సాక్షి,హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. గురువారం వైఎస్ భాస్కరరెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించగా, ఆపై సీబీఐ కూడా తమ వాదనలు వినిపించింది. వివేకా కేసులో దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించిందని.. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని భాస్కర్‌రెడ్డి తరపున లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు.
కేసుతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్ర జరుగుతోంది. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే.. మా క్లయింట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని వ్యతిరేకిస్తున్నాం. వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు. అలాంటిది నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చేసి.. దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించింది.
ఒక నిందితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మా క్లయింట్లను ఈ కేసులోకి ఎలా లాగుతారు. గూగుల్ టేక్‌అవుట్ ఫొటోలను ఎలా ఆధారంగా చూపిస్తారు?. ఇది ముమ్మాటికీ మా క్లయింట్స్‌ను ఇరికించే ప్రయత్నమే అంటూ లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు.
ఇక సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యేనేని, వివేకాను ఎవరు హత్య చేశారన్నది తేలాల్సి ఉందని, సుప్రీం కోర్టు ఈ కేసును దగ్గరగా పర్యవేక్షిస్తోందని వాదించింది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
Comments
Please login to add a commentAdd a comment