threat to leader
-
రతన్ టాటాకు బెదిరింపులు
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు బెదిరింపులు వచ్చాయి. రతన్ టాటా ప్రాణానికి ముప్పు పొంచి ఉందని దుండగుడు హెచ్చరించాడు. ముంబయి పోలీస్ కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడని పోలీసులు తెలిపారు. టాటా భద్రతను పెంచాలని లేదంటే ఆయనకు సైరస్ మిస్త్రీ లాగే అవుతుందని బెదిరించినట్లు వెల్లడించారు. బెదిరింపులు రావడంతో రతన్ టాటా భద్రతను పెంచడంతో పాటు ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బెదిరింపు కాల్స్ కర్ణాటక నుంచి వచ్చినట్లు గుర్తించి.. వెంటనే అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు పుణెకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన నిందితుడు పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు దర్యాప్తులో తేల్చారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్తీ గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిస్తీతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్.. హత్య చేస్తామంటూ..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. హత్య చేస్తామంటూ దుండగులు కాల్ చేసి బెదిరించారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. నాగ్‌పూర్‌లోని గడ్కరీ నివాసానికి వచ్చిన ఈ కాల్స్‌కు ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాతో సంబంధం ఉన్నాయని అనుమానిస్తున్నారు. కాగా జనవరి 14నే గడ్కరీ ఆఫీస్ ల్యాండలైన్కు మొదటి బెదిరింపు కాల్ వచ్చింది. నిందితున్ని జయేష్ పుజారి అలియాస్ కాంత అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మొదటికాల్స్లో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌గా పేర్కొంటూ రూ.100 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత మార్చి 21న మరో బెదిరింపు కాల్ చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. లష్క్ర్ ఏ తోయిబాతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితున్ని మార్చి 28న ఊపా చట్టం కింద కేసు నమోదు చేసి నాగ్‌పూర్ జైలుకు తరలించారు. అతను జైళ్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం మరో బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఎన్ఐఏ టీం నాగ్‌పుర్ చేరింది. దర్యాప్తును ప్రారంభించింది. చదవండి: విద్యార్థిగా మారిన మోస్ట్ వాంటెడ్ నక్సల్.. చరిత్ర సృష్టించింది -
చంపేస్తామంటూ కేంద్రమంత్రికి బెదిరింపు కాల్.. ఈ ఏడాదిలో రెండోసారి
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సోమవారం ఢిల్లీలోని గడ్కరీ నివాసానికి ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంత్రి కార్యాలయం నుంచి నితిన్ గడ్కరీకి ప్రాణహాని ఉన్నట్లు తమకు ఫిర్యాదు అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వివరాల ఆధారంగా ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా నితిన్ గడ్కరీకి తన కార్యాలయంలో హత్య బెదిరింపు కాల్స్ రావడం ఈ ఏడాది ఇది రెండోసారి. అంతకుముందు జనవరిలో, మహారాష్ట్రలోని అతని నివాసం, కార్యాలయానికి అలాంటి కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావిలో జైలులో ఉన్న వ్యక్తిగా గుర్తించామని నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. చదవండి: షాకిచ్చిన ఓటర్లు.. మృతి చెందిన అభ్యర్థికి తిరుగులేని విజయం -
‘ఏక్నాథ్ షిండేను లేపేస్తా’.. మహారాష్ట్ర సీఎంకు బెదిరింపు కాల్..
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు బెదిరింపు ఫోన్ చేసిన వ్యక్తిని కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆగంతకుడు మద్యం మత్తులో ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు ఆగంతకున్ని మంగళవారం అదుపులోకి తీసుకుని జైలులో వేశారు. సోమవారం సాయంత్రం అత్యవసర హెల్ప్‌లైన్ నంబరు 112కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అందులో నేను ‘ఏక్నాథ్ షిండేను లేపేస్తా’ అంటూ కేవలం ఒకే మాట మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరాతీశారు. ముంబైలోని ధారావి ప్రాంతానికి చెందిన రాజేశ్ ఆగవ్ణే అనే యువకుడి నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించారు. కానీ ముంబై క్రైం బ్రాంచ్‌కు చెందిన ఓ బృందం అక్కడికి వెళ్లేసరికి ఇంట్లో రాజేశ్ లేడు. ఆ తర్వాత అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ లోకేషన్‌ను ట్రేస్ చేయగా పుణేలోని వారజే పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పుణే పోలీసులు, నాగ్‌పూర్ ఏటీఎస్ బృందం అక్కడికి వెళ్లి రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇది కొత్తేమీ కాదు..! మహారాష్ట్రలో బెదిరింపు ఫోన్లు రావడం కొత్తేమీ కాదు. ఇలాగే తరుచూ అనేక మంది మంత్రులకు, రాజకీయ నాయకులకు, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటి ముందు బాంబు పెట్టామని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మూడుసార్లు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్‌కు, మాజీ సీఎం అశోక్ చవాన్, మాజీ మంత్రులు జితేంద్ర అవ్హాడ్, సంజయ్‌రౌత్, బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ తదితర ప్రముఖులకు బెదిరింపు ఫోన్లు రావడం కలకలం రేపుతోంది. తాజాగా సీఎం షిందేకు బెదిరింపు ఫోన్ రావడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆందోళనకు గురి చేస్తోంది. -
తీవ్ర హెచ్చరిక.. జాగ్రత్తగా వినండి సీఎం.. మధ్యలో వచ్చి బలికావొద్దు!
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ సంఘం నేత గురుపత్వాన్ సింగ్ పన్నూ సీఎంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అస్సాం జర్నలిస్టులకు కాల్ చేసి ముఖ్యమంత్రిని బెదిరించాడు. పంజాబ్‌లో ఖలిస్తాన్ వేర్పాటు వాది, అమృత్‌పాల్ సింగ్ కోసం గాలింపు కొనసాగుతున్న వేళ అస్సాం సీఎంకు బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. ‘ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులను అస్సాంలో నిర్భంధించి హింసిస్తున్నారు. జాగ్రత్తగా వినండి సీఎం శర్మ.. ఇక్కడ పోరాటం ఖలిస్తాన్ అనుకూల సిక్కులకు.. భారత ప్రభుత్వానికి మధ్య జరుగుతోంది. అనవసరంగా ఈ హింసలో మీరు బలికావద్దు’ అని హెచ్చరించాడు. అలాగే ‘మేము ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ మేరకు శాంతియుత ప్రజాస్వామ్య పద్దతిలో భారత ఆక్రమణ నుంచి పంజాబ్‌ను విముక్తి చేయాలని కోరుతున్నాం. మీ ప్రభుత్వం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న అమృతపాల్ మద్దతురాలైన ఆరుగురుని ఖైదీలుగా మార్చి వేధింపులకు గురిచేస్తోంది. మీరు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పన్నూ ఫోన్లో బెదిరించాడు. కాగా వారిస్ పంజాద్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులకు చిక్కిన్నట్లే చిక్కి వేషాలు, వాహనాలు మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు వందలాది ఖలిస్తాన్ మద్దతుదారులు, అమృత్‌పాల్ సహాయకులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే భద్రతా కారణాల రీత్యా అతడి ఆరుగురు సహాకులను అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. చదవండి: అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు..! -
Tamil Nadu: అంబేద్కర్ పేరు పలకని గవర్నర్.. డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసెంబ్లీ ప్రసంగ పాఠాన్ని గవర్నర్ మార్చి ప్రసంగించారు. ప్రసంగంలో బీఆర్ అంబేద్కర్, పెరియార్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి ప్రముఖుల పేర్లను దాటవేస్తూ కొత్త వ్యాఖ్యలను జోడించారు. ప్రసంగ పాఠంలో మార్పులను గుర్తించిన సీఎం స్టాలిన్.. దీనిపై అభ్యంతరం తెలియజేయగానే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ వివాదం ఆరోజు నుంచి రగులుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న గవర్నర్ ప్రవర్తనపై తమిళనాడుతో సహా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్త వాజీ కృష్ణమూర్తి గవర్నర్ ఆర్ఎన్ రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్ అంబేద్కర్ పేరు చెప్పలేకపోతే అతను కశ్మీర్ వెళ్లాలని, అక్కడికి ఉగ్రవాదులను పంపుతామని, వారు ఆయన్ను కాల్చి చంపుతారని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ‘భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన పితామహుడు అంబేద్కర్ పేరును ఈ వ్యక్తి ఉచ్చరించడానికి నిరాకరిస్తే, ఆయనను చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా లేదా?. అసలు గవర్నర్ రాజ్యాంగం పేరుతో ప్రమాణం చేయలేదా? దాన్ని రాసింది అంబేద్కర్ కాదా.. రాజ్యాంగం మీదనే ప్రమణం చేస్తే ప్రసంగంలోని అంబేద్కర్ పేరును ఎందుకు చదవలేదు. అంబేద్కర్ పేరు చెప్పకపోతే కాశ్మీర్‌కు వెళ్లిపో.. మేమే ఓ ఉగ్రవాదిని పంపిస్తాం.. వారు మిమ్మల్ని తుపాకీతో కాల్చిచంపగలరు’ అని డీఎంకే కార్యకర్త శివాజీ కృష్ణమూర్తి అన్నారు. చదవండి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు.. If he (TN Gov RN Ravi) refuses to utter the name of Ambedkar in his Assembly speech, don't I have the right to assault him? If you (Gov) don't read out the speech given by Govt, go to Kashmir&we'll send terrorists so that they'll gun you down: DMK's Shivaji Krishnamoorthy (12.01) pic.twitter.com/OvcuauylVw — ANI (@ANI) January 13, 2023 మరోవైపు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గవర్నర్‌పై బెదిరింపు వ్యాఖ్యలపై రాజ్ భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎంకేకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పై శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోందని చెన్నై సీపీకి రాసిన లేఖలో రాజ్ భవన్ పేర్కొంది. ఈ వీడియోలో శివాజీ కృష్ణమూర్తి గవర్నర్‌పై దుర్భాషలాడటంతో పాటు, పరువు నష్టం కలిగించే విధంగా భయపెట్టే పదజాలాన్ని ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా శివాజీ కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ఫిర్యాదును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ విభాగానికి పంపారు. -
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్..
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆయన కార్యాలయానికి ఫోన్ చేసిన దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. 10 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు ఫోన్ చేశారు. శనివారం ఉదయం 11.30, 11.40 గంటలకు దుండగుల నుంచి ఫోన్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇది ఆకతాయి పని అయి ఉంటుందా? లేక ఎవరైనా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుండగుడు ఉపయోగించిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: 900 కిమీ దూరం.. గంటల వ్యవధిలోనే చనిపోయిన కవల సోదరులు.. -
ఉక్రెయిన్‌కు రష్యా హెచ్చరిక.. లేదంటే మేమే చేసి చూపిస్తాం!
కీవ్: దురాక్రమణ, దాడులతో ఉక్రెయిన్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్న రష్యా మరోమారు హెచ్చరికలు చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ హెచ్చరికలు చేసినట్లు రష్యా అధికారిక టాస్ న్యూజ్ ఏజెన్సీ వెల్లడించింది. ‘ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందనేది ఉక్రెయిన్, దాని మిత్రదేశం అమెరికా వైఖరిపైనే ఆధారపడి ఉంది. ఉక్రెయిన్ను నిస్సైనికీకరణ(డీమిలిటరైజ్) చేయండి. నాజీయిజానికి స్వస్తిపలకండి. రష్యాకు సైనిక ముప్పు లేకుండా చూడండి. లేదంటే రష్యా సైన్యమే ఇదంతా చేసి చూపిస్తుంది’ అని లావ్రోవ్ హెచ్చరించారు. రష్యా నేరుగా కలగజేసుకోకుండా ఉంటే వచ్చే రెండు నెలల్లోపు ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో శాంతి చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ప్రకటించిన మరుసటి రోజే అందుకు భిన్నమైన వాదన రష్యా లేవనెత్తడం గమనార్హం. చదవండి: చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు -
'ఆ నలుగురు' ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్.. 4 ఠాణాల్లో ఫిర్యాదులు..
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసుకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ మేరకు వారు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఫిర్యాదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఘట్కేసర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గచ్చిబౌలి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బంజారాహిల్స్ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌ను కలిసిన రోహిత్ రెడ్డి తనకు ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 11 ఫోన్ నంబర్ల నుంచి తరచూ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో దూషిçస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఆరుకు చేరిన కేసుల సంఖ్య ఫామ్‌హౌస్ ఘటనలో ప్రధాన, అనుబంధ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ‘ఎర’కు సంబంధించిన ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలపై మొయినాబాద్ ఠాణాలో నమోదైన కేసు మొదటిది కాగా.. ఆ తర్వాత రామచంద్రభారతి రెండేసి ఆధార్, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగి ఉన్నాడంటూ బంజారాహిల్స్‌లో మరో కేసు నమోదయింది. తాజాగా నమోదైన నాలుగు కేసులతో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది. రోహిత్‌రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఎమ్మెల్యే ఇంటికెళ్లిన అధికారులు రెమా రాజేశ్వరి, కల్మేశ్వర్ శింగేనవర్.. నిందితులు ఆయన్ను ఎలా సంప్రదించారు? పార్టీ మారితే ఏం ఇస్తామని ఆఫర్ చేశారని ప్రశ్నించి..ఆ మేరకు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
తోక ఊపోద్దు, నాలుక కోస్తాం.. ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ
సాక్షి, బెంగళూరు: మరోసారి ముస్లింలను తిట్టినా, వారిని గుండాలని అన్నా నీ నాలుకను కోస్తామని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈశ్వరప్పకు ఓ హెచ్చరిక లేఖ వచ్చింది. ముస్లింలను, టిప్పు సుల్తాన్‌ను దూషిస్తే ఊరుకునేది లేదని అందులో కన్నడలో పేర్కొన్నారు. హావేరి జిల్ళా బ్యాడగి తాలూకాలోని మేటె బెన్నూరు కళాశాల భవనం నిర్మాణానికి ముస్లింలు చేసిన సిమెంటు ఇటుకలు కావాలి, కానీ మేం మాత్రం వద్దా?, తోక ఊపొద్దు, నీ నాలుక కట్ చేస్తాము, జాగ్రత్త, హుషార్ అని బెదిరింపులు ఉన్నాయి. ఈశ్వరప్ప ఆ లేఖను చదివి, దీనిని రాసినవారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరారు. ఎవరో గుర్తు తెలియని వారు లేఖ రాశారు, ఆ లేఖలకు నేను భయపడేది లేదని అన్నారు. లేఖపై పోలీసులు విచారణ ప్రారంభించారు. చదవండి: ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు -
ప్రతీకారం తీర్చుకుంటాం.. మంత్రికి మావోయిస్టుల బెదిరింపు లేఖ
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా మంత్రిని టార్గెట్ చేసి బెదిరింపు లేఖను పంపించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వివరాల ప్రకారం.. గడ్చిరోలి జిల్లాలో తమ కార్యకర్తలను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండేకు మావోయిస్టులు బెదిరింపు లేఖను పంపారు. బెదిరింపు లేఖ కలకలం రేపడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయన నివాసం వద్ద పోలీసులు నిఘాను పెంచారు. ఈ లేఖకు సంబంధించి థానే పోలీసులకు అందిన ఫిర్యాదును దర్యాప్తు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: దేవతలు నడయాడే భూమిని అవమానిస్తే మీరు సహిస్తారా? ఈ సందర్భంగా మంత్రి షిండే మాట్లాడుతూ.. ఇంతకు ముందు కూడా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. గడ్చిరోలికి మంత్రిగా ఉన్న తాను అక్కడున్న ప్రజలను కాపాడటమే కాకుండా.. జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులతో పోరాడాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక్కటే మార్గం షిండే సూచించారు. ఇదిలా ఉండగా.. గతేడాది నవంబర్‌లో గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల టాప్ కమాండర్‌తో సహా 26 మంది నక్సల్స్ హతమయ్యారు. చదవండి: కేజ్రీవాల్‌ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ.. -
Maharashtra: సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రేకు బెదిరింపులు..
సాక్షి, ముంబై, బెంగళూరు: మహారాష్ట్ర సీఎం కుమారుడు, పర్యాటక– పర్యావరణ మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేను బెదిరించిన కేసులో ముంబై పోలీసులు గురువారం బెంగళూరులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తి జైసింగ్ రాజపుత్‌గా గుర్తించారు. ఇతడిని ముంబై క్రైం బ్రాంచ్ సైబర్ విభాగం పోలీసులు అరెస్ట్‌చేసి ముంబైకి తీసుకెళ్లారు. కాగా ఈ నెల 8వ తేదీన మంత్రికి జైసింగ్ ఫోన్ చేశాడు. మంత్రి ఫోన్ తీయకపోవడంతో రాజపుత్ ప్రాణహాని బెదిరింపులతో మళ్లీ మెసేజ్ పంపించాడు. ఈ నేపథ్యంలో నిందితున్ని గురువారం అరెస్ట్ చేశారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కు ఇతడు అభిమాని అని, ఆ ఘటనకు సంబంధించి బెదిరింపు సందేశాలను పంపినట్లు తెలిసింది. చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. చదవండి: ‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్ -
కమల హ్యారీస్ హత్య కుట్ర భగ్నం: రూ.40 లక్షలకు ఒప్పందం
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ హత్యకు కుట్ర పన్నింది ఓ మహిళ. అయితే చివరకు ఆమె కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను జైలుకు పంపించారు. ఈ వార్త అమెరికాలో కలకలం రేపింది. అయితే కమలా హత్యకు ఆమె ఏకంగా దాదాపు అరకోటి వరకు సుపారీ తీసుకుంది. కమలా హత్యకు కుట్రకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. నిందితురాలిని మియామి ఫెడరల్ కోర్టులో హాజరుపరచగా పలు విస్తుగొల్పే విషయాలు వెల్లడయ్యాయి. చదవండి: కొత్త ట్విస్ట్.. ‘ఆ బిడ్డ నాకు పుట్టలేదు! డీఎన్ఏ టెస్ట్ చేయండి’ దక్షిణ ఫ్లోరిడాకు చెందిన మహిళ నివియన్ పెటిట్ ఫెల్ప్స్ (39) ఫిబ్రవరిలో కమల హత్యకు కుట్ర పన్నింది. 53 వేల డాలర్ల (సుమారు రూ.39 లక్షలు)కు కమలను హత్య చేసేందుకు ఆమె ఒకరితో ఒప్పందం కుదుర్చుకుంది. 50 రోజుల్లోనే ఆమెను హత్య చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే ఆ విషయాలను మాట్లాడుతూ వీడియో తీసుకుంది. అయితే ఆ వీడియోను ఇతరులకు పంపడం ఆమె చేసిన పెద్ద తప్పిదం. దీంతో ఆమె కుట్ర నిఘా వర్గాలకు తెలిసిపోయింది. నిఘా వర్గాలు ఆ వీడియోను పరిశీలించిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మియామీ న్యాయస్థానంలో నిందితురాలిని హాజరుపరిచారు. కమల హ్యారీస్‌ను హత్య చేస్తానని ఆరుసార్లు హెచ్చరికలు పంపింది. కమల హత్యకు ఆమె తుపాకీ లైసెన్స్ అనుమతికి దరఖాస్తు చేసుకున్నది కూడా. ఈ కేసులో విచారణ అనంతరం నివియన్కు ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. చదవండి: బెడ్రూమ్లోకి వెళ్తే వద్దంటుండు: భర్తపై భార్య ఫిర్యాదు హత్యకు కుట్ర పన్నిన మహిళ నివియన్ పెటిట్ ఫెల్ప్స్ -
చంద్రబాబు నుంచి ప్రాణ హాని..
తిరుపతి క్రైం: ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్ల తనకు ప్రాణ హాని ఉందని టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపేస్తామని తెలుగుదేశం ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. మంగళవారం రాత్రి ఆయన తిరుపతి వెస్టు పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా తాను తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేశానన్నారు. అయితే చంద్రబాబు, అచ్చెన్నాయుడు గుర్తించక పోవడమే కాకుండా చిన్నపాటి సహాయం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈయన ఇంకా ఏమన్నారంటే.. ►చంద్రబాబుకు, అచ్చెన్నాయుడుకు అత్యంత సన్నిహితుడైన కేఎల్ నారాయణ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్‌లోని నా 400 గజాల భూమిని కబ్జా చేశాడు. దీనిపై చంద్రబాబుతో పాటు బాలకృష్ణకు కూడా పలుమార్లు మొర పెట్టుకున్నాను. ►చంద్రబాబు ఒక మాట చెబితే నా భూమి నాకు నిమిషాల్లో వస్తుంది. అయితే ఆయన ఆ మాట చెప్పకుండా కబ్జాదారులతో కుమ్మక్కు అయ్యారు. ఈ విషయంపై మరో మారు విన్నవిద్దామని సోమవారం తిరుపతిలో జరిగిన ప్రచార సభకు హాజరయ్యాను. ►పలు మార్లు చంద్రబాబునాయుడును పిలిచినా కూడా చూసీ చూడనట్టు వ్యవహరించడంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఈ క్రమంలో నిరసన తెలియజేసేందుకు చొక్కా విప్పి విసిరేశాను. అయినా కూడా పట్టించుకోక పోవడంతో ముందుకెళ్లి నిలదీశాను. తనకు ఏమీ పట్టనట్టుగా అభివాదం చేస్తూ తప్పించుకుని పారిపోయాడు. ►చంద్రబాబు వెనుక ఉన్న రామ్మోహన్నాయుడు ‘అన్నా నేను నీతో మాట్లాడుతా’ అని నన్ను నమ్మించే ప్రయత్నం చేశారు. చొక్కా విసరడం అందరూ చూడడంతో ఆ సంఘటనను పెడదారి పట్టించేందుకే చంద్రబాబుపై రాళ్లు పడ్డాయంటూ కొద్దిసేపటికే కొత్త డ్రామా ప్రారంభించారు. ►బాబుపై ఎలాంటి రాళ్లూ పడలేదు. బాబు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం సహజమే. నేను 30 సంవత్సరాలుగా టీడీపీలోనే ఉంటూ ఒకసారి జూబ్లీ హిల్స్‌లో కార్పొరేటర్‌గా కూడా పోటీ చేశాను. ఈ పరిస్థితిలో చంద్రబాబు వల్ల నాకు ప్రాణ హాని ఉంది. మరోవైపు టీడీపీ ముఖ్య నాయకులు చంపేస్తామని ఫోన్లు చేస్తున్నారు. అందుకే నాకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నారా లోకేష్‌ను ఏదైనా సాయం చేయమని కోరితే ఇంటిల్లిపాది కట్టకట్టుకుని చావమంటూ సలహా ఇచ్చారు. వీరిని నమ్మి ఎవరూ మోసపోవద్దు. చదవండి: 17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు ఓటమి భయంతోనే రాళ్ల దాడి డ్రామా -
మోదీతో పాటు నిన్ను చంపేస్తాం: ఎమ్మెల్యేకు పాక్ నుంచి బెదిరింపులు
లక్నో: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు నిన్ను చంపేస్తామని తనకు బెదిరింపులు వచ్చాయని ఓ బీజేపీ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించింది. తనకు ప్రాణాపాయం పొంచి ఉందని.. భద్రత కల్పించాలని ఆ మహిళా ఎమ్మెల్యే పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఆమె ఎటావా సదర్ నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధి జాయింట్ కమిటీ ఎటావా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె కుటుంబంతో పాటు ఆమెను చంపేస్తామని బెదిరింపులతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీనియర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులను చంపేస్తామని తనకు వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు వచ్చాయని ఎమ్మెల్యే సరితా భదౌరియా సోమవారం తెలిపారు. పాక్ గూఢచార సంస్థ ఎస్ఐఎస్ లోగోతో వాట్సాప్‌లో సందేశాలు వచ్చాయని పోలీసులకు వివరించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తొలి సందేశం రాగా ఆ తర్వాత వరుస పెట్టి సందేశాలు వచ్చాయని వెల్లడించింది. ఆదివారం ఉదయం వరకు ఎమ్మెల్యేతో పాటు ప్రధాని, బీజేపీ సీనియర్, ఆర్ఎస్ఎస్ నేతలను చంపేస్తామంటూ 8 సందేశాలు వచ్చాయని పోలీసులకు ఆమె తెలిపింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఎటావా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆకాశ్ తోమర్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేకు వాట్సాప్‌లో వచ్చిన బెదిరింపు మెసేజ్‌లు పరిశీలించినట్లు తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన +92 సిరీస్‌తో ప్రారంభమైన మొబైల్ నంబర్ నుంచి సందేశాలు వచ్చాయని, వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సరితా భదౌరియా 1999లో భర్త అభయ్ వీర్ సింగ్ భదౌరియా హత్యానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. -
చంపుతామంటున్నారు..
కోల్‌కతా: సోషల్ మీడియా ద్వారా తనకు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని, అందువల్ల రక్షణ కల్పించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, నటి నుస్రాత్ జహాన్ భారత హై కమిషన్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె బెంగాలీ సినిమా షూటింగ్ లో భాగంగా లండన్‌లో ఉన్నారు. దుర్గా అమ్మవారి రూపంతో మహిషాసురమర్థినిలా త్రిశూలం పట్టుకొని తీసిన ఓ వీడియోను పోస్ట్ చేశాక బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా సాధారణంగానే ఆమెకు భద్రత ఉంటుంది. అయితే బెదిరింపుల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, విదేశాంగ శాఖల ద్వారాఅదనపు భద్రత కూడా ఏర్పాటైనట్లు సమాచారం అందింది. తనకు రక్షణ కావాలంటూ భారత హైకమిషన్ కు రాసిన లేఖలో ఆమెకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఉంచినట్లు తెలిపారు. సింధూరం ధరించడం వంటి చర్యల కారణంగా గతంలో ఆమెను కొందరు ముస్లింలు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: యూపీ నిర్భయ పట్ల అమానవీయం) -
సానుభూతి చిట్కాతో ఓట్లు రాలవు
కాళ్లకింది భూమి కదిలిపోతున్న ప్రమాద ఘంటికలు మోగినప్పుడల్లా పాలకులు సానుభూతి నాటకాలకు తెర తీసి పబ్బం గడుపుకుంటున్న వైనం భారత రాజకీయాలకు కొత్తేమీ కాదు. మోదీ హత్యకు మావోయిస్టుల కుట్ర అంటూ కేంద్ర స్థాయిలో ఇప్పుడు లేఖ మిషతో జరుగుతున్న ప్రచారం కానీ, తనపై కేంద్రం దాడి చేయవచ్చు కాబట్టి నాచుట్టూ రక్షక కవచంలా ఉండి కాపాడుకోండి అంటూ చంద్రబాబు ఆడుతున్న నాటకం కానీ పాలకవర్గ రాజకీయాల్లో, వారి పన్నాగాల్లో భాగమే. కానీ సానుభూతి కోసం తీసుకొస్తున్న ఈ గోసాయి చిట్కాలతో ఓట్లు రాలవన్నది చరిత్ర పదేపదే చెప్పిన సత్యం. ఇటీవల ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల వ్యతిరేక చట్టం దుర్వినియోగం అవుతోందనీ, దాన్ని పునఃసమీక్షించాలనీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సహజంగానే అణగారిన ప్రజాసమూహాల్లో దేశవ్యాప్తంగా ఆగ్రహాందోళనలు పెల్లుబికాయి. దేశంలో ఆ చట్టం కింద నమోదైన కేసులలో కేవలం 7 శాతం సందర్భాలలోనే శిక్షలు పడుతుంటే, సుప్రీంకోర్టు ఉత్తర్వు ఎస్సీ, ఎస్టీలకున్న కనీస హక్కును సైతం నీరు గార్చడమేనన్న వారి ఆగ్రహాన్ని అర్థం చేసుకోవలసిందే. డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ తదితర దళిత నేతల ఆధ్వర్యంలో పుణేలో ఆ ఉద్య మం తీవ్ర రూపం దాల్చింది. పాలకులు, పోలీసుల పెడధోరణితో అది హింసాత్మకంగా మారి 9 మంది ఉద్యమకారులను బలిగొన్నది. ఆ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు ఆనాటి తమ సోదాల్లో ఒక లేఖ దొరికినట్లు ఇటీవలే ప్రకటించారు. అది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియాలో విశేష ప్రాచుర్యం పొందింది. దేశ ప్రధాని మోదీని హత్య చేయవలసిందిగా మావోయిస్టు పార్టీ నేత ఒకరు ప్రకాశ్ అంబేడ్కర్‌ను, అలాగే తన పార్టీని ప్రేరేపిస్తూ రాసినట్లున్న లేఖ అది. ఆ లేఖలో ‘రాజీవ్ గాంధీని హతమార్చిన రీతిలో (మానవ బాంబు ప్రయోగం) చేయాలని’ కూడా ఆ లేఖ కుడు సూచించి ఉన్నారు. మోదీని హత్య చేసే కుట్రలో మావోయిస్టులను, వారికి సహకరిస్తున్న పట్టణాలలోని మావోయిస్టుల పక్షపాతులైన మేధావులు, పౌరహక్కుల సంఘాల కార్యకర్తలను మాత్రమే కాకుండా కొత్తగా ప్రకాశ్ అంబేడ్కర్ వంటి దళిత నేతలను కూడా భాగస్వాములుగా ఈ లేఖ చిత్రీకరిస్తున్నది. ఒకవైపు నిత్యం అంబేడ్కర్ పేరును జపిస్తూ, పెద్దపెద్ద విగ్రహాలు నిర్మిస్తూ, తాము దళిత, గిరిజన, ఆదివాసీ శ్రేయోభిలాషులమని, ప్రచారం చేసుకునే మోదీ శిష్య బృందం అంబేడ్కర్ అనుయాయులను, వ్యక్తిగత హింసావాదులుగా చిత్రీకరించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట! పైగా మన రాష్ట్రంలో పౌరహక్కుల నేత అయిన వరవరరావు పేరు కూడా ఆ లేఖలో ప్రస్తావన రావడం చూస్తుంటే బీజేపీ, మోదీ యంత్రాంగం ఎంత చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నదో మరింత స్పష్టంగా అర్థం అవుతున్నది. ఇది ఇటీవల కర్ణాటకలోనూ, ఆ తర్వాత పార్లమెంటుకు, అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలలో మోదీకి జరిగిన గర్వభంగం నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు ఎన్డీయే పాలకుల ఎత్తుగడ అనే సందేహం వెలిబుచ్చేవారిని న్యాయంగానైతే అనుమానించాల్సిన అవసరం లేదు. ఈ లేఖలో వరవరరావును కలవండి అనీ, ఇంత పైకం (8 కోట్లు) ఖర్చవుతుందని, ఇన్ని బుల్లెట్లు కావాలి (40 లక్షల రూపాయలు) అనీ ఇన్ని వివరాలు మావోయిస్టు నేతలు రాస్తారనే విషయం సామాన్యుల ఊహకు కూడా అందనిది. ఇదంతా వరవరరావును ‘వదిలించుకునే’ ఎన్డీఏ పన్నాగంలో భాగమే అనిపించట్లేదా? ప్రత్యేకంగా మోదీ పాలనలో, ఈ రకమైన సానుభూతి కోసం జరిగే ప్రయత్నాలు మనం నిత్యం చూస్తున్నవే. పెద్దనోట్ల రద్దు సందర్భంగా మోదీ తన ఉపన్యాసాలలో, నా చర్య వల్ల నల్లధనాన్ని కోట్లాదిగా దాచుకున్న వారినుంచి నా ప్రాణానికి సైతం ప్రమాదం రావచ్చని బహిరంగ సభలో చెప్పిన విషయం మనకు గుర్తుండే ఉంటుంది. కానీ ఆయనపై అలాంటి హత్యాప్రయత్నం ఏదీ జరగలేదు. కానీ బ్యాంకులలో దాచుకున్న తమ పైకం, తాము తీసుకుని వాడుకోడానికి ఏటీఎంల వద్ద, క్యూలలో నిలబడిన వందమందికి పైగా సాధారణ జనం ప్రాణాలు వదిలారు. గుజరాత్ ఎన్నికలలో గెలిచేం దుకు తన ప్రాణాలకు ముప్పు గురించి ప్రస్తావిస్తూ గతంలోనూ మోదీ ఈ భావోద్వేగాన్ని ప్రదర్శించినదీ మనమెరిగిందే. ఎన్డీఏలో భాగస్వామిగా మోదీతో నాలుగేళ్లు అంటకాగిన సీఎం బాబు సైతం ఇటీవల ఒక కొత్త రాగం అందుకున్నారు. ‘నాపై కేంద్రం కుట్ర పన్నుతోంది. నాకేమైనా జరగొచ్చు. కేంద్రం నాపై కేసులు పెట్టో, జైల్లో పెట్టో, ఏదోవిధంగా దాడి చేయవచ్చు. ప్రజలారా, నాకు మీరంతా అండగా ఉండాలి. నా చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి మీరే నన్ను రక్షించుకోవాలి. నేను బాగుంటే మీరు బాగున్నట్లే. నాకేదన్నా నష్టం జరిగితే అది మీకు జరిగినట్లే’ అంటూ ఇటీవల తానే కొత్త పల్లవినొకదాన్ని ఎత్తుకోవడం మనం చూస్తున్నదే కదా. ఇలా ప్రజల దృష్టి మళ్లించడంలోనూ, అవసరార్థం అవకాశవాదంగా వ్యవహరించడం అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రజలను మోసం చేయడం ఇత్యాది విద్యలతో అటు మోదీ, ఇటు బాబు ఒకరిని మించిన వారొకరు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అలాగే విభజన సమయం నాటి హామీలు నెరవేర్చకుండా ఇన్నేళ్లు అవిభక్త కవలలుగా వ్యవహరించిన ఈ తోడుదొంగలిద్దరూ, తీరా ఎన్నికలు వచ్చేసరికి, లాలూచీ కుస్తీ లాగా పరస్పరం నాటకమాడటం మనం చూస్తున్నదే. ఈ సందర్భంగా మావోయిస్టులకు, సాధారణంగా కమ్యూనిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి. బాబుపై అలిపిరిలో నక్సలైట్లు 2003లో దాడి చేశారు. ఆ దాడినుంచి బాబు ఆయన మాట ల్లోనే చెప్పాలంటే వెంకన్న దయతో అమరావతి రాజ ధాని నిర్మాణ కర్తవ్యం పూర్తి చేసేందుకే బయటపడ్డానంటున్నారు. అప్పుడే నక్సలైట్లకు ఒక వ్యాసంలో ‘ఎందుకీ అనవసరమైన హత్యా రాజకీయాలు? వ్యక్తిగత హత్యలు సమస్యను పరిష్కరించలేవు. ఎటూ బాబు రానున్న ఎన్నికలలో కచ్చితంగా పరాజయం పొందనున్నారు. మీ అనాలోచిత చర్యవల్ల బాబుకు అదనంగా కొన్ని సానుభూతి ఓట్లు రావచ్చు. ఇలాంటి చర్యలు గర్హనీయం’ అని హెచ్చరించాను. అదే సమయంలో అటు మోదీ, ఇటు బాబు కూడా గుర్తుంచుకోవలసింది ఒకటుంది. అలిపిరి ఘటన తర్వాత జరిగిన ఎన్నికల్లో బాబు పట్ల సానుభూతి పవనాలేవీ బాబును ఓటమినుంచి రక్షించలేదు. ప్రజలు ఆయనను ఓడించి వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు. అప్పటిదాకా టీడీపీతో పొత్తు ఉన్న వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీని కూడా ప్రజలు ఓడించారు. కనుక, ఈ సానుభూతి గోసాయి చిట్కాలు ప్రజావ్యతిరేకత ముందు నిలబడలేవు. అలాగే వరవరరావును, ఇతర ప్రజానుకూల మేధావులను, దళిత నేతలను వారి వారి రాజ కీయ దృక్పథాలతో విభేదాలు ఉండినా, వెంటాడి వేధించేందుకు పాలకులు పన్నుతున్న కుట్రలను వ్యతిరేకించడం సాధారణ మానవత, సంస్కారం కలవారందరి కర్తవ్యం. ఏది ఏమైనా ఈ లేఖ కమ్యూనిస్టులమనుకునే వారందరి కళ్లు తెరిపించాలి. ఇక్కడ పాలకులు శ్రామికవర్గ పోరాట శక్తులను సామాజిక అణచివేతకు గురవుతున్న ప్రజాసంఘాలను కలిపి, హంతకులుగా చిత్రించే యత్నం చేస్తున్నారన్న వాస్తవం గుర్తించాలి. దీనిని ఎదుర్కొనడానికి మార్క్సిస్టు పార్టీలు అణగారిన ప్రజాసమూహాల నేతలు, ఐక్యమై పోరాడటమే మార్గం. లాల్ నీల్ నినాదం ఆచరణ రూపం దాల్చాలి. ఇందుకు తెలంగాణలో ఏర్పడిన, బహుజన వామపక్ష సంఘటన ఒక మంచి ఉదాహరణ. ఆచరణలో దేశవ్యాప్తంగా అలాంటి కృషి జరగాలి. మన సిద్ధాంతాలు, తీర్మానాలు విస్తృత ప్రజానీకం నుంచి మనం వేరుపడేందుకు తావివ్వరాదని మావోయిస్టులైనా, సాంప్రదాయ మార్క్సిస్టు పార్టీలైనా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఏపీనే తీసుకుందాం. అక్కడ ప్రధానంగా వైఎస్సార్సీపీ ఒకవైపు ప్రత్యేక హోదా పట్ల, ఏపీ సమస్యల పట్ల ప్రజా చైతన్యాన్ని పెంచుతూ, ప్రజా ఉద్యమాలను నిర్వహించే ప్రధాన పార్టీగా ఉంది. మరోవైపు ప్రజావ్యతిరేక నయవంచన పార్టీలుగా బాబు నాయకత్వాన టీడీపీ (వెన్నుపోటు), మతతత్వ మోదీ పార్టీ ఉన్నాయి. తమ శక్త్యానుసారం ఏదో ఒక మోతాదులో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న వామపక్ష పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి వంటివి ఉన్నాయి. మరోవైపు తాను బాబు చేతిలో మోసపోయానంటూ ప్రజలకోసమే జనసేన అంటున్న పవన్ కల్యాణ్ ఉన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కలిసి వచ్చేవారందరితో కలిసి పోరాడటం వామపక్షాలు చేయాలి. అదే సమయంలో కీలకమైన ఎన్నికల సమయంలో పుష్కలంగా విజయావకాశాలు ఉన్న వైఎస్సార్ సీపీకి ఏదో ఒక పద్ధతిలో తోడ్పడే విధానం చేపట్టాలి. దానిని వైఎస్సార్ సీపీ సైతం ఆహ్వానించాలి. అంతే కానీ ముక్కోణపు పోటీ అని, తృతీయ ఫ్రంట్ అని వామపక్షాలు ప్రయత్నిస్తే అవి 2009 నాటి మహాకూటమిలాగా ప్రజలకు దూరం అయ్యే అవకాశం లేకపోలేదు. ఏ నినాదమైనా ఆచరణాత్మకం కావాలంటే, అది ప్రజాబాహుళ్యంతో కలిసి వున్నప్పుడే సాధ్యం. ప్రజలనుంచి ఒంటరయితే ఎంత గొప్ప సిద్ధాంతమైనా నిరుపయోగమే. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
ఒక నాయకుడికి పొంచి ఉన్న ప్రమాదం
-
ఒక నాయకుడికి పొంచి ఉన్న ప్రమాదం
తెలంగాణలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు పెరిగే అవకాశం ఉందని, ఒక నాయకుడికి కూడా ప్రమాదం పొంచి ఉందని పంచాంగకర్త సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రగతిభవన్‌లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు మంత్రులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని, ఆషాడంలో తుపానులు కూడా వస్తాయని సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని, అయితే పోలీసు శాఖ మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు మేలు జరుగుతుందని, రైతులు సుభిక్షంగా ఉంటారని అన్నారు.