Maharashtra: సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రేకు బెదిరింపులు.. | Bengaluru Man Arrested For Threats to Aditya Thackeray | Sakshi
Sakshi News home page

Aaditya Thackeray: సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రేకు బెదిరింపులు..

Published Fri, Dec 24 2021 1:06 PM | Last Updated on Fri, Dec 24 2021 1:09 PM

Bengaluru Man Arrested For Threats to Aditya Thackeray - Sakshi

సాక్షి, ముంబై, బెంగళూరు: మహారాష్ట్ర సీఎం కుమారుడు, పర్యాటక– పర్యావరణ మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేను బెదిరించిన కేసులో ముంబై పోలీసులు గురువారం బెంగళూరులో ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన వ్యక్తి జైసింగ్‌ రాజపుత్‌గా గుర్తించారు. ఇతడిని ముంబై క్రైం బ్రాంచ్‌ సైబర్‌ విభాగం పోలీసులు అరెస్ట్‌చేసి ముంబైకి తీసుకెళ్లారు.

కాగా ఈ నెల 8వ తేదీన మంత్రికి జైసింగ్‌ ఫోన్‌ చేశాడు. మంత్రి ఫోన్‌ తీయకపోవడంతో రాజపుత్‌ ప్రాణహాని బెదిరింపులతో మళ్లీ మెసేజ్‌ పంపించాడు. ఈ నేపథ్యంలో నిందితున్ని గురువారం అరెస్ట్‌ చేశారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌కు ఇతడు అభిమాని అని, ఆ ఘటనకు సంబంధించి బెదిరింపు సందేశాలను పంపినట్లు తెలిసింది.
చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్‌లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. 
చదవండి:
 ‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement