
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు.
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు మధ్యాహ్న భోజనం కలిసి చేస్తారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చర్చకు రానున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో వైఎస్ జగన్, కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు.