
ఈశ్వరప్పకు వచ్చిన లేఖ
సాక్షి, బెంగళూరు: మరోసారి ముస్లింలను తిట్టినా, వారిని గుండాలని అన్నా నీ నాలుకను కోస్తామని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈశ్వరప్పకు ఓ హెచ్చరిక లేఖ వచ్చింది. ముస్లింలను, టిప్పు సుల్తాన్‌ను దూషిస్తే ఊరుకునేది లేదని అందులో కన్నడలో పేర్కొన్నారు. హావేరి జిల్ళా బ్యాడగి తాలూకాలోని మేటె బెన్నూరు కళాశాల భవనం నిర్మాణానికి ముస్లింలు చేసిన సిమెంటు ఇటుకలు కావాలి, కానీ మేం మాత్రం వద్దా?, తోక ఊపొద్దు, నీ నాలుక కట్ చేస్తాము, జాగ్రత్త, హుషార్ అని బెదిరింపులు ఉన్నాయి.
ఈశ్వరప్ప ఆ లేఖను చదివి, దీనిని రాసినవారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరారు. ఎవరో గుర్తు తెలియని వారు లేఖ రాశారు, ఆ లేఖలకు నేను భయపడేది లేదని అన్నారు. లేఖపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
చదవండి: ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
Comments
Please login to add a commentAdd a comment