను నిర్మించినట్లు తెలిసింది. ప్రస్తుతం విల్లాలను తొలగించాలని యజమానులకు నోటీస్ ఇచ్చామన్నారు. JCB’s in action today in Mahadevapura demolishing alleged encroachments on rajakaluves. #BBMP pic.twitter.com/lvEjU9yHyM — Anil Budur Lulla (@anil_lulla) September 12, 2022 -
బెంగుళూరు ప్రధాని పర్యటన.. బీబీఎంపీ ఖర్చు రూ.23 కోట్లు
సాక్షి, బెంగళూరు: ప్రధాని మోదీ బెంగళూరు పర్యటన సందర్భంగా రోడ్ల మరమ్మతుల కోసం బీబీఎంపీ రూ.23 కోట్లు ఖర్చుచేసింది. ప్రతి నిమిషానికి రూ.5 లక్షల 18 వేలు వ్యయమైంది. సోమవారం బెంగళూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ నాలుగు గంటల పాటు నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోదీ సంచరించిన 14 కి.మీ పొడవునా రోడ్లకు తారు వేయడం, ఫుట్‌పాత్, వీధిదీ పాలు, డ్రైనేజీల శుభ్రం తదితర పనులకు ఎ క్కువ నిధులు ఖర్చయినట్లు ప్రత్యేక కమిషనర్ రవీంద్ర తెలిపారు. సభ జరిగిన కొమ్మఘట్ట రోడ్డు చుట్టుపక్కల రోడ్ల మరమ్మతులకు, సుందరీకరణ ఖర్చులకు రూ.9 కోట్లు వెచ్చించారు. చదవండి: అసమాన యోగయజ్ఞం -
Omicron కలకలం: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 10 మంది మిస్సింగ్
బెంగళూరు: ఒమిక్రాన్ వేరింయట్ ప్రపంచ దేశాలను ఒణికిస్తోంది. తాజాగా భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో బృహన్ బెంగళూరు మహనగర పాలికే (బీబీఎంపీ) చేసిన ఓ ప్రకటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన 10 మంది విదేశీ ప్రయాణికులు పత్తా లేకుండా పోయినట్లు వెల్లడించింది. ఆరోగ్య శాఖ అధికారులు వీరి జాడ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు బీబీఎంపీ వెల్లడించింది. ఈ సందర్భంగా బీబీఎంపీ కమిషనర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘విదేశీ ప్రయాణికులు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. కొందరు ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు. అలాంటి వారి కోసం కేంద్రం ఓ ప్రామాణిక ప్రోటోకాల్ జారీ చేసింది. దాన్ని అనుసరిస్తాం. ఈ సందర్భంగా ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. జాగ్రత్తగా ఉండండి.. భద్రతా ప్రమాణాలు పాటించండి’’ అని కోరారు. (చదవండి: తరుముకొస్తున్న ఒమిక్రాన్.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!) ఈ సందర్భంగా కర్ణాటక హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వెలుగు చూసిన తర్వాత అక్కడ నుంచి 57 మంది బెంగళూరుకి వచ్చారు. వీరిలో 10 మంది ఆచూకీ లభించడం లేదు. బీబీఎంపీ వారిని వెతికే పనిలో ఉంది. సదరు ప్రయాణికులు ఫోన్ నంబర్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. వారు ఇచ్చిన అడ్రెస్‌కు వెళ్లి చూడగా.. అక్కడ ఎవరూ లేరు. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. (చదవండి: Omicron: భారత్‌లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!) కర్ణాటకలో గురువారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినటుల కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో ఓ విదేశీ ప్రయాణికుడు ఇప్పటికే దేశం విడిచిపోయాడని.. మరోక వ్యక్తి కర్ణాటక స్థానికుడని.. అతడికి ఎలాంటి ప్రయాణ చరిత్రలేదని ఆరోగ్యశాఖ తెలపింది. చదవండి: దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. 9 రోజుల్లోనే 30 దేశాలకు.. -
దారుణం: గతేడాది కోవిడ్‌తో చనిపోతే.. ఇప్పుడు మృతదేహాలు అప్పగింత!
బెంగళూరు: ఏడాది క్రితం కరోనా మహమ్మారి కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన రెండు కుటుంబాలకు బెంగళూరులోని రాజాజి ఆసుపత్రి నుంచి ఊహించని షాక్ ఎదురైంది. అయితే తమ ప్రియమైన వ్యక్తులు కరోనా బారినపడి చనిపోయిన ఏడాది తర్వాత మీ సంబంధికుల మృతదేహాలు ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయంటూ ఆసుపత్రి సిబ్బంది నుంచి కాల్ వచ్చింది. దాంతో సదరు కుటుంబ సభ్యులు అయోమయానికి గురి కావడమే కాక అసలు విషయం తెలుసుకుని షాక్‌కి గురయ్యారు. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) అయితే నిజానికి ఆ మృతులు దుర్గా సుమిత్ర (40), మునిరాజు (50) గతేడాది కరోనాతో మృతిచెందారు. అంతేకాక బెంగళూరులోని రాజాజీనగర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మోడల్ ఆస్పత్రి సర్టిఫికేట్లలో గతేడాది జూలై 2, 2020న మరణించినట్లు మరణ ధృవీకరణ పత్రాలు కూడ ఇచ్చింది. పైగా ఆ సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృభించడంతో ఆస్పత్రి సిబ్బంది మృతదేహాలను ఇవ్వమని చెప్పారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) ఆ మృత దేహాలకు దహన సంస్కారాలు నిర్వహించాం అని కూడా ఆయా బాధిత కుటుంబాలకు తెలియజేసింది. అయితే ఇటీవలే మూడురోజుల క్రితం బాధిత కుటుంబాలకి మీ వాళ్ల మృతదేహాలు మార్చురీలో ఉన్నాయంటూ సదరు ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించింది. అయితే సదరు బాధిత కుటుంబాలు తాము మొదటగా నమ్మలేదని ఆసుపత్రికి వెళ్తే అసలు విషయం తెలిసిందని అంటున్నారు. దీంతో ఆయా బాధిత కుటుంబాలు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష వైఖరి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మేరకు సదరు ఆస్పత్రి ఆధికారులు సిబ్బంది పై చర్యలు తీసుకోవడమే కాక అసలు ఇది ఎలా జరిగిందో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: దూషించొద్దు అన్నందుకు స్నేహితులే హత్య చేశారు!) -
మాజీ కార్పొరేటర్ హత్య కేసు: సోదరి, కోడలే సూత్రధారులా?
బనశంకరి: ఆపదలో ఆదుకోవాల్సిన రక్త సంబంధీకులే అంతమొందించారు. కాటన్‌పేట పీఎస్ పరిధిలో బీబీఎంపీ మాజీ కార్పొరేటర్ రేఖా కదిరేశ్ (45) పట్టపగలే హత్య కేసులో ఆమె సోదరి మాలా, ఇతర కుటుంబ సభ్యులే సూత్రధారులని పశ్చిమ విభాగ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మాలా, ఈమె కోడలు పూర్ణిమాను పోలీసులు అజ్ఞాత స్థలంలో తీవ్రంగా విచారించగా, తామే చేయించినట్లు ఒప్పుకున్నారని సమాచారం. ఈ హత్యలో స్టీఫెన్ ప్రముఖ పాత్రధారిగా ఉన్నాడు. రేఖాను ఎలా హత్య చేయాలి, ఎవరెవరు పాల్గొనాలి, తరువాత ఎలా పరారు కావాలి అనే ప్లాన్‌ను స్టీఫెన్ రూపొందించాడు. రోడ్డుపక్కకు లాక్కెళ్లి 24వ తేదీ ఉదయం ఫ్లవర్ గార్డెన్ బీజేపీ ఆఫీసు వద్ద ఆమె పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసి వస్తుండగా పీటర్, సూర్య రోడ్డు పక్కకు లాక్కెళ్లి చాకుతో రేఖా గొంతు, వీపుపై విచ్చలవిడిగా పొడిచారు. స్టీఫెన్, అజయ్‌లు ఎవరూ అడ్డురాకుండ నిలబడ్డారు. ఒక యువకుడు ఆమె దగ్గరికి వస్తుండగా నిందితులు అతన్ని పెద్ద పాత్రతో తరిమికొట్టారు. ఈ హత్యోదంతం మొబైల్స్ వీడియోలు చూపరులను వణికించేలా ఉన్నాయి. రాజకీయ, ఆర్థిక అడ్డంకి అని.. సోదరి మాలాను ఆర్థిక, రాజకీయ కారణాలే హత్యకు ప్రేరేపించాయి. రానున్న బీబీఎంపీ ఎన్నికల్లో తన కుమారుడు లేదా కుమార్తె ను బరిలోకి దింపాలని మాలా సన్నాహాలు చేసింది. ఇందుకు రేఖా ససేమిరా అంది. స్థానికంగా టెండర్లు, ఆర్థిక వ్యవహారాల్లోనూ రేఖది పైచేయి అయ్యింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించారు. ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయా? అని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. చదవండి: హత్యకు ఆరు నెలలుగా కుట్ర .. గతంలో భర్త.. ఇప్పుడు భార్య! -
హాట్‌స్పాట్‌గా మారనున్న బెంగళూరు?!
బెంగళూరు: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో బెంగళూరులో మొత్తం నమోదైన కరోనా కేసుల్లో 91శాతం కేసులు కేవలం జూలైలోనే వెలుగు చూసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం సిటీలో మొత్తం కరోనా కేసులు 51,091 ఉండగా వీటిలో యాక్టీవ్ కేసుల సంఖ్య 36,224గా ఉంది. ఇది ఇలానే కొనసాగితే.. కొద్ది రోజుల్లోనే బెంగళూరు కరోనాకు హాట్‌స్పాట్‌గా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య అధికారులు తగినన్ని టెస్టులు చేస్తున్నారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందకంటే గతవారం, ఈ వారం పాజిటివిటీ రేట్లలో చాలా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. జూలై 28 నాటికి సిటీలో పాజిటివిటీ రేటు 17.19 శాతంగా ఉంది. జూలై 22 నుంచి 28 వరకు బెంగళూరులో రోజుకు సగటున 8745 మందిని పరీక్షించగా.. యావరేజ్‌గా ప్రతి రోజు 1982 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. (కరోనా : భారత్‌లో మరో రికార్డు ) పరీక్షలు పెంచడంతో పెరుగుతున్న కేసులు బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) వెల్లడించిన కోవిడ్-19 డాటా ప్రకారం.. జూలై 25-26 రోజుల్లో వరుసగా 9,697, 5,930 మందిని పరీక్షించారు. జూలై 27-28 నాడు 10,176, 9,773 మందిని పరీక్షించారు. ఈ క్రమంలో పాజిటివిటీ రేటు 20.19 శాతం నుంచి 32.8 శాతానికి పెరిగింది. ఆ తర్వాత రెండు రోజుల్లో పాజిటివిటీ రేటు 14.4శాతం నుంచి 19.4శాతానికి పడిపోయింది. దాంతో గత వారం రోజుల్లో బెంగళూరులో యావరేజ్ పాజిటివిటీ రేటు 22.66 శాతంగా నమోదయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత వారంలో నాలుగు రోజులలో నగరంలో పాజిటివిటీ రేటు 25శాతం కంటే ఎక్కువగా ఉంది. జూలై 26న మాత్రం అత్యధికంగా 32.8శాతం పాజిటివిటీ రేటు నమోదయ్యింది. జూలై 19 న పాజిటివిటీ రేటు 45 శాతంగా. ఆ రోజు 4703 నమూనాలను మాత్రమే పరీక్షిస్తే.. 2156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై 19 తర్వాత బెంగళూరులో పరీక్ష సంఖ్యలను పెంచడంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. (ప్రజల వద్దకే పరీక్షలు) పరీక్షలు చేయించుకోవడానికి భయం వద్దు ఈ క్రమంలో కరోనాను కట్టడి చేయడం కోసం బీబీఎంపీ బెంగళూరులో పరీక్షలను పెంచాలని భావిస్తోంది. ఇందుకు గాను మంగళవారం నగరంలో ఉచిత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పౌరసంఘం ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరులోని ప్రతి వార్డులో బీబీఎంపీ ఉచిత పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిందని.. కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రారంభదశలోనే వైరస్‌ను గుర్తిస్తే.. దాన్ని ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఆడ్డుకోవడంలో సాయం చేస్తుంది. ప్రజలు ప్రారంభ దశలోనే కరోనా పరీక్షలు చేయించుకుంటే.. త్వరగా కోలుకుంటారు. కనుక పరీక్షలు చేయించుకోవడానికి భయపడవద్దు’ అని కోరారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా బెంగళూరులో పరీక్ష సంఖ్యలను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పరీక్షల సంఖ్య ప్రస్తుతం కంటే ఐదు రెట్లు పెంచాలని సూచిస్తున్నారు. (ఈ ముందు చూపు బాగుంది) ఫోన్ నంబర్ నిర్ధారణ కోసం ఓటీపీ సెయింట్ జాన్ మెడికల్ కాలేజీ మెడికల్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ సంజీవ్ లెవిన్ మాట్లాడుతూ.. ‘బెంగళూరులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కనుక ఎక్కువ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని కూడా పరీక్షించాల్సి ఉంటుంది. అయితే పాజిటివ్ వచ్చిందంటే సమాజంలో చిన్న చూపు, వివక్షత కారణంగా ప్రజలు పరీక్షలు చేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. దీని గురించి ప్రభుత్వమే అవగాహన కల్పించాలి’ అని కోరారు. బెంగళూరు ఆసుపత్రుల్లో చేరిన రోగులందరికి కరోనా పరీక్షలు చేయాలని సంజీవ్ సూచించారు. ‘ఆసుపత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరి పరీక్ష చేయమని సూచిస్తున్నాను. ఫలితంగా ఆరోగ్య సంరక్షణ కార్మికులను వైరస్ బారిన పడకుండా కాపాడటానికి సహాయపడుతుంది’ అని సంజీవ్ చెప్పారు. పరీక్షల కోసం వచ్చిన రోగులు తప్పుడు ఫోన్ నంబర్లు, చిరునామాలు ఇవ్వడంతో వారిని గుర్తించడానికి ఇబ్బంది తలెత్తుతుందన్నారు. అందుకని ఇక మీదట ఆస్పిత్రలో పేషెంట్ ఫోన్ నంబర్ ఇచ్చినప్పుడు దాన్ని నిర్ధరించడానికి ఓటీపీ పంపించనున్నట్లు తెలిపారు. -
సీఎంకు డ్రైప్రూట్స్ బుట్ట.. మేయర్‌కు ఫైన్
బెంగళూరు : కొన్నిసార్లు మనం అనాలోచితంగా చేసే పనులు.. తప్పుల జాబితాలో చేరతాయి. తాజాగా ఇలాంటి అనుభవమే బెంగళూరు మేయర్ గంగాంబికే మల్లికార్జున్‌కు ఎదురైంది. ఇటీవల కర్ణాటక సీఎంగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు వివిధ రూపాల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గంగాంబికే కూడా సీఎంను కలిసి శుభాకాంకక్షలు తెలిపారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేయడానికి తీసుకెళ్లిన డ్రైప్రూట్స్ బుట్ట పైభాగంలో ప్లాస్టిక్ కవర్‌తో మూశారు. మేయర్ ప్లాస్టిక్ వినియోగించడం పట్ల సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే గంగాంబికే సీఎం ఇచ్చిన పండ్ల బుట్టకు ప్యాక్ చేసిన ప్లాస్టిక్ కవర్ లోగ్రేడ్కు చెందినదిగా కొందరు నెటిజన్లు గుర్తించారు. ఈ రకం ప్లాస్టిక్‌పై బెంగళూరులో నిషేధం ఉన్నట్టు వారు గుర్తుచేశారు. మేయర్ అయి ఉండి నిషేధిత ప్లాస్టిక్‌ను వినయోగిచడంపై గంగాంబికేను ప్రశ్నించారు. ఈ విషయం గంగాంబికేకు తెలియడంతో ఆమె స్వచ్ఛందంగా తన తప్పును అంగీకరించారు. అందుకు క్షమాపణ కూడా కోరారు. బెంగళూరు నగరపాలక సంస్థ జారీ చేసిన 500 రూపాయల జరిమానాను చెల్లించారు. పండ్ల బుట్టను తీసుకురావడానికి వేరే వారిని పంపించడంతోనే ఈ తప్పిదం జరిగిందని గంగాంబికే తెలిపారు. తాను కూడా దానిని చూడకుండానే సీఎంకు అందజేశానని.. చట్టం ముందు అందరు సమానులేనని పేర్కొన్నారు. కాగా, లోగ్రేడ్ ప్లాస్టిక్ వాడకం బెంగళూరు నగరపాలక సంస్థ 2016లో నిషేధం విధించింది. బెంగళూరు నగరంలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధించాలని పాలికె లక్ష్యంగా పనిచేస్తోన్న విషయం తెలిసిందే. -
టెల్కోల ధరల పోరుకు తెర!
న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా హోరాహోరీ పోరులో గణనీయంగా టారిఫ్‌లను తగ్గించాల్సి వచ్చి తీవ్రంగా దెబ్బతిన్న టెలికామ్ కంపెనీలు... క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి టెలికం మార్కెట్లో స్థిరత్వం, హేతుబద్ధత తిరిగి రాగలదన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. పరస్పరం దెబ్బతీసుకునే చార్జీల విధానానికి స్వస్తి చెప్పి..లాభాలు, ఆదాయాలు పెంచుకోవడానికి టెల్కోలు కొత్త మార్గాలను అన్వేషిస్తుండటం ఇందుకు దోహదపడుతుందని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ అంచనా వేస్తోంది. ‘ధరల విషయంలోనూ, ఇతర సంస్థల కస్టమర్లను తమవైపు తిప్పుకోవడంలోనూ కొన్నాళ్లుగా మార్కెట్ పరిస్థితి అసంబద్ధంగా మారింది. అయితే, క్రమంగా మార్కెట్లో స్థిరత్వం, హేతుబద్ధత తిరిగి వస్తాయని ఆశిస్తున్నాం‘ అని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ చెప్పారు. ‘పరిశ్రమపరంగా చూస్తే పోటాపోటీగా టారిఫ్‌లు తగ్గించడం మొదలుకుని అత్యంత దారుణ పరిస్థితులన్నీ ఈ మధ్య కాలంలో చూడటం జరిగింది. నిధుల సమీకరణలో సవాళ్ల వల్ల మార్కెట్ క్రమంగా స్థిరపడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతం ఎంత దుర్భరంగా ఉండేదనేది పక్కన పెట్టి భవిష్యత్‌పై సానుకూల దృక్పథంతో పరిశ్రమ ముందుకెడుతోంది‘ అని మాథ్యూస్ చెప్పారు. కొత్త మార్గాలవైపు దృష్టి.. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ఆదాయాలు, లాభాల తగ్గుదలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికం సంస్థలు మరిన్ని కొత్త మార్గాల వైపు దృష్టి పెడుతున్నాయని మాథ్యూస్ చెప్పారు. కంటెంట్, ఈ–కామర్స్, ఆర్థిక సేవలు మొదలైనవన్నీ కూడా అందించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘గడిచిన 5–6 త్రైమాసికాలుగా ఆదాయాలు, లాభదాయకత తగ్గడాన్ని చూశాం. దీనికి అడ్డుకట్ట పడొచ్చు. వ్యక్తిగతంగానైతే... ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికల్లా ఆదాయాల క్షీణతకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నాను‘ అని ఆయన చెప్పారు. ఆశావహంగా టెల్కోల ఫలితాలు అసాధారణ ఆదాయం ఊతంతో గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అనూహ్యంగా లాభంలో 29 శాతం వృద్ధితో టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ అందర్నీ ఆశ్చర్యపర్చింది. రిలయన్స్ జియో రాకతో తీవ్రంగా దెబ్బతిన్న ఎయిర్టెల్.. జనవరి– మార్చి త్రైమాసికంలో రూ. 107.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. పలు త్రైమాసికాల తర్వాత లాభంలో వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కంపెనీ ఆదాయం కూడా 6.2 శాతం ఎగిసి రూ.20,602.2 కోట్లకు పెరిగింది. మరోవైపు, రిలయన్స్ జియో నికర లాభం 64.7 శాతం పెరిగి రూ.840 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో జియో లాభం రూ. 510 కోట్లు. 2018–19 నాలుగో త్రైమాసికంలో జియో నిర్వహణ ఆదాయం 55.8 శాతం పెరిగి రూ. 11,106 కోట్లకు చేరింది. అంతక్రితం సంవత్సరం ఇదే వ్యవధిలో నిర్వహణ ఆదాయం రూ. 7,128 కోట్లు. మరో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా మే 13న ఆర్థిక ఫలితాలు వెల్లడించనుంది. ఎయిర్టెల్ సిగ్నల్: ఫిచ్ న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ మార్చి క్వార్టర్ నికర లాభం 29 శాతం వృద్ధి చెందడం ఆధారంగా చూస్తే.. ఈఏడాదిలో దేశీ మొబైల్ రంగ ఆదాయం 5–10 శాతం మేర పెరిగేందుకు అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ అంచనావేసింది. ఈ రంగంలోని టాప్–3 కంపెనీలు లాభదాయకత వైపు దృష్టిసారించేందుకు ఆస్కారం ఉండగా.. వీటి మార్కెట్ వాటా ప్రతి కంపెనీకి 30–33 శాతం మధ్య ఉండనుందని అంచనాకట్టింది. ఈ సంస్థల మధ్య కొనసాగుతున్న పోటీతత్వం ఇక నుంచి నెమ్మదిగా తగ్గిపోయి.. డేటా టారిఫ్ పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఒక్కో ఖాతాదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) నెలకు 10–20 శాతం వృద్ధి చెంది 1.6–1.7 డాలర్లకు చేరుతుందని అంచనావేసింది. -
బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ధూమపాన నిషేధం
కర్ణాటక, బనశంకరి : ఉద్యాననగరిలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్, పబ్స్, క్లబ్‌లు సార్వజనిక ప్రాంతాలను ధూమపాన రహిత ప్రదేశాలుగా ప్రకటించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు కూడా రద్దు చేస్తామని బీబీఎంపీ హెచ్చరించింది. హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు చట్టపరంగా నో స్మోకింగ్జోన్ను ఏర్పాటు చేయడానికి పొగాకు నియంత్రణ శాఖ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. నో స్మోకింగ్జోన్లో అల్పాహారం, భోజనం, మద్యం, సిగరెట్, నీరు, కాఫీ, టీ తదితర వాటిని సరఫరా చేయరాదు. కోప్టా చట్టం అనుగుణంగా 30కి పైగా ఆసనాలు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్, హోటల్స్, పబ్స్, క్లబుల్లో నో స్మోకింగ్జోన్ ఏర్పాటు చేయాలని బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది. మైనర్లు, స్మోకింగ్ చేసేవారిని నో స్మోకింగ్ జోన్లోకి అనుమతించరాదు. ఈ నిబంధనలు ఉల్లంఘించే హోటల్స్, పబ్ అండ్ బార్ రెస్టారెంట్లు, క్లబ్స్ లైసెన్సు రద్దు చేస్తామని సూచించింది, నగరంలోని చాలా బార్ అండ్ రెస్టారెంట్, క్లబుల్లో ధూమపానం చేయడం సాధారణం. టీ దుకాణాల ముందు పొగరాయుళ్లు సిగరెట్ తాగుతుండటంతో ఇతరులకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ షరా మామూలుగా కొనసాగుతోంది. ఇకపై కేటాయించిన స్మోకింగ్ జోన్లలో మాత్రమే సిగరెట్లు తాగాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేస్తామని బీబీఎంపీ హెచ్చరించింది. -
మీ పెంపుడు కుక్కకు లైసెన్స్ ఉందా?
సాక్షి, బెంగళూరు: మీ ఇళ్లలో పెంపుడు కుక్కలు ఉన్నాయా? వాటికి లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఏంటి.. అది కుక్కలకి ఏంటి అనుకుంటున్నారా!! ఇప్పటివరకు అయితే కుక్కలకు లైసెన్స్ తప్పనిసరి కాకపోయిన ఇకపై త్వరలో బీబీఎంపీ పరిధిలో కుక్కలకు లైసెన్స్‌లు కచ్చితం కానుంది. ఈ మేరకు బీబీఎంపీ ఆలోచన చేస్తోంది. బీబీఎంపీ పరిధిలో అపార్ట్మెంట్ అసోసియేషన్ నియమాల ప్రకారం లైసెన్స్ తప్పనిసరి. ఈ క్రమంలో ఆదివారం కబ్బన్ పార్కు క్యానిన్స్ (సీపీసీ) స్వచ్ఛంద సేవకులు, బీబీఎంపీతో కలుపుకుని కుక్కలకు లైసెన్స్‌లనే ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఆదివారం పెంపుడు కుక్కకు సంబంధించిన ప్రభుత్వ గుర్తింపు, వ్యాక్సినేషన్ వివరాలతో పాటు అడ్రస్ ప్రూఫ్‌తో యజమానులు తమ కుక్కలను కబ్బన్ పార్కుకు తీసుకొచ్చారు. ఈ లైసెన్స్‌కు బీబీఎంపీ రూ. 110 చార్జీ చేసింది. లైసెన్స్ తీసుకున్న పెంపుడు కుక్కలకు ఉచిత హెల్త్ చెకప్, రాయితీతో కూడిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీసీ వ్యవస్థాపకురాలు ప్రియా చెట్టి మీడియాతో మాట్లాడుతూ కుక్కలకు లైసెన్స్‌లు తీసుకోవడం ప్రతిఒక్క యజమాని బాధ్యతని చెప్పారు. భారత జంతు సంక్షేమ సంస్థ (ఏడబ్ల్యూబీఐ) నియమాల ప్రకారం కూడా దేశంలో ఎక్కడైన పెంపుడు కుక్కలకు లైసెన్స్‌లు తప్పనిసరని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా అన్ని జాతులకు చెందిన పెంపుడు కుక్కలతో కబ్బన్ పార్కులో సందడి నెలకొంది. -
సాయం చేయాలా.. వద్దా?
సాక్షి, కర్ణాటక(బనశంకరి) : గత కొన్నేళ్ల క్రితం హత్యకు గురైన బీబీఎంపీ కార్పొరేటర్ నటరాజ్ కుటుంబానికి సహాయం చేయాలా, వద్దా? అని పాలికె నెలవారీ సమావేశంలో రభస చెలరేగింది. ఆయన కుటుంబం వీధిపాలైనట్లు బీజేపీ కట్టుకథ అల్లుతోంది, వారికి పాలికె సభ్యులు ఒకనెల వేతనం అందించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ లతాఠాకూర్ పట్టుబట్టారు.మంగళవారం పాలికె సమావేశంలో నటరాజ్ కు టుంబం వీధిపాలైందని, రోడ్డుపై వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారని, పాలికె నుంచి సహాయం అందించాలని కొందరు బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో పాలికె సభ్యులందరూ ఒకనెల వేతనం సహాయంగా అందించాలని తీర్మానించారు. ఇందు కు లతాఠాకూర్ వ్యతిరేకించారు. ఆ కుటుంబం బాగానే ఉందని, కానీ వీదిపాలైనట్లు బీజేపీ సభ్యులు మాట్లాడడం సరికాదని విమర్శించారు. గతంలో బీజేపీ సభ్యుడు మహేశ్‌బాబు ప్రమాదంలో మరణించినప్పుడు పార్టీలకు అతీతంగా తామంతా సహాయం చేశామన్నారు. నటరాజ్ మామ తమ పరిస్థితి కష్టతరంగా ఉందని సహాయం చేయాలని కోరారని బీజేపీ సభ్యులు లతాఠాకూర్పై ఎదురు దాడిచేశారు. మేయర్ సంపత్‌రాజ్ జోక్యం చేసుకుని మృతి విషయంలో ఎవరూ రాజకీయం చేయరాదన్నారు. డిప్యూటీ మేయర్, ఇతర ముఖ్యులు కలిసి నటరాజ్ ఇంటిని సందర్శించి పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు. సభ ఆలస్యంపై ఆగ్రహం బీబీఎంపీ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ సుమారు రెండు గంటల ఆలస్యమైంది. 12.50 గంటలకు సభ ప్రారంభమైంది. సభ ఆలస్యంగా ప్రారంభం కావడం పట్ల విపక్షనేత పద్మనాభరెడ్డి తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు. బీబీఎంపీ నెలవారి సభకు ప్రత్యేకత ఉంది, సంపత్‌రాజ్ మేయర్‌గా ఎన్నికైనప్పటి నుంచి పాలికె సభలు ఆలస్యంగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. మాజీ మేయర్ శాంతకుమారి కుమారుడు వివాహానికి హాజరు కావడం వల్ల ఆలస్యమైందని మేయర్ సంపత్‌రాజ్ సమర్దించుకున్నారు. ఇక ముందు సభ నిర్ణీత సమయంలో జరుగుతుందని హామీనిచ్చారు. -
సురక్ష బ్యాండ్‌తో లైంగిక వేధింపులకు చెక్
మహిళల రక్షణకు నిర్భయ లాంటి చట్టాలు చేసినా నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏదో ఒకచోట మహిళలు దాడులకు బలైపోతూనే ఉన్నారు. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి సేఫ్ సిటీ ప్రణాళికలో భాగంగా బెంగళూరు మహా నగర పాలికె సురక్ష బ్యాండ్లను అందించనుంది. జీపీఎస్ ఆధారిత ఈ బ్యాండ్లు మహిళలకు సబ్సిడీ ధరతో అందజేయనుంది. సాక్షి,బెంగళూరు: బెంగళూరు నగరంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న లైంగిక వేధింపులు, దౌర్జన్యాల ఘటనలు అరికట్టడానికి పాలికె సరికొత్త సాంకేతిక రక్షణాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టే ఉద్దేశంతో రూపొందించిన సేఫ్‌సిటీ ప్రణాళికలో భాగంగా మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలపై బీబీఎంపీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందించింది. అందులో భాగంగా నగరవ్యాప్తంగా మహిళలు, యువతులకు జీపీఎస్ ఆధారిత సురక్ష బ్యాండ్లను అందించడానికి నిర్ణయించుకున్నట్లు కేంద్రానికి అందించిన నివేదికలో పేర్కొంది. ఈ ప్రణాళిక అమలుకోసం పాలికె రూ.100 కోట్ల నిధులు కేటాయించాలంటూ నివేదికలో విన్నవించింది. మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలు, అనుసరించిన ప్రణాళికలపై చర్చించి తమకు నివేదికలు అందించాలంటూ కొద్ది నెలల క్రితం దేశంలోని ప్రముఖ నగరాల పాలనా సంస్థలకు కేంద్రప్రభుత్వం సూచనలు జారీ చేసింది. నివేదికలు అందించిన అనంతరం నిర్భయ నిధుల పథకం ద్వారా ఆయా నగరాల్లో మహిళల భద్రత కోసం నిధులు కేటాయిస్తామంటూ కేంద్రప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇటీవల సమావేశమైన నగర పోలీసులు, పాలికె అధికారులు సురక్ష బ్యాండ్లను అందించడానికి నిర్ణయించుకొని ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో ప్రస్తావించారు. ఎలా పనిచేస్తుంది... పాలికె అందించనున్న సురక్ష బ్యాండ్లను జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నారు.« మహిళలు, యువతులు ధరించనున్న సురక్ష బ్యాండ్లలో ఆయా మహిళల, యువతుల కుటుంబ సభ్యులు, స్థానిక పోలీస్స్టేషన్లు తదితర ఏడు ఫోన్ నంబర్లు నమోదు చేయనున్నారు. ఏదైనా ఆపద తలెత్తిన సమయంలో వెంటనే సురక్ష బ్యాండ్ ద్వారా యువతులు కుటుంబ సభ్యులతో పాటు బ్యాండ్‌లో పొందుపరచిన ఏడు నంబర్లకు ఒకేసారి ప్రస్తుతం తామున్న ప్రదేశం, ఆపద గురించి సమాచారం చేరవేయవచ్చు. జీపీఎస్ ద్వారా పోలీసులు, కుటుంబ సభ్యులు వెంటనే యువతులు ఉన్న చోటుకు చేరుకోవడానికి ఈ సురక్ష బ్యాండ్లు ఎంతో సహకరించనున్నాయి. ధరల్లో సబ్సిడీ : మహిళల భధ్రత కోసం అందుబాటులోకి తేనున్న సురక్ష బ్యాండ్లను పాలికె సబ్సిడీ ధరల్లో మహిళలకు విక్రయించడాని కి నిర్ణయించుకుంది. ఒక్కో బ్యాండ్ తయారికీ రూ.800 ఖర్చు కానుండగా మహిళలకు రూ.400లకే విక్రయించడానికి పాలికె నిర్ణయించుకుంది. ప్రయోగాత్మకంగా పాలికె పరిధిలో పది లక్ష ల మంది మహిళలకు సురక్ష బ్యాండ్లు అందించనుంది. -
ఫొటో తీయండి.. పోస్ట్ చేయండి
బనశంకరి: బెంగళూరు పాలికె పరిధిలో సమస్యలు ఉంటే.. ఆ ఫొటో తీసి పాలికె యాప్‌లో అప్లోడ్ చేస్తేచాలు, పరిష్కారం బాధ్యత పాలికెదే. సోమవారం పాలికె కేంద్రకార్యాలయంలో మేయర్ సంపత్‌రాజ్, పాలికె కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ ‘మా వీధులను సరిచేయండి’ అనే యాప్‌ను విడుదల చేశారు. మేయర్ మాట్లాడుతూ పాలికె పరిధిలోని రోడ్లు, చెత్త తదితర ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించుకోవడానికి ఈ యాప్ ఎంతో అనుకూలమవుతుందని చెప్పారు. ఎలా పనిచేస్తుందంటే.. bbmpfixmystreet యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోడ్డుపై గుంత, చెత్త, మురుగు సమస్య ఉన్నట్టయితే, ఒక ఫొటో తీసియాప్‌లో అప్లోడ్ చేయాలి. దానిపై అధికారులు స్పందిస్తారు. డ్యాష్‌బోర్డు ద్వారా సమస్యల పరిష్కారానికి అదికారుల నుంచి చర్యలు తీసుకుంటామని సంపత్‌రాజ్ తెలిపారు. ఇప్పటివరకు నగరంలో ఇబ్బందులపై ప్రజలు బీబీఎంపీ కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేయాల్సివచ్చేది. అక్కడి నుంచి వార్డుకు, అధికారులకు సమాచారం అందించి అప్రమత్తం చేయడానికి సమయం పట్టేది. ప్రస్తుతం విడుదల చేసిన యాప్ ద్వారా నేరుగా తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని మేయర్ చెప్పారు. ఏ సమస్యకు ఎంత సమయం? చెత్త సమస్య ఉంటే ఒక్కరోజులోగా పరిష్కరించాలని అధికారులకు మేయర్ సూచించారు. వీధి దీపాల సమస్యను రెండురోజులు, రోడ్లు గుంతల సమస్యలను ఒక వారంలోగా పరిష్కరించాలని చెప్పారు. బెస్కాం, ఆరోగ్య శాఖ, బీడీఏ, ఉద్యానవనశాఖ తో పాటు వివిద శాఖలు యాప్ సమాచారాన్ని అందుకుంటాయి. ప్రతి అధికారి, కార్పొరేటర్లకు సమాచారం వెళ్తుందని మేయర్ తెలిపారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే ఆ ఫోటోను అప్లోడ్ కోరారు. నగరమంతటా ఎల్ఈడీ బల్బులు అనంతరం పాలికె కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ మాట్లాడుతూ... యాప్‌లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఆలస్యమైతే అధికారులు అందుకు కారణాన్ని ఫిర్యాదిదారుకు తెలియజేయాలి. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలో పాత విద్యుత్దీపాలను తొలగించి ఎల్ఇడి బల్ప్‌లను ఏర్పాటు చేయడానికి నివేదికను సిద్ధం చేశామని, మూడునాలుగు నెలల్లోగా టెండర్లు ఆహ్వానించి 8 నెలల్లోగా నగరంలోని అన్ని వీదులకు విద్యుత్దీపాలను ఎల్‌ఇడీగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ పద్మావతి నరసింహమూర్తి, పాలికె పాలనా విభాగం నేత రిజ్వాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
బెంగళూరులో ఇక స్మార్ట్ పార్కింగ్
సాక్షి, బెంగళూరు: మెట్రో పాలిటన్ నగరాల్లో నేడు పార్కింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెల్సిందే. ఎక్కడ మోటారు బైక్‌ను ఆపాలో, ఎక్కడ కారు పార్కింగ్ చేయాలో తెలియక నగర జీవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు బహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) త్వరలో స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా అభివద్ధి చేసింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు పార్కింగ్ సమస్య తీరినట్లే. యాప్ ద్వారా ఎక్కడ పార్కింగ్ స్థలం ఉందో, అందులో ఎన్ని ఖాళీ స్లాట్లు ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అడ్వాన్స్‌గా కూడా పార్కింగ్ స్థలాన్ని బుక్ చేసుకోవచ్చు. స్మార్ట్ పార్కింగ్ విధానం కింద నగరంలో 85 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఎక్కడికక్కడ ఎలక్ట్రానిక్ సెన్సర్లను ఏర్పాటు చేస్తున్నారు. కార్లపై నిఘా ఉంచేందుకు సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. సెన్సర్ల ద్వారా ఏ కారు ఎన్నిగంటలకు వచ్చిందో, ఎన్నిగంటలకు వెళుతుందో గుర్తించవచ్చు. ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా పార్కింగ్ చార్జీలు చెల్లించవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరపొచ్చు. టూ వీలర్ బైకులకు, కార్లకు వేర్వేరు చార్జీలు వసూలు చేస్తారు. నగరంలో పార్కింగ్ స్థలాలను ఏ, బీ, సీ అంటూ మూడు కేటగిరీలుగా విభజిస్తున్నారు. కేటగిరీని బట్టి పార్కింగ్ చార్జీలు మారుతుంటాయి. తొలుత మూడువేల కార్లు, ఆరువేల మోటారు బైకులకు పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేస్తున్నారు. మనం వెళ్లే ప్రాంతాన్నిబట్టి అక్కడి పార్కింగ్ స్థలాన్ని, అందులోని ఖాళీ స్లాట్లను యాప్ ద్వారా ముందుగా గుర్తించవచ్చు. అవసరమైతే అడ్వాన్స్‌గా బుకింగ్ చేసుకోవచ్చు. -
సెల్ఫీ కొట్టు...లక్ష పట్టు..!
బెంగళూరు: ఆగస్టు 15 నుంచి నగరవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న ఇందిరా క్యాంటీన్లకు విస్తృత ప్రచారం కల్పించేందుకు బీబీఎంపీ సెల్ఫీ విత్ ఇందిరా క్యాంటీన్ కార్యక్రమాన్ని రూపొందించింది. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఇందిరా క్యాంటీన్లకు చేరుకోవడానికి వీలుగా బీబీఎంపీ అభివృద్ది చేస్తున్న మొబైల్ యాప్ మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇందిరా క్యాంటీన్ ముందు సెల్ఫీ తీసుకొని అందుకు అనుబంధంగా ట్యాగ్‌లైన్ పెట్టి యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఇలా పంపిన సెల్ఫీల్లో ఉత్తమ సెల్ఫీ పంపిన వారిని విజేతలుగా ప్రకటించి రూ. 1 లక్ష నగదు బహుమానాన్ని అందించనున్నట్లు బీబీఎంపీ ఆర్థికవిభాగం ప్రత్యేక కమిషనర్ మనోజ్ రాజన్ తెలిపారు. ఆగస్టు 15న 106 ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీలను ప్రారంభించనుంది. అందులో 80 క్యాంటీన్లు ఇప్పటికే నిర్మాణ పనులను పూర్తి చేసుకున్నాయి. ఆగస్టు 10 నుంచి 750 మంది కేటరింగ్ సిబ్బందికి మల్లేశ్వరంలోని ఐపీపీ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 15న బెంగళూరు నగరంలోని నేషనల్ కాలేజ్ క్రీడా మైదానంలో ఇందిరా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్లను ఈనెల 15న ప్రారంభిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే క్యాంటీన్లలను ఏర్పాట్లు చేసి నగరంలో అందుబాటులోకి కాంగ్రెస్ ప్రభుత్వం తేనుంది. -
600 ఎస్ఎఫ్టీ ఇంటికి రూ. 4.53 కోట్ల ఆస్తిపన్ను!
పూరి గుడిసెకు వేలల్లో కరెంటు బిల్లులు రావడం ఇంతవరకు చూశాం. కానీ, సరిగ్గా 600 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం మాత్రమే ఉన్న ఓ చిన్న ఇంటికి ఏకంగా 4.5 కోట్ల రూపాయల ఆస్తిపన్ను విధించి బెంగళూరు కార్పొరేషన్ అధికారులు కొత్త చరిత్ర సృష్టించారు. అస్లాం పాషా అనే వ్యక్తికి దక్షిణ బెంగళూరులోని కావేరి నగర్లో చిన్నపాటి ఇల్లుంది. అతడు రూ. 4,53,32,161 ఆస్తిపన్ను కట్టాలని మెసేజ్ వచ్చింది. నోటీసు మాత్రం ఇంకా రాకపోవడంతో అతడికి అనుమానం వచ్చి రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. తాను బీబీఎంపీ కార్యాలయానికి పన్ను చెల్లించేందుకు వెళ్లానని, అయితే అక్కడేదో సమస్య ఉందని చెప్పి తర్వాత రమ్మన్నారని, తనకు నోటీసు కూడా ఇంకా ఇవ్వలేదని పాషా తెలిపారు. మే నెలాఖరులోగా ఆస్తిపన్ను చెల్లించేవారికి 5% రాయితీ ఇస్తామని బీబీఎంపీ ప్రకటించింది. కానీ దాన్ని లెక్కపెట్టడంలో మాత్రం ఏదో సాంకేతిక లోపం వచ్చింది. దాంతో ఆ సాఫ్ట్వేర్ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ లోపం వల్లే.. గత సంవత్సరం తన జి+2 ఇంటికి రూ. 6235 పన్ను చెల్లించిన శ్రీనివాసమూర్తికి ఈసారి రూ. 1.59 కోట్ల పన్ను వచ్చింది. ఈ లోపాన్ని సరిచేయలేని అధికారులు.. ఇలాంటి సమస్యలతో వస్తున్న వాళ్లను తిరిగి మరోసారి రమ్మని మాత్రమే చెబుతున్నారు. అసలు విషయం ఇదీ.. అస్లాం పాషా ఇంటి విషయంలో మొత్తం 2వేల అంతస్తులు ఉన్నట్లుగా ఎంటర్ చేశారని, శ్రీనివాసమూర్తి కేసులో కూడా 450 అంతస్తులు ఉన్నట్లు ఎంటర్ చేశారని, ఇది మానవ తప్పిదమే తప్ప సాఫ్ట్వేర్ లోపం కాదని బీబీఎంపీ జాయింట్ కమిషనర్ ఎం. వెంకటాచలపతి చెప్పారు. -
భౌభౌకు లైసెన్స్ తప్పనిసరి
► ఫ్లాట్‌కు ఒక్క పెంపుడు కుక్క మాత్రమే.. ► భారీ శునకాలకు నో చాన్స్ ► త్వరలో అమల్లోకి రానున్న పాలికె నిబంధనలు బెంగళూరు : ఉద్యాన నగరిలో ఇప్పడు పెంపుడు కుక్కలను పెంచుకోవాలంటే లైసెన్స్ తప్పనిసరి కానుంది. అదే విధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్‌కు ఒక కుక్కను మాత్రమే పెంచుకోవడానికి అనుమతి ఉంటుంది. అలాగే అపార్టుమెంట్‌వాసులు భారీ పరిమాణంలో ఉండే కుక్కలను పెంచుకోవడానికి అనుమతి ఉండదు. ఇలాంటి నిబంధనలను త్వరలో బీబీఎంపీ అమలు చేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలపై ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోరింది. అనుమతి రాగానే పెంపుడు కుక్కల కోసం పాలికె కార్యాలయం చుట్టూ తిరగక తప్పదు. బెంగళూరులో ఇప్పటి వరకు కుక్కలను పెంచుకోవడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. ముంబై, చండీఘడ్ తదితర నగరాల్లో కుక్కలను పెంచుకోవాలంటే అనుమతి తప్పనిసరి. దీంతో ఇదే నిబంధనలు బెంగళూరులో కూడా అమలు చేయడం కోసం పాలికె తీవ్ర కసరత్తు చేస్తోంది. అనుమతికి రూ. 250 : కుక్కను పెంచుకోవాలనుకునేవారు మొదట బీబీఎంపీ నుంచి అనుమతి పొందడానికి రూ. 250లు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా అపార్ట్మెంట్ వాసులు భారీ పరిమాణంలో ఉండే బుల్డాగ్, జర్మన్ షపర్డ్ తదితర కుక్కలను అనుమతి ఉండదు, పెంచితే వారికి జరిమానా విధిస్తారు. అదే విధంగా జనవాసాల్లో పెంపుడు కుక్కలను తీసుకువచ్చి బహిర్బూమి, మూత్ర విసర్జన చేయిస్తే వాటి యజమానితోనే శుభ్రం చేయిస్తారు. కుక్కలు పెంచడం హాబీగా ఉన్న వాళ్లు ఇకపై ఈ నిబంధనలు పాటించాల్సిందే. -
పఠాన్ కోట్ హీరో ఇల్లు.. పడగొట్టే యత్నం..!
బెంగళూరుః బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపి) చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో భాగంగా పఠాన్ కోట్ దాడిలో ప్రాణత్యాగం చేసిన నిరంజన్ కుమార్ నివాసం పడగొట్టాలనుకోవడం ఇప్పుడు రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ఉగ్రదాడి సందర్భంలో అసువులు బాసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎస్జీ) కమాండో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ నివాసంలోని కొంత భాగం పడగొట్టేందకు బీబీఎంపి నిశ్చయించింది. కర్నాటక ముఖ్యమంత్రి ఎస్ సిద్ధరామయ్య సూచనల మేరకు బెంగళూరులో కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ నివాసంలోని కొంత భాగాన్ని కూల్చాలని బృహత్ బెంగళూరు మహానగర పాలిక నిశ్చియించింది. అయితే దేశంకోసం ప్రాణత్యాగం చేసిన నిరంజన్ కుమార్ కుటుంబానికి కనీస గౌరవం అందించాల్సి ఉందంటూ, సీఎం నిర్ణయాన్ని భారతీయ జనతాపార్టీ నాయకుడు జగదీష్ షెట్టార్ విభేదిస్తుండగా... ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంజన్ కుటుంబానికి గృహ నిర్మాణంకోసం మరో స్థలాన్ని ఇవ్వనున్నట్లు కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర చెప్తున్నారు. మరోవైపు తాము చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతకు నిరంజన్ కుటుంబం మద్దతునివ్వడం పట్ల బీబీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ ఎ ఆలం ప్రశంసలు కురిపించారు. తమ నివాసంలోని ఆక్రమిత భాగాన్ని పడగొట్టేందుకు అంగీకరించిన ఎన్ఎస్జీ కంమాండో తల్లిదండ్రులకు ఆయన శాల్యూట్ చేశారు. అయితే తన సోదరుడి త్యాగాన్ని గుర్తించయినా కూల్చివేత డ్రైవ్ ను ఆపాలని, లేదంటే కొంత సమయమైనా ఇవ్వాలని నిరంజన్ సోదరుడు కోరారు. ఈ చర్యలు తమకెంతో సిగ్గుగా అనిపిస్తున్నాయని, పఠాన్ కోట్ దాడిలో సోదరుడి ప్రాణాలు పోగొట్టుకున్న బాధలో ఉన్న తాము.. ఇల్లు కూలగొట్టే చర్యను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉందంటూ ఉద్వేగంగా మాట్టాడారు. ముందస్తుగా ప్రయర్ నోటీసులు జారీ చేసి ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళమని, ఇటువంటి చర్యలు ప్రభుత్వానికే కాక, దేశానికే తలవంపులని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు నగరంలో డ్రైనేజ్ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు 'బీబీఎంపీ' కూల్చివేతల కార్యక్రమం చేపట్టింది. నిరంజన్ కుమార్ ఇంటితోపాటు, డ్రైవ్ లో భాగంగా అక్కడి 1100 వరకూ అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ కూడా చేసింది. పఠాన్ కోట్ ఉగ్రదాడి సందర్భంలో రాత్రంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన ఎన్ఎస్జీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ లో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ సభ్యుడు. నిర్వీర్యం చేసే ప్రయత్నంలో గ్రెనేడ్ పేలడంతో నిరంజన్ ప్రాణాలు కోల్పోయాడు. -
ఆస్తి పన్ను ఆరగించేశారు !
బీబీఎంపీలో రూ. కోట్ల గోల్మాల్ మాజీ మేయర్ సహా పలువురు సభ్యుల వెల్లడి బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలోని ఆస్తిపన్ను వసూలు విషయంలో రూ.5,649 కోట్ల గోల్మాల్ జరిగినట్లు మాజీ మేయర్లు బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు ఎస్.కే నటరాజ్, కట్టె సత్యనారాయణలు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అదే పార్టీకి చెందిన నాయకులు, మాజీ ఉపమేయర్ ఎస్. హరీష్, మాజీ బీబీఎంపీ సభ్యుడు ఏ.హెచ్ బసవరాజ్‌తో కలిసి నగరంలో సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వసూలైన ఆస్తి పన్నును బ్యాంకులో జమ చేయడం తదితర విధుల కోసం గతంలో ఇండియన్ సెంటర్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేవారన్నారు. ఈ నేపథ్యంలో 2012-13,2013-14 ఏడాదిలో బీబీఎంపీ పరిధిలో రూ.6,680 కోట్లు ఆస్తి పన్ను వసూలైందని, అయితే అందులో కేవలం రూ.1,031 కోట్ల మాత్రం బీబీఎంపీ ఖాతాల్లో జమైందని, మిగిలిన రూ.5,649 కోట్లకు సంబంధించి వివరాలు తెలియడం లేదని వివరించారు. ఇక ఆస్తి పన్ను చెల్లింపుల కోసం కొంతమంది డీడీలు, చెక్కులు ఇస్తారని అయితే వాటిలో 60 శాతం చెక్కుల బౌన్స్ కావడం, సంతకం సరిగా లేకపోవడంతో తదితర కారణాలతో చెల్లుబాటు కాలేదన్నారు. ఇలా చెల్లుబాటు కాని చెక్కులు, డీడీలు ఇచ్చిన వారి నుంచి తిరిగి ఆస్తిపన్ను వసూలు చేయడం లేదని వారు పేర్కొన్నారు. ఇందుకు మెకానికల్ ఇంజనీర్ అయిన శేషాద్రిని బీబీఎంపీ ఐటీ విభాగం అధిపతిగా నియమించడమే ప్రధాన కారణమని, ఆయనను తొలగించి సమర్థుడైన అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆస్తిపన్ను వసూలు కోసం కావేరి పేరుతో నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై కూడా అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. అందువల్ల ఈ సాఫ్ట్వేర్ వినియోగాన్ని కూడా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బీబీఎంపీలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో మొత్తం 16 లక్షల ఆస్తులు ఉన్నట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిందన్నారు. అయితే ప్రస్తుతం బీబీఎంపీ పరిధిలో 10 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయన్నారు. మిగిలిన ఆరు లక్షలు ఎక్కడికి వెళ్లినట్టు అని వారు ప్రశ్నించారు. ఆస్తుల సంఖ్య తగ్గిపోవడం వల్ల బీబీఎంపీ ఖజానాకు వేల కోట్ల గండి పడుతోందని పేర్కొన్నారు. నగరంలో 2వేలకు పైగా అనధికార అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉన్నాయన్నారు. అదే విధంగా 370 ఐటీ బీటీ కంపెనీలు వేలకొద్ది హాస్టల్స్, నర్సింగ్‌హోంలు ఆస్తిపన్ను చెల్లించడం లేదన్నారు. ఈ విషయమై ప్రతి ఏడాది కోట్లాది రుపాయలు చేతులు మారుతున్నాయని వారు ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపించి అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌చేశారు. -
చెత్త రహితానికి నజరానా
బీబీఎంపీ కార్పొరేటర్లకు సీఎం తాయిలం బెంగళూరులో ప్లాస్టిక్ నిషేధానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటన కపై 15 రోజులకొకసారి నగర పర్యటన బెంగళూరు(బనశంకరి) : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని వార్డులను చెత్త రహితంగా తీర్చిదిద్దిన కార్పొరేటర్లకు పారితోషకం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. జాతీయ నగర ఆరోగ్య మిషన్ కార్యక్రమం అమలుపై పాలికె సభ్యులకు వికాససౌధలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెంగళూరులో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు బీబీఎంపీ సభ్యులు పూర్తిగా సహకరిం చాలని అన్నారు. రహదారులపై చెత్తను తొల గించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా అపరిశుభ్రత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తను తొలగించేందుకు పాలికె సభ్యులు తొలి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. నగరంలో రోజూ నా లుగున్నర టన్నుల చెత్త పోగవుతోందని, ఇంత చెత్త సేకరణ కష్టమవుతోందని తెలిపారు. గార్డెన్‌సిటీగా పేరుపొందిన బెంగళూరు నగరం ప్ర స్తుతం గార్బేజ్‌సిటీ అనే పేరుపొందిందని ఈ చెడ్డ పేరును తొలగించడానికి కృషి చేయాలన్నారు. చెత్తసేకరణ సంస్కరణలకు తమ ప్రభుత్వం అవసరమైన సహయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆక్రమణలకు గురైన నగరంలోని చెరువులు, రాజకాలువలను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఒకపై ప్రతి 15 రోజులకొకసారి తాను బెంగళూరులోని వీధుల్లో పర్యటిస్తానని, ఆ సమయంలో చెత్త సేకరణ, విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే అధికారులకు మద్దతు ఇవ్వరాదంటూ పాలికె సభ్యులకు సూచించారు. నగర పరిధిలో తాగునీటి లీకేజీలను అరికట్టాలన్నారు. అనంతరం బీబీఎంపీ ప్రతిపక్షనేత పధ్మనాభరెడ్డి మాట్లాడుతూ నగరంలో పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేదించడం సాధ్యం కావడం లేదన్నారు. గతంలో ప్లాస్టిక్ నిషేదించాలని ప్రభుత్వానికి ప్రస్తావించామని, ప్రస్తుతం ప్రభుత్వం ప్లాస్టిక్ ను నిషేదిస్తే తామంతా సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు యు.టి.ఖాదర్, రామలింగారెడ్డి, దినేశ్‌గుండూరావు, మేయర్ మం జునాథరెడ్డి, డిప్యూటీ మేయర్ హేమలతాగోపాలయ్య, కమిషనర్ కుమార్‌నాయక్, ఎమ్మెల్యేలు అశ్వత్థనారాయణ, గోపాలయ్య, బీ బీఎంపీ ఆర్థిక స్థాయీ సమితి అధ్యక్షుడు ముజాహిద్దిన్‌పాషా, బీబీ ఎంపీ పాలనా విభాగం నేత అశ్వత్థనారాయణ, కుటుంబసంక్షేమ శాఖా ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ తివారీ పాల్గొన్నారు. -
బీజేపీలో నైరాశ్యం
బెంగళూరు(బనశంకరి) : బీబీఎంపీ ఎన్నికల్లో బీజేపీని వంద స్థానాల్లో గెలుపించిన సామ్రాట్‌గా పేరుపొందిన మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్ నడవడికే వారిని ముంచింది. బేషరత్తుగా మద్దతు ఇస్తామంటూ అశోక్ వద్దకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను అశోక్ నిర్లక్ష్యం చేయడమే ఆ పార్టీని అధికారానికి దూరం చేసింది. అశోక్ దురహంకార ధోరణితోనే చేతులారా బీబీఎంపీని వదులుకోవాల్సి వచ్చిందని రాజకీయవర్గాల్లో వినిపిస్తుంది. రాజకీయబద్ద శత్రువులుగా ముద్రపడ్డ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హెచ్డీ దేవెగౌడ బీబీఎంపీని దక్కించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికారు. ఈ స్నేహం రానున్న జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతుందని వినబడుతుంది. బీబీఎంపీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపొందిన అధికారం చేపట్టడంలో విఫలమైన పార్టీ నేతలపై పాలికె సభ్యులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, బీబీఎంపీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను కైవశం చేసుకోవడంతో కాంగ్రెస్, జేడీయస్ పార్టీ శ్రేణుల్లో ఆనందాలు మిన్నంటాయి. బీబీఎంపీలో మేయర్ ఎన్నిక ముగిసిన వెంటనే ప్రవేశద్వారం ద్వారా వందలాదిమంది కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. నిషేదాజ్ఞలు అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు గుంపులుగా చేరిన కార్యకర్తలను చెదరగొట్టారు. అయినప్పటికీ వందలాది సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అంతేగాక కేపీసీసీ కార్యాలయం వద్ద బాణాసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. అలాగే జేడీఎస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా సంబరాలు మిన్నం టాయి. 8 ఏళ్ల అనంతరం జేడీఎస్- కాంగ్రెస్ కూటమిగా ఏర్పడటం రాష్ట్రరాజకీయాల్లో సంచలనానికి తెరలేపింది. -
కూటమికే పట్టం
జేడీఎస్, స్వతంత్రుల సహకారంతో బీబీఎంపీ మేయర్ స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలుపొందినా... బీజేపీకి తప్పని భంగపాటు ఉత్కంఠగా సాగిన ఎంపిక కీలక స్థానాలను దక్కించుకున్న స్వతంత్రులు ఉప మేయర్ స్థానం జేడీఎస్‌కు మేయర్‌గా మడివాళ కార్పొరేటర్ మంజునాథరెడ్డి బెంగళూరు : నగరంతో పాటు రాష్ట్రంలో తీవ్ర కుతూహలం రేకెత్తించిన బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ ఎన్నికల్లో చివరికి కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయఢంకా మోగించింది. అన్ని అడ్డంకులను దాటుకుని మేయర్, ఉపమేయర్ స్థానాలను ఈ రెండు పార్టీలు కైవసం చేసుకోగా పన్నెండిటిలో ఏడు స్థాయీ సమితి అధ్యక్ష స్థానాలను మద్దతు ప్రకటించిన స్వతంత్ర అభ్యర్థులు దక్కించుకున్నారు. దీంతో బీబీఎంపీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ఎక్కువ వార్డుల్లో గెలిచిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. బెంగళూరులో మేయర్, ఉపమేయర్ ఎన్నిక కోసం శుక్రవారం జరిగిన ఎన్నికల్లో నగర 49వ మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకు చెందిన మడివాళ కార్పొరేటర్ మంజునాథ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉపమేయర్ పదవిని వృషభావతి వార్డు జేడీఎస్ కార్పొరేటర్ హేమావతి గోపాలయ్య దక్కించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే వెల్లడించిన నోటిఫికేషన్ ప్రకారం శుక్రవారం ఉదయం కాంగ్రెస్, జేడీఎస్ మైత్రి కూటమి నుంచి మేయర్ స్థానానికి మంజునాథ్‌రెడ్డి, ఉపమేయర్ స్థానానికి హేమలతా నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీజేపీ తరఫున ఈ రెండు స్థానాలకు వరుసగా మంజునాథరాజు, హెచ్‌సీ నాగరత్న నామినేషన్లు వేశారు. అనంతరం ఈ సారి బీబీఎంపీ ఎన్నికల్లో గెలిచిన 198 కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్ర హై కోర్టు ఆదేశాలను అనుసరించి మేయర్, ఉపమేయర్ స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు నగర ప్రాంతీయ కమిషనర్ ఎం.వి.జయంతి బీబీఎంపీ సభలో వెల్లడించారు. అటు మేయర్ స్థానానికి పోటీపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంజునాథ్‌రెడ్డి, బీజేపీ నాయకుడు మంజునాథరాజులలో ఎవరిని ఎవరు సమర్థిస్తున్నారో చెప్పాల్సిందిగా జయంతి కార్పొరేటర్లకు సూచించారు. దీంతో మంజునాథ్రెడ్డిని సమర్థిస్తూ 131 మంది ప్రజాప్రతినిధులు చేతులు పైకి లేపగా మంజునాథరాజుకు 128 మంది మద్దతు లభించింది. దీంతో మేయర్‌గా మంజునాథరెడ్డి ఎన్నికైనట్లు జయంతి ప్రకటించారు. అదేవిధంగా హేమలతా గోపాలయ్య కూడా 131 మంది మద్దతుతో ఉపమేయర్ పదవిని దక్కించుకున్నారు. అందరూ హాజరు... కర్ణాటక మునిసిపల్ కార్పొరేషన్ యాక్ట్‌ను అనుసరించి మేయర్ ఎన్నిక విషయంలో కార్పొరేటర్లకే కాకుండా బీబీఎంపీ పరిధిలోని ప్రజాప్రతినిధులకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సారి బీజేపీ కంటే కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్, స్వతంత్రుల మద్దతుతో ఆ పార్టీ మేయర్ పదవిని దక్కించుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జరిగిన ఎన్నికలో ఆ పార్టీకు చెందిన అందరు నాయకులూ మేయర్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఇక మేయర్ పదవిపై చివరి క్షణం వరకూ ఆశలు వదులుకోని బీజేపీ అధినాయకులు తమ పార్టీకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులందరూ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అటు కాంగ్రెస్-జేడీఎస్ కూటమితో పాటు బీజేపీకు చెందిన అందరు నాయకులు హాజరు కావడంతో బీబీఎంపీ కార్యాలయం మొత్తం ఫుల్ అడెండెన్స్తో కళకళలాడింది. -
పొత్తు లేదు
- బీబీఎంపీ మేయర్ ఎంపికపై ఎవరితోనూ మైత్రి ప్రస్తావనే లేదు - స్పష్టం చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ సీటు కోసం తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రస్తావనే లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో కొత్తగా ఎంపికైన కార్పొరేటర్లతో శనివారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌తో కలిసి సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. మేయర్ ఎంపిక పూర్తయ్యే వరకు నగరాన్ని వీడి ఎక్కడికీ వెళ్లవద్దని కొత్తగా ఎంపికైన కార్పొరేటర్లకు ఈ సమావేశంలో సిద్దరామయ్య సూచించినట్లు సమాచారం. అంతేకాక ఎన్నికల సమయంలో పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆయా వార్డుల్లో కార్పొరేటర్లు శ్రమిం చాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉం డాలని మార్గనిర్దేశనం చేశారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. ఇక సమావేశానికి ముందు సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ....బీబీఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ శిరసావహిస్తుందని తెలి పారు. మేయర్ సీటు కోసం ఎవరితోనూ పొత్తు కు దుర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నా రు. అనంతరం కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ మాట్లాడుతూ... బీబీఎంపీ ఎన్నికల్లో మైత్రికి సంబంధించి చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదని అన్నారు. అయినా పార్టీ అనుమతి లేకుండానే మైత్రి చర్చలు జరిపిన నాయకుల నుంచి వివరణ కోరనున్నట్లు పరమేశ్వర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకోనుందనే వ్యాఖ్య లు సత్యదూరమని స్పష్టం చేశారు. -
పైరవీలు షురూ..
‘మేయర్’ కుర్చీ కోసం తహతహలాడుతున్న కమలనాథులు అభ్యర్థి ఎంపిక కోసం శనివారం సీనియర్ నేతల సమావేశం బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల్లో 100 వార్డులను సొంతం చేసుకొని అధికార పీఠాన్ని దక్కించుకున్న బీజేపీలో ఇక ‘మేయర్’ కుర్చీ కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. ‘మేయర్’ స్థానాన్ని దక్కించుకునేందుకు గాను ఆ పార్టీ కార్పొరేటర్ల మధ్య పోటీ ప్రారంభమైంది. ఆ పార్టీలోని సీనియర్ కార్పొరేటర్లైన నాగరాజు, పద్మనాభరెడ్డిల మధ్య ముఖ్యంగా పోటీ నెలకొంది. వీరితో పాటు కార్పొరేటర్లు ఎల్.శ్రీనివాస్, మంజునాథ్ రాజు, ఉమేష్ శెట్టి, ఎం.నాగరాజు, గురుమూర్తి రెడ్డిలు కూడా మేయర్ రేస్‌లో ఉన్నారు. వీరంతా పార్టీలో తమకు మద్దతుగా ఉన్న, తమ గాడ్‌ఫాదర్‌లైన నేతలతో ‘మేయర్’ కుర్చీ కోసం ఇప్పటికే పైరవీలు ప్రారంభించారు. ఇక ఇతర పార్టీల నుంచి బీజేపీకి వచ్చి కార్పొరేటర్లుగా గెలిచిన వారికి ఈ సారి మేయర్ పీఠాన్ని కట్టబెట్టరాదనే వాదన చాలా మంది కార్పొరేటర్ల నుంచి వినిపిస్తోంది. మొదటి నుంచి పార్టీలోనే ఉండి పార్టీకి సేవ చేస్తున్న కార్పొరేటర్లకే మేయర్ పదవిని కట్టబెట్టాలని, మేయర్ ఎంపిక విషయంలో కేవలం పార్టీ నాయకత్వ అభిప్రాయమే కాకుండా, పార్టీకి చెందిన కార్పొరేటర్లు, బీబీఎంపీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, ఎటువంటి అవినీతి, అక్రమాల ఆరోపణలు లేకుండా పార్టీ వర్చస్సును పెంచగలిగే సీనియర్ నేతకే మేయర్ పదవిని కట్టబెట్టాలని పార్టీ నాయకులు ఇప్పటికే తీర్మానించినట్లు సమాచారం. శనివారం సమావేశం కానున్న నేతలు.... ఇక ‘మేయర్’ అభ్యర్థిని ఎన్నుకొనేందుకు గాను బీజేపీ సీనియర్ నేతలు, ఈ శనివారం సమావేశం కానున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషితో పాటు కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, సదానందగౌడ, సీనియర్ నేతలు ఆర్.అశోక్, వి.సోమణ్ణలు ఈ సమావేశంలో పాల్గొని మేయర్ అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే సందర్భంలో స్వతంత్య్ర అభ్యర్థులుగా గెలిచిన ఎనిమిది మంది కార్పొరేటర్లలో కనీసం ఐదుగురిని తమ పార్టీలో చేర్చుకొని, తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
'బెంగళూరు ప్రజలకు ధన్యవాదాలు'
న్యూఢిల్లీ: బీజేపీపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బెంగళూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అభినందించారు. ఈ విజయంతో హాట్రిక్ కొట్టామని ట్విటర్ లో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిందని గుర్తు చేశారు. అభివృద్ధి రాజకీయాలకు, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని ఈ విజయాలు వెల్లడిస్తున్నాయన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. 125 భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చందుకు ప్రయత్నిస్తామని మోదీ ట్వీట్ చేశారు. Thank you Bengaluru! My gratitude to people & congratulations to Karnataka BJP leaders & workers for the great BBMP election results. — Narendra Modi (@narendramodi) August 25, 2015 -
అంతా సిద్ధం
రేపు బీబీఎంపీ ఎన్నికల పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకోనున్న 73 లక్షల మంది పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు 1900కు పైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 20 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత బెంగళూరు :బహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల పోలింగ్‌ను శాంతి, భద్రతల నడుమ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీనివాసాచారి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గురువారమిక్కడి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు శ్రీనివాసాచారి సమాధానమిచ్చారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్, బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్‌లు సైతం పాల్గొని పోలింగ్ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ....బీబీఎంపీ పరిధిలోని 198 వార్డులకు ఇప్పటికే ఒక వార్డులో ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 197 వార్డులకు ఈనెల 22న పోలింగ్ జరగనుందని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్‌తో పాటు బీబీఎంపీ, పోలీసు శాఖలు సంయుక్తంగా ఎన్నికలఏర్పాట్లను నిర్వహిస్తున్నాయని తెలిపారు. గత బీబీఎంపీ ఎన్నికల్లో కేవలం 44శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని, ఈ ఎన్నికల్లో పోలింగ్‌ను 60శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో పూర్తి పారదర్శకత కోసం ఐఏఎస్ స్థాయిలోని ఏడుగురు అధికారులను ప్రత్యేక మానిటరింగ్ అధికారులుగా నియమించినట్లు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో 53 మంది ప్రత్యేక ఎన్నికల అధికారులను సైతం నియమించినట్లు తెలిపారు. 197వార్డుల్లో పోలింగ్ కోసం మొత్తం 6,759 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓటు హక్కును వినియోగించుకోనున్న 73లక్షల మంది ఓటర్లు.... ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్ సైతం ఓటర్ల వివరాలను వెల్లడించారు. కొత్తగా ఓటు హక్కును పొందిన 3.5లక్షల మంది ఓటర్లతో కలిపి నగరంలో మొత్తం 73,88,256 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. వీరిలో 38,76,244 మంది పురుష ఓటర్లు కాగా, 35,10,828 మంది మహిళా ఓటర్లు. ఇటీవలే సహకార సంఘాల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఓటర్ల ఎడమ చేతి బొటనవేలికి సిరాగుర్తు వేయనున్నట్లు తెలిపారు. నోటా ఓటును వినియోగించుకోవాలనుకునే ఓటర్లు ఫారం నంబర్ 27ను నింపి తమ నోటా ఓటును నమోదుచేయవచ్చని సూచించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ మాట్లాడుతూ....ఎన్నికల కోసం 20వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలో 2,069 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకమైనవిగా, 1,909పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ పోలింగ్ బూత్‌లలో మరింత ఎక్కువగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు మేఘరిక్ వెల్లడించారు. -
బహిరంగ ప్రచారానికి తెర...
బెంగళూరు:ృ బహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెరపడింది. దీంతో పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి బెంగళూరు నగరం ఆయా పార్టీల నేతల ప్రచారంతో హోరెత్తింది. ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మొదలుకొని కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన ప్రముఖ నేతలు ఇలా అందరూ బహిరంగ సమావేశాల్లో పాల్గొని ఒకరి వైఖరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అంతేకాక అభ్యర్థుల మద్దతుదారుల బైక్ ర్యాలీ, సైకిల్ ర్యాలీలు, బహిరంగ ప్రచారంతో నగరమంతా మారుమోగింది. ఇక బహిరంగ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో గడువు ముగియడంతో గురువారం నుంచి ఇంటింటి ప్రచారాన్ని అభ్యర్థులు చేపట్టనున్నారు. కాగా, పోలింగ్‌కు మరో 48గంటలు మాత్రమే సమయం ఉండడంతో శాంతి, భద్రతల నడుమ, పూర్తి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ బూత్‌లలో అధికారుల నియామకం, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడం, పర్యవేక్షకుల నియామకంతో పాటు ఈవీఎంలను ఎన్నికల కమీషన్ ఇప్పటికే సిద్ధం చేసింది. గురువారం సాయంత్రానికి పోలింగ్ బూత్‌ల వారీగా అధికారుల నియామకాన్ని పూర్తి చేయడంతో పాటు సంబంధిత అధికారులను ఆయా బూత్‌లకు చేర్చే విధంగా ఎన్నికల కమీషన్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో నగర పోలీస్ విభాగం గట్టి నిఘా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి వీలుగా అదనపు బలగాలను మోహరించింది. సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలతో నిఘా ఏర్పాటు చేసింది. అవసరమైతే వాచ్టవర్లు, ద్రోణ్ల సహాయంతో నిఘా ఏర్పాటు చేస్తామని నగర కమిషనర్ మేఘరిక్ తెలిపారు. -
ఓటు అడిగితే.... రోడ్డు చూపండి
‘నో రోడ్-నో ఓట్’ క్యాంపైన్‌ను ప్రారంభించిన విద్యాశ్రీ నెటిజెన్ల నుంచి అనూహ్య స్పందన నాలుగు రోజుల్లో 1.35 లక్షలకు పైగా లైక్‌లు బెంగళూరు : బెంగళూరులో ప్రస్తుతం బీబీఎంపీ ఎన్నికల వేడి పెరుగుతోంది. నగరానికి ‘అద్భుత నగిషీలు’ చెక్కి సమస్యలన్నింటినీ పరిష్కరించేస్తామని అన్ని పార్టీలు హామీల వర్షాలను గుప్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఉద్యాననగరి వాసులపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. అయితే ప్రతి ఎన్నికల తరహాలోనూ ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఎన్నికల హామీలు చెత్తబుట్టల్లోకి చేరిపోతాయనేది నగర వాసుల ఆవేదన. ఇలాంటి ఓ నగరవాసి ఆవేదన నుంచి ప్రారంభమైనదే ‘నో రోడ్-నో ఓట్’ క్యాంపైన్. నగరంలోని రాజరాజేశ్వరి నగర ప్రాంతానికి చెందిన 23ఏళ్ల విద్యాశ్రీ ఈ క్యాంపైన్‌ను ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం విద్యాశ్రీ ప్రారంభించిన ఈ క్యాంపైన్‌కు ప్రస్తుతం నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆమె నుంచి స్ఫూర్తి పొందిన ఎంతో మంది ఈ క్యాంపైన్లో తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. ఎలా మొదలైందీ క్యాంపైన్.... బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర ప్రాంతానికి చెందిన విద్యాశ్రీ ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఆర్ట్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు ప్రతి రోజు తన సొంత వాహనంలో దాదాపు 15కిలోమీటర్ల మేర ఆమె ప్రయాణిస్తుంటారు. రాజరాజేశ్వరి నగరలో రోడ్ల దుస్థితి కారణంగా తన ప్రయాణంలో ప్రతి రోజు ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే వస్తున్నారు. కొన్ని సార్లు రోడ్ల దుస్థితి ప్రమాదాలకు దారి తీసిన సందర్భాలను ఆమె చవి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ రాజకీయ నేతల్లో రోడ్ల దుస్థితిపై జాగృతి కల్పించడంతో పాటు రోడ్ల దుస్థితి కారణంగా సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియజెప్పేందుకు గాను ‘నో రోడ్-నో వోట్’ పేరిట నాలుగు రోజుల క్రితం ఆమె ఈ క్యాంపైన్‌ను ప్రారంభించారు. నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన..... విద్యాశ్రీ ప్రారంభించిన ఈ క్యాంపైన్‌కు ఆమె స్నేహితులు చంద్రు, నేహాల్ మద్దతుగా నిలిచారు. నగరంలోని రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఆ ఫొటోలను పోస్ట్ చేస్తూ వచ్చారు. వీరు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. నాలుగు రోజుల్లోనే విద్యాశ్రీ క్యాంపెన్‌ను ప్రశంసిస్తూ 1.35 లక్షల మంది ఆమె ఫేస్‌బక్ పేజ్‌ను‘లైక్’ చేశారు అంతేకాక విద్యాశ్రీ చేస్తున్న క్యాంపైన్‌కి తమ మద్ధతును తెలియజేసేందుకు ముందుకు వచ్చి తమ తమ ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితిని తెలియజేసేలా ఫొటోలు తీసి వాటిని ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేస్తున్నారు. ప్రశ్నించమనే అడుగుతున్నాను.... ‘నగరంలోని రోడ్ల దుస్థితిని నేతల దృష్టికి తీసుకొచ్చేందుకే నేను ఈ క్యాంపైన్ని ప్రారంభించాను. సామాన్య ప్రజలు ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులకు కనిపిస్తారు. అందుకే నగర వాసులందరినీ నేను కోరేది ఒక్కటే...మీ ఇంటి దగ్గరికి ఓట్లు అడిగేందుకు వచ్చే నాయకులందరినీ(పార్టీలతో సంబంధం లేకుండా) మీ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిందిగా కోరండి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లను అభివృద్ధి చేసిన వారికే మీ ఓటు వేస్తామని చెప్పండి. ఈ క్యాంపైన్ ద్వారా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చెందినా చాలు. అలాగని పూర్తిగా ఓటింగ్‌కు దూరంగా ఉండమని కూడా నేను చెప్పడం లేదు. ఓటు అడగానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ రోడ్ల దుస్థితిని తెలియజేసే, రోడ్డును అభివృద్ధి చేసే వారికే ఓటు వేస్తామని చెప్పేలా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడమే నా క్యాంపైన్ లక్ష్యం.’ - విద్యాశ్రీ, ఆర్ట్ టీచర్ -
వేడెక్కిన ప్రచారం
రంగంలోకి సినీ తారలు విమర్శలకు దిగిన తాజా మాజీ సీఎంలు బెంగళూరు: పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ)ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన తాజా, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆదివారం ప్రచార పర్వంలో దిగారు. ఒకరిపై మరొకరు విమర్శలకు పాల్పడుతూ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప, జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పచార పర్వంలో విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఆయా పార్టీలకు చెందిన సినీతారలు కూడా ఇంటి ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థుల గెలుపుకోసం చమటోడుస్తున్నారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ కాస్త ముందున్నట్లు కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు చెందిన సినీతారలను కూడా ప్రచార పర్వంలో భాగస్వామ్యం చేస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన బహుభాషా నటి కుష్బూ బెంగళూరులో ఆదివారం తమిళనాడు ప్రాంత ప్రజలు ఎక్కువగా నివసించే హలసూరులో ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం ముగిసేంత వరకూ ఆమె బెంగళూరులోనే ఉంటారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. బీజేపీలో కూడా సినీ తారలను రంగంలోకి దించింది. స్థానికంగా ఉంటున్న సినీ తార రక్షిత పట్టాభిరామ నగర వార్డులో హెచ్.సీ నాగరత్న తరఫున ప్రచారం నిర్వహించారు. నగరాభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే జేడీఎస్ సినీగ్లామర్ విషయంలో వెనుకబడి ఉందని ఆ పార్టీ అభ్యర్థులే పేర్కొంటున్నారు. రెండేళ్లలోనే రూ.2,500 కోట్లు లూటీ-సీఎం సిద్ధరామయ్య భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో గార్డెన్ సిటీ గార్బేజ్ సిటీగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బెంగళూరు అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను బీబీఎంపీలో అధికారంలో ఉన్న బీజేపీ సక్రమంగా ఖర్చుపెట్టడంలేదు. అనేక అక్రమాలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో గత రెండేళ్లలో రూ.2,500 కోట్లు లూటీకి పాల్పడింది. మరోసారి అధికారంలోకి వస్తే ఆ పార్టీ నిధులను పక్కదారి పట్టిస్తుంది. ప్రజల సొమ్ము అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చుకావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలి. కాంగ్రెస్‌దే లూటీ సంస్కృతి- యడ్యూరప్ప కాంగ్రెస్ పార్టీదే లూటీ సంస్కృతి. గడిచిన రెండేళ్లలో కర్ణాటకలో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బీజేపీని విమర్శించే నైతికత లేదు. బీజేపీ హయాంలోనే మెట్రో వంటి అత్యాధునిక రవాణా వ్యవస్థ పట్టాలెక్కింది. కబ్జాలకు గురైన అనేక చెరువులు తిరిగి వినియోగంలోకి వచ్చాయి. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించి బీబీఎంపీ మేయర్ పదవి తిరిగి బీజేపీకి దక్కేలా చేయాలి. దొందు దొందే- కుమారస్వామి ప్రజల సొమ్ములను స్వప్రయోజనాలకు వాడుకోవడం లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లది ఒకటే దారి. ఈ రెండు పార్టీల వల్ల అభివృద్ధి, సంక్షేమం విషయంలో బెంగళూరు నగరం తిరోగమన దిశలో ప్రయాణం చే స్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరానికి వచ్చే పె ట్టుబడులు ఆగిపోతాయి. జేడీఎస్ అభ్యర్థులను గెలిపిస్తే బెంగళూరు నగరానికి తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తాం. -
ప్రచార పర్వంలోకి సిద్ధు
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల ప్రచార పర్వంలోకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం లాంఛనంగా అడుగుపెట్టేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో విజయం కోసం రూపొందించాల్సిన వ్యూహం పై చర్చించేందుకు గాను కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌తో కలిసి కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో గురువారం ఉదయం సిద్ధరామయ్య సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయా వార్డుల వారీగా అభ్యర్థులు ఎలాంటి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నగర ప్రజలకు ఎలా వివరించాలి వంటి అంశాలపై అభ్యర్థులకు సూచనలు చేశారు. అంతేకాక బీజేపీ హయాంలో బీబీఎంపీలో జరిగిన కుంభకోణాలు, నగరంలో తలెత్తిన చెత్త సమస్య వంటి అంశాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం గురువారం మద్యాహ్నం నగరంలోని బీటీఎం లే అవుట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పూర్తై తర్వాత నగరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని సిద్ధరామయ్య తొలుత భావించారు. అయితే ఇప్పటికే బీజేపీ, జేడీఎస్‌లు ప్రచారంలో దూసుకుపోతుండడంతో ఇంకా ఆలస్యం అయితే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించి గురువారం నుంచే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈనెల 15 తర్వాత స్టార్ ప్రచారకులతో బీబీఎంపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఇక గురువారం సాయంత్రానికి నగరానికి చేరుకోనున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నుంచే నగరంలో ప్రచారాన్ని చేపట్టనున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో టికెట్ లభించని కారణంగా దాదాపు 100 మంది రెబల్ అభ్యర్థులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రెబల్ అభ్యర్థులతో పార్టీ సీనియర్ నేతలు చర్చలు జరపడంతో వీరిలో దాదాపు 60 మంది గురువారం రోజున తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. కాగా మిగిలిన వారికి జేడీఎస్ పార్టీ తక్షణమే బీ-ఫాంలు అందించడంతో ప్రస్తుతం వీరంతా జేడీఎస్ తరఫున పోటీలో ఉన్నారు. దీంతో ఈ రెబల్స్ బెడదను తప్పించుకొని, విజయాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులే చేయాల్సి వస్తోందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
బీజేపీ తొలిబోణి
హొంగసంద్ర బీబీఎంపీ వార్డు కార్పొరేటర్‌గా భారతి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణతో ఏకగ్రీవం విజేతగా ప్రకటించిన ఎన్నికల అధికారి బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో బీజేపీ తొలిబోణి కొట్టింది. బొమ్మనహళ్లిలోని హొంగసంద్ర బీబీఎంపీ వార్డు(189)లో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో బీజేపీ అభ్యర్థి ఎం.భారతి ఏకగ్రీవంగా ఎన్నికైంది. బెంగళూరు : ఈ మేరకు ఎన్నికల అధికారులు గురువారం ప్రకటించారు. నామినేషన్ వేసే సమయంలో కుల ధ్రువీకరణ పత్రంలో తన పేరు మీద ఉన్నది కాకుండా తన భర్త పేరు మీద ఉన్నది మహేశ్వరి సమర్పించారు. విషయాన్ని గుర్తించిన ఎన్నికల అధికారులు ఆ నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ వార్డు నుంచి జేడీఎస్ బరిలో లేకపోవడం, స్వతంత్రులుగా ఉన్న ఇద్దరు తమ నామినేషన్లను గురువారం ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీలో సంబరాలు బీబీఎంపీ ఎన్నికల్లో బీజేపీ తొలిబోణి సాధించడంతో స్థానిక బీజేపీ కార్యకర్తల్లో ఆనందోత్సవాలు పెల్లుబుకాయి. కార్పొరేటర్‌గా గెలుపొందిన భారతిని అభినందనలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే ఎం. సతీష్‌రెడ్డి అక్కడకు చేరుకుని భారతిని అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు దుర్వినియోగం అవుతుంటుందని, ఒక మంచి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా ఈ లోటును పూరించవచ్చునని అన్నారు. భారతి మాట్లాడుతూ.. ఈ విజయం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చెందుతుందని అన్నారు. ఇంత సులువుగా విజయం సాధిస్తానని అనుకోలేదని అన్నారు. వార్డు సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. విజయోత్సవాల్లో నగరసభ మాజీ సభ్యుడు టి.రామచంద్ర, బీజేపీ బొమ్మనహళ్లి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నాయకులు సయ్యద్ సలాం, నరేంద్రబాబు, ఆనంద్‌రెడ్డి, బాబురెడ్డి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
పీఠం కోసం ఎత్తుగడ
బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ? మరోసారి ‘మేయర్’ పదవి దక్కించుకునేందుకు బీజేపీ వ్యూహం బెంగళూరు : బీబీఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలుపు సాధించి, మేయర్ పదవిని మరోసారి చేజిక్కించుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా ‘కాంగ్రెస్ రహిత కర్ణాటక రాష్ట్రం’ నినాదానికి నాంది పలకాలని భావిస్తోంది. అందుకే ఈ ఎన్నికల ప్రచారంలో నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే స్టార్ ప్రచారకునిగా ప్రచార పర్వంలో పాల్గొనేలా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ బెంగళూరు నగరంలో నిర్వహించిన బహిరంగ సమావేశాలకు ప్రజల నుంచి మంచి స్పందనే లభించింది. ఆయన ప్రచార ఫ లితం పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కూడా కనిపించిందనేది రాజకీయ విశ్లేషకులు చెప్పే వివరణ. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మరోసారి బెంగళూరు నగరం లో ప్రచారం చేయించాలని, త ద్వారా నగరంలోని ఓటర్లను బీజేపీ వైపు ఆకర్షించాలని ఆ పార్టీ రాష్ట్రశాఖ నేతలు భావిస్తున్నారు. మోదీతో ప్రచారం ఎందుకంటే..... ఇక రాష్ట్రస్థాయిలోనే కాక కేంద్రస్థాయిలో కూడా ప్రముఖ వ్యక్తులుగా ఉన్న అనంతకుమార్, సదానందగౌడ, యడ్యూరప్ప వంటి వారు ఉండగా ఏకంగా ప్రధానమంత్రి హోదాలోని వ్యక్తిని బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి పిలవాలని బీజేపీ నేతలు అనుకోవడానికి కూడా ఓ లెక్కుంది. బీబీఎంపీ ఎన్నికల్లో విజయం తమదేనని, మరోసారి మేయర్ పీఠాన్ని కచ్చితంగా కైవసం చేసుకుంటామని ఇప్పటి వరకు బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీబీఎంపీలో విజయం కోసం తన శాయశక్తులా కృషి చేస్తోంది. ఇదే సందర్భంలో గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో బీబీఎంపీలో జరిగిన కుంభకోణాలు, గార్బేజ్ సిటీ అంటూ వచ్చిన విమర్శలు ఇవన్నీ కలిసి బీజేపీ విజయావకాశాలపై ఈ ఎన్నికల్లో కాస్తంత ప్రభావాన్ని చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సందర్భంలో ఇంటలిజెన్స్ వర్గాలు అందించిన నివేదికలో కూడా బీజేపీ రెండో స్థానంలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాగౌనా సరే తన విజయావకాశాలను మెరుగు పరుచుకునేందుకు గాను ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే ప్రచారంలో పాల్గొనేందుకు ఒప్పించే దిశగా బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ అంశంపై మరో రెండు రోజుల్లో రాష్ట్ర శాఖ నేతలు ప్రధానిని కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ప్యాలెస్ గ్రౌండ్స్ లేదా బసవనగుడి మైదానం..... కాగా, ప్రచార పర్వంలోని చివరి రెండు రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బీబీఎంపీ ఎన్నికల ప్రచార సమావేశాలను ఏర్పాటు చేయించాలనేది బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశాలకు గాను నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్ లేదా బసవనగుడి నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్‌ను వేదికగా చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక ఈ ప్రచారంలో పాల్గొనేందుకు కనుక మోదీ అంగీకరిస్తే బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని స్థాయి వ్యక్తి పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటర్లలో చైతన్యం పెంచే దిశగా... -
ప్రచారానికి చిరంజీవి, ఖుష్భూ, రమ్య
బెంగళూరు : త్వరలో జరగబోయే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)ఎన్నికలకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) సన్నద్ధం అవుతోంది. బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో సొంత రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన సినీ తారలను ఉపయోగించుకునేందుకు కేపీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని రమ్యా, భావనతో పాటు చిరంజీవి ఖుష్భును ఆహ్వానించినట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. మరోవైపు వరుసగా రెండోసారి బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే కమల నాథుల వ్యూహాలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కుదరదని అనంతకుమార్‌తోపాటు యడ్యూరప్ప సైతం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషికి ఇప్పటికే తేల్చిచెప్పినట్టు సమాచారం. -
ప్రచారానికి బీజేపీ సీనియర్లు దూరం!
బెంగళూరు : వరుసగా రెండోసారి బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే కమల నాథుల వ్యూహాలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. సీనియర్ నాయకులతో పాటు బెంగళూరు నగరాన్నే కాక రాష్ట్ర రాజకీయాలను సైతం శాసించే సముదాయ వర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు ప్రచార పర్వంలో పాల్గనబోమని చెప్పడమే ఇందుకు కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్‌కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సీనియర్ నాయకుల సూచనలను సైతం లెక్కచేయకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు నగరంలో బీజేపీ పటిష్టతకు కృషి చేసిన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్‌తోపాటు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న వీరశైవ సముదాయ నాయకుడైన బి.ఎస్.యడ్యూరప్ప సూచించిన ఒకరిద్దరు అభ్యర్థులకు కూడా టికెట్టు ఇవ్వక పోవడం ఆ పార్టీ సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు ప్రచారంలో పాల్గొనబోమని ఇప్పటికే తేల్చిచెప్పినట్టు సమాచారం. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండటం వల్ల బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కుదరదని అనంతకుమార్‌తోపాటు యడ్యూరప్ప సైతం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషికి ఇప్పటికే తేల్చిచెప్పినట్టు సమాచారం. ఒకవేళ కేంద్ర స్థాయి నాయకులు కలుగజేసుకుంటే ఎన్నికల ప్రచారంలోని చివరి ఘట్టంలో ఒకటి లేదా రెండు రోజులు అలా వచ్చి ఇలా వెళ్లిపోవాలని వీరిద్దరూ భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల నాయకులు ఎన్నికల ప్రచారానికి గైర్హాజరవడమే కాకుండా పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన కొంతమంది కార్పొరేటర్ అభ్యర్థులను ఓడించడానికి ప్రయత్నించడం బీబీఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయంపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
బరిలో రెబల్స్
అయోమయంలో కాంగ్రెస్ పెద్దలు పోటీలో 624 మంది స్వతంత్రులు నేతల బుజ్జగింపులు 198 వార్డులకు 2,037 నామినేషన్లు... బెంగళూరు : ఈనెల 22న జరగనున్న బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికలకు గాను మొత్తం 198 వార్డులకు 2,037 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లతో పాటు బీఎస్పీ, కేజేపీ, సీపీఎంలకు చెందిన అభ్యర్థులు కూడా ఉన్నారు. కాగా, 624 మంది స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్ లభించని కొంతమంది ఆశావహులు చివరి నిమిషంలో జేడీఎస్‌లో చేరి పోటీకీ దిగగా, మరికొంత మంది తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. కాగా, ఈ బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ టికెట్ దక్కని అనేక మంది రెబల్స్‌గా పోటీలో నిలబడ్డారు. వీరి కారణంగా ఆయా వార్డుల్లో తమ అభ్యర్థుల విజయావకాశాలు దెబ్బతింటాయని భావించిన కాంగ్రెస్ పార్టీ వారిని అనునయించే దిశగా చర్యలు ప్రారంభించింది. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 13 వరకు గడువు ఉండడంతో వీలైనంత వరకు రెబల్ అభ్యర్థులకు నచ్చజెప్పి వారు నామినేషన్లను ఉప సంహరించుకునేలా చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు గాను ఇప్పటికే కేపీసీసీ చీఫ్ జి.పరమేశ్వర్ స్వయంగా ఆయా రెబల్ అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందరికీ టికెట్లు అసాధ్యం కదా...... కాగా, బీబీఎంపీ ఎన్నికల బరిలో నిలిచిన రెబల్ అభ్యర్థులు వెంటనే తమ నామినేషన్లను ఉప సంహరించుకోవాలని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ కోరారు. మంగళవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. స్థానికులు, స్థానిక నేతల అభిప్రాయాలను అనుసరించే బీబీఎంపీ పరిధిలోని 198 వార్డుల్లోనూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీలోని అందరికీ టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని కార్యకర్తలు గుర్తించాలని అన్నారు. రెబల్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకొని, పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పరమేశ్వర్ కోరారు. పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని అన్నారు. -
బీజేపీ అభ్యర్థులను గెలిపించండి
కేంద్ర మంత్రి సదానంద గౌడ కృ్ణరాజపురం : బీబీఎంపీ ఎన్నికల్లో దౌర్జన్యాలకు అధికార కాంగ్రెస్ పార్టీ తెలబడే అవకాశం ఉందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందకుండా బీజేపీ అభ్యర్థుల విజయానికి కృష చేయాలని ఆ పార్టీ కార్యకర్తలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందాగౌడ పిలుపునిచ్చారు. కృష్ణరాజపురంలోని పై లేఔట్లో ఆదివారం బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణరాజపురం పరిధిలోని బీబీఎంపీ వార్డుల్లో పార్టీ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడారు. అభివృ్ధని కాంక్షించేవారు బీజేపీకి ఓటు వేయాలని కోరారు. మైసూరు నగరాన్ని అభివృ్ధ చేయడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కనబరుస్తున్న శ్రద్ధ బెంగళూరుపై చూపడం లేదని అన్నారు. బెంగళూరు నగరం అభివృ్ధ కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. పార్టీ తరుఫున ఎన్నికల బరిలో నిలిచిన వారిలో హొరమావు వార్డు నుంచి భారతీ మునిరాజు, రామ్మూర్తి నగర నుంచి పద్మావతి శ్రీనివాస్, విజినాపుర నుంచి ఎస్.రాజు, కృష్ణరాజపురం నుంచి పూర్ణిమా శ్రీనివాస్, దేవసంద్ర వార్డు నుంచి పుట్టరాజు, బసవనపుర నుంచి సుందర్రాజు, హెచ్ఎఎల్ నుంచి శశిధర్ రాజన్, విజ్ఞాన నగర్ నుంచి మోహన్‌మూర్తి, ఎ.నారాయణపుర నుంచి వి.సి.రాజు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నందీష్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రమేష్, మాజీ కార్పొరేటర్ గీతావివేకానంద బాబు, మంజుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బీజేపీపై చార్జ్‌షీట్‌కు రెడీ..
సాక్షి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మహాసంగ్రామం నేపథ్యంలో బల మైన ప్రత్యర్థులపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగానే బీజేపీ హయాంలో జరిగిన అవినీతి పై ఓ చార్జ్‌షీట్‌ను రూపొందించి, ఆ చార్జ్షీట్తోనే ప్ర జల ముందుకు వెళ్లాలని భావి స్తోంది. ఇందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన బుధవారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ, పార్టీ పెద్దల సమావేశంలో అంగీకారం సైతం లభించినట్లు సమాచారం. ఇక బీబీఎంపీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించేందుకు గాను సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్‌తో పాటు మంత్రులు కె.జె.జార్జ్, రామలింగారెడ్డి, దినేష్ గుండూరావ్, పార్టీ పధాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ....‘గత ఏడెనెమిది ఏళ్లుగా బీబీఎంపీ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు. చెత్త నిర్వహణ, స్వచ్ఛత, రోడ్ల నిర్వహణ ఇలా అన్ని విభాగాల్లోనూ అనేక లోపాలు, అవినీతి చోటుచేసుకున్నాయి. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బీబీఎంపీ కోసం రూ.3,700కోట్లు విడుదల చేసింది. గత ఏడాది బీబీఎంపీ కోసం కేటాయించిన రూ.1,500కోట్ల నిధులను టారు-నీరు పేరిట పూర్తిగా దుర్వినియోగం చేశారు. అందుకే ఈ ఏడాది బీబీఎంపీకి బదులుగా రాష్ట్ర ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో పనులు చేయిస్తున్నాం. ఈ అవినీతి అంశాలన్నింటిపై ఓ చార్జ్‌షీట్‌ను రూపొందించి ప్రజల సమక్షంలో విడుదల చేయాలి’ అని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు పార్టీ, ప్రభుత్వం నుంచి అంగీకారం లభించినట్లు తెలుస్తోంది. ఇక బీబీఎంపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు గాను మరికొన్ని విషయాలను ఈ సమావేశంలో చర్చించారు. - బీబీఎంపీ ఎన్నికలను హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ ఎన్నికల్లో విజయం కోసం ఐకమత్యంగా శ్రమించాలి. - బీజేపీ నేతలు ఎక్కువగా ప్రచారం పై దృష్టి సారిస్తున్నారు. వారు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాల గు రించి ప్రస్తావిస్తే, అందులో ఏమాత్రం నిజం లేదని ప్రజలను నమ్మించేందుకు మనం శ్రమించాలి. అందుకే మనం కూడా ఎక్కువగా ప్రచారంపై దృష్టి సారించాలి. - పార్టీ ఏర్పాటు చేసిన అధికార ప్రతినిధుల బృందం ఏదైనా మీడియా చర్చలో పాల్గొనే సమయంలో పూర్తి సమాచారాన్ని క్రోడీకరించుకొని హాజరుకావాలి. -
మినీ పోరు మొదలు
బీబీఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఈ నెల 22న ఓటు హక్కును వినియోగించుకోనున్న 71.80లక్షల ఓటర్లు నగరంలో 6,733 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు హత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ సైతం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ను బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో బీబీఎంపీ పరిధిలోని మొత్తం 198 వార్డుల్లోని 71.80లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 37,68,498మంది పురుషులు, 34,68,400 మంది మహిళలు, 1,149 ఇతర ఓటర్లు ఉన్నారు. ఇక ఓటింగ్ ప్రక్రియకు గాను బీబీఎంపీ పరిధిలో మొత్తం 6,733 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని రూ.5లక్షలుగా నిర్ణయించారు. ఎన్నికల కోసం అదనంగా ఖర్చు చేసే వారిపై నోడల్ అధికారులు నిఘా వేయనున్నారు. - సాక్షి, బెంగళూరు ఎన్నికల విధుల్లో 35వేల మంది అధికారులు.... బీబీఎంపీ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు గాను జిల్లా ఎన్నికల అధికారులుగా నలుగురు వ్యవహరించనున్నారు. 28 మంది అదనపు జిల్లా ఎన్నికల అధికారులు, 53 మంది ఎన్నికల అధికారులు, 53 మంది అదనపు ఎన్నికల అధికారులు, 198 మంది సహాయక ఎన్నికల అధికారులు, 27 మంది ఓటరు నమోదు అధికారులు, 63 మంది సహాయక ఓటరు నమోదు అధికారులు, ఐదుగురు ప్రత్యేక ఎన్నికల పర్యవేక్షకులు, 88 మంది నోడల్ అధికారులను నియమించారు. వీరితో పాటు 7,979 మంది ప్రిసైడింగ్ అధికారులు, 7,979 మంది సహాయక ప్రిసైడింగ్ అధికారులు, 19,678 మంది పోలింగ్ బూత్ స్థాయి అధికారులను ఎన్నికల ప్రక్రియ కోసం నియమించారు. మొత్తంగా 35,636 మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. వెబ్సైట్లో ఓటర్ల జాబితా.... బీబీఎంపీ పరిధిలోని ఓటర్ల జాబితాను ఇప్పటికే బీబీఎంపీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఓటర్ల వివరాలతో పాటు వారు ఏ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది తదితర వివరాలను సైతం ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఒకవేళ తమ పేరు ఓటర్ల జాబితాలో లేకపోయినా, లేక ఏవైనా మార్పుచేర్పులున్నా మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందజేసేందుకు గాను సహాయవాణి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలనుకునే వారు 080-22224748, 080-22221158నంబర్లలో సంప్రదించవచ్చు. -
టెర్రార్...
- గ్రామీణుల పాలిట శాపంగా టెర్రాఫార్మా - చెరువులు, కుంటలకు చేరుతున్న కెమికల్ నీరు - మృత్యువాత పడుతున్న పశుపక్షాదులు - అస్వస్థత బారిన ప్రజలు లక్ష్యం సమున్నతం... ఆచరణే అధమం.. ఫలితం గ్రామీణుల బతుకు ఛిద్రం! ఇది దొడ్డబళ్లాపురం సమీపంలో ఏర్పాటు చేసిన టెర్రాఫార్మా ప్రస్తుత ముఖచిత్రం. చెత్తనుంచి ఎరువులు తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రస్తుతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణుల పాలిట శాపంగా మారింది. నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా ఇక్కడ చెత్తను డంప్ చేస్తుండడంతో వింత రోగాల బారిన పడి గ్రామీణులు విలవిల్లాడుతున్నారు. పశుపక్షాదుల మృత్యుఘోషకు అంతులేకుండా పోతోంది. ఒక ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలనే పాలకుల నీతి.. మరో ప్రాంత ప్రజలను అన్యాయానికి గురిచేస్తోంది. దొడ్డబళ్లాపురం : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) పరిధిలో నిత్యం పోగవుతున్న టన్నుల కొద్ది చెత్తను దొడ్డబళ్లాపురం తాలూకాలోని గుండ్లహళ్లి వద్ద టెర్రాఫార్మాలో డంపింగ్ చేస్తున్నారు. చెత్త నుంచి ఎరువులు తయారు చేయాలనే లక్ష్యంతో టెర్రాఫార్మాను ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి తరలివస్తున్న చెత్త మొత్తాన్ని రీసైక్లింగ్ చేసేందుకు ఇక్కడి యంత్రాలకు తగిన సామర్థ్యం లేకపోవడంతో రోజూ చెత్త పేరుకుపోతూ వస్తోంది. నిబంధలను ఉల్లంఘిస్తూ ఇక్కడ చెత్తను డంప్ చేస్తున్నారు. వాస్తవానికి తడి, పొడి చెత్తను ఇక్కడ రీసైక్లింగ్ చేయడం ద్వారా ఎరువులను తయారు చేస్తారు. అయితే బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న లెక్కకు మించిన రసాయనిక పరిశ్రమల వ్యర్థాలను సైతం ఇక్కడ డంప్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే రసాయనిక వ్యర్థాలను ఆయా పరిశ్రమల వద్దనే రీసైక్లింగ్ చేసి తరలించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి రీసైక్లింగ్ చేయని రసాయనిక వ్యర్థాలను ఇక్కడ డంప్ చేస్తుండడంతో అవి భూమిలో కలిసి విషపూరితంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు విషపూరితమైన రసాయనిక నీరుగా మారి సమీపంలోని చెరువులు, కుంటల్లోకి చేరుకుంటున్నాయి. అంతేకాక భూగర్భ జలాల్లో సైతం ఇవి కలిసి బోరుబావుల్లోకి చేరుకుంటున్నాయి. ఇటీవల చుట్టపక్కల పాతిక గ్రామాలకు చెందని పశువులు చెరువులు, కుంటల్లోని నీరు తాగి చూస్తుండగానే పొట్ట ఉబ్బి వృత్యువాత పడుతుండడంతో గ్రామీణుల వేదనకు అంతులేకుండా పోయింది. మేతకు వెళ్లిన పశువులు తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో మార్గమధ్యలోనే మరణిస్తుండడం పాడిరైతులను మరింత కృంగదీస్తోంది. మరో వైపు వాన నీటికి చెత్త తడిసి మరింత దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ వాసన భరించలేక నాలుగు రోజుల్లోనే పదుల సంఖ్యలో గ్రామీణులు ఆస్పత్రుల పాలయ్యారు. ఇదంతా టెర్రాఫార్మాకు అతి సమీపంలో ఉన్న సక్కరెగొల్లహళ్లి, కాశీపాల్య, గుండ్లహళ్లి గ్రామాల్లో మరీ ఎక్కువగా ఉంది. పశువులు, మేకలు, గొర్రెలతో పాటు కోళ్లు, పిట్టలు కూడా వృత్యువాత పడుతున్నాయి. నీరు తాగిన కొద్ది సేపటికి పొట్ట ఉబ్బి, ముక్కు, నోటి వెంట రసాయనిక మిశ్రీత నీరు కారుతుండగా విలవిల్లాడుతూ తమ కంటి ముందే పశువులు మరణిస్తున్నాయని గ్రామీణులు వాపోతున్నారు. దుర్వాసన వెదజల్లుతుండడంతో భరించలేక ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలను దుక్కి చేసుకోలేక పోతున్నట్లు రైతులు తెలిపారు. ప్రశాంతంగా భోజనం కూడా చేయలేని స్థితిలో ఉన్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి టెర్రాఫార్మా బారి నుంచి తమను కాపాడాలని పలువురు గ్రామీణులు వేడుకుంటున్నారు. కాగా, పాడి పశువులను కోల్పోయిన బాధిత రైతులు నాగరాజు, ముద్దన్న, జరీనా తదితరులు టెర్రాఫార్మా డంపింగ్ సెంటర్ నిర్వాహకులపై బెళవంగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మండిపాటు
సస్పెన్షన్లపై భగ్గుమన్న బీబీఎంపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన బెంగళూరు: విధులను సరిగా నిర్వహించడం లేదనే ఆరోపణలతో పాలికెలో అధికారులను సస్పెండ్ చేస్తున్న బీబీఎంపీ పాలనాధికారి టి.ఎం.విజయ్‌భాస్కర్ వైఖరికి నిరసిస్తూ బీబీఎంపీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ విధులను బహిష్కరించి బీబీఎంపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీఎంపీ అధికారుల సంఘం ప్రతినిధి అమృతరాజ్ మాట్లాడుతూ....బీబీఎంపీ పాలనాధికారి టి.ఎం.విజయ్‌భాస్కర్ ఇప్పటి వరకు తొమ్మిది మంది అధికారులను సస్పెండ్ చేశారని అన్నారు. బీబీఎంపీలో అవసరమైన మేరకు సిబ్బంది లేరని, ఇప్పటికే వందల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు ఈ ఉద్యోగాలను భర్తీ చేయకపోయినా, తామంతా ఒత్తిళ్ల నడుమే పని చేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో ఉద్యోగులకు మరింత ప్రోత్సాహాలు కల్పించాల్సింది పోయి వారిని సస్పెండ్ చేస్తూ నైతికంగా కుంగుబాటుకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కొంతమంది సీనియర్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా వారు కూడా ఈ విషయంపై స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇదిలాగే కొనసాగితే తామెవరూ విధులు నిర్వర్తించే పరిస్థితే ఉండదని అన్నారు. ఇప్పటికైనా విజయ్‌భాస్కర్‌తో పాటు ఇతర అధికారులు తీరును మార్చుకోకపోతే మరింత భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని ఉద్యోగులు హెచ్చరించారు. -
బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయబోము
- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్ సాక్షి, బెంగళూరు: బీబీఎంపీ విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన సభాసంఘం త్వరలోనే తన నివేదికను అందజేయనుం దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్ తెలిపారు. అయితే ఈ నివేదికను అడ్డుపెట్టుకొని తాము బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయబోమని స్పష్టం చేశారు. గురువారమిక్కడి కేపీసీసీ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీబీఎంపీ విభజనకు సంబంధించి ఎస్.ఆర్.పాటిల్ నేతృత్వంలో సభాసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విభజనపై చర్చించేందుకు ఇప్పటికే సభాసంఘం నాలుగు సార్లు సమావేశమైందని ఎస్.ఆర్.పాటిల్ వెల్లడించారు. అంతేకాక బీబీఎంపీ విభజనకు సంబంధించి అధ్యయనం చేసేందుకు గాను అధికారుల బృందాన్ని ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, ముంబై నగరాలకు సైతం పంపినట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలను క్రోడీకరిస్తూ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ నివేదికను అడ్డుపెట్టుకొని బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణీత సమయంలోనే బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు చెప్పారు. -
చెత్త సమరం
- బీబీఎంపీకి వ్యతిరేకంగా పోరాటం - రాత్రంతా రోడ్డుపైనే గడిపిన గ్రామీణులు - టెర్రాఫార్మా మూయాల్సిందేనని పట్టు - బారులు తీరిన చెత్త వాహనాలు దొడ్డబళ్లాపురం: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని చెత్త డంపింగ్‌పై వివాదం మళ్లీ చెలరేగింది. దొడ్డబళ్లాపురం తాలూకాలోని గుండ్లహళ్లి వద్ద ఉన్న టెర్రాఫార్మా డంపింగ్ సెంటర్‌కు కొన్ని సంవత్సరాలుగా బీబీఎంపీ చెత్తను తరలిస్తున్నారు. ఇక్కడ పోగవుతున్న చెత్తను ఎరువగా మారుస్తుంటారు. వాస్తవానికి 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న టెర్రాఫార్మాలోని యంత్రాలతో ఒక రోజుకు 20 టన్నుల చెత్త నుంచి మాత్రమే ఎరువులను చేయగలిగే సామర్థ్యం ఉంది. అయితే ఇందుకు భిన్నంగా రోజుకు వంద టన్నుల మేర చెత్తను బీబీఎంపీ అధికారులు తరలిస్తున్నారు. దీంతో టెర్రాఫార్మ చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల ప్రజలకు ఇక్కట్లు మొదలయ్యాయి. దీంతో ఏడు సంవత్సరాల క్రితమే స్థానికులు దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. చెత్త మురిగిపోవడంతో ఆ ప్రాంతంలో దుర్గంధం వ్యాపిస్తోందని, అపరిశుభ్రత పెరిగి ఈగలు వృద్ధి చెందడం వల్ల అనారోగ్యం పాలవుతున్నామంటూ స్థానికులు అప్పట్లో పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. దీనిపై బీబీఎంపీ అధికారుల్లో గాని, పాలకుల్లో గాని ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండేళ్ల క్రితం ఈ ఉద్యమం తీవ్రతరమైంది. అదే సమయంలో మండూరు దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేపట్టడంతో అక్కడ డంప్ చేసే చెత్తను టెర్రాఫార్మాకు అధికారులు మళ్లించారు. దీంతో ఒక రోజుకు రెండు వందల టన్నులకు పైగా చెత్త టెర్రాఫార్మాకు చేరుతూ వచ్చింది. దీంతో 25 గ్రామాలకు చెందిన ప్రజలు మరోసారి ఉద్యమ బాట పట్టారు. మంగళవారం మధ్యాహ్నం హఠాత్తుగా బీబీఎంపీ చెత్త లారీలను అడ్డగించి ధర్నా చేపట్టారు. దీంతో 200 బీబీఎంపీ చెత్త లారీలు దాబస్‌పేట, తుమకూరు రోడ్డుపైనే నిలిచిపోయాయి. దుర్గంధం, దోమలు, ఈగల బెడద వల్ల రోగాలు ప్రబలుతుండడంతో చాలా మంది గ్రామాలను వదలాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం మొదలైన ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. రాత్రి మొత్తం గ్రామీణులు రోడ్డుపైనే ఉంటూ చెత్త వాహనాలను టెర్రాఫార్మాలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. అక్కడే వంట వండుకుని రోడ్డుపైనే భోజనం చేశారు. చెత్త డంపింగ్‌ను పూర్తిగా నిలిపి వేసేవరకు అక్కడి నుంచి కదలబోమంటూ భీష్మించారు. మరో వైపు బెంగళూరు నుంచి ప్రతి ఐదు నిమిషాలకో చెత్త వాహనం వస్తుండడంతో చూస్తుండగానే కిలోమీటర్ల మేర ఆ వాహనాలు నిలిచిపోయాయి. బీబీఎంపీ అధికారులు వచ్చి ఇకపై చెత్త తరలించమని హామీ ఇచ్చేవరకూ ఇక్కడి నుండి కదిలే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మొహరించారు. -
విపక్షాలదే పై చేయి...
బీబీఎంపీ విభజన బిల్లు సెలెక్ట్ కమిటీ చేతికి సమావేశాల పేరుతో రూ. 3 కోట్లు ప్రజాధనం వృధా బెంగళూరు: బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) విభజన విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే విపక్షాలైన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్లదే పై చేయిగా నిలించింది. ప్రత్యేక శాసన సభా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ‘విభజన’ కోసం సిద్ధరామయ్య ప్రభుత్వం పట్టుబట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రత్యేక శాసనసభల్లో భాగంగా మూడోరోజైన సోమవారం కూడా శాసనపరిషత్‌లో బీబీఎంపీ విభజన కోసం ప్రవేశపెట్టిన ‘కర్ణాటక మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) విభజన (సవరణ) బిల్లు-2015’ పై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అధికార, విపక్షాలు విభజన బిల్లు పై చర్చించాయి. మండలి విపక్ష నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ...‘బెంగళూరు నగరాన్ని విభజించడం వల్ల కన్నడిగుల మధ్య ప్రాంతీయ భేదాలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా విభజన ముసాయిదా బిల్లు పై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. అందువల్ల బిల్లును సెలెక్ట్ కమిటీకు అప్పగించాల్సిందే’ అని పట్టుబట్టారు. ఇందుకు జేడీఎస్ సభ్యులు కూడా తమ మద్దతును తెలిపారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం విభజన బిల్లు అనుమతి కోసం పట్టుబట్టారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విపక్షాలకు ఎన్నిసార్లు సర్ధిచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సాయంత్రం 6.15 గంటలకు విభజన బిల్లును సెలెక్ట్ కమిటీకు అప్పగిస్తూ మండలి అధ్యక్షుడు శంకరమూర్తి నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల ఆగాల్సిందే... శాసనసభలో ఆమోదం పొందిన ఏదేని ముసాయిదా బిల్లు శాసనమండలికి ఆమోదం కోసం వచ్చిన తర్వాత ఆ బిల్లు పై మరింత అధ్యయనం కోసం సెక్షన్ 116ను అనుసరించి సెలెక్ట్ కమిటీకు అప్పగించే అధికారం శాసనమండలి అధ్యక్షుడికి ఉంది. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యుల డిమాండ్ మేరకు బీబీఎంపీ విభజన ముసాయిదా బిల్లు సెలెక్ట్ కమిటీ చేతికి అప్పగిస్తూ అధ్యక్షస్థానంలో ఉన్న శంకరమూర్తి నిర్ణయం తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం మండలిలో ఉన్న అధికార విపక్ష సభ్యుల సంఖ్యాబలాన్ని అనుసరించి సెలెక్ట్ కమిటీలోనూ విపక్షానిదే పై చేయిగా కనిపిస్తోంది. ఇరుపక్షాల ప్రస్తుత బలాబలాను అనుసరించి బీజేపీ,కాంగ్రెస్ పార్టీకు చెందిన చెరి నలుగురు సభ్యులు, జేడీఎస్‌కు చెందిన ఒక ఎమ్మెల్సీను సెలెక్ట్ కమిటీ సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. ఈ కమిటీకు రాష్ట్ర న్యాయ,పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి, లేదా ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ మూడు నెలల్లోపు తన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నివేదికను మండలి ముందు తీసుకురాలేకపోతే ముసాయిదా బిల్లు తిరిగి శాసనసభకు వెళ్లి అక్కడ నేరుగా ఆమోదం పొంది అనుమతి కోసం గవర్నర్‌కు వద్దకు వెళ్లనుంది. సెలెక్ట్ కమిటీలో విపక్షాల సంఖ్యాబలమే ఎక్కువ... మండలిలోని మొత్తం సభ్యులు 75 అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు 28 బీజేపీ పార్టీ ఎమ్మెల్సీలు 30 జేడీఎస్ ఎమ్మెల్సీలు 12 స్వతంత్రులు 4 చైర్మన్ 1 ప్రభుత్వ మొండిపట్టుకు రూ.3 కోట్లు వృధా అధికార కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల మూడు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీబీఎంపీ విభజన బిల్లు అమోదం కోసమే మూడు రోజుల పాటు ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, విద్యుత్, భద్రతా తదితర విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఒక్క రోజు చట్టసభలు నిర్వహించడానికి రూ.1 కోటి ఖర్చవుతోంది. దీంతో మూడు రోజులకు గాను దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చయినా విభజన బిల్లు చట్టసభల్లో పూర్తిస్థాయిగా ఆమోదం పొందకపోవడంతో దాదాపు రూ.3 కోట్లు ఖర్చయినట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. -
పాలికెలో బోగస్ పౌర కార్మికులు
గుర్తించిన రాష్ట్ర సఫాయి కర్మచారి కమిషన్ బెంగళూరు(బనశంకరి) : బీబీఎంపీలో సుమారు ఆరు వేలకు పైగా బోగస్ పౌరకార్మికులు ఉన్నారని, వీరి వేతనాన్ని ఇతరులు స్వాహా చేస్తున్నట్లు రాష్ట్ర సఫాయి కర్మచారి కమిషన్ గుర్తించింది. బీబీఎంపీ రికార్డుల ప్రకారం 18,400 మంది కార్మికులు ఉండాల్సి ఉంది. అయితే అక్కడ పనిచేస్తున్నది కేవలం 12,800 మంది మాత్రమేనని తేలింది. 6,400 మంది కార్మికుల వేతనాలను ఎవరు స్వాహా చేస్తున్నది తేలాల్సి ఉందని కమిషన్ అధ్యక్షుడు నారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల బీబీఎంపీలోని ఎనిమిది వలయాల జాయింట్‌కమిషనర్లు సమావేశం నిర్వహించగా బోగస్ పౌరకార్మికులు ఉండటం వెలుగుచూసిందని అన్నారు. దీనిపై ప్రతి పరిధిలోనూ విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. విచారణ సమయంలో కార్మికులందరినీ హాజరుపరచాలని బీబీఎంపీకి సూచించినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు సక్రమంగా డబ్బు చెల్లించకుండా కాంట్రాక్టర్లు వేధిస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. సఫాయి కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం నుంచి 2014-15 సంవత్సరంలో రూ.300 కోట్లు నిధులు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ అబివృద్ధి మండలికి అందాయని తెలిపారు. ఈ నిధులను సక్రమంగా వెచ్చించకపోవడంతో రూ. 280 కోట్లు వెనక్కు మళ్లాయని అన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర సపాయి కర్మచారి కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఎస్ఎస్.సంగాపుర తదితరులు పాల్గొన్నారు. -
బీబీఎంపీ సమావేశంలో వాగ్వాదం
బెంగళూరు: బీబీఎంపీ సర్వసభ్య సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. మీరు అవినీతికి పాల్పడ్డారంటూ ఒకరిపై ఒ కరు ఆరోపణలు చేసుకున్నారు. బుధవారం బీబీఎంపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంలో బీజే పీ సీనియర్ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. బీబీఎంపీ రాజరాజేశ్వరినగర ఉప విభాగంలోని అభివృద్ధి పనుల ఫైళ్లను తన ఇంటిలో ఉంచుకొని గోల్‌మాల్‌కు పాల్పడిన శాసన సభ్యుడు మునిరత్న వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బీబీఎంపీలో జరిగి న అన్ని అభివృద్ధి పనుల్లో గోల్మాల్ జరిగిందని, ఈ మొత్తం వ్యవహారం సీబీఐతో దర్యాప్తు చేయించాలని డి మాండ్ చేశారు. అంతేకాని ఒక్క మునిరత్న మీద సీబీఐ దర్యాప్తు చేయించాలని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. ఈ సందర్బంలో బీజేపీ కార్పొరేటర్లు ‘కాంగ్రెస్ డౌన్‌డౌన్... మునిరత్న రాజీనామా చేయాలి’ అని నినాదాలు చేస్తూ మేయర్ పోడియం దగ్గరకు దూసుకు వెళ్లారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ‘బీజేపీ డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేస్తు మేయర్ పోడియం దగ్గరకు వెళ్లారు. ఇరు పార్టీల నాయకులు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అ ర్థం కాలేదు. మేయర్ శాంతకుమారి సభను పలుసార్లు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం అయినా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో బీజేపీ కార్పొరేట ర్ (లగ్గేరి) లక్ష్మికాంతరెడ్డి మాట్లాడుతూ బీబీఎంపీ రా జరాజేశ్వరి నగర ఉప విభాగం కార్యాలయంలో ఉండవలసిన ఫైల్లు మునిరత్న భవనంలో ఎలా ఉన్నాయి అని కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పి తరువాత మాట్లాడాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సందర్భంలో ఇరు పార్టీల సీనియర్ కార్పొరేటర్లు ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. నాకు ఎలాంటి సంబంధం లేదు : మునిరత్న బుధవారం బీబీఎంపీ సమావేశానికి ఇక్కడి రాజరాజేశ్వరి నగర నియోజక వర్గం శాసన సభ్యుడు మునిరత్న హాజరైనాడు. గందరగోళం జరుగుతున్న సమయంలో తనకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని మేయర్‌కు మనవి చేశారు. అయితే మునిరత్న మాట్లాడటానికి పాలికె సమావేశంలో అవకాశం చిక్కలేదు. తరువాత ఆ యన సభ నుంచి బయటకు వచ్చి పాలికె కార్యాలయం ఆవరణంలో మీడియాతో మాట్లాడారు. లోకాయుక్త అ ధికారులు స్వాధీనం చేసుకున్న ఫైల్లకు తనకు ఎలాం టి సంబంధం లేదని స్పష్టం చేశారు. జరిగిన వాస్తవం చెప్పడానికి తాను పాలికె సమావేశంలో ప్రయత్నిం చినా అవకాశం ఇవ్వలేదని, కావాలని తనను కేసులో ఇరికించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
రేపటి నుంచి బీబీఎంపీలో ‘ఆన్లైన్ పేమెంట్’ సేవలు
బీబీఎంపీ ట్విట్టర్,పేస్బుక్ అకౌంట్లు ఇవే.. facebookaccountuser name : worshipful mayor-bbmp twitter account user name : mayor bangalore బీబీఎంపీ మేయర్ ఎన్ శాంతకుమారి బనశంకరి : బీబీఎంపీలో ఆన్లైన్ ద్వారా చెల్లింపుల విధానాన్ని (ఆన్లైన్ పేమెంట్) బుధవారం నుంచి అమలు చేస్తున్నట్లు మేయర్ ఎన్ శాంతకుమారి తెలిపారు. సోమవారమిక్కడి బీబీఎంపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 24 నుంచి బీబీఎంపీలో ఆన్లైన్ వ్యవస్థను అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన నిర్వహణా బాధ్యతలను నిర్వర్తించేందుకు గాను నిపుణుల సమితి ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమితి రెండు నెలల పాటు కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం బీబీఎంపీ అనేక పథకాలు అమల్లోకి తెస్తోందని, అందులో భాగంగానే పాలికేలోని అన్ని శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడానికి మేయర్ పేరుతో ట్విట్టర్, పేస్బుక్ అకౌంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు ఎలాంటి అభిప్రాయాలు, సూచనలు,సలహాలనైనా సరే ఈ ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా పంపించవచ్చునని ఆమె తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బీబీఎంపీ సిద్ధంగా ఉందన్నారు. జనవరి మొదటివారంలో జలమండలి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. బీబీఎంపీ వ్యాప్తిలో తాగునీటి సమస్య ఉన్న వార్డుల్లో అధికారులు పూర్తి వివరాలతో సమావేశంలో చర్చించి సమస్యను పరిష్కారిస్తామన్నారు. నూతనంగా రోడ్లు వేసిన వార్డుల్లో రెండేళ్ల పాటు ఓఎప్సీ కేబుల్ ఏర్పాటు చేయబోమని, అలాగే రోడ్లు విస్తరణకు అనుమతి ఇచ్చేదిలేదని అన్నారు. కేబుల్ అమర్చినట్లైతే ఎచ్డీడీ తరహాలో అమర్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. విలేకరుల సమావేశంలో బీబీఎంపీ కమిషనర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీమేయర్ కే.రంగణ్ణ, అధికారపక్షనేత ఎన్ఆర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మేయర్ శాంతకుమారి ట్విట్టర్,పేస్బుక్ అకౌంట్లను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. వీటితో పాటు బీబీఎంపీ సహాయ్ అనే హెల్ప్‌లైన్ వెబ్‌సైట్‌నూ ప్రారంభించారు. కంట్రాక్టర్లు, అధికార పక్షనేత మధ్య మాటల యుద్ధం బీబీఎంపీలో 24 నుంచి ఆన్లైన్ చెల్లింపు విధానంపై కాంట్రాక్టర్లు , అధికార పక్షనేత ఎన్ ఆర్ రమేశ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు.. ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్లు ఒక్కసారిగా విలేకరుల సమావేశంలోకి వెళ్లారు. కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా ఓ సంఘం ఉందని, పదాధికారులు ఉన్నారని, తమతో చర్చించకుండా, తమకు కావలసిన వారికి బిల్లులు చెల్లించిన తరువాత ఇప్పుడు ఆన్లైన్ చెల్లింపు విధానాన్ని ఎలా ప్రవేశపెడతారా అంటూ కమిషనర్, మేయర్‌పై గొడవకు దిగారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న అధికార పక్షనేత ఎన్ఆర్ రమేశ్ ‘ మీరు ఎందుకు లోపలికి వచ్చారు. ముందు బయటకు వెళ్లండి’ అంటూ కాంట్రాక్టర్లుతో అన్నారు. తక్షణమే కాంట్రాక్టర్లు ఎన్ఆర్ రమేశ్‌ను ఏకవచనంతో కమిషనర్ ఎదురుగా నిందించడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. చేయి చేసుకునే స్థాయికి చేరుకుంది. కమిషనర్ ఇరువర్గాల వారిని శాంతపరిచి.. తమ కార్యాలయానికి పిలుచుకెళ్లారు. అక్కడ కూడా కంట్రాక్టర్లు ఒక్కసారిగా ఆన్లైన్ వ్యవస్థను అమలులోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారికి సర్దిచెప్పారు. -
బీబీఎంపీ మేయర్ పదవికి బీజేపీలో పోటాపోటీ
బీఆర్. నంజుండప్ప వైపు పలువురి మొగ్గు ఆది నుంచి పార్టీలోనే ఉన్నవారినే ఎంపిక చేయాలని ఆశావహుల సూచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీబీఎంపీ పాలక మండలి పదవీ కాలం మరో ఆరు నెలల్లో ముగియనున్న తరుణంలో, రొటీన్ పద్ధతిలో చివరి, ఐదో మేయర్‌ను వచ్చే నెల ఐదో తేదీన సభ్యులు ఎన్నుకోనున్నారు. ఈసారి జనరల్ కేటగిరీకి ఈ పదవి రిజర్వు కావడంతో ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. వచ్చే ఏడాది మేలో బీబీఎంపీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి తిరిగి అధికారంలోకి వస్తామనే ఆశల్లేవు. దీంతో ఆ పార్టీ కార్పొరేటర్లు మేయర్ పదవిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎవరిని ఎంపిక చేస్తే, వచ్చే ఎన్నికల్లో పార్టీకి లాభిస్తుందనే దిశగా పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు. సీనియర్ సభ్యులైన బీఆర్. నంజుండప్ప, గంగ భైరయ్య, ఏహెచ్. బసవరాజు, శాంత కుమారి పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. నంజుండప్పకు అవకాశాలున్నాయని చెబుతున్నప్పటికీ, ఆయన వేరే పార్టీ నుంచి వలస వచ్చారని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు అడ్డు తగులుతున్నారు. ఆది నుంచి పార్టీలోనే ఉన్న వారినే మేయర్ పదవికి ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో అనుభవంతో పాటు అజాత శత్రువనే పేరున్నందున, ఆయనను మేయర్ స్థానంలో కూర్చోబెట్టాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. తొలి నుంచీ పార్టీలోనే ఉన్న తనను ఎంపిక చేయాలని గంగ భైరయ్య పట్టుబడుతున్నారు. మరో సీనియర్ సభ్యురాలు శాంత కుమారి కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. ఈమెకు మాజీ మంత్రి సోమన్న ఆశీస్సులు ఉన్నాయి. మరో మాజీ మంత్రి ఆర్. అశోక్ తన ఆప్తులైన నంజుండప్ప లేదా బసవరాజ్‌కు మేయర్ పదవిని కట్టబెట్టాలని పట్టుదలతో ఉన్నారు. -
ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే...
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరులోని రెవెన్యూ స్థలాల్లో నివేశనాలను కొనుగోలు చేసి(బీ ఖాతా), ఏ ఖాతా కోసం ఎదురు చూస్తున్న వారు మరి కొద్ది రోజులు ఆగాల్సి ఉంది. బీ ఖాతాలు కలిగిన యజమానుల నుంచి బెటర్మెంట్ ఛార్జీలను వసూలు చేయడం ద్వారా ఏ ఖాతాలుగా మార్చనున్నట్లు బీబీఎంపీ ఇటీవల తెలిపింది. అయితే వ్యవసాయ భూమిని వ్యవసాయేతరానికి ఉపయోగించుకోవడానికి ‘భూ పరివర్తన’ అనుమతి పొందిన వాటికి మాత్రమే ప్రస్తుతం ఏ ఖాతాలు మంజూరు చేయనున్నారు. నగరంలో భూ పరివర్తన అనుమతి పొందని నివేశనాలు 2.5 లక్షల దాకా ఉన్నాయి. వీటికీ ఏ ఖాతాలు మంజూరు చేస్తే బెటర్మెంట్ ఛార్జీల రూపంలో బీబీఎంపీకి రూ.500 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. అయితే కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ చట్టం ప్రకారం ఇలాంటి సైట్లకు ఏ ఖాతా ఇవ్వడం కుదరదు. మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీల ఏర్పాటు ద్వారా ఏ ఖాతాలు ఇవ్వడానికి మార్గం సుగమమవుతుంది. ఈ నెలాఖరుకు ఈ కమిటీలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. అప్పటి వరకు బీ ఖాతాలు పొందిన విడి నివేశన స్థలాల యజమానులు వేచి ఉండాల్సిందే. -
ఇక బెటర్మెంట్!
చార్జీల వసూలుకు బీబీఎంపీ శ్రీకారం భూ పరివర్తన ఆమోదం పొందిన నివేశనాలకు మాత్రమే చార్జీల మొత్తాన్ని కంతుల రూపంలో చెల్లించే వెసులబాటు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) పరిధిలో రెవెన్యూ స్థలాల్లోని నివేశనాలకు తక్షణమే బెటర్మెంట్ ఛార్జీలను వసూలు చేపట్టాలని రెవెన్యూ, సహాయ రెవెన్యూ అధికారులను పాలికె కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సర్క్యులర్‌ను జారీ చేశారు. నగరంలో రెవెన్యూ స్థలాల్లోని క్రమబద్ధీకరణ పొందని (బీ ఖాతా) నివేశనాల నుంచి బెటర్మెంట్ ఛార్జీలను వసూలు చేస్తారు. క్రమబద్ధీకరణ పొందిన నివేశనాలను ‘ఏ’ ఖాతాలుగా పరిగణిస్తారు. ఇళ్లు కట్టుకోవడానికి ఇలాంటి ‘ఏ’ ఖాతాలకు మాత్రమే బ్యాంకులు రుణాలిస్తాయి. ‘బీ’ ఖాతా స్థలాలకు రుణ సౌలభ్యం ఉండదు. నగరంలో ఎన్నో ఎకరాల్లో ఇలాంటి ‘బీ’ ఖాతాలున్నాయి. బెటర్మెంట్ ఛార్జీలను చెల్లించడం ద్వారా ‘ఏ’ ఖాతాలను పొందడానికి చకోర పక్షుల వలే ఎదురు చూస్తున్న వారికి ఈ సర్క్యులర్ ద్వారా ఉపశమనం కలుగనుంది. బెటర్మెంట్ ఛార్జీల కింద బీబీఎంపీలో పరిధిలో 2007లో కొత్తగా చేరిన వార్డుల్లో చదరపు మీటరుకు రూ.250, పాత బీఎంపీ పరిధిలోని వంద వార్డుల్లో రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. బెటర్మెంట్ ఛార్జీలను స్వీకరించడానికి ముందు యాజమాన్య హక్కులను ఓ సారి పరిశీలించాలని రెవెన్యూ అధికారులకు కమిషనర్ సూచించారు. వ్యవసాయేతర వినియోగానికి భూ పరివర్తన ఆమోదం పొందిన నివేశనాలకు మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశించారు. భూ పరివర్తన పొందని నివేశనాలకు బెటర్మెంట్ ఛార్జీలు వసూలు చేయడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. ఛార్జీల మొత్తాన్ని కంతుల్లో చెల్లించడానికి కూడా అవకాశం ఉందని, దీనికి సంబంధించి గత ఏడాది జనవరి 5న జారీ చేసిన సర్క్యులర్‌లోని నియమాలను అనుసరించి ఈ అవకాశాన్ని కల్పించాలని సూచించారు. భూ పరివర్తన ఆమోదం పొంది, భాగాలు పంచుకోని ఏక నివేశనాలు, భాగాలు పంచుకుని, వాటిల్లో నిర్మించబోయే కట్టడాల బ్లూప్రింట్లకు బీడీఏ అనుమతి పొందిన నివేశాలు, కేఐఏడీబీ, కేఎస్‌ఎస్‌ఐడీసీ, కేహెచ్బీలు ఏర్పాటు చేసిన పారిశ్రామిక-గృహ లేఔట్లలో పౌర సదుపాయాలు కల్పించని లేఔట్లు, కర్ణాటక భూ రెవెన్యూ చట్టంలోని సెక్షన్ 94(సీ) ప్రకారం క్రమబద్ధీకరించుకుని, ఖాతాలను కోరుతున్న నివేశనాలకు బెటర్మెంట్ ఛార్జీలను కట్టించుకోవచ్చని కమిషనర్ సూచించారు. -
అక్రమ-సక్రమకు బీబీఎంపీ ఓకే
రెవెన్యూ సైట్లకు ‘ఏ’ ఖాతాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో రెవెన్యూ సైట్లను కలిగి ఉన్న పౌరులకు శుభ వార్త. బెటర్మెంట్ చార్జీలు వసూలు చేయడం ద్వారా ఆ సైట్లను క్రమబద్ధీకరించాలని (‘ఏ’ ఖాతా) బీబీఎంపీ నిర్ణయించింది. బీబీఎంపీ పరిధిలోని పాత, కొత్త వార్డులకు ఈ నిర్ణయం అన్వయిస్తుంది. పాత వార్డుల్లో చదరపు మీటరుకు రూ. 200, కొత్త వార్డుల్లో రూ.250 చొప్పున బెటర్మెంట్ చార్జీలను వసూలు చేస్తారు. రెవెన్యూ సైట్లను క్రమబద్ధీకరించాలన్న బీబీఎంపీ నిర్ణయానికి పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. బహుశా బుధవారం నుంచే బెటర్మెంట్ చార్జీల వసూలుకు శ్రీకారం చుడతారు. బెంగళూరు చుట్టుపక్కల లక్షల సంఖ్యలో రెవెన్యూ సైట్లు ఉన్నాయి. వీటికి ‘ఏ’ ఖాతా లేకపోవడంతో బ్యాంకులు గృహ రుణాలు ఇవ్వడం లేదు. అలాంటి సైట్ల యజమానులకు బీబీఎంపీ నిర్ణయంతో ఉపశమనం కలిగింది. -
క్రమబద్ధీకరణ...లేదంటే కూల్చివేతే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలతో పాటు బీబీఎంపీ పరిధిలో అక్రమ కట్టడాలను నిర్ణీత గడువులోగా క్రమబద్ధీకరించుకోక పోతే వాటిని కూల్చి వేయనున్నారు. కనుక వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న అక్రమ-సక్రమ కింద ఇలాంటి కట్టడాలను విధిగా క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత జరిమానాను చెల్లించడం ద్వారా వీటిని క్రమబద్ధీకరించుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సవరణ నిబంధనల్లో ఈ ‘నిర్బంధ క్రమబద్ధీకరణ’ను చేర్చింది. ఈ క్లాజు ద్వారా హైకోర్టును ఒప్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో క్రమబద్ధీకరణను ‘చట్టంలో చెడు’గా అభివర్ణించిన హైకోర్టు, దానిపై యథాతథ పరిస్థితిని కొనసాగించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పుడు అక్రమ-సక్రమకు నడుం బిగించినా ‘ఏదైనా...కోర్టు తుది ఆదేశాలకు లోబడే’ అని షరతు విధించింది. క్రమబద్ధీకరణకు పౌరులకు ఓ అవకాశం ఇవ్వాలని కూడా ప్రభుత్వం కోర్టును కోరనుంది. గత ఏడాది అక్టోబరు 19వ తేదీకి ముందు నిర్మించిన కట్టడాలు, భూ పరివర్తన ఆమోదం పొందని వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు, లేఔట్లు, నివేశనాలను అక్రమ-సక్రమ కింద క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. క్రమబద్ధీకరణకు అవకాశం లేని కట్టడాలను కూడా ప్రభుత్వం ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది. అవి...నిర్ణీత గడువులోగా క్రమబద్ధీకరణను కోరుతూ దరఖాస్తులను సమర్పించని అనధికార లేఔట్లు, కట్టడాలు. క్రమబద్ధీకరణకు అవకాశం లేని లేఔట్లు, కట్టడాలు (అంటే...కాలువలు, రాజ కాలువలు, నదులు, చెరువుల గట్లు, హైటెన్షన్ విద్యుత్ లైన్ కింద ఉండే ప్రాంతాల్లోని నిర్మాణాలు). నిర్ణీత గడువు లోగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించని కట్టడాలు, లేఔట్లు. అప్పీలుకూ అవకాశం పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు లేదా పాలికెలు...అక్రమ కట్టడాలు, లేఔట్లు, నివేశనాలకు క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. ఒక వేళ క్రమబద్ధీకరణను కోరుతూ సమర్పించిన అర్జీ తిరస్కరణకు గురైతే, అప్పిలేట్ అథారిటీలో సవాలు చేసే అవకాశాన్ని కూడా ముసాయిదా నిబంధనల్లో ప్రభుత్వం కల్పించింది. కాగా ఈ ముసాయిదా నిబంధనల్లో ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 31లోగా ప్రజలు తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం ఏడాది పాటు క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది. ఏటీఎంలకు సరైన భద్రత = బ్యాంకర్లకు నగర పోలీసు కమిషనర్ సూచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో ఇటీవల దొంగల కళ్లు ఏటీఎంలపై పడినందున, వాటికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ బ్యాంకర్లకు సూచించారు. తన కార్యాలయంలో శనివారం ఆయన బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఏటీఎంలకు భద్రతతో పాటు వాటిల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అనంతరం విలేకరులతో వ ూట్లాడుతూ తాము ఎంతగా మొత్తుకుంటున్నా ఇంకా 1,650 ఏటీఎంలకు భద్రత కల్పించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ సమావేశంలో 45 మందికి పైగా వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పన్ను వసూలులో ఉదాసీనత
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆస్తి పన్ను వసూలు చేయడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) కార్పొరేటర్(బీజేపీ) రమేష్ మండిపడ్డారు. మంగళవారం నిర్వహించిన పాలికె సమావేశంలో అధికారుల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని రెండు వేల కట్టడాల నుంచి పాలికెకి రూ. 1500 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉందని గుర్తు చేశారు. బీబీఎంపీలోని ఎనిమిది ఉప విభాగాలు ఉన్నాయని, వీటి పరిధిలో 30 ప్రఖ్యాతి గాంచిన కట్టడాల నుంచి రూ. ఒక కోటి(ఒక్కొక్క కట్టడం), మరో రూ. 50 లక్షలు(ఒక్కొ కట్టడం) చొప్పున 13 వేల కట్టడాల నుంచి పన్ను వసూలు చేయాల్సి ఉందని వివరించారు. అయితే పాలికె రెవెన్యూ అధికారులు మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తూ పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారని ఆరోపించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి బీబీఎంపీ పరిధిలో ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పాలికె పాలన విభాగం నేత అశ్వత్థ నారాయణగౌడ సూచించారు. పాలికె పరిధిలోని కొన్ని వేల మంది ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకుండా చోద్యం చూస్తున్నారని తెలిపారు. రుణాల వసూళ్లలో బ్యాంకుల వ్యవహరిస్తున్న తరహాలోనే ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నగరంలోని మార్కెట్లలో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అనుమతులు రెన్యూవల్ చేయాలని సూచించారు. పాలికె నిధులు లాక్కొంటున్నారు బీబీఎంపీలోకి విలీనమైన 110 గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిదులను స్థానిక ఎమ్మెల్యేలు లాగేసుకుంటున్నారని పాలికె విపక్ష నేత(జేడీఎస్) ఆర్.ప్రకాష్ ఆరోపంచారు. బీబీఎంపీలోకి విలీనమైన తర్వాత 110 గ్రామాల అభివృద్ధికి నాలుగేళ్లలో రూ. 40 కోట్ల నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు. ఈ నిధులను తమ కోటా నిధులుగా ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారని తెలిపారు. సీనియర్ కార్పొరేటర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పట్ల గౌరవముందని, అయితే నిధులు ఖర్చు చేసే విషయంలో కార్పొరేటర్ల నిర్ణయమే అంతిమం కావాలని అన్నారు. సమావేశంలో నగర ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి, మేయర్ కట్టె సత్యనారాయణ, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.