
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వాళ్ల విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు.
వైఎస్ జగన్(YS Jagan) రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయన్ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జగనన్నతో కరచలనం, సెల్ఫీలు..ఫొటోల కోసం ఎగబడ్డారు.


మరో వైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి ప్రజల తరపున అనునిత్యం పోరాటం చేయాలని వారికి ఆయన సూచించారు.

తన రెండ్రోజుల పులివెందుల పర్యటన(Pulivendula Visit)లో భాగంగా.. ఇవాళ, రేపు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. సాయంత్రం ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరు కానున్న ఆయన.. రేపు(ఫిబ్రవరి 26) ఎల్వీ ప్రసాద్ సంస్థ ద్వారా ఆధునికీకరణ చేసిన రాజారెడ్డి ఐ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment