Pragati Bhavan
-
ప్రజా భవన్ ఇక డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసం
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, ప్రజాదర్బార్‌ను కొత్త ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కాగా, రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్హెచ్ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అసలు ఆట ఇప్పుడుంది: కేటీఆర్ -
తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఎంసీఆర్హెచ్ఆర్డీ?
సాక్షి, హైదరాబాద్: ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనం త్వరలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారనున్నట్లు సమాచారం. ఎంసీఆర్హెచ్ఆర్డీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు. సీఎం అధికారిక భవనంగా ఉన్న ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. ప్రగతి భవన్నుప్రజాభవన్గా మారుస్తున్నట్లు, అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. -
ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలు వినేందుకే ప్రజాదర్బార్ ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరలోనే వారి సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వినేందుకే ప్రగతిభవన్‌కు ఉండే అడ్డుగోడలను తొలగించి ప్రజాభవన్‌గా మార్చామని పొన్నం తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కె.సత్యనారాయణతో పాటు సీపీఐ నాయకులను కలిసేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూమ్‌భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మతో సమావేశమయ్యారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు, ప్రతిపక్ష నేతలు కలిసేందుకు కూడా అవకాశం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో సీపీఐ సంపూర్ణ సహకారం, మద్దతు ఉందని, భవిష్యత్‌లో కూడా తాము కలిసే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయంతో రాష్ట్రంలో ప్రజాస్వామిక పునాది పడిందన్నారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురవరం వారికి అభినందనలు తెలిపారు. -
ఇనుప కంచె తొలగింది
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు గురువారం తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. సిటీ ట్రాఫిక్ చీఫ్ జి.సుదీర్‌బాబు సైతం ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒకట్రెండు రోజుల్లో ఆ రోడ్డును పూర్తిస్థాయిలో వాహన చోదకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మొదలు.. బేగంపేటలోని గ్రీన్లాండ్స్ చౌరస్తా సమీపంలో చాలా ఏళ్లుగా ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ ఆఫీస్ కొనసాగుతున్నాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో అక్కడ ముఖ్యమంత్రి నివాసం నిర్మితమైంది. ఆయన అందులో బస చేసినప్పుడు రహదారిపై ఎలాంటి అడ్డంకులు ఉండేవి కాదు. కేవలం సీఎం నివాసంలోకి ప్రవేశించడానికే అనుమతులు అవసరమయ్యేవి. అయితే నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా ఆ రహదారిలో బారికేడ్లు వెలిశాయి. తొలినాళ్లలో తాత్కాలికంగా 8 అడుగుల ఎత్తున వాటిని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ప్రగతి భవన్ నిర్మించిన తర్వాత రోడ్డుపైకి ఇనుప గ్రిల్స్ వచ్చాయి. వాటి ప్రభావంతో బేగంపేట మార్గంలో పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడేవి. సీఎం రేవంత్ ఆదేశంతో... మంగళవారం తనను ముఖ్యమంత్రిగా ప్రకటించిన వెంటనే మాట్లాడిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తున్నట్లు, అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి ప్రజాదర్బార్ ప్రారంభం కానుండటంతో అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అడ్డంకులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు గురువారం ఉదయం నుంచి అవసరమైన చర్యలు ప్రారంభించారు. -
కోట గేట్లు బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్న జీహెచ్ ఎంసీ కార్మికులు
-
ప్రగతిభవన్ నుంచి కేసీఆర్‌ను సాగనంపాలి
మెట్పల్లి(కోరుట్ల)/జగిత్యాలటౌన్: తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతిభవన్ నుంచి సాగనంపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో బహుజన రాజ్యాధికార గర్జన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో ఒక్కశాతం ఉన్న వర్గానికి అధికారం అప్పగిస్తే బహుజనులకు న్యాయం జరగదన్నారు.టీఎస్పీఎస్సీని మంత్రి కేటీఆర్ తన దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారని, ఒక్కో పరీక్ష పేపర్‌ను ఆయన రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. పరీక్షలు వాయిదా పడటం వల్ల మనస్తాపం చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే, కేటీఆర్ దానిని వక్రీకరిస్తూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే రూ.5 వేల కోట్లతో గల్ఫ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. బహుజనులు ఎక్కువగా ఉన్న కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా దొరలు గెలవడం సమంజసం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న పూదరి నిషాంత్ కార్తికేయను గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ పూదరి అరుణ, జిల్లా ఇన్చార్జి పుప్పాల లింబాద్రి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ రద్దుకు తొలి సంతకం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేస్తూ తొలి సంతకం చేయడంతో పాటు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని బీఎస్పీ చీఫ్ ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన బీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ ఏక్ నంబర్ అయితే బేటా కేటీఆర్ దస్ నంబర్ అని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు అంబులెన్సుల్లో డబ్బులు పంపిణీ చేస్తారని అనుమానంగా ఉందని అన్నారు. -
ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు కమిషన్ కాకమ్మ కథలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటిదాకా ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు.. ఎవరూ ఉద్యోగాలే ఇవ్వనట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కాకమ్మ కథలు చెబుతోందని శుక్రవారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నచ్చినోళ్లకు పదవులు, కావాల్సినోళ్లకు ఉద్యోగాలు.. ఇదే దొర తెచ్చిన బంగారు తెలంగాణ అని విమర్శించారు. చెప్పాలంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్‌ను కాస్త.. దొరలు ప్రగతిభవన్ సర్విస్ కమిషన్ గా మార్చారన్నారు. ‘గ్రూప్ 1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొక లెక్క.. ఓఎంఆర్ షీట్స్ లెక్కిస్తే మరో లెక్క.. ఇది చాలా కామన్ అట. ప్రశ్నపత్రాలనే అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓఎంఆర్ షీట్స్ తారుమారుచేయడం ఒక లెక్కనా’అని అన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే కమిషన్‌కు వచ్చిన నష్టం ఏంటని షర్మిల సూటిగా ప్రశ్నించారు. -
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ
-
ప్రగతిభవన్ వద్ద ధర్నాకు సిద్ధమేనా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో 33% మహిళలకు టికెట్ల కేటాయింపు కోసం ప్రగతిభవన్ వద్ద ధర్నా చేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత సిద్ధమేనా అని టీపీసీసీ అధికార ప్రతినిధి, మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి సవాల్ విసిరారు. కల్వకుంట్ల కవితకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన తండ్రిపై పోరాటానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ మహిళా నేతలు కోరారు. ఒక పార్టీ అధినేతగా తన తండ్రి కేసీఆర్ చేతిలో ఉన్న టికెట్ల కేటాయింపు అవకాశాన్ని వదిలిపెట్టి ఎక్కడో పార్లమెంటులో బిల్లులు గురించి కవిత మాట్లాడటం, జంతర్‌మంతర్ దగ్గర బూటకపు పోరాటాలు చేయడం సరికాదని హితవు పలికారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ...బీఆర్ఎస్ తరఫున మొత్తం 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో కేవలం ఏడుగురు మహిళలకే టికెట్లు కేటాయించారని, ఆ పార్టీ మహిళాసాధికారిత గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. ప్రధాని పదవితో సహా రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ఏఐసీసీ అధ్యక్షురాలి పదవులను మహిళలకు ఇచి్చన ఘనత కాంగ్రెస్ పారీ్టదని గుర్తుంచుకోవాలని కోరారు. -
నేతల పనితీరుపై ఆరా.. కారెలా నడుస్తోంది?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. తన కేబినెట్ సహచరులతో వరుస భేటీలు జరుపుతున్నారు. ప్రగతి భవన్ వేదికగా ఉమ్మడి జిల్లాల వారీగా జరుపుతున్న సమావేశాల్లో నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై లోతుగా చర్చిస్తున్నారు. ఇప్పటివరకు నల్లగొండ, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన సమీక్షలు పూర్తయినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వివిధ సర్వే సంస్థలు, నిఘావర్గాల ద్వారా అందిన నివేదికలు, ఏప్రిల్, మే నెలల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలపై పార్టీ ఇన్చార్జిలు ఇచ్చిన రిపోర్టుల్లోని అంశాలు ఈ భేటీల్లో ప్రస్తావనకు వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర కీలక నేతల పనితీరు, నియోజకవర్గ స్థాయిలో వారి నడుమ సమన్వయ లోపం వంటి అంశాలపై మంత్రుల అభిప్రాయాలను సీఎం తెలుసుకుంటున్నారు. మంత్రులు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను తెలియజేయడంతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యేల ఏకపక్ష ధోరణి కారణంగా చాలాచోట్ల పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందనే అభిప్రాయం ఈ భేటీల్లో వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల పార్టీ నేతలు గ్రూపులను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేలకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని కేసీఆర్‌కు మంత్రులు తెలిపారు. కాగా పార్టీకి నష్టం చేస్తున్న నేతల వివరాలను సేకరిస్తున్న ముఖ్యమంత్రి, వారి విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై దిశా నిర్దేశం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నియోజకవర్గాల వారీగా విపక్ష పార్టీల బలాలు, బలహీనతలపై కూడా ఈ భేటీల్లో చర్చిస్తున్నట్లు తెలిసింది. అవసరమైన చోట చేరికలకు గ్రీన్ సిగ్నల్ సర్వే సంస్థల నివేదికలు, వివిధ నిఘా సంస్థల రిపోర్టుల ఆధారంగా, నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్, విపక్షాల బలాలు, బలహీనతలపై కేసీఆర్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల ద్వారా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాల్సిందిగా మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు విఫలమైన చోట ఇతరులకు టికెట్ కేటాయించే అంశంపై మాత్రం ఈ భేటీల్లో సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. పార్టీకి ఉపయోగపడతారని భావించే అసంతృప్త నేతలతో మాట్లాడి వారు పార్టీలోనే ఉండేట్టుగా చూడటంతో పాటు ఇతర పార్టీల్లో ప్రజాదరణ కలిగిన నేతలతో సంప్రదింపులు జరపాలనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. కేవలం క్షేత్ర స్థాయి పరిస్థితులకే పరిమితం కాకుండా ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పార్టీ మేనిఫెస్టో, ప్రచార వ్యూహం ఖరారు వంటి అంశాలపై కూడా కేసీఆర్ దృష్టి సారించారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై మంత్రుల నుంచి సీఎం అభిప్రాయాలు కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వాటి ప్రభావం, చేపట్టాల్సిన మార్పులు చేర్పులు తదితర అంశాలపై తన అభిప్రాయాలను కూడా ఈ భేటీల్లో కేసీఆర్ వెల్లడిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు, కీలక నేతలకు కేటీఆర్ క్లాస్ సీఎం కేసీఆర్ ఇలా మంత్రులతో వరుస భేటీలు జరుపుతుండగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు.. పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సమావేశమవుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందుతుండటం, టికెట్‌ను ఆశిస్తున్న నేతల నడుమ ఆధిపత్య పోరుపై ఆయన దృష్టి సారించారు. వివాదాస్పద ప్రకటనలు, పనులతో తరచూ వార్తలకెక్కుతున్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు కేటీఆర్ తరఫున ఫోన్లు వెళ్తున్నాయి. ఈ మేరకు ప్రగతిభవన్‌కు వస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కేటీఆర్ సీరియస్‌గా క్లాస్ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు రాజయ్య, శంకర్ నాయక్, రెడ్యా నాయక్, రోహిత్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్ తదితరులు ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. టికెట్ల కేటాయింపు అంశం అధినేత కేసీఆర్ చూసుకుంటారని, వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు కేసీఆర్ మంగళవారం లేదా బుధవారం పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. -
రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్ దూరం.. స్టేట్ చీఫ్‌ను కలిసే అవకాశమే లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘దేశ, విదేశాల అధిపతులనైనా కలవగలం.. దురదృష్టవశాత్తు ఇక్కడి స్టేట్ చీఫ్‌ను మాత్రం కలవలేం.. కనీసం దగ్గరగా వెళ్లడానికి కూడా అవకాశం ఉండదు..రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్ దూరంగా ఉంది. ఇది మంచి ధోరణి కాదు..’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న తనను నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సేవా ఇంటర్నేషనల్, సీ–20 వర్కింగ్ గ్రూప్, సేవా భారతి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గచ్చిబౌలిలో నిర్వహించిన సీ–20 సమావేశాల కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అభివృద్ధి అంటే ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు.. ‘ప్రజా ప్రతినిధులు సమాజ సేవకులు. ఎల్లప్పుడూ ప్రజల అభివృద్ధికి పాటు పడాలి. అభివృద్ధి అంటే ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు. అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాలి. ఐదు వేల సంవత్సరాల క్రితమే ఆనాటి ప్రముఖుడు కనియన్ పుంగనాన ప్రజలంతా ఒక్కటేనని నినదించారు. ప్రస్తుత ప్రధానమంత్రి అదే నియమాన్ని పాటిస్తూ ప్రజలందరినీ సమానంగా చూస్తున్నారు. యావత్ ప్రపంచానికి భారత్ పరిష్కార మార్గాలను చూపిస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో 150 దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసి ఆదుకుంది. మన దేశంలోని వసుదైక కుటుంబానికి ఇది నిదర్శనం’అని తమిళిసై తెలిపారు. ‘తొలిసారిగా జీ20 ఫోరమ్‌కు 2023లో భారత్ అధ్యక్షత వహించడం గర్వకారణం. మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. స్వాతంత్య్ర శతాబ్ది వైపు పయనించే ‘అమృత్కాల్’దిశగా ఇదో ముందడుగు. నిరాక్షరాస్యత, అనారోగ్యం, నిరుద్యోగం లేని దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే అభివృద్ధి దిశగా చేసే పనిని కొందరు వ్యతిరేకిస్తారు కానీ పని చేయరు. నాయకులు అధికారులు, రాజ్‌భవన్ అందరూ ప్రజల కోసమే ఉన్నాం..’అని గవర్నర్ స్పష్టం చేశారు. జీ20 సౌస్ షెర్పా డీఎం కిరణ్, రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద, సేవా ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్వాతి రామ్ తదితరులు పాల్గొన్నారు. -
భయపడాల్సింది ఏమీ లేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఏడాదిలో కేంద్రం మరింత కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, వాటిని ధైర్యంగా ఎదుర్కొందామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గానికి సూచించారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ముందుగా ఊహించినవేనని అన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్దామని, భయపడాల్సిన పనేమీ లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసుల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. కాగా నోటీసులు, వేధింపులు ఇక్కడితో ఆగవని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురిపై దాడులు నిర్వహించిన దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసిన అంశం కూడా చర్చకు వచ్చింది. బీజేపీ అరాచకాలను క్షేత్రస్థాయిలోనూ ఎండగట్టాలని, అందుకు సంబంధించి శుక్రవారం జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వివరంగా మాట్లాడుకుందామని సీఎం చెప్పినట్లు తెలిసింది. తదుపరి భేటీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు! గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని కేబినెట్ సమర్ధించింది. మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే ఇంకా సమయం ఉన్నందున తదుపరి కేబినెట్ భేటీలో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. ఎన్నికల ఏడాది కావడంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విమర్శలకు, ఆరోపణలకు తావివ్వకుండా మసలుకోవాలని, బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు. -
Telangana: నేడు కీలక కేబినెట్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. సమావేశంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన ఇద్దరిని ఖరారు చేయడంతోపాటు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపైనా చర్చించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీచేసిన అంశంపైనా భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈడీ విచారణ సందర్భంగా ఒకవేళ కవితను అరెస్టుచేస్తే ఎలా స్పందించాలన్న విషయమై సమావేశంలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కేంద్రం రాష్ట్రంపై వ్యవహరిస్తున్న కక్షసాధింపు చర్యలపై మున్ముందు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపైనా చర్చ జరగనుంది. పలు అంశాలపై నిర్ణయాలు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, స్థలాలున్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున నిధుల మంజూరుపై నిర్ణయం, మూడు పారిశ్రామికవాడల్లోని భూముల క్రమబద్ధీకరణ అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో అమలవుతున్న కంటివెలుగు కార్యక్రమం, మంగళవారం ప్రారంభమైన ‘మహిళా ఆరోగ్య’కార్యక్రమాలను కూడా సమీక్షించే అవకాశం ఉంది. నేడు నామినేషన్ల దాఖలు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నవీన్‌కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వారి వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెళ్లనున్నారు. కాగా, గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. -
ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొట్టాలి
సాక్షి, మహబూబాబాద్: ‘రాష్ట్రంలోని నాలుకోట్ల మంది ప్రజలు రక్తమాంసాలు కరిగించి, శ్రమించి పన్నులు చెల్లిస్తే రూ.2వేల కోట్లతో ప్రగతిభవన్ కట్టారు. దీనిలోకి రైతులు, కూలీలు, ఉద్యమకారులు, విద్యార్థులు, చివరకు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులకు కూడా ప్రవేశం లేదు. ప్రజలకు ఉపయోగపడని ఆ భవనం గేట్లు బద్దలు కొట్టాలి. పునాదులతో సహా కూల్చేయాలి. ప్రజల సమస్యలను వినే భవన్ కావాలి..’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. హాథ్‌సే హాథ్ జోడో యాత్ర బుధవారం మహబూబాబాద్ జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో, బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ద్రోహుల కేంద్రంగా ప్రగతిభవన్ ‘గతంలో పనిచేసిన సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల కార్యాలయాలు ప్రజల సమస్యలు, వినతులు తీసుకునే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు తెలంగాణ ద్రోహులు, దగాకోర్లు, మాఫియా, చీకటి ఒప్పందాలకు కేంద్రంగా ప్రగతిభవన్ ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైంది. 2014లో రాష్ట్రాన్ని సాధించింది. ఇప్పుడు 2023లో తెలంగాణలో నియంత పాలన అంతానికి మరో ఉద్యమం వచి్చంది. నాటి ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్‌ను వంద మీటర్ల లోతుకు పాతేందుకు కాంగ్రెస్ దండు కదలాలి..’ అని రేవంత్ పిలుపునిచ్చారు. కేసీఆర్‌పై కూడా కేసు పెట్టాలి ‘ప్రగతిభవన్‌ను నేలమట్టం చేయాలని చెప్పినందుకు తనపై కేసు పెట్టాలని పోలీసులను ఆశ్రయించిన దద్దమ్మ నాయకులు గతాన్ని తెలుసుకోవాలి. నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్‌పై కూడా కేసు పెట్టాలి. చట్టం అందరికీ సమానమే. నాకో నీతి.. కేసీఆర్‌కో నీతా?..’ అని ప్రశ్నించారు. ప్రజలు చెప్పిందే మేనిఫెస్టోలో.. ‘గతంలో మాదిరిగా ఈసారి కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో ఉత్కంఠ ఉండదు. ఇప్పటికే 50 శాతం అభ్యర్థుల జాబితా తయారు చేశాం. ఇతర పారీ్టల నాయకులు తమకు నచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారు. మేం మాత్రం ప్రజలు చెప్పిందే పెడతాం. వారి సమస్యలు తీర్చేలా మేనిఫెస్టో ఉంటుంది. పోడు భూములకు పట్టాలు, పేదలకు ఇళ్లు, పంటలకు గిట్టుబాటు ధర, 317 జీఓ సవరణ తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తాం. అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధులు కేటాయిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. మానుకోటలో దుశ్శాసన పాలన ‘మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఒక రాక్షసుడు. దుశ్శాసన పాలన చేస్తున్నాడు. కలెక్టర్‌ను అవమానపర్చడం, పేదలకు అన్యాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఒక వైపు ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మరోవైపు ఎంపీ కవిత వందల ఎకరాలు పంచుకుంటున్నారు..’ అని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సీతక్క, మల్లురవి, సుదర్శన్‌రెడ్డి, బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా మహబూబాబాద్ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ‘జై బీఆర్ఎస్, జై శంకరన్న’ అంటూ నినాదాలు చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారు. వారు రేవంత్‌పై చెప్పులు విసిరేసేందుకు యతి్నస్తుండగా అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జరిగినా, అలాంటిదేమీ లేదని పోలీసులు అన్నారు. -
తెలంగాణ నమూనా దేశవ్యాప్తం కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న ప్రగతి నమూనా మహారాష్ట్ర సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహరాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు అయిన శంభాజీ రాజె గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేసీఆర్ మధ్యాహ్న భోజనంతో శంభాజీ రాజెకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో అమల వుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పట్ల ప్రభుత్వ విధానాలను రాజె ఆరా తీశారు. వినూత్న ఎజెండాతో ప్రజల ముందుకు అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా కేసీఆర్, శంభాజీ రాజె నడుమ చర్చ జరిగింది. దేశ అభివృద్ధి, సమగ్రత, ప్రజా సంక్షేమం లక్ష్యంగా వినూత్న ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముందనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. సందర్భాన్ని బట్టి మరోమారు కలిసి మరిన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. శంభాజీ రాజె పూర్వీకులు శివాజీ మహరాజ్ నుంచి సాహూ మహరాజ్ దాకా దేశానికి అందించిన సేవలను ఇరువురు స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారందించిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని కేసీఆర్‌కు శంభాజీ రాజె అందించారు. ఈ భేటీలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు శంభాజీ రాజెతో పాటు వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘చలో ప్రగతి భవన్’లో ఉద్రిక్తత
పంజగుట్ట/ సాక్షి, హైదరాబాద్: జీవో నెంబర్ 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం వివిధ బీజేపీ మోర్చా నాయకులు చేపట్టిన చలో ప్రగతిభవన్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో మోర్చా నాయకులు ప్రగతిభవన్ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దూషించుకునే స్థాయికి వెళ్లింది. తోపులాటలో బీజేపీ నాయకులతో పాటు పోలీసులు కూడా కిందపడటంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బీజేవైఎం నేత రవికుమార్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషా, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలె భాస్కర్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు బాషాతో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఉద్యోగులు, టీచర్లకు సీఎం క్షమాపణలు చెప్పాలి.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల అరెస్ట్‌ల సందర్భంగా పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై సీఎం కేసీఆర్ బేషరతుగా ఆయా వర్గాలకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.. 317 జీవోను సవరించి వారికి న్యాయం చేయాలని, భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను లంచాల కోసమే నిలిపేశారని ఆరోపించారు. జిల్లా కేంద్రాల్లో ఖాళీలు చూపకుండా పోస్టులన్నీ బ్లాక్ చేశారని ఆరోపించారు. సోమవారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలు మెరబెట్టుకునేందుకు ప్రగతిభవన్‌కు వెళితే మహిళా టీచర్లు, చిన్న పిల్లలపై కేసీఆర్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించిందని సంజయ్ మండిపడ్డారు. పసిపిల్లలు ధర్నాలో రోదిస్తుండడాన్ని చూసి అందరి మనసు ద్రవించినా కేసీఆర్ మనసు మాత్రం కరగలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సకల జనుల సమ్మె నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయన్నారు. కష్టపడి తెలంగాణ సాధించుకున్నాక స్థానికత కోసం మళ్లీ ఉద్యమించే దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువకులు ఉద్యమించకపోతే, 42 రోజులు సకల జనుల సమ్మె చేయకపోతే ఇయాళ తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ సీఎం అయ్యేవారా? అని ప్రశ్నించారు. (చదవండి: రైలును అపరిశుభ్రంగా మార్చేసిన ప్రయాణికులు) -
DYFI అధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి
-
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎస్ఎల్పీఆర్బీ పోలీసు నియామకాల్లో కొత్త నిబంధనల వల్ల లక్షల మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ నిరసిస్తూ ప్రగతి భవన్‌ను ముట్టడించారు బీజేవైఎం కార్యకర్తలు. పోలీసు నియామకాల్లో గతంలో ఉన్న శారీరక పరీక్షల్లో మార్పులు చేయడంపై నిరసనలకు దిగారు. నిబంధనలను మార్చి, ఎవరైతే ఫిజికల్ టెస్టుల్లో నష్టపోయారో వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రగతి భవన్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు బీజేవైఎం కార్యకర్తలు. దీంతో ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఆందోళనకారులను అరెస్టులు చేసి స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇదీ చదవండి: ‘కేసీఆర్ సర్కార్ సర్పంచ్ల గొంతులు నొక్కేస్తున్నది’ -
కేంద్రం తీరును ఎండగట్టండి
సాక్షి, హైదరాబాద్: రేపటి(బుధవారం) నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలకు హాజరై రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలను ఆదేశించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో ఆయన సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేసీఆర్ పలు రాజకీయ, పాలనపరమైన అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని, తద్వారా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పార్టీ ఎంపీలకు సుదీర్ఘంగా వివరించినట్లు తెలిసింది. పార్లమెంటులో లోపలా, బయటా చోటు చేసుకునే పరిస్థితులను బట్టి వ్యూహరచన చేసుకోవాలని సూచించారు. సీబీఐ, ఐటీ, ఈడీ సోదాలు, కేసుల విషయంలో విపక్షాలతో కలిసి ఆందోళనలు చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు చేసే ఇతర ధర్నాలు, ఆందోళనలకు అంశాల వారీగా టీఆర్ఎస్ మద్దతునిస్తుందని తెలిపారు. అవసరమైతే సమావేశాల బహిష్కరణ! ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిన కుట్రలను పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ సూచించారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలను అడ్డుకున్న తీరుతో పాటు అందులో బీజేపీ పాత్ర, విచారణను అడ్డుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా ఎంపీలకు వివరించారు. విభజన హామీల అమలులో తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, నిధుల విడుదలలో చూపుతున్న వివక్షను గణాంకాలతో సహా వివరించారు. గవర్నర్ వ్యవస్థతో పాటు, సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడం ద్వారా విపక్ష రాజకీయ పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణను ప్రజలకు వివరించేందుకు ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిన తర్వాత జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు ముమ్మరంగా ఉంటాయని చెప్పినట్లు సమాచారం. -
ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆందోళన
పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 317 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆదివారం ప్రగతిభవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీవోను వెంటనే రద్దు చేయాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. దీంతో పోలీసులు 88 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. 317 జీవో వల్ల సుమారు 20 వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగులు స్థానికత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది సొంత జిల్లాలు వదిలి సుదూర ప్రాంత జిల్లాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మనోవేదనకు గురై ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, తాము కూడా శాశ్వతంగా తమ స్థానికత కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీవోను రద్దు చేసి తమను సొంత జిల్లాకు పంపాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఆద్యంతం ఉద్రిక్తత, ఉత్కంఠ.. షర్మిల అరెస్ట్.. బెయిల్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేటలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా సోమవారం టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగడం, ఫ్లెక్సీలు తగులబెట్టడం, ఆమె కారవాన్‌కు నిప్పంటించడం తదితర సంఘటనల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం..హైదరాబాద్ వేదికగా మంగళవారం కూడా కొనసాగింది. దాడికి నిరసన వ్యక్తం చేస్తూ, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. దాడిలో ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ షర్మిల ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఆమెకు మద్దతుగా పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. అయితే షర్మిలను అడ్డుకున్న పోలీసులు..ఆమె లోపల ఉండగానే కారును క్రేన్ సాయంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం, ఇతర ఆరోపణలతో మరో పీఎస్‌లో షర్మిల సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం, నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, షర్మిల విడుదల కోరుతూ వైఎస్ విజయమ్మ నిరాహార దీక్షకు దిగడం వంటి పరిణామాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే షర్మిలతో పాటు ఐదుగురికి న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. షర్మిలను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పోలీసులు... బందోబస్తు తప్పించుకుని.. నర్సంపేటలో ఉద్రిక్తత నేపథ్యంలో షర్మిలను అదుపులోకితీసుకున్న పోలీసులు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసానికి తరలించిన సంగతి తెలిసిందే. కాగా నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం వైఎస్సార్ విగ్రహానికీ నిప్పుపెట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిల మంగళవారం పంజగుట్ట కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు ఉదయం 10 గంటల నుంచే లోటస్ పాండ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ షర్మిల తొలుత సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉంచిన ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎంను కలుస్తానంటూ ప్రగతి భవన్‌కు బయలుదేరారు. అయితే పోలీసులు షర్మిల వాహనాన్ని అడ్డుకుని కిందకు దిగాలని కోరగా ఆమె నిరాకరించారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పోలీసులు డ్రైవింగ్ సీటులో ఉన్న ఆమెతో సహా కారును క్రేన్ సాయంతో ఎస్సార్ నగర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో కూర్చున్న షర్మిల... బలవంతంగా కారు డోర్ తెరిచి.. ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ వద్ద కూడా కారు దిగేందుకు షర్మిల అంగీకరించలేదు. దీంతో పోలీసులు మారు తాళాలు తయారు చేసే వ్యక్తిని తెచ్చి కారు డోర్‌ను తెరిచేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు అధికారులు కారు ఎడమ వైపు ముందు డోర్‌ను ప్లాస్టిక్ లాఠీల సాయంతో తెరిచారు. కారులో ఉన్న నలుగురు పార్టీ నేతలను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహిళా పోలీసులు షర్మిలను బలవంతంగా కిందకు దింపి ఠాణా లోపలకు తీసుకువెళ్లారు. ఈలోగా షర్మిలకు సంఘీభావం తెలపడానికి వైఎస్ విజయమ్మ బయలుదేరారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆమెను లోటస్ పాండ్‌లోనే గృహ నిర్భంధం చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ, షర్మిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయమ్మ నిరాహార దీక్ష చేపట్టారు. నాంపల్లి కోర్టు నుంచి బయటకు వస్తున్న షర్మిల పలు సెక్షన్ల కింద కేసు షర్మిలపై 143, (గుమిగూడటం) 341 (అక్రమ నిర్బంధం), 506 (బెదిరింపులు), 509 (మహిళ లను దూషించడం), 336 (ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించడం), 353 (పోలీసు విధులకు ఆటంకం కలిగించడం), 382 (దొంగతనం), 149 (అక్రమ సమావేశం), 290 (పబ్లిక్ న్యూసెన్స్, దూషించడం) సెక్షన్ల కింద పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలతో పాటు 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె పీఆర్ఓ శ్రీనివాస్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్సార్‌నగర్ ఠాణాకు వచ్చిన ప్రభుత్వ వైద్యులు షర్మిలకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను నాంపల్లిలోని 14వ ఏసీఎంఎం ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ విధించాలని కోరారు. అయితే షర్మిలపై తప్పుడు కేసులు పెట్టారని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. న్యాయమే గెలిచింది: విజయమ్మ షర్మిలకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసిన తర్వాత వైఎస్ విజయమ్మ దీక్ష విరమించారు. న్యాయమే గెలిచిందని, తాము చట్టాన్ని గౌరవిస్తామని ఆమె పేర్కొన్నారు. ఎస్సార్‌నగర్ పీఎస్‌కు బ్రదర్ అనిల్ షర్మిలను పరామర్శించేందుకు ఆమె భర్త అనిల్ ఎస్సార్‌నగర్ పీఎస్‌కు వచ్చారు. సమస్యలపై పాదయాత్ర చేస్తున్న షర్మిలపై దుర్మార్గంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. కార్యకర్తలపై లాఠీచార్జి షర్మిల అరెస్టు వార్తతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఎస్సార్ నగర్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కొందరు యువకులు స్టేషన్ ఎదురుగా ఉన్న భవ నంపైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు కార్యకర్తలు స్టేషన్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా లాఠీచార్జి చేశారు. షర్మిల అరెస్టును ఖండించిన కిషన్‌రెడ్డి షర్మిల అరెస్టును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. ఒక మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం చాలా అసహ్యకరమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన వాహనంలో ఉండగానే క్రేన్‌తో లాక్కెళ్లడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ప్రధాన అజెండాగా టీఆఎస్ఆర్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కారవాన్‌కు నిప్పంటించిన వారిపై కేసు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా శివారులో షర్మిల కారవాన్‌ను అడ్డుకుని పెట్రోల్ పోసి నిప్పంటించిన వారిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జల్లీ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు తొగరు చెన్నారెడ్డితో పాటు మరికొంత మందిపై 427, 435 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిపోయింది: షర్మిల అంతకుముందు ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ వద్ద షర్మిల మాట్లాడుతూ టీఆర్ఎస్పై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులు గూండాల్లా మారారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలా పని చేస్తుందో టీఆర్ఎస్కు పోలీసులు అదే విధంగా పని చేస్తున్నారు. టీఆర్ఎస్ బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఒక ఆడ పిల్లను ఈ విధంగా అరెస్టు చేయించడం సీఎం కేసీఆర్‌కు తగునా? నన్ను బలవంతంగా ఎందుకు అరెస్టు చేశారో ప్రజలకు చెప్పాలి. అసలు నాపై ఎందుకు దాడి చేస్తున్నారు. పాదయాత్రను కావాలనే అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించకూడదా? అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?’ అంటూ షర్మిల ధ్వజమెత్తారు. షర్మిల అరెస్టు తీరుపై గవర్నర్ ఆందోళన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్, అందుకు దారి తీసిన పరిణామాల పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల అరెస్టు తీరు పట్ల, ఆమె భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల లోపల ఉండగా, కారును లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలవరపెట్టినట్లు తెలిపారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు.. మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరముందని గవర్నర్ పేర్కొన్నారు. -
8 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్యవిద్యా రంగ చరిత్రలో మంగళవారం అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్లో ఒకేసారి 8 కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రారంభించనున్నారు. తద్వారా సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం పట్టణాల్లోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్ తొలి విద్యాసంవత్సరం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం దేశ చరిత్రలోనే అత్యంత అరుదైన సందర్భమని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో ఉస్మానియా (1946), గాంధీ(1954) దవాఖానాలు ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఆవిర్భవించే నాటికే ఉన్నాయి. గత ప్రభుత్వాలు 57 ఏళ్లలో కాకతీయ(1959), ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేశాయి. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు రోగులకు అందనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వీటిల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను కలుపుకొని మొత్తం 35 వైద్య విభాగాలు సేవలందించనున్నాయి. 449 మంది డాక్టర్లు, 600 మందికిపైగా పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. పెద్ద వ్యాధి వచ్చినా రోగులు హైదరాబాద్ వరకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా సమీపంలోనే నాణ్యమైన వైద్యం అందే అవకాశం ఉంది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గత ఎనిమిదేళ్లలో మూడు రెట్లకుపైగా పెరిగాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకునే అవకాశాలు పెరిగాయి. పెద్దమొత్తం ఖర్చుతో వైద్య విద్యను విదేశాల్లో అభ్యసించే పరిస్థితులు తప్పనున్నాయి. -
అనుమానం వద్దు.. భేటీ 5నే!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ఈ నెల 5న పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో యథావిధిగా జరుగుతుందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దసరా రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్‌కు చేరుకోవాలని ఆహ్వాని తుల జాబితాలోని వారికి సూచించారు. మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో దసరా రోజు జరిగే టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంపై దాని ప్రభావం ఉండదని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశానికి ఆహ్వానాలు అందినవారు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిర్దేశిత సమయానికి రావాలని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణభవన్‌లో ఈ నెల 5న జరిగే ఈ భేటీకి రాష్ట్రమంత్రులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా పరిషత్, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, టీఆర్ఎస్ 33 జిల్లాల అధ్యక్షులు హాజరుకావాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించారు. 5న మధ్యాహ్నం 2.30లోగా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ముగించేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలంగాణభవన్ వర్గాలు వెల్లడించాయి. కొత్త జాతీయ పార్టీపై టీఆర్ఎస్లో ఉత్కంఠ కొత్త జాతీయపార్టీ ఏర్పాటుపై ఈ నెల 5న కీలక ప్రకటన చేసేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనుండటంతో కొత్తపార్టీ రూపురేఖలు, తీరుతెన్నులపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కొత్తపార్టీ పేరు, జెండా, ఎన్నికల చిహ్నం మొదలుకుని ఎజెండా తదితరాలపై ఆసక్తి కనిపిస్తోంది. అదే సమయంలో కొత్త జాతీయపార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కేసీఆర్ వేసే అడుగులు, ఎత్తుగడలు, పార్టీ భవిష్యత్తు తదితరాలపై పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ లాంఛనంగా ప్రకటన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న వివిధ పార్టీల నాయకులకు ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే అతిథుల జాబితాపై మంగళవారం ఉదయానికి స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేత చరిత్ర సృష్టించారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జాతీయ రాజకీయాలు చర్చించేందుకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఆదివారం కేసీఆర్‌తో కుమారస్వామి ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. వీరిద్దరూ దాదాపు 3 గంటల పాటు నేషనల్ పాలిటిక్స్‌పై చర్చించారు. ఇక, భేటీ అనంతరం మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. ప్రస్తుతం దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను. దేశానికి తెలంగాణ మోడల్ కానుంది. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక అవసరం. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను సైతం తప్పుపడుతున్నారు. నిరుదోగ్యం పెరిగిపోయిందని, రూపాయి విలువ పతనమైందని, ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ అమ్మేస్తోందని ఆరోపించారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ కావాలని దేశ ప్రజలను కోరారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల సీఎంలు, కీలక నేతలను కలుస్తున్నారు. -
Telangana CM: ప్రగతిభవన్ నిర్మాణ ఖర్చెంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధికార నివాసం ‘ప్రగతిభవన్’ నిర్మాణానికి రూ.45.91 కోట్లు వ్యయమైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. 2016 మార్చిలో ప్రగతిభవన్ నిర్మాణాన్ని ప్రారంభించి అదే ఏడాది నవంబర్‌లో పూర్తి చేసినట్టు రోడ్లు, భవనాల శాఖ తెలిపింది. ప్రగతిభవన్ నిర్మాణ వ్యయం వివరాలు తెలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. ఆర్ అండ్ బీ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. -
ఇంటింటిపై జాతీయ జెండా
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’కార్యక్రమం నిర్వహణపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన సుమారు 1.20 కోట్ల త్రివర్ణ పతాకాల తయారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గద్వాల, నారాయణపేట, సిరిసిల్ల, పోచంపల్లి, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత, పవర్లూమ్ కార్మికులకు జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు ఇవ్వాలన్నారు. జాతీయ పతాకాల ముద్రణ, దేశభక్తి ప్రచార కార్యక్రమాల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. పల్లె నుంచి పట్నం దాకా... ►పంద్రాగస్టుకు వారం ముందు నుంచి వారం తర్వాత వరకు 15 రోజులు రాష్ట్రంలో ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ►గడపగడపకూ జాతీయ పతాకాన్ని ఎగు రవేయాలి. కవి సమ్మేళనాలు, జాతీయ భావాలు పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ►మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం రన్ నిర్వహించాలి. ►అన్ని విద్యాసంస్థల్లో ఆటలు, వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు, నాటికలు, ఏకపాత్రాభినయం వంటివి జరపాలి. ►ప్రభుత్వ శాఖలన్నీ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనాలి. రోజువారీ షెడ్యూల్ రూపొందించుకోవాలి. విధివిధానాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని నియమించాలి. ►పల్లె నుంచి పట్నం దాకా స్వాతంత్య్ర వజ్రోత్సవ దీప్తిని వెలిగించే దిశగా చర్యలు చేపట్టాలి. ►జాతీయ పతాక చిహ్నాన్ని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు లెటర్ హెడ్లపై ముద్రించుకోవాలి. ►15 రోజులు జాతీయ పతాక చిహ్నా న్ని పత్రికలు మాస్టర్ హెడ్స్‌పై ముద్రించాలి. ►టీవీ చానళ్లు సైతం చిహ్నాన్ని నిత్యం కనిపించేలా ప్రసారం చేయాలి. దేశ భక్తిని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చేయాలి. నాటి విలువలు నేడు ఏవీ? ‘స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారత దేశాన్ని మరింత గుణాత్మకంగా రూపొందించుకోవాల్సి ఉంది. ప్రజాస్వామిక, లౌకిక, సమాఖ్య విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పని ఒత్తిడి, ఆర్థిక అవసరాల నేపథ్యంలో నాటి తరం ఆచరించిన దేశభక్తి, అంతటి భావోద్వేగాలు నేటి యువతలో కనిపించడంలేదు. ఈ వాతావరణాన్ని మనం పునఃసమీక్షించుకోవాల్సి ఉంది. అందుకే దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన అక్కెర దేశభక్తులైన తెలంగాణ బిడ్డలకు ఉంది. పల్లె, పట్నం ఒక్కటై భారతావని ఘనకీర్తిని చాటాల్సి ఉంది’అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. -
కేసీఆర్ ఎజెండా ఖరారు.. దేశవ్యాప్తంగా రైతు సభలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పథకాలను అమలు చేయాలనే డిమాండ్‌తో రైతు సంఘాలు నిర్వహించే సభలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరవుతారు. అయితే దేశవ్యాప్త పర్యటనకు ముందు నిజామాబాద్, వరంగల్‌లో రైతులతో భారీ సభలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రాథమికంగా నిర్ణయించారు. రెండు రోజులుగా రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్‌తో ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా సమావేశమైన కేసీఆర్.. దేశ వ్యాప్తంగా రైతు సదస్సుల నిర్వహణకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న టికాయత్‌తో పాటు మరో ఇద్దరు రైతు సంఘాల నేతలు ప్రగతిభవన్లోనే విడిది చేసినట్లు సమాచారం. తికాయత్ బృందంతో జరిగిన భేటీలో రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. సభల షెడ్యూల్, ఎజెండా ఖరారు! రైతు సదస్సులను తొలుత వచ్చే నెల మొదటి వారంలో నిజామాబాద్‌లో, ఆ తర్వాత వరంగల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సదస్సులు నిర్వహించేందుకు అనువైన ప్రాంతాలు, షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. రైతు బంధు, రైతు బీమాతో పాటు కులవృత్తుల కోసం చేపట్టిన గొర్రెలు, చేప పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలను సభల్లో వివరిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను కూడా ఎండగట్టేలా కేసీఆర్ ఎజెండా ఖరారు చేసినట్లు తెలిసింది. -
ప్రగతిభవన్‌కు తిమ్మక్క.. సమీక్ష సమావేశానికి తీసుకెళ్లి సత్కరించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ గ్రహీత.. 110 ఏళ్ల వయసున్న సాలు మరద తిమ్మక్క బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎం ఆమెను ప్రగతిభవన్‌లో మంత్రు లు, కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి స్వయంగా తోడ్కొని వెళ్లారు. అందరికీ పరిచయం చేశారు. ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పర్యావరణం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. మంచి పనిలో నిమగ్నమైతే గొప్పగా జీవించవచ్చని, మంచి ఆరోగ్యంతో ఉంటారనడానికి తిమ్మక్క నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. అందరూ ఆమె బాటలో నడవాలని ఆకాంక్షించారు. కాగా.. వ్యవసాయం, అటవీ సంరక్షణ రంగాల్లో రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలవడం పట్ల తిమ్మక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు అవసరముంటే తాను అందజేస్తానని చెప్పారు. కర్ణాటకకు చెందిన తిమ్మక్క బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల్లో ఒకరు. 25 ఏళ్లవరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి.. పచ్చదనం, పర్యావరణ హితం కోసం ఆమె కృషి చేస్తున్నారు. చదవండి👉🏼 కేసీఆర్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు.. తప్పుగా అనుకోవద్దని వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, 110 సంవత్సరాల సాలుమరద తిమ్మక్క ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. pic.twitter.com/j9hLTlz4cK — Telangana CMO (@TelanganaCMO) May 18, 2022 ‘ఆకుపచ్చని వీలునామా’ఆవిష్కరణ హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ పై సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం ‘ఆకుపచ్చని వీలునామా’పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సీఎంను కలిసిన తమిళ హీరో విజయ్ తమిళ సినీనటుడు విజయ్ బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయ్‌కు కేసీఆర్ శాలువా కప్పి సత్కరించారు. చదవండి👉 భూవివాదంలో కేసు నమోదు.. పరారీలో మంత్రి మల్లారెడ్డి బావమరిది -
ప్రగతి భవన్ లో ఉగాది వేడుకలు
-
ప్రగతి భవన్ దగ్గర జేపీ దివాకర్‌రెడ్డి ఓవర్ యాక్షన్
-
ప్రగతి భవన్ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి ఓవర్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: అపాయింట్మెంట్ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు బుధవారం ప్రగతి భవన్‌కు వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బుధవారం ఉదయం 10:45 గంటల ప్రాంతంలో ప్రగతిభవన్‌కు వచ్చిన జేసీ లోపలికి అనుమతించాలని కోరగా... అపాయింట్మెంట్ లేకుండా అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు. తాను మాజీ మంత్రినని, సీనియర్ రాజకీయ నేతనని.. సీఎంను కలిసేందుకు తనకు కూడా అపాయింట్మెంట్ కావాలా? అని వారితో వాగ్వాదానికి దిగారు. కనీసం మంత్రి కేటీఆర్‌ను అయినా కలుస్తానని జేసీ కోరగా.. ఆయనను కలవాలన్నా అపాయింట్మెంట్ తప్పనిసరని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ఫోన్ చేసి తాను వచ్చినట్టు సమాచారం ఇవ్వాలని పోలీసులను కోరగా.. ఫోన్ నంబర్ తమ వద్ద ఉండదని.. మీరే ఫోన్ చేయండని.. ఆయన పంపమంటే పంపుతామని బదులిచ్చారు. 15 నిమిషాలపాటు పోలీసులతో వాగ్వాదానికి దిగినా.. లోపలికి పంపేందుకు ససేమిరా అనడంతో.. ఈసారి అపాయింట్మెంట్ తీసుకునే వస్తానంటూ వెళ్లిపోయారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. చదవండి: జీవో 317పై స్టేకు హైకోర్టు నిరాకరణ -
కేసీఆర్ చెంతకు కామ్రేడ్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీపీఎం, సీపీఐ పార్టీల జాతీయ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలుసుకోవడం ఆసక్తిగా మారింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన మూడు రోజుల కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు సీపీఎం జాతీయ నేతలు హైదరాబాద్‌కు రాగా.. తమ పార్టీ అనుబంధ విభాగం ‘అఖిల భారత యువజన సమాఖ్య (ఏవైఎఫ్)’జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు సీపీఐ నేతలూ వచ్చారు. వీరిలో తొలుత శనివారం మధ్యాహ్నం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలో ఆ పార్టీ అగ్రనేతలు కేరళ సీఎం పినరై విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిళ్లై, బాలకృష్ణన్, ఎంఏ బేబీ తదితరుల బృందం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఇక సాయంత్రం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ పార్లమెంటరీపక్ష నేత, కేరళ ఎంపీ బినయ్ విశ్వం, కేరళ రెవెన్యూ మంత్రి రాజన్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు తదితరులు ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఇలా ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు ఒకే సమయంలో హైదరాబాద్‌కు రావడం, ఒకరి తర్వాత మరోపార్టీ నేతలు కేసీఆర్‌ను కలిసి చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలకు సంబంధించి అటు సీఎం కార్యాలయంగానీ, కమ్యూనిస్టు పార్టీలుగానీ అధికారికంగా పూర్తి వివరాలేవీ వెల్లడించలేదు. కేవలం జాతీయ రాజకీయాలు, రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్టు మాత్రమే సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా.. ఈ సమావేశాల్లో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
ఆత్మబంధువు–దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కవి, రచయిత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందించిన ‘ఆత్మబంధువు–దళిత సంక్షేమ బంధం’పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. దళితబంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషినంతా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు జూలూరు తెలిపారు. అనంతరం, తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ముఖ్యమంత్రికి జూలూరు గౌరీశంకర్ దంపతులు ఆహ్వానపత్రికను అందజేశారు. -
‘ముందస్తు’ ఉండదు..
-
నాకు పదవి ఇవ్వాల్సిందే..
పంజగుట్ట(హైదరాబాద్): ‘టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నా.. రూ.కోట్లు పార్టీ అభివృద్ధికి ఖర్చు చేశా.. కానీ ఇప్పటివరకు ఏ నాయకుడు నన్ను గుర్తించలేదు.. ఏ పదవీ ఇయ్యలేదు.. వెంటనే నాకు ఏదో ఓ పదవి ఇవ్వాలి’అని కోరుతూ టీఆర్ఎస్ నాయకుడు ఒకరు సోమవారం ప్రగతిభవన్ ముందు ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకుని అతన్ని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా నాగపురం గ్రామానికి చెందిన లక్ష్మణ్ ముదిరాజ్ 2001 నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. పార్టీ అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. కానీ, పార్టీ నుంచి తనకు ఎలాంటి లబ్ధి చేకూరకపోగా ప్రస్తుతం నిరుద్యోగిగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 12:15గం.కు ప్రగతిభవన్ ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న డీజిల్ ఒంటిపై పోసుకున్నారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు గుర్తించి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించి సాయంత్రం వరకు దీక్ష చేయడంతో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేశారు. -
ప్రగతిభవన్‌లో వినాయకుడికి సీఎం కేసీఆర్ దంపతుల పూజలు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిష్టించిన మట్టి గణపతికి తన సతీమణి శోభతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ఎంపీ సంతోశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూజలకు కేసీఆర్ మనమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య రావు కూడా హాజరయ్యారు. -
పేదలకు గూడు లేదు.. నీకు ప్రగతి భవనా?
ఘట్కేసర్/ఉప్పల్/యాదాద్రి/అంబర్‌పేట: ‘పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా నువ్వొక్కడివి ప్రగతి భవన్ కట్టుకుంటే సరిపోతుందా’ అని సీఎం కేసీఆర్‌ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్ర«శ్నించారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్‌లోని నాంపల్లిలో ముగిసింది. అంతకు ముందు యాత్రలో భాగంగా భువనగిరి, ఘట్కేసర్లో, ఉప్పల్, అంబర్‌పేటలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మాట్లాడుతూ.. పేదలకు ఇళ్లు కట్టించేందుకు ప్రధాని మోదీ ముందుకు వస్తున్నా.. సీఎం కేసీఆర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించినా.. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. మోదీ ఏ ఒక్క రోజు సెలవు లేకుండా నిరంతరం పని చేస్తుంటే కేసీఆర్ ఫాంహౌజ్‌కు పరిమితమయ్యాడని ఎద్దేవా చేశారు. రెండు, మూడేళ్ల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉండరని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉందన్నారు. ప్రతి పేదకూ కోవిడ్ టీకా అందజేస్తున్నామని, అందరూ వ్యాక్సిన్ వేయించుకునే వరకు నిద్రపోమన్నారు. దేశంలో ఎరువుల కోసం కేంద్రం రూ.లక్ష కోట్ల సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రతినెలా క్రమం తప్పకుండా నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం రేషన్ దుకాణాల ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్న ఐదు కిలోల బియ్యం దీపావళి వరకు పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు. టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం... రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు గెలిచి చాలా మంది టీఆర్ఎస్లో చేరారని, కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే గెలిచిన వారంతా తెలంగాణ భవన్‌కే వెళ్తారని పేర్కొన్నారు. దేశంలోనే మొదటి సిమెంట్ కాంక్రీట్ జాతీయ రహదారి వరంగల్ వరకు నిర్మించిన ఘనత మోదీ సర్కార్‌దేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న భువనగిరి ఖిలాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అయితే కోట అభివృద్ధికి రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. మాఫియా రాజ్యం.. రాష్ట్రంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతుందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపిస్తే.. అసలు సెక్రటేరియటే కనిపించకుండా నేలమట్టం చేశాడన్నారు. బంగారు తెలంగాణ అందిస్తామన్న కేసీఆర్.. రాష్ట్రాన్ని ఓవైసీలకు దాసోహం చేశారని విమర్శించారు. 8 రాష్ట్రాల అభివృద్ధిని తన భుజస్కందాలపై మోదీ ఉంచారని, తెలుగువారు గర్వపడేలా నిజాయితీతో సేవ చేస్తానని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆ ఆప్యాయత వెంటాడుతోంది... అంబర్‌పేట ప్రజల కష్టార్జీతంతోనే.. వారి ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని కిషన్‌రెడ్డి అన్నారు. అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్తీల్లో చిన్నారులు, పెద్దల పలకరింపులు, ఆప్యాయత తనను వెంటాడుతూనే ఉన్నాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకొని కాసేపు మాట్లాడలేకపోయారు. అంబర్‌పేట ప్రజలను తన చివరి శ్వాస ఉన్నంత వరకూ గుర్తు పెట్టుకుంటానన్నారు. దేశానికి కేంద్ర కేబినెట్ మంత్రినే అయినా తాను అంబర్‌పేట బిడ్డనే అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానన్నారు. ఈ యాత్రలో ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జీ ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనవరి 1నుంచి పర్యాటక కేంద్రాల పునరుద్ధరణ.. కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జనవరి 1నుంచి దేశవ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను పునరుద్ధరించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టూరిజం సెంటర్లు, పురాతన కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, జలపాతాలను అభివృద్ధి చేసి దేశంలోని ప్రతి కుటుంబం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి రాష్ట్రంలో సంప్రదాయ పండుగలను గుర్తించడంతో పాటు చిత్రీకరించి దేశ, విదేశాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. రామప్పవంటి యునెస్కో గుర్తించిన 40 చారిత్రక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు ఆయన వివరించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, రూ.67వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. యాదాద్రి, భద్రాచలం, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. యాదాద్రీశుడి సేవలో కేంద్ర మంత్రి యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఉదయం 6.45 గం.కు బాలాలయానికి చేరుకొని సువర్ణ పుష్పార్చన చేశారు. అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అంతకుముందు మంత్రికి ఆచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈఓ గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. -
హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం
-
PRC: రేపు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: రేపు మంగళవారం జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఎన్నో కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్డౌన్ కొనసాగింపు.. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అంశాలతో పాటు ఉద్యోగులకు సంబంధించిన అంశంపై కూడా చర్చించనుంది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు ముఖ్యమైన అంశం వేతన సవరింపు సంఘం (పీఆర్సీ) కూడా అజెండాలో ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రేపు పీఆర్సీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు పీఆర్సీ అంశం చర్చకు రానుంది. ఉద్యోగుల వేతన సవరణ నివేదికను మంత్రివర్గం ఆమోదించనుంది. ఇప్పటికే వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్థిక శాఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల ఫిట్మెంట్, ఇతర అంశాలపై ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. -
జూడాల సమ్మె సరికాదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచేందుకు.. మూడేళ్లు వైద్య విద్య అభ్యసించి కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య విద్యార్థులకూ ఈ వేతనాన్ని వర్తింపజేసేందుకు సీఎం ఓకే చెప్పారు. కోవిడ్ విధుల్లో మరణించిన వైద్యులకు అందిస్తున్న ఎక్స్‌గ్రేషియాను సత్వరమే చెల్లించాలని.. జూనియర్ డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు జూనియర్ డాక్టర్ల సమ్మె విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చాలా రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు తెలంగాణ కంటే తక్కువ స్టైపెండ్ చెల్లిస్తున్నారని వివరించారు. దీంతో జూనియర్ డాక్టర్ల సమస్యలు ఏమిటని సీఎం ఆరా తీశారు. ఆయా అంశాలను అధికారులు వివరించగా.. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం ఎన్నడూ వివక్ష చూపలేదని, వారి సమస్యలను పరిష్కరిస్తూనే ఉందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందన్నారు. సమ్మెను ప్రజలు హర్షించరు విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచు కుని తక్షణమే విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. ‘‘జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలైనప్పుడు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండబోదు. వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చు. అంతేగానీ.. చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, సమయ సందర్భాలను కూడా చూడకుండా, విధులను బహిష్కరించడం సరైన పద్ధతి కాదు. అదికూడా కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరు’’అని స్పష్టం చేశారు. చదవండి: జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందన సమర్థవంతంగా లాక్డౌన్ అమలు: సీపీ అంజనీకుమార్ -
నా భార్యకు భర్తగా కొడుకు పేరా: ఈటల ఆగ్రహం
సాక్షి, కరీంనగర్: పార్టీలు ఉంటాయ్, పోతాయ్ వ్యక్తులు ఉంటారు పోతారు, కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని మాజీమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న క్రమంలో అధికారులు వ్యవహరించిన తీరు దారుణమని పేర్కొన్నారు. ఈటల జమున వైఫ్ ఆఫ్ నితిన్ అని రాశారని గుర్తుచేశారు. అధికారులకు కొడుకు ఎవరో, భర్త తెలియదు అన్నారు. ఆదరాబాదరా అయిన అర్థవంతమైన పని చేయాలని హితవు పలికారు. ఐఏఎస్ చదువుకున్న అధికారులు, బాధ్యత గల రెవెన్యూ అధికారులు, రిపోర్ట్ చేసే అధికారులు ఎంతనీచంగా ప్రవర్తించారో అదొక్కటే ఉదాహరణ అని ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్లో మంగళవారం మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల మాట్లాడారు. ‘జ్ఞానం పెట్టి రాయలే, డిక్టెషన్ చేస్తే రాసినట్టుంది. మళ్లీ చెబుతున్నా కనీసం తప్పు చేసినవని నోటీస్ ఇవ్వాలి, లేదా ఓ దరఖాస్తు వచ్చింది భూములను పరిశీలిస్తున్నాం, కొలుస్తున్నాం అని పిలవాలి. ఇప్పటికైనా పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నా. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగంతో నోరులేని వాళ్లకు, దిక్కులేని వారిని రాజ్యం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు కోర్టులు రాజ్యాంగ కాపాడుతుందని భావిస్తున్నాం.’ అని తెలిపారు. ‘ప్రభుత్వం నీచంగా ప్రవర్తించిందని త్వరలోనే తెలుస్తుంది. నేను ఎవరి గురించి కామెంట్ చేయను. నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టీఆర్ఎస్, సీఎం కేసీఆర్. పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదు. కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు.. నేనే స్వాగతించాను.. 2002లో టీఆర్ఎస్లో చేరిన. 2004 నుంచి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశా’ అని ఈటల తెలిపారు. మంత్రులు చేసిన విమర్శలపై ఈటల స్పందిస్తూ.. ‘మాకు త్యాగమే లేదు, కమిట్మెంట్ లేదు, చీమలు పెట్టిన పుట్టలో పాములుదూరినట్లు చేరానని, మేకవన్నె పులి అంటున్నరు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని తెలిపారు. ‘ఎవరి చరిత్ర ఏమిటో ప్రజాక్షేత్రంలో ఉంది. నా పై కక్ష సాధించడం సరికాదు. ఎవరి మాటలపై స్పందించను. నాతో ఎవరేం మాట్లాడినారో నాకు తెలుసు. జిల్లాకు సంబంధించిన ఓ సమస్యపై తాను మంత్రిగా గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా సీఎంను కలుద్దామని ప్రగతిభవన్‌కు వెళ్లితే అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ సందర్భంలో సీఎంకు ఇంత అహంకారం ఉంటుందా అని గంగుల అన్నారు. అలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడితే ఎలా? నేను ఎవరి గురించి మాట్లాడను, కామెంట్స్ చేయను’ అని స్పష్టం చేస్తూ సమావేశం ముగించారు. చదవండి: నోటీస్ ఇవ్వకుండా రాజ్‌భవన్‌పై కూడా విచారించొచ్చు సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్ -
పంచాయతీల మాదిరిగానే నిధులు, విధులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకూ నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్ట విధులు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బడ్జెట్లోనే ఈ నిధులు కేటాయిస్తామన్నారు. మండల, జిల్లా స్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, పంచాయతీలు నిధులను వినియోగించుకునే అధికారం కొత్త పంచాయతీరాజ్ చట్టం కల్పించిందన్నారు. దీన్ని సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను క్రియాశీలం చేస్తామని ప్రకటించారు. సోమవారం ప్రగతి భవన్లో స్థానిక సంస్థల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. విధులు, బాధ్యతలు... ‘స్థానిక సంస్థల బలోపేతం ప్రభుత్వ విధాన నిర్ణయం. దాన్ని అమలు చేస్తున్నం. ఇందులో ఆర్థిక సంఘం.. గ్రామ పంచాయతీలకు నెలకు రూ.308 కోట్లు, మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్లు విడుదల చేస్తోంది. గ్రామాల్లో ట్రాక్టర్లు, డంప్ యార్డులు, నర్సరీలు, వైకుంఠ ధామాలు సమకూరాయి. ఇదే తరహాలో జిల్లా, మండల పరిషత్‌లకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తం. వీటిని నరేగా లాంటి పథకాలతో అనుసంధానం చేసుకోవడం వల్ల మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. అలాగే జెడ్పీలు, ఎంపీపీలకు విధులు అప్పగించాలి. ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో అధికారులు సూచించాలి. ఆ సూచనలపై జెడ్పీ చైర్ పర్సన్లతో నేనే స్వయంగా చర్చిస్తా. తర్వాత తుది నిర్ణయం తీసుకుంటం. మొత్తంగా జిల్లా, మండల పరిషత్‌లను మరింత క్రియాశీలం చేసి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం, గౌరవం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది’అని సీఎం స్పష్టం చేశారు. చదవండి: (సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన టీఎస్ఆర్టీసీ) సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ ఆ నిధులు వినియోగించుకోవచ్చు... ‘గ్రామ పంచాయతీలు తమ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా కొత్త చట్టంలో నిబంధన పెట్టినం. కానీ కొన్ని చోట్ల రూ.2 లక్షలకు మించిన పనుల మంజూరుకు మండల అధికారుల నుంచి అనుమతి పొందాలనే పాత నిబంధన అమలు చేస్తున్నరు. ఇది కొత్త చట్టానికి విరుద్ధం. గ్రామ పంచాయతీలు తమ నిధులను, తమ గ్రామ అవసరాలు తీర్చడానికి సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉంది. ఎవరి జోక్యం అక్కరలేదు. ఈ విషయంలో అధికారులు మరోసారి స్పష్టత ఇవ్వాలి’అని కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, పీఆర్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, పీఆర్ కమిషనర్ రఘునందన్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, గుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, శంకర్ నాయక్, హర్షవర్థన్ రెడ్డి, ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సీతారామ ప్రాజెక్టు’ వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(కేసీఆర్) అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు, నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా కలుపుకుని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని సిఎం అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. చదవండి: ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేసీఆర్ గుడ్‌న్యూస్ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్సీలు మురళీధర్ రావు, హరేరామ్, సిఇలు వెంకట కృష్ణ, శంకర్ నాయక్, మధు సూదన్ రావు, ఎస్.ఇ. శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియ, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు ‘‘అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకం మంజూరు చేసింది. దుమ్ముగూడెం పాయింట్ వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుంది. ఈ నీటి ద్వారా ఖమ్మం జిల్లా యావత్తు నీరు అందించవచ్చు. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తి పోసి, అటు ఇల్లందు వైపు, ఇటు సత్తుపల్లి వైపు, మరోపక్క పాలేరు రిజర్వాయర్ కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాలి. సత్తుపల్లి, ఇల్లందు వైపు వెళ్లే కాలువలకు సంబంధించిన మిగిలిన పనుల సర్వే వెంటనే పూర్తి చేసి, టెండర్లు పిలవాలి. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించి, పాలేరు రిజర్వాయర్ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్ కల్లా పూర్తి చేయాలి. కృష్ణా నదిలో నీళ్లు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో తెలియదు. అంతా అనిశ్చితి ఉంటుంది. కృష్ణా నది ద్వారా నీరు అందని సమయంలో గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా సాగర్ ఆయకట్టుకు నీరందించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి’’ అని సిఎం చెప్పారు. -
ప్రగతి భవన్ ఎదుట విపక్షాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ ప్రగతిభవన్ ముందు ఆందోళనకు దిగిన విపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్‌కు పీపీఈ కిట్‌తో వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ఉదయం నుంచే వివిధ పార్టీల ముఖ్య నేతల ఇళ్ల పాటు, ప్రగతిభవన్ ముందు పోలీసులు భారీగా మొహరించారు. సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ప్రజా సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. -
కరోనాపై ఆందోళన వద్దు..!
సాక్షి, హైదరాబాద్: ‘కొన్ని అంచనాల ప్రకారం రాబోయే రెండు, మూడు నెలల్లో దేశంలో పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. అయినా ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఎక్కువైనా, అందరికీ వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైన పీపీఈ కిట్లు, టెస్టు కిట్లు, మాస్కులు, బెడ్స్, వెంటిలేటర్లు, ఆసుపత్రులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ‘కరోనా వైరస్ సోకినా చాలా మందిలో లక్షణాలు కనిపించనందున పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్ది మందిలో మాత్రం లక్షణాలు కన్పిస్తున్నాయి. అలాంటి వారికి మంచి వైద్యం అందించాలి. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే మరింత శ్రద్ధ తీసుకుని, ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. పాజిటివ్‌గా తేలినా.. లక్షణాలు లేని వారిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రజలు కూడా లాక్డౌన్ నిబంధనలు, కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి’అని సీఎం సూచించారు. ‘రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా, వైద్య సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఎవరికైనా ఆరోగ్యం బాగా క్షీణిస్తే అత్యవసర వైద్యం అందించాలి’అని సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో మరణాల రేటు 2.82 శాతం కరోనా విషయంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను సీఎం, మంత్రులకు వైద్య నిపుణులు, వైద్య శాఖ అధికారులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీ వివరించింది. ‘కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైరస్ సోకిన తర్వాత కూడా 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించవు. ఇలాంటి వారికి ఎలాంటి వైద్యం కూడా అవసరం లేదు. 15 శాతం మందిలో జలుబు, జ్వరం, దగ్గు, దమ్ము లాంటి ఐఎల్ఐ (ఇన్ఫ్లుయెంజా వంటి అనారోగ్యం) లక్షణాలు కనిపిస్తాయి. ఐఎల్ఐ లక్షణాలున్న వారు త్వరగానే కోలుకుంటారు. మిగతా 5 శాతం మందిలో మాత్రమే తీవ్రమైన శ్వాసకోస సంబంధ వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. ఈ ఐదు శాతం మందిలోనే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా మరణాల రేటు భారత్‌లో 2.86 శాతం, తెలంగాణలో 2.82 శాతంగా ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇతరత్రా తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారే ఉన్నారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత రాకపోకలు పెరిగినా, వైరస్ వ్యాప్తి అంత ఉధృతంగా లేకపోవడం మంచి పరిణామం. కరోనా వైరస్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ కరోనాకు వ్యాక్సిన్, ఔషధం రానందున వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర స్థాయి కమిటీ సూచిం చింది. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతకుమారి, రామకృష్ణారావు, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస్, మెడికల్ హెల్త్ సలహాదారు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
దాల్ సరస్సులా గోదారి
సాక్షి, హైదరాబాద్: ‘శ్రీనగర్‌లోని దాల్ సరస్సును చూడగానే ముందుగా ఆకట్టుకునేవి గట్టున పొడవుగా ఉండే చెట్లు. మంచు కురిసే వాతావరణంలో సుందరంగా ఉండే సరస్సు అందాన్ని ఆ చెట్లు రెట్టింపు చేస్తాయి. ఇప్పుడు అదే తరహా ఎత్తయిన చెట్లను గోదావరి తీరం వెంట పెంచాలి’అని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిపై ప్రగతి భవన్లో శనివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల వల్ల వందల కిలోమీటర్ల మేర గోదావరి నదిలో నిత్యం జలకళ ఉట్టి పడుతుంది. ఏడాది పొడవునా నదుల్లో, కాల్వల్లో నీరు నిల్వ ఉంటుంది. నదికి ఇరు వైపులా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. నదికి ఇరు వైపులా దాల్ సరస్సులా ఉండే తరహాలో ఆకర్షణీయమైన చెట్లు పెంచవచ్చు. నదిలో బోటింగుకు అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌస్‌ల వద్ద కావాల్సినంత స్థలం ప్రభుత్వ అధీనంలోనే ఉంది. అక్కడ బృందావన్ గార్డెన్ లాంటి మ్యూజికల్ ఫౌంటెయిన్లు, వాటర్ పార్కులు ఏర్పాటు చేయవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి’అని సీఎం పేర్కొన్నారు. అనేక పుణ్యక్షేత్రాలు.. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు తుపాకులగూడెం, దుమ్ముగూడెం బ్యారేజీలు కూడా నిర్మితమవుతున్నాయి. వీటికి ఆనుకునే బాసర, ధర్మపురి, కాళేశ్వరం, గూడెం సత్యనారాయణస్వామి, కోటి లింగాల, పర్ణశాల, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలున్నాయి. రామగుండం, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో బొగ్గు గనులున్నాయి. ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండుల్లో బొగ్గు ఉత్పత్తి ఎలా అవుతుందో, పంపుహౌస్‌ల పనితీరు ఎలా ఉంటుందో పర్యాటకులకు చూపించే వీలుంటుంది. రామగుండం, జైపూర్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కూడా సందర్శనీయ ప్రాంతాలుగా తీర్చిదిద్దవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకుని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 7న మేడారానికి సీఎం కేసీఆర్ ఈనెల 5 నుంచి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 7న వెళ్లనున్నారు. జాతర తొలి రోజు సారలమ్మ గద్దెకు రానుండగా, ఆరో తేదీన సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది. జాతర చివరి రోజు 8వ తేదీన సమ్మక్క, సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ నెల 7న భక్తులు పెద్ద సంఖ్యలో సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుంటారు. అదేరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేక హెలీకాప్టర్‌లో మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మన్యంకొండ బ్రహ్మోత్సవాల ఆహ్వానం తెలంగాణ తిరుపతిగా పేరొందిన మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి ఆహ్వానిం చారు. ఫిబ్రవరి 4 నుంచి 13వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను ఇద్దరు మంత్రులు శనివారం సీఎం కేసీఆర్‌కు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యంకొండ శ్రీలక్ష్మిసమేత వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు మన్యంకొండ దైవదర్శనానికి వస్తారని వివరించారు. ఆహ్వానపత్రం అందజేసిన వారిలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూధన్ ఉన్నారు. -
ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. సోమవారం ప్రగతి భవన్లో జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ పలు కీలక విషయాలపై చర్చించారు. మరీ ముఖ్యంగా అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, షెడ్యూల్ 9,10లలోని ఆస్తుల విభజనకు సంబందించిన అంశాలపై చర్చించారు. అలాగే పోలీసుల ప్రమోషన్లకు సంబంధించిన అంశాలపై కూడా చర్చలు జరిపారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారుల ఆధ్వర్యంలో చర్చలు జరపాలని రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికారుల బృందం ఏపీకి, అలాగే ఏపీ ప్రధాన కార్యదర్శి, అధికారుల బృందం హైదరాబాద్‌కు రానుంది. రెండు రాష్ట్రాల్లోని తాగు, సాగు నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో జలాల తరలింపుపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా కృష్ణా-గోదావారి అనుసంధానం సహా.. చేపట్టాల్సిన పథకాలపై నిర్మాణాత్మక, ప్రణాళికల తయారీకి ఉభయ రాష్ట్రాల ఇంజనీర్లు భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
-
ప్రగతి భవన్లో కేసీఆర్, వైఎస్ జగన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు మధ్యాహ్న భోజనం కలిసి చేస్తారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చర్చకు రానున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో వైఎస్ జగన్, కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. -
‘వెల్గటూరు’ ఆదర్శనీయం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ స్వశక్తీకరణ్ పురస్కార్‌కు ఎంపికైన వెల్గటూరు మండలాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. వెల్గటూరు మండలం ఆదర్శనీయమని కొనియాడారు. 2017–18 సంవత్సరానికిగాను కేంద్రం ప్రకటించిన ఈ అవార్డును మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాసరావు ఇటీవల అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో గురువారం ఆయన ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం
-
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15 వేల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కొత్తగా మరో రూ.15,575.11 కోట్ల రుణాలు సమీకరించాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాళేశ్వరం నీటిపారుదల పథకం కార్పొరేషన్ పేరుతో నాబార్డు నుంచి రూ.1,500 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ.10 వేల కోట్లు, పీఎఫ్సీ నుంచే మరో రూ.4,075.11 కోట్ల రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ►గోదావరిపై దుమ్ముగూడెం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 3,481.9 కోట్ల అంచనా వ్యయంతో దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణానికి అనుమతిచ్చింది. ఈ బ్యారేజీకి అనుబంధంగా 320 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించాలని నిర్ణయించింది. ఈ బ్యారేజీకి అయ్యే ఖర్చును రెండేళ్ల పాటు బడ్జెట్లలో కేటాయించాలని నిర్ణయించింది. దుమ్ముగూడెం వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉండే ఐదారు నెలల పాటు తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 63 మీటర్ల ఎత్తులో, భూసేకరణ అవసరం లేకుండా నదిలోనే నీళ్లు నిల్వ ఉండేలా బ్యారేజీ నిర్మాణం చేపట్టొచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ►కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మిడ్‌మానేరు వరకు 3 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే వీలుంది. మేడిగడ్డ వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉన్నందున రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోసుకోవచ్చని అధికారులు ప్రతిపాదించారు. మిడ్‌మానేరు వరకు 3వ టీఎంసీని ఎత్తిపోసే పనులను చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రూ.11,806 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులకు సంబంధించిన ఖర్చులను రెండేళ్ల పాటు బడ్జెట్లో కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 1.1 టీఎంసీని తరలించనున్నారు. లోకాయుక్తకు సవరణలు.. లోకాయుక్త చైర్మన్, వైస్ చైర్మన్ల నియామకానికి సంబంధించిన అర్హతలను మార్చేందుకు తెలంగాణ లోకాయుక్త చట్టాన్ని అత్యవసరంగా సవరిస్తూ ఆర్డినెన్స్ తేవాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. లోకాయుక్త చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జీని నియమించాలన్న నిబంధన స్థానంలో జిల్లా జడ్జిగా పనిచేసి రిటైరైన వారికి కూడా అవకాశం కల్పించేలా సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పల్లె ప్రగతిలో విఫలమయ్యారు.. ►అధికారులపై సీఎం ఆగ్రహం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమమైన ‘పల్లె ప్రగతి’పురోగతిపై సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన ఈ కార్యక్రమం స్ఫూర్తిని కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అవసరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిని సీఎం ప్రశ్నించారు. ఎలాంటి అలసత్వం లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు. గతంలో 30 రోజుల కార్యక్రమం నిర్వహించినట్లుగా వచ్చే నెలలో 10 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఖర్చులు తగ్గిద్దాం.. ►కేబినెట్ భేటీలో ఆర్థిక స్థితిపై సీఎం కేసీఆర్ సూచనలు సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో శాఖల వారీగా ఖర్చులు తగ్గించుకో వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి పెంచాలని నిర్ణయానికి వచ్చింది. బుధవారం ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ లోతుగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ముఖ్య అధికారులతో జరిపిన భేటీలో చర్చించిన ఆర్థిక అంశాలను మరోసారి ఈ భేటీలో సీఎం ప్రస్తావించినట్లు తెలిసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.1.84 లక్షల కోట్లతో తొలుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి, ఆ తర్వాత రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రూ.1.46 లక్షల కోట్లకు కుదించిన విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. కేంద్ర పన్నుల వాటాతో పాటు ఇతరత్రా ఆదాయం తగ్గడం.. ప్రభుత్వ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 4 నెలల్లో ముగియనుండటంతో అత్యవసర పనులకు మినహా, ఇతరత్రా కేటాయింపులు చేయొద్దని సీఎం అధికారులకు సూచించారు. ఆర్థిక పరిస్థితి అనిశ్చిత స్థితిలో ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలకు నిధులు తగ్గించడంతో పాటు, శాఖల పరిధిలో ఖర్చు విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. కేంద్ర వాటాలో కోతతో ఇబ్బందులు ‘కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.19,719 కోట్లు రావాలి. గడిచిన 8 నెలల కాలంలో కేంద్రం నుంచి పన్నుల వాటా ద్వారా రూ.10,304 కోట్లు మాత్రమే వచ్చా యి. గత ఏడాది ఇదే సమయానికి అందిన పన్నుల వాటాతో పోలిస్తే మనకు రూ.224 కోట్లు తక్కువగా వచ్చాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని మనం కేంద్రాన్ని కోరినా స్పందన కనిపించట్లేదు. రాబోయే రోజుల్లో రాష్ట్రం వాటాలో 15 శాతం మేర కోత పడే సూచనలు కనిపిస్తున్నా యి. అదే జరిగితే రాష్ట్ర వాటాలో రూ.2,954 కోట్లు తగ్గుతాయి’ అని సీఎం వివరించారు. కేంద్రం వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్దాం.. ‘కేంద్రం వైఖరి చూస్తే పన్నుల వాటాలో రాబోయే రోజుల్లో మరింత కోత పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి చేద్దాం. కేంద్రం నుంచి జీఎస్టీ నష్ట పరిహారం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.1,719కోట్ల బకాయిల తో పాటు, ఐజీఎస్టీతో తెలంగాణకు రూ.2,812 కోట్లు రావాల్సి ఉందని’ సీఎం వెల్లడించినట్లు సమాచారం. కేంద్ర నిధులు రాని పక్షంలో రాష్ట్ర పథకాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున కేంద్ర వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలి సింది. దిశ హత్యాచారం, తదనంతర ఘటనలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. -
ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ లంచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు చొప్పున సీనియర్ కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశ అనంతరం కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని కార్మికులకు తెలియజేసేందుకే సీఎం కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే కార్మికుల సమస్యలు ఏంటో నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను నేరుగా సీఎంకే వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించి తమను ఆదుకుంటానని హామీ ఇచ్చారని కార్మికులు పేర్కొన్నారు. -
ఆర్టీసీపై మరోసారి సీఎం కేసీఆర్ సమీక్ష
-
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలతో నిన్న జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మెపై సోమవారం హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ సమీక్ష సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, కమిషనర్ సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు హాజరయ్యారు. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 23 రోజులుగా కొనసాగుతోంది. కార్మికులు, ప్రభుత్వం మధ్య చర్చల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ యాజమాన్యం శనివారం కార్మిక సంఘాల నేతలతో చర్చల ప్రక్రియకు ఆహ్వానించినా అవి ఫలప్రదం కాలేదు. మరోవైపు ఆర్టీసీ కార్మికులతో జరిపిన చర్చలపై అధికారులు ఇవాళ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. అంతేకాకుండా కోర్టులో తదుపరి వాదించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్...న్యాయ నిపుణులు,అధికారులతో చర్చించారు. తాజా పరిణామాల నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. -
టానిక్ లాంటి విజయం
సాక్షి, హైదరాబాద్: ‘హుజూర్నగర్ ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతికూల వాతావరణంలో హుజూర్నగర్ సభకు వెళ్లలేకపోయినా అద్భుత విజయం అందించారు. ప్రజలు ఆషామాషీగా కాకుండా ఆచితూచి, ఆలోచించి టీఆర్ఎస్కు ఓటు వేశారు. ఈ తీర్పు ప్రభుత్వానికి టానిక్ లాంటిది’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్లో మంత్రులు, పార్టీ నేతలతో కలసి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్షాలు దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలకు పాల్పడినా 43 వేల ఓట్లకుపైగా మెజారిటీతో ప్రజలు మా పార్టీ అభ్యర్థిని గెలిపించారు. హుజూర్నగర్ ప్రజలు ఏ అభివృధ్ధి కోసం ఓటు వేశారో ఆ ఆశలు నెరవేరుస్తాం. శనివారం హుజూర్‌నగర్‌లో జరిగే కృతజ్ఞత సభకు ఎన్నికల సంఘం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ సభకు హాజరై వారి ఆశలను నెరవేరుస్తా’అని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు నేతలందరూ మొక్కవోని కృషి చేయడం వల్లే హుజూర్‌నగర్‌లో విజయం సాధించామని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు అహంకారం వీడాలి ‘ప్రతిపక్షాలు పంథా మార్చుకోవాలని కోరుతున్నా. ఏ అంశాన్ని ఎత్తుకోవాలో తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు క్షమించరు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. వాళ్లు రోజూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సద్విమర్శ చేసే ప్రతిపక్షం అవసరం. కేసీఆర్‌ను తిడితే పెద్దవాళ్లు కాలేరు. ప్రజలు వంద శాతం అన్ని అంశాలను గమనిస్తున్నారు. విమర్శలు హుందాగా, విమర్శనాత్మకంగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు ఉంటే మంచిదే కానీ ఏది పడితే అది మాట్లాడితే ఎవరికీ మంచిది కాదు. కొన్ని పార్టీలు ఉప ఎన్నిక వాయిదా వేయించాలని చూశాయి. కేసీఆర్ హెలికాప్టర్‌ను తనిఖీ చేయాలని చెప్పాయి. కేసీఆర్ హెలికాప్టర్లో డబ్బులు తీసుకుపోతాడా? ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు నోరు అదుపులో పెట్టుకోవాలి. అహంభావం, అహంకారం లేకుండా వ్యవహరించాలి. బాధ్యతగా ప్రవర్తిస్తే రేపు మీరు కూడా అధికారంలోకి వస్తారు. ఈ విజయంతో గర్వం తలకెక్కించుకోకుండా మరింత బాధ్యతతో, సంస్కారవంతంగా పనిచేయాలని పార్టీ నేతలను కోరుతున్నా. రాష్ట్రాన్ని గాడిన పెట్టడమే మా ముందున్న సవాల్. ఓవైపు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలను కూడా సమాంతరంగా అమలు చేస్తున్నాం’అని కేసీఆర్ తెలిపారు. నవంబర్‌లోగా మున్సిపల్ ఎన్నికలు ‘వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇదివరకే రెండు చట్టాలు తెచ్చింది. నియమిత విధానంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ది జరిగేలా గ్రామ పంచాయతీ, మున్సిపల్ చట్టాలు రూపొందించాం. గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ. 330 కోట్లు కేటాయించి పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. అదే తరహాలో మున్సిపాలిటీలకు కూడా రూ. 1,030 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించి నూతన పాలక మండళ్ల ద్వారా పట్టణ ప్రగతికి ప్రణాళిక అమలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రూ. 1,030 కోట్లు కేటాయించి మొత్తం రూ. 2,060 కోట్లతో 141 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుంది. మున్సిపాలిటీ ఎన్నికలు అనుకున్న దానికంటే రెండు నెలలు ఆలస్యమయ్యాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో మున్సిపల్ ఎన్నికలపై 99 శాతం స్పష్టత వచ్చింది. 2, 3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదన ప్రభు త్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. నవంబర్‌లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’అని కేసీఆర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత గల్ఫ్ దేశాలకు ‘గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణవాసులను స్వదేశానికి రప్పించేందుకు మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత స్వయంగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. కేరళ అనుసరిస్తున్న ఎన్ఆర్ఐ పాలసీపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తుంది. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారిలో ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఆ ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో వెళ్లి తెలంగాణ వాసులు ఎక్కువగా ఉండే 4–5 గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తాం. ఇక్కడ న్యాక్ ద్వారా వారికి భవన నిర్మాణ రంగంలో శిక్షణ ఇప్పిస్తాం. మన వాళ్లు ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్తుంటే యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి కోసం తెలంగాణకు వస్తున్నారు’అని కేసీఆర్ వివరించారు. మహారాష్ట్రలో పోటీపై ఆసక్తి లేదు ‘నాందేడ్, యావత్మల్, చంద్రాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మహారాష్ట్రవాసులు టీఆర్ఎస్ తరపున అక్కడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ తెలంగాణలోనే దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతో మేము ఆసక్తి చూపలేదు. భివండీ, షోలాపూర్ వంటి ప్రాంతాల్లోనూ తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఆశ పడటంలో తప్పులేదు. 2001లో పుట్టిన టీఆర్ఎస్ నిలదొక్కుకునేందుకు ఎంతో శ్రమించింది. ఎవరైనా పార్టీ స్థాపించవచ్చు. అదేమీ దురాశ కాదు. అయితే లక్ష్యాన్ని చేరుకునే పద్ధతి సరిగా ఉండాలనేది టీఆర్ఎస్ భావన’అని కేసీఆర్ పేర్కొన్నారు. జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు ‘జర్నలిస్టులకు వంద శాతం ఇళ్ల స్థలాలు ఇస్తాం. సుప్రీంకోర్టులో ఉన్న కేసు త్వరలో కొలిక్కివచ్చే అవకాశం ఉంది. జర్నలిస్టుల సంక్షేమ నిధి సత్ఫలితాలిస్తోంది. జర్నలి స్టులు, రాజకీయ నాయకులు వ్యవస్థకు పరస్పరం అవసరం. ప్రెస్ అకాడమీ బాగా పనిచేస్తోంది’అని సీఎం కితాబిచ్చారు. కాగా, గవర్నర్ కార్యాలయానికి సందర్శకులు పెరగడం గురించి విలేకరులు అడగ్గా కొత్త గవర్నర్ వచ్చారు కాబట్టి సందర్శకులు పెరిగారంటూ కేసీఆర్ తనదైన శైలిలో బదులిచ్చారు. రెవెన్యూ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు ‘కొత్త రెవెన్యూ చట్టంతో ఉద్యోగాలు పోతాయనే అపోహలో కొందరు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. అలాంటి పరిస్థితే వస్తే వారిని వేరే చోట సర్దుబాటు చేస్తాం. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దయితేనే వీఆర్వో వ్యవస్థ వచ్చింది. అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల విషయంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సమస్యలు లేకుండా ఉంటే జీడీపీ కూడా పెరుగుతుందని ఇతర దేశాల అనుభవాలు వెల్లడిస్తున్నాయి. ఎవరూ డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా భూ రికార్డుల నిర్వహణ జరగాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం’అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. -
ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత
-
చలో ప్రగతి భవన్: నగరంలో భారీ ట్రాఫిక్ జామ్!
-
చలో ప్రగతి భవన్: రేవంత్ రెడ్డి అరెస్ట్
-
బైక్‌పై దూసుకొచ్చిన రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో ప్రగతి భవన్ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడి అక్కడ అదుపులోకి తీసుకుంటారు. మరికొందరు నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాత్రం పోలీసులను బురిడి కొట్టించారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ వారిని తోసుకుంటూ ఇంటి బయటకు వచ్చారు. అక్కడి నుంచి వేగంగా ముందుకు సాగిన రేవంత్.. అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోయాడు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. బైక్‌పై దూసుకొచ్చిన రేవంత్‌ను ప్రగతి భవన్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ప్రగతిభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పరిస్థితులు కొనసాగితే.. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు. ప్రగతి భవన్ గేట్లను తాకుతామని అన్నామని.. తాకి చూపించామని చెప్పారు. -
సికింద్రాబాద్ టు పంజాగుట్ట భారీ ట్రాఫిక్ జామ్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివస్తుండటంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో ప్రగతి భవన్‌కు దారితీసే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ప్యారడైజ్‌నుంచి బేగంపేట వరకు ప్రస్తుతం వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ఈ మార్గం మీదుగా ప్రగతి భవన్‌కు రాకుండా కాంగ్రెస్ శ్రేణులను నిలువరించేందుకు పోలీసులు బేగంపేటలో మోహరించారు. ఇక్కడ ఆందోళనకారులు కనిపించిన వెంటనే అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ప్రగతి భవన్ వరకు ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. వాహనదారులకు రోడ్డుమీద తీవ్ర పడిగాపులు తప్పడం లేదు. మరోవైపు ఈ మార్గంలోని మెట్రరైల్ స్టేషన్లలోనూ పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసనకారులు మెట్ర రైళ్లలో ప్రగతి భవన్‌కు చేరుకోకుండా ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. ఇక, సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కావడంతో నగరంలో రద్దీ భారీగా పెరిగింది. నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ నిదానంగా కదులుతోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రయాణికులు, స్కూలు విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పలు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకుంది. నగరంలో చెప్పుకోదగిన స్థాయిలోని ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. అయితే, ఇవి ఏమాత్రం సరిపోని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు తగినంత అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు పెద్దసంఖ్యలో సెట్విన్ బస్సులపై ఆధారపడుతున్నారు. దీంతో సెట్విన్లు చోటులేనంతగా. కిక్కిరిసిపోతున్నాయి. పలుచోట్ల సెట్విన్‌బస్సుల్లో మహిళలు సైతం ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. -
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘చలో ప్రగతి భవన్’ ఉద్రిక్తంగా మారింది. సోమవారం ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, విక్రం గౌడ్, రాములు నాయక్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలను తెలంగాణవ్యాప్తంగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లతో, ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరోవైపు ఎంపీ రేవంత్ రెడ్డి నివాసంతో పాటు, ఆయన అనుచరుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. ఇక మల్రెడ్డి రంగారెడ్డి నివాసాన్ని కూడా పోలీసులు చుట్టుముట్టడంతో ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించి, గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. చలో ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన ఎన్ఎస్యూఐ విద్యార్థులు అరెస్ట్ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీధర్ బాబు హౌస్ అరెస్ట్ దోమలగూడలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు సంగారెడ్డి జిన్నారం (మం) కాంగ్రెస్ నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరగా, వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పలువురు కాంగ్రెస్ నాయకులకు అదుపులోకి తీసుకున్న పోలీసులు -
బేగంపేట్ మెట్రో స్టేషన్‌కు తాళం
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట మెట్రో స్టేషన్‌కు అధికారులు తాళం వేశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ సోమవారం చలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిరసన కారులు స్టేషన్లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్లో నోటీసు అంటించారు. కాగా ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్ ముట్టడి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముందస్తుగా కాంగ్రెస నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
నేడు కాంగ్రెస్ ‘ప్రగతి భవన్ ముట్టడి’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్ ముట్టడి జరగనుంది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఆందోళన వ్యూహంపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి షబ్బీర్‌అలీ నివాసంలో కాంగ్రెస్‌నేతలు సమావేశమయ్యా రు. ఈ సమావేశంలో భువనగిరి, మల్కాజ్గిరి ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని కోరారు. కాంగ్రెస్ ఆందోళన నేపథ్యంలో ఆదివారం రాత్రే కాంగ్రెస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. 50 వేల కుటుంబాల ఆవేదన రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలే కాకుండా వారు చేస్తున్న సమ్మెలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ఆత్మగౌరవ పోరాటం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు కీలకంగా వ్యవహరించారన్నారు. వారి ఉద్యమంతో వచ్చిన తెలంగాణలో వారినే రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 50 వేల మంది కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నా యని, వారి ఆవేదన ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి: సీపీఐ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న సీపీఐ న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు గాయానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సమ్మెకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న రంగారావు బొటన వేలు తెగడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని చాడ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగుల ఉసురు తగులుతుంది: నాగం సాక్షి, హైదరాబాద్: సెల్ఫ్ డిస్మిస్ పేరుతో 50 వేల మంది ఉద్యోగులను రోడ్ల మీద పడేసిన సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆర్టీసీలో సమ్మె చేసే పరిస్థితి రావడానికి కేసీఆరే కారణమన్నారు. -
ఆర్టీసీ సమ్మె; ఓయూ విద్యార్థుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులతో పాటు వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలు దేరిన ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, టీఎస్‌యూ, టీఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూ క్యాంపస్‌లో భారీగా పోలీసు బలగాలను మొహరించి విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చలో ప్రగతి భవన్ ముట్టడికి వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడికి విపక్ష నేతలు, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించారు. సీపీఎం, సీపీఐ, ఏఐఎస్ఎఫ్ డీఐవైఎఫ్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. అరెస్టు సమయంలో పరుష పదజాలంతో దూషించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు పోలీస్ శిక్షణ కేంద్రంలో నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో ఆర్టీసీ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. వీరికి దళిత సంఘాలు, సీపీఎం, బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద సామూహిక దీక్షను చేపట్టారు. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ సామూహిక దీక్షను ప్రారంభించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
-
కేసీఆర్, వైఎస్ జగన్ ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె. చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతి భవన్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్‌కు సీఎం జగన్ చేరుకున్నారు. ఆయనకు కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికి లోపలికి తోడ్కోని వెళ్లారు. అనంతరం వీరిద్దరి భేటీ ప్రారంభమైంది. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగే అవకాశముంది. విభజన చట్టంలోని పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతారు. జల వనరుల సద్వినియోగం.. 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగు విద్యుత్తు బిల్లులపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు. కేసీఆర్‌కు జగన్ ఆహ్వానం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(టీటీడీ) తరపున ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు వైఎస్ జగన్ అందజేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు సీఎం జగన్ వెంట ఉన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఈ రాత్రికి లోటస్‌పాండ్‌లోనే సీఎం వైఎస్ జగన్ బస చేయనున్నారు. మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 11.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ప్రగతి భవన్లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ -
రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె. చంద్రశేఖర్ రావు సోమవారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్‌కు చేరుకుంటారు. ఇక్కడే వీరిద్దరూ సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 లోని పరిష్కారం కాని అంశాలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకం, ఉద్యోగుల విభజన, ఇతర పెండింగు అంశాలు, జలవనరుల సద్వినియోగం, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగు విద్యుత్తు బిల్లులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా వీటితోపాటు ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడంతోపాటు నీటి వనరుల సమగ్ర సద్వినియోగంపై గతంలో రెండు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, సలహాదారులు, ముఖ్య కార్యదర్శులు హైదరాబాద్‌లో సమావేశమై చర్చించిన విషయం విదితమే. చర్చల కొనసాగింపులో భాగంగా తర్వాత ఇరు రాష్ట్రాల ప్రభుత్వ, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు సమావేశమై చర్చించారు. ఈ చర్చలన్నీ సామరస్యపూర్వక వాతావరణంలో జరిగిన నేపథ్యంలో సోమవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారు. -
విషయం తెలియక వెళ్లాను
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు సందర్భంగా తనను ప్రగతిభవన్‌లోకి అనుమతించలేదని వచి్చన వార్తలపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ‘గవర్నర్ వీడ్కోలు సమావేశానికి రావాల్సిందిగా నాకు ప్రగతిభవన్ నుంచి ఫోన్ వచి్చంది. అయితే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు చేయాల్సిన ఫోన్ నాకు పొరపాటున వచి్చనట్లుగా తర్వాత గుర్తించారు. ఆ విషయం తెలియక నేను ప్రగతిభవన్‌కు వెళ్లాను. మంత్రు లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం ఉండటంతో.. అదే సమయంలో వచి్చన మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ లోనికి వెళ్లి ఉంటారు. ఇందులో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర ఏమీలేదు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు’ అని ఆమె అన్నారు. -
ఎవరిపై కేసు పెట్టాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రగతిభవన్‌లో కుక్క చనిపోతే డాక్టర్ మీద కేసు పెట్టారని, అదే జ్వరాలతో ప్రజలు చని పోతుంటే ఎవరిపై కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ హాల్ బయట ఆయన మాట్లాడుతూ.. అధికారులను బ్లీచింగ్ పౌడర్ వేయమంటే డబ్బులు లేవంటున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేయలేని పరిస్థితుల్లో ఈ సర్కార్ ఉందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఓనర్ల పంచాయితీపై స్పందిస్తూ ఈటల జెండా ఓనర్లం అనడంలో తప్పులేదన్నారు. గతంలో బతుకుదెరువు కోసం తాను కూడా టీఆర్ఎస్లోకి వెళ్లి వచ్చానని చెప్పుకొచ్చారు. -
ప్రగతి భవన్లో గవర్నర్‌కు వీడ్కోలు సభ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి, మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. వీడ్కోలు అనంతరం గవర్నర్ ఈవాళ సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు. మరోవైపు తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తమిళసై సౌందర్ రాజన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు రాజ్‌భవన్‌లో నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు కానున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేని, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో చట్టం ఉండాలంటే ఎలాంటి నిబంధనలు రూపొందించాలనే అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో తమ అనుభవంలో ఉన్న విషయాలను, కొత్త చట్టం రూపకల్పనలో సూచనలను కలెక్టర్ల వద్ద నుంచి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం కలెక్టర్లు కూడా అభిప్రాయాలు, సూచనలు చెప్పడానికి, చర్చలో భాగస్వామ్యం కావడానికి సిద్ధమై రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. పల్లెలు, పట్టణాలలో అమలు చేయబోయే 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మూడు విషయాలపై లోతైన చర్చ జరగాల్సి ఉన్నందున ఈ సమావేశం రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. -
తెలుగు రాష్ట్రాల సలహాదారుల సమావేశం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి రోడ్డు మ్యాప్ ఖరారవుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ సలహాదారులు శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. నిన్నటి ముఖ్యమంత్రుల భేటీ ఆధారంగా ఇరు రాష్ట్రాల అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా జూలై రెండో వారం తరువాత ఏపీలో మరోసారి రెండు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. నెల రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఇరురాష్ట్రాల సీఎంల కార్యాచరణ ఉండే అవకాశం ఉంది. -
వైఎస్ జగన్ స్వచ్ఛమైన మనసుతో వ్యవహరించారు..
సాక్షి, హైదరాబాద్ : అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా కలకలలాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను గతం గతః అన్న రీతిలో మరిచిపోయి, మంచి మనసుతో రెండు రాష్ట్రాలకు ఎంత వీలయితే అంత మేలు చేసే విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉభయ ప్రభుత్వాలు పనిచేస్తాయని ప్రతిన బూనారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఎదుర్కుంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించునే దిశగా అడుగు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్లో జరిగింది. చదవండి: ఏపీ, తెలంగాణ సీఎంల కీలక భేటీ ప్రారంభం ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని స్పష్టం చేశారు. ‘బేషజాలు లేవు. బేసిన్ల గొడవ లేదు. అపోహలు లేవు. వివాదాలు అక్కర్లేదు. వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళివ్వలేము. కేసీఆర్, జగన్‌లు వ్యక్తిగతంగా ఆలోచించరు. ప్రజల కోణం నుంచే ఆలోచిస్తరు. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. వారికి మేలు చేయడమే మా బాధ్యత. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మక మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో, పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ, రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారు. కలిసి నడుద్దామనుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని ముఖ్యమంత్రులు కలిసి పాల్గొనడం మంచి సంకేతం ఇచ్చింది. మహారాష్ట్రతో సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగలిగాం. అదే విధంగా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలుంటే, అంతిమంగా ప్రజలకు మేలు కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రజలకు ఎంత వీలయితే అంత మేలు చేయడమే మా లక్ష్యం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ‘తక్కువ ఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఉత్తమమైన, సులభమైన మార్గం ద్వారా సాగునీటి కష్టాలు తీర్చాలి. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతోంది. రాబోయే కాలంలో ఇంకా తగ్గవచ్చు. అందుకే గోదావరి నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, పాలమూరు, నల్గొండ ప్రాంతాల సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. నీటిని ఎలా తరలించాలనే విషయంలో అధికారులు అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సమావేశం సందర్భంగా నదుల్లో నీటి లభ్యతపై ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో పాటు ఆ రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య(నాని), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సీనియర్ అధికారులు ఎల్.ప్రేమచంద్రారెడ్డి, కె.ధనుంజయ రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఎంపి కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, జెన్ కో -ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు, సలహాదారుడు టంకశాల అశోక్, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులున్నారు. -
బండారు దత్తాత్రేయ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వం, బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపు నివ్వడంతో సీఎం నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ కేనన్స్‌తో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. పలుమార్లు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ప్రగతి భవన్‌వైపు దూసుకురావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దశల వారీగా ప్రగతి భవన్ ముట్టడి వస్తున్న బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను అదుపుచేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. బీజేవైఎం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వినయ్ సహా 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమతో వాగ్వాదానికి దిగిన బీజేవైఎం నేత భానుప్రకాశ్‌పై పోలీసులు పిడిగుద్దులు కురిపించడంతో ఆయన ఆస్పత్రిపాలయ్యారు. కాగా, బీజేపీ నాయకుడు జితేందర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి వస్తున్న ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్.. నిమ్స్‌లో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. -
ఇంటర్ ఫలితాల వివాదంపై కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ హాజరయ్యారు. కాగా ఇంటర్ ఫలితాల అవకతవకల నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 19మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నాగినేనిపల్లిలో ఇంటర్ విద్యార్థిని మిథి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇంటర్ సెకండియర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఆమె ఈ ఘటనకు పాల్పడింది. మరోవైపు ఇవాళ కూడా ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. చదవండి....(మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య) -
మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామానికి చెందిన చాకలి రాజు అనే 18 ఏళ్ల విద్యార్థి.. అదే గ్రామంలోని పాఠశాలలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ గ్రూప్‌లో ఇంటర్ చదివిని రాజు...రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రగతి భవన్ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ప్రయత్నించింది. ప్రగతి భవన్ ముట్టడికి తరలివచ్చిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఇంటర్ బోర్డు వైఫల్యంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగో రోజూ ఆందోళనలు ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోర్డు తప్పిదాలపై తల్లిదండ్రులతోపాటు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో బోర్డ్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు సైతం రావల్సిన సమయం కంటే ముందుగానే బోర్డుకి చేరుకున్నారు. అయినా, ఆందోళనలు ఆగడం లేదు. మరోవైపు పరీక్షా పత్రాల రీ వాల్యుయేషన్, మార్కుల రీకౌంటింగ్ గడువు పెంచినప్పటికీ.. విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోయింది. దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ బోర్డు వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు.. పెద్దసంఖ్యలో ఇంటర్ బోర్డు వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ తప్పిదాలు.. విద్యార్థుల బలవన్మరణాలు ఇంటర్ ఫలితాల అవకతవకల నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 18మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ఇంటర్ బోర్డు తప్పిదాలకు మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిరుమలాపూర్‌కు చెందిన జ్యోతి..ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సెకండియర్ సివిక్స్ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జ్యోతి..ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన జ్యోతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. కాగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన నవీన్ (నిన్న) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు కళ్లు తెరవడం లేదు. తప్పులు సరిదిద్దుకునే చర్యలు చేపట్టడం లేదు. కళ్లేదుట తప్పులు కనబడుతున్న బోర్డు పెద్దలు ఆ తప్పును అంగీకరించడం లేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇంటర్ బోర్డు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న వారి నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదు. పైగా న్యాయం కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్ధుల్లో ధైర్యం నింపాల్సిన అధికారులు కూడా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రేపు ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ ధర్నా.. ఇంటర్ పరీక్షల నిర్వహణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల 18 మంది విద్యార్థులు తమ జీవితాలను కోల్పోయారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ల ఎదురుగా ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు. విద్యార్థుల పరీక్షాపత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
అవినీతి పెరిగిపోయిందంటూ కేసీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : అవినీతికి ఆస్కారం లేని విధంగా, ప్రజలకు మరింత బాగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలని సూచించారు. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి పేరుతో పిలవబడే ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని అడిషనల్ కలెక్టర్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని పిలవబడే ముఖ్య అధికారుల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. లే అవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాలు(అసెస్మెంట్స్) తదితర పనులన్నీ ఈ అధికారిక బృందం ఆధ్వర్యంలోనే జరగాలని వివరించారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలన్నారు. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా గొప్ప బాధ్యతలేవీ లేవు. ప్రజలకు ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పని జరగాలి. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కావల్సిన పనులు జరగాలి. దీనికోసం కఠినమైన కొత్త చట్టాలు తేవాలి. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలి. జిల్లా పరిషత్‌లకు, మండల పరిషత్‌లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త మున్సిపాలిటీలను, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకుండా ప్రజలకు పని కావడంతోనే ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘నాకు ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి? లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం పటిష్టమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలి. రెవెన్యూలో, రిజిస్ట్రేషన్లలో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో ఒక్క పైసా ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితులు రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉంది’ అని ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ‘జిల్లా ముఖ్య పరిపాలనాధికారి సారథ్యంలో సీనియర్ అధికారుల నాయకత్వంలో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థ ఉండాలి. భూమిశిస్తులు, నీటి రకాలు వసూలు చేసినప్పుడు కలెక్టర్ అనే పదం పుట్టింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్ అనే పిలవాలా? లేక జిల్లా పరిపాలనాధికారి అనే పేరు పెట్టాలా? అని ఆలోచించాలి. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్యమైన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలి. వారికి కొన్ని నిర్థిష్ట శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బృందం పర్యవేక్షించాలి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత. కలెక్టర్/పరిపాలనాధికారి, అడిషనల్ కలెక్టర్/అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విధులు, బాధ్యతలను నిర్ధిష్టంగా పేర్కొనాలి. లే అవుట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు (ప్రాపర్టీ అసెస్మెంట్స్) తదితర పనులు ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని బృందం చేయాల్సి ఉంటుంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లాగా తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను నెలకొల్పి రాష్ట్రంలోని స్థితిగతులకు అనుగుణంగా పాలన సజావుగా సాగే ప్రక్రియను ప్రవేశ పెట్టే అవకాశాలు పరిశీలించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలి. సిఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ సిఎస్ లను నియమించాలి. వారికి శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పనితీరును సిఎస్ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు కావాల్సిన నిర్ణయాలను ఈ బృందం తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు పారిశుద్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం నిర్మించాలి. నర్సరీ ఏర్పాటు చేయాలి. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. ఇవన్ని అంశాలు కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపరచాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘తెలంగాణలో పట్టణ జనాభా బాగా పెరుగుతున్నది. పట్టణాల్లో ఏర్పడే అవసరాలను తీర్చే విధంగా తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. హైదరాబాద్ నగరానికి సంబంధించిన జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఇతర పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరగాలి’ అని సిఎం చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కెటి రామారావు, బాల్క సుమన్, వివేకానంద గౌడ్, ఎంపిలు బిబి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి, సీనియర్ ఐఎఎస్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, సునిల్ శర్మ, అరవింద్ కుమార్, నీతూ ప్రసాద్, స్మితాసభర్వాల్, న్యాయ కార్యదర్శి నిరంజన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
8 లేదా 9 మందికి చాన్స్.. తెలంగాణ మంత్రులు వీరే..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరికొద్ది గంటల సమయమే ఉండటంతో కేబినెట్లో బెర్త్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ‘హై’ టెన్షన్ నెలకొంది. మంత్రివర్గ విస్తరణలో పలువురి పేర్లు తెరమీదకు వచ్చినా... తుది జాబితా మాత్రం ఇప్పటివరకూ అధికారంగా బయటకు రాలేదు. మరోవైపు ఎనిమిది లేదా తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలకే ప్రగతి భవన్ నుంచి పిలుపురావడంతో వారంతా ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ అధికారులు పలువురికి ఆదివారమే సమాచారం అందించగా, తాజాగా సోమవారం మరికొందరు ప్రగతి భవన్ చేరుకున్నారు. వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందంటూ ప్రశాంత్ రెడ్డి (నిజామాబాద్), నిరంజన్ రెడ్డి (మహబూబ్ నగర్), ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), జగదీశ్ రెడ్డి (నల్లగొండ), కొప్పుల ఈశ్వర్ (కరీంనగర్), ఎర్రబెల్లి దయాకర్ రావు (వరంగల్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్ నగర్), ఈటల రాజేందర్ (కరీంనగర్), అలాగే డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు, చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మంత్రివర్గంలో ఉంటారా అనే దానిపై అధికార పార్టీతోపాటు రాజకీయ వర్గాలు, ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఎవరికి వారు మాత్రం తమకు ఛాన్స్ దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. సీఎం కార్యాలయం లేదా సాధారణ పరిపాలనశాఖ నుంచి ఫోన్లు వచ్చాయా అంటూ ఆశావహులు తమ పరిధి మేరకు ఆరా తీస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరం నుంచి కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కనివారికి అంతకు సమానమైన కేబినెట్ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ కూర్పుపై నెలకొన్న సస్పెన్స్‌కు తెర పడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
‘సాగు’తో తొలి అడుగు!
సాక్షి, హైదరాబాద్: రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కె.చంద్రశేఖర్‌రావు తొలి అధికారిక సమీక్షను సాగునీటి ప్రాజెక్టులతో ఆరంభించనున్నారు. శనివారం ఉదయం ప్రగతిభవన్‌లో కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలపై సమీక్షించనున్నారు. సమీక్షకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని పనుల పురోగతి, అవాంతరాలు, కోర్టు కేసులు, అవసరమయ్యే బడ్జెట్ వంటి అంశాలపై చర్చించనున్నారు. కాళేశ్వరంపై ఫోకస్.. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న నిర్ణీత వాటా నీటిని వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు ముగింపుదశకు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో మొత్తంగా 85 గేట్లు అమర్చాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే 6 గేట్లను అమర్చారు. ఇక్కడి పంప్‌హౌస్‌లో 3 మోటా ర్లు అమర్చారు. అన్నారం బ్యారేజీలో 66, సుందిళ్లలో 74 గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తయింది. అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల పరిధిలో రెండేసి మోటార్లు అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు.ట్రయల్‌రన్‌కు అంతా సిద్ధం చేసినా, గ్రావిటీ కెనాల్లో పనులకు ఆటంకం కలుగుతుందని నిలిపివేశారు. దీనిపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 8లోని మోటార్లు సిద్ధంగా ఉన్నా, ప్యాకేజీ–7లో టన్నెల్లో లైనింగ్పనులు జరుగుతున్నాయి. ఈ పనుల పూర్తిపై సీఎం లక్ష్యాలను విధించనున్నా రు. వచ్చే మార్చి నాటికి ట్రయల్‌రన్ పూర్తి చేసి, జూన్‌లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని ఎల్లంపల్లి దిగువకు తరలించే ప్రణా ళికలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాజెక్టు కోసం అవసరమయ్యే నిధులపై అధికారులు వివరా లు సిద్ధం చేశారు. ప్రాజెక్టుకు రూ.33 వేల కోట్ల మేర రుణాలు అవసరమని లెక్కించగా, ఇందులో ఇప్పటి కే వివిధ బ్యాంకుల నుంచి రూ.27,240 కోట్ల రుణా లు తీసుకున్నారు. వీటిలో ఇప్పటికే రూ.22,790 కోట్లు ఖర్చు పెట్టారు. మరో రూ.5,700 కోట్ల మేర రుణాలకు మాత్రమే అవకాశం ఉంది. మిగతా నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై సీఎం పలు సూచనలు చేసే అవకాశం ఉంది. సీతారామ ఎత్తిపోతల కింద 70.40 టీఎంసీలతో 7 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో పనులు చేపట్టినా అవి ముం దుకు కదల్లేదు. సీతారామ ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే రూ.832 కోట్ల మేర నిధుల సేకరణ జరగ్గా, మున్ముందు అవసరమైన నిధులు, ఈ ప్రాజెక్టు పరిధిలో ఇంకా కేంద్ర సంస్థల నుంచి రావాల్సిన అనుమతులపై శనివారం నాటి భేటీలో చర్చించనున్నారు.