
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిష్టించిన మట్టి గణపతికి తన సతీమణి శోభతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ఎంపీ సంతోశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూజలకు కేసీఆర్ మనమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య రావు కూడా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment