సాక్షి, హైదరాబాద్: వివేకా కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. కేవలం దస్తరిగి ఇచ్చిన కన్ఫెషన్ తప్ప.. సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, పైగా దస్తగిరిని కూడా బెదిరించి ఆ స్టేట్‌మెంట్ తీసుకుందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. ఆపై పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు.
అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే అరెస్ట్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి దస్తగిరి కన్ఫెషన్ తప్ప సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరిని బెదిరించి.. చిత్రహింసలకు గురిచేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పాడు. దస్తగిరి కూడా సీబీఐకి భయపడి భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయి. ఒకటి కుటుంబం, రెండోది వ్యాపార సంబంధాలు, మూడోది వివాహేతర సంబంధాలు, నాలుగోది పొలిటికల్ గెయిన్. వీటిపై సీబీఐ ఫోకస్ పెట్టలేదని అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. అలాగే.. వైఎస్ అవినాష్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని, రాజకీయ కోణంలో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్రలో భాగమే ఇదంతా అని వాదించారు.
ఈ తరుణంలో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు.. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి ఇవాళ్టి విచారణను రేపటికి సీబీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాతే అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: వివేకాపై అందుకే సునీత కక్షగట్టింది
Comments
Please login to add a commentAdd a comment