తెలుగు రాష్ట్రాల సలహాదారుల సమావేశం | AP And Telangana Officials Meeting In Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల సలహాదారుల భేటీ

Published Sat, Jun 29 2019 5:51 PM | Last Updated on Sat, Jun 29 2019 5:54 PM

AP And Telangana Officials Meeting In Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి రోడ్డు మ్యాప్‌ ఖరారవుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ సలహాదారులు శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. నిన్నటి ముఖ్యమంత్రుల భేటీ ఆధారంగా ఇరు రాష్ట్రాల అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, తెలంగాణ సీఎస్‌ ఎస్కే జోషి, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా జూలై రెండో వారం తరువాత ఏపీలో మరోసారి రెండు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. నెల రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఇరురాష్ట్రాల సీఎంల కార్యాచరణ ఉండే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement