హైదరాబాద్: వివేకా హత్య కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సీబీఐ అబద్ధాల మయంగా మార్చేసిందన్నది ఆయన వాదన. ఈ క్రమంలో.. గత వారం ఆయన వేసిన పిటిషన్ విచారణ అర్హతకు సంబంధించిన ఆదేశాలను రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇవాళ(శుక్రవారం) విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో.. రిజిస్ట్రీ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌కు మెయిన్ నంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
‘‘సీఆర్‌పీసీ సెక్షన్-161 ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. మెస్సేజ్ చేసి విచారణకు పిలిచారు. నా స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదు. అప్పటి విచారణాధికారి వికాస్ సింగ్. స్టేట్‌మెంట్‌పై సంతకం మాత్రం ముఖేష్ శర్మది ఉంది. సీనియర్ ఐపీఎస్‌లు అయ్యిఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదు. నేను చెప్పింది యధాతథంగా రికార్డు చేయలేదు. దర్యాప్తు వెనకాల దురుద్దేశం కనిపిస్తోంది. సీబీఐ తన ఛార్జిషీట్‌లో తన స్టేట్మెంట్ తొలగించాలి. తిరిగి తనస్టేట్మెంట్ రికార్డు చేయాలి’’ అని గత వారం హైకోర్టులో వాదనలు సందర్భంగా అజేయ కల్లం న్యాయవాదులు వాదించారు.
నాడు చెప్పింది ఇదే..
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఏప్రిల్ 29, 2023న సీబీఐ అజేయ కల్లం నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. ‘‘మార్చి 15, 2019న జగన్‌గారి నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు’’. ఇది తాను సీబీఐకి చెప్పింది.. అంతకు మించి తానేం చెప్పలేదు అని అజేయ కల్లాం అంటున్నారు.
స్టేట్‌మెంట్ అంతా అబద్ధాలమయమే!
జగన్ గారి భార్య ప్రస్తావనకాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదు. సీబీఐ తాను ఒకటి చెబితే.. దాన్ని మార్చేసి ఛార్జిషీట్‌లో మరోలా ప్రస్తావించింది. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అబద్ధాలే ఉన్నాయి. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోంది. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్‌మెంట్‌గా పేర్కొన్న అంశాలను కొట్టేయాలి. అవసరమైతే తన నుంచి మరోసారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేలా ఆదేశించాలి. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా వివేకా కేసులో విచారణ సాగాలని తన పిటిషన్‌లో అజేయ కల్లం కోరారు.
Comments
Please login to add a commentAdd a comment