
సాక్షి, వైఎస్సార్ జిల్లా: భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానికులు శాంతియూత ర్యాలీ నిర్వహించారు. సీబీఐ ఏకపక్ష వైఖరి పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్ అండ్ బీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు.కడప- తాడిపత్రి హైవేపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు. సీబీఐ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. వివేకా హత్యకేసులో దోషులను కాకుండా అవినాష్‌రెడ్డి కుటుంబాన్నిసీబీఐ టార్గెట్ చేసిందన్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. ఆయనను హైదరాబాద్ తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో భాస్కర్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment