Bhaskar Reddy
-
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి
-
వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలోకి ప్రవేశించొద్దని ఆదేశిస్తూ కోర్టుకు పాస్‌పోర్టు, రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, ఇద్దరు ష్యూరిటీలు ఇవ్వాలని సూచించింది. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హైదరాబాద్ సీసీఎస్‌లో హాజరు కావాలని ఆదేశించింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని, సాక్షులను బెదిరించొద్దని ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని తమకు వ్యతిరేకంగా సాక్ష్యం లేదని.. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డితో పాటు సునీల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పారు. అరెస్టు సమర్థనీయం కాదు నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం (హియర్ సే ఎవిడెన్స్) చట్టప్రకారం సాక్ష్యంగా చెల్లదని వైఎస్ భాస్కర్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గూగుల్ టేకవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధృవీకరణ ఇవ్వదన్నారు. ఇలాంటి సాక్ష్యాలతో వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి అరెస్టు సమర్థనీయం కాదన్నారు. ‘మూడో చార్జిషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది.వైఎస్ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించినవారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం సహకరిస్తున్నారు. హత్య వెనుక వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినా గంగిరెడ్డి తాను అలా చెప్పలేదని పేర్కొన్నారు. దస్తగిరి చెప్పిన విషయానికి అంత ప్రా«దాన్యమిస్తున్న సీబీఐ ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడంలేదు’ అని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. తండ్రి తన కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా?‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్‌గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్‌కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఈయనపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయనను తప్పించి.. మరొకరిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హత్య జరిగిన రోజు వైఎస్ అవినాశ్‌రెడ్డికి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి తన కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో సీబీఐ విచారణను సాగదీస్తోంది’ అని నిరంజన్‌రెడ్డి న్యాయమూర్తికి నివేదించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇవ్వాలి.. ‘‘పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే సాక్ష్యాలు లేవు. వైఎస్ భాస్కర్‌రెడ్డి వయసు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల వద్దకు చేర్చాల్సి ఉంటుంది. జైలులో ఉంటే అదెలా సాధ్యం? ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్‌రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. వీరికి కూడా అదే వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితులను జైలులో ఉంచడం వారి హక్కులను హరించడమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది’ అని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి గత నెలలో తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం తీర్పు చెప్పారు. -
Viveka Case: అవినాష్‌రెడ్డికి ఊరట
హైదరాబాద్, సాక్షి: వివేకా కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది. కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, కాబట్టి ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి ఓ పిటిషన్ వేశాడు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే దస్తగిరి పిటిషన్దస్తగిరి ఆరోపణల్లో వాస్తవం లేదునిరాధార ఆరోపణలతో పిటిషన్ వేశారుసీబీఐ బెయిల్ రద్దు ఎప్పుడూ కోరలేదుహైకోర్టు షరతులను కూడా ఎక్కడా ఉల్లంఘించలేదుసాక్షులను బెదిరించినట్లు ఎక్కడా ఆధారాల్లేవ్వైఎస్ భాస్కర్‌రెడ్డి విషయంలో సైతం ఆధారాల్లేవ్ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ వేసిందిఅని అవినాష్ తరఫు న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దస్తగిరి పిటిషన్‌ను కొట్టేసింది.మరోవైపు ఇదే కేసులో అరెస్టైన అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అదే సమయంలో ఉదయ్‌కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.ఇక.. ఈ కేసులో వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి అంటున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, పైగా ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్. షర్మిల రాజకీయ సభల్లో ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారులేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సునీత పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇస్తోందిఅసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చానుదస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించండిఈ కేసులో వాచ్ మెన్ రంగన్న ఐ విట్ నెస్ ...నలుగురి పేర్లు చెప్పాడురంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్ద అయిన అరెస్ట్ చేసి కస్టడీ అడిగి సమాచారం రాబట్టాలినెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదుదస్తగిరి హత్య చేశానని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారుఅనంతరం దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ అడిగాడుదస్తగిరి బెయిల్‌కు సునీత అభ్యంతరం చెప్పలేదుపక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు306- 4A ప్రకారం అప్రూవర్‌ను ట్రయల్ అయిపోయే వరకు బయటకు పంపకూడదుకానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్‌గా మార్చారుఅప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది?సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయిఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది.?హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో అందరికీ తెలుసుజమ్మలమడుగులో చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం చేశారని సునీత చెప్పిందిఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపి టికెట్ కోసమని ఎలా మాట మార్చుతారు?నాకు బెయిల్ వచ్చాకా ఇప్పటివరకు 13 సార్లు వాంగ్మూలం ఇచ్చానుఎవరో ఫోన్ చేస్తే అవినాష్ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోందిఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతుంది?వైఎస్ వివేకానందరెడ్డికి సొంత బావమరిది శివప్రకాష్ రెడ్డి, ఆయన మూడో మనిషి ఎలా అవుతాడు ?శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పానుమూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఎలా అంటారు ?ఎవరైనా కాల్ చేస్తారని ముందే ఊహిస్తారా?నేను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడునేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పానువివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే చెప్పి ఉండాలిఎర్రగంగిరెడ్డి 45 నిమిషాలు అలస్యంగా వచ్చాడుఎర్రగంగిరెడ్డికి శివప్రకాష్ రెడ్డే ఫోన్ చేశాడుసునీత ఏ రకంగా నిందలు వేస్తున్నారో అందరు గమనించాలిఎర్రగంగిరెడ్డి వివేకాకు ఎంత అప్తుడొ అందరికి తెలుసువివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారుచివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలి ?బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారు.రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారుఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదుగూగుల్ టేక్ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోందివైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుంది100 మీటర్ల నుంచి కిలోమీటర్ అంత దూరం తేడా కనిపిస్తోందిఅది కూడా మూడేళ్ల తరువాత చూశారు?మొదట్లో గూగుల్ టేక్ ఔట్ ఎందుకు తప్పని అనిపించలేదు?గూగుల్ టేక్ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చింది?గ్రీన్ విచ్ మీన్ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చింది?ఇది వివాదం అవ్వడంతో దీంతో మళ్లీ సాకులు చెబుతు కౌంటర్ వేశారువారి కారణాలపైనే వారే అఫిడవిట్ వేశారు, అబద్దాన్ని ఏమి చేసినా నిజం కాదుచంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారునేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదున్యాయవ్యవస్దపై పూర్తి నమ్మకం ఉందిఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుందినా ఫోన్లో వాట్సప్ యాక్టివ్ ఉన్నందుకు నిందితులతో మాట్లాడానని ఆరోపిస్తున్నారుఆరోపించే వారికి కనీసం వాట్సాప్ పట్ల అవగాహన అయినా ఉండాలినా నెంబర్ వాట్సాప్‌లో ఎన్నో గ్రూపులున్నాయి.ఏ గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వాట్సాప్‌లోకి వస్తుందినేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్‌లు ఎవరైనా చూస్తారా?మూడేళ్లుగా నన్ను అప్రతిష్టపాలు చేశారుఅనేక ఇబ్బందులకు గురిచేశారు74 యేళ్ల వయస్సులో మా తండ్రి జైలులో మగ్గుతున్నాడుటిడిపి, బిజేపి నాయకులను అడ్డుపెట్టుకుని కేసులు వేశారుహత్యని తెలిసింది ముందుగా వివేకా కుటుంబ సభ్యులకే.!వైఎస్అర్ చనిపోయాక షర్మిలకు ఎంపిగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదు?వీరే కదా నన్ను ఎంపీగా ఉండమని పిలిచిందికేవలం ఎంపీ పదవి చూపి విమర్శలు చెయ్యడం సరికాదు -
వివేకా కేసులో సంచలన నిజాలు బయటపడ్డ సునీత అబద్దాలు
-
‘హియర్ సే ఎవిడెన్స్’ సాక్ష్యంగా చెల్లదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హియర్ సే ఎవిడెన్స్ (నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం) చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని, గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధ్రువీకరణ ఇవ్వదని భాస్కర్‌రెడ్డి, ఉదయ్కుమారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి కోర్టుకు నివేదించారు. అలాంటి సాక్ష్యాలతో అరెస్టు సమర్థనీయం కాదని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మూడో చార్జీషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది. అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు. హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారంటూ దస్తగిరి వాంగ్మూలం ఇవ్వగా.., గంగిరెడ్డి మాత్రం తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. దస్తగిరి చెప్పిన విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీబీఐ.. ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. ‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్‌గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్‌కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయనపై సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయన్ని తప్పించి, మరొకరిని నియమించింది. హత్య జరిగిన రోజున అవినాశ్‌రెడ్డికి భాస్కర్‌రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో విచారణను సీబీఐ సాగదీస్తోంది. ముఖ్యంగా నాలుగు అంశాలను ఇక్కడ పరిశీలించాలి. ఇందులో మొదటిది పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే. వాటికి సాక్ష్యాలు లేవు. రెండోది భాస్కర్‌రెడ్డి వయస్సు. ఆయన వయస్సు దాదాపు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మూడో అంశం. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆయనకు అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణకు చేర్చాలి. జైలులో ఉంటే అది సాధ్యం కాదు. ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నాలుగోది ఆయన్ని అరెస్టు చేసి సంవత్సరమయ్యింది. ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్‌రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదే వీరికి కూడా వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితుల పేరుతో జైలులో ఉంచడం వారి హక్కులను హరించడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేశారు. -
కాంగ్రెస్ బలోపేతానికి పాత మిత్రులు కలిసిరావాలి..
కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాత మిత్రులు కలిసి రావాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీచేయని పాత కాంగ్రెస్ నాయకులు తిరిగి పార్టీలోకి రావాలన్నారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ పాటుపడుతుంటే, కొంతమంది మతం పేరిట, దేవుళ్ల ఫొటోలతో గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. సీనియర్ నాయకుడైన భాస్కర్‌రెడ్డి, తిరిగి పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. సొంత గూటికి ఆకారపు భాస్కర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఆయన, కొన్ని సంవత్సరాల క్రితం బీఆర్ఎస్లో చేరారు. బుధవారం బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జీ రోహిత్ చౌదరి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. బీఆర్ఎస్లో సీనియర్ నాయకులకు గుర్తింపు లేదని ఆకారపు భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేనేని రోహిత్ రావు, మూల వెంకట రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా.. -
సీఎం జగన్ సమక్షంలో YSRCPలో చేరిన భాస్కర్ రెడ్డి
-
సీఎం వైఎస్ జగన్ సహకారం మరువలేనిది
పుంగనూరు: జర్మనీకి చెందిన తమకు రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సహకారం మరువలేనిదని పెప్పర్ మోషన్ విద్యుత్ బస్సుల తయారీ సంస్థ సీఈవో ఆండ్రియాస్ హేగర్ చెప్పారు. తాము చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేయబోయే పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. హేగర్, ఆయన బృందం శుక్రవారం పుంగనూరు మండలంలోని ఆరడిగుంటలో పెప్పర్ మోషన్ బస్సులు, ట్రక్కుల తయారీ పరిశ్రమకు కేటాయించిన భూమిని జిల్లా కలెక్టర్ షన్మోహన్తో కలిసి పరిశీలించింది. ఈ సందర్భంగా హేగర్ జిల్లా కలెక్టర్‌తో, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్‌తో పలు విషయాలపై చర్చించారు. అనంతరం పుంగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారతదేశం పెప్పర్ మోషన్ సంస్థకు రెండో పుట్టినిల్లు అని తెలిపారు. 2009లో తొలిసారిగా ఇండియాను సందర్శించామన్నారు. భారతదేశంలో అధిక జనాభా ఉన్నారని, అధిక శాతం వాహనాలను వినియోగిస్తున్నారని తెలిపారు. అందుకే ఇక్కడ 800 ఎకరాలలో రూ.4,640 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో 8,100 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2027 నాటికి 30 వేల బస్సులు, ట్రక్కులను మార్కెట్లో విడుదల చేస్తామన్నారు. మూడు దశల్లో నిర్మాణం చేస్తామని తెలిపారు. పర్యావరణానికి పూర్తి అనుకూలమైన విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీతో పాటు విడిభాగాల తయారీ పరిశ్రమ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు, తమిళనాడుకు పుంగనూరు జాతీయ రహదారులు అనుసంధానం కావడం, విమానాశ్రయాలు, రవాణా సదుపాయాలు ఎంతో బాగుండడంతో ఇక్కడ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించామన్నారు. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు కొనసాగించేందుకు వీలుందని సీఈవో తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ షన్మోహన్ పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది: జిల్లా కలెక్టర్ పుంగనూరు మండలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జర్మన్ పెప్పర్ ఎల్‌క్ట్రికల్ బస్సుల సంస్థ పరిశ్రమ ఏర్పాటు కావడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని జిల్లా కలెక్టర్ షన్మోహన్ కొనియాడారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి చొరవతో పరిశ్రమ ఏర్పాటవుతోందన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఇక్కడే 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఘన స్వాగతం పెప్పర్ కంపెనీ సీఈవో ఆండ్రియస్ హేగర్కు, ఆయన బృందానికి కర్ణాటక సరిహద్దులో పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి ఘన స్వాగతం పలికారు. శాలువలు కప్పి సన్మానించారు. హేగర్తోపాటు ఆ సంస్థ సీటీవో డాక్టర్ మదియాస్ కెర్లర్, సీఎస్‌వో సత్య, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్డర్, సీఐవో రాజశేఖర్‌రెడ్డి, సీఎస్‌వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, ఉర్త్ ఎల్రక్టానిక్స్ ఎండీ హర్ష ఆద్య తదితరులు ఉన్నారు. -
వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు
-
వివేకా కేసు.. వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 12 రోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ఎస్కార్ట్ బెయిల్లో భాగంగా ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్ వెహికిల్ ఉంటాయి. ఎస్కార్ట్ బెయిల్లో వీళ్లు భాస్కర్ రెడ్డి వెంటే ఉంటారు. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో.. ఈ ఏప్రిల్‌లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని పులివెందులలో విచారించి.. నాటకీయ పరిణామాల నడుమ అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ సీబీఐ అధికారులు. అప్పటి నుంచి ఆయన చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేయగా.. ఇవాళ ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అంతకు ముందు ఉదయ్ కుమార్‌రెడ్డికి కూడా సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ భార్య గర్భవతిగా ఉండడంతో ఆమెను కలిసేందుకు 14 నుంచి 16వ తేదీ వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఇదీ చదవండి: Viveka Caseలో దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు' -
వివేకా కేసు దర్యాప్తులో సీబీఐ హ్యాండ్సప్!
సాక్షి, అమరావతి: ఊహించినట్లుగానే మాజీ మంత్రి వైఎస్ వివేకాందనందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ చేతులెత్తేసింది! ముందుగానే ‘అప్రూవర్’ గంతలు కట్టుకుని దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ చివరికి సాధించింది శూన్యం!! నిందితుడు దస్తగిరితో చెప్పించిన తప్పుడు కథనం.. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు వండివార్చిన వాంగ్మూలాలు మినహా రెండున్నరేళ్ల దర్యాప్తు తరువాత సీబీఐ సాధించింది ఏమీ లేదు! శాస్త్రీయ ఆధారం అంటూ తెరపైకి తెచ్చిన ‘గూగుల్ టేక్’ అవుట్ చివరకు వట్టిదేనని చేతులెత్తేసింది. సాక్షుల వాంగ్మూలాల పేరిట పరస్పర విరుద్ధమైన, అహేతుకమైన వాదనలు బెడిసికొట్టాయి. గతంలో దాఖలు చేసిన చార్్జషీట్లలో పేర్కొన్న అభూత కల్పనలు, ఊహాజనితాలకు కొనసాగింపుగానే సీబీఐ తుది చార్్జషీట్ను దాఖలు చేసి చేతులు దులిపేసుకున్నట్లు స్పష్టమవుతోంది. సాధించింది శూన్యం ఎలాంటి ఆధారాలు లేకుండా వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి పేర్లను చార్్జషీట్లలో సీబీఐ ఏకపక్షంగా చేర్చింది. వారికి వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. గూగుల్ టేక్ అవుట్ పూర్తిగా అహేతుకమని నిపుణులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. యూటీసీ కాలమానానికి, భారత కాలమానానికి తేడా కూడా గుర్తించకుండా గతంలోని చార్జిషీట్లోఅభియోగాలను మోపడం సీబీఐ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. తమ అభియోగాలు అవాస్తవమని న్యాయ విచారణలో వెల్లడవుతుందని గుర్తించిన సీబీఐ తుది చార్జిషీట్లోనాలుక కరుచుకుంది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి సునీల్ యాదవ్ అక్కడ లేరని పేర్కొంది. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం పూర్తిగా తొందరపాటేనని స్పష్టమైంది. వాంగ్మూలాల కట్టుకథలు సాక్షులు చెప్పని విషయాలను కూడా 164 స్టేట్మెంట్ పేరిట నమోదు చేసుకుని మీడియాకు లీకులు ఇవ్వడం సీబీఐ దురుద్దేశాన్ని వెల్లడిస్తోంది. 2019 మార్చి 15న ఉదయం తాము హైదరాబాద్‌లో సమావేశంలో ఉండగా వైఎస్ జగన్ తమకు వివేకా మరణించారనే విషయాన్ని తెలియచేసినట్లు అజేయ కల్లం చెప్పారు. కానీ ఆయన ఫలానా సమయం అని ఏమీ చెప్పలేదు. కానీ ఉదయం 5.30 గంటలకే వైఎస్ జగన్ తమకు చెప్పారని అజేయ కల్లం వెల్లడించినట్లు సీబీఐ ఏకపక్షంగా వాంగ్మూలం నమోదు చేసుకుని మీడియాకు లీకులు ఇచ్చింది. దీన్ని అజేయ కల్లం వెంటనే ఖండించారు. అజేయ కల్లంను కలసిన అధికారి ఒకరు కాగా ఆయన పేరిట వాంగ్మూలం నమోదు చేసిన అధికారి మరొకరు కావడం గమనార్హం. ఇక అదే రోజు ఆ సమావేశంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఏస్ కృష్ణమోహన్‌రెడ్డి ఉదయం 6.30 గంటలకు తనకు ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ చేసి వివేకా మరణించిన విషయాన్ని తెలిపారని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. వైఎస్ జగన్ నివాసంలో సహాయకుడు నవీన్ కూడా అదే చెప్పారు. ఆ ఇద్దరి వాంగ్మూలాలను సీబీఐ అదే విధంగా నమోదు చేసింది. మరి వారిద్దరు ఉదయం 6.30 గంటలకు తెలిసింది అన్నప్పుడు అదే సమావేశంలో పాల్గొన్న అజేయ కల్లం మాత్రం ఉదయం 5.30 గంటలకు తెలిసింది అని ఎలా చెప్పగలరు? ఎంపీ టికెట్ నిర్ధారించేది వైఎస్ జగన్ కడప ఎంపీ టికెట్ అంశంపై లేని సందిగ్దత ఉన్నట్టుగా చూపించేందుకు సీబీఐ విఫల యత్నాలు చేస్తోంది. తాజాగా షర్మిల వాంగ్మూలం పేరిట అదే ప్రచారాన్ని తెరపైకి తేవడం విడ్డూరంగా ఉంది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా తనను పోటీ చేయమని వివేకా ఒత్తిడి చేశారని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కానీ ఎంపీ టికెట్‌ను నిర్ణయించేది వివేకానో షర్మిలనో కాదు. నిర్ణయించేది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన అప్పటికే అవినాశ్‌రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనే 2019 ఎన్నికల్లోనూ అభ్యర్థి అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. వివేకా కూడా అవినాశ్‌రెడ్డి తరపున ప్రచారం చేశారు. బెడిసికొట్టిన దస్తగిరి అప్రూవర్ కుట్ర వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ మొదట్లోనే పక్కదారి పట్టింది. హత్య చేశానని స్వయంగా అంగీకరించిన నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విస్మయపరిచింది. వివేకాను హత్య చేస్తే తాము చూసుకుంటామని వైఎస్ భాస్కర్‌రెడ్డి భరోసా ఇచ్చారని ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అయితే తాను అలా చెప్పనే లేదని ఎర్ర గంగిరెడ్డి స్పష్టం చేశారు. ఇక వివేకా హత్యకు రూ.40 కోట్లతో డీల్ కుదిరినట్లు దస్తగిరి మరో కట్టుకథ చెప్పాడు. అందుకు సీబీఐ ఎలాంటి ఆధారాన్ని చూపించ లేదు. బెంగళూరులో ఓ భూ వివాదంలో రూ.8 కోట్లు వస్తాయని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టుగా దస్తగిరి చెప్పాడు. అసలు ఆ వివాదమే లేదని స్పష్టమైంది. తనకు అడ్వాన్స్‌గా రూ.కోటి ఇచ్చారని చెప్పుకొచ్చిన దస్తగిరి రూ.2 వేల కోసం చివరికి రూ.500 కోసం సునీల్ యాదవ్‌తోపాటు ఇతరులను ప్రాథేయపడుతూ పెట్టిన వాట్సాప్ మెస్సేజ్‌లు వెలుగు చూశాయి. రూ.కోటి ఉన్న వ్యక్తి రూ.500 కోసం దేబిరించడం ఏమిటన్నది సీబీఐనే చెప్పాలి. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చిన సీబీఐ హత్య ఆయుధాన్ని కూడా రికవరీ చేయలేకపోయింది. తండ్రి శత్రువులతో సునీత కుమ్మక్కు పులివెందులలో తన తల్లి విజయమ్మపై పోటీ చేసినప్పటికీ వైఎస్ వివేకా పార్టీలోకి వస్తానంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. సముచిత గౌరవం ఇచ్చారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను అభ్యర్థిగా నిలిపారు. చంద్రబాబు పన్నాగంతో నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి వైఎస్సార్సీపీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి కుట్రతో వివేకానందరెడ్డిని ఓడించారు. వివేకా మరణించిన తరువాత ఆయన కుమార్తె సునీత టీడీపీ నేతలతో కుమ్మక్కు కావడం విస్మయపరిచింది. వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కారణమంటూ సీబీఐకి తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో పూర్తిగా విఫలమైన సీబీఐ తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కట్టుకథలతో దర్యాప్తును పక్కదారి పట్టిస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా భాస్కర్‌రెడ్డి.. సీబీఐ కోర్టు సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్‌రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని హైదరాబాద్ జిల్లా మెజిస్ట్రేట్‌కు సీబీఐ కోర్టు సిఫార్సు చేసింది. ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న భాస్కర్ రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది. కాగా, వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతించాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ పిటిషన్‌పై గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేశారు. తన వైపు కౌంటరు లేదని సీబీఐ కోర్టుకు దస్తగిరి తెలిపారు. సీబీఐ వాదనలు వినడానికి విచారణను ఈ నెల 5కు కోర్టు వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణలో సీబీఐ పీపీకి సహకరించేందుకు అనుమతివ్వాలన్న సునీత కోరగా, ఆమె పిటిషన్ పై శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్‌పై భాస్కర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి తమ కౌంటర్లు దాఖలు చేయలేదు. సునీత వాదనల కోసం పిటిషన్ విచారణ ఈ నెల 5కు కోర్టు వాయిదా వేసింది. -
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు, వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి బెయిల్ కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. దాదాపు నెలన్నర రోజులుగా జైలులో ఉంటున్నానని, కస్టడీ విచారణ కూడా ముగిసిందని భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16న భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ఏప్రిల్ 24 నుంచి చంచల్‌గూడ జైలులో ఉంటున్న భాస్కర్‌రెడ్డి గత వారం అస్వస్థతకు గురవ్వగా.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు హృదయ సంబంధ సమస్యలున్నట్లు గుర్తించారు. దీంతో నిమ్స్‌కు తరలించి.. పలు పరీక్షలు చేశారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది కూడా చదవండి: అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ -
నిమ్స్ లో వైఎస్ భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు
-
వైఎస్ భాస్కర్ రెడ్డి నిమ్స్‌కు తరలింపు..
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలు అధికారులు శనివారం ఉదయం భాస్కర్ రెడ్డిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో వైద్య చికిత్సలు, యాంజియోగ్రామ్ చేయనున్నారు వైద్యులు. కాగా, వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా చంచల్‌గూడ సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురవడంతో జైలు అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. భాస్కర్‌రెడ్డికి బీపీ లెవల్స్ తగ్గడంతో జైలు అధికారులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించారు. భాస్కర్‌రెడ్డికి హృదయ సంబంధ సమస్యలు ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు ఆయనకు యాంజియోగ్రామ్ చేయించాలని సూచించినట్లు తెలిసింది. వైద్యుల సూచన మేరకు భాస్కర్‌రెడ్డిని నిమ్స్‌కు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత -
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత
సాక్షి కర్నూలు/ హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, వైఎస్ శ్రీలక్ష్మికి కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే, మెరుగైన వైద్య సేవల కోసం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని ఏఐజీ తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందుతోంది. ఇక, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. మరోవైపు.. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉస్మానియా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కర్ రెడ్డిని రేపు నిమ్స్‌కు తరలించనున్నారు జైలు అధికారులు. ఇది కూడా చదవండి: మంచి చేసే ఉద్దేశం వాళ్లకు లేదు.. నారా చంద్రబాబును నమ్మొద్దు: సీఎం జగన్ -
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్..సీబీఐకి హై కోర్టు కీలక ఆదేశాలు
-
వివేకా హత్య కేసు: దోషులని నిర్ణయించుకుని.. అదే లక్ష్యంగా దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొందరిని దోషులుగా నిర్ణయించుకుని, అదే లక్ష్యంగా దర్యాప్తు చేస్తోంది తప్ప.. అసలు నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేయడంలేదని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ల న్యాయవాదులు సీబీఐ కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ కస్టడీ పిటిషన్‌తో పాటు ఉదయ్‌కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టులో వాదనలు జరిగాయి. భాస్కర్‌రెడ్డి తరఫున ఉమామహేశ్వర్, ఉదయ్ తరఫున రవీందర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఏ–4 (దస్తగిరి) చెప్పాడని వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి భాస్కర్‌రెడ్డి, అవినాశ్, శివశంకర్‌రెడ్డితో వివేకాకు విభేదాలున్నాయని పేర్కొన్నారు. హత్య కోసం రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందని, రూ.కోటి ఇచ్చారని చెప్పారు. ఈ ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవు. రిమాండ్ పిటిషన్‌లోని సబ్జెక్ట్‌ను మార్చి కస్టడీ పిటిషన్‌గా వేశారు. దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను పాటించకుండా ఇష్టం వచ్చినట్లు పిటిషన్ దాఖలు చేశారు. ఒక్క కస్టడీ అన్న పదం తప్ప రెండు పిటిషన్లు ఒక్కటే. 75 ఏళ్ల వృద్ధుడైన భాస్కర్‌రెడ్డిని పలుమార్లు విచారణకు పిలిచారు. విచారణలో ఏం అడిగారు, ఆయన ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదో తెలపకుండా.. సహకరించలేదని అనడం సరికాదు. సీబీఐ కోరుకున్న విధంగా ఆయన సమాధానాలు వెల్లడించరు. అలాగే సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జీషీట్లలోనూ భాస్కర్‌రెడ్డి ప్రస్తావన కూడా లేదు. ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేసి నిందితుల జాబితాలో చేరుస్తున్నారు. ఇంకా ఎంత మందిని కోర్టు అనుమతి లేకుండా ఇలా చేరుస్తారో తెలియదు. సాక్షులు ఎవరన్నది కూడా పిటిషన్లో లేదు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. భాస్కర్‌రెడ్డి వెన్నెముకకు సర్జరీ జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. భాస్కర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని ఉమామహేశ్వర్ వాదించారు. అరెస్టులతో హడావుడి ‘ఉదయ్‌కుమార్‌ను ఏ నేరం కింద అరెస్టు చేశారో సీబీఐ ఎక్కడా చెప్పలేదు. సీఆర్పీసీ 173 ప్రకారం.. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే ఏ–6 (ఉదయ్‌కుమార్), ఏ–7 (వైఎస్ భాస్కర్‌రెడ్డి)లను నిందితులుగా పేర్కొనాలి. కానీ కోర్టు నుంచి సీబీఐ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఏ–6పై నమోదు చేసిన అన్ని సెక్షన్లు బెయిల్ ఇచ్చేవే. ఇప్పటికి 22 సార్లు సీబీఐ ఉదయ్‌కుమార్‌ను విచారించింది. అతని మొబైల్ తీసుకున్న అధికారులు రసీదు కూడా ఇవ్వలేదు. ఇన్నిసార్లు విచారణ జరిపి.. ఇంకా సహకరించలేదనడం హాస్యాస్పదం. తెలియని ప్రశ్నలకు సమా«దానం చెప్పకపోవడం అతని హక్కు. సీబీఐ మూడేళ్లుగా విచారణ చేస్తున్నా రెండు చార్జిషీట్లు వేయడం తప్ప సాధించిన పురోగతి లేదు. సుప్రీంకోర్టు ఆదేశించిన గడువు దగ్గరపడుతుండటంతో అరెస్టులు చేస్తున్నారు తప్ప ఆధారాలను సేకరించడంలేదు. చట్టాలను పాటించడం లేదు. సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై ఉదయ్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. చదవండి: దస్తగిరితో డ్రామా! అప్రూవర్ వాంగ్మూలం ఉత్త కథే ఉదయ్‌ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆయనపై మోపినవి నాన్–కాగ్నిజబుల్ నేరాలే. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఉదయ్‌కి బెయిల్ ఇవ్వాలి’ అని రవీందర్‌రెడ్డి కోరారు. ‘2017 ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి వివేకాతో వైఎస్ భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి పలు విభేదాలు ఉన్నాయి. 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకా ఓడిపోయారు. ఈ ఓటమికి భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కారణమని వివేకా తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. హత్య చేసిన వారు కూడా భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు’ అని సీబీఐ పీపీ వాదనలు వినిపించారు. -
వైఎస్ వివేకా కేసు దర్యాప్తుపై అనుమానాలు !
-
కళ్లకు గంతలతోనే దర్యాప్తు
సాక్షి, అమరావతి: ఏనుగు కాళ్లు, తొండం, తోక పట్టుకుని నలుగురు అంధులు గనక ఆ ఏనుగెలా ఉందో ఊహిస్తూ చెబితే ఏమవుతుంది? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ కూడా ఇలాగే చేస్తోంది. వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ... కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు దీన్నే తలపిస్తోంది. కుట్రదారులెవరో నిగ్గుతేల్చే నిప్పు కణికల్లాంటి అంశాలను పూర్తిగా వదిలేసి దర్యాప్తు సాగిస్తుండటమే విస్మయం కలిగిస్తోంది. అవేంటంటే... ♦వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఆస్తి కోసం..రాజకీయ వారసత్వం కోసం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ♦మెజార్టీ ఓట్లు ఉన్నప్పటికీ స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన వైఎస్ వివేకానంద రెడ్డి ఓడిపోయారు. టీడీపీ గెలిచింది. ♦వివేకా గుండెపోటుతో మరణించారని తొలిసారిగా చెప్పింది ఆయన పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డి. ఆయన తొలుత చెప్పింది టీడీపీ మంత్రి ఆది నారాయణరెడ్డికే. ♦వైఎస్ అవినాశ్‌ను ఎంపీగా గెలిపించేందుకు తన తండ్రి కృషి చేస్తున్నారన్న సునీత... మళ్లీ మాట మార్చి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకని? ♦స్వయంగా హత్య చేశాడంటున్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం సరైనదేనా?.. రూ.40 కోట్ల సుపారీ కట్టుకథలో అడుగడుగునా అవాస్తవాలే. ♦నార్కో పరీక్షల్లో ఏమీ చెప్పని రంగయ్య తరువాత ఏదో చెప్పారట..! ♦ఆధారాల ధ్వంసం అంటున్న సీబీఐ... ఆ మూడు వేలిముద్రలపై ఎందుకు మౌనంగా ఉంటోంది? ♦వివేకా హత్య కుట్రదారులు ఆయన అల్లుడు, పెద్ద బావమరిదే అంటున్న తులసమ్మ మాటలనెందుకు పట్టించుకోరు? ఇవీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అంశాలు.. కానీ కళ్లకు గంతలు కట్టుకున్న రీతిలో సీబీఐ వాటినేమాత్రం పట్టించుకోవడం లేదు. ముందుగా నిర్ణయించుకున్నట్టుగా... ఎవరో ప్రభావితం చేస్తున్నారన్నట్టుగా ముందుకెళుతోంది. కుట్రదారులు ఎవరన్న కోణంలో కాకుండా...ముందే ఓ నిర్ణయానికి వచ్చేది ఆ దిశగా వెళుతోందనటానికి భాస్కర్‌రెడ్డి అరెస్టే తాజా తార్కాణం. తన చర్యను సమర్థించుకుంటూ సీబీఐ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ నిండా కల్పితాలు...ఊహాజనితాలు... అవాస్తవాలే!. ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ కేవలం గాలిమాటలు పోగేసి రిమాండ్ నివేదికను రూపొందించడం ఆశ్చర్యమే మరి. రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ ప్రస్తావించిన అంశాలు ఒకసారి పరిశీలిస్తే... వివేకాను కుట్రపూరితంగా ఓడించిందెవరు? వైఎస్ వివేకానందరెడ్డి 2017 కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేశారు. తగినంత బలం ఉంది కనక గెలుస్తారన్న ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి ఆయనకు టికెట్టిచ్చారు. కానీ ఓడిపోయారు. అందుకు వైఎస్ భాస్కర్ రెడ్డే కారణమని వివేకా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సీబీఐ తన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. అందుకే వివేకాపై భాస్కర్‌రెడ్డి కక్ష పెంచుకున్నారన్నట్టుగా చెప్పింది. కానీ వాస్తవం ఏమిటంటే... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించింది స్వయానా చంద్రబాబు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపికి పూర్తి మెజార్టీ ఉంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి వివేకానందరెడ్డి గెలుపు నల్లేరుపై నడకే. కానీ చంద్రబాబు పన్నాగంలో భాగంగా అప్పటి టీడీపీ మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేశారు. కుట్ర పూరితంగా వివేకాను ఓడించారు. ఇది వైఎస్సార్ జిల్లాలో బహిరంగ రహస్యం. అంటే వైఎస్ వివేకానందరెడ్డి ఎవరిపై ఆగ్రహించాలి? వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినా.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ చేరి మంత్రి అయి తనను ఓడించిన ఆదినారాయణ రెడ్డిపై కదా? సీబీఐ మాత్రం భాస్కర్‌రెడ్డిపై ఆగ్రహించినట్టుగా కట్టు కథను అల్లడం విస్మయ పరిచేదే. ఇక వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఇప్పటికీ ఆదినారాయణ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. తన తండ్రిని ఓడించిన ఆయనతో వారికి సన్నిహిత సంబంధాలు ఎందకున్నాయి? వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కూడా తన భార్య, కుమార్తె, అల్లుడి ఒత్తిడితోనే వివేకానందరెడ్డి మంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. వారి ఒత్తిడితోనే ఏకంగా వైఎస్ విజయమ్మపై పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తన చిన్నాన్నపై పూర్తి గౌరవంతో పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డికి రాజకీయ శత్రువులు టీడీపీ నేతలైన ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిలేనని.. ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించింది కుమార్తె సునీ త, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డేనని స్పష్టమవుతోంది. మరి ఈ దిశగా సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నదే సందేహాలకు తావిస్తోంది. ఎంపీ టికెట్ అవినాశ్ రెడ్డిదేనని అప్పటికే స్పష్టత కడప సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాశ్‌రెడ్డికే 2019 ఎన్నికల్లో కూడా టికెట్ ఇస్తున్నట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి మౌఖికంగా ప్రకటించేశారు. దాంతో అవినాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఆయన ఎన్నికల ప్రచారానికి వైఎస్ వివేకానందరెడ్డే ఇన్చార్జి. ఆ విషయాన్ని వైఎస్ వివేకా హత్యకు గురైన తరువాత కూడా ఆయన కుమార్తె సునీత మీడియా ముఖంగా చెప్పారు. మరి కడప ఎంపీ టికెట్ కోసమే వైఎస్ వివేకాపై భాస్కర్‌రెడ్డి కుటుంబం కక్ష పెంచుకుందని టీడీపీ ఆరోపిస్తుండటం ఎంత నీచం!!. గుండెపోటు కథ వివేకా పెద్ద బావమరిదిదే... వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో నెత్తురు కక్కుకుని చనిపోయినట్టు భాస్కర్‌రెడ్డి ఇతర నిందితులతో కలసి ప్రచారం చేశారని సీబీఐ తన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. వాస్తవానికి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని వైఎస్ అవినాశ్రెడ్డిగానీ వైఎస్ భాస్కర్రెడ్డిగానీ ఎవరికీ చెప్పలేదు. ఆ విషయాన్ని చెప్పింది వివేకానందరెడ్డి పెద్ద బావమరిది, అల్లుడికి సోదరుడు అయిన నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి. అది కూడా వైఎస్ వివేకా రాజకీయ శత్రువు, అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డితోనే ఆయన తొలుత చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న శివ ప్రకాశ్ రెడ్డి స్వయంగా మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. సిగరెట్లు ఎక్కువగా తాగుతారు కనక ఇలా జరిగి ఉండొచ్చని తాను చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి స్వయంగా మీడియాకు చెప్పారు. అంతేకాదు నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డే ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేసి.. వివేకా చనిపోయిన విషయాన్ని చెప్పారు. అప్పటికే ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతున్న ఎంపీ అవినాశ్... వెనక్కి తిరిగి వైఎస్ వివేకా ఇంటికి వెళ్లారు. ఆ ఫోన్ రాకపోయి ఉంటే అవినాశ్‌రెడ్డి జమ్మలమడుగు వెళ్లేవారు. ఎన్నికల ప్రచారం చేసుకునేవారు. వైఎస్ వివేకా మృతిచెందారని అందరికీ చెప్పింది శివ ప్రకాశ్‌రెడ్డి. గుండెపోటుతో మరణించారని చెప్పింది కూడా ఆయనే. కానీ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి చెప్పారంటూ సీబీఐ ఓ కల్పిత కథను రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించటం విస్మయం కలిగిస్తోంది. వివేకా రాసిన లేఖను ఎందుకు దాచిపెట్టారు? వైఎస్ వివేకా మరణించే సమయంలో లేఖ రాశారు. రక్తపు మరకలతో కూడిన లేఖ అది. డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచినట్టు ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను ఆ రోజు ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... వెంటనే ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. సునీత, ఆమె భర్త మధ్యాహ్నం 1గంట సమయంలో పులివెందుల చేరుకున్నారు. వారికి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి అందించారు. చివరకు సాయంత్రం 5గంటలకు వారంతా కలిసి లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఇక్కడే అత్యంత కీలకమైన అంశం దాగి ఉంది. ఆ లేఖను దాచి ఉంచమని సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పకపోయి ఉంటే కృష్ణారెడ్డి వాటిని వెంటనే బయటపెట్టేవారు. శివప్రకాశ్‌రెడ్డి చెప్పిన సమాచారంతో అక్కడికి వచ్చిన అవినాశ్‌కు గనక దాన్ని చూపించి ఉంటే... వివేకాది హత్యేనని అందరికీ వెంటనే స్పష్టత వచ్చేది. గుండెపోటో మరొకటో కాదని వెంటనే తెలిసిపోయేది. అసలు ఎవ్వరూ మృతదేహాన్ని ముట్టుకునేవారే కాదు. కానీ ఆ లేఖను దాచి ఉంచమని చెప్పడమే కాకుండా... వివేకా గుండెపోటుతో చనిపోయారని టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి చెప్పింది వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదే. వాస్తవం ఇలా ఉంటే... గుండెపోటు కథను భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి ప్రచారంలోకి తీసుకువచ్చారని సీబీఐ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనడమే దర్యాప్తు తీరుపై సందేహాలకు తావిస్తోంది. ఆనాడు సునీత మాట్లాడింది మరచిపోయారా? తన తండ్రి హత్య వెనుక అసలు దోషి ఆదినారాయణ రెడ్డేనని సునీత 2019 మార్చిలో చెప్పిన విషయాలను సీబీఐ పరిగణనలోకి తీసుకోవడమే లేదు. వివేకా హత్య తరువాత సునీత హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని పెట్టి... వైఎస్ కుటుంబంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబం గురించి చంద్రబాబుకు ఏం తెలుసని ప్రశ్నించారు. ఒకర్ని ఒకరు చంపుకునే చరిత్ర తమ కుటుంబానికి లేదన్నారు. కేవలం వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననానికే టీడీపీ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని సునీత మండిపడ్డారు. చంద్రబాబు అసలు ఆదినారాయణ రెడ్డిని ఎందుకు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రజలు ఎవరూ చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఆనాడు అలా మాట్లాడిన సునీత ఇప్పుడెందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు?. ఎవరి ఒత్తిడి, ప్రలోభాలకు లొంగి సునీత మాట మార్చారు? ఆమె ఢిల్లీ వెళ్లినప్పుడల్లా వెనకుండి కథ నడిపిస్తున్నది ఎవరు? వ్యవస్థలను ప్రభావితం చేస్తూ దర్యాప్తును పక్కదారి పట్టిస్తోంది ఎవరు? వీటిని సీబీఐ ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదు? హంతకుడే అప్రూవరా...!? రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ పేర్కొన్న మరో అంశం కూడా ఆ సంస్థ విశ్వసనీయతను శంకించేలా చేస్తోంది. వైఎస్ వివేకాను గొడ్డలితో స్వయంగా నరికినట్లు చెప్పిన నిందితుడు దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విస్మయపరుస్తోంది. హత్య చేసిన వ్యక్తి జైల్లో కాక దర్జాగా బయట తిరుగుతున్నారు. అతని బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించలేదు. హంతకుడైన దస్తగిరి తో కల్పితాలు, అభూతకల్పనలు చెప్పించి... వాటి ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతుండటం వెనుక మర్మమేమిటి? రూ.40కోట్ల సుపారీ కట్టుకథే.. దస్తగిరి అప్రూవర్ వాంగ్మూలం పేరిట సీబీఐ అల్లిన మరో కట్టుకథ రూ.40 కోట్ల సుపారీ స్టోరీ. వైఎస్ వివేకాను హత్య చేయడానికి రూ.40 కోట్లకు సుపారీ కుదిరిందని, అందులో రూ.5కోట్లు అడ్వాన్స్ వచ్చిందని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పి తనకు రూ.కోటి ఇచ్చారని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పినట్టు సీబీఐ పేర్కొంది. మరి అదే సీబీఐ వెలికి తీసిన దస్తగిరి, సునీల్ యాదవ్ మధ్య వాట్సాప్ సందేశాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వివేకా హత్యకు రెండు రోజుల ముందు వరకు... ఆ తరువాత కూడా దస్తగిరి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ సునీల్ యాదవ్‌కు మెస్సేజులు చేశారు. కనీసం రూ.2 వేలు అయినా అప్పు ఇవ్వాలని... రూ.500 ఇచ్చినా ఆ పూట ఖర్చుకు సరిపోతాయని ప్రాథేయపడ్డారు. ఆ వివరాలన్నీ కూడా సీబీఐనే వెల్లడించింది. మరి దస్తగిరి రూ. కోటి అడ్వాన్స్‌గా తీసుకుని ఉంటే రూ.500 అప్పు ఎందుకడుగుతాడు? అంటే రూ.40కోట్ల సుపారీ కట్టు కథే కదా? అప్రూవర్‌గా మారగానే దస్తగిరికి డబ్బూదస్కం ఇక అప్పటివరకు కటిక పేదరికంలో కొట్టుమిట్టాడి న దస్తగిరి అప్రూవర్‌గా మారిపోగానే ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. ఒక్కసారిగా కార్లతో తిరు గుతూ... ట్రాక్టర్లు కొనుగోలు చేసి... సెటిల్మెంట్లు మొదలు పెట్టాడు. అంటే అప్రూవర్‌గా మారి వైఎస్ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలకు వ్యతిరేకంగా వాంగ్మూలమిచ్చినందుకు అతనికి భారీగానే ముట్టిందన్నది తేటతెల్లమవుతోంది. మరి తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని దస్తగరిని ప్రలోభపెట్టింది ఎవరు? నార్కో టెస్టుల్లో ఏమీ చెప్పని రంగయ్య...! అభిషేక్ మహంతి ఎస్పీగా ఉన్నప్పుడు ఈ కేసు దర్యాప్తులో భాగంగా వాచ్‌మేన్ రంగయ్యను విచారించారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన గుజరాత్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసుకువెళ్లి అతనిపై నార్కో ఎనాలిసిస్ టెస్ట్, బ్రెయిన్ మ్యాపింగ్, లై డికెక్టర్ టెస్ట్‌లు నిర్వహించారు. నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించిన ఆ పరీక్షల్లో కూడా రంగయ్య ఏమీ చెప్పలేకపోయాడు. కానీ ఆ రోజు రాత్రి ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్‌లతోపాటు మరో వ్యక్తిని చూశానని రంగయ్య తమ దర్యాప్తులో చెప్పారని సీబీఐ అంటోంది. నార్కో పరీక్షల్లోనే ఏమీ చెప్పలేని రంగయ్య అన్ని నెలల తరువాత సీబీఐ అధికారులు మామూలుగా అడిగితే ఇవన్నీ చెప్పారట!. నమ్మశక్యమా? తులసమ్మ పిటిషన్‌లోని అంశాలపై దర్యాప్తే లేదు వివేకా హత్యకు కారణాలపై డి.శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ పలు సందేహాలను లేవనెత్తుతూ పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలు, రాజకీయ వారసత్వం, ఆస్తి పై హక్కుల కోసం కుమార్తె, అల్లుడితో విభేదాలు, నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం టీడీపీ నేత బీటెక్ రవి కక్షగట్టడం, ఆర్థిక విభేదాలతో కక్ష పెంచుకున్న అనుచరుడు కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి టీడీపీ నేత బీటెక్ రవితో కలసి కుట్ర పన్నటం, రాజకీయ విభేదాలు ఉన్న తాడిపత్రి నేత రాజేశ్వరరెడ్డి, అతనికి సహకరించిన నీరుగట్టు ప్రసాద్‌ల ప్రమేయం...ఇలా తులసమ్మ లేవనెత్తిన కీలకమైన అంశాలను న్యాయస్థానం నమోదు చేసింది. కానీ సీబీఐ వీటిని దర్యాప్తులో కనీసం పరిగణలోకే తీసుకోవటం లేదు. ఆ 3 వేలి ముద్రలపై మౌనం ఎందుకో...! వివేకా హత్య స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారనేది భాస్కర్‌రెడ్డి మీద సీబీఐ చేసిన ప్రధాన అభియోగం. ఆ ఆరోపణ పూర్తిగా అహేతుకం. మరి అదే సమయంలో వివేకా హత్య ప్రదేశంలో లభించిన కీలకమైన ఆధారాలను సీబీఐ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? మృతదేహం పడి ఉన్న బాత్రూమ్లో లభించిన వేలి ముద్రలను నిపుణులు పరిశీలించి పలువురి వేలిముద్రలతో సరిపోల్చారు. కానీ వాటిలో అయిదు వేలి ముద్రలు ఎవరితోనూ సరిపోల లేదు. వాటిలో మూడు వేలిముద్రలు పూర్తిగా ఉండగా... మరో రెండు పాక్షికంగా ఉన్నాయి. బాత్రూమ్ గోడలు, తలుపు వెనుక భాగంలో ఆ వేలి ముద్రలను గుర్తించారు. పూర్తిగా ఉన్న ఆ 3 వేలి ముద్రలు ఎవరివన్నది ఇప్పటివరకు తేలలేదు. సీబీఐ ఆ విషయాన్నే పట్టంచుకోలేదు. ఆ వేలి ముద్రలెవరివో గుర్తిస్తే అసలు దోషులెవరో తెలుస్తుంది కదా? సీబీఐ వేధింపులపై ఫిర్యాదులు బుట్టదాఖలు వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలని సీబీఐ తనను చిత్రహింసలకు గురి చేసిందని... ఇంకా వేధిస్తోందని కల్లూరు గంగాధర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా సీబీఐ స్పందించ లేదు. ఎంపీ అవినాశ్, భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలని సీబీఐ తనను వేధిస్తోందని ఉదయ్ కుమర్‌రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సీబీఐ తీరు మారలేదు. కొత్త బృందం...పాత కక్షే..: వివేకా హత్య కేసులో రామ్‌సింగ్ నేతృత్వంలోని సీబీఐ అధికారుల బృందం గతంలో ఎంత అసంబద్ధంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. తాము చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలం రాసుకున్నారని పలువురు సాక్షులు వాపోయారు. తాము కోరుకున్నట్లు వాంగ్మూలమివ్వాలని చిత్రహింసలకు గురి చేస్తోందని మరికొందరు బాధితులు పోలీసులను కూడా ఆశ్రయించారు. దాంతో ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ అధికారి రామ్సింగ్ను న్యాయస్థానం తొలగించి కొత్త బృందాన్ని నియమించాలని సీబీఐని ఆదేశించింది. కొత్త అధికారుల బృందం వస్తే కొత్త కోణంలో దర్యాప్తు చేసి కొత్త అంశాలను వెలికి తీస్తారని అంతా ఆశించారు. కానీ కొత్త బృందం వచ్చింది కానీ ఒక్క కొత్త ఆధారాన్ని కూడా కనుగొనలేదు. పైగా పాత బృందం అసంబద్ధంగా చేసిన దర్యాప్తునే ఆధారంగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ఏప్రిల్ 30లోగా కేసు దర్యాప్తును ముగించాలన్న ఉద్దేశంతో కక్షపూరితంగా కొందర్ని లక్షంగా చేసుకుని వ్యవహరిస్తోందన్నది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదయ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల అరెస్టుకు గతంలో సీబీఐ బృందం చెప్పిన అహేతుక కారణాలనే కొత్త బృందం కూడా వల్లేవేయడం విస్మయపరుస్తోంది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు సీబీఐ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న మరో అంశం... వివేకానందరెడ్డి రెండో వివాహం...దాంతో ఆ కుటుంబంలో తలెత్తిన తీవ్ర విభేదాలు, ఆస్తి తగాదాలు. వీటిని సీబీఐ నామమాత్రంగానైనా దర్యాప్తు చేయకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందన్నది ప్రశ్నగా మారుతోంది. షమీమ్ అనే ముస్లిం మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారని.. వాళ్లిద్దరికీ ఒక కుమారుడు కూడా పుట్టాడని... ఆ కుమారుడికి ఆస్తిలో భాగంతో పాటు తన రాజకీయ వారసుడిగా చేస్తానని ప్రకటించారన్నది ఆ జిల్లాలో అందరికీ తెలిసిందే. దాంతో వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి ఆయనతో తీవ్రంగా గొడవపడ్డారు. ఆయన్ని వదిలి కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. వివేకా ఒక్కరే పులివెందులలో ఉంటున్నారు. బెంగళూరులో ఓ భూమి సెటిల్మెంట్ ద్వారా వచ్చే రూ.2 కోట్లను తన రెండో భార్యకు ఇవ్వాలని వివేకా నిర్ణయించారు. దాంతో సునీత ఆయనతో గొడవపెట్టుకున్నారు. అంతేకాక సునీత, ఆమె భర్త నర్రెడ్డి, బావగారు శివ ప్రకాశ్‌రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు. వివేకాను విడిచిపెట్టకపోతే ఆమె కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, వైఎస్ సునీత మధ్య వాట్సాప్‌లో వాదోపవాదాలు సాగాయి. ఒకర్ని ఒకరు దూషించుకున్న వాట్సాప్ మెస్సేజులను కూడా గతంలో సిట్ అధికారులు గుర్తించారు. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడికి హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా... అవ్వడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ వారసత్వ, ఆస్తి గొడవలే వివేకా హత్యకు ప్రధాన కారణమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వివేకానందరెడ్డి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బామమరిదికే ఎక్కువ ప్రయోజనం. కానీ సీబీఐ మాత్రం ఈ కీలకాంశాలన్నిటినీ విస్మరిస్తూ ఏకపక్షంగా కక్షపూరితంగా దర్యాప్తు చేస్తోందనే విమర్శలున్నాయి. ఆనాడు చంద్రబాబు రాజీనామా చేశారా...! భాస్కర్‌రెడ్డి అరెస్టుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగా ఉంది. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉందని సునీత అప్పట్లోనే ఆరోపించారు. మరి ఆ రోజు చంద్రబాబు తన పదవికి రాజీనామా చేశారా...! వైఎస్ వివేకా హత్యపై మొదటిసారి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. మూడు నెలలు టీడీపీ అధికారంలో ఉంది. మరి ఆ 3 నెలల్లో వైఎస్ వివేకా హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని సిట్ ఎందుకు ఆధారాలు చూపించలేకపోయింది?. వైఎస్ కుటుంబంలోని వారి పాత్ర ఉందంటే చంద్రబాబు ఆ కేసును తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని ఉండేవారు కదా. మరి ఆనాడు సిట్ పోలీసులతోపాటు టీడీపీ నేతలు కూడా వైఎస్ వివేకా హత్య వెనుక భాస్కర్‌రెడ్డి కుట్ర ఉందని చెప్పనే లేదు కదా. అంటే ఆ హత్య వెనుక వారి ప్రమేయం లేనట్టే కదా. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఏనాడూ సిట్ దర్యాప్తును ప్రభావితం చేయలేదు. సీబీఐ దర్యాప్తునకు కూడా హైకోర్టు సాక్షిగా సమ్మతించారు. విచారణను తెలంగాణకు మారుస్తామన్నా కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ సమ్మతిని తెలిపింది తప్ప వ్యతిరేకించ లేదు కదా?. ఇది చాలదూ వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవస్థలను ఎంత గౌరవిస్తోందో చెప్పటానికి? -
నిజాలు దాచి దర్యాప్తా?
సాక్షి, పులివెందుల: ‘అత్యున్నత స్థాయి విచారణ సంస్థ దిగజారి ప్రవర్తిస్తోంది. కీలక అంశాలను మరుగు పరుస్తూ, సిల్లీ అంశాల ఆధారంగా విచారణ చేస్తోంది. పర్సన్ టార్గెట్ ఇన్వెస్టిగేషన్ కాదు.. ఫ్యాక్ట్ టార్గెట్ ఇన్వెస్టిగేషన్ చేయాలని సీబీఐ డైరెక్టర్, డీఐజీ, కొత్తగా నియమితులైన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను కలిసి అభ్యర్థించినా ఆ దిశగా కనీస విచారణ చేపట్టలేదు’ అని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆదివారం పులివెందులలో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని ఊహించని విధంగా అరెస్టు చేశారని, మాటలు రానంత బాధగా ఉందన్నారు. వ్యతిరేక శక్తులు, వ్యతిరేక మీడియాతో పోరాటం చేయడంలో నిజాయితీ నిరూపించుకోవడం సవాల్‌గా నిలుస్తోందని చెప్పారు. సీబీఐ కీలక అంశాలను డౌన్‌ప్లే చేసి, సిల్లీ అంశాల ఆధారంగా ఎందుకు విచారణ కొనసాగిస్తోందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుపటి అధికారి చేసిన రోల్ కంటిన్యూ చేయడం మినహా విచారణలో ప్ర«ధాన కోణం వెలుగు చూడడం లేదన్నారు. ఇలా అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన కొద్ది గంటలకే సోమవారం మరోమారు విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడం గమనార్హం. అవినాష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడిన అంశాలు ఇంకా ఇలా ఉన్నాయి. డెత్ నోట్ దాచి పెట్టింది అల్లుడే.. ♦వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని తెలిసీ, డెత్ నోట్ చదివి వినిపించిన పీఏ కృష్ణారెడ్డితో దానిని ఎవరికీ చూపించకుండా దాచి పెట్టమని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. ఆ మేరకు కృష్ణారెడ్డి ఆయన చెప్పినట్లే చేశారు. వాస్తవాలు చెప్పకుండా ఘటనా స్థలం వద్దకు నన్ను వెళ్లమని నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్లో కోరారు. ♦నేను అక్కడికి వెళ్లి చూశాక ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చాను. హత్య విషయం నా కంటే గంట ముందుగా వివేకా అల్లుడికి తెలుసు. పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన ఆయన విషయాన్ని దాచారు. వివేకా హత్య విషయాన్ని ముందుగా పోలీసులకు తెలిపింది నేనే. సీఐ శంకరయ్యకు స్వయంగా మూడు సార్లు ఫోన్ చేశాను. 35 నిమిషాల తర్వాత సీఐ వచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. ♦ఆ రోజు జమ్మలమడుగుకు వెళ్తున్న నాకు ఫోన్ రావడంతో కృష్ణాలయం సమీపం నుంచి వెనుతిరిగి వచ్చాను. నేనొక్కడినే కాకుండా, నాతో పాటు నాలుగు వాహనాలు ఉన్నాయి. మీరు చెబుతున్న గూగుల్ టేకౌట్ ద్వారా పరిశీలించుకోండి. వాస్తవమో కాదో తెలుస్తుంది. డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి.. ♦ఏ–4 దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన స్టేట్మెంట్లో వివేకా హత్య అనంతరం స్టాంప్డ్ డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాతే ఇంట్లో నుంచి బయటికి వచ్చినట్లు చెప్పాడు. దీనిని బట్టి డాక్యుమెంట్లు దొంగిలించారని స్పష్టం అవుతోంది. అలాంటప్పుడు దొంగతనానికి చెందిన సెక్షన్లు సీబీఐ ఎందుకు పెట్టలేదు? ♦తన ఐడియా ప్రకారమే డెత్‌నోట్‌లో డ్రైవర్ ప్రసాద్ పేరు రాయించానని దస్తగిరి చెబుతున్నాడు. దస్తగిరి చంపి, సంబంధం లేని వారిపై ఆరోపణలు చేస్తున్నాడు. ఆ మేరకు ఉన్న ఐపీసీ సెక్షన్లు ఎందుకు పెట్టలేదు? మరోవైపు వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్లో హత్యలో పాల్గొన్న నలుగురి పేర్లతో సహా చెబుతారు. అయినా నిందితుల్లో ఒకరిని సాక్షిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇవన్నీ చూస్తే కలిసికట్టుగా పద్ధతి ప్రకారం విచారణ సాగుతోందని అర్థమవుతోంది. ♦ఏప్రిల్ 3న రిజిస్టర్ పోస్టు ద్వారా సీబీఐ డైరెక్టర్, డీఐజీ, ప్రస్తుత ఐఓకు పలు వివరాలు ఆధారాలతో పంపించాను. 5వ తేదీ మనిషి ద్వారా కూడా వారికి చేర్చాను. ఏమాత్రం మార్పు లేదు. బెంగళూరు సెటిల్మెంట్లో రూ.8 కోట్లు రావాల్సి ఉండగా, ఆ డబ్బులో సగం ఇవ్వాలని డిమాండ్ చేసిన తర్వాత జరిగిన ఘర్షణలో చంపినట్లు దస్తగిరి చెబుతాడు. ♦వాస్తవంలో అవి ఫేక్ డాక్యుమెంట్లు అని తేలిపోయింది. అసలే రాని, లేని డబ్బు కోసం గొడవ జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలను ఎందుకు సీబీఐ ఛేదించడం లేదు? డాక్యుమెంట్లు తీసుకెళ్లామని దస్తగిరి చెబుతున్నాడు.. ఆ డాక్యుమెంట్లను ఎందుకు రికవరీ చేయలేదు? అందులో ఏముంది? అన్న విషయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. సునీతక్క వర్షన్ సడన్‌గా మారింది ♦ 2019 మార్చి 15న హత్య జరిగితే, టీడీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో వైఎస్ కుటుంబం ఔన్నత్యాన్ని సునీతక్క స్పష్టంగా వివరించింది. సీఎంగా వైఎస్ జగనన్నను, ఎంపీగా నన్ను చేసుకోవాలని కొద్ది నెలలుగా వైఎస్ వివేకానందరెడ్డి తపన పడ్డారని ఆమె స్పష్టంగా తెలిపింది. ఒక సంవత్సరం వరకూ బాగా మాట్లాడేది. ఎర్రగంగిరెడ్డి వైఖరిపై నా అభిప్రాయం కూడా కోరింది. చెప్పాను. సడన్‌గా వైఖరి మార్చుకొని ఢిల్లీకి వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు చేసింది. కారణమేంటో సునీతక్కే చెప్పాలి. ♦హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్ కోసం సీబీఐ నో అబ్జక్షన్ చెబుతోంది. రెండేళ్లుగా కోర్టులో ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అయ్యే సునీతమ్మ, దస్తగిరి ముందస్తు బెయిల్‌కు మాత్రం అభ్యంతరం చెప్పరు. ఆ తర్వాత అప్రూవర్ అనే అబద్ధాల కట్టడం వెలుగులోకి వచ్చింది. ♦అప్రూవర్‌గా మారితే కేసు విచారణ పూర్తయ్యే వరకు లోపల ఉండాల్సి వస్తుంది కాబట్టి ముందస్తు బెయిల్‌కు అభ్యంతరం చెప్పడం లేదు. అటు సీబీఐ, ఇటు సునీతమ్మ కలిసికట్టుగా ప్రణాళిక బద్ధంగా కేసును పక్కదాది పట్టిస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. మేము ఏ తప్పూ చేయలేదు ♦మా నాన్న 40 ఏళ్లుగా మీ అందరికీ తెలుసు. మా మనస్తత్వాలు తెలుసు. నా నిజాయితే నన్ను గెలిపిస్తోంది. వివేకం సార్ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మేము ఇసుమంతైనా తప్పు చేయలేదు. ఎల్లో మీడియా విష ప్రచారాలను నమ్మొద్దు. ♦2009 నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. తొలుత లింగాల మండలం ఇన్ఛార్జిగా పని చేశా. పదేళ్లుగా నేనేంటో అందరికీ తెలుసు. ఈ 3650 రోజుల్లో 1500 రోజులు ఉదయ్‌కుమార్‌రెడ్డి నాతో కలిసి ఉంటాడు. కానీ ఆ రోజు ఉదయమే వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకో విషయం.. థర్డ్ పర్సన్ ఫోన్ కోసం నేను వెయిట్ చేసినట్లు మరో విషయాన్ని చెబుతున్నారు. అదే వాస్తవమైతే నేనే అక్కడికి ఎవర్నో పంపించి ఫోన్ చేయించుకునే వాడిని కదా.. చాలా సిల్లీ థింగ్స్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ♦విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది. అప్రూవర్ అనే అబద్దాల కట్టడం కోర్టులో నిలిచే అవకాశమే లేదు. మాకు పదవులపై వ్యామోహం లేదు. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. వ్యవస్థలపై గౌరవం ఉంది. న్యాయం కోసం పోరాటం చేస్తాం. వ్యక్తి టార్గెట్‌గా చేస్తున్న విచారణలో తుదకు న్యాయమే గెలుస్తుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు సాక్షి ప్రతినిధి కడప : కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. -
‘భాస్కర్ రెడ్డి హెల్త్ విషయంలో సీబీఐకి విజ్ఞప్తి చేశాం’
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. అనంతరం, ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో భాస్కర్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత.. సీబీఐ న్యాయమూర్తి ఎదుట భాస్కర్ రెడ్డిని హాజరుపరిచారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. ‘రేపు(సోమవారం) కోర్టులో కౌంటర్ ఫైల్ చేస్తాం. భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు వివరించాం. ఆయనకు బీపీ 190 ఉన్నట్టు వైద్యులు చెప్పారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని చెప్పాం. హెల్త్ విషయంలో సీబీఐకి విజ్ఞప్తి చేశాం. మా వాదనలు వినిపించాం. ఎస్పీ స్థాయి అధికారి అరెస్ట్ చేయడం సరికాదని చెప్పాం. జైల్లో సదుపాయాలు సంతృప్తికరంగా లేకపోతే కోర్టుకు తెలియజేస్తాం. టార్గెట్ చేస్తూ దర్యాప్తు సాగడంపై ఎంపీ అవినాష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు సాగడం సరికాదని చెబుతూనే ఉన్నాం’ అని అన్నారు. -
భాస్కర్ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేయించారు: ఎంపీ అవినాష్ రెడ్డి
-
విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది: అవినాష్ రెడ్డి
సాక్షి, పులివెందుల: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. ఇక, భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. ‘భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేయించారు. ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటాం. మేం చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించలేదు. లెటర్ దాచిపెట్టామని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. హత్య విషయం నా కంటే గంట ముందు వివేకా అల్లుడికి తెలుసు. కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోంది. వివేకా హత్య విషయాన్ని ముందుగా పోలీసులకు చెప్పింది నేనే. పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. నేను గాలి మాటలు.. గాలి కబుర్లు చెప్పడం లేదు. సాక్షులు చెప్పిన స్టేట్మెంట్ల ఆధారంగానే చెబుతున్నాను. చదవండి: వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు? సీబీఐ నమ్ముకున్న దస్తగిరి స్టేట్మెంట్లోనే అనేక కీలక అంశాలున్నాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్లు చోరి కాబడ్డ ఏ4పై ఎందుకు కేసు నమోదు కాలేదు. ఏ4కి ఎందుకు ఇంత రిలీఫ్ ఇస్తున్నారు. కలిసికట్టుగా ఎవరిపైనో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్రూవర్‌గా మార్చేందుకు యాంటిసిపేటరీ బెయిల్ వేయించారు. అప్రూవర్‌కు సహకరించి సీబీఐ బెయిల్ ఇప్పించింది. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతున్నాను. ఏప్రిల్ 3న మా అభ్యంతరాలను సీబీఐ దృష్టికి తీసుకెళ్లాం అని అన్నారు. చదవండి: రెండో వివాహంతోనే కుటుంబంలో తీవ్ర విభేదాలు! పోలీసులు రావొద్దని నేను చెప్పాననడం దారుణం. పాత అధికారి చేసిన విచారణనే కొత్త బృందం ఫాలో అవుతోంది. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతున్నాను. రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. స్టాంపు పేపర్లు పోతే సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత స్టాంప్ పేపర్ల పరిశీలన, దొంగతనం జరిగింది. చోరీ కేసు ఎందుకు పెట్టలేదు.. ఆ దిశగా ఎందుకు విచారించలేదు?. సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయి. వివేకా.. షేక్ మహ్మద్ అక్బర్‌గా 2010లో పేరు మార్చుకున్నారు. వివేకాకు పెహన్ షా అనే కుమారుడు ఉన్నాడు. వివేకా రాసిన లెటర్ అక్కడే ఉంది. లెటర్ దాచిపెట్టామని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది. మాకు పదవులపై వ్యామోహం లేదు. వ్యవస్థలు, న్యాయస్థానాలపై మాకు గౌరవం ఉంది. చివరకు నిజాయితీయే గెలుస్తుంది’ అని తెలిపారు. చదవండి: భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానికుల ర్యాలీ -
YSR జిల్లా పులివెందులలో శాంతియుత ర్యాలీ
-
సీఎమ్ రమేష్ ఆదినారాయణరెడ్డి.. సీబీఐ విచారణను పక్కదారి పట్టిస్తున్నారు : సుధీర్ రెడ్డి
-
వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి విచారణ: రాచమల్లు
-
పులివెందులలో భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ స్థానికుల ర్యాలీ
-
భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ తరలించిన సీబీఐ
-
భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానికుల ర్యాలీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానికులు శాంతియూత ర్యాలీ నిర్వహించారు. సీబీఐ ఏకపక్ష వైఖరి పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్ అండ్ బీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు.కడప- తాడిపత్రి హైవేపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు. సీబీఐ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. వివేకా హత్యకేసులో దోషులను కాకుండా అవినాష్‌రెడ్డి కుటుంబాన్నిసీబీఐ టార్గెట్ చేసిందన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. ఆయనను హైదరాబాద్ తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో భాస్కర్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. -
కడప: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ
-
గీతం యూనివర్సిటీలో మొత్తం 40 ఎకరాలు ఆక్రమణ: ఆర్డీవో
-
‘వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు’
సాక్షి,హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. గురువారం వైఎస్ భాస్కరరెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించగా, ఆపై సీబీఐ కూడా తమ వాదనలు వినిపించింది. వివేకా కేసులో దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించిందని.. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని భాస్కర్‌రెడ్డి తరపున లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. కేసుతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్ర జరుగుతోంది. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే.. మా క్లయింట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని వ్యతిరేకిస్తున్నాం. వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు. అలాంటిది నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చేసి.. దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించింది. ఒక నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మా క్లయింట్లను ఈ కేసులోకి ఎలా లాగుతారు. గూగుల్ టేక్అవుట్ ఫొటోలను ఎలా ఆధారంగా చూపిస్తారు?. ఇది ముమ్మాటికీ మా క్లయింట్స్‌ను ఇరికించే ప్రయత్నమే అంటూ లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. ఇక సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యేనేని, వివేకాను ఎవరు హత్య చేశారన్నది తేలాల్సి ఉందని, సుప్రీం కోర్టు ఈ కేసును దగ్గరగా పర్యవేక్షిస్తోందని వాదించింది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. -
వైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టులో వాదనలు
-
తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఆదేశించినట్లుగా ఏ–4 దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని, దాని ఆధారంగా కేసుతో ఎలాంటి సంబంధంలేని వారిని ఇరికించాలని దర్యాప్తు సంస్థ ప్రయతి్నస్తోందని వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడం చట్టవిరుద్ధమని, అతడికి బెయిల్ ఇచ్చే సమయంలో కిందికోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. దస్తగిరి చెప్పిన వివరాల అధారంగా తనతోపాటు మరి కొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందన్నారు. ‘దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని, బెయిల్ ఇస్తూ కిందికోర్టు ఇచి్చన ఉత్తర్వులను కొట్టివేయాలి. నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చవద్దని ఆదేశాలు ఇవ్వాలి’అని అభ్యరి్థస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్లోనూ వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యారు. ‘దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. హత్యకు ఆయుధాన్ని కొనుగోలు చేసింది అతడే. దస్తగిరికి బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ పూర్తిగా సహకరించింది. దస్తగిరిపై వాచ్‌మన్ రంగన్న చెప్పిన అంశాలను కిందికోర్టు పట్టించుకోలేదు’అని వైఎస్ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి పిటిషన్లో మరికొన్ని అంశాలివీ.. అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చా.. నా వయసు సుమారు 73 ఏళ్లు. దీర్ఘకాలిక వెన్నునొప్పి, ఛాతీలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నా. ఇప్పటికే సీబీఐ విచారణకు హాజరయ్యా. దర్యాప్తు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. సీఆర్పీసీ సెక్షన్ 161, 164 కింద వివేకా వాచ్‌మన్ రంగన్న స్టేట్మెంట్ను దర్యాప్తు సంస్థ రికార్డ్ చేసింది. దాని ప్రకారం.. హత్య జరిగిన రోజు రంగన్న నిద్రలో ఉండగా అకస్మాత్తుగా పాత్రలు, ఇనుప రాడ్ పడిపోవడం వంటి శబ్దాలు వినపడటంతో లేచి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లాడు. లోపలి నుంచి ఏడుపు లాంటి శబ్దం వినిపించడంతో పార్క్ వైపు ఉన్న ద్వారం వద్దకు వెళ్లి పక్కనే ఉన్న కిటికీ లోంచి లోపలికి చూశాడు. ఇంట్లో నలుగురు వ్యక్తులు కనిపించారు. వాళ్లు హాల్లో ఏదో వెతుకుతూ కనిపించారు. వారిలో ముగ్గురిని ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్‌గా గుర్తించాడు. నాలుగో వ్యక్తి పొడవుగా, సన్నగా ఉన్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రంగన్న చీకటిగా ఉన్న తోటలోని చెట్టు దగ్గర దాక్కున్నాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత పార్క్ వైపు ద్వారం తెరిచి సన్నగా, పొడవుగా ఉన్న వ్యక్తితోపాటు దస్తగిరి, సునీల్ హడావుడిగా వచ్చి కాంపౌండ్ వాల్ దూకి పారిపోయారు. అక్కడ దొరికిన ఆధారాల మేరకే పోలీసులు నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. మమ్మల్ని ఇరికించే ప్రయత్నం.. ఆ నలుగురే ఈ హత్య చేసినట్లు రంగన్న స్టేట్మెంట్ చాలా స్పష్టంగా చెబుతున్నా ఈ కేసుతో ఎలాంటి సంబంధంలేని నాతోపాటు మరికొందరిపై ఆరోపణలు చేస్తూ ఇరికించేందుకు దర్యాప్తు సంస్థ అక్రమ పద్ధతులను అనుసరిస్తోంది. వివేకా కుమార్తె సునీత, దర్యాప్తు అధికారులు వారికి తోచిన చట్టవిరుద్ధ ప్రక్రియలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే దస్తగిరికి కొన్ని సూచనలు చేసి వారికి కావాల్సిన విధంగా వాంగ్మూలం తీసుకున్నారు. దీంతో దస్తగిరి.. ఏ–5(శివశంకర్‌రెడ్డి)తో పాటు నాపై, మరో ఇద్దరిపై నిరాధార ఆరోపణలు చేశాడు. సుప్రీం ఉత్తర్వులను పట్టించుకోకుండా.. మరో ఇద్దరికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. దస్తగిరి గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగా చేసుకుని సీబీఐ నాపై ఆరోపణలు మోపుతోంది. నాకు వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తోంది. సీబీఐ అనుసరించిన విధానం పూర్తిగా చట్టవిరుద్ధం. హత్య కేసులో నిందితుడైన కిరాయి హంతకుడికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులిచ్చింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆమోదయోగ్యం కాదు. దస్తగిరి చెప్పిన దానికి ఎలాంటి సాక్ష్యం లేదు. నేరంలో నలుగురు పాలుపంచుకున్నారు. వీ రిలో తక్కువ నేరం చేసిన వారు జైలులో ఉండగా కీలక పాత్ర పోషించిన దస్తగిరికి మాత్రం బెయిల్ ఇవ్వడం సరికాదు. గంగిరెడ్డి ఆదేశాల మేరకు హత్యలో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. దీని కోసం భారీ మొత్తంలో నగదు కూడా తీసుకున్నాడు. ఆయుధాన్ని తెచ్చానని, హత్యలో ప్రధాన పాత్ర పోషించానని కూడా ఒప్పుకున్నాడు. ఈ అంశాన్ని కిందికోర్టు మేజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోలేదు. బెయిల్ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వివరణ తీసుకోవాల్సి ఉండగా అలా చేయలేదు. అప్రూవర్‌గా మారడం, బెయిల్ ఇవ్వ డం అంతా చట్టవిరుద్ధంగానే జరిగింది. బెయిల్ మంజూరు చేస్తూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా నన్ను నిందితుడిగా చేర్చవద్దని సీబీఐని ఆదేశించాలి. చదవండి: ‘స్కిల్’ సూత్రధారి బాబే -
సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ భాస్కర్ రెడ్డి
-
లెటర్ చూస్తే అసలు విషయాలు బయటపడతాయి: వైఎస్ భాస్కర్ రెడ్డి
సాక్షి, కడప: వైఎస్భాస్కర్ రెడ్డి ఆదివారం ఉదయం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆఫీసులో అధికారులు లేకపోవడంతో భాస్కర్ రెడ్డి వెనుదిరిగారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకా కేసులో సీబీఐ అధికారులు పిలిస్తే విచారణకు వచ్చాను. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా విచారణకు హాజరయ్యాను. విచారణ అధికారి లేరు కాబట్టి తిరిగి మళ్లీ నోటీసులు ఇస్తామన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్లీ విచారణకు హాజరవుతాను. లెటర్ చూస్తే అసలు విషయాలు బయటపడతాయి. కేసును పక్కదారి పట్టించొద్దు. ఈ కేసు పరిష్కారం కావాలంటే లేఖను పరిశీలించాలి అని అన్నారు. -
సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులూ రాలేదు
పులివెందుల: విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని వైఎస్సార్సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చి శనివారం తనను విచారణకు పిలిచినట్లు కొన్ని వార్తా పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని ఖండించారు. గతంలో నోటీసు ఇవ్వడానికి సీబీఐ అధికారులు వచ్చినప్పుడు తాను ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల వల్ల ఈనెల 24 తర్వాత అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చానని తెలిపారు. ఆ తర్వాత తనకు సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. -
సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు: వైఎస్ భాస్కర్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: విచారణకు రావాలని సీబీఐ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వైఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. గతంలో నోటీసు ఇచ్చిన సందర్భంలో ఈ నెల 24 తరువాత అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చానని, కానీ ఇవాళ సీబీఐ విచారణకు హాజరవుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు తాను సిద్ధమని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: సీబీఐ దర్యాప్తుపై సందేహాలు: ఎంపీ అవినాశ్‌రెడ్డి -
ఎల్లో మీడియాది అసత్య ప్రచారం
పులివెందుల రూరల్: 2019 మార్చి 14వ తేదీ రాత్రి సునీల్ యాదవ్ వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడండూ ఎల్లో మీడియా చేస్తున్నది అసత్య ప్రచారమని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారించిన స్థానిక విలేకరి భరత్ యాదవ్ చెప్పారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తాను, సునీల్ యాదవ్ పులివెందులలో కడప రోడ్డు సమీపంలోని నందిక ఆసుపత్రి దగ్గర ఉన్నామని స్పష్టంచేశారు. తనను సీబీఐ అధికారులు విచారించిన సందర్భంలో ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పానని తెలిపారు. సీబీఐ అధికారులు వైఎస్ వివేకా హత్య కేసులో ఎందుకు ఇంతలా అవాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ తనకు బంధువని చెప్పారు. ఆయన వివాహాన్ని బంధువుల అమ్మాయితో తానే జరిపించానన్నారు. చిన్న స్థలం పంచాయితీ విషయంలో సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి దగ్గర ఉండటంవల్ల తాను కూడా ఆయనకు దగ్గరయ్యానన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు తననూ విచారించారని, వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని అన్నారు. సీఐ ర్యాంకు అధికారిణి ఆ విషయాలను అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ధారించారన్నారు. వాస్తవాలు దాచి సీబీఐ అధికారులు ఎవరి కోసమో ఏదో తప్పు చేస్తున్నారని అన్నారు. అసలు తప్పు చేసిన వారిని వదిలేస్తున్నారని చెప్పారు. ఒకే కోణంలో కాకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. తాను పేర్లతో సహా సీబీఐ డైరెక్టర్లకు లేఖ రాశానని, అందులో నిజాలు లేవా అని ప్రశ్నించారు. వారికి అవసరం వచ్చినప్పుడు తన దగ్గర నుంచి సమాధానాలు తీసుకుని కేసును ముందుకు తీసుకెళుతున్నారని, తనను మాత్రం మైనస్ చేసి చూపిస్తున్నారన్నారు. తాను ఎవరికీ అమ్ముడుపోలేదని, తనను ఎవరూ పోషించలేదని చెప్పారు. సీబీఐపై ప్రజలకు గౌరవం ఉందని, దానిని వారు కాపాడుకోవాలన్నారు. -
రియల్టర్ భాస్కర్ రెడ్డి కేసులో కొనసాగుతున్న విచారణ
-
సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి బాధ్యతలు
సాక్షి, విజయవాడ: సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన భాస్కర్‌రెడ్డి.. మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. రైస్‌మిల్లింగ్ పరిశ్రమపై పూర్తి అవగాహన ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక పదవిని అప్పగించారు. ఈ సందర్భంగా సీఎంకు ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
పప్పులు.. బియ్యం బంద్!
♦ లారీల సమ్మెతో హైదరాబాద్‌కు నిలిచిపోయిన నిత్యావసరాల సరఫరా ♦ వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న అసోసియేషన్ల నాయకులు ♦ డీసీఎం అద్దం పగలగొట్టడంతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం సాక్షి, హైదరాబాద్: లారీల సమ్మె తీవ్రమైంది. లారీ యజమానుల ఆందోళన ఆదివారంతో నాలుగో రోజుకు చేరుకుంది. ఎక్కడి చక్రం అక్కడే ఆగింది. హైదరాబాద్‌కు బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి వంటి నిత్యావసరాలు, సిమెంట్, స్టీలు వంటి ముడిసరుకుల రవాణా పూర్తిగా స్తంభించింది. రాష్ట్ర రాజధాని శివార్లలోని ఆటోనగర్ వద్ద తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని బంద్‌ను పర్యవేక్షించారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న లారీలను అసోసియేషన్ల నాయకులు, లారీ యజమానులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. ఆదివారం కంకరతో వస్తున్న టిప్పర్లను, ఇతర సరుకుతో వస్తున్న లారీలను అడ్డుకుని టైర్ల నుంచి గాలి తీసివేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లారీ ఓనర్స్, దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. నగరానికి రాకపోకలు సాగించే సుమారు 5 వేల లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. సుమారు 500 లారీల బియ్యం, 200 లారీల ఉల్లి, అల్లం వెల్లుల్లి తదితర సరుకుల రవాణా నిలిచిపోయింది. అత్యవసర వస్తువులైన పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ వంటి అత్యవసరాల రవాణా మాత్రం ఎప్పట్లాగే కొనసాగుతుండడం కాస్త ఊరటనిస్తోంది. మరోవైపు లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది. నేడు బీమా సంస్థతో చర్చలు! లారీ యాజమాన్య సంఘాలతో సోమవారం బీమా నియంత్రణ సంస్థ చర్చలు జరిపే అవకా శాలున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. చర్చల ఫలితాన్ని బట్టి తమ భవిష్యత్ ఆందోళన ఉంటుందన్నారు. తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించని పక్షంలో అత్యవసర వస్తువులను రవాణా చేసే లారీలను సైతం నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. ‘మలక్‌పేట్’కు రాని మిర్చి, ఉల్లి మలక్‌పేట్‌లోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు సాధారణ రోజుల్లో నిత్యం 10 వేల బస్తాల మేర మిర్చి, ఉల్లిగడ్డ సరఫరా జరిగేది. కానీ ప్రస్తుతం సమ్మె కారణంగా రోజుకు 400 బస్తాలకు మించి రావడం లేదని వ్యాపారులు వాపోయారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, గుంటూరు, ఖమ్మం జిల్లాల నుంచి సరుకు రవాణా నిలిచిపోయిందని పేర్కొన్నారు. వారం క్రితం పెద్ద మొత్తంలో సరుకు నిల్వచేయడంతో ప్రస్తుత అవసరాలకు సరిపోతోందని, మరిన్ని రోజులు ఆందోళన కొనసాగితే సరుకులు నిండుకుంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేగంబజార్‌కు అరకొర సరఫరా నగరంలోని ప్రధాన మార్కెట్‌గా ఉన్న బేగం బజార్, మహారాజ్‌గంజ్, ముక్తార్‌గంజ్, సిద్ధి అంబర్ బజార్లకు కొబ్బరి, పప్పులు, బియ్యం, అల్లం, వెల్లుల్లి, డ్రైఫ్రూట్స్ రవాణా స్తంభించిం ది. గతంలో ఈ ప్రాంతాలకు నిత్యం 200–300 టన్నుల సరుకు రవాణా అయ్యేది. ప్రస్తుతం 40 టన్నులే సరఫరా అందుతోందని వ్యాపారులు తెలిపారు. తమిళనాడు, కేరళ నుంచి నిత్యం 20 లారీల కొబ్బరి వచ్చేదని, ప్రస్తుతం ఒక్క లారీ కూడా రావడం లేద న్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నగరానికి వచ్చే ఉల్లి, ఆలు, టమాటా రవాణా తగ్గిందని చెప్పారు. పండ్లు, కూరగాయలు, పాలు, మందులు, డీజిలు, పెట్రోలు వంటి అత్యవస రాలను సమ్మె నుంచి మినహాయించడంతో వాటి సరఫరా యథాతథంగా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. -
ఇదేం రాజ్యం ?
-
లంచగొండుల భరతం పడదాం
– ప్రజలకు ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి పిలుపు – నేటి నుంచి అవినీతి వ్యతిరేక వారోత్సవాలు అనంతపురం సెంట్రల్ : ‘లంచం తీసుకోవడం ఎంత నేరమో, ఇవ్వడమూ అంతే నేరం. ప్రభుత్వంతో పనులు చేయించుకోవడం ప్రజల హక్కు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే ఏసీబీకి సమాచారమివ్వండి. వారి భరతం పడతాం’ అని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీఎస్పీ భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల తొమ్మిదిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఏసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం నుంచి తొమ్మిదో తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నాల్గోతేదీన పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన, ఐదున జనసంచార ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, ఆరున పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన పోటీలు, నేడున ఏసీబీ కార్యాలయం నుంచి టవర్‌క్లాక్ వరకు భారీ ర్యాలీ, తొమ్మిదిన స్థానిక అంబేడ్కర్ భవన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ, అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. చివరిరోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయడంతో పాటు చేతికి స్కై బ్లూకలర్ రిబ్బన్ కట్టుకోవాలని కోరామన్నారు. 2013 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జిల్లాలో 37 మంది అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్లు తెలిపారు. ఐదుగురు అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. 17సార్లు ప్రభుత్వ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకూ 28 కేసులు విచారణ పూర్తయ్యాయని, 19 మందిని ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించారని తెలిపారు. తొమ్మిది కేసులను కోర్టు కొట్టివేసిందన్నారు. ఎస్కేయూనివర్సిటీలో జరిగిన అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఆరుగురు ఫైనాన్స్ ఆఫీసర్లు, ఐదుగురు ఆడిట్ అధికారులపై, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన మరికొంత మందిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. ప్రజాచైతన్యంతోనే అవినీతి నిర్మూలన సాధ్యమన్నారు. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రతియేటా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. -
స్నేహితుల మధ్య వివాదం, పరస్పరం దాడి
-
స్నేహితుల మధ్య వివాదం, పరస్పరం దాడి
హైదరాబాద్ : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతి నగర్ లో ఇద్దరు స్నేహితుల మధ్య వ్యక్తిగత వివాదాలు దాడికి దారి తీశాయి. స్థానికంగా నివాసం ఉంటున్న భాస్కర్ రెడ్డి, శంకర్ ఇరువురు చాలాకాలంగా స్నేహితులు. వీరిద్దరూ ఒకే గదిలో నివాసం ఉండేవాళ్లు. అయితే వారిమధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. ఓ విషయమై శుక్రవారం కలుసుకున్న వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ముదిరి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ ఆగ్రహంతో భాస్కర్‌రెడ్డిపై దాడి చేశాడు. చుట్టుపక్కల వారు పట్టుకోబోగా శంకర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే స్థానికులు అతడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన భాస్కర్‌రెడ్డిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తాను చనిపోతూ... మరికొందరి జీవితాల్లో వెలుగులు
- బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందిన ప్రవీణ్ - అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు - మృతుని అవయవాలు ఇతర రాష్ట్రాలకు చిగరపల్లె(చిత్తూరు): ప్రమాదవశాత్తు తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాడు ఐరాల మండలం చిగరపల్లెకు చెందిన ప్రవీణ్. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, కుమారి దంపతుల కుమారుడు ప్రవీణ్(37). పూతలపట్టు మండలం అనంతాపురానికి చెందిన భవ్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరు గ్రామంలోని ప్రవీణ్ తల్లిదండ్రుల వద్ద నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ప్రవీణ్ కాలుజారి కిందపడ్డాడు. వెంటనే అతడిని అరగొండ అపోలో ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించినా ఫలితం లేదు. రెండు రోజుల వరకు చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ గురువారం ఉదయం ప్రవీణ్ మృతిచెందాడు. తల్లిదండ్రులు, భార్య స్పందించారు. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. చెన్నై వైద్యులను సంప్రదించి అక్కడే అవయవాలు దానం చేయాలని కోరారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రవీణ్ మృత్యదేహన్ని శుక్రవారం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రవీణ్ గుండెను దిల్లీకి, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు ఇతర రాష్ట్రాలకు పంపినున్నట్లు వైద్యులు తెలిపారు. -
బెల్టుతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య
పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి శ్రీరామ్‌పూర్ కాలనీలో కారుపైకి ఎక్కి బెల్ట్‌తో చెట్టుకు ఉరేసుకున్నాడు. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతుడ్ని రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ నివాసిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
బీసీ హాస్టల్లో ఏసీబీ సోదాలు
అనంతపురం జిల్లా తలుపుల మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంపై ఏసీబీ దాడి చేసింది. మంగళవారం ఉదయం హాస్టల్‌కు చేరుకున్న అధికారులు రికార్డులను పరిశీలించారు. ఈ వసతి గృహం సంక్షేమాధికారి చెన్నయ్యపై అవినీతి ఆరోపణలు రావటంతో సోదాలు జరుపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
జీతం కోసం సెల్ టవరెక్కాడు
అనంతపురం: కష్టపడి పనిచేసిన జీతం ఇవ్వలేదు.. ఇదేంటి అని మొరపెట్టుకున్నా.. పట్టించుకునే వాళ్లు లేరు. దీంతో విసుగు చెందిన ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవాడ ఓ ప్రైవేటు కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి జీతం సరిగ్గా ఇవ్వడంలేదని ఈమధ్యే ఉద్యోగం మానేశాడు. అప్పటినుంచి అనంతపురంలోనే ఉంటున్నాడు. తనకు రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వాల్సిందిగా.. పలుమార్లు అడిగినా కళాశాల యాజమన్యం పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన భాస్కర్ బుధవారం తెల్లవారుజామన పట్టణంలోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందికి దించె ప్రయత్నం చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇంటిదొంగలు అరెస్ట్
హైదరాబాద్: బంగారం స్మగ్లింగ్‌లో స్మగ్లర్లకు సహకరిస్తున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇంటిదొంగల గుట్టురట్టయింది. జీఎంఆర్ సంస్థ తరపున విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు భాస్కరరెడ్డి, రామ్నాయుడుని డీఆర్ఐ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం వారని తమ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 8 కేజీల బంగార బిసెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఈ సందర్భంగా అతడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. విదేశాల నుంచి నగరానికి బంగారం స్మగ్లింగ్ చేసేందుకు జీఎంఆర్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు భాస్కరరెడ్డి, రామ్‌నాయుడు సహాకరిస్తున్నారని సదరు ప్రయాణికుడు ఉన్నతాధికారులకు వెల్లడించారు. అంతేకాకుండా ఇలా బంగారం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నందుకు రూ. 20 లక్షలు వివిధ రూపాలలో వారికి అందజేస్తున్నట్లు తెలిపాడు. దాంతో వారిద్దరిపై జీఎంఆర్ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో భాస్కరరెడ్డి, రామానుజంపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు తమ నేరాన్ని ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. -
ఇందిరకు శుభాకాంక్షలు
మంకమ్మతోట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి ఇందిరా భాస్కర్‌రెడ్డికి పార్టీ నాయకులు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ పూల మాల వేసి శుభాకాంక్షలు చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, మై నార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీం, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు దీటి సుధాకర్‌రావు, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి ము ల్కల గోవర్ధన్‌శాస్త్రి, వి.లక్ష్మన్ పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. -
ప్రజాసమస్యలపై పోరాటం
ప్రజాసమస్యలపై పోరాటం మంకమ్మతోట : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాటం చేయూలని, అందరి సహకారంతో పార్టీని బలోపేతం చేయూలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణరుుంచింది. పార్టీ జిల్లా సమీక్షను జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలకులు నల్లా సూర్యప్రకాశ్ సమక్షంలో నగరంలో ఆదివారం నిర్వహించారు. ప్రజా సమస్యలపై పో రాటం చేస్తూనే ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయూలని సూచించారు. ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరిస్తున్నారని, నియంత పోకడలతో కుటుంబపాలన సాగిస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేయూలని చర్చించారు. నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి ఇన్నేళ్లరుునా ఏర్పాటుపై చర్యలు తీసుకోవడం లేదని, ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకునేలా పాదయూత్ర చేపట్టాలని సమావేశంలో నిర్ణరుుంచారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా పోరాటాలు చేయూలని, మానేరు నీటి వాడకంలో జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాకేంద్రంలో అస్తవ్యస్తంగా మారిన అండర్‌గ్రౌండ్ డ్రెరుునేజీ నిర్మాణంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణరుుంచారు. సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయూలు, ప్రజాసమస్యలను వివరించారు. త్వరలోనే రాష్ట్ర నాయకులతో చర్చించి జిల్లా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో మధ్యమానేరు, తోటపల్లి రిజర్వాయర్, వరదకాలువ పనులు నిలిచిపోయూయని, చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోరుుందని, జిల్లాలో ఇద్దరు కీలక మం త్రులు, చీఫ్ విప్ ఉన్నారని, అరుునా ప్రాధాన్యం లేకుండా పోరుుందని ఎప్పటికప్పుడు సమస్యలపై గళమెత్తాలని పరిశీలకులు నల్లా సూర్యప్రకాశ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి శ్రీనివాస్‌రావు, రాష్ర్ట కార్యదర్శి అక్కెనపెల్లి కుమార్, రాష్ర్ట సంయుక్త కార్యదర్శి డాక్టర్ కె. నగే ష్, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సహాయ పరిశీలకుడు కొమ్మర వెంకట్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ర్ట నాయకుడు గుర్రాల సంతోష్‌రెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బోగె పద్మ, జిల్లా నాయకురాలు మోకెనపెల్లి రాజమ్మ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వరాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు గాలి ప్రశాంత్‌బాబు, జిల్లా నాయకులు ముస్కు వెంకటరెడ్డి, దేవరనేని వేణుమాధవ్రా వు, బండమీది అంజి, గండి శ్యామ్, గండి గణేష్, లక్ష్మీనారాయణ, పి.వేణుగోపాల్‌రెడ్డి, సలీమ్, బలాల, రాజేశం పాల్గొన్నారు. -
టీడీపీ నేత క్లబ్‌పై పోలీసుల దాడి
కొలిమిగుండ్లలో టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బిజ్జం భాస్కరరెడ్డికి చెందిన విష్ణు సోషియో కల్చరల్ క్లబ్‌పై మంగళవారం పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 54 మందిని అదుపులోకి తీసుకున్నారు. పేకాటరాయుళ్లను ట్రాక్టర్లలో బస్టాండ్ వద్దకు తీసుకొచ్చి ఇక ముందు పేకాట జోలికి వెళ్లమని ప్రతిజ్ఞ చేయించారు. కొలిమిగుండ్ల : కొలిమిగుండ్లలో టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బిజ్జం భాస్కర్‌రెడ్డికి చెందిన విష్ణు సోషియో కల్చర్ క్లబ్‌పై పోలీసులు మంగళవారం మళ్లీ దాడులు చేశారు. కోవెలకుంట్ల సీఐ నాగరాజు యాదవ్, కొలిమిగుండ్ల, సంజామల, రేవనూరు, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ ఎస్ఐలు రాజ్‌కుమార్, చంద్రశేఖరరెడ్డి, జగదీశ్వరరెడ్డి, సుబ్బరాయుడు, నవీన్‌బాబు తమ సిబ్బందితో స్థానిక పైన పేర్కొన్న క్లబ్‌పై దాడులు చేశారు. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పేకాట ఆడేందుకు వచ్చిన 54 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.లక్షకు పైబడి నగదు, సెల్ఫోన్లు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వారందరినీ ట్రాక్టర్లలో షిర్డిసాయి మందిరం మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. బస్టాండ్‌లో ట్రాక్టర్లను ఆపి ‘జీవితంలో పేకాట జోలికి వెళ్లమంటూ’ ప్రతిజ్ఙ చేయించారు. అనంతరం స్టేషన్‌కు తరలించారు. నెల వ్యవధిలో ఇదే క్లబ్‌పై పోలీసులు రెండు సార్లు దాడులు చే యడం విశేషం. కాగా పోలీసులను గ్రామస్తులు ప్రశంసించారు. -
‘షేడ్‌నెట్’తో.. కాలం కలిసొస్తుంది!
భాస్కర్‌రెడ్డి సాధారణ పద్ధతిలో నారు పెంచితే... సాధారణ పద్ధతిలో పెంచే నారును పశువులు, గొర్రెలు, మేకలు మేసే ప్రమాదం ఉంటుంది. దీనికి రైతు కాపలా ఉండాల్సి వస్తుంది. ఏ తెగులు ఎలా వస్తుందో తెలుసుకోవడం కష్టం. మురుగు నీరు పారే వసతి (నీరు ఇంకిపోయే గుణం) నారుమడుల్లో ఉండకపోవడం వల్ల నారు కుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. విత్తనాలు దగ్గర దగ్గరగా వేయడం వల్ల నారు ఒత్తుగా పెరిగి బలంగా ఉండదు. దీన్ని పొలంలో నాటిటే మొక్కలు వంగిపోయి చనిపోతాయి. నారును బహిరంగ ప్రదేశాల్లో పెంచడం వల్ల తామర, పేనుబంక, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగు ఆశించి పాడవుతుంది. నారును పొలం నుంచి పీకినప్పుడు పీచువేర్లు తెగిపోయి వేర్లతో సహా మట్టి తక్కువగా ఉండడం లేదా పూర్తిగా లేక పోవడంవల్ల నాటిన తర్వాత మొక్కలు చనిపోయి పొలంలో ఖాళీలు ఏర్పడుతాయి. మళ్లీ మొక్కలు నాటినా అవి పెరిగే వరకు చాలా సమయం పడుతుంది. పొలంలో నాటడానికి 30 రోజులు ముందే విత్తనాలు సేకరించుకుని నారు పోసి కనీసం 26 నుంచి 40రోజుల వరకు నారు మడులను సంరక్షించాల్సిన వస్తుంది. మధ్యకాలంలో అనువైన వర్షాలు కురిసి అదును ఉన్నా నారు సాగు చేయడానికి పనికిరాదు. షేడ్‌నెట్ హౌస్‌తో ఉపయోగాలు.. నర్సరీలలో నారును ట్రేలలో పెంచుతారు. ముందుగా కొబ్బరి పీచులో విత్తనాలను పూడ్చడం వల్ల తగు మేర తేమ ఉండి మొలకశాతం పెరుగుతుంది. తద్వారా విత్తన మోతాదు తగ్గి ఖర్చు తగ్గుతుంది. నారును ప్లాస్టిక్ ట్రేలలో పెంచడం వల్ల వేర్లు సమృద్ధిగా పెరిగి పక్క మొక్కకు సంబంధం లేకుండా ఎదుగుతాయి. మొక్కలు ట్రేల నుంచి పెరిగినప్పుడు వేరు వ్యవస్థ దెబ్బతినకుండా కొబ్బరి పీచుతో సహా పూర్తిగా ఊడివస్తుంది. ఈ మొక్కలను పొలంలో నాటినప్పుడు చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో ట్రే గుంత రెండున్నర సెంటీమీటర్లు ఉండటం వల్ల ప్రతి మొక్కకు నలువైపులా కావాల్సినంతా ఖాళీ ఉండి మొ క్కలు ధృడంగా పెరుగుతాయి. ఇలాంటి మొక్కలు పొలంలో నాటిన వెంటనే పెరుగుదల ప్రారంభం అవుతుంది. మొక్కలు షేడ్నెట్హౌస్లలో పెరగడం వల్ల తగినంత వెలుతురు, గాలి, తేమ ఉండి మొక్కల పెరుగుదలతో అన్ని సమంగా ఉండి ప్రధాన పొలంలో త్వరగా నాటుకునే అవకాశం ఉంటుంది. షేడ్ నెట్ హౌస్‌ల చుట్టూ తెల్లటి ఇన్సెక్ట్ నెట్ ఏర్పాటు చేయడం వల్ల తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ వంటి వైరస్ తెగుళ్ల వ్యాప్తికి సహాయపడే రసం పీల్చే పురుగులు ఆశించడానికి అవకాశం ఉండదు. ఫలితంగా నాణ్యమైన, ఆరోగ్యవంతమైన నారు లభిస్తుంది. ఈ షేడ్‌నెట్ మౌస్‌లలో పాముపొడ, చీడపీడలు నారు మొక్కలపై ఆశించే అవకాశం ఉండదు. పంట ఎప్పుడు సాగు చేసుకోవాలనుకున్నా నారు అప్పటికప్పుడు రెడీమేడ్‌గా అదును వచ్చిన వెంటనే సాగుకు అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతిలో ఖర్చు అధికం.. ఎకరం పొలంలో పంటసాగుకు ముందుగా నారు మళ్లు తయారు చేసుకోవాలి. ఎత్తుబెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫ్రూడాన్ గుళికలు, వేప పిండి చల్లి విత్తనాలు చల్లుకోవాలి. రెండుమూడు సార్లు మందు పిచికారీ చేయాలి. ఈ సాధారణ పద్ధతికి గాను పెట్టుబడి మొత్తం రూ. 5వేలు అవుతుంది. ఎకరం కూరగాయల సాగుకు 12వేల మొక్కలు కావాలి. అయినా అందులో ఎన్ని చనిపోతాయో చెప్పలేని పరిస్థితి. షేడ్నెట్లలో.. నారును ట్రేలలో పెంచుతారు. ఎలాంటి రోగ లక్షణాలు ఉండవు. అన్ని రకాల పిచికారీ మందులు వాడతారు. ఎకరం కూరగాయల సాగుకు 8వేల మొక్కలు సరిపోతాయి. ఏ మొక్కా చనిపోదు. నారు ఖర్చు మొక్కకు 30 పైసలు అయితే పెట్టుబడి రూ.2,400, నారు 40పైసలు అయితే పెట్టుబడి రూ. 3,200 అవుతుంది. సాధారణంతో పోల్చితే షేడ్నెట్హౌస్ల ద్వారా తక్కువ ఖర్చవుతుంది. -
జన్మభూమి బ్యానర్‌పై మాజీ మంత్రి ఫొటో
అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే క్షమాపణ కోరిన తహశీల్దార్ పాకాల : జన్మభూమి ప్రభుత్వ అధికారిక కార్యక్రమముని, గ్రామసభలకు సంబంధించిన బ్యానర్‌పై స్థానిక శాసనసభ్యునిగా తన ఫొటో ప్రచురించకుండా మాజీ మంత్రి ఫొటో పెట్టడమేమిటని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తహశీల్దార్ కృష్ణయ్యుపై మండిపడ్డారు. పాకాల వుండలంలోని శంఖంపల్లెలో మంగళవారం జరిగిన గ్రామసభలో వేదికపై ఏర్పాటుచేసిన అధికారిక బ్యానర్‌పై మాజీవుంత్రి గల్లా అరుణకువూరి ఫొటోను ముద్రించారు. ఈ బ్యానర్‌పై స్థానిక ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి ఫొటో లేదు. దీన్ని గమనించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సభాప్రాంగణం ముందు కారులోనే ఉండిపోయూరు. ప్రభుత్వ కార్యక్రవుంలో నిబంధనలకు విరుద్ధంగా అనధికార వ్యక్తి ఫొటోతో బ్యానర్ ఏర్పాటు చేయడం ఏంటని తహశీల్దార్‌ను ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలను జన్మభూమి అధికారిక బ్యానర్‌పై ఉండాలన్నారు. బ్యానర్‌ను తొలగిస్తేకానీ తాను సభావేదికపైకి రానని చెప్పి ఆయన దాదాపు పది నిమిషాలపాటు కారులోనే కూర్చుండిపోయూరు. దీంతో బ్యానర్ తయారు చేయించిన పంచాయుతీ కార్యదర్శి స్వర్ణమంజులపై తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో పార్టీలను మోయవద్దని ఆమెపై మండిపడ్డారు. ఫ్లెక్సీని వెంటనే మార్పించి, జన్మభూమి బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డిని వేదికపైకి ఆహ్వానించారు. ఈ ఘటనపై తహశీల్దార్ క్షమాపణ కోరారు. -
కుక్కలను చంపించినందుకు కేసు నమోదు
హైదరాబాద్ : వందకు పైగా వీధి కుక్కలను ఒకేసారి చంపించినందుకు మీర్‌పేట గ్రామ కార్యదర్శిపై పోలీస్ కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ శంకర్ యాదవ్ కథనం ప్రకారం ఇటీవల మీర్‌పేటలోని పలు కాలనీలలో సుమారు వందకు పైగా కుక్కలకు విష ప్రయోగం ద్వారా గ్రామ కార్యదర్శి భాస్కర్ రెడ్డి చంపించారు. అయితే మూగ జీవులను చంపించే అధికారం గ్రామ కార్యదర్శికి లేదని, పై అధికారుల అనుమతి తీసుకోకుండా, జంతు ప్రేమికులను అవమానపరిచేలా వ్యవహిరించి మూగ జీవుల చావుకు కారకుడైన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికుడు వేముల నర్సింహతో పాటు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో భాస్కర్ రెడ్డిపై 428 ఐపీసీ, 11(1) ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ యానిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతోనే..
పుంగనూరు: అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో కలుస్తూ.. వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తాను ముందుకు పోతున్నట్టు పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పుంగనూరు మండలం పట్రపల్లెలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను రాజకీయరంగ ప్రవేశం చేపట్టిన రోజు నుంచి దశాబ్దాలుగా ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను పరిష్కరించడమే ఆశయం గా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతియేటా రెండుసార్లు నేరుగా ప్రజలను కలుసుకునేందుకు అధికార యం త్రాంగంతో వెళతానన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రెండుసార్లు పర్యటిస్తుండటంతో గ్రామ సమస్యలపై అవగాహన వస్తుందన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు అభివృద్ధికి కొంత మేరకు నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు గ్రామ పర్యటనలు చేపట్టి, ప్రజలతో మమేకం కావాలని కోరారు. ఎన్నికలు వచ్చేంత వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని కోరారు. చంద్రబాబునాయుడు మోసాలను జనం గుర్తించారని, వారికి తగిన గుణపాఠం నేర్పుతారని తెలిపారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి మినహా మరేమీ జరగలేదని తెలిపారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు స్వార్థంతో పేద ప్రజలను నట్టేట ముంచేశాయని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, జెడ్పీమాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు నాగరాజారెడ్డి, అమరనాథరెడ్డి, మాజీ ఎంపీటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్రమణ్యయాదవ్, చంద్రారెడ్డి యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
తిరుపతి ఎస్పీపై పరువు నష్టం కేసు వేస్తా
చిత్తూరు(ఎడ్యుకేషన్): తన పరువుకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరించిన తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబుపై పరువు నష్టం దావా వేయనున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ స్పీకర్, మానవహక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం ఆయన చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించేందుకు ఇటీవల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశానన్నారు. దీనికి పోలీసులు రాలేదని, ఎందుకు రాలేదో కనుక్కొనేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. ఎస్పీ పోలీసులు రారని చెప్పారని, అలా రాకుండా ఉండేందుకు నిబంధనలు ఏమైనా ఉంటే చెప్పండి, ఫాలో అవుతామని తాను చెప్పానని, దీనికిగాను లేఖ ఇస్తానని, దాని ద్వారా తనకు సమాధానం ఇవ్వాలని కోరానని తెలిపా రు. ఇది తమ ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అని తెలిపారు. అరుుతే శుక్రవారం ఓ దినపత్రికలో ఎస్పీకి తాను ఫోన్ చేస్తే ఆయన ఆగ్రహించినట్లు, తనకు వార్నింగ్ ఇచ్చినట్లు కథనం వచ్చిందని తెలిపారు. ఆ సంభాషణ గురించి తమ ఇద్దరికే తెలుసని, ఈ విషయాన్ని ఎస్పీనే పత్రికలో రాయించారనే అనుమానం కలుగుతోందని చెప్పా రు. ఒక ఐపీఎస్ అధికారికి పత్రికల్లో రాయించాల్సిన అవసరం రావడం బా ధాకరమన్నారు. ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేయకపోయినా, ఆగ్రహిం చినట్లు రాశారని, తాను చట్టసభలకు ప్రాతి నిథ్యం వహించే ఎమ్మెల్యేనని, తనను ఎందుకు ఎీస్పీ హెచ్చరిస్తారని ఆ యన ప్రశ్నించారు. సత్యదూరమైన వా ర్తలు రాసిన ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈ మొత్తం సంఘటనకు ఎస్పీనే బాధ్యత వహించాలన్నారు. వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడితే లేనిపోని కేసులు పెడతారని చెప్తుంటారని, ఎస్పీపై పరువు నష్టం దావా వేస్తే ఇబ్బందులకు గురిచేస్తారని చెప్పారని భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఏమేం చేస్తారో చేయాలని, తాను తప్పుడు దారిలో వెళ్లే వ్యక్తిని కాదని, నీతి, నిజాయితీతో ఈ స్థాయికి వచ్చానని వివరించారు. తనపై ఎన్నో తప్పుడు కేసులు పెట్టించిన గల్లా అరుణకుమారిని చంద్రగిరి ప్రజలు అంగీకరించలేదన్నారు. టీడీపీ నేతలు, పోలీసులు కలిసి ఏం చేసినా, తప్పుడు కేసులు పెట్టినా తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేగా తాను పిలిస్తే రాని పోలీసులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పిలిస్తే వెళ్లరా అని ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ ఒకే రకంగా ఉంటాయనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. -
జీపు విలువ మనిషికుండదా?
*గిద్దలూరు ఘటనపై డీజీపీని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే *అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదు *స్థానిక ఎన్నికల సందర్భంగా టీడీపీ దాడులకు పాల్పడుతోందని వెల్లడి *డీజీపీ న్యాయం చేస్తామన్నారు: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి హైదరాబాద్: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎస్ఐ దురుసు ప్రవర్తన కారణంగా తమ పార్టీకి చెందిన సహకార సంఘ అధ్యక్షుడు మరణించిన తరువాత కూడా తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శుక్రవారం డీజీపీ రాముడును కలిసి సంఘటన వాస్తవాలను వివరించారు. గిద్దలూరులో గత నెల 30వ తేదీన సహకార సంఘ అధ్యక్షుడు వై.భాస్కరరెడ్డి మృతికి కారణమైన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డీజీపీని కోరారు. అపార్టుమెంట్లో ఏర్పడిన పార్కింగ్ వివాదంలో అక్కడి ఎస్సై ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకొని ఒకరి పక్షాన వత్తాసు తీసుకొని గొడవకు కారణమయ్యారని వివరించారు. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన భాస్కరరెడ్డి పట్ల ఆ ఎస్సై దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఆయన పోలీసు స్టేషన్లోనే కుప్పకూలి మరణించారని తెలిపారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భాస్కరరెడ్డి మరణిస్తే.. తెల్లవారు 3.30 గంటల ప్రాంతంలో పోలీసు స్టేషన్‌కు 300 మీటర్ల దూరంలో పోలీసు జీపు దగ్ధం కావడం కారణం చూపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. పోలీసు జీపు దగ్ధం వంటి ఆవేశపూరిత ఘటనలు అంత ఆలస్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసే అవకాశం ఉండదని డీజీపీకి వివరించారు. పోలీసు విచారణలో జీపు కాల్చిన వారెవరిపైనా చర్యలు తీసుకోండిగానీ.. దాన్ని సాకుగా చూపి తమపై అక్రమ కేసులు బనాయించవద్దని విజ్ఞప్తి చేశారు. గిద్దలూరు సంఘటనలపై పోలీసుల విచారణ తీరు చూస్తే, పోలీసు జీపు దగ్ధమైన ఘటనకు ఇచ్చిన విలువ వ్యక్తి చనిపోయినదానికి ఇవ్వడం లేదని తెలిపారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరాం : వైవీ సుబ్బారెడ్డి గత నెలలో కనిగిరి టీడీపీ నేతల దాడిలో ఒక వైఎస్సార్ కాంగ్రెస్ నేత మరణించడం, గిద్దలూరులో పోలీసు స్టేషన్లో జరిగిన గలాటలో మరో పార్టీ నేత మరణించిన విషయాలను డీజీపీ దృష్టికి తీసుకొచ్చినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భేటీ అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. డీజీపీ న్యాయం చేస్తామన్నారు : ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గిద్దలూరు సంఘటనలో తమకు న్యాయం చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చెప్పారు. డీజీపీతో భేటీ అనంతరం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సై ఉద్దేశ పూర్వకంగా ఒక పక్షాన అండగా నిలిచి రెండో పక్షానికి చెందిన వారిలో మహిళలతో సహా అందరి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారని అన్నారు. -
ఆ ఎస్సై తప్పేం లేదు : ఐజీ
ఒంగోలు టౌన్ : గిద్దలూరులో వైఎస్సార్ సీపీ నేత వైజా భాస్కర్‌రెడ్డి పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన ఎస్సై వై.శ్రీనివాసరావును గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ వెనకేసుకొచ్చారు. ఆ ఘటనలో ఎస్సై ఎలాంటి పొరపాటు చేయలేదని చెప్పుకొచ్చారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్‌తో కలిసి ఐజీ సునీల్‌కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గిద్దలూరు ఘటనకు సంబంధించి ఆయన మాట్లాడారు. గిద్దలూరులో రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా అందుకు కారణమైన ఎస్సైని వెనకేసుకురావటంలో ఐజీ ఏ మాత్రం సంకోచించలేదు. మహిళా సిబ్బంది లేకుండా డాక్టర్ భార్యను ఎస్సై తన జీపులో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడాన్ని ఐజీ కనీసం ప్రస్తావించలేదు. వైజా భాస్కర్‌రెడ్డి అనారోగ్యం వల్లే మృతి చెందాడని, ఆయన్ను ఎస్సై కొట్టలేదని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం, శాంతిభద్రతలను ఉల్లంఘించటం సరైన పద్ధతి కాదన్నారు. భాస్కర్‌రెడ్డి మృతిపై పోస్టుమార్టం నివేదిక తెప్పించామని, మృతుడి శరీరంపై కనపడే దెబ్బలు లేవని నివేదికలో ఉన్నట్లు ప్రస్తావించారు. భాస్కర్‌రెడ్డి మృతి తర్వాత దుండగులు కొందరు గిద్దలూరు-కలశపాడు రోడ్డులో పోలీస్ జీపును తగులబెట్టారని, ఎంవీ సుబ్బారావు హీరోహోండా షోరూం వద్దకు వెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారని చెప్పారు. డాక్టర్ హరనాథరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వై.శ్రీనివాసరావు మీద కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై నెల్లూరు రూరల్ డీఎస్పీని విచారణాధికారిగా నియమించామన్నారు. అన్ని కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఐజీ వివరించారు. -
రైతుల పరువుతో ఆటలు
కుంచేపల్లి (పొదిలి) : ఊరందరిదీ ఒక దారైతే.. .ఉలిపి కట్టెది మరోదారి అన్న చందంగా ఉంది మండలంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల వ్యవహారం. గతంలో పంట నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నష్ట పరిహారం పంపిణీ గురించి ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. మరో వైపు ఖరీఫ్ ప్రారంభం కాబోతోంది. విత్తనాలు, మందులు, ఎరువులు, పురుగుమందుల కోసం పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలో తెలియని అయోమయ స్థితిలో రైతులు దిక్కుతోచక అల్లాడుతున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో గోరు చుట్టుపై రోకటి పోటు చందంగా.. బ్యాంకు అధికారులు మాత్రం బంగారు రుణాలు చెల్లించకుంటే ఈ నెల 20న మీ బంగారు నగలు వేలం వేస్తామని రైతులకు నోటీసులు పంపించారు. = ఈ నోటీసులు చూసుసుకున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. ఒక వైపు ప్రభుత్వం రైతుల రుణాల మాఫీపై ఎటూ తేల్చక పోవటం.. ముందుగానే తొందరపడి రావాల్సింది రాబట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. = ఈ విషయమై బ్యాంకులో సంప్రదించగా నోటీసులు పంపిన మాట వాస్తవమేనన్నారు. వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. మేనేజర్ అనుమతి లేనిదే వివరాలు వెల్లడించలేమని, మేనేజర్ ఈ విషయంపైనే చర్చించేందుకు హెడ్ ఆఫీస్‌లో సమావేశానికి హాజరయ్యారని సిబ్బంది తెలిపారు. = బ్యాంకు పరిధిలో రామాపురం, సూదనగుంట, ఈగలపాడు, కుంచేపల్లి, పాములపాడు, దాసల్లపల్లి తదితర గ్రామాలు ఉన్నాయి. = {పభుత్వం రుణాలు మంజూరు చేస్తే తిరిగి బ్యాంకులకు వెళ్లి రుణం పొందాలనే ఆలోచన రైతులు చేస్తున్నారు. = బ్యాంకు అధికారులు ఎలాగైనా రైతులను బెదిరించో.. అదిరించో వేలం తేదీలోపే రుణాలు కట్టించుకోవాలనే విధంగా వ్యవహారం చేస్తున్నారు. = శుక్రవారం వేలం కావటంతో ఏమి జరుగుతుందోననే విపరీత ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. = చెల్లించాలంటే డబ్బులు ఎక్కడ నుంచి సర్దుబాటు చేయాలో తెలియటం లేదు. = చెల్లించకుంటే వేలం వేస్తారేమోననే ఆందోళనతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. శుక్రవారం వేలం జరిగితే రైతులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విపత్తు నుంచి రైతులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు : బి.వెంకటేశ్వర్లు 2012 మే నెలలో బంగారం తాకట్టు పెట్టి రూ.63 వేల రుణం తీసుకున్నాం. ఏప్రిల్ 14 నాటికి వడ్డీతో కలిపి రూ.74,289లు అయింది. గతేడాది వ్యవసాయం అంతగా కలిసి రాలేదు. రుణం చెల్లించకుంటే నగలు వేలం వేస్తామని బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. ఇప్పుడు ఏమీ చేయాలో అర్థం కావడం లేదు. బ్యాంకు నుంచి నోటీస్ వచ్చింది :రోజమ్మ బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి రూ.50 వేల రుణం తీసుకున్నా. వడ్డీతో కలిపి మొత్తం రూ.58,585లు అయిందని, వెంటనే చెల్లించాలని నోటీసు వచ్చింది. ఇప్పటికిప్పుడు చెల్లించమంటే డబ్బలు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావటం లేదు. బంగారం వేలం వేస్తారేమోనని భయంగా ఉంది. ఇంత అన్యాయమా?: ఎం.భాస్కర్‌రెడ్డి బంగారం తాకట్టు పెట్టి రూ.27 వేల రుణం తీసుకున్నా. ఏప్రిల్ 2014 నాటికి రూ.31791లు అయింది. డబ్బులు కట్టమని బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. రైతులను ఇంత అన్యాయం చేయటం ధర్మం కాదు. రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం అంటుంటే.. బ్యాంకులు అవేమీ పట్టించుకోవడం లేదు. -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
ధర్మవరం రూరల్, న్యూస్‌లైన్ : ట్రాన్స్ఫార్మర్ కోసం లంచం డిమాండ్ చేసిన ట్రాన్స్‌కో ఏఈ ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్లాకాలువకు చెందిన ఎం.రామిరెడ్డి అనే రైతు 2012 ఫిబ్రవరిలో ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన మెటీరియల్ మంజూరు కాగా, వాటిని రైతుకు ఇచ్చేందుకు ట్రాన్స్‌కో ఏఈ పశువుల మల్లయ్య రూ.4 వేలు డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వనిదే పని జరగదని తేల్చి చెప్పడంతో రూ. 3,500 ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న రైతు, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఉన్న విద్యుత్ ఉపకేంద్రంలో కాపుగాసిన ఏసీబీ సిబ్బంది మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా, ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఈ దాడుల్లో సీఐలు గిరిధర్, ప్రభాకర్, మధ్యవర్తులుగా కార్మిక శాఖ ఉద్యోగులు సూర్యనారాయణ, రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
ఆ వాల్వ్... నష్టకారణం
జడ్చర్ల,న్యూస్‌లైన్: జడ్చర్ల సమీప పోలేపల్లి సెజ్‌లోనున్న హెటిరో ఫార్మాలో అగ్నిప్రమాదం సంభవించి నిర్వాహకులకు రూ.15 కోట్ల నష్టాన్ని మిగిల్చిన తీరుకు అందులో ఉన్న వాటర్‌వాల్వ్ సమయానికి పనిచేయకపోవడమే కారణంగా తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం రెండుగంటలకు విద్యుదాఘాతం కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు అంచనావేస్తున్నారు. అయితే దీన్ని తీవ్రత తగ్గించేందుకు యత్నించినా పరిశ్రమలోని వాటర్‌వాల్వ్ సకాలంలో తెరుచుకోలేదు. దీంతో మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల సేపు కష్టపడాల్సి వచ్చింది. సుమారు 500మంది సిబ్బంది పరిశ్రమ ప్రాంగణంలోనే ఉన్నారు. వారెవరికీ ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. ఆ 35నిమిషాల్లోనే: జనరల్ బ్లాక్‌లో గల 4వ యూనిట్లో తొలుత చిన్నగా ఉన్న మంటలను ప్రారంభంలోనే ఆర్పేందుకు చేసిన ప్రయత్నం ఫలించనట్లు తెల్సింది. వాటర్ వాల్వ్ తెరుచుకునేందుకు దాదాపుగా 35 నిమిషాలకు పైగా ఆలస్యం కావడంతో ఆలోగా యూనిట్ విబాగం మొత్తం ప్రమాదంలో చిక్కుకుంది.అ యితే ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడం ఊరటనిచ్చే అంశం. మంటలు తీవ్రస్థాయికి చేరి పరిసర ప్రాంతాలవారిని భయభ్రాంతులకు గురిచేసింది. మంటలను ఆర్పేందుకు కావలసిన నీరు అందుబాటులో లేక కొంత మేరజాప్యమైంది.ఈ లోగా అక్కడికి సమీపంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో వారి పరిశ్రమలోని నీటిని మంటలను ఆర్పేందుకు వినియోగించారు. ఫైర్ స్టేషన్లకు సమాచారం ఇచ్చినా దాదాపు గంటన్నర అనంతరం గానీ సంఘటనా స్థలానికి చేరుకోలేక పోయాయి. తొలుత షాద్‌నగర్ నుండి వచ్చిన ఫైర్ ఇంజన్ రంగంలోకి దిగింది.అనంతరం నాగర్‌కర్నూల్,మహబూబ్‌నగర్‌లనుండి కూడా ఫైర్ ఇంజన్లను రప్పించారు. ఫైర్ ఇంజన్లకు తోడు పరిశ్రమలోని సంపు నుండి,ఇతరత్రా నీటితో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. మరోవైపు జేసీబీలను రప్పించి పరిశ్రమ గోడలను బద్దలు కొట్టి నీటిని చిమ్మడంతో సాయంత్రం 6గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి.అద్దాలను బద్దలు కొట్టి ముందస్తుగా గోడలను నీటితో తడిపేశామని పరిశ్రమ మేనేజర్ భాస్కర్‌రెడ్డి ఈ సందర్బంగా విలేకరులకు వెళ్లడించారు. ప్యాకింగ్ మెటీరియల్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. మొత్తం నష్టం రూ.15కోట్లు ఉంటుందని డీఎస్పీ మల్లిఖార్జున ఆద్వర్యంలోని బృందం తేల్చింది. సీఐలు వెంటకరమణ,శ్రీనివాస్‌రెడ్డి,ఫైర్ అధికారి గిరిధర్‌రెడ్డి ,తహసీల్దార్ అమరేందర్,పోలేపల్లి సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి,తదితరులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మల్లురవి సంఘటనస్థలాన్ని పరిశీలించారు. -
రాజన్న రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యం
సోమందేపల్లి, న్యూస్‌లైన్: రాజన్న రాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డికి మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నాగినాయనిచెరువు, గుడిపల్లి పంచాయతీల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ ఆధ్వర్యంలో గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, నియోజకవర్గ అబ్జర్వర్ సుధాకర్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు లోచర్ల భాస్కర్‌రెడ్డి తదితరులు గుడిపల్లిలోని సజ్జగంట రంగనాథస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం నాగినాయనిచెరువు, బుస్సయ్యగారిపల్లి, నాగినాయనిచెర్వు తాండా, వెలగమాకులపల్లి, గుడిపల్లి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. మహానేత అమలు చేసిన పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్రెడ్డికి మద్దతివ్వాలన్నారు. నాగినాయనిచెరువులో వరి మళ్లలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి అజెండాను వివరించి మద్దతు కోరారు. కార్యక్రమంలో సానే ఉషారాణితోపాటు మండల కన్వీనర్ నారాయణస్వామి, కిసాన్‌మోర్చా జిల్లా కన్వీనర్ జీవీపీ నాయుడు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యలు నాగ భూషణ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు అశ్వర్థమ్మ, సర్పంచులు, సింగిల్ విండో డెరైక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిక ఈ సందర్భంగా గుడిపల్లికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ తదితర నాయకులు కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ర్ట సమైక్యతకోసం కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, ఆయన స్ఫూర్తితోనే పార్టీలో చేరినట్లు ఉపసర్పంచ్ నరసింహమూర్తి, హరినాథ్, చంద్రశేఖర్, సోము, రమేష్, హరికృష్ణ, చంద్రశేఖర్ తదితరులు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణ స్వామి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాగభూషణ్ రెడ్డి, సర్పంచు నారాయణ రెడ్డి పాల్గొన్నారు.