Commercial buildings
-
‘కన్నడ’ బోర్డుల రగడ
బనశంకరి: వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయంపై దర్శనమిచ్చే సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్ల(నామఫలకాల)లో 60 శాతం బోర్డులు కన్నడలోనే ఉండాలనే బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) నిబంధన తాజాగా బెంగళూరు నగరంలో బోర్డుల విధ్వంసానికి దారితీసింది. కన్నడ నగరంలో వ్యాపారం చేసే వారు ఎవరైనా సరే తమ కార్యాలయం బోర్డును కన్నడ భాషలోనే పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. ఇంగ్లి‹Ùలో కనిపించిన ప్రతీ సైన్‌బోర్డును ధ్వంసంచేశారు. కొన్నింటిపై నలుపు రంగు పూశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేఆర్వీ కనీ్వనర్ టీఏ నారాయణ గౌడను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదంపై బృహత్ బెంగళూరు మహానగర ఉన్నతాధికారి తుషార్ గిరినాథ్ స్పందించారు. సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడలోనే ఉండాలన్న నిబంధనను ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి తెస్తామని, నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. -
గ్రీన్ రూఫ్‌టాప్‌లు.. నగరాలకు చలువ పందిళ్లు!
ప్రపంచవ్యాప్తంగా భవనాల పైకప్పులు ఆకుపచ్చగా మారుతున్నాయి. నగరాలను మరింత నివాసయోగ్యంగా మార్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇళ్లు, వాణిజ్య భవనాల పైకప్పులు ‘గ్రీన్ రూఫ్’లుగా మారుతున్నాయి. అవి పూల మొక్కలు కావచ్చు లేదా కూరగాయ మొక్కలు కావచ్చు.. గ్రీన్ రూఫ్ల వల్ల ఒకటికి పది ప్రయోజనాలున్నాయని ప్రపంచం కోడై కూస్తోంది. ‘ప్రపంచ నగరాల దినోత్సవం’ సందర్భంగా గ్రీన్ రూఫ్‌లు అందించే పర్యావరణ, ఆరోగ్య, ఆహార ప్రయోజనాలను గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు! సగం మంది ప్రజలు పట్టణాలు, నగరాల్లోనే నివాసం ఉంటున్నారు. 2030 నాటికి ఈ శాతం మరింత పెరుగుతుంది. భూతాపోన్నతి వల్ల వాతావరణంలో ప్రతికూల మార్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా హెచ్చు తగ్గుల పాలవుతూ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. అతి వేడి, అతి చలి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. వాయు కాలుష్యానికి నగరాలే కేంద్ర బిందువులుగా మారాయి. ఇటీవలికాలంలో నగరాలు ఎదుర్కొంటున్న మరో ఉపద్రవం ఆకస్మిక కుండపోత వర్షాలు–వరదలు. ఇవి ప్రజల జీవన నాణ్యతను దెబ్బతీయటమే కాకుండా వారి శారీరక, మానసిక ఆరోగ్యాలనూ ప్రభావితం చేస్తున్నాయి. నగరాలు ఎదుర్కొంటున్న ఈ పర్యావరణ, సామాజిక, ఆరోగ్య సమస్యలకు గ్రీన్ రూఫ్‌లు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్లు పచ్చదనాన్ని నగరాల్లోకి తిరిగి తీసుకొస్తున్నాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్ అంటే? గ్రీన్ రూఫ్‌టాప్ గార్డెన్ (మిద్దె తోట) అంటే.. ఇంటి పైకప్పు మీద ఉండే ఆకుపచ్చని తోట. మెసొపొటేమియా జిగ్గురాట్ల కాలం నుంచే భవనాల పైకప్పులపై తోటలు పెంచుతున్నారు. గ్రీన్ రూఫ్‌లు ఆధునిక రూపాన్ని సంతరించుకోవటం జర్మనీలో 50 ఏళ్ళ క్రితమే ప్రారంభమైంది. అప్పట్లో ఇది విడ్డూరంగా చెప్పుకునేవారు. అదే జర్మనీ ఇప్పుడు ‘ఐరోపా గ్రీన్ రూఫ్ క్యాపిటల్’గా పేరుగాంచింది. గ్రీన్ గార్డెన్... కంటికి ఆహ్లాదాన్నిస్తూనే, వేసవిలో చల్లదనాన్నీ/శీతాకాలంలో వెచ్చదనాన్నీ పంచుతూ విద్యుత్తును ఆదా చేస్తోంది. మిద్దెతోట... పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారాన్ని, మూలికలను అందిస్తున్నాయి. ఇక విద్యుత్తును అందించే సౌర ఫలకాలూ గ్రీన్ రూఫ్ గార్డెన్‌కు కొత్త సొబగులను అద్దుతున్నాయి. రూఫ్ గార్డెన్ ఖర్చెంత? గ్రీన్ రూఫ్ గార్డెన్లను ఏర్పాటు చేయటం కొంచెం ఖర్చుతో కూడిన పనే. భవనం స్లాబ్ దెబ్బ తినకుండా ఉండేందుకు, నీటిని ఒడిసి పట్టేందుకు, మొక్కలు/చెట్ల వేర్లు స్లాబ్‌లోకి చొరబడకుండా నివారించడానికి, ఇన్సులేషన్ కోసం అనేక దొంతర్లు వేసిన తర్వాత.. ఆపైన మొక్కలు/చెట్లు పెంచేందుకు రూఫ్ పైభాగంలో మట్టి మిశ్రమాన్ని 6 నుంచి 12 అంగుళాల మందంతో వేస్తారు. ఆ తర్వాత పచ్చని మొక్కలు లేదా పంటలు వేస్తారు. ఇదంతా చెయ్యటానికి చదరపు అడుగుకు 15 నుంచి 20 డాలర్లు ఖర్చు అవుతుందని ఒక అమెరికా సంస్థ అంచనా. గ్రీన్ రూఫ్‌టాప్ గార్డెన్లకు జర్మనీ, అమెరికా, జపాన్, కెనడా, సింగపూర్ అతిపెద్ద మార్కెట్లుగా మారాయి. ఈ మార్కెట్ 2025 నాటికి 880 కోట్ల డాలర్లకు పెరగనుందని పరిశోధనా సంస్థ టెక్నావియో అంచనా. అయితే.. సేంద్రియ ఇంటి పంటలు సాగు చేసుకోవటం వరకే అయితే పెద్దగా ఖర్చు అవసరం లేదు. కంటైనర్లు, కుండీలు, ఎత్తు మడుల్లో వేసుకోవచ్చు. రూఫ్ మొత్తాన్నీ కప్పి ఉంచేలా అనేక దొంతర్లుగా గార్డెన్‌ను నిర్మించాలనుకుంటేనే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంటిపంటలతో ప్రాణవాయువు 10 అడుగుల వెడల్పు, 10 అడుగులు పొడవు వుండే స్థలంలో పెరిగే మొక్కలు 13 అడుగులఎత్తయిన చెట్టుతో సమానంగా బొగ్గుపులుసు వాయువును పీల్చుకొని ప్రాణవాయువును విడుదల చేస్తాయని అంచనా. గ్రీన్ రూఫ్ మన దేశానికీ కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ, దేశవ్యాప్తంగా సానుకూల స్పందన కనిపిస్తోంది. పెద్ద నగరాల్లో గ్రీన్ రూఫ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సుస్థిర జీవనం, పర్యావరణ స్పృహ కలిగిన నగరవాసులు సేంద్రియ ఆహారం ప్రాముఖ్యతను, సేంద్రియ ఇంటిపంటల సాగు ఆవశ్యకతను గ్రహిస్తున్నారు. కొసమెరుపు హైదరాబాద్ నగరంలో భవనాల పైకప్పుల విస్తీర్ణం కనీసం 50 వేల ఎకరాలకు పైగా ఉండొచ్చని ఒక అంచనా. దాదాపుగా ఈ రూఫ్లన్నీ ఖాళీగానే వున్నాయి. వీటిని గ్రీన్ రూఫ్ గార్డెన్లు గానో లేదా సేంద్రియ ఇంటిపంటల తోటలుగానో (సౌర ఫలకాలను కూడా వీటిలోనే పెట్టుకోవచ్చు) మార్చితే..? ఇదే మాదిరిగా ఇతర నగరాలూ, పట్టణాలను మార్చితే? పర్యావరణ పరంగా, ఆహార భద్రతా పరంగా, ప్రజారోగ్యపరంగా మహా అద్భుతమే ఆవిష్కృతమవుతుంది! – సాక్షి, సాగుబడి డెస్క్ నగరాలను చల్లబరిచే మార్గం పట్టణ ప్రాంతాల్లో భవనాల పైకప్పుల విస్తీర్ణం సాధారణంగా పట్టణ భూభాగంలో 5–35 శాతం వరకు ఉంటుంది. అమెరికాలో 90 శాతానికి పైగా భవనాల పైకప్పులు ఖాళీగా ఉన్నాయని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంచనా. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల కంటే నగర వాతావరణంలో 5.6 డిగ్రీల సెంటీగ్రేడ్ అధిక వేడి ఉంటుంది. దీన్నే ‘అర్బన్ హీట్ ఐలాండ్‘ అని పిలుస్తారు. గాలి కూడా సాధారణం కంటే వేడిగా ఉంటుంది. పైకప్పులు వేడిగా ఉన్నప్పుడు, భవనాల లోపలి గదులను చల్లబరచడం కష్టం. ఇది నగర విద్యుత్ గ్రిడ్‌పై అధిక భారాన్ని మోపుతుంది. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల నగరంలో వాయు కాలుష్యం కూడా తీవ్రమవుతుంది. ఉదాహరణకు, నగరాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల గాలిలో ఓజోన్ వాయువు సాంద్రత పెరుగుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. అయితే.. భవనాల పైకప్పులపై కనీసం 30% విస్తీర్ణంలో మొక్కలు, చెట్లు పెంచినప్పుడు దాదాపు 1 డిగ్రీ సెల్సియస్ వరకు వాతావరణం చల్లబడిందని బాల్టిమోర్–వాషింగ్టన్ మెట్రోపాలిటన్‌లో జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. -
సీఆర్డీఏ ప్లాట్ల వేలం గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆస్పత్రి, సినిమా థియేటర్, పాఠశాల వంటి వివిధ వాణిజ్య అవసరాలు, నివాసాల నిర్మాణానికి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కేటాయించిన ప్లాట్ల వేలం గడువును ఆగస్టు 1న వరకు పొడిగించింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోని 5 లాట్లలో ఉన్న 100 ప్లాట్లను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. తొలుత ఈ నెల 28న ఈ–వేలం నిర్వహించాలని నిర్ణయించగా..ఎక్కువ మంది వేలంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆగస్టు 1వరకు పొడిగించింది. వేలం వేసే ప్లాట్ల వివరాలివీ.. ► తెనాలి నగరం చెంచుపేటలో లాట్–1లో 250 నుంచి 5,372 చ.గ విస్తీర్ణంలో మొత్తం 15 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో సినిమా థియేటర్, హెల్త్ సెంటర్, ప్రాథమిక పాఠశాల కోసం మూడు ప్లాట్లు, మిగిలినవి వాణిజ్య సముదాయాల కోసం కేటాయించారు. ఇక్కడ చ.గ. ధర రూ.35,200గా నిర్ణయించారు. ► తాడేపల్లి–మంగళగిరి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవులూరు వద్ద ఉన్న లాట్–2లోని అమరావతి టౌన్షిప్లో 500 నుంచి 4,065 చ.గ. విస్తీర్ణం వరకు మొత్తం 18 ప్లాట్లను అభివృద్ధి చేశారు. వీటిలో 14 వాణిజ్య ప్లాట్లకు చ.గ. రూ.17,600 గాను.. ఆస్పత్రి, సినిమా థియేటర్, పాఠశాలలకు కేటాయించిన ప్లాట్లలో చ.గ. రూ.16 వేలుగాను ధర నిర్ణయించారు. ► విజయవాడ పాయకాపురం టౌన్‌షిప్‌లోని లాట్–3లో 550 చ.గ. నుంచి 3 వేల చ.గ. వరకు మొత్తం 10 ప్లాట్లు ఉన్నాయి. వీటిని ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య కేంద్రం, స్థానిక షాపింగ్ కోసం కేటాయించారు. ఇదే ప్రాంతంలోని లాట్–4లో 100 నుంచి 744 చ.గ. వరకు 29 ప్లాట్లు ఉన్నాయి. వీటిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, అల్పాదాయ వర్గాలకు, నివాస అవసరాలకు కేటాయించారు. ఈ రెండు ప్రాంతాల్లోను చ.గ. ధర రూ.25 వేల నుంచి రూ.27,500 వరకు ఉంది. ► ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్‌లోని లాట్–5లో 150 నుంచి 1000 చ.గ. వరకు ఉన్న మొత్తం 28 ప్లాట్లు ఉన్నాయి. వీటిని దుకాణాలు, కార్యాలయాలు, నివాసానికి కేటాయించారు. వీటిలో మూడు ప్లాట్లకు చ.గ. ధర రూ.11 వేలుగా, మిగిలిన ప్లాట్లలో చ.గ. రూ. 10 వేలుగా నిర్ణయించారు. పూర్తి వివరాలను https:// konugolu.ap.gov.in/,https://crda.ap.gov.in/లో పొందవచ్చు. ఫోన్ ఓటీపీతో రిజిస్ట్రేషన్ పైన పేర్కొన్న ప్లాట్ల కొనుగోలుకు ఫోన్ ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఈ–వేలం సేవలను ప్రజలు సులభంగా పొందేందుకు కొత్తగా ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. కొనుగోలుదారులెవరూ అమ్మకందారును కలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా, ఇంటివద్దే ఫోన్ సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. తమ సందేహాల నివృత్తి కోసం 0866–2527124 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఆదా చేస్తేనే అనుమతి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వాణిజ్య భవనాలు నిర్మించాలనుకునేవారు ఇకపై విధిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ)ను అనుసరించాల్సిందే. లేని పక్షంలో అనుమతులివ్వరు. ప్లాట్ ఏరియా వెయ్యి చదరపు మీటర్లకు మించిన.. లేదా బిల్టప్ ఏరియా 2 వేల చదరపు మీటర్లకు మించిన వాణిజ్య భవనాలకు దీనిని జీహెచ్ఎంసీ తప్పనిసరి చేసింది. ఈసీబీసీని తప్పనిసరి చేస్తూ అనుమతులివ్వడం దేశంలో ఇదే తొలిసారి. ఈసీబీసీకి మూడేళ్ల క్రితమే చట్టం చేసినా.. ఏ రాష్ట్రం ఇంతవరకు దీన్ని అమలు చేయడం లేదు. దీన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీయే కానుంది. జనవరి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. విద్యుత్ వినియోగం పెరగడంతో.. విద్యుత్ వినియోగం భారీస్థాయిలో పెరుగుతుండటంతో ఇంధన పొదుపు కీలకంగా మారింది. వాణిజ్య భవనాలకు వర్తించే ఈ నిబంధన ఫ్యాక్టరీలు, నివాస సముదాయాలకు వర్తించదు. హాస్పిటళ్లు, హోటళ్లు, మల్టీప్లెక్స్‌లు మొదలైనవి రెండు వేల చదరపు మీటర్ల లోపున ఉన్నా ఈసీబీసీని పాటించాల్సిందే. దీని వల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి), నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్(ఎన్ఆర్డీసీ) సహకారంతో దీని అమలుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఈసీబీసీ వల్ల విద్యుత్ ఆదాతోపాటు వాతావరణ మార్పు సమస్యల్ని ఎదుర్కొనేందుకూ ఉపయుక్తంగా ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసీబీసీ అమలు చేస్తే.. ► గోడలు, రూఫ్‌లు, కిటికీలు వంటి వాటిని దీనికి లోబడి నిర్మించాలి. ► విద్యుత్ లైట్లు ఎన్ని పడితే అన్ని వాడటానికి వీల్లేదు. ఎంత విస్తీర్ణం గదికి ఎన్ని వాట్ల విద్యుత్ వాడాలనే నిబంధనలు పాటించాలి. ► ఎయిర్ కండిషనింగ్ కూడా పరిమిత స్థాయిలోనే ఉండాలి. ► ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, వాటర్‌పంప్ సిస్టం తదితరమైనవి సూపర్ ఎఫీషియెంట్‌గా ఉండాలి. ► హోటళ్లు, హాస్టళ్ల వంటి వాటిల్లో నీటిని వేడిచేసేందుకు 60 శాతం వరకు సోలార్ పవర్‌ను వినియోగించాలి. ► ఈసీబీసీ అమలుతో విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. సహజసిద్ధమైన వెంటిలేషన్ ఉంటుంది. సదరు కార్యాలయాల్లో పనిచేసే వారి ఆరోగ్యానికి అది మేలు చేస్తుంది. కమర్షియల్ స్పేస్ డిమాండ్ పెరుగుతుంది ఈసీబీసీ వల్ల విద్యుత్ వ్యయం తగ్గడమే కాక, సదరు భవనాల్లోని ఉద్యోగులకు సహజసిద్ధమైన గాలి, వెలుతురు అందే వీలుంది. తద్వారా వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి సదుపాయాలున్న చోట కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుంది. – ప్రొఫెసర్ రాజ్‌కిరణ్, ఆస్కి మొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఈసీబీసీని అమలు చేయనున్న మొదటి రాష్ట్రం తెలంగాణ.. మొదటి కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కానున్నాయి. భవనాల డిజైన్‌ను ఆమోదించేందుకు నిపుణుల ఎంప్యానెల్ ఉంటుంది. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల్ని డెవలప్మెంట్ పర్మిషన్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఆన్లైన్లో జారీ చేస్తున్నాం. ఈసీబీసీ అమలుకు సాఫ్ట్‌వేర్‌ను తగినవిధంగా రూపొందించాం. – ఎస్.దేవేందర్‌రెడ్డి, చీఫ్ సిటీప్లానర్, జీహెచ్ఎంసీ -
ఆస్తిపన్నుపై సర్కార్ కన్ను !
జిల్లాలోని మునిసిపాలిటీలు, నగరాల్లో ఉన్న భవనాల కొలతలు సరిచేయడం, పన్ను తక్కువగా వస్తున్న భవనాలను గుర్తించి సరైన పన్ను విధించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లతో పాటు ఆరు మునిసిపాలిటీల్లో భవనాల కొలతలు, పన్ను వివరాలు సరిచేయాలని రాష్ట్ర పురపాలన పరిపాలన శాఖ (డీఎంఏ) కమిషనర్లను ఆదేశించింది. - భవన విస్తీర్ణం పునః పరిశీలన - మునిసిపాలిటీల్లో ఎనిమిది వారాల ప్రణాళిక - వాణిజ్య భవనాలను వదలొద్దు - పురపాలకశాఖ నుంచి ఆదేశాలు జిల్లాలో చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి మునిసిపాలిటీలు ఉన్నాయి. తిరుపతిలో 60,619 భవనాలకు ప్రతి అర్ధ సంవత్సరానికి రూ.28.41 కోట్లు, చిత్తూరు నుంచి 29,636 భవనాలకు ఆర్నెల్లకు రూ.4 కోట్లు, మదనపల్లెలో 16,640 భవనాలకు గానూ 1.43 కోట్లు, పుంగనూరులో 7726 భవనాలకు 1.56 కోట్లు, పలమనేరులో 9,606 భవనాలకు రూ.1.08 కోట్లు, శ్రీకాళహస్తిలో 60,619 భవనాలకు రూ.2.84 కోట్లు, పుత్తూరులో 9,892 భవనాలకు రూ.89.31 లక్షలు, నగరిలో 12,441 భవనాలకు రూ.88.08 లక్షల ఆస్తి పన్ను రూపంలో వసూలవుతోంది. ఈ భవనాల్లో ఇళ్లకు ఓ రేటు, వాణిజ్య సముదాయాల నుంచి ఓ రేటు, కర్మాగారాల నుంచి ఓ రేటు రూపంలో అధికారులు ఆస్తి పన్ను వసూలు చేస్తారు. చాలా పట్టణాలు, నగరాల్లో వాణిజ్య భవనాల నుంచి చాలా తక్కువ మొత్తంలో ఆస్తిపన్ను వసూలవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఎన్నో ఏళ్ల క్రితం గృహ అవసరాలకు ఉన్న భవనానికి వేసిన పన్నునే ఇప్పటికీ వాణిజ్య భవనాల నుంచి వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాత పన్నులు సరిచేయడానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎనిమిది వారాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేసే బిల్ కలెక్టర్లు పన్నులు వేయని రెండు భవనాలను గుర్తించడంతో పాటు, తక్కువ పన్ను వస్తున్న నాలుగు భవనాలను గుర్తించి పన్ను పెంచాలని డీఎంఏ నుంచి ఆదేశాలు అందాయి. అలాగే పేరుకు నివాసగృహాలుగా చూపుతూ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే భవనాలకు వ్యాపార జోన్‌గా గుర్తించి వాటి నుంచి కొత్త పన్ను వసూలు చేయాలని కమిషనర్లను, రెవెన్యూ అధికారులను రాష్ట్ర అధికారులు ఆదేశించారు. ఇప్పటికే అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు పచ్చ జెండా ఊపిన ప్రభుత్వం, తాజాగా పన్నుల వసూళ్లపై దృష్టి సారించి ప్రతి మునిసిపాలిటీలో పది శాతం పన్ను పెంచుకోవడమే లక్ష్యంగా ఉత్తర్వులు జారీ చేసింది. -
పేరుకుపోయిన ‘అద్దె'
- హెచ్ఎండీఏ వాణిజ్య భవనాలపై కమిషనర్ నజర్ - 12లోగా అద్దె బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ - గడువు ముగిశాక షాపుల సీజ్‌కు నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: హెచ్ఎండీఏ వాణిజ్య సముదాయాల్లో అద్దె చెల్లించకుండా కొనసాగుతోన్న కిరాయిదారులపై కమిషనర్ శాలిని మిశ్రా కొరడా ఝుళిపించారు. ఈ నెల 12లోగా అద్దె బకాయిలు చెల్లించకపోతే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ హుకుం జారీ చేశారు. ఈ మేరకు అమీర్‌పేటలోని మైత్రివనం, మైత్రి విహార్, స్వర్ణజయంతి, ఆదర్శనగర్‌లోని హెర్మిటేజ్ బిల్డింగ్, తార్నాక కాంప్లెక్స్‌ల్లోని పలువురు లీజు దారులకు తాజాగా నోటీసులు అందాయి. నిర్దేశిత గడువులోగా అద్దె బకాయిలు హెచ్ఎండీఏ అకౌంట్‌కు జమచేయకుంటే ఆయా షాపులను సీజ్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. వారం రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ పీకలపై కత్తిపెట్టడంతో కిరాయిదారుల్లో కలవరం మొదలైంది. కొందరు తట్టాబుట్టా సర్దుకునేందుకు సిద్ధమయ్యారు. హెచ్ఎండీఏ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడంతో నెలవారీగా కమర్షియల్ కాంప్లెక్స్‌ల నుంచి వచ్చే అద్దెల ఆదాయంపై కమిషనర్ ఆరా తీశారు. నెలకు సుమారు రూ.1.5 కోట్లకుపైగా ఆదాయం రావాల్సి ఉండగా అందులో సగం కూడా వసూలు కావట్లేదని, ఇప్పటికే రూ.9 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినట్లు తేలింది. దీంతో ఆగ్రహానికి గురైన కమిషనర్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆర్అండ్డీ సెక్షన్‌లోని సిబ్బందికి ఛార్జి మెమోలు జారీ చేశారు. హెచ్ఎండీఏ వద్ద ఉన్న డిపాజిట్ సొమ్ముకంటే వారు చెల్లించాల్సిన అద్దె బకాయిలే అదనంగా ఉండటంతో కమిషనర్ అధికారులపై కన్నెర్ర జేశారు. అయితే, కొందరు సిబ్బంది అద్దె బకాయిదారులతో కుమ్మక్కై నెలవారీగా మామూళ్లు పుచ్చుకొంటూ సంస్థ ఆదాయానికి గండికొట్టిన విషయం బహిరంగ రహస్యమే. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంతో రూ.9 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో గతంలో పార్కింగ్ లాట్ తీసుకొన్న ఓ వ్యక్తి హెచ్ఎండీఏకు లీజు మొత్తం చెల్లించకుండా దర్జాగా వ్యాపారం చేసుకొని తీరా వత్తిడి తేవడంతో ఉడాయించాడు. ఇందుకు ఓ అధికారి సహకరించాడన్న పుకార్లు అప్పట్లో దుమారం రేపాయి. అయితే, ఆ అధికారి పదవీవిరమణ చేయడంతో ఆయన హయాంలో జరిగిన అక్రమాలకు అధికారులు సమాధి కట్టేశారు. ఇలా పలువురు అధికారులు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వండంతో సంస్థకు అద్దె బకాయిలు భారీగా పెరిగిపోయాయి. వసూళ్లకు ప్రత్యేక బృందాలు.. అద్దె బకాయిల వసూలును సీరియస్‌గా తీసుకొన్న హెచ్ఎండీఏ కమిషనర్ ఇం దుకోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఒక తహశీల్దార్/ఏఓ, ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించి వారికి వసూలు బాధ్యతను అప్పగిం చారు. ఒక్కో కాంప్లెక్స్‌కు ఒక బృం దాన్ని నియమించి ఈనెల 12లోగా బకాయిలు మొత్తం వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అప్పటికీ స్పందించకపోతే గడువు తీరాక, ఆయా షాపులను సీజ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈమేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి బకాయిదారులపై వత్తిడి తెచ్చారు. గతంలో సకల జనుల సమ్మె సందర్భంగా 45 రోజుల పాటు తాము షాపులను మూసుకోవాల్సి వచ్చిందనీ, వ్యాపారాలు సాగకపోవడంతో అప్పట్లో అద్దె చెల్లించలేకపోయామే తప్పా ఎగ్గొట్టాలనే ఆలోచన తమకు లేదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. ఒకేసారి కాకుండా రెండు మూడు వాయిదాల్లో అద్దె బకాయిలు చెల్లించే విధంగా తమకు వెసులుబాటు కల్పించాలని వారు కోరుతున్నారు, -
'మహ' మాయ
ఆస్తి పన్ను గణనలో అక్రమాలు సిబ్బంది చేతివాటం నివాస గృహాలు వాణిజ్య భవనాలుగా గుర్తింపు సర్వేతో వెలుగు చూస్తున్న వైనం సిటీబ్యూరో: ఆస్తిపన్ను... జీహెచ్ఎంసీకి ఎంత మేరకు ఆదాయం తెచ్చి పెడుతుందన్న సంగతి పక్కన పెడితే... ఆ సంస్థలోని కొంతమంది ఉద్యోగులకు మాత్రం పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికే వివిధ విభాగాలు అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నాయి. తాజాగా భవనాల ఆస్తిపన్ను విధింపులోనూ వివిధ రూపాల్లో అవినీతి చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. వాణిజ్య భవనాలను నివాస గృహాలుగా చూపుతూ కొంతమంది సంస్థను ముంచుతుండ గా... మరికొంతమంది భవనాన్ని ఆస్తిపన్ను జాబితాలోనే చేర్చకుండా ‘ప్రైవేటుగా’ వసూలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీకి ఏటా రూ.వందల కోట్ల నష్టం వాటిల్లుతోంది. జీహెచ్ఎంసీ తాజాగా చేపట్టిన సర్వేలో ఈ వివరాలు వెలుగు చూస్తున్నాయి. సంఖ్య బారెడు... ఆదాయం మూరెడు ఈ ఆర్థిక సంవత్సరం ఖజానాను నింపే క్రమంలో వాణిజ్య భవనాల ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సులపై అధికారులు దృష్టి సారించారు. నగరంలో మూడు లక్షలకుపైగా వాణిజ్య, వ్యాపార సంస్థలు ఉన్నప్పటికీ, వాటిలో దాదాపు 60 వేల సంస్థలు మాత్రమే ట్రేడ్‌లెసైన్సు ఫీజులు చెల్లిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. పెద్ద సంఖ్యలో వాణిజ్య భవనాల నుంచి నివాస గృహాల రూపంలో వసూలవుతున్నట్టు గుర్తించారు. వాస్తవానికి నివాస గృహానికి ఆస్తిపన్ను రూ.వెయ్యి ఉంటే... అదే విస్తీర్ణంలోని భవనానికి వాణిజ్య కేటగిరీలో ఏరియాను బట్టి రెండు మూడు రెట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. సిబ్బంది చేతివాటంతో ఇలాంటి వాటిని వాణిజ్య కేటగిరీలో చేర్చకుండా ‘దయ’ చూపిస్తున్నారు. ఇక కార్పొరేటర్లను మచ్చిక చేసుకొని ఇటీవలి వరకు వాణిజ్య కేటగిరీలో నమోదు కాకుండా చేసుకున్న వారు... అసలు జాబితాలోనే లేని వారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ ఇలాంటి వాటిపై దృష్టి సారించారు. విద్యుత్ శాఖ నుంచి వాణిజ్య కేటగిరీలోని భవనాల జాబితా తెప్పించారు. గ్రేటర్లో దాదాపు 3.13 లక్షల కనెక్షన్లు వాణిజ్య కేటగిరీలో ఉన్నాయి. వాటితో పోలుస్తూ, తమ సిబ్బందితో సర్వే చేయించారు. వచ్చే నెల రెండో వారంలోగా సర్వే పూర్తి చేసి, పన్ను వసూలు చేయాలని ఆయన ఆదేశించారు. రూ.200 కోట్లు వచ్చే అవకాశం ఇంతవరకు ఆస్తిపన్ను పరిధిలోకి రాని 3,218 భవనాలను, నివాస గృహాల పేరిట వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న 22,046, భవనాలను, పన్ను పరిధిలో కనిపించని 1,336 భవనాలు (మొత్తం 26,600) గుర్తించినట్లు జీహెచ్ఎంసీ డేటాబేస్‌లో పేర్కొన్నారు. ఇంకా గుర్తించాల్సినవి చాలా ఉన్నాయి. గుర్తించిన వాటిలో 4975 భవనాలకు స్పెషల్ నోటీసులు జారీ చేశారు. వారంతా ఆదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ఆస్తిపన్ను రేపేణా జీహెచ్ఎంసీకి అదనంగా రూ. 10 కోట్లు రాగలదని అంచనా. మొత్తం సర్వే పూర్తయితే ఈ ఆదాయం రూ.200 కోట్లకు పైగా పెరుగుతుందని భావిస్తున్నారు. లబోదిబోమంటున్న చిరు వ్యాపారులు ఇదిలా ఉండగా, జిరాక్స్ సెంటర్లు, రోడ్డు పక్క టిఫిన్ సెంటర్లకు సైతం కరెంటు కనెక్షన్లు వాణిజ్య కేటగిరీలో ఉన్నాయి. వాటి ఆధారంగా ఆస్తిపన్ను వసూలుతో పాటు భవన యజమానులు తమపై మరింత భారం మోపుతారని చిరువ్యాపారులు లబోదిబోమంటున్నారు. థర్ ్డపార్టీతోనూ సర్వే.. ఆస్తిపన్ను విధింపులో జీహెచ్ఎంసీలోని కొంతమంది సిబ్బం ది చేతివాటం ఉండటం వల్ల తాజా సర్వేలోనూ అవకతవకలకు ఆస్కారం ఉండగలదని అధికారులు భావిస్తున్నారు. దీంతో థర్డ్‌పార్టీతో మరో మారు సర్వే జరిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ప్రైవేటు సంస్థను టెండ రు ద్వారా ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
‘వాణిజ్యం’ కొంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: రానున్న ఐదేళ్లలో నగరంలో ఎంతలేదన్నా 2 కోట్ల చ.అ. విస్తీర్ణంలో వాణిజ్య భవనాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటయితే.. ఫ్లాట్లపై 2 నుంచి 4 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో వాణిజ్య స్థలాల్లో పెట్టుబడికి పరిశీలించాల్సిన అంశాలేమిటో చూద్దాం. వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో పెట్టుబడి పెట్టాలి. వాణిజ్య సముదాయాల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. కాకపోతే అన్ని విధాల అభివృద్ధికి ఆస్కారమున్న చోట నిర్మితమయ్యే వాణిజ్య కట్టడాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాల్ని క్షుణ్నంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి. ఇవే కీలకం.. ► ఒక ప్రాంతంలో కట్టే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశముందా అనే విషయాన్ని బేరీజు వేయాలి. ► భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ► వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెంద డానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగడానికి ఆస్కారముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి. ► కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి. ► నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది.