బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్లల వ్యవహారం విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే. కన్నడ భాషలోనే సైన్ బోర్డులు పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్‌జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. అయితే ఆందోళనకు దిగిన నిరసనకారులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప మండిపడ్డారు. అరెస్ట్ చేయబడిన నిరసనకారులు నేరస్తులు కాదని.. వారంతా కన్నడ భాష పరిరక్షకులని అన్నారు. కన్నడ భాషలనే నేమ్ ప్లేట్లు, సైన్ బోర్డులు పెట్టాలని నిరసన కారులు చేసిన డిమాండ్ ఆమోదయోగ్యమైందని తెలిపారు. వారిని ఎందుకు అరెస్ట్ చేశారలో తనకు ఇప్పటికీ అర్థం కావటంలేదని మండిపడ్డారు.
ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసిన నిరసన కారులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. ఇక కర్ణాటకలో వ్యాపారస్తులు తప్పనిసరిగా కన్నడ భాషలోనే సైన్ బోర్డులు పెట్టుకోవాలని అన్నారు. అయితే నిరసకారులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. నిరసన తెలిపేవారికి తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ.. చట్టం తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని తెలిపారు.
చదవండి: ‘కన్నడ’ బోర్డుల రగడ
Comments
Please login to add a commentAdd a comment