ఒక నాయకుడికి పొంచి ఉన్న ప్రమాదం
తెలంగాణలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు పెరిగే అవకాశం ఉందని, ఒక నాయకుడికి కూడా ప్రమాదం పొంచి ఉందని పంచాంగకర్త సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రగతిభవన్‌లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు మంత్రులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని, ఆషాడంలో తుపానులు కూడా వస్తాయని సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని, అయితే పోలీసు శాఖ మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు మేలు జరుగుతుందని, రైతులు సుభిక్షంగా ఉంటారని అన్నారు.