ajay kallam
-
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉపయోగాలు తెలిస్తే ప్రజలంతా జగన్‌కే ఓటు వేస్తారు
-
అజేయ కల్లం పిటిషన్ విచారణకు స్వీకరణ
హైదరాబాద్: వివేకా హత్య కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తాను ఇచ్చిన స్టేట్మెంట్ను సీబీఐ అబద్ధాల మయంగా మార్చేసిందన్నది ఆయన వాదన. ఈ క్రమంలో.. గత వారం ఆయన వేసిన పిటిషన్ విచారణ అర్హతకు సంబంధించిన ఆదేశాలను రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇవాళ(శుక్రవారం) విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో.. రిజిస్ట్రీ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌కు మెయిన్ నంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ‘‘సీఆర్పీసీ సెక్షన్-161 ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. మెస్సేజ్ చేసి విచారణకు పిలిచారు. నా స్టేట్మెంట్ రికార్డు చేయలేదు. అప్పటి విచారణాధికారి వికాస్ సింగ్. స్టేట్మెంట్పై సంతకం మాత్రం ముఖేష్ శర్మది ఉంది. సీనియర్ ఐపీఎస్‌లు అయ్యిఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదు. నేను చెప్పింది యధాతథంగా రికార్డు చేయలేదు. దర్యాప్తు వెనకాల దురుద్దేశం కనిపిస్తోంది. సీబీఐ తన ఛార్జిషీట్లో తన స్టేట్మెంట్ తొలగించాలి. తిరిగి తనస్టేట్మెంట్ రికార్డు చేయాలి’’ అని గత వారం హైకోర్టులో వాదనలు సందర్భంగా అజేయ కల్లం న్యాయవాదులు వాదించారు. నాడు చెప్పింది ఇదే.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఏప్రిల్ 29, 2023న సీబీఐ అజేయ కల్లం నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ‘‘మార్చి 15, 2019న జగన్‌గారి నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు’’. ఇది తాను సీబీఐకి చెప్పింది.. అంతకు మించి తానేం చెప్పలేదు అని అజేయ కల్లాం అంటున్నారు. స్టేట్మెంట్ అంతా అబద్ధాలమయమే! జగన్ గారి భార్య ప్రస్తావనకాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదు. సీబీఐ తాను ఒకటి చెబితే.. దాన్ని మార్చేసి ఛార్జిషీట్లో మరోలా ప్రస్తావించింది. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అబద్ధాలే ఉన్నాయి. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోంది. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్మెంట్గా పేర్కొన్న అంశాలను కొట్టేయాలి. అవసరమైతే తన నుంచి మరోసారి స్టేట్మెంట్ను రికార్డు చేసేలా ఆదేశించాలి. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా వివేకా కేసులో విచారణ సాగాలని తన పిటిషన్లో అజేయ కల్లం కోరారు. -
వివేకా హత్య కేసులో అజేయ కల్లం పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హై కోర్టు
-
‘వివేకా కేసు దర్యాప్తులో దురుద్దేశం కనిపిస్తోంది!’
సాక్షి, హైదరాబాద్: వివేకా కేసులో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తన స్టేట్మెంట్ను యధాతథంగా రికార్డు చేయలేదని.. తిరిగి తన స్టేట్మెంట్ను రికార్డు చేయించేలా దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో ఇవాళ వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును రిజర్వ్ చేసింది. వివేకా కేసులో సీనియర్ అధికారి అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ‘‘సీబీఐ సీఆర్పీసీ సెక్షన్-161 ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. మెస్సేజ్ చేసి విచారణకు పిలిచారు. నా(అజేయ కల్లం) స్టేట్మెంట్ రికార్డు చేసింది అప్పటి విచారణాధికారి వికాస్ సింగ్. స్టేట్మెంట్పై సంతకం మాత్రం ముఖేష్ శర్మది ఉంది. సీనియర్ ఐపీఎస్‌లు అయ్యిఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదు. నేను చెప్పింది యధాతథంగా రికార్డు చేయలేదు. దర్యాప్తు వెనకాల దురుద్దేశం కనిపిస్తోంది. సీబీఐ తన ఛార్జిషీట్లో తన స్టేట్మెంట్ తొలగించాలి. తిరిగి తనస్టేట్మెంట్ రికార్డు చేయాలి’’ అని అజేయ్ కల్లం తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో పిటిషన్ విచారణ అర్హతపై తీర్పు రిజర్వ్ చేసింది ధర్మాసనం. నాడు చెప్పింది ఇదే.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఏప్రిల్ 29, 2023న సీబీఐ అజేయ కల్లం నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ‘‘మార్చి 15, 2019న జగన్‌గారి నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు’’. ఇది తాను సీబీఐకి చెప్పింది.. అంతకు మించి తానేం చెప్పలేదు అని అజేయ కల్లాం అంటున్నారు. స్టేట్మెంట్ అంతా అబద్ధాలమయమే! జగన్ గారి భార్య ప్రస్తావనకాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదు. సీబీఐ తాను ఒకటి చెబితే.. దాన్ని మార్చేసి ఛార్జిషీట్లో మరోలా ప్రస్తావించింది. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అబద్ధాలే ఉన్నాయి. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోంది. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్మెంట్గా పేర్కొన్న అంశాలను కొట్టేయాలి. అవసరమైతే తన నుంచి మరోసారి స్టేట్మెంట్ను రికార్డు చేసేలా ఆదేశించాలి. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని తన పిటిషన్లో అజేయ కల్లం కోరారు. ఇదీ చదవండి: బతికున్నోళ్లను సునీతమ్మ బజారుకీడుస్తోంది -
వివేకా హత్య కేసులో సీబీఐ స్టేట్ మెంట్ లో అన్నీ అబద్దాలే ఉన్నాయన్న అజేయకల్లం
-
వివేకా హత్య కేసులో అంశాలను వక్రీకరించడం సరికాదు
-
దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట..
నేను సీబీఐ ఎస్పీకి చెప్పని వాటిని కూడా చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనాలను ప్రచురించడం దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని వైఎస్ జగన్ నాతో అన్నారని నేను సీబీఐకి వెల్లడించినట్లు వెలువడ్డ కథనం పచ్చి అబద్ధం. – అజేయ కల్లం సాక్షి, అమరావతి: మేనిఫెస్టో కమిటీ సమావేశానికి, హత్య కేసుకు సంబంధం ముడిపెడుతూ కథనాలను ప్రచురించటాన్ని బట్టి ఆంధ్రజ్యోతి ఏ స్థాయికి దిగజారిందో అర్ధం అవుతోందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు వైఎస్ జగన్ తనకు చెప్పారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్త పచ్చి అబద్ధమని అజేయ కల్లం ఖండించారు. అంతకుముందే మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందని, అందులో పాల్గొన్న వారిని విచారించాలంటూ గతంలో ఓ కథనం వెలువరించిందని, అందులో భాగంగానే మళ్లీ పచ్చి అబద్ధాలను ప్రచురించిందన్నారు. ఏదో ఒకవిధంగా ముఖ్యమంత్రి జగన్ పేరును లాగాలనే ప్రయత్నం మినహా ఆంధ్రజ్యోతి కథనాల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. విశ్వసనీయ వర్గాలంటూ తప్పుడు సమాచారంతో ఆ పత్రిక విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. సీబీఐ తనను విచారించిందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. కొద్దిరోజుల క్రితం సీబీఐ ఎస్పీ తన ఇంటికి వచ్చి ఐదు నిమిషాలు మాట్లాడి సమాచారం తీసుకున్నారని, ఆ సమయంలో గుండెపోటు అంశం చర్చకే రాలేదని, దాని గురించి అడగలేదని అజేయ కల్లం వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందిన రోజు యాధృచ్ఛికంగా పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతోందన్నారు. తమకు కాలేజీలో పాఠాలు బోధించిన గురువు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మేనిఫెస్టో రూపకల్పనలో సహాయం చేయాలని కోరడంతో సమాశానికి వెళ్లానని అజేయ కల్లం తెలిపారు. సమావేశం జరుగుతుండగా కొంతసేపటికి ‘వివేకానందరెడ్డి గారు నో మోర్..’ అని ఇంగ్లీషులో చెప్పడంతో ఇక లేచి వచ్చేశామన్నారు. అదే విషయాన్ని సీబీఐ ఎస్పీకి చెప్పానన్నారు. ‘మీరు స్వచ్ఛందంగా అంగీకరిస్తే రికార్డు చేసుకుంటామని సీబీఐ ఎస్పీ కోరారు. సెక్షన్ 161 కింద సమాచారాన్ని అడిగారు. అయితే ఆ సమాచారం, రికార్డుకు ఎటువంటి న్యాయపరమైన విలువ ఉండదు. సంతకాలు తీసుకోలేదు’ అని అజేయ కల్లం పేర్కొన్నారు. ‘సాంకేతికంగా ఎటువంటి విలువ ఉండదు. ఎవిడెన్స్‌గా పనికిరాదు. ఆ సెక్షన్ కింద కొన్ని అంశాలు యాడ్ చేసుకోవచ్చు, కొన్ని అంశాలు తొలగించవచ్చు’ అని కల్లం తెలిపారు. గుండెపోటు మాటే చర్చకు రాలేదు.. అసలు గుండె పోటు అనే పదమే సీబీఐ ఎస్పీని కలుసుకున్న సందర్భంగా చర్చకు రాలేదని అజేయ కల్లం స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో రహస్యంగా ఉండాల్సిన తమ ఇద్దరి సంభాషణ సమాచారం లీకుల పేరుతో ఆంధ్రజ్యోతిలో రావడం అంటే సీబీఐ విశ్వసనీయత కూడా దెబ్బతిన్నట్లేనని పేర్కొన్నారు. ఇది సీబీఐ పేరును దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. సీబీఐ ముందుకొచ్చి ఇలాంటి లీకు వార్తలను నిరోధించడంతో పాటు ఖండించాల్సి ఉందన్నారు. ‘మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఆ పనిమీద దృష్టి పెడతాం కానీ గడియారం చూసుకుంటూ కూర్చోం కదా! ఎవరు ఎప్పుడు బయటకు వెళ్లారో ఎలా తెలుస్తుంది? అయినా ఈ సమావేశాన్ని సీరియస్ మర్డర్ కేసుకు ముడిపెట్టి ఆంధ్రజ్యోతి తనకు కావాల్సినట్లు రాసుకోవడం కంటే అనైతికం మరొకటి ఉండదు..’ అని కల్లాం మండిపడ్డారు. ఖండించాల్సిన బాధ్యత సీబీఐపై ఉంది తన దగ్గర నుంచి తీసుకున్న సమాచారం చార్జిషీటు వేసేవరకు రహస్యంగా ఉండాలని, లీకుల పేరుతో తప్పుడు సమాచారం మీడియాలో ప్రచురితమైనందున ఆ వార్తను ఖండించాల్సిన బాధ్యత సీబీఐపై ఉందని కల్లాం పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో మీడియాలో సమాంతర దర్యాప్తు జరగకూడదని, ఇన్విస్టిగేషన్ ఏజెన్సీలు మీడియాకు వివరాలు వెల్లడించరాదని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని కల్లాం ప్రస్తావించారు. నిందారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా అందుబాటులో లేని సమాచారాన్ని మీడియాలో లీకుల పేరుతో ప్రచురించకూడదన్నారు. నా భార్యకు కూడా తెలియదు.. ‘దర్యాప్తు అంశాలను ఇష్టానుసారం ప్రచురించేందుకు, మీడియా తమ ఇష్టం అనేందుకు వీల్లేదని సుప్రీం కోర్టు తాజా తీర్పులున్నాయి. కనీస క్రమశిక్షణ, కోడ్ ఆఫ్ కాండక్ట్ మీడియాకు అవసరం. నేను సీబీఐ ఎస్పీకి చెప్పని అంశాలను చెప్పినట్లుగా నా ఫొటోతో పెద్ద శీర్షిక పెట్టి కథనాలు ప్రచురించటాన్ని బట్టి ఆ పత్రిక ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తోంది. ఆ సమయంలో నేను, సీబీఐ ఎస్పీ మాత్రమే ఉన్నాం. మా ఇంటికి సీబీఐ ఎస్పీ వచ్చిన విషయం నా భార్యకు కూడా తెలియదు. ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్త ప్రచురించిన తరువాతే మిగతా వారికి తెలిసింది’ అని కల్లాం తెలిపారు. ‘సెక్షన్ 161 కింద ఇచ్చిన సమాచారానికి ఎటువంటి న్యాయపరమైన విలువ లేదు. అయినా సాక్షిగా కూడా కాదు. తప్పుడు వార్తపై తగిన సమయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని చెప్పారు. సమాంతర విచారణ తగదు.. ఏదైనా క్రిమినల్ కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు దానికి సమాంతరంగా విచారణను ప్రభావితం చేసేలా మీడియా కథనాలను రాయకూడదు, చర్చలు పెట్టకూడదు. దర్యాప్తు సమయంలో విచారణాధికారికి సాక్షులు వెల్లడించిన అంశాలను చార్జిషీట్ వేసేవరకు బహిర్గతం చేయకూడదు. విచారణలో వెల్లడైన అంశాలను బహిర్గతం చేస్తూ కథనాలను ప్రచురిస్తే వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లేనని పలు కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులిచ్చాయి. దీన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా స్వాగతించింది’ అని పేర్కొంటూ ఈ సందర్భంగా అజేయ కల్లం వాటిని ఉదహరించారు. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! -
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఏడాదిపాటు పొడిగించింది ప్రభుత్వం. సజ్జలతో పాటు ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్)గా ఉన్న జీవీడీ కృష్ణ మోహన్ పదవి కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. అంతేకాదు ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ అడ్వైజర్ అజయ్ కల్లం, ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. -
AP: కాల్ సెంటర్ సేవలు భేష్
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమీకృత రైతు సమాచార కేంద్రం ద్వారా రైతులకు అందిస్తోన్న సేవలు బాగున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. మంగళవారం ఆయన గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను సందర్శించారు. కాల్ సెంటర్ ద్వారా రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. చదవండి: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకపోతే కృష్ణా జలాలు వృథా రైతుల నుంచి రోజూ ఎన్ని కాల్స్ వస్తున్నాయి? వారి సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తు న్నారు? తదితర విషయాలు తెలుసుకు న్నారు. కాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆర్బీకే చానల్‌ను సందర్శించి ప్రసారాలు, కార్యక్రమాల వివరాలను ఆరా తీశారు. రైతులకు మరింత ఉప యోగపడేలా ఈ సేవలను విస్తరించాలని సూచించారు. అజేయ కల్లం వెంట రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ (ప్రజా వ్యవహారాలు) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఈనెల 18వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. అలాగే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం పదవీ కాలం ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్ పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగుస్తోంది. అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వ సలహాదారు (కో–ఆర్డినేటర్–కార్యక్రమాలు) తలశిల రఘురాం పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని అప్పటి నుంచి మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. చదవండి: 7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ! -
తొమ్మిది గంటలు ఎంత వాడినా ఫ్రీనే
-
స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉచితంగానే చేస్తాం
-
పేదల పెన్నిధి.. సంక్షేమ సారథి డాక్టర్' వైఎస్సార్'
సాక్షి, గుంటూరు : ప్రభుత్వం ఉండేది ప్రజల కోసం. ప్రభుత్వాధినేతలు పని చేయాల్సింది ప్రజల కోసం. అధికారంలో ఉండేది ఏ పార్టీ అయినా కావచ్చు. కాని, అంతిమ లక్ష్యం మాత్రం ప్రజా ప్రయోజనమే అయ్యిండాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేవారని ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయ కల్లం అన్నారు. మంగళవారం స్థానిక హిందూ ఫార్మశీ కళాశాల ఆడిటోరియంలో ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో తొలుతగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం ప్రకటించారు. అనంతరం మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన అతిథులతో జ్యోతిప్రజ్వలనగావించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. సభకు మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించగా.. అజేయ కల్లం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దివంగత వైఎస్సార్ సంక్షేమ పాలకుడని, సుపరిపాలనా సేవకుడని కొనియాడారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను అర్థం చేసుకుని, అధినేతగా అధికారాన్ని అందుకోవడానికి ముందు, ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసిన నాయకుడు వైయస్సార్ అని కీర్తించారు. 1997లో ఏపీలో ఏడువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం అప్పులు పెరిగిపోవడమేనని... విద్య, వైద్యం, సాగునీటి సమస్యలేనని తాము అప్పట్లో నివేదిక అందజేసినట్లు గుర్తుచేశారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్ మెంట్ రూపకల్పన దివంగత వైఎస్ఆర్ చేతులమీదుగా జరిగాయని వివరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. 108 సర్వీసుల ఆరోగ్యయోధులు కోవిడ్ ఆపత్కాలంలో కష్టపడి, తెగువతో పనిచేసి లక్షలాది ప్రాణాలు నిలబెట్టారని అభినందించారు. అరబిందో 108 సర్వీసుల సీఈఓ సాయిస్వరూప్ మాట్లాడుతూ కోవిడ్ ఆపత్కాలంలో 108 అంబులెన్స్ సర్వీసుల ద్వారా 1.42 లక్షల కేసుల బాధితులను, 82వేల మంది సాధారణ రోగులను తరలించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాదిలో 108 ద్వారా నాలుగు వేల కొత్త ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ... మంచిని మెచ్చుకోలేని ప్రతిపక్షం ఉన్నా లేనట్టేనని... విమర్శల్ని సైతం పాజిటివ్ తీసుకునే వ్యక్తిత్వం డాక్టర్ వైఎస్ఆర్ ది అని చెప్పారు. ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ పారిశ్రామిక అభివృద్ధికి బీజాలేశారన్నారు. పేదల స్థితిగతులు తెలిసినందునే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల కోసమే ప్రభుత్వం అని ప్రకటించారని గుర్తుచేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ.. పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో వైఎస్ నిర్ణయాలు దేశానికే మార్గదర్శకాలయ్యాయని అన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ రాష్ట్రాన్ని దివంగత వైఎస్ నడిపించిన తీరు.. జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసిందని గుర్తుచేశారు. చైతన్య గోదావరిగ్రామీణ బ్యాంకు చైర్మన్ టి.కామేశ్వరరావు మాట్లాడుతూ దివంగత వైఎస్ భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారని తెలిపారు. కీర్తన ట్రస్టు అధినేత మేరుగ విజయలక్ష్మి మాట్లాడుతూ.. దివంగత వైఎస్ స్ఫూర్తి ఎప్పటికీ విలువల బాటలో నడిపిస్తూనే ఉంటుందన్నారు. మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి హయాంలో జనవిజ్ఞాన తరఫున కోరిన వినతులన్నీ అమలుచేసి పథకాల రూపంలో ప్రజలకు మేలు చేశారని.. పలు ఆశక్తికర ఘటనలను ప్రస్తావించి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన 28మంది 108 సేవల ఆరోగ్యయోధులకు సన్మానం చేసి ప్రభుత్వ ప్రసంశాపత్రం, మెమొంటో అందించారు. కార్యక్రమంలో గుంటూరు ఎక్సైజ్ డీసి అరుణ్ రావు, ప్రభుత్వ అధికారులు, నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ సత్కారం పొందిన 'ఆరోగ్య యోధులు' వీరే.. కోవిడ్ వంటి ఆపత్కాలంలో బాధితులకు సకాలంలో సేవలందించి అరబిందో 108 హెల్త్ ఎమర్జెన్సీ ఆంబులెన్స్ సర్వీసుకు మంచి పేరు తెచ్చిన 28 మంది ఆరోగ్య యోధులకు ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ తరఫున సత్కారం, ప్రశంశాపత్రం జ్ఞాపికను ప్రభుత్వం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి 28 మంది ఉత్తమ ఉద్యోగులను సత్కరించారు. సత్కారం పొందిన వారిలో విజయనగరం జిల్లా నుంచి మద్దు భవాని (ఈ ఎం టీ), ఆర్, ధనుంజయ నాయుడు( ఈఎంటీ), ఎం. కోటేశ్వరరావు (పైలట్), విశాఖ నుంచి మనుమత్తు అప్పారావు (పైలట్), శ్రీకాకుళం జి.జగన్నాథరావు (పైలట్), ఎస్. నాగభూషణ్ రావు (ఎన్ని), పశ్చిమగోదావరి నుంచి జి. వెంకటరావు(ఈఎంటీ), గొర్రె వెంకట నరహరి(పైలట్), తూర్పు గోదావరి నుంచి పంపన విజయకుమార్ (ఈవెంటీ), కె.భీమశంకరావు (పైలట్), కృష్ణా జిల్లా నుంచి కె. కోటేశ్వరరావు (ఈఎంటీ), బొలెం ఆనంద్ (పైలట్). గుంటూరు జిల్లా నుంచి తెనాలి 2 పైలట్ డిఎల్ శ్రీనివాస్, కారంపూడి ఏఎంటీ మేకల వెంకటరరావు, నెల్లూరు జిల్లా నుంచి షేక్ ఖాదర్ బాషా (ఈఎంటీ), మబ్బు లక్ష్మయ్య (పైలట్), ప్రకాశం జిల్లా నుంచి ఎం. శ్రీనివాసరాజు (ఈఎంటీ), కె. ప్రభాకర్ రావు (పైలట్), దర్గా మస్తాన్ రావు (పైలట్), వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి జి. వరలక్ష్మి (ఈఎంటీ), పలుకూరి ఎరుకలయ్య (పైలట్), చిత్తూరు జిల్లా నుంచి మన్నేరి రాజు (పైలట్), సోమశేఖర్ (ఈఎంటీ). కర్నూలు జిల్లా నుంచి డి. జీవన్ (ఈఎంటీ), బి. గురుస్వామి (పైలట్), అనంతపురం నుంచి డి దాదా బాషా (ఈఎంటీ), దాసరి శేఖర్ (పైలట్), దర్గా మస్తాన్ వలి(ప్రకాశం), షేక్ హసన్ (గుంటూరు) ఉన్నారు. -వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి చైర్మన్ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -
గవర్నర్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది: అజేయ కల్లాం
-
ఏపీ: ఖజానాకు భారీ ఆదాయం
సాక్షి, అమరావతి: ఉన్న వనరులతో రాష్ట్రానికి మరింత మేలు చేకూర్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ సంకల్పం అద్భుత ఫలితాలిస్తోందని సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం పేర్కొన్నారు. ‘రౌతు సరైనోడైతే గుర్రం దౌడు తీస్తుంది. పాలకుడు సరైనోడైతే పాలన పరుగులు పెడుతుంది’ అన్నది రాష్ట్రంలో నిజమవుతోందని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో అజేయకల్లం మాట్లాడుతూ సమర్థతకు సరికొత్త నిర్వచనంగా సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. (త్వరలో సీఎం జగన్ పల్లె బాట) గ్రీన్‌కోతో సంప్రదింపుల ద్వారా.. ►గ్రీన్కో గ్రూప్ విద్యుత్ ప్రాజెక్ట్‌పై సంప్రదింపుల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చారు. భూమి ధర పెంపు వల్ల దాదాపు రూ.250 కోట్లు, గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చార్జీ విధింపు వల్ల రూ.3,375 కోట్లు కలిపి మొత్తంగా రూ.3,625 కోట్లు రాష్ట్రానికి అదనంగా లబ్ధి చేకూరనున్నది. ►టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. ►సౌర, పవన విద్యుత్‌తో కలిపి జల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ ఇది. 1,000 మెగావాట్ల సౌర విద్యుత్, 550 మెగావాట్ల పవన విద్యుత్, 1,680 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ►టీడీపీ ప్రభుత్వం ఎకరాకు రూ.2.50 లక్షల చొప్పున గ్రీన్కో గ్రూప్‌నకు 4,600 ఎకరాల భూమిని కేటాయించింది. సీఎం వైఎస్ జగన్ పునఃసమీక్ష జరపగా.. ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించేందుకు ఆ సంస్థ సమ్మతించింది. ►ఇక గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చార్జీ కింద.. ఉత్పత్తి చేసే ప్రతి మెగావాట్‌కు 25 ఏళ్ల పాటు రూ.లక్ష చొప్పున చెల్లించేందుకు గ్రీన్కో సంస్థ సమ్మతించింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.31 కోట్లు ఆదాయం వస్తుంది. ►25 ఏళ్ల తరువాత ప్రాజెక్ట్ కొనసాగినంత కాలం మెగావాట్‌కు రూ.2లక్షల చొప్పున చెల్లించేందుకు గ్రీన్కో అంగీకరించింది. ►హైడ్రో ప్రాజెక్ట్‌ల జీవిత కాలం వందేళ్లు అని నిపుణుల అంచనా. ఆ ప్రకారం గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చార్జి ద్వారా ప్రాజెక్ట్ జీవిత కాలంలో రూ.3,375 కోట్ల ఆదాయం వస్తుంది. ►ఈ ప్రాజెక్ట్‌పై గ్రీన్ కో గ్రూప్‌తో కేవలం సంప్రదింపులు జరపడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొత్తమ్మీద రూ.3,625 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చి నట్టయింది. ►గ్రీన్కో గ్రూప్ ప్రపంచంలో రెండో అతిపెద్ద సావెరిన్ వెల్త్ ఫండ్స్ మద్దతు గల సంస్థ. ►అందులో సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడుల కార్పొరేషన్, అబుదాబి పెట్టుబడుల అథారిటీలు భాగస్వామిగా ఉన్న అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్ కంపెనీ. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్ ►భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్ నిర్మించేందుకు జీఎంఆర్ గ్రూప్‌తో గతంలో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ►ఇందుకోసం 2,700 ఎకరాల భూమిని కేటాయించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై జీఎంఆర్ సంస్థతో సంప్రదింపులు జరిపింది. ►విమానాశ్రయం నిర్మాణాన్ని 2,200 ఎకరాలను పరిమితం చేసింది. దాంతో ప్రభుత్వానికి 500 ఎకరాల భూమి మిగిలింది. ఆ భూమి విలువ రూ.1,500 కోట్లు. తద్వారా ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఆదా చేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2,072.29కోట్లు ఆదా టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ ప్రాజెక్ట్‌లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.2,072.29 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. ►నీటి పారుదల రంగంలో ప్రాజెక్ట్‌ల రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1,130.18కోట్లు, పంచాయతీరాజ్ ప్రాజెక్ట్‌ల రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.200 కోట్లు, ఏపీ టిడ్కో ప్రాజెక్ట్‌ల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.361కోట్లు, జెన్కో ప్రాజెక్ట్‌ల్లో రూ.190 కోట్లు, విద్యా శాఖలో రూ.181.29 కోట్లు.. ఇలా రివర్స్ టెండరింగ్ ద్వారా భారీగా ప్రజాధనాన్ని ఆదా చేయడం సీఎం వైఎస్ జగన్ సమర్థతకు నిదర్శనం. ►టెండర్లలో పారదర్శకత కోసం జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేశారు. విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో టెండర్లను పరిశీలించి అనుమతులు ఇస్తున్నారు. ►అలా ఆదా చేసిన ప్రజాధనంతో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, పింఛన్లు తదితర పథకాల నిధులన్నీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అనుకున్న సమయానికి పడుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ పథకాలను సమగ్రంగా అమలు చేస్తున్నారు. ►విలేకరుల సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, సమాచార, పౌర సంబంధాల కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం క్యాంప్ ఆఫీసులో గణతంత్ర వేడుకలు
-
కరెంట్ కొనుగోళ్లపై సమీక్షతో.. ప్రజాధనం ఆదా
చౌక ధరలకే ముందుకొస్తున్నారు.. 5 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్రూ. 2.70కే రాష్ట్రానికి అందించేందుకు ఎలాంటి పీపీఏలు లేకుండానే పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులలాబీయింగ్కు రాష్ట్రం ఎందుకు తలొగ్గాలి? ప్రజలకు అతి తక్కువ ధరకే విద్యుత్తు లభిస్తుంటే ఎక్కువ ధరలున్న పీపీఏలను సమీక్షించడాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు కుదుర్చుకున్న తప్పుడు డీల్స్‌పైనే సీఎం దృష్టి పెట్టారు. సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. అవినీతికి అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రజలు, ప్రభుత్వంపై పడుతున్న భారాన్ని తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గత సర్కారు హయాంలో అధిక ధరలతో చేసుకున్న పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను క్షుణ్నంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని, దీని ద్వారా ఏటా రూ.2,500 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నివారించవచ్చని సీఎం భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజాధనాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విపక్షాలు విమర్శించడం ఏమిటని కల్లం తప్పుబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ పథకాన్ని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. వ్యవసాయం, విద్యుత్ అత్యంత కీలక రంగాలని పేర్కొన్నారు. కీలకమైన విద్యుత్ రంగం గాడి తప్పుతోందని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీన్ని సరైన మార్గంలోకి తెచ్చి అవినీతికి తావు లేకుండా తీర్చిదిద్దాలని నిర్ణయించారని వివరించారు. మూడేళ్లలో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వివాదాస్పదం కావడంతో వీటిని పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని తెలిపారు. సీఎం సదాశయాన్ని అంతా అభినందించాల్సిందేనని పేర్కొన్నారు. ధరలు తగ్గాయని కేంద్రమే చెప్పింది పీపీఏల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో పలు రకాలుగా స్పందించిందని కల్లం గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పవన, సౌర విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గాయని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018–19 సర్వేలో స్పష్టంగా పేర్కొందన్నారు. 2010లో యూనిట్ రూ. 18 చొప్పున ఉన్న సౌర విద్యుత్ ధర 2018 నాటికి రూ. 2.44కి తగ్గిందని కేంద్రం ప్రకటించిందన్నారు. 2018–19 ఆర్థిక సర్వే కూడా ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. దేశంలో పవన విద్యుత్ ధర 2017 డిసెంబర్ నాటికి యూనిట్ రూ.4.20 నుంచి రూ. 2.44కి తగ్గిందన్నారు. రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా గత రెండేళ్లలో 3,000 మెగావాట్ల వరకూ యూనిట్ రూ. 4.84 చొప్పున కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో పవన, సౌర విద్యుత్ ధరలు భారీగా తగ్గితే రాష్ట్రంలో మాత్రం ఎలాంటి టెండర్లకు వెళ్లకుండా పీపీఏలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో థర్మల్ ప్రాజెక్టులతో దీర్ఘ, మధ్య కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలున్నాయని, థర్మల్, జల విద్యుత్ ద్వారా రాష్ట్ర విద్యుత్ డిమాండ్ తీరడానికి ఆస్కారం ఉందని కల్లాం పేర్కొన్నారు. సోలార్, విండ్ పవర్ కన్నా థర్మల్ విద్యుత్తు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని వివరించారు. చౌకగా లభించే జెన్కో థర్మల్ విద్యుత్ ఉన్నప్పటికీ ప్రైవేట్ పవన విద్యుత్‌ను తీసుకోవడం దారుణమన్నారు. పవన, సౌర విద్యుత్‌ను ఇష్టానుసారంగా కొనుగోలు చేయడం వల్ల పీపీఏలు చేసుకున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ నిలిపివేసినా స్థిర వ్యయం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. థర్మల్ విద్యుత్తు యూనిట్‌కు రూ.4.20కే అందుబాటులో ఉంటే వాడకుండా పవన్ విద్యుత్తు యూనిట్‌కు రూ.5.94, సౌర విద్యుత్తు రూ.6.10 చొప్పున కొనుగోలు చేయడం వల్ల ఖజానాపై ఏటా రూ.2,500 కోట్ల భారం పడిందన్నారు. ప్రజా ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, వీటిని కాపాడానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు నష్టం కలిగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. అవినీతిపై యుద్ధం చేస్తామని సీఎం బహిరంగంగానే ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీఏలపై సమీక్షించడాన్ని ఇంజనీర్స్ అసోసియేషన్ కూడా స్వాగతించిందన్నారు. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమంటూ అత్యధిక ధరలున్న పీపీఏలు సమీక్షించడం మంచి నిర్ణయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెప్పారు. సమీక్షించాలని గతంలో చెప్పింది... ప్రజలపై భారం మోపే విద్యుత్ ఒప్పందాలను రాష్ట్రం ఎందుకు సమీక్షించడం లేదని కేంద్రం కూడా గతంలో ప్రస్తావించినట్లు ఇంజనీర్స్ అసోసియేషన్ తెలిపిందని కల్లాం పేర్కొన్నారు. 5 శాతం తీసుకోవాల్సిన రెన్యూవబుల్ పవర్‌ను 22 శాతం తీసుకున్నారని, థర్మల్ విద్యుత్ కన్నా ఇది తక్కువ ఉంటే ప్రోత్సహించడం మంచిదని, కానీ అధిక ధరలు చెల్లించి ఎందుకు తీసుకున్నారనేది బోధపడటం లేదన్నారు. తక్కువ ధరకు లభించే థర్మల్ విద్యుత్తును తీసుకోకుండా, వాటికి బ్యాక్‌డౌన్ వల్ల స్థిర విద్యుత్ చెల్లించడం, విండ్, సోలార్కు అయ్యే ఖర్చుతో కలిపితే ఏడాదికి రూ. 2,500 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియకుండా ఏపీఈఆర్సీకి వివరాలు ఇవ్వడం లేదన్నారు. గత ఏడాది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ 3 వేల మెగావాట్ల సోలార్ పవర్‌కు టెండర్లు పిలిచిందని, అందులో 2,400 మెగావాట్లు రద్దు చేసిందని, సాఫ్ట్‌బ్యాంక్ అనే సంస్థ గణాంకాల మాయజాలం చేస్తే, కేవలం 27 పైసలు తేడా ఉందంటూ టెండర్లు రద్దు చేశారని తెలిపారు. కర్నూలులో సోలార్ పార్క్ ఏర్పాటు చేస్తే అందులో 350 మెగావాట్లు యూనిట్ రూ. 4.63 చొప్పున పీపీఏ చేసుకున్నారని చెప్పారు. గత ఐదేళ్లుగా జరిగిన పీపీఏలను సమీక్షిస్తామని, అక్రమాలు జరగకుంటే వాటికి ఏ ఇబ్బందీ ఉండదని కల్లాం ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో విద్యుత్ ధరలు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుల్లో డిస్కమ్‌లు గత మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రైవేట్ విద్యుత్‌ను అత్యధిక ధరలకు కొనుగోలు చేయడం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. ఉత్పత్తిదారులకు పంపిణీ సంస్థలు రూ. 18,375 కోట్ల మేరకు బకాయిలు పడ్దాయని, ఇవి ఇప్పటికి రూ. 20 వేల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. ఈ ఏడాది మార్చి 31 వరకూ డిస్కమ్‌ల నష్టాలు రూ. 15 వేల కోట్లకు చేరుకున్నాయని, ఆర్థిక పరిస్థితి ఇలా దిగజారడం వల్ల డిస్కమ్‌లకు అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదన్నారు. దీనివల్ల ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉందన్నారు. కేవలం ఎన్టీపీసీకే రూ. 5 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, సెప్టెంబర్ నాటికి చెల్లించకుంటే మరో రూ. 450 కోట్లు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఏపీఈఆర్సీకి ఇచ్చిన ఆదాయ అంతరం (రెవెన్యూ గ్యాప్) రూ. 3 వేల కోట్ల వరకూ భారం పడుతోందన్నారు. దీన్ని ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. రాష్ట్రంలో సంప్రదాయేత ఇంధన వనరులు (విండ్, సోలార్) డిమాండ్‌లో 5 శాతం మాత్రమే ఉండాలని, కానీ దీన్ని 22 శాతం తీసుకున్నారని, దీనివల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాల్సి వచ్చిందని, ఆ ఉత్పత్తిదారులతో ఒప్పందాలున్నాయని కాబట్టి విద్యుత్ తీసుకోకపోయినా ఫిక్స్డ్ ధర చెల్లించాల్సి వచ్చిందన్నారు. కొన్నింటికి యూనిట్‌కు రూ. 1.10, మరికొన్నింటికి రూ. 1.25 చెల్లిస్తామని చెప్పారు. గత ఐదేళ్లుగా పారిశ్రామిక విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందన్నారు. విద్యుత్ ధరలు పెరిగితే పారిశ్రామిక వినియోగం మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ తక్కువ ధరకే లభిస్తే పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే అవకాశం ఉండదన్నారు. రాష్ట్రంలో పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 221 ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 88, కొత్త రాష్ట్రంలో 133 ఒప్పందాలు జరిగాయని వివరించారు. 25 సంవత్సరాల పీపీఏల నెట్ వ్యాల్యూ రూ.9,200 కోట్లని తెలిపారు. ఇందులో ప్రధాన పీపీఏలు ఐదున్నాయని, వీటితోనే 75 శాతం విద్యుత్ తీసుకునేందుకు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. అందులో గ్రీన్కోవి 16 (999 మెగావాట్లు), రెన్యూ 15 (717 మె.వా), మైత్రా 7 పీపీఏలు (352 మె.వా), కేంద్ర ప్రభుత్వ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నాలుగు పీపీఏలు (189 మె.వా), ఎకోరిన్ (151 మె.వా), యాక్సిస్ (210మె.వా) ఉన్నాయన్నారు. కొన్నేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో విండ్, సోలార్ విద్యుత్ ధరల గురించి శ్రీకాంత్ వివరించారు. 1995లో విండ్ యూనిట్ రూ. 2.23 ఉందని, 2006లో రూ. 2.70 ఉందని, 1995–2000 మధ్య తమిళనాడులో రూ.2.70 వరకూ ఉందని తెలిపారు. ప్రస్తుతం సెఖీ బిడ్ 2017లో రూ. 2.43 ఉందని, తమిళనాడులో రూ. 2.86 చొప్పున ఉందన్నారు. విద్యుత్ ధరలపై అత్యున్నత కమిటీ సమీక్ష టీడీపీ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అత్యున్నతస్థాయి సంప్రదింపుల కమిటీ సోమవారం భేటీ అయింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఇంధనశాఖ సలహాదారు కృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. విండ్, సోలార్ ఉత్పత్తిదారులకు కమిటీ అన్ని విషయాలను వివరించింది. దేశవ్యాప్తంగా పవన, సౌర విద్యుత్ ధరలు తగ్గాయని, రాష్ట్రంలో ఎలాంటి బిడ్డింగ్ లేకుండా పీపీఏలు చేసుకోవడం వల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో సౌర, పనవ విద్యుత్ ధరలు చౌకగా ఉన్న విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కమిటీ సూచనలపై సమాలోచనలు జరుపుతామని విండ్, సోలార్ ఉత్పత్తిదారులు తెలిపారు. త్వరలో తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. విద్యుత్ టారిఫ్‌లపై ఎవరి నిర్ణయం ఉండదు : చంద్రబాబు సాక్షి, అమరావతి: విద్యుత్ టారిఫ్ నిర్ణయంలో ఎవరి ప్రమేయం ఉండదని, పద్ధతి ప్రకారం ధరల నిర్ణయం ఉంటుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. టారిఫ్ నిర్ణయం స్వల్పకాలిక, దీర్ఘకాలికంగా ఉంటుందన్నారు. మంగళగిరిలోని ఒక రిసార్ట్స్‌లో సోమవారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీపీఏలను రద్దు చేయొద్దని కేంద్ర ఇంధన శాఖ కోరిందని, మంత్రివర్గం ఖరారు చేసిన తర్వాతే అవి అమల్లోకి వస్తాయని తెలిపారు. పీపీఏలను సమీక్షించాల్సిందే: సీపీఎం రాష్ట్ర ప్రజలపైన, ప్రభుత్వ ఖజానాపైన భారాన్ని తగ్గించడానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కేంద్రం పీపీఎలను సమీక్షించి ప్రజలకు విద్యుత్ చార్జీలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విజ్ఞప్తి చేశారు. -
‘అందుకే విద్యుత్ ఒప్పందాలపై పునఃసమీక్ష’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సరిదిద్దేందుకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. గతంలో పోలిస్తే విద్యుత్ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేటు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..అందులో భాగంగా గతంలో ఎవరూ తీసుకోని విధంగా గతంలో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. పీపీఏల రద్దువల్ల పెట్టుబడులు వెనక్కివెళ్లిపోతాయని కొంతమంది దుష్ఫ్రచారం చేస్తోన్నారని..కానీ ఎలాంటి ఒప్పందాలు లేకుండానే కరెంటు సరఫరా చేసేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలి. ప్రస్తుతం మనం ఎక్కువ ధరకు విద్యుత్‌ను కొంటున్నాం. గత ప్రభుత్వం పీపీఏలను రూ.6లకు ఒప్పందం చేసుకుంది. సౌర విద్యుత్‌ఒప్పందం రూ. 4.84కు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విండ్ సోలార్, విద్యుత్ ధరలు తగ్గిపోయాయి. 2010లో రూ.18 ఉన్న సౌర విద్యుత్ యూనిట్ రూ.2.45 తగ్గింది. పవన విద్యుత్ యూనిట్ రూ.4.20 నుంచి 43 పైసలకు తగ్గిపోయింది. ఎక్కువ ధరకు విద్యుత్ కొనాల్సిన అవసరం రాష్ట్రానికి లేదు. అధిక ధరల ఒప్పందం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. పీపీఏలు లేకుండానే యూనిట్ విద్యుత్‌ను రూ. 2.72లకు అందించేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి’ అని అజేయ కల్లం అన్నారు. ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. డిస్కంలు రుణపరిమితి దాటి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం డిస్కంలు రూ. 20వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రూ.26.6శాతానికి చేరుకుందని తెలిపారు. కొత్తగా వస్తున్న పరిశ్రమలపై విద్యుత్ భారం వేయలేమని తేల్చి చెప్పారు. ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీలో మార్పులు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీలో మార్పులు జరిగాయి. అడ్వకేట్ జనరల్ స్థానంలో న్యాయశాఖ కార్యదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత స్థాయి సంప్రదింపు కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్‌లు ఉన్నారు. -
తెలుగు రాష్ట్రాల సలహాదారుల సమావేశం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి రోడ్డు మ్యాప్ ఖరారవుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ సలహాదారులు శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. నిన్నటి ముఖ్యమంత్రుల భేటీ ఆధారంగా ఇరు రాష్ట్రాల అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా జూలై రెండో వారం తరువాత ఏపీలో మరోసారి రెండు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. నెల రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఇరురాష్ట్రాల సీఎంల కార్యాచరణ ఉండే అవకాశం ఉంది. -
సీఎం కార్యాలయంలో అధికారుల శాఖలు ఇవే
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులకు శాఖలు కేటాయించారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఇతర అధికారులు అందరికీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ఈ కేటాయింపులు చేశారు. అజేయ కల్లం, సీఎం ముఖ్య సలహాదారు: సాధారణ పరిపాలన, హోంశాఖ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, శాంతిభద్రతల అంశాలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలు. పీవీ రమేష్, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ: వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యాశాఖ(పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు,వాణిజ్యం, మౌళిక వసతులు, పెట్టుబడులు,ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఇన్ఫ్రా, ఇంధన శాఖ. సొల్మన్ ఆరోక్య రాజ్, సీఎం కార్యదర్శి: ట్రాన్స్పోర్ట్ రహదారులు, భవనాల శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార,పౌరసరఫరాల, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, అన్ని సంక్షేమ శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడలు. కె.ధనుంజయరెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి: నీటి వనరులు, పర్యావరణం, అటవీ,సాంకేతిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, సీఆర్డీఏ, వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకం. జె.మురళి, సీఎం అదనపు కార్యదర్శి: పశుసంవర్థక, పాడి పరిశ్రమ,మత్స్యశాఖ, సహకారం, సంస్కృతి. డాక్టర్ ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి: ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్), విజ్ఞాపనలు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజల విజ్ఞప్తులు). పి.కృష్ణమోహన్‌రెడ్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ): ముఖ్యమంత్రికి సంబంధించిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, అపాయింట్మెంట్స్, విజిటర్స్ అపాయింట్మెంట్స్. -
బాధ్యతలు స్వీకరించిన కల్లం, శ్రీరామ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా అజేయ్ కల్లం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని బాధ్యతలు చేపట్టిన ఆయనకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు. అంతకు ముందు అజేయ్ కల్లం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజీగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం శ్రీరామ్ మరోవైపు ఆంధ్రపద్రేశ్ హైకోర్టు అడ్వకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన తన ఛాంబర్లో కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అడ్వొకేట్ జనరల్‌గా శ్రీరామ్‌ను నియమించాలని నిర్ణయించారు. శ్రీరామ్ 1969లో జన్మించారు. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అజేయ కల్లం
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా అజేయ కల్లం కేబినెట్ హోదాతో సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అజేయ కల్లం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎం పేషీ) అధిపతిగా వ్యవహరిస్తారు. అలాగే సీఎంవో కార్యదర్శులకు శాఖల కేటాయింపు బాధ్యతతో పాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో ఆయన టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. -
ఏపీ సీఎం ముఖ్య సలహాదారుగా అజయ్ కల్లం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని కార్యదర్శులకు నేతృత్వం వహిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ఇతర సలహాదారులకు ఆయన బాధ్యులుగా ఉంటారని జీవోలో పేర్కొంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పేషీకి 10 మంది సిబ్బందిని సమకూరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా..
సాక్షి, కడప : క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి మైసూరారెడ్డి వెల్లడించారు. ఆయన ఆదివారం ఇక్కడ రాయలసీమ హక్కుల సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతం కోసమే పని చేస్తానని, రాజకీయేతర ఉద్యమం చేస్తానని తెలిపారు. ఉద్యమం పార్టీగా మారితే క్రియాశీలక పాత్ర పోషిస్తానని ఆయన పేర్కొన్నారు. సీమ సమస్యల పరిష్కారానికి అజయ్ కల్లం నేతృత్వంలో ఓ కమిటీ వేయనున్నట్లు మైసూరారెడ్డి ప్రకటించారు. రాయలసీమ హక్కుల సాధనకు మహాసభ నిర్వహించాలని నిర్ణయించామని, ఎన్నికల తర్వాత సభ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా చాలాకాలంగా మైసూరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం విదితమే. -
రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతోంది
-
జన్మభూమి కమిటీలు డబ్బు సంపాదనకే ఏర్పాటయ్యాయి
-
పేదల ఇళ్ల నిర్మాణంలో వందల కోట్ల అవినీతి
సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి కమిటీలు డబ్బు సంపాదన కోసమే ఏర్పాటయ్యాయని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజయ్ కల్లం ఆరోపించారు. డబ్బు కోసం టీడీపీ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం విశాఖలో సేవ్ ఆంధ్రప్రదేశ్- సేవ్ డెమోక్రసీ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి అజయ్ కల్లం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్మిక, ప్రజాసంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ కల్లం మాట్లాడుతూ.. అవినీతి సంస్థాగతంగా వ్యవస్థీకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా అవినీతికి ఎమ్మెల్యేలే మూలకారణమని అభిప్రాయపడ్డారు. పేదల ఇళ్ల నిర్మాణంలో వందల కోట్ల అవినీతి జరుగుతోందని ఆయన విమర్శించారు. ఏపీలో ఇసుక దోపిడి కోట్లల్లో సాగుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని మూడు రెట్లు పెంచిందన్నారు. సీఎంతో సహా పదవుల్లో ఉన్న వారికి ప్రాజెక్టుల్లో ఆరు శాతం వాటాను కాంట్రాక్టర్లు ఇస్తున్నారని తెలిపారు. అలా సంపాదించిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయాలని ప్రభుత్వం చూస్తోందని అజయకల్లం దుయ్యబట్టారు. -
స్కీముల పేరుతో దోపిడి చేస్తున్నారు
-
ఏపీలో రాచరికపు పాలన: అజేయ కల్లాం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పాలనపై ప్రభుత్వ మాజీ సీఎస్ అజేయ కల్లాం తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులో సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అజేయ కల్లాం చంద్రబాబు చర్యలను తీవ్రంగా విమర్శించారు. ఏపీలో రాజరికపు ప్రజాస్వామ్యం నడుస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాచరికపు పోకడలు వచ్చాయి.. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన పెత్తనం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఒక రోజు ఎమ్మెల్యేగా కూడా చేయని వారు మంత్రులు అవుతున్నారని పరోక్షంగా నారా లోకేష్‌ని ఉద్దేశించి అన్నారు. ప్రజాస్వామ్యంలో రాచరికపు వ్యవస్థలకు ప్రజలే చెక్ పెట్టాలని సూచించారు. తమిళనాడు పుణ్యమా అని సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం ఇక్కడా వచ్చిందని అన్నారు. రాజకీయాల్లో ఆదర్శవంతమైన నేతలు ఈరోజుల్లో కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్వవస్థలకు స్వతంత్ర కావాలని కోరారు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అసెంబ్లీ అనుమతి లేకుండా రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కాగ్ తప్పుబట్టినా ఈ విషయాన్ని ఎవరూ ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు చేస్తున్న వేల కోట్ల రూపాయల అప్పులు ఎవరి కోసం చేస్తున్నారో చెప్పాలని సూటిగా అడిగారు. ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలే పెత్తనం చేస్తున్నాయని ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేశారు. సింగపూర్ విమానం కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. చనిపోయిన రైతులకు ఆదుకోరు కానీ విమాన ప్రయాణానికి రాయితీలు ఆగమేఘాల మీద చెల్లిస్తారని విమర్శించారు. తెలంగాణాలో డబుల్ బెడ్రూం నిర్మాణంలో భాగంగా చదరపు అడుగుకు రూ.800 ఖర్చు అవుతుంటే...ఏపీలో మాత్రం చదరపు అడుగుకు రూ.2700 అయినట్లు ఖర్చు చూపిస్తున్నారని, ఈ విషయంలోనే చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవిధంగా దోచుకుంటున్నారో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడానికా ప్రభుత్వం ఉంది అని అజేయ్ కల్లాం సూటిగా అడిగారు. -
ప్రకృతి వైపరీత్యాలను రాజకీయలబ్ధికి వాడొద్దు
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవద్దని, తుఫాను సంభవించినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటించి స్థానిక అధికార యంత్రాగాన్ని ఇబ్బందులకు గురి చేయొద్దని ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం అన్నారు. జన చైతన్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ 2005లో ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టాన్ని కేంద్రం రూపొందించి అమలులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడేళ్లుగా రూ.1,250 కోట్లను ప్రకృతి విపత్తుల నివారణ కోసం కేంద్రం ఇచ్చిందనీ, అయినా, తిత్లీతుఫాను విషయంలో కేంద్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రం పంపిన బృందం నివేదిక అందగానే వెంటనే నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. కాగా, తుఫాను సందర్భంగా కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ నిధులను పెద్దెత్తున ప్రచార కార్యక్రమాలకు వెచ్చించడం విచారకరమన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం మాట్లాడుతూ సీఎం ఒకరోజు జిల్లాలో పర్యటిస్తే రూ.25 లక్షల ఖర్చువస్తుందని, తుఫాను వచ్చిన ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తే ప్రజాధనం వృ«థా కావడమే కాకుండా పోలీసులు, అధికార యంత్రాంగం సీఎం చుట్టూ తిరుగుతారే కానీ, వరదబాధితులకు ఏం సాయం చేస్తారని ప్రశ్నించారు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ శ్రీకాకుళంలో సంభవించిన తిత్లీ తుఫాను గ్రామాలు విద్యుత్ లేకుండా చీకట్లో జీవిస్తున్నాయని పేర్కొన్నారు. తిత్లీ తుఫాను ప్రభావం నుండి ఒడిశా వారంలో కోలుకుంటే హైటెక్ సీఎం గా చెప్పుకునే చంద్రబాబు పూర్తిగా విఫలమై ఆ లోపా న్ని కేంద్రంపై రుద్దేందుకు చూస్తున్నారన్నారు. -
పరాకాష్టకు చేరిన విలువల పతనం
గత 35 ఏళ్ల ప్రభుత్వ పాలనతో పోలిస్తే నాలుగేళ్ల చంద్రబాబు పాలన అతి చెత్త పాలనగా మిగిలిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజల ప్రయోజనాలకు సంరక్షణ కర్తలుగా ఉండాలి అనే భావననే క్షీణింపజేస్తూ, వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ వచ్చారని ఆరోపించారు. పాలకులు చెడుమార్గం పట్టినప్పుడు పౌర సమాజమే తగు నిర్ణయం తీసుకోవాలంటున్న అజయ్ కల్లం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీరు రాసిన ‘మేలుకొలుపు’ లక్ష్యం ఏమిటి? వేకప్ కాల్ అనే ఇంగ్లిష్ పదానికి తెలుగు అర్థం మేలుకొలుపు. 1980లనాటి రాజకీయ నేతల్లో కాస్త నిజాయితీ ఉండేది. ఆ తరం నేతలు నిజాయితీపరులైన అధికారులను ఇబ్బంది పెట్టేవారు కాదు. సమాజం కోసం, రాష్ట్రం కోసం ఎవరైనా మంచి సలహా ఇస్తే ‘అవును.. మనం అలా చేద్దాం’ అంటూ ప్రోత్సహిం చేవారు. ఆ విధంగానే మనకు ఐటీడీఎ వంటి గొప్ప సంస్థలు ఏర్పడ్డాయి. కానీ 1980ల చివరికి వచ్చేసరికి మా కళ్లముందే వ్యవస్థలన్ని ధ్వంసం అయిపోవడం, క్షీణించిపోవడం చూశాం. వ్యవస్థలు విఫలమవటం, ఆనాటివరకు కొద్ది స్థాయిలో ఉండే అవినీతి తర్వాత భరించలేని స్థాయికి చేరడం, విలువలు పూర్తిగా పక్కకుపోవడం, సమర్థత ప్రాతిపదికన కాకుండా మనకు పనికొచ్చేవాడు ఎవరు అంటూ ఉన్న ఆఫీసర్లలో వెతుక్కోవడం మొదలైంది. మనప్రాంతం వాడా, మన కులంవాడా, మనం అడిగిన పని చేసిపెడతాడా లేదా అనేవి పదవులకు కొలమానాలుగా మారాయి. బ్యూరోక్రాట్లకు ప్రజా ప్రయోజనాలతో ఏమాత్రం పనిలేదనే వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజల ప్రయోజనాలకు సంరక్షణ కర్తలుగా ఉండాలి తప్ప రాజకీయ ప్రయోజనాలకోసం కాదు. ఆ భావననే క్షీణింపజేస్తూ, వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ వచ్చారు. ఇదే నా ‘మేలుకొలుపు’ లక్ష్యం. ప్రభువులు మీపట్ల చాలా ఆగ్రహంతో ఉన్నట్లున్నారే? ప్రశ్నించే అలవాటు సమాజంనుంచి పోవడం వల్లే వాళ్లాస్థాయికి వచ్చారు. ప్రశ్నిస్తే ఆగ్రహించడమా? నాయీ బ్రాహ్మణులను సచివాలయంలోకి ఎందుకు రానిచ్చారు అని సీఎం అరిస్తే ఎలా? నాయకులు బ్యాలెన్స్ తప్పినప్పడే ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరూ మమ్మల్ని ప్రశ్నించకూడదు, మేం మాత్రం అందరిమీదా పెత్తనం చెలాయిస్తాం అంటే మీరు అక్కడ ఉండే పరిస్థితే ఉండదు. ఇద్దరు సీనియర్ అధికారులు ప్రభుత్వ విధానాలను వరుసగా తూర్పారబట్టడం ఇదే ప్రథమం కదా? గతంలో మన వ్యవస్థలో ఎప్పటికప్పుడు కొద్దో గొప్పో సానుకూలంగా ఆలోచించేవాళ్లం. విచిత్రం ఏమిటంటే, పోయినవాళ్లే మంచివాళ్లు అని పెద్దలు చెబుతుంటారు కదా. గత 35 ఏళ్లుగా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా పరిస్థితులు మెరుగవుతాయనే ఆశ ఎక్కువగా ఉండేది. కానీ దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ వస్తోంది. పాలనకు సంబంధించి ఏ అయిదేళ్ల కాలాన్ని తీసుకున్నా, అంతకుముందు అయిదేళ్ల పాలనే ఉత్తమంగా ఉండేదన్న ప్రతిస్పందన ఆటోమేటిక్‌గా వస్తోంది. పరిస్థితి మెరుగుపడటానికి బదులు మరింతగా దిగజారుతూండటాన్నే చూస్తున్నాం. అయితే పార్టీలే తమ ఎజెండాను తీసుకెళ్లి ప్రజ లకు ఇవి చేస్తాం, అవి ఇస్తాం అంటూ చెబుతూ వస్తున్నాయి కానీ ప్రజలు మాకు ఇది కావాలి. ఇది వద్దు అని తమ సొంత ఎజెండాను రూపొందించుకుని డిమాండ్‌చేసే పరి స్థితి ఏర్పడాలన్న ఆలోచన మాత్రం మా ఇద్దరికీ వచ్చింది. ఒక్కటి మాత్రం నిజం. ఏపీలో ఇప్పుడున్న ప్రభుత్వ పాలన గత 35 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలన్నింటి కంటే చెత్త పాలన అని మాత్రం చెప్పాలి. కారణం ఏమంటే ప్రభుత్వ పాలనా సంస్థలు పూర్తిగా బలహీనమైపోయాయి. కానీ మండల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లారని ప్రశంస కూడా వచ్చింది కదా? ఉన్న వ్యవస్థలను పనికిమాలినవిగా తయారు చేసి, ప్రజల వద్దకు పాలన అంటే ఉపయోగం ఏమిటి? పైగా మండల వ్యవస్థ నాటి నుంచి నేటి వరకుకూడా ఒక వ్యవస్థగా బలోపేతం కాలేదు. గతంలోని గ్రామీణ సమితులకు అది ప్రత్యామ్నాయం కాలేదు. మెంటే పద్మనాభంగారితో నాకున్న చనువుతో నేను ఆయన్ని ప్రశ్నించాను. ఇదేంటండీ తగిన ప్రత్యామ్నాయం ఏదీ తీసుకురాకుండానే మీరు ఉన్న వ్యవస్థలన్నింటినీ దునుమాడుతున్నారు. (ఆరోజునుంచి ఈరోజు వరకు గ్రామీణ రికార్డులు బాగుపడలేదు.) వ్యవస్థలను నాశనం చేస్తే మీకేంటండీ లాభం? ప్రజ లకు సరఫరా దెబ్బతింటుంది. దాంతో మీకు చెడ్డపేరు వస్తుంది కదా అని ఆయన్ని అడిగాను. దానికాయన అభిమానంతోటే ఒక విషయం చెప్పారు. అజయ్ మీరంతా యువకులు. మీరు ఆదర్శవాదంతోనే ఆలోచిస్తుంటారు. వ్యవస్థలన్నీ చక్కగా పనిచేసిపెడితే ఇక మాదగ్గరకు ఎవడొస్తాడయ్యా.. వ్యవస్థలు పాడైపోతేనే మా పాత్ర, మా ప్రాధాన్యం ప్రజల్లో పెరుగుతుంది అని చెప్పారాయన. ఆ విధంగా అప్పటినుంచి క్రమక్రమంగా ఒక్కో వ్యవస్థనూ నాశనం చేసుకుంటూ పోయారు. పైగా ఈరోజు ప్రభుత్వంలో ఏ కలెక్టర్‌కి, ఏ విభాగాధిపతికి స్వేచ్ఛ ఉంది? నాయకులు మొత్తం అధికారాలను తమ సొంతం చేసుకుం టున్నారు. కేంద్రీకరించుకుంటున్నారు. సింగపూర్ కంపెనీకి భూములు కట్టబెట్టడంపై మీరు అభ్యంతరం వ్యక్తం చేయలేదా? ఎందుకు లేదు? సింగపూర్ కంపెనీకి 1600 ఎకరాలు కట్టబెట్టడం అనేది ఏకపక్ష ఒప్పందం. దీంట్లో ప్రజా ప్రయోజ నాన్ని బలి తీసుకుంటున్నారు. ప్రభుత్వం అవతలివాళ్లకు లాభం కలిగేలా చేస్తోంది అని చాలా క్లియర్‌గా మా వాదనపై ఆరు పాయింట్లు నిర్దిష్టంగా రాసి అందించాం. దాన్ని కేబి నెట్ భేటీలో స్వయంగా నేను లేవనెత్తినా ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. మహారాష్ట్రలో దబోల్ విద్యుత్ ప్రాజెక్టు కేసు మీకు గుర్తుందా? దానికీ దీనికీ పెద్దగా తేడా లేదండీ అని చెప్పాను. అవునవును. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. కానీ మా నిర్ణయం మేము తీసుకుంటాము అని స్పష్టం చేశారు. ఈ అంశంపై నా విధి నేను చేశాను. కాబట్టి పశ్చాత్తాపపడాల్సిన పనిలేదు. మీరు కాదన్నా కేబినెట్ ఓకే చేసింది కదా? పౌరసమాజమే దీనికి సమాధానమివ్వాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం పౌర సమాజానిదే కదా. రాజధాని చుట్టూ పరిణామాలపై మీకేమనిపిస్తోంది? నిజం చెప్పాలంటే రాజధాని వ్యవహారాల్లో మేమెన్నడూ జోక్యం చేసుకోలేదు. దాంట్లో మా పాత్ర ఏమీ లేదు. కానీ ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశంలో కూడా రాజధానికి ఇంత ప్రాధాన్యమిచ్చిన చరిత్ర ఎక్కడా లేదు. ఇంత హైప్ చేసింది లేదు కూడా. మన దేశ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దదైన కాలిఫోర్నియా నగరంలో ప్రభుత్వ శాఖలు ఎక్కడో ఒక మూలన పడేసినట్లుంటాయి. నెదర్లాండ్స్‌లో ప్రభుత్వ శాఖలన్నీ హేగ్ వంటి చిన్న నగరంలో ఉంటున్నాయి తప్ప రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో లేవు. ఆస్ట్రేలియాలో కీలక శాఖలన్నీ కాన్ బెర్రా అనే 3 లక్షల జనాభా ఉన్న అటవీ ప్రాంత పట్టణంలో ఉంటున్నాయి. రాజధాని అంటే పరిపాలనా శాఖ లతో కూడిన నిర్మాణం. దాన్ని ఒక పెద్ద మెగాసిటీగా, గ్రేటర్ సిటీగా పెంచాల్సిన అవసరం లేదు. అందులోనూ చేతిలో డబ్బులు లేని దాసరికి అవసరమే లేదు. రెండుమూడు ప్రభుత్వ భవనాలు, రెండువేల కోట్ల ఖర్చు, కావలసిన డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్లు, మౌలిక వసతులు తప్పితే అంతకు మించిన పెట్టుబడి అవసరమే లేదు. అక్కడున్న అవకాశాలను బట్టే రాజధాని చుట్టూ సహజ సిద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఈమాత్రం దానికి రాజధానిని పూర్తిగా కేంద్రీకృతం చేయాల్సిన అవసరం లేదు. పాలన ఎంత వికేంద్రీకరణకు గురైతే అంత సమర్థంగా ఉంటుంది. నిజంగా సచివాలయం అనేది గ్రామంలో ఉండాలి. గ్రామ వ్యవహారాలను నిత్యం చూసే సెక్రటేరియట్ అది. నేటికీ చాలా దేశాల్లో సెక్రటేరియట్ అనే భావనే లేదు. దేశరాజధాని ఢిల్లీలో సెక్రటేరియట్ ఉందా? వివిధ శాఖలు మాత్రం ఉన్నాయి. వాటì æపని అవి చేసుకుంటున్నాయి. ఆన్లైన్ వ్యవస్థ వచ్చింతర్వాత అన్నీ ఒకేచోట కేంద్రీకరించడం ఎందుకు? అవును. ఆన్లైన్ వ్యవస్థతో పనులు సమర్థంగా జరుగుతాయి. అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు వీలిచ్చే ఈ వైఖరిని మొత్తం ప్రపంచమంతా ప్రస్తుతం పాటిస్తోంది. ప్రభుత్వాఫీసులన్నీ ఒకే చోట ఎందుకు పెట్టాలి? నాలుగు డిపార్ట్మెంట్లు తిరుపతిలో, మరో నాలుగు విశాఖలో పెట్టండి. కొన్ని విభాగాలను కర్నూలులో పెట్టండి. దానివల్ల నష్టం ఏమిటి? ఏ డిపార్ట్మెంట్తో ఎవరికి పనిబడితే వారు మాత్రమే అక్కడికి వెళతారు. అంతేగానీ అన్ని పనులకూ రాజ ధానికే ఎందుకు రావాలి? రాజధానిలో ఉండటం వల్ల ఎవరికీ లాభం లేదు. కేవలం ప్రభుత్వోద్యోగులకు అక్కడికక్కడే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి తప్ప ఇతరులకు లాభం ఏమిటి? రెండోది ఎమ్మెల్యేలు పైరవీలు చేసుకోవడానికి కూడా రాజధాని ఉపయోగపడుతుంది. అంతే తప్ప సాధారణ ప్రజలకు అన్నీ ఒకేచోట ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు. -
ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లంతో మనసులో మాట
-
‘అధికార వికేంద్రీకరణే శరణ్యం’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, జస్టిస్ ఎ.గోపాలరావు, జస్టిస్ బి.శేషశయన రెడ్డి, జస్టిస్ జి.క్రిష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యఅతిధులుగా మాజీ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, మాజీ అడ్వకేట్ జనరల్ సివి మోహన్ రెడ్డి విచ్చేశారు. రాయలసీమకు హైకోర్టు కావాలని కోరడం న్యాయమైన కోరిక అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. 11 రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టులు మరో చోట ఉన్నాయని గుర్తు చేశారు. అలా ఒప్పుకోవద్దు: ఐవైఆర్ రాయలసీమలోనే ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. రాజధానిలో హైకోర్టు, రాయలసీమలో బెంచ్ అంటే ఒప్పుకోవద్దని సూచించారు. రాయలసీమ, కళింగాంధ్ర అభివృధ్దికి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఏకపక్ష నిర్ణయాలు: కల్లం ఏపీ రాజధాని విషయంలో పాలకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అజయ్ కల్లం ఆరోపించారు. అధికార పార్టీ నేతలు కొన్న భూముల ధరల పెంపు కోసమే అంతా ఒకేచోట అంటున్నారని తెలిపారు. ప్రధాన నిర్ణయాలు ప్రజాభిప్రాయంతో తీసుకోవడమే పరిపక్వ ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. సిడ్నీలో చిన్న ఎయిర్పోర్ట్ కోసం అందరినీ ఒప్పించడానికి 20 ఏళ్లు పట్టిందని వెల్లడించారు. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. -
కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకుల కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం కుండబద్దలు కొట్టారు. ఎన్నికల్లో ఖర్చుకు ప్రభుత్వ ఖజానా నుంచే దోపిడీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని తాను రాసిన ‘మేలుకొలుపు’ పుస్తకంలో ఆయన బహిర్గతం చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రధాన ఉద్దేశం ఎన్నికల ఖర్చు కోసం వీలైనంత త్వరగా డబ్బును భారీ మోతాదులో రాబట్టుకోవడమేనని వెల్లడించారు. ‘మేలుకొలుపు’లో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. అధినాయకుల కమీషన్ 6 శాతం ‘కమీషన్ల కోసం అంచనాలను పదేపదే మారుస్తూ కేటాయింపులు పెంచుతున్నారు. అధినాయకుల కమీషన్ ఆరు శాతమని కార్యాలయాల నడవాల్లో బాహాటంగానే మాట్లాడుతున్నారు. కాంట్రాక్టు చేతికొచ్చిన మరుక్షణమే తొలి ఖర్చుల కోసం అడ్వాన్సుల ఒత్తిడి పెరుగుతుంది. అధినాయకుల వాటా ఆ దశలోనే వసూలవుతోంది. ప్రతి పనికి కాంట్రాక్టర్లగా పేరు పొందిన వారే లేదంటే అందులో ఒకరిద్దరే ఉంటారు. ఇంజనీర్లు వారికి కొమ్ముగాస్తూ తమ వాటాను దండుకుంటూ అధినాయకుల కనుసన్నల్లో మెలుగుతుంటారు. ఆడిటర్ జనరల్ తనిఖీల్లో బయటపడకుండా ఉండేందుకు సంబంధిత అధికారులు లొసుగులను పూడ్చేస్తారు. దీన్ని కేవలం బాహ్య లేదా సామాజిక ఆడిట్ ద్వారానే నియంత్రించగలం. జరిగిన పనిని వాల్యుయేషన్ చేస్తేనే ఖర్చు నిజంగా జరిగిందా లేదా? అనేది తెలుస్తుంది’ రూ.వేల కోట్లు నేతల పాలు ‘తెలుగు రాష్ట్రాల్లో నీటిపారుదల పథకాలకు కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నా చెప్పుకోదగినంత పొలం సాగులోకి రాక రైతులు ఎప్పటిలాగే ఉండగా రాజకీయ నేతలు అంతులేకుండా సంపాదిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా ఆ మేరకు కొత్తగా సాగులోకి రావడం లేదు. అధికార పక్షం, వారిని బలపరచే భాగస్వాములకు ప్రభుత్వ వనరులు వరంగా పరిణమించాయి. అధికారంలో ఉన్నవారు, ప్రభుత్వంలో పనులు కావాల్సిన వారి మధ్య లాలూచీ మొదలైంది. ఈ క్రమంలో నిబంధనలు గాలికి కొట్టుకుపోతున్నాయి. చివరకు అధికార కేంద్రాలు వ్యక్తిగత ప్రయోజనాలు తీర్చుకొనే వ్యవస్థలుగా మారిపోయాయి. విధాన పరమైన నిర్ణయాలు పారదర్శకంగా జరగాల్సిందిపోయి వాటి స్థానంలో తెర వెనుక లావాదేవీలు నిర్వహించే దళారీలు ప్రవేశించారు. ఇలాంటి వాతావరణంలో ప్రభుత్వ ఖజానాను దోచుకునే వ్యక్తులు అవినీతి పరులైన ఉద్యోగులతో చేతులు కలిపి మొత్తం పాలనా వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. కంచే చేను మేస్తే సుపరిపాలనకు ఇక తావెక్కడ?’ అని తన పుస్తకంలో కల్లాం పేర్కొన్నారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారు: అజేయ కల్లాం అనంతపురం కల్చరల్: వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్న పాలకులను నిలదీయాల్సిన అవసరం ప్రజలకుందని మాజీ సీఎస్ అజేయ కల్లాం అన్నారు. సత్యవేద ప్రభ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం అనంతపురంలోని సూరజ్ గ్రాండ్ సమావేశ మందిరంలో ఆయన రచించిన ‘మేలుకొలుపు’ (వేకప్ కాల్) పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) మాజీ వీసీ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజయ్‌కల్లాం మాట్లాడుతూ తన పుస్తకంలోని ప్రత్యేకతలను వివరించారు. తన చిన్నతనంలో హరిత విప్లవం చూశామని, అప్పట్లో అధికారులు స్వతంత్రంగా వ్యవహరించడానికి వ్యవస్థలు సహకరించాయన్నారు. ప్రస్తుతం వస్తున్న మార్పులు దిగజారుతున్న విలువలకు అద్దం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కదలిక పత్రిక సంపాదకులు ఇమామ్, సిటిజన్ ఫోరం గౌరవాధ్యక్షులు రామిరెడ్డి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, గేట్స్ ఇంజనీరింగ్ విద్యాసంస్థల అధినేత వీకే పద్మ, నీటిపారుదలరంగ నిపుణులు పాణ్యం సుబ్రహ్మణ్యం తదితరులు అజయ్‌కల్లం పుస్తక విశిష్టతపై మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనంతపురం నియోజకవర్గం సమన్వయకర్త నదీం అహ్మద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, ఆచార్య పీఎల్ శ్రీనివాసరెడ్డి, ఆచార్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యవస్థలో మార్పు అవసరం: జేపీ
సాక్షి, హైదరాబాద్: వ్యవస్థలో మార్పు రావాలని లోక్‌సత్తా అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం రాసిన ‘మేలుకొలుపు’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. కులం, మతం, ప్రాంతం సమాజాన్ని నిట్ట నిలువునా చీలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ చాలాచోట్ల చట్టబద్ధ పాలన సాగడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా ఏ పనీ జరిగే అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటే అన్నింటికీ పరిష్కారమార్గమని చెప్పారు. చిత్తశుద్ధి, నిజాయితీకి మారుపేరైన అజయ్ కల్లం ప్రజలను మేలుకొలుపే విధంగా పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ అవినీతిపై సమరానికి మేలుకొలుపు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో అవినీతి పెరిగిపోయిందన్నా రు. సమస్యలపట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అజయ్ కల్లం మాట్లాడుతూ పాలనావ్యవస్థ నిలువెల్లా కుళ్లిపోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ, రాజకీయ విలువలు హరించుకుపోతుం డటంతో చట్టసభలు, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ వంటి కీలక పాలనాయంత్రాంగాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ సచివాలయాలు అవసరమన్నారు. సమాజంపట్ల బాధ్యతను గుర్తు చేసేందుకు జిల్లాలవారీగా ‘మన కోసం మనం’అనే అంశంపై చర్చావేదికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అనంతపురం నుంచి చర్చావేదికలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. మాజీ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ సమాజ హితం కోసం పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. సమాజంలో మార్పు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. -
మేకప్ వేసుకోని కొందరు కొత్త రాజకీయాలు చేస్తున్నారు
-
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి విలయతాండవం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పెచ్చుమీరుతున్న అవినీతిపై మరో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లం గళం విప్పారు. రాష్ట్రంలో ప్రతిచోటా అవినీతి వేళ్లూనుకుపోయిందని, సాగునీటి ప్రాజెక్టులు తదితరాల పేరుతో అవినీతి విశృంఖలంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. మెగా రాజధాని నగరం ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తోందని తప్పుపట్టారు. అధికార కేంద్రీకరణ తప్పుడు విధానమని, మెగా నగరాల ఆలోచనే అసంబద్ధమని, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి తప్ప ప్రజలకు ఏవిధంగానూ ఉపయోగం కాదని కుండబద్దలు కొట్టారు. తామేదో పెద్ద తాజ్‌మహల్‌ను నిర్మించి చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోవాలనే పిచ్చితనం నుంచి పాలకులు దూరం కావాలని హితవు పలికారు. వారి పేరు కోసం ప్రజలు ఎన్నుకోలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వం మొత్తం ఒకేచోట ఎందుకు కేంద్రీకృతం కావాలి? కేవలం ఒకే నగరంలోనే అన్నీ ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు. అధికార కేంద్రీకరణ అనేది మౌలిక సిద్ధాంతానికే వ్యతిరేకమని చెప్పారు. సింగపూర్ ప్రైవేట్ సంస్థల కన్సార్టియం ప్రతిపాదన సరికాదని సర్వీసులో ఉండగానే తాను తప్పుపట్టానని, ఫైల్లో ఆ మేరకు స్పష్టంగా రాశానని గుర్తుచేశారు. అజేయ కల్లం కంటే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైరైన ఐవైఆర్ కృష్ణారావు కూడా చంద్రబాబు సర్కారుపై ఇలాంటి విమర్శలతోనే పుస్తకం రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి అక్రమాలు, ప్రభుత్వ తప్పుడు విధానాలపై అజేయ కల్లం కూడా తాజాగా పుస్తకం రాసి, విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ పుస్తకం రాయడానికి నేపథ్యం ఏమిటి? ఇందులో ఏయే అంశాలు ఉన్నాయనే అంశాలపై అజేయ కల్లం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అందులో కొన్ని ఆయన మాటల్లోనే... పెద్ద నగరాలతో ప్రజలకు భారమే ‘‘పెద్ద పెద్ద నగరాల వల్ల ప్రజలకు అన్ని విధాలా భారం తప్ప లాభం ఉండదు. అనుభవజ్ఞులు ఎవరూ మహా నగరాలను కట్టరు. నగరం పెద్దదయ్యే కొద్దీ రవాణా వ్యయం, నీటి సరఫరా రేటు, విద్య ఖర్చులు, ఇంటి అద్దె లాంటివన్నీ పెరుగుతాయి. జీవన వ్యయం భారీగా పెరుగుతుంది. నేను సర్వీసులో ఉన్నప్పుడే మెగా నగరాలు, గ్రేటర్ నగరాల నిర్మాణ ప్రతిపాదనలను ప్రజా వేదికలపైనే తప్పుపట్టాను. పెద్ద నగరాల్లో ఏముంటుంది? నేరాలు, వ్యభిచారం, చెడు అలవాట్లు పెరుగుతాయి. ప్రజలకు మనశ్శాంతి ఉండదు. అందువల్ల ప్రజలకు కావాల్సింది గ్రామ స్వరాజ్యమేనని జాతిపిత మహాత్మాగాంధీ ఆనాడే చెప్పారు. స్వయం సమృద్ధి, స్వయం పాలన గల చిన్న చిన్న ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు చౌకగా అందుబాటులోకి వస్తాయి. అధ్యయనాల్లోనూ తేలింది నగరాల పరిమాణం పెరిగే కొద్దీ ప్రజలు నివసించడానికి ఉపయోగపడేలా ఉండవని జర్మనీతోపాటు పలు దేశాలు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. నగరాలు పెద్దవయ్యే కొద్దీ అన్ని రకాల ఖర్చులూ పెరుగుతాయని జర్మనీలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. అతి తెలివి తక్కువ ఆలోచన పెద్ద నగరాలుంటేనే పెద్ద పెద్ద సంస్థలు వస్తాయని ప్రజలను భ్రమల్లో ముంచడం తెలివి తక్కువ ఆలోచన. మైక్రోసాఫ్ట్ ప్రధాన కేంద్రం ఎక్కడుంది? లాస్ఏంజెలెస్, షికాగో, న్యూయార్క్ లాంటి నగరాల్లో లేదు కదా? అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో(యూఎస్ఏ) మారుమూల ప్రాంతమైన రెడ్మాండ్లో మైక్రోసాఫ్ట్ ప్రధాన కేంద్రం ఉంది. వారెన్ బఫెట్ అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఒమాహా అనే మారుమూల ప్రాంతం నుంచే నడుపుతున్నారు. పెద్ద నగరాలు కట్టడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకే మేలు జరుగుతుంది. స్థిరాస్తి ధరలను పెంచి భారీగా ఆర్జిస్తారు. అందుకే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కోసం అంతర్జాతీయ స్థాయి అమరావతి నగరం అంటోందని విమర్శలు ఉన్నాయి. ఎవరు హీరోలు? యువత ఆలోచనా విధానం మారాలి. డ్రెస్సింగ్ రూమ్‌లో మేకప్‌లు వేసుకొని, ఎవరో రాసిచ్చిన డైలాగులు చదివేవారు హీరోలా? లేక త్యాగాలు చేసిన, సమాజ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించిన వారు హీరోలా? సినిమాల్లో ఎంత గొప్పనటులైనా అయి ఉండొచ్చు. డబ్బు సంపాదించుకోవచ్చు. సమాజానికి వచ్చేసరికి హీరోలంటే కొన్ని లక్షణాలు కచ్చితంగా ఉండాలి. సినిమాలను నిజజీవితంతో ముడిపెట్టడం సరికాదు. గ్లామర్, కులం, ప్రాంతం... చూడొద్దు ప్రజలు ఓట్లు వేసే ముందు ఎవరు మంచివారు? ఎవరికి ఓట్లు వేస్తే సమాజానికి మేలు చేస్తారు? అనే కోణంలోనే ఆలోచించాలి. గ్లామర్, కులం, ప్రాంతం ఆధారంగా ఓటు వేయొద్దు. రాజకీయ పార్టీలు, నేతలు వారి అజెండాతో ముందుకొస్తున్నారు. ప్రజలు తమకు కావాల్సిందేమిటో ఆలోచించుకుని అజెండా రూపొందించుకునే స్థితికి రావాలి. దీనిని బలపరిచే వారికే ఓట్లు వేయాలి. నా పుస్తకం చదివితే రాజకీయ నేతలు, రాజకీయాలపై నా అభిప్రాయం అర్థమవుతుంది. ఈ నెల 20వ తేదీలోగా స్వాతంత్య్ర సమరయోధులు, మిత్రులతోనే నిరాడంబరంగా పుస్తకాన్ని ఆవిష్కరిస్తా. నేను ఎవరినీ తప్పుబట్టడం కోసం పుస్తకం రాయలేదు. కేవలం యువతను, ప్రజలను మేల్కొల్పడం ద్వారా సమాజానికి నా వంతు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే రాశాను. పాలకులు వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న నేపథ్యంలో యువతను మేల్కొల్పడం, ప్రజల కళ్లు తెరిపించడం కోసమే 70 పేజీలకు మించకుండా చిన్న పుస్తకం రాశాను. అందుకే దీనికి ‘మేలుకొలుపు’ (ఆంగ్లంలో వేకప్ కాల్) అని పేరు పెట్టాను’’ అని అజేయ కల్లం పేర్కొన్నారు. ప్రజలను చైతన్యపరచాలన్నదే నా తపన ‘‘రాష్ట్రంలో ప్రతిచోటా అవినీతి వేళ్లూనుకుపోయింది. బదిలీలు మొదలు ప్రతి అంశంలోనూ అవినీతి పెరిగిపోయింది. దీనికి పరిష్కారం ఏమిటి? అంతర్గత జవాబుదారీతనం పూర్తిగా లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ ప్రయోజనార్థం యువతను, ప్రజలను చైతన్యపరచాలన్నదే నా తపన. భూ పరిపాలన ఎందుకిలా కుప్పకూలింది? భూ వివాదాలు ఏమిటి? కారణాలు ఏంటి? పరిష్కార మార్గాలు ఏంటి? వ్యవసాయం, విద్య, ఆరోగ్యం.. ఇలాంటి ప్రాథమిక అంశాలకు ప్రాచుర్యం కల్పించడమే నా ఉద్దేశం. ప్రజల ఉద్దేశం కూడా అదే’’ అని అజేయ కల్లం స్పష్టం చేశారు. ⇒ తామేదో పెద్ద తాజ్‌మహల్‌ను నిర్మించి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే పిచ్చితనం పాలకుల్లో పోవాలి. ఈ జబ్బు 1600 సంవత్సరంలోనే కొందరు పాలకులకు అంటుకుంది. ఇంకా మన పాలకులు అలాగే పిచ్చిగా ఆలోచించడం అవివేకం. వారి పేరు కోసం ప్రజలు ఎన్నుకోలేదు. తమకు మంచి చేస్తారనే ఆశతోనే ప్రజలు గెలిపించారని పాలకులు గుర్తించకపోవడం బాధాకరం. ⇒ ఒకేచోట ప్రభుత్వం మొత్తం ఎందుకు కేంద్రీకృతం కావాలి? అన్ని విభాగాలు, శాఖలు ఒకే నగరంలో ఎందుకు ఉండాలి? విశాఖపట్నంలో నాలుగు శాఖలు, తిరుపతిలో నాలుగు, కాకినాడలో నాలుగు, కర్నూలులో నాలుగు ప్రభుత్వ విభాగాలను పెట్టడం వల్ల నష్టమేంటి? కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటూ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం లేదా? కేంద్రం ఉదయం అడిగితే రాష్ట్రం సాయంత్రానికల్లా సమాచారం పంపుతోంది కదా. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి రోజుల్లో ఇది మరింత సులభం. అధికార కేంద్రీకరణ అనేది మౌలిక సిద్ధాంతానికే వ్యతిరేకం. అది తప్పుడు విధానం. ప్రపంచంలో పలుచోట్ల చిన్న నగరాల్లోనే రాజధానులు ఉన్నాయి. అయితే, స్వార్థం కోసమే ఇలా(అధికార కేంద్రీకరణ) చేసేవారికి ఎవరేం చెప్పినా చెవికెక్కదు ⇒ ‘‘రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం ప్రతిపాదనను నేను సర్వీసులో ఉండగానే తప్పుపట్టాను. ఫైల్‌లోనే దీనికి వ్యతిరేకంగా ఆరు పేరాలు రాశాను. రాష్ట్రానికి సచివాలయం లేకపోయినా ఫర్వాలేదు. సచివాలయాలు ఉండాల్సింది గ్రామాల్లోనే’’ ⇒ ‘‘ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రశ్నించలేదని ఎవరైనా అడగొచ్చు. ప్రభుత్వంలో ఉన్నప్పుడే అడిగేది, అడగాల్సింది అడిగేశా. ఫైళ్లలో రాయాల్సింది రాశా. సలహాలు ఇచ్చా. అధికారులు సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలరు. అధికారులు ఎవరైనా అంతకంటే పాలకులను ప్రశ్నించి ఏమీ చేయలేరు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు పాలకులే కదా. వారి అజెండా ప్రజల అజెండా కాకుండా స్వార్థపూరితం కావడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి’’ -
మహానగరాల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
-
చంద్రబాబుపై అజయ్ కల్లాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పనితీరుపై మరో మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున డబ్బులు వృధా చేస్తున్నారని కల్లాం ఆరోపించారు. ఇటీవలే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సైతం టీడీపీ సర్కారు విధానాలను తప్పుపట్టిన నేపథ్యంలో తాజాగా కల్లాం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమరావతిలో అవినీతికి సంబంధించి తానో పుస్తకం రాశానన్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం: ‘‘అనుభవజ్ఞుల పాలన అంటే పెద్ద పెద్ద నగరాలు కట్టడంకాదు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగితేనే నిజమైన అభివృద్ధి. మహానగరాల పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయడం వల్ల ప్రజలకు మేలు జరగదు. పైగా అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం సరైన భావనకాదు. విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం నగరాలకు పరిపాలనను విస్తరించాలి. కొత్త రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగకపోగా పాలకుల అవినీతి చాలా పెరిగిపోయింది. దీనివల్ల వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముంది. నిజానికి ఏపీలో కొత్త రాజధాని కట్టాలనుకునేది కేవలం పైరవీల కోసం మాత్రమే. రాజధాని పేరుతో భారీగా డబ్బును దుబారా చేస్తున్నారు’’ అని అజయ్ కల్లాం అన్నారు. ఆసక్తికర వ్యాఖ్యలు: మీడియాతో భేటీ సందర్భంగా కల్లాం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మేకప్‌లు వేసుకున్న కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు. ప్రస్తుత యువతరంలో ప్రశ్నించే తత్వం లోపిస్తున్నదని కల్లాం ఆవేదన వ్యక్తం చేశారు. -
ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ పి.హరికుమార్‌ను ఏసీబీ అదనపు డైరెక్టర్ (డీఐజీ)గా నియమించింది. వెయిటింగ్లో ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్‌ను గ్రేహౌండ్స్ డీఐజీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రిటైర్డ్ ఎస్పీ కె.మాధవరావును స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఓఎస్డీగా నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనూరాధ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ నండూరి సాంబశివరావు అభ్యర్థన మేరకు రిటైర్డ్ ఎస్పీ మాధవరావుకు ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెలకు రూ.50 వేల వేతనంతో ఏడాదిపాటు ఆయన ఓఎస్డీగా కొనసాగనున్నారు. -
వేసవిలో సమస్యలు తలెత్తకూడదు
అనంతపురం అర్బన్ : వేసవిలో తాగునీటి ఇబ్బందులు పశుగ్రాసం కొరత సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి ఎద్దడి , పశుగ్రాసం కొరత నివారణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి అనంతరాముని నియమించామన్నారు. జిల్లాలో ఏవైనా సమస్యలుంటే ఆయన దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో చేపట్టిన చర్యల గురించి ఇన్చార్జి జేసీ–2 రఘునాథ్ వివరించారు. 137 హ్యాబిటేషన్లలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ఎంత గ్రాసం సేకరించాలనేదానిపై అంచనాలు తయారు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జేడీఓ శ్రీరామ్మూర్తి, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్, సెరికల్చర్ జేడీ అరుణకుమారి, సీపీఓ సుదర్శనం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరాం నాయక్, డీంఎంహెచ్‌ఓ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ జుబేదా బేగం, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సీఎస్ నియామకంపై ఏపీ సర్కార్ కసరత్తు
విజయవాడ: నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ప్రస్తుత సీఎస్ టక్కర్ పదవీ కాలం రేపటితో (మంగళవారం)తో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్త సీఎస్ కోసం ప్రభుత్వం సమాచాలోచనలు చేస్తోంది. కాగా కొత్త సీఎస్ రేసులో అజయ్ కల్లాం, దినేష్ కుమార్, అనిల్ చంద్ర పునీత్ ఉన్నారు. కాగా అజయ్ కల్లాంను సీఎస్‌గా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో నెలలో రిటైర్ అయ్యే అధికారికి.. పదవీకాలం పొడిగింపు కుదరదని డీవోపీటీ, పీఎంవో స్పష్టం చేసింది. అజయ్ కల్లాం ప్రస్తుతం ఫైనాన్స్ విభాగం ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పదవీ పొడిగింపు కుదరదని తేల్చిచెప్పడంతో ఈ నేపథ్యంలో అజయ్ కల్లాం నియామకంపై సందిగ్ధత నెలకొంది. దీంతో సీనియారిటీ జాబితాలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దినేశ్ కుమార్ ను పూర్తిస్థాయి సీఎస్‌గా నియమించడంపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. -
ఏపీ ఆర్థిక, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్‌గా అజేయ కల్లం
భారీగా సీనియర్ ఐఏఎస్‌లకు స్థానచలనం వెయిటింగ్లో ఉన్న ఏడుగురికి పోస్టింగ్ అటవీశాఖకు పీవీ రమేశ్ సాక్షి, హైదరాబాద్: నెల రోజులుగా ఐఏఎస్‌ల బదిలీలపై ఊరిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు శుక్రవారం 21 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్‌లతో పాటు ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్లకు చెందిన ఏడుగురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ముందు నుంచి అనుకున్నట్లుగానే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్‌పై ఏపీ సీఎం వేటు వేశారు. ఆయన్ను అడవుల బాట పట్టించారు. రమేశ్ అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉండడంతో పాటు అదనంగా రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రంలో పెండింగ్ అంశాలకు సంబంధించి సీఎం ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు. బదిలీల్లో ఏపీ సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ ముద్ర ప్రస్ఫుటంగా కనిపించింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజేయ కల్లంను నియమించాల్సిందిగా తొలి నుంచి టక్కర్ సీఎంకు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అదే అమలైంది. ఆర్థిక శాఖ, రెవెన్యూ(వాణిజ్య, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజేయ కల్లంను ప్రభుత్వం నియమించింది. దీర్ఘకాలంగా సాగునీటి శాఖ అధికారిగా కొనసాగుతున్న ఆదిత్యనాథ్ దాస్‌ను బదిలీ చేశారు. ఆయనను స్కూల్ విద్యా శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. సాగునీటి శాఖ కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌ను నియమించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఏకే ఫరీడాను ప్రాధాన్యత లేని ప్రభుత్వ రంగ సంస్థల శాఖకు బదిలీ చేశారు. మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు ప్రస్తుతం ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖకు అదనంగా గృహ నిర్మాణ శాఖను కేటాయించారు. ఇటీవల పరిశ్రమల శాఖ నుంచి బదిలీ చేసిన రావత్‌ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు. -
తొలుత 6 శాఖల తరలింపు
తొలుత హోం, విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, సాగునీటి శాఖలు బెజవాడకు 6న విధివిధానాల రూపకల్పన 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక మేధా టవర్స్, లైలా కాంప్లెక్స్‌లపై సుముఖత సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకు తరలించటంపై అక్టోబర్ 6వ తేదీన విధివిధానాలు రూపొందించాలని ముఖ్య కార్యదర్శులతో ఏర్పాటైన కమిటీ నిర్ణయించింది. తొలి దశలో హైదరాబాద్ నుంచి 6 ప్రభుత్వ శాఖలు విజయవాడకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేయూలని కమిటీ సూచించింది. హోంశాఖ, విద్య, వైద్యం, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలతో పాటు నీటిపారుదల శాఖల విభాగాధిపతులు విజయవాడ నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని కమిటీ సభ్యులు నిర్ణరుుంచారు. వీలైనంత త్వరగా హోంశాఖ, విద్య, సాగునీటి శాఖల కార్యాలయాలను తరలించాలన్న ప్రభుత్వ సూచనపై కమిటీ చర్చించింది. సోమవారం సచివాలయంలోని ‘జే’ బ్లాకులో రవాణా, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ చాంబర్లో ముఖ్య కార్యదర్శులు అజయ్ కల్లాం, సాంబశివరావు, జవహర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నీలం సహానీ తదితరులు సమావేశమై విజయవాడకు కార్యాలయూల తరలింపుపై చర్చించారు. తొలి దశలో తరలివెళ్లే ప్రభుత్వ శాఖలకు ఎంత స్థలం కావాలి? అవసరాలు తదితరాలపై సిబ్బందితో సోమవారంలోగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. గన్నవరంలోని మేధా టవర్స్, విజయవాడ బందరు రోడ్డులోని లైలా కాంప్లెక్స్‌లలో కార్యాలయాలు నిర్వహించేందుకు అనువుగా ఉన్నాయని భావిస్తున్నారు. ఈ భవనాల్ని సీఎం చంద్రబాబు సైతం విజయవాడ పర్యటన సందర్భంగా సందర్శించి తరలింపుపై సుముఖత వ్యక్తం చేయటాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో 15 రోజుల్లోగా ప్రాథమికంగా ఓ నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. విభాగాధిపతులు నిర్దిష్ట గడువులోగా వెళ్లాలనే అంశంపై సమావేశంలో స్పష్టత రాలేదు. -
బ్యాంకులకు 3 రోజులు సెలవు
* ఆది, సోమవారం ఆన్లైన్ చెల్లింపులు పనిచేస్తాయి * ఈ రెండు రోజులు కేవలం పన్ను చెల్లింపు శాఖలే పనిచేస్తాయి * పండగల దృష్ట్యా ఏటీఎంల్లో నగదు కొరత లేకుండా చర్యలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరుస సెలవు దినాలతో సామాన్యులకు మూడు రోజుల పాటు సాధారణ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండటం లేదు. ఆదివారానికి తోడు సోమవారం ఉగాది కావడం, మంగళవారం నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ఆది, సోమవారాలు సెలవు దినాలైనప్పటికీ ఆన్లైన్ చెల్లింపులు చేసుకోవడానికి ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ సేవలను ఆర్బీఐ కొనసాగిస్తోంది. పన్నుల చెల్లింపులను స్వీకరించే బ్యాంకు శాఖలు మాత్రం ఆది, సోమవారాలు యధావిధిగా పనిచేస్తాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ మంగళవారం మాత్రం అన్ని బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ లావాదేవీలు అందుబాటులో ఉండవు. ప్రత్యేక చర్యలు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా బ్యాంకులు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యోగులకు జీతాలు పడే సమయం, పండగలను దృష్టిలో పెట్టుకొని ఏటీఎం కేంద్రాల్లో అధిక మొత్తాలను ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ బ్యాంకు అధికారి ఒకరు చెప్పారు. దీనికి తోడు ఆది, సోమవారాల్లో ఆన్లైన్ లావాదేవీలకు అనుమతి ఉండటంతో ఈ వరుస సెలవులు ప్రజలకు అంతగా ఇబ్బంది కల్గించకపోవచ్చన్నారు. ఖజానా కార్యకలాపాలు యథాతథం.. మరోవైపు .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రావల్సిన వసూళ్లు, జరపాల్సిన అత్యవసర చెల్లింపులకు సంబంధించి ఆది, సోమవారాల్లో కూడా ఖజానా కార్యాలయం, జిల్లా ఖజానా కార్యాలయాలు, సబ్ ఖజానా కార్యాలయాలు, పే అకౌంట్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం శనివారం అంతర్గత సర్క్యులర్ జారీ చేశారు. దీని ప్రకారం 31వ తేదీనాడు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కార్యాలయాలన్నీ పనిచేయనున్నాయి. ఈ రెండు రోజులు రాష్ట్ర ఖజానా కార్యాలయాల నుంచి ఆస్తుల కల్పన వ్యయాలకు చెల్లింపులు చేయనున్నారు. రెవెన్యూ వ్యయానికి చెందిన చెల్లింపులను పూర్తిగా నిలుపుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పును ఆస్తుల కల్పన వ్యయానికి వినియోగించాల్సి ఉంది. అయితే అప్పు పాతిక వేల కోట్ల రూపాయలను చేసినప్పటికీ ఆస్తుల కల్పనకు కేవలం 11 వేల కోట్ల రూపాయలనే వెచ్చించింది. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజుల్లో ఇతర చెల్లింపులను నిలుపుదల చేసి ఆస్తుల కల్పనకు బిల్లులు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. -
అజయ్ కల్లాం, జవహర్‌రెడ్డిలకు కీలక బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి వినయ్ కుమార్, కేంద్ర సర్వీసుకు వెళ్లడంతో సీఎం పేషీలోని మిగతా ఉన్నతాధికారుల శాఖల సర్దుబాటుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా వినయ్ కుమార్ స్థానంలో అజయ్ కల్లాం నియమితులయ్యూరు. అజయ్ కల్లాంతోపాటు వురో ఉన్నతాధికారి జవహర్‌రెడ్డికి కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు. ఆ వివరాలు ఇవీ.... ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లాం: సాధారణ పరిపాలన, హోమ్, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్, రెవెన్యూ, ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం ఇంచార్జి, సీఎం కార్యాలయం ఎస్టాబ్లిష్మెంట్, ఇతర అధికారులకు కేటాయించని శాఖలు. ముఖ్యమంత్రి కార్యదర్శి జవహర్‌రెడ్డి: మున్సిపల్ పరిపాలన-పట్టణాభివృద్ధి, గనులు-భూగర్భవనరుల శాఖ, రవాణా, రహదారులు-భవనాలు, పర్యాటక-సాంస్కృతిక వ్యవహారాలు, అటవీ పర్యావరణశాఖ-శాస్త్ర సాంకేతిక శాఖ, న్యాయ- శాసనభ వ్యవహారాలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, మౌలిక సదుపాయూలు-పెట్టుబడులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం. సీఎం. ప్రత్యేక కార్యదర్శి ఎస్.ఎస్. రావత్: విద్య, సాంకేతిక విద్య, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, సాగునీరు, ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళిక. సీఎం. ప్రత్యేక కార్యదర్శి ఎన్. శ్రీధర్: వ్యవసాయం, ఉద్యానవన శాఖ, ఆరోగ్యం, వైద్య విద్య, సహకార-మార్కెటింగ్, పౌరసరఫరాలు, పశుసంవర్థక శాఖ, వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి, క్రీడలు-యువజన సర్వీసులు, గృహనిర్మాణం, కార్మిక-ఉపాధి శాఖలు. ముఖ్యమంత్రి ఉప కార్యదర్శి జె. మురళి: ప్రత్యేక అభివృద్ధి నిధి, నియోజకవర్గాల అభివృద్ధి నిధి, మారుమూల ప్రాంతాల అభివృద్ధి, ఇందిరమ్మ బాట దరఖాస్తుల పర్యవేక్షణ, సమాచార వ్యవస్థ, ముఖ్యమంత్రి మెయిల్స్, దరఖాస్తులు.