ks eshwarappa
-
కేఎస్ ఈశ్వరప్ప కీలక నిర్ణయం.. మోదీకి వ్యతిరేకం కాదు
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో షిమోగా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ కార్యకర్త కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు. తన కుమారుడు కేఈ కాంతేశ్‌కు హవేరీ టికెట్ దక్కకపోవడంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడ్యూరప్పపై ఈశ్వరప్ప మండిపడ్డారు. వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా, హిందుత్వ కోసం పోరాడతానని ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఇది ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. షిమోగా మద్దతుదారులతో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. బీజేపీ పార్టీని, దాని సిద్ధాంతాలను కాపాడటానికి ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్ధమైనట్లు, నరేంద్ర మోదీని మరో సారి ప్రధానిని చేసేందుకు నేను చేస్తున్న పోరాటమని ఈశ్వరప్ప అన్నారు. ప్రస్తుతం ఈ చర్యకు పూనుకోవడం వల్ల బీజేపీ తనకు నోటీసు ఇచ్చే అవకాశం ఉంది లేదా పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నేను గెలిస్తే.. తప్పకుండా బీజేపీకి మద్దతు ఇస్తానని ఆయన అన్నారు. అయితే బీజేపీ అభ్యర్థి యడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ బీ వై రాఘవేంద్ర మరోసారి షిమోగా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారనేది త్వరలోనే తెలుస్తుంది. -
‘వాళ్లు నేరస్తులు కాదు..’ ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో సైన్‌బోర్డు, నేమ్ప్లేట్లల వ్యవహారం విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే. కన్నడ భాషలోనే సైన్ బోర్డులు పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. అయితే ఆందోళనకు దిగిన నిరసనకారులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప మండిపడ్డారు. అరెస్ట్ చేయబడిన నిరసనకారులు నేరస్తులు కాదని.. వారంతా కన్నడ భాష పరిరక్షకులని అన్నారు. కన్నడ భాషలనే నేమ్ ప్లేట్లు, సైన్ బోర్డులు పెట్టాలని నిరసన కారులు చేసిన డిమాండ్ ఆమోదయోగ్యమైందని తెలిపారు. వారిని ఎందుకు అరెస్ట్ చేశారలో తనకు ఇప్పటికీ అర్థం కావటంలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసిన నిరసన కారులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. ఇక కర్ణాటకలో వ్యాపారస్తులు తప్పనిసరిగా కన్నడ భాషలోనే సైన్ బోర్డులు పెట్టుకోవాలని అన్నారు. అయితే నిరసకారులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. నిరసన తెలిపేవారికి తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ.. చట్టం తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని తెలిపారు. చదవండి: ‘కన్నడ’ బోర్డుల రగడ -
కర్ణాటకలో ఆపరేషన్ లోటస్.. మాజీమంత్రి షాకింగ్ కామెంట్స్
బెంగళూరు: ఇటీవల కర్ణాటక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీపై కాంగ్రెస్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నో ప్లాన్స్ చేస్తూ ముందుకుసాగింది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో హస్తం పార్టీ గెలుపు ఖాయమైంది. ఇక, తాజాగా కర్ణాటక రాజకీయాలపై బీజేపీ మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన కామెంట్స్ చేశారు. అయితే, మాజీ మంత్రి ఈశ్వరప్ప ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్లాన్ సిద్ధమైనట్టు తెలిపారు. కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ త్వరలోనే ప్రారంభం కానుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండదని హాట్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో సగం మంది హస్తం గూటికి చేరతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని కానీ.. ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోరని స్పష్టం చేశారు. దమ్ముంటే నెలరోజుల్లోగా కనీసం ఒక్క ఎమ్మెల్యేను ఆకర్షించాలని ఆయన కాంగ్రెస్‌కు సవాల్ చేశారు. తమ సొంత ఎమ్మెల్యేలకే మీపై నమ్మకం లేదని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని చురకలంటించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ ఈశ్వరప్పకు టికెట్ ఇవ్వలేదు. అనంతరం, ప్రధాని మోదీ.. ఈశ్వర్పకు కాల్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే. Shivamogga, Karnataka | On the question of whether BJP can do 'Operation Lotus' at present, BJP leader KS Eshwarappa says, "Wait and watch, your (Congress) own MLAs don't have hope on you, Congress has no future in this country. Congress party is making big news in the state.… pic.twitter.com/WIa59VKRG7 — ANI (@ANI) September 3, 2023 ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే? -
కర్ణాటక బీజేపీ నేతకు మోదీ ఫోన్ కాల్
బెంగళూరు: దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు ఫోన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. ఆ మరుసటి రోజే ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ స్వయంగా ఈశ్వరప్పకు ఫోన్ చేయడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న తరుణంలో.. పార్టీ దిద్దుబాటు చర్యకు దిగింది. ఇప్పటికే చాలామంది సీనియర్లకు ప్రత్యామ్నాయ హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఈశ్వరప్పకు స్వయంగా ఫోన్ చేశారు మోదీ. ‘‘మీలాంటి గొప్ప నేత.. నాలాంటి ఓ సాధారణ కార్యకర్తకు ఫోన్ చేయడం గొప్పగా భావిస్తున్నా అని ఈశ్వరప్ప, మోదీతో పేర్కొన్నారు. దానికి ప్రతిగా.. ‘మీరు పార్టీ పట్ల వీరవిధేయతను కనబరిచారు. అందుకు నాకు సంతోషంగా ఉంది. అందుకే మీతో మాట్లాడాలనుకున్నా. ఈశ్వరప్పజీ.. థాంక్యూ’ అని ప్రధాని మోదీ ఆ కాల్లో ఆయనకు బదులిచ్చారు. అంతేకాదు.. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన శివమొగ్గ నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న చెన్నబసప్ప తరపున తాను ప్రచారం సైతం చేస్తానని, కర్ణాటకలో బీజేపీ గెలుపునకు తన శాయశక్తులా కృషిచేస్తానని ఈశ్వరప్ప.. మోదీకి హామీ ఇచ్చారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఈశ్వరప్ప.. ఆరో దఫా సైతం పోటీ చేయాలని భావించగా, పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో అసంతృప్తితో రగిలిపోతూ ఆయన ఎన్నికల రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ బహిరంగ ప్రకటన చేశారు. ఇక శుక్రవారం ప్రధాని మోదీతో ఫోన్‌కాల్ మాట్లాడిన అనంతరం.. ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడారు. ఇదీ చదవండి: వివాదాల పుట్ట.. ఈశ్వరప్ప మోదీగారు తనకు ఫోన్ చేస్తారని జీవితంలో అనుకోలేదని, ఆయన చేసిన పని తనకెంతో స్ఫూర్తినిచ్చిందని మీడియాకు ఈశ్వరప్ప బదులిచ్చారు. कुर्सी, सत्ता, दबदबा किसी भी हाल में बना रहना चाहिए… जो फोन पर बात कर रहे है वो BJP के #Eshwarappa है जिन्होंने 40% कमीशन की मांग कर एक कांट्रेक्टर को आत्महत्या के लिए मजबूर किया, बाद में मंत्री से इस्तीफा और टिकिट कटा देश के #PM उन्हें भरोसा देते हुए pic.twitter.com/uml1QCnl9I — Chhaya Thakur (@ChhayaThakurInc) April 21, 2023 బీజేపీ మే 10వ తేదీన జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఎక్కువగా కొత్త ముఖాలను, యూత్ లీడర్లను దించుతోంది. దీంతో పార్టీ దిగ్గజాల్లో చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు కూడా. అయితే మొదట ఈశ్వరప్ప సైతం పార్టీతీరుపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం నడిచినప్పటికీ, తాను పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానంటూ గురువారం ఈశ్వరప్ప ఒక ప్రకటన చేశారు కూడా. తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది కూడా పార్టీని బలోపేతం చేయడానికేనని పేర్కొన్నారు. పాతికేళ్లుగా శివమొగ్గ ప్రజలకు సేవలందించా. ఇకపైనా వాళ్లకు అందుబాటులో ఉంటా అని పేర్కొన్నారాయన. ఇదీ చదవండి: ఈశ్వరప్ప కొడుకుకూ దక్కని సీటు -
ఇక ఎన్నికల్లో పోటీ చేయను: కర్ణాటక ఈశ్వరప్ప
బెంగళూరు: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, శివమొగ్గ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప(74) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని మంగళవారం అధికారికంగా ప్రకటించారాయన. మే నెలలో జరగబోయే ఎన్నికలతో పాటు ఇకపై ఏ ఎన్నికల్లోనూ పార్టీ తరపున పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటానని ప్రకటించారు ఈశ్వరప్ప. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు. ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్‌గా చెప్పుకునే ఈశ్వరప్ప.. వివాదాలకు కేరాఫ్. ఈ వివాదాల నడుమే ఆయన మంత్రి పదవిని సైతం పొగొట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. అందువల్లే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై పార్టీ జాప్యం చేస్తూ వస్తోందని గత కొంతకాలంగా కర్ణాటక రాజకీయంగా చర్చ కూడా నడుస్తోంది. ఈ తరుణంలో.. అధిష్టానం టికెట్ తిరస్కరించడం కంటే ముందే తానే గౌరవప్రదంగా తప్పుకోవాలని ఆయన భావించినట్లు అనుచరులు చెప్తున్నారు. పార్టీ గత నలభై ఏళ్లుగా ఎన్నో బాధ్యతలు అప్పజెప్పింది. బూత్ ఇంఛార్జి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సముచిత స్థానం కల్పించింది. డిప్యూటీ సీఎంగా పని చేయడం కూడా నాకు గౌరవానిచ్చింది అని లేఖలో పేర్కొన్నారాయన. ఈశ్వరప్ప వివాదాలకు కేరాఫ్. వివాదాల నడుమే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు కూడా. సంతోష్ పాటిల్ అనే ఓ కాంట్రాక్టర్‌ను కమీషన్ కోసం వేధించిన ఆరోపణలపై కన్నడనాట పెద్ద రాజకీయ దుమారమే రేగింది. ఫలితంగా.. ఆయన కిందటి ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో కేవలం రాజీనామా మాత్రమే కాదని.. ఈశ్వరప్పను అరెస్ట్‌చేయాలంటూ విపక్షాలు బలంగా డిమాండ్ చేశాయి. అంతకు ముందు.. జాతీయ జెండా స్థానంలో ఏదో ఒకరోజు కాషాయపు జెండా ఎర్రకోటపై ఎగిరి తీరుతుందని కే.ఎస్.ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఊహించని పరిణామాలకు దారి తీశాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా విధానసౌధ(విధాన సభ)లో ధర్నాకు దిగింది. ఇంతేకాదు.. మధుర, కాశీలలో ఆలయాలను కూల్చేసి మరీ మసీదులను నిర్మించారంటూ వ్యాఖ్యలు చేసి పెనుదుమారమే రేపారాయన. ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అయోధ్యలో బాబ్రీ మసీదులాగే అన్నింటినీ కూల్చేసి.. ఆలయాలను పునర్మిస్తామంటూ ప్రకటించాడాయన. ఇది ఇంతటితోనే ఆగలేదు.. ముస్లింల నమాజ్పైనా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించిందన్న ప్రచారమూ అక్కడ నడిచింది. కూలీ పనులు చేసుకునే కుటుంబంలో పుట్టిన ఈశ్వరప్ప.. సామాజిక ఉద్యమకారుడిగా, అటుపై ఆరెస్సెస్‌తో అనుబంధం కొనసాగించారు. వీహెచ్‌పీ, ఏబీవీపీలో పని చేసి.. అటుపై రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రతిపక్ష నేతగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా పలు బాధ్యతలు చేపట్టారు. -
తోక ఊపోద్దు, నాలుక కోస్తాం.. ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ
సాక్షి, బెంగళూరు: మరోసారి ముస్లింలను తిట్టినా, వారిని గుండాలని అన్నా నీ నాలుకను కోస్తామని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈశ్వరప్పకు ఓ హెచ్చరిక లేఖ వచ్చింది. ముస్లింలను, టిప్పు సుల్తాన్‌ను దూషిస్తే ఊరుకునేది లేదని అందులో కన్నడలో పేర్కొన్నారు. హావేరి జిల్ళా బ్యాడగి తాలూకాలోని మేటె బెన్నూరు కళాశాల భవనం నిర్మాణానికి ముస్లింలు చేసిన సిమెంటు ఇటుకలు కావాలి, కానీ మేం మాత్రం వద్దా?, తోక ఊపొద్దు, నీ నాలుక కట్ చేస్తాము, జాగ్రత్త, హుషార్ అని బెదిరింపులు ఉన్నాయి. ఈశ్వరప్ప ఆ లేఖను చదివి, దీనిని రాసినవారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరారు. ఎవరో గుర్తు తెలియని వారు లేఖ రాశారు, ఆ లేఖలకు నేను భయపడేది లేదని అన్నారు. లేఖపై పోలీసులు విచారణ ప్రారంభించారు. చదవండి: ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు -
నాలుక కోస్తా.. బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ లెటర్ కలకలం
కర్నాటకలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వేడి ఇంకా చల్లరలేదు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో టిప్పు సుల్తాన్, వీడీ సావర్కర్ల ఫొటోలు ఉండడం.. తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప.. ముస్లిం యువకులను టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరప్పకు తాజాగా ఓ బెదిరింపు లేఖ వచ్చింది. టిప్పు సుల్తాన్‌ను మరోసారి ‘ముస్లిం గుండా’ అని పిలిస్తే నాలుక కోస్తానని బెదిరింపు లేఖలో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఈశ్వరప్ప పోలీసులను ఆశ్రయించి.. బెదిరింపు లేఖపై స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే ఈశ్వరప్ప మాట్లాడుతూ..‘ముస్లిం పెద్దలకు నేను చెప్పేది ఒక్కటే.. ముస్లింలందరూ గుండాలు అని అనలేదు. ముస్లిం సమాజంలోని పెద్దలు గతంలో శాంతి కోసం ప్రయత్నాలు చేశారు. కొందరు యువత గుండాయిజంలో మునిగిపోతున్నారు. వారికి మాత్రమే సలహా ఇవ్వాలని నేను చెప్పాలనుకుంటున్నాను. లేని పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని స్పష్టం చేశారు. తాను ఇలాంటి బెదిరింపులకు భయపడనని ఈశ్వరప్ప కౌంటర్ ఇచ్చారు. #Karnataka BJP MLA KS Eshwarappa files complaint after receiving threat letter over his remarks on #TipuSultan.https://t.co/fiIML4qsi5 — TIMES NOW (@TimesNow) August 25, 2022 ఇది కూడా చదవండి: స్వతంత్ర మీడియాని అణచివేసేందుకు యత్నాలు -
మసీదుల్లో మందిరాలను పునరుద్ధరించి తీరతాం!: ఎమ్మెల్యే ఈశ్వరప్ప
బెంగళూరు: మసీదుల్లో మందిరాల ఉనికిపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతున్న వేళ.. బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. 36,000 ఆలయాలను ధ్వంసం చేసి.. మసీదులు కట్టారని, వాటన్నింటిని పునరుద్ధరించి తీరతామని శపథం చేస్తున్నాడాయన. కర్ణాటక డిప్యూటీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప పై కామెంట్లు చేశాడు. మందిర్-మసీద్ వ్యవహారంపై మీడియా సాక్షిగా శుక్రవారం ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆలయాలను ధ్వంసం చేసి.. వాటిపై మసీదులు కట్టారు. వేరే ఎక్కడైనా మసీదులు కట్టి.. నమాజ్‌లు చేసుకోండి. అంతేగానీ, ఆలయాల మీద మసీదులను అనుమతించేదే లేదు. ముప్పై ఆరువేల ఆలయాలను హిందువులు తిరిగి అదీ లీగల్‌గా చేజిక్కించుకోవడం ఖాయం అని పేర్కొన్నారు ఆయన. జ్ఞానవాపి మసీదు వ్యవహారం కోర్టులో ఉన్న వేళ.. కర్ణాటకలోనూ అదే తరహా వ్యవహారం వెలుగుచూసింది. మంగళూరు దగ్గర ఓ పాత మసీదులో రిన్నోవేషన్ పనులు జరుగుతుండగా.. హిందు ఆలయం తరహా నమునాలు వెలుగు చూశాయి. దీంతో.. వీహెచ్‌పీ నేతలు పనులు ఆపించాలంటూ జిల్లా అధికారులను కోరారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈశ్వరప్ప గుడులను పునరుద్ధరించి తీరతామని వ్యాఖ్యానించడం విశేషం. ముస్లింలందరూ చెడ్డవాళ్లు కారని, అలాగని ఆలయాలపై మసీదులు నిర్మించి నమాజ్‌లు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఒక మసీదు ఉందంటే.. అది కచ్చితంగా శివుడి ఆలయమే అయ్యి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈశ్వరప్ప కామెంట్లపై కాంగ్రెస్ మండిపడుతోంది. న్యాయస్థానాల్లో వ్యవహారం ఉండగా.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడంటూ విమర్శలు గుప్పిస్తోంది. K S Eshwarappa: ಮಸೀದಿ ಇದ್ದಲ್ಲಿ ವಿಶ್ವನಾಥ ದೇವಾಲಯ ಆಗಿಯೇ ಆಗುತ್ತೆ ಎಂದ ಈಶ್ವರಪ್ಪ ||Bjp|| ||Karnataka Tak||@BJP4Karnataka #karnatakanews #UpdateNews #Eshwarappa #latestnews #GyanvapiMosque Watch:https://t.co/4IxRcaVlTY pic.twitter.com/gltJOr0alm — Karnataka Tak (@karnataka_tak) May 27, 2022 K S Eshwarappa: ‘ಎಲ್ಲಾ ಮುಸ್ಲೀಮರು ಕೆಟ್ಟವರು ಅನ್ನುವುದಿಲ್ಲ’ ||Bjp|| ||Karnataka Tak||@BJP4Karnataka #Muslim #Eshwarappa #KarnatakaTak #latestnews Watch:https://t.co/Wm05PslukR pic.twitter.com/LjkX7B3yQ5 — Karnataka Tak (@karnataka_tak) May 27, 2022 -
విచారణ జరుగుతోంది, తొందరెందుకు? విపక్షాలపై సీఎం ఫైర్
బెంగళూరు: కే.ఎస్ ఈశ్వరప్పను అరెస్ట్ చేసేది, లేనిది విచారణ అధికారుల నిర్ణయమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓపిక లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. ఆయన శనివారం హంపీ సమీపంలోని కన్నడ విశ్వ విద్యాలయంలో నూతన భవనాలను ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి జార్జ్‌పై వచ్చిన ఆరోపణలపై అప్పటి సీఎం ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేయించలేదని ప్రశ్నించారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకలా మాటలు మాట్లాడితే సరిపోదన్నారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం మంచిది కాదన్నారు. సంతోష్ పాటిల్ గదిలో క్రిమిసంహారక మందు దొరకడంతో విచారణ జరుగుతోందన్నారు. కాగా హొసపేటెలో బీజేపీ కార్యనిర్వాహక సభ భారీఎత్తున నిర్వహించారు. మాజీ సీఎం యడియూరప్ప, మంత్రి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కర్ణాటక కాంట్రాక్టర్ మృతి.. చనిపోయేముందు ఏం జరిగింది? కాంగ్రెస్ హస్తం ఉందేమో ? సాక్షి,బళ్లారి/హొసపేట: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే వారి హస్తం ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిని కుమార్ కటిల్ పేర్కొన్నారు. శనివారం ఆయన హొసపేటలో విలేకరులతో మాట్లాడుతూ... సంతోష్ ఆత్మహత్య వెనుక మహానాయకుడు హస్తం ఉందని చర్చసాగుతోందని, ఆ దిశగా దర్యాప్తు కూడా చేయిస్తామన్నారు. ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలని రాద్ధాంతం చేస్తున్నారని, ఎవరిని అరెస్ట్ చేయాలో చట్టం చూసుకుంటుందన్నారు. -
కర్ణాటక కాంట్రాక్టర్ మృతి.. చనిపోయేముందు ఏం జరిగింది?
బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్‌పాటిల్ ఆత్మహత్య చేసుకోవడానికి పంటల తెగుళ్ల నివారణకు వాడే క్రిమిసంహారక మందు మోనోక్రోటోఫాస్ తాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. సంతోష్‌పాటిల్ చిక్కమగళూరు వద్ద కైమర అనే గ్రామంలో 4 రోజుల పాటు ఒక హోంస్టేలో మకాం వేశాడు. ఆ తరువాత ఉడుపిలో లాడ్జి గది తీసుకున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ముగ్గురు ఉన్నట్లు సమాచారం. హోం స్టేలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ హుషారుగా ఉన్నాడని, వెళ్లేటప్పుడు అక్కడ కుక్కలకు బిస్కెట్లు వేశాడని తెలిసింది. హోం స్టే, లాడ్జి వద్ద సీసీ కెమెరాల చిత్రాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన వెంట వచ్చిన ముగ్గురు ఎవరని ఆరా తీశారు. ఈశ్వరప్ప అరెస్ట్‌కు కాంగ్రెస్ ధర్నాలు.. శివాజీనగర: కాంట్రాక్టర్ కేసులో మాజీ మంత్రి ఈశ్వరప్పను అరెస్టు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శనివారం నుంచి వారంరోజుల ఆందోళన ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల 9 బృందాలుగా ఏర్పడి వివిధ జిల్లా, తాలూకా కేంద్రాల్లో ధర్నాలు చేశారు. పాటిల్ కుటుంబానికి పరిహారం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఈశ్వరప్పను అరెస్టు చేసి న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర జిల్లా వ్యాప్తిలో ధర్నా నిర్వహించారు. మంత్రిమండలి నుంచి తొలగింపు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనతో మంత్రి పదవికి కే.ఎస్.ఈశ్వరప్ప రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన ఆ లేఖను సీఎం బొమ్మైకి ఇవ్వగా, అటు నుంచి గవర్నర్ గెహ్లాట్‌కు పంపారు. ఆ మేరకు ఈశ్వరప్పను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలిచ్చారు. -
కర్ణాటక సీఎంపై గవర్నర్‌కు మంత్రి ఫిర్యాదు
బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తీరుపై బుధవారం గవర్నర్ వజూభాయ్ వాలాకు ఫిర్యాదు చేశారు. తన శాఖ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఐదు పేజీల ఫిర్యాదు పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. తన శాఖకు సంబంధించిన పలు పరిపాలనా సంబంధమైన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈశ్వరప్ప చెప్పారు. తనకు తెలియకుండానే తన శాఖ నుంచి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు. యడియూరప్పకు సన్నిహితుడిగా ఈశ్వరప్ప పేరు పొందారు. ఇటీవల ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. -
ముస్లింలకు టిక్కెట్ ఇచ్చే ప్రశ్నే లేదు
సాక్షి,కర్ణాటక: కర్ణాటక బీజేపీ నేత, గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు లోక్‌సభ టికెట్ ఇచ్చేప్రశ్నేలేదంటూ వ్యాఖ్యానించి కొత్త వివాదానికి తెర తీశారు. హిందువులలో ఏ వర్గమైనా పర్వాలేదు. ఎవరికైనా ఇస్తాం..కానీ ముస్లింలకు మాత్రం కచ్చితంగా టికెట్ ఇవ్వమని మంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో బెళగావి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే శాఖసహాయ మంత్రి సురేష్ అంగడీ కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. త్వరలో అక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. బెళగావి ఎంపీ టికెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు కేటాయించే ప్రసక్తిలేదని ఆయన తేల్చి చెప్పారు. బెళగావి హిందూత్వనికి కేంద్రమని ఈ నేపథ్యంలో హిందువేతరులకు, ముఖ్యంగా కురుబ, లింగాయత్, వక్కలింగా, బ్రాహ్మణ కులాలకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ముస్లింలకు టికెట్ ఇచ్చే ప్రశ్న లేదని ఆయన తెగేసి చెప్పారు. గతంలోనూ ఈశ్వరప్ప ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
మంత్రి ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశభక్తులైన ముస్లింలు బీజేపీకే ఓటేస్తారని, పాక్ మద్దతుదారులైన ముస్లింలు మాత్రం ఇతర పారీ్టలకు ఓట్లేస్తారన్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలిచాక కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావాలనుకున్నా ముస్లింల ఓట్లు పోతాయనే రాలేదని తనతో చెప్పారన్నారు. ఇక ముస్లింలు బీజేపీ నమ్మరని, అందుకే వారికి టికిట్లు కేటాయించబోమని లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
ముస్లింలకు టికెట్లు ఇవ్వం
సాక్షి, బెంగుళూర్: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తమను నమ్మరని, అందుకే తాము ముస్లింలకు టికెట్లు ఇవ్వబోమని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. ‘కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది. కాని మీకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం లేదు. కర్ణాటకలో మేము కూడా ముస్లింలకు టికెట్లు ఇవ్వం. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మరు. మమ్మల్ని నమ్మండి.. అప్పుడు మీకు టికెట్లతోపాటు ఏది కావాలంటే అది ఇస్తాం’ అని కర్ణాటకలోని కొప్పల్‌లో కురుబా, ఇతర మైనారిటీవర్గాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరప్ప పేర్కొన్నారు. వెనుకబడిన కురుబా సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరప్ప గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. -
అవసరమైతే అబద్దాలు చెప్పండి!
సాక్షి, బెంగళూరు : ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. గెలుపే ధ్యేయంగా పార్టీలు పనిచేస్తాయి. అవసరమైతే అడ్డదారులు తొక్కేందుకు కూడా సిద్ధపడతాయి. ఇందుకు నిదర్శనమే కర్ణాటక బీజేపీ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు అవసరమైతే అబద్దాలు చెప్పండి.. అని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశారు. కొప్పాల్ ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వచ్చే ఏడాది ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను అందరూ కలుపుకుపోవాలని ఆయన చెప్పారు. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుక్కలా?
సాక్షి, బళ్లారి:బెంగళూరు విధానసౌధలో ఈనెల 25 నుంచి రెండు రోజులు పాటు జరగనున్న వజ్ర మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం బంగారు బిస్కెట్ల అందజేతను విధాన పరిషత్ ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప తీవ్రంగా ఖండించారు. ఆయన సోమవారం బళ్లారి జిల్లా సండూరులోని కుమారస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. విధానసౌధను ఎవరో మహానుభావుడు నిర్మిస్తే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎందుకు బంగారు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సీఎం సిద్ధరామయ్య బంగారు బిస్కెట్లు అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు అతివృష్టితో నానా అవస్థలు పడుతుంటే బంగారు బిస్కెట్లు ఇవ్వడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇందుకు అయ్యే ఖర్చును పేదల అభ్యున్నతికి, కరువు పీడిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని సూచించారు. వజ్ర మహోత్సవాల్లో పంపిణీ చేసే బంగారు బిస్కెట్లను బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీసుకోబోమన్నారు. వజ్ర మహోత్సవాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజా«ధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దుబారా ఖర్చులు చేస్తూ ప్రజా సంక్షేమం విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంజాబ్‌లో రైతులకు రుణ మాఫీ చేసినట్లుగానే కర్ణాటకలో కూడా ఎందుకు సంపూర్ణ రుణ మాఫీ చేయడం లేదని నిలదీశారు. తక్షణం రైతులకు సంపూర్ణ రుణ మాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కడతారని, 150 సీట్లు దక్కించుకుని బీజేపీ విజయ పతాక ఎగర వేస్తుందని జోస్యం చెప్పారు. -
‘బీజేపీ కార్యాలయం ఊడిస్తే టికెట్ ఇస్తాం’
► కర్ణాటక శాసనమండలిలో ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు బెంగళూరు: బీజేపీ కార్యలయంలో ముస్లింలు చెత్త ఊడిస్తే వారికి టికెట్ ఇస్తామంటూ కర్ణాటక శాసనమండలిలో ఆ పార్టీ పక్షనేత కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ హర్షద్ రిజ్వాన్ బీజేపీ ముస్లింలకు ఎన్ని టికెట్లు ఇచ్చిందని ప్రశ్నించారు. దీనికి మా పార్టీ కార్యలయంలో చెత్త ఊడిస్తే ముస్లింలకు టికెట్లు ఇస్తామని ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. ఈ మాటలను అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో సర్దుకున్న ఈశ్వరప్ప ‘మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి చేసింది ఎవరు? జార్జ్ ఫెర్నాండెజ్‌ను కేంద్ర మంత్రిని చేసింది ఎవరు?’అని తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. -
ఈశ్వరప్పా.. ఇవేం మాటలప్పా!
బెంగళూరు: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రశ్నించిన ఓ మహిళా జర్నలిస్ట్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ ముఖ్య నేత కె.ఎస్. ఈశ్వరప్పపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఈశ్వరప్ప వ్యాఖ్యలను నిరసిస్తూ కర్ణాటక మహిళా కాంగ్రెస్, యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరులో భారీ ఆందోళన నిర్వహించారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలతో బీజేపీ మహిళల పట్ల ఎలా ఆలోచిస్తోందో తెలుస్తున్నదని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఈశ్వరప్పతోపాటు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కె.ఎస్.ఈశ్వరప్ప శనివారం ఒక మహిళా జర్నలిస్టుతో మాట్లాడుతూ.. 'ఎవరైనా అత్యాచారం చేస్తే మేమేం చేయగలం? మీరిక్కడ వున్నారు, ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడితే ప్రతిపక్షం ఏం చేస్తుంది?' అని ప్రశ్నించారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలతో కంగుతిన్న జర్నలిస్టులు అక్కడిక్కడే ఆయనకు నిరసన తెలిపారు. అన్ని రాజకీయపక్షాలు ఆ వ్యాఖ్యలను తప్పుపట్టాయి. దీంతో ఈశ్వరప్ప సారీ చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కితీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈశ్వరప్ప ఉదంతానికి కొద్ది రోజుల ముందు కర్ణాటకకే చెందిన కె.జె. జార్జ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇద్దరు పురుషులు ఒక మహిళను రేప్ చేస్తే అది గ్యాంగ్‌రేప్ కాదని, నలుగురైదుగురు చేస్తేనే దాన్ని సామూహిక అత్యాచారం అనాలంటూ రేప్ కు నిర్వచనం ఇచ్చారు. -
దుమారం
కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు గొంతు కలిపిన సొంత పార్టీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ‘యూత్ కాంగ్రెస్’ డిమాండ్ నేనలా అనలేదంటూ మాటమార్చిన కేఎస్ కేఎస్ ఈశ్వరప్పకు నోటి దురద ఎక్కువని మరోసారి రుజువైంది. రాష్ర్టంలో జరుగుతున్న అత్యాచారాలపై ఆయన శుక్రవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కూతురి పైనో, హోం శాఖ మంత్రి కూతురిపైనో అత్యాచారం జరిగి ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు తెలిసొచ్చేది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా స్వపక్షం నుంచీ విమర్శలు గుప్పుమన్నాయి. దీంతో నేనలా అనలేదంటూ కేఎస్ మాటమార్చారు. అత్యాచార ఘటనలపై మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈశ్వరప్ప మాట్లాడుతూ...‘రాష్ట్రంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అత్యాచార ఘటనలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి కూతురి పైనో, హోం శాఖ మంత్రి కూతురిపైనో అత్యాచారం జరిగి ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు తెలిసొచ్చేది. కనీసం అప్పుడైనా అత్యాచారాల నిరోధానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేవారేమో..’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై రాష్ర్ట వ్యాప్తంగా తీవ్ర దుమారమే రేగింది. ఈశ్వరప్ప చేసిన ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీతో పాటు స్వపక్షం నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తాయి. కేఎస్ సంస్కారం తెలిసింది ఈశ్వరప్ప వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలతో ఆయన సంస్కారం ఏపాటిదో తెలిసింది. రాజకీయాల్లో ఇంత అనుభవం ఉండి ఇలా మాట్లాడడం ఏమాత్రం సరికాదు. ఇప్పటికైనా ఈశ్వరప్ప స్థాయికి తగ్గట్టు మాట్లాడడం నేర్చుకోవాలి’ అని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వీఎస్ ఉగ్రప్ప మాట్లాడుతూ...‘ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఆయన గౌరవాన్ని దిగజార్చేవిగా ఉన్నాయి’ అంటూ మండిపడ్డారు. ఇక ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కర్ణాటక యూత్ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో బెంగళూరు, శివమొగ్గ ప్రాంతాల్లోని ఈశ్వరప్ప నివాసాలను ముట్టడించారు. అంతేకాక మైసూరు, తుమకూరు తదితర ప్రాంతాల్లో ఈశ్వరప్ప వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్నాలను నిర్వహించారు. ఈశ్వరప్ప తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. స్వపార్టీ నుంచీ విమర్శలు.. ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు స్వపక్షమైన బీజేపీ నుంచి సైతం విమర్శలు ఎదురయ్యాయి. ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి ఢిల్లీలో స్పందిస్తూ...‘ఈశ్వరప్ప ఇలా మాట్లాడడం సరికాదు. ఆ వ్యాఖ్యలను పార్టీ సమర్థించడం లేదు. అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు మేం పోరాటాన్ని సాగిస్తున్నామే కానీ వ్యక్తిగతంగా ఎవరినీ దూషించడం సరికాదు. ఈ విషయాన్ని మేం ఈశ్వరప్పతో పార్టీ సమావేశంలో కూడా చెబుతాం’ అని పేర్కొన్నారు. నేనలా అనలేదు... ఇక తన వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు స్వపక్షం నుంచి సైతం విమర్శలు రావడంతో ఈశ్వరప్ప మాటమార్చారు. ‘నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి పిల్లలపై నాకు గౌరవం ఉంది. వారిపై అత్యాచారం జరగాలని అనలేదు. అలా జరిగితేనే కళ్లు తెరుస్తారా అన్నాను. నా ఇంటి ముందు ఇలాంటి నిరసనలు మామూలే’ అని పేర్కొన్నారు. -
సుప్రీం ఆదేశాలు తుంగలోకి
- అక్రమ గనుల రద్దుపై ప్రభుత్వం నిర్లక్ష్యం - బీజేపీ ఎమ్మెల్సీ కేఎస్ ఈశ్వరప్ప సాక్షి, బళ్లారి : దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని బీజేపీ ఎమ్మెల్సీ కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. రాష్ట్రంలోని 51 అక్రమ గనుల కంపెనీలను రద్దు చేసి, వాటిని వేలం వేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసి ఏడాది పూర్తి అవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకుండా పోయిందని అన్నారు. ఆ 51 కంపెనీలు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలవి కావడం వల్లనే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక ఎస్పీ సర్కిల్ వద్ద బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పేదలకు అందాల్సిన రూ.1కే కిలోబియ్యం ధనికుల పాలు అవుతోందని, ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. అత్యాచారాల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అత్యాచార ఘటనల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక చట్టం తీసుకువస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపినా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. రాష్ర్టంలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపంచే విషయంపై కాంగ్రెస్ పాలకులు దృష్టి సారించడం లేదని విమర్శించారు. సమష్టి కృషితో కాంగ్రెస్‌ను ఇంటి బాట పట్టిస్తామని అన్నారు. సమావేశంలో మాజీ డీసీఎం అశోక్, మాజీ మంత్రి గోవిందకారజోళ, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, మాజీ ఎంపీ శాంత తదితరులు పాల్గొన్నారు. -
రాష్ర్టంలో బీజేపీ అధికారమే ధ్యేయం
ఆరు నెలల్లో సీఎం కుర్చీ దిగుతారు ఆ గనులను ఎందుకు వేలం వేయలేదో సీఎం స్పష్టం చేయాలి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప సాక్షి, బళ్లారి : కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపి బీజేపీని అధికారంలోకి తేవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప సీఎం సిద్ధరామయ్యపై తీవ్ర విమర్శలు చేశారు. బళ్లారి ఎంపీ శ్రీరాములును అత్యధిక మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపేందుకు నగరంలోని బసవభవన్‌లో గురువారం సాయంత్రం బీజేపీ శాఖ ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి యడ్యూరప్ప, శ్రీరాములు విడిపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తిరిగి వారిద్దరి కృషితో పాటు మోడీ హవా కారణంగా రాష్ర్టంలో తమ పార్టీకి 17 లోక్‌సభ స్థానాలు దక్క డం సంతోషంగా ఉందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు మాత్రమే రావడం ఆపార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన సిద్ధరామయ్య ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్డడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ ఖనిజ తవ్వకాలు సాగించిన 51 కంపెనీలను వేలం వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా.. సీఎం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. గనుల అక్రమార్కులనుంచి సీఎం మామూళ్లు తీసుకుంటున్నందుకే వాటిని వేలం వేయలేదని ఆరోపించారు. గనుల అక్రమాలపై బెంగళూరు నుంచి బళ్లారికి డ్యాన్స్‌లు చేస్తూ పాదయాత్ర చేపట్టిన సిద్దరామయ్య ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మోడీని సిద్ధరామయ్య నరహంతకుడుగా విమర్శించారని, ఇప్పుడు మోడీ ప్రధాని అయ్యారని, దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మోడీ తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం ఆయన స్నేహ హస్తానికి నిదర్శనమన్నారు. త్వరలో సీఎం సిద్ధరామయ్య తన కుర్చీ దిగడం ఖాయమన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో రానున్నట్లు జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం మాత్రమే బీజేపీకి దక్కుతుందన్నారు. దేశాన్ని ఏకతాటిపై తీసుకుని వచ్చిన మోడీని ప్రపంచ దేశాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటక సమగ్రాభివృద్ధికి తామంతా కృతనిశ్చయంతో ఉన్నామని, జాబితా తయారు చేసి ప్రధానమంత్రి వద్దకు వెళ్దామని సీఎం కు సూచించారు. కార్యక్రమంలో బళ్లారి లోక్‌సభ సభ్యుడు బీ.శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, మాజీ ఎంపీలు శాంత, సన్న పక్కీరప్ప, విధాన పరిషత్ సభ్యులు మృ త్యుంజయ జినగ, శశీల్ నమోషీ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, బీజేపీ నాయకులు మహిపాల్, కే.ఎస్.దివాకర్, ఎ.ఎం.సంజయ్, సుధీర్, సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.