
బెంగళూరులో ఇంగ్లిష్ ఫ్లెక్సీని చించివేస్తున్న కార్యకర్త
బనశంకరి: వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయంపై దర్శనమిచ్చే సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్ల(నామఫలకాల)లో 60 శాతం బోర్డులు కన్నడలోనే ఉండాలనే బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) నిబంధన తాజాగా బెంగళూరు నగరంలో బోర్డుల విధ్వంసానికి దారితీసింది. కన్నడ నగరంలో వ్యాపారం చేసే వారు ఎవరైనా సరే తమ కార్యాలయం బోర్డును కన్నడ భాషలోనే పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్‌జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు.
ఇంగ్లి‹Ùలో కనిపించిన ప్రతీ సైన్‌బోర్డును ధ్వంసంచేశారు. కొన్నింటిపై నలుపు రంగు పూశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేఆర్‌వీ కనీ్వనర్ టీఏ నారాయణ గౌడను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదంపై బృహత్ బెంగళూరు మహానగర ఉన్నతాధికారి తుషార్ గిరినాథ్ స్పందించారు. సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడలోనే ఉండాలన్న నిబంధనను ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి తెస్తామని, నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు.