locals
-
ఇళ్లు కూల్చం.. చెరువులు పునరుద్ధరిస్తాం
సాక్షి, హైదరాబాద్/ అంబర్‌పేట: ‘పేదల ఇళ్లు కూల్చం.. చెరువులను పునరుద్ధరిస్తాం’’.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తాజాగా ఎత్తుకున్న నినాదమిది. ఇటీవలి వరకు చెరువుల పరిధిలో కూల్చివేతలతో కలకలం రేపిన హైడ్రా తన పంథా మార్చుకుంది. ఎక్కడైనా నీటి వనరుల పునరుద్ధరణ చర్యలకు ఉపక్రమించే ముందు స్థానికులతో భేటీ కావాలని.. తమ లక్ష్యం, దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలను వారికి వివరించాలని నిర్ణయించింది. దీనికోసం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. అంబర్‌పేటలోని బతుకమ్మకుంట నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. బుధవారం ఆ ప్రాంతానికి వచ్చిన రంగనాథ్.. పేదల ఇళ్లు కూల్చబోమని, ఆక్రమణలకు గురై ఖాళీగా ఉన్న స్థలాలను మాత్రమే శుభ్రం చేస్తామని వివరించారు. బతుకమ్మకుంట పునరుద్ధరణ జరిగితే.. ముంపు తప్పడంతోపాటు భూగర్భ జలాల లభ్యత పెరుగుతుందని స్థానికులకు అవగాహన కల్పించారు. ఆ ప్రాంతంలో ఓ ఆహ్లాదకరమైన పార్కును నిర్మిస్తామని తెలిపారు. దీంతో బతుకమ్మకుంటలో ఉన్న ఆక్రమణల తొలగింపునకు స్థానికులు ముందుకు వచ్చారని అధికారులు చెబుతున్నారు. పక్షం రోజుల పాటు కసరత్తు చేసి.. బతుకమ్మకుంటకు పునరుద్ధరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడానికి ముందు హైడ్రా దాదాపు పక్షం రోజుల పాటు కసరత్తు చేసింది. ఈ అంశాన్ని న్యాయ నిపుణులతో వివిధ కోణాల్లో చర్చించింది. న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసి ముందుకు వెళ్లింది. ప్రొక్లెయినర్లతో తొలగింపు ప్రక్రియ చేపట్టడానికి ముందే స్థానికులకు అవగాహన కల్పించింది. ఇది విజయవంతమైందని, ఇకపై ఇదే విధానాన్ని కొనసాగించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. బతుకమ్మకుంటలో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీ వాసులతో మాట్లాడిన రంగనాథ్.. హైడ్రా పేరుతో ఎవరైనా భయపెట్టాలని, బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఉపేక్షించవద్దని సూచించారు. పదహారు ఎకరాల నుంచి ఐదెకరాలకు.. అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను పునరుద్ధ రించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలను అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలని అధికారులు తేల్చా రు. తాజా సర్వే ప్రకారం బతుకమ్మకుంటలో మిగిలినది 5.15 ఎకరాలేనని గుర్తించారు. దీంతో అంత మేరకు కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా.. ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. దీనితో స్థానికులు హైడ్రాకు సహకరించేందుకు ముందుకొచ్చారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని.. రెవెన్యూ రికార్డులూ అదే చెప్తున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. అయితే ఇటీవలి పలు పరిణామాల నేపథ్యంలో బతుకమ్మకుంట వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ స్థలం ప్రైవేటుది అని వాదించిన బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. తార్నాకలోని ఎర్ర కుంటను పరిశీలించి.. బుధవారం తార్నాకలోని ఎర్రకుంటను రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూస్తూ, ఎర్రకుంటను పునరుద్ధరించాలని నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం వినతి పత్రం సమరి్పంచింది. ఈ మేరకు పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు. జనావాసాల జోలికి హైడ్రా వెళ్లదు హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ పేదల జనావాసాల జోలికి వెళ్లదు. పెద్ద చెరువుగా ఉండాల్సిన బతుకమ్మకుంట క్రమేణా కుంచించుకుపోయింది. దానిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీని పక్కన ఉన్న బస్తీ వాసులకు గతంలో పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్లను హైడ్రా కూలుస్తుందనే దుష్ఫ్రచారం నేపథ్యంలో.. ఇక్కడికి వచ్చి స్థానికులకు వాస్తవాలు వివరించాం. వారి సహకారంతోనే బతుకమ్మకుంట పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో చట్టపరంగా అన్ని అంశాలను పరిశీలిస్తూ, అన్ని విభాగాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని తుది నిర్ణయం తీసుకున్నాం. కొందరు బతుకమ్మకుంట ప్రైవేటు స్థలమని వాదిస్తున్నప్పటికీ సరైన ఆధారాలు చూపలేదు. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ ఇళ్లు కూల్చబోమని హామీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ వచ్చి మాతో మాట్లాడారు. మా ఇళ్లను కూల్చబోమని హామీ ఇచ్చారు. దోమలు, దుర్వాసన లేకుండా బతుకమ్మకుంటను పునరుద్ధరిస్తామని చెప్పారు. కేవలం ఖాళీగా ఉన్న జాగానే చెరువుగా అభివృద్ధి చేస్తామన్నారు. అలా చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. – అరుణ, వీకర్ సెక్షన్ కాలనీ రంగనాథ్ సార్ వచ్చి ధైర్యం చెప్పారుబతుకమ్మకుంటలో సుమారు 50 ఏళ్లుగా నివసిస్తున్నాం. నగరంలో అక్కడక్కడా ఇళ్లు కూలుస్తుంటే భయం వేసింది. మా వద్దకు కూడా వచ్చి ఇళ్లు కూల్చేస్తారని కొందరు భయపెట్టారు. ఈ రోజు రంగనాథ్ సార్ వచ్చి ధైర్యం చెప్పారు. ఇళ్లు కూల్చబోమని, ఖాళీగా ఉన్న స్థలంలోనే కుంటను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. – సుంకమ్మ, వీకర్ సెక్షన్ కాలనీ -
‘రెడ్ మార్క్’ గోబ్యాక్!
సాక్షి, హైదరాబాద్: మూసీ నది గర్భంలో, బఫర్‌జోన్‌లో నిర్మాణాలను గుర్తించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేయడానికి వెళ్తున్న అధికారులకు అడుగడుగునా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఏళ్లకేళ్లుగా కష్టపడి సంపాదించుకుని కట్టుకున్న ఇళ్లను వదిలిపొమ్మనడం ఏమిటంటూ పరీవాహకంలోని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం రెండోరోజు శుక్రవారం వివిధ ప్రాంతాలకు వెళ్లిన అధికారులను స్థానికులు అడుగడుగునా అడ్డుకున్నారు.రోడ్లపై బైఠాయించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులపైనా తమ ఆక్రోశం వెళ్లగక్కారు. అభివృద్ధి అంటే ప్రజలకు మంచి జరగాలని.. తమను ముంచి చేసే అభివృద్ధి ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు మహిళలు బాధతో శాపనార్థాలు పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే బృందాలు ఇళ్ల మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మూసీ పరీవాహకంలో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కొన్ని కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తే తరలివెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా.. పక్కా ఇళ్లు కట్టుకున్నవారు కూల్చివేతను, తరలిపోవడాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చేస్తే ఎలా బతకాలంటూ చైతన్యపురి వినాయక్‌నగర్ కాలనీలో మహేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటికి మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. అదే ప్రాంతంలో మరో మహిళ తమ ఇల్లు పోతే ఎలాగనే కలతతో రోదిస్తూ స్పృహతప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చైతన్యపురిలో బాధితులకు మద్దతుగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తహసీల్దార్ ఆఫీసును ముట్టడించి.. మూసీ పరీవాహకంలో లంగర్‌హౌస్‌లోని వివిధ బస్తీల్లోని ఇళ్లకు అధికారులు గురువారం రాత్రి మార్కింగ్స్ వేశారు. అలా మొఘల్‌నగర్ రింగ్‌రోడ్డు వైపు వెళ్లే ప్రయత్నం చేయగా.. అక్కడి బాధితులు రాళ్లు పట్టుకొని ఉన్నారన్న హెచ్చరికలతో వెళ్లలేదు. అప్పటికే స్థానికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని.. రాత్రివేళ ఆందోళనలు వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. తహసీల్దార్ లేకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. మూడు గంటలు దిగ్బంధం కార్వాన్‌లోని జియాగూడ, పరిసర ప్రాంతాల వారు.. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని భారీ ఆందోళనకు దిగారు. ఇక్కడి ప్రధాన రహదారిని మూడు గంటల పాటు దిగ్బంధించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేసి.. అధికారులు గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూల్చనివ్వబోమని, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీనితో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కంటిమీద కునుకు కరువు! మూసీ పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులకు కంటిమీద కునుకు కరువైంది. జీవితకాలం సంపాదించి కట్టుకున ఇళ్లను కూల్చేస్తారనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ ఇళ్లను కూల్చివేసి పాపం ముటగట్టుకోవద్దంటూ వేడుకుంటున్నారు. ఉదయం ఆరేడు గంటల నుంచే బస్తీల్లో అలజడి కనిపిస్తోంది. పెద్దలు పనులకు వెళ్లకుండా, పిల్లలను బడులకు పంపకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఎవరెవరు బస్తీలోకి వస్తున్నారు, అధికారులు వస్తున్నారా అని ఆందోళనగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇంటిని ఖాళీ చేసే మాటేలేదు 30ఏళ్లుగా ఉంటున్నాం. ఇప్పడు కూలగొడతామంటూ ఊరుకునే మాటే లేదు. ఎక్కడికి వెళ్లాలి? మా పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. మేం అన్ని పన్నులు కడుతున్నాం. ఇక్కడే బతుకుతాం. – నవనీత, కమలానగర్ (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి02) భవిష్యత్తు ఆశలను కూల్చేస్తారా? పైసా పైసా కూడబెట్టి చిన్న ఇల్లు కట్టుకున్నాం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్నాం. ఆకస్మాత్తుగా ఇల్లు కూల్చేస్తే.. ఇల్లు మాత్రమేకాదు. భవిష్యత్తు ఆశలూ పోయినట్టే. మా బతుకులను బజారున పడేయొద్దు. – స్వప్న, గోల్నాక (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి03 ) అనుమతులు తీసుకుని ఇళ్లుకట్టుకున్నాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని బ్యాంకు లోన్‌తో ఇళ్లు కట్టుకున్నాం. 70–80 ఏళ్ల వయసున్న వృద్ధ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కూల్చివేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఇదేం న్యాయం? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? – లక్షి్మ, న్యూమారుతీనగర్ 56 ఏళ్లుగా ఉంటున్నాం.. ఎక్కడికి వెళ్లాలి? 1968 నుంచి అంటే 56 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇక్కడివారంతా బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు. హైటెక్ సిటీ కంటే సేఫ్‌గా ఉంటున్నాం. ఏ ఇబ్బందులూ తలెత్తలేదు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట రోడ్ల పాలు చేస్తున్నారు. మేమేం కబ్జా చేసి ఇళ్లు కట్టుకోలేదు. ఇంత ఖరీదైన ఇళ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? న్యాయం కోసం పోరాడుతాం. – ఉపేందర్, న్యూమారుతీనగర్ -
అద్దె బ్యాచ్ దిగింది !
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/తిరుపతి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తోంది. ఎన్నడూ లేని విధంగా నలుగురైదుగురు ఉన్న చోటకెళ్లి టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఆ పార్టీ గెలుస్తోందని అసత్య ప్రచారాలు కల్పిస్తూ ‘చీప్ పాలిట్రిక్స్‌కు’ దిగజారిపోయింది. రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు రచించడం సహజం. ప్రజలకు చేసిన మంచి పనులను ఎన్నికల సమయంలో చెప్పుకోవడం, మరోసారి అధికారంలోకి వస్తే మరింత మంచి చేస్తామని ప్రకటించడం పరిపాటి. అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏవగింపుగా మారింది. ప్రజాభిమానం కోల్పోయి రోజురోజుకూ పాతాళంలోకి దిగజారిపోయిన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మౌత్ పబ్లిíసిటీ పేరుతో అడ్డదారులు తొక్కుతోంది. ప్రతి నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఎల్లో కిరాయి మూకలను అద్దెకు ఏర్పాటు చేసుకుని టీ దుకాణాలు, సెలూన్ల వద్ద తిష్టవేసి అధికార పక్షంపై అసత్య ప్రచారం చేయించుకునే దుస్థితికి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డిని దూషించడమే పనిగా పెట్టుకుని అద్దెబ్యాచ్ పట్టణాల్లో తిరుగుతోంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం సహకారంతో విద్యార్థులను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి కళాశాల నుంచి కొంత మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించినట్లు తెలిసింది. అద్దె బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చి.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వైఎస్సార్సీపీ అభ్యర్థులను టార్గెట్ చేయటంతో పాటు ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్‌పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలని ఆదేశాలిచ్చారు. శిక్షణా తరగతులను మొదటి, రెండు, మూడు బ్యాచ్‌లుగా విభజించి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి విడతగా నియోజక వర్గానికి ఇద్దరు విద్యార్థుల చొప్పున రంగంలోకి దింపారు. వీరిపైన జిల్లాకు ఒక కో ఆర్డినేటర్‌ని నియమించారు. ఈ ఇద్దరు రోజూ ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు? అక్కడ పరిస్థితులు ఏంటి అనేది జిల్లా కో ఆర్డినేటర్‌కి నివేదిక రూపంలో అందిస్తారు. దానిని అమరావతిలో ఉండే టీం లీడర్‌కి పంపుతారు. దాదాపు 5 వేల మందికి శిక్షణ ఇచ్చి నగర, పట్టణ ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. లోకల్‌గా కొంతమందిని రిక్రూట్ చేసుకుని వారితో సమన్వయం చేసుకుంటూ అద్దె బ్యా చ్ మౌత్ పబ్లిíసిటీ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల నెల్లూరు రూరల్ ప్రాంతంలో అద్దె బ్యాచ్ టీ దుకాణాల వద్ద చేస్తున్న అసత్య ప్రచారాన్ని కొందరు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ బ్యాచ్ ఆ ప్రాంతాన్ని వదిలి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు, మూడు విడతల్లో మండల, సచివాలయాలు.. మొదటి విడత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పూర్తయ్యాక మరొక బ్యాచ్ రంగంలోకి దిగుతుంది. సంక్రాంతి తరువాత మండల, సచివాలయ కేంద్రాలను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిసింది. పట్టణాలు, నగరాలు అయితే అద్దె బ్యాచ్ ఎవరనేది ఎవ్వరూ ప్రశ్నించరు. కాబట్టి వారికి ఆ బాధ లేదు. మండల, సచివాలయ కేంద్రాలకు వెళ్లే సమయంలో స్థానిక నాయకుల సహకారంతో రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే స్థానిక నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక నాయకులతో కలిసి పర్యటిస్తారు. ఒక అద్దె వ్యక్తి స్థానికుడు ఒకరు ఉంటారు. అలా ఇద్దరికి ఇద్దరు పర్యటిస్తారు. టీ కొట్లు, చిన్న బంకుల వద్ద కూర్చొని అబద్దపు ప్రచారాలకు పదును పెడుతారు. స్థానిక టీడీపీ కార్యకర్త ప్రభుత్వం గురించో, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గురించో ప్రస్తావన చేస్తారు. అద్దె వ్యక్తి ‘అవునంటన్నా. మా బంధువుకి అలా జరిగిందంట, వైఎస్సార్సీపీ వాళ్లు ఇలా చేశారంట’ అని శృతి కలుపుతాడు. నలుగురు కలిసి ఒక అబద్దాన్ని నిజం చేసేందుకు తీవ్రంగానే కృషి చేయటానికి పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం. మూడో బ్యాచ్‌లో బరి తెగింపుడే ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మూడవ బ్యాచ్ రంగంలోకి దిగే పనిలో ఉంది. ఈ బ్యాచ్ అన్నింటికీ తెగించిన వారికి ప్రస్తుతం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్ వచ్చాక అబద్దాలు ప్రచారం చేయటం కంటే.. స్థానికంగా గొడవలు సృష్టించేందుకే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. మద్యం దుకాణాల వద్ద, లేదా మద్యం సేవించే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్థానికుల మధ్య గొడవలు పెట్టటం లేదా వీరే స్థానికులను రెచ్చగొట్టి విధ్వంసాలకు లాగటమే వీరి స్కెచ్‌గా తెలుస్తోంది. మద్యంపై విషప్రచారం చేయటం, స్థానికులను కొట్టడం, లేదా వారి వద్ద వీరు దెబ్బలు తినటమే ప్రధాన లక్ష్యంగా రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఘోర పరాభవాన్ని గుర్తెరిగే.. గత ఎన్నికల్లో మాదిరిగా ఘోర పరాభవాన్ని గుర్తెరిగే టీడీపీ ఇలాంటి నీతిమాలిన చర్యలకు పూనుకొంటోంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధితో ఆ ప్రభుత్వానికి ప్రజల్లో పరపతి పెరిగింది. మరోసారి కూడా వైఎస్సార్సీపీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగే ప్రయతాన్ని టీడీపీ చేస్తోంది.అయినా ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మౌత్ పబ్లిíసిటీని నమ్ముకొని దానినే కార్యరూపంలోకి తీసుకొచ్చారు. టీ స్టాళ్లు, సెలూన్లే వేదికలు టీడీపీ కిరాయి మూకలు నగరాలు, పట్టణా ల్లోని టీ దుకాణాలు, సెలూన్లను వేదికగా చేసుకుంటున్నాయి. సాధారణ వ్యక్తుల్లా వెళ్లి అక్కడే తిష్ట వేస్తారు. వారి చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంటుంది. ఆ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్త లను చదువుతున్నట్లు నటిస్తారు. వార్త ల సారాంశంపై పక్కనున్న వారితో చర్చ పెడతారు. ఆపై ఇదేం ప్రభుత్వం, ఎక్కడ చూసినా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఎక్కడా రోడ్లు వేయలేదు, అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం అప్పులు చూస్తే కొండలా పెరిగిపోతున్నాయి, సంక్షేమం అంటూ బటన్లు నొక్కి తిరిగి ధరలు పెంచి మన నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారంటూ పెదవి విరుస్తారు. ఇలా ఎల్లో కిరాయి మూ కలు తమ నటనను ప్రదర్శిస్తారు. అంతే కాకుండా లోకల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు టికెట్ రాదని, ఆయన అవినీతి చేశాడని.. టీడీపీలోకి వలసలు జోరుగా జరుగుతున్నాయంటూ భజన ప్రారంభిస్తారు. టీడీపీ, జనసేన జోడీ బాగుంది.. ఉత్తరాంధ్రలో అంతా టీడీపీ, జనసేన కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని, ఈ దఫా ఈ కూటమికే అధికారం వస్తుందని పదేపదే చెబుతారు. ఆ షాపుల వద్ద జనం ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే అక్కడ తిష్ట వేసి ఇలా తమ నటనను ప్రదర్శిస్తారు. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా నేర్పరితనంతో వ్యవహరిస్తారు. -
ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
ఢిల్లీ వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ (మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించే ఉష్ణమండల తుఫాను)కారణంగా ఇక్కడి వాతావరణంలో వేడి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అదే సమయంలో వాయు కాలుష్య స్థాయిలో కూడా ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. ఇక్కడి ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 388, అశోక్ విహార్‌లో 386, లోధి రోడ్లో 349, జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏక్యూఐ 366గా నమోదయ్యింది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎండీ)లో శనివారం ఉదయం ఒక మోస్తరు పొగమంచు నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 28 అనంతరం గాలి నాణ్యత కొద్దిగా మెరుగుపడింది. నవంబర్ 2 నుంచి కాలుష్య నివారణ చర్యలు చేపట్టిన దరిమిలా గాలి నాణ్యతలో మెరుగదల చోటుచేసుకుంది. అనవసరమైన నిర్మాణ సంబంధిత కార్యకలాపాలు నిషేధించడం, కాలుష్య కారక వాహనాలు రోడ్లపైకి రావడాన్ని నిషేధించడంతో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం -
ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం
ఉత్తరకాశీ జిల్లాలోని మరో సొరంగం స్థానికులను భయానికి గురిచేస్తోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు ఉబికివస్తుండంతో ఇక్కడి సాగునీటి కాలువ, పంట భూములు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇటీవలే కుప్పకూలిన టన్నెల్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని ఉత్తరాఖండ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (యూజేవీఎన్‌ఎల్) తెలిపింది. ఉత్తరకాశీలోని మనేరి భళి-2 ప్రాజెక్ట్‌లో 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంది. ఈ సొరంగం గుండా నీరు ప్రవహిస్తోంది. ధారసులో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంటుంది. ధారసు బ్యాండ్ సమీపంలోని మహర్‌గావ్‌లోని సొరంగం నుండి నీటి లీకేజీ రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇది క్రమంగా పెరుగుతోంది. యూజేవీఎన్‌ఎల్ ఇప్పటికే దీని మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అయినా లీకేజీ అదుపులోకి రావడం లేదు. గత రెండేళ్ల నుంచి ఇక్కడ నీటి లీకేజీ వేగంగా పెరుగుతోందని గ్రామ పెద్ద సురేంద్రపాల్ చెప్పారు. ఫలితంగా సాగునీటి కాలువ, పలు పంట భూములు దెబ్బతిన్నాయని, పలు చోట్ల భూమి కోతకు గురవుతోందని అన్నారు. ఈ సొరంగానికి తక్షణమే మరమ్మతులు చేయాలని ఆయన కోరారు. కాగా మనేరి భళి సొరంగం నీటి లీకేజీ నివారణకు మరమ్మతులు చేస్తున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని యూజేవీఎన్‌ఎల్ ఎండీ సందీప్ సింఘాల్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఇటలీ ప్రధానితో భారత ప్రధాని దోస్తీ చేస్తే.. -
Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ఘటన వెలు గుచూసింది. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చిన ఓ పర్యాటకుడిపై స్థానిక యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పర్యాటకుడిని వెంబడించి మరీ కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఇదంతా మంగళవారం ఉదయం జరగ్గా.. దాడికి సంబంధించిన దృశ్యాలు ఓ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాజ్‌మహల్ చూసేందుకు ఆదివారం ఆగ్రా వచ్చాడు. ఈ క్రమంలో తాజ్‌గంజ్ ప్రాంతంలోని బసాయ్ చౌకీ వద్ద కారులో వెళ్తుండగా పక్కన నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను తన వాహనం తాకింది. పర్యాటకుడు కారు ఆపి వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. అయినా వారు వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు భయంతో అతడు దగ్గర్లోని ఓ స్వీట్ షాప్‌లోకి పరుగెత్తాడు. అతన్ని వెంబడించిన దుండగులు షాప్‌లోకి చొరబడి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. తప్పు అయ్యింది, క్షమించాలని వేడుకున్నా వదల్లేదు. కొంత సమయం పాటు అతన్ని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. Video from Agra . Tourist Beaten by Locals. #shameful #SeemaHaider #KiritSomaiya #Agra #DelhiFloods pic.twitter.com/zuXq7qdwLN — देश सर्वप्रथम (@deshsarvpratham) July 18, 2023 దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తమలో ఒకడిని కారుతో ఢీ కొట్టాడన్న కారణంతోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తాజ్‌మహల్ గొప్ప పర్యటక ప్రాంతమని, దీనిని చూసేందుకు రోజు వేలల్లో టూరిస్టులు వస్తుంటారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. पर्यटक के साथ मारपीट से संबंधित वायरल वीडियो का स्वत: संज्ञान लेकर, #थाना_ताजगंज पुलिस द्वारा तत्काल अभियोग पंजीकृत कर, 03 टीमों का गठन करते हुए, 05 आरोपियों को हिरासत में लिया गया है व अन्य आरोपियों की गिरफ्तारी हेतु लगातार प्रयास किया जा रहा है। pic.twitter.com/yoyjGb6J3d — POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) July 17, 2023 -
కాంగ్రెస్ చెప్పింది కరెంట్ బిల్లులు కట్టం.. విద్యుత్ శాఖ అధికారిపై దాడి
కర్ణాటకలో కరెంట్ బిల్లు పంచాయితీ చినికి చినికి గాలివానలా తయారైంది. ‘మేం కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’ అంటూ పలు గ్రామాల ప్రజలు తెగేసి చెబుతున్నారు. కరెంటు బిల్లులు కట్టాలన్న అధికారులకు ఎదురు తిరుగుతున్నారు. పార్టీ పెద్దలు చెప్పారు కాబట్టి విద్యుత్ బిల్లులు కట్టేది లేదని చిత్రదుర్గ జిల్లా జాలికట్టెలో ఇటీవల గ్రామస్తులు మొండికేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో గ్రామంలో మీటర్ రీడింగ్ కోసం వచ్చిన విద్యుత్ అధికారిపై ఓ వ్యక్తి రెచ్చిపోయి ప్రవర్తించాడు. అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగకుండా చెప్పుతో దాడి చేశాడు. దీన్నంతటిని మరొకరు వీడియో తీయగా.. అతనిపై సైతం ఆవేశంతో అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Electricity officials are attacked by local residents in Karnataka when they came for meter reading. Residents says that they won’t pay from electricity now onwards as per Congress Guarantee pic.twitter.com/T0sVUjD2Ux — Rishi Bagree (@rishibagree) May 24, 2023 కాగా, అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. జూన్ 1 నుంచి ఎవరూ కరెంటు బిల్లు చెల్లించరాదని కేపీసీసీ అద్యక్షుడు డీకే శివకుమార్ ఎన్నికల ప్రచార సభల్లో కూడా ప్రకటించారు. మరోవైపు తమకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదని.. ఆదేశాలు వస్తే మీకు ఉచితంగా కరెంటు ఇస్తాం, అప్పటివరకు బిల్లులుకట్టాలని విద్యుత్ అధికారులు తెలిపారు. దీనికి ఒప్పుకోని గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఫ్రీ అని చెప్పారు. కాబట్టి మేం బిల్లులు చెల్లించేది లేదు. దీనిపై మీరు ప్రభుత్వానికి చెప్పండి అని కరాఖండిగా చెబుతున్నారు. చదవండి: రోడ్డుపై కనికట్టు..బొగ్గు, చాక్‌పీస్‌లతో ఒక కాలువను సృష్టించినా! వీడియోలతో -
భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానికుల ర్యాలీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానికులు శాంతియూత ర్యాలీ నిర్వహించారు. సీబీఐ ఏకపక్ష వైఖరి పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్ అండ్ బీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు.కడప- తాడిపత్రి హైవేపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు. సీబీఐ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. వివేకా హత్యకేసులో దోషులను కాకుండా అవినాష్‌రెడ్డి కుటుంబాన్నిసీబీఐ టార్గెట్ చేసిందన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. ఆయనను హైదరాబాద్ తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో భాస్కర్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. -
Telangana: ఆర్టీసీలోనూ 95% పోస్టులు స్థానికులకే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలోనూ ఇకపై 95 శాతం పోస్టులను స్థానికులకే కేటాయించనున్నారు. జోనల్, మల్టీజోనల్ పద్ధతిలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ‘95 శాతం స్థానికత’ను పరిగణనలోకి తీసుకొనేలా శాసనసభ ఇటీవల ఆమోదించడంతో దాన్ని ఆర్టీసీలో అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ పాలకమండలి శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది. స్థానికులకే పోస్టుల ప్రక్రియ అమలు విధివిధానాలకు సంబంధించి కొన్ని అంశాలను ప్రతిపాదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 రెవెన్యూ జిల్లాలు ఉండగా ఆర్టీసీలో మాత్రం 11 రీజియన్లే ఉన్నాయి. అలాంటప్పుడు స్థానికతను ఏ రకంగా పరిగణనలోకి తీసుకోవాలనే విషయమై పాలకమండలి సభ్యులు చర్చించారు. ఓ ప్రతిపాదనను ఖరారు చేసి ప్రభు త్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించారు. ప్రభు త్వం ఆమోదించాక కొత్త రిక్రూట్మెంట్ చేపట్టనున్నారు. ప్రస్తుతానికి డిపో మేనేజర్ కంటే దిగువ అధికార పోస్టుల్లో ఖాళీలు ఉండగా త్వరలో డ్రైవర్, కండక్టర్ పోస్టుల్లో కూడా ఖాళీలు ఏర్పడనున్నాయి. ఆర్టీసీ ఆసుపత్రికి ఐదుగురు వైద్యులు.. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. ఆసుపత్రికి అనుబంధంగా ఏర్పాటైన నర్సింగ్ కాలేజీకి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కొత్తగా అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ సేవలకు సంబంధించి డయాలసిస్ టెక్నీషియన్లు, నర్సులను ఔట్ సోర్సింగ్ కింద నియమించుకొనేందుకు ఆసుపత్రి పాలకమండలికి బోర్డు అనుమతించింది. చదవండి: మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్‌మార్టం.. ‘పోలైన ఓట్లలో 50శాతం మనకే’ -
20 రోజులుగా తాగునీళ్లు లేవు
బనశంకరి: బెంగళూరు దక్షిణ నియోజకవర్గపరిధిలోని ఉత్తరహళ్లి వార్డు (184) యాదాళం నగరలో గత 20 రోజులుగా తాగునీటిని సరఫరా కావడం లేదు. గుక్కెడు నీటికోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని ప్రజలు వాపోయారు. గురువారం స్థానిక కాంగ్రెస్ నేత ఆర్కే.రమేశ్, ఉత్తరహళ్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కే.కుమార్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కడ పర్యటించారు. ప్రజల సమస్యలను తీర్చడంలో ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప విఫలమయ్యారని కాంగ్రేస్‌నేతలు ఆరోపించారు. నేతలు బాలకృష్ణ, బైరప్ప, గుండుమణిశ్రీనివాస్, ఉమాదేవి పాల్గొన్నారు. ఉమ్మడిగా సంక్షేమ కార్యక్రమాలు బనశంకరి: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటరామరాజు గురువారం బెంగళూరు బనశంకరి గాయత్రిభవన్లో అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు అశోక్ హర్నహళ్లి, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీధర్‌మూర్తిని కలిశారు. బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. -
గురుకుల సీట్లలో సగం స్థానికులకే!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల అడ్మిషన్ల విధానంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతి ఏడాది గురుకుల పాఠశాలల ఐదో తరగతి అడ్మిషన్లలో స్థానిక అసెంబ్లీ నియోజకవర్గంలోని విద్యార్థులకు సగం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగులు సీట్లను జిల్లాస్థాయిలోని విద్యార్థులతో భర్తీచేస్తారు. ఇంకా మిగిలితే రాష్ట్రస్థాయిలోని విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 13న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఆర్ఈఐఎస్) సొసైటీలు ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్) నిర్వహిస్తున్నాయి. అనంతరం విద్యార్థులను కేటగిరీలవారీగా విభజించి ఆయా గురుకులాల్లో అడ్మిషన్లు ఇస్తున్నాయి. టీఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్ మాత్రం సొంతంగా ప్రవేశపరీక్ష, అడ్మిషన్లు చేపడుతోంది. ప్రవేశపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 50 శాతం సీట్లు నియోజకవర్గంలోని వారికే కేటాయిస్తారు. సీట్లు మిగిలితే జిల్లాను యూనిట్‌గా, ఇంకా మిగిలితే రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. పైరవీలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా అడ్మిషన్లు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలకు ఒకసారి సమీక్ష.. రాష్ట్రంలోని ప్రతి గురుకుల విద్యాసంస్థ మూడు నెలలకోసారి తప్పకుండా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి విద్యాసంస్థల పనితీరు, ఇతర సమస్యల్ని చర్చించాలని ప్రభుత్వం ఆదేశించింది. సమావేశానికి నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సొసైటీలతోపాటు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
వైరల్ వీడియో: పోలీస్‌పై గ్రామస్థుల విచక్షణ రహిత దాడి
-
Viral Video: పోలీస్ అధికారిపై కర్రలతో గ్రామస్తుల దాడి
భోపాల్: విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిపై స్థానికులు విచక్షణ రహితంగా దాడికి తెగబడిన ఘటన శుక్రవారం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌కు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛతర్‌పూర్‌లోని జామ్‌తులి గ్రామంలో కోవిడ్ కర్ఫ్యూని ఉల్లంఘించి కొంతమంది వ్యక్తులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన గ్రామంలోని కొంతమంది మూకుమ్మడిగా పోలీస్ దగ్గరకు వెళ్లి అతనిపై దాడికి తెగబడ్డారు. కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను జాతీయ మీడియా సంస్థ తన ట్విటర్లో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరలవుతోంది. 7 సెక్షన్ల నిడివిగల ఈ వీడియోలో గాయాలతో పోలీస్ కిందపడిపోయి లేవడానికి ఇబ్బందిపడుతున్నట్లు కనిపిస్తోంది. అంతేగాక పోలీస్‌ను కొట్టడానికి వచ్చిన వారిలో ఓ వ్యక్తికి తలపై గాయాలయి ఉన్నాయి. కాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్థానికులు మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. అయితే, ఈ దాడికి పాల్పడిన వారిలో ఏ ఒక్కరూ కూడా మాస్క్ ధరించలేదు. దీనికితోడు వారంతా అసభ్య పదజాలంతో మాట్లాడటం కెమెరాలో రికార్డయ్యింది. కాగా పోలీస్ ఓ వ్యక్తి తలపై పోలీస్ గట్టిగా కొట్టాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందుకే అతనిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. కానీ పోలీసుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తను కేవలం షాప్‌లు మూసేయాలని చెప్పినందుకు కోపంతో తనపై దాడి చేశారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై డీఎస్పీ శశాంక్ విలేకరులతో మాట్లాడుతూ.. జామ్‌తులి గ్రామంలో కోవిడ్ కర్ఫ్యూ ఉల్లంఘించబడుతోందని తమకు సమాచారం అందిందన్నారు. వెంటనే పోలీసులు బృందం అక్కడికి వెళ్లిందని, దుకాణాలను మూసివేయమని చెప్పడంతో కొంతమంది కోపం తెచ్చుకొని సిబ్బందిని కొట్టారని వెల్లడించారు. తామింకా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు, పూర్తి వివరాలు సేకరించగా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
కొట్టుకున్న పోలీసులు, స్థానికులు
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో పోలీసులు స్థానికుల మధ్య గొడవ జరిగింది.ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పశ్చిమ బెంగాలోని బదురియాలో స్థానికులు రోడ్డు మీదకు రావడంతో కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా రోడ్డుపైకి రాకూడని పోలీసులు హెచ్చరించారు. తమకు రేషన్ సరుకుల పంపిణీ సరిగా జరగడం లేదని అందుకే రోడ్డుపై బైఠాయించామని స్థానికులు చెప్పారు. వారిని వెంటనే అక్కడ నుంచి లేచి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. దీంతో వారు పోలీసులపై తిరగబడ్డారు. ఈ కారణంగా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. -
కొట్టుకున్న పోలీసులు, స్థానికులు
-
రెండో రోజుకు చేరుకున్న తిరుమల స్థానికుల దీక్ష
-
అడ్డదారిలో టీచర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్ : విద్యాశాఖలో అడ్డదారి బదిలీలకు తెరలేచింది. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఏకంగా వందలాది మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ గుట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగులకు సాధారణ బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. బదిలీ మార్గదర్శకాల రూపకల్పనలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ తరుణంలో అక్రమ బదిలీల ప్రక్రియ విద్యాశాఖలో కలకలం సృష్టిస్తోంది. బుధవారం రాత్రి దాదాపు 100 మంది టీచర్లను బదిలీ చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరో 150 మంది టీచర్ల బదిలీలకు సంబంధించి ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో అత్యధికులు అంతర్ జిల్లా (ఇతర జిల్లాలకు) బదిలీలు పొందగా.. మరికొందరు జిల్లా పరిధి (విత్ ఇన్ డిస్ట్రిక్ట్)లో బదిలీ అయ్యారు. పలుకుబడికే పట్టం టీచర్ల బదిలీలకు భారీ మంత్రాంగమే నడిచింది. ప్రముఖుల అండదండలున్న టీచర్లకే స్థానచలనం కలిగింది. ఒక్కో టీచర్ బదిలీకి భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు తెలిసింది. సాధారణ బదిలీలు జరిగితే పట్టణ ప్రాంత పోస్టులు భర్తీ అవుతాయని భావించిన కొందరు రాజకీయ నేతలు.. అధికారులతో చేతులు కలిపి దొడ్డిదారి బదిలీలకు తెరతీశారు. అందులో భాగంగా ప్రత్యేక ఉత్తర్వులతో పట్టణ ప్రాంతాల్లో పాగా వేయాలని భావించి రంగంలోకి దిగారు. మొత్తంగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో టీచర్ల బదిలీ వ్యవహారం సాఫీగా జరిగింది. వాస్తవానికి ఒకట్రెండు రోజుల్లో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రత్యేక బదిలీలు చేపట్టొద్దని సంఘాలు స్పష్టం చేశాయి. మంత్రి సైతం అంగీకరించారు. కానీ సమావేశం ముగిసిన గంటల వ్యవధిలోనే అడ్డగోలుగా బదిలీ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. 30 శాతం హెచ్ఆర్ఏ కోసం.. తాజాగా బదిలీ పొందిన వారంతా పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకే ట్రాన్స్ఫర్ అయ్యారు. పట్టణ ప్రాంతాల బదిలీకి ప్రధాన కారణం 30 శాతం హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) రావడమే. అంతేకాకుండా రాజధాని నగరంలో నివసించే వెసులుబాటు ఉంటుందని భావించిన టీచర్లు భారీ మొత్తంలో నజరానాలు ఇచ్చుకుని మరీ దొడ్డిదారిలో బదిలీలు పొందారు. బుధవారం రాత్రి వచ్చిన బదిలీ ఉత్తర్వుల్లో సగానికిపైగా టీచర్లు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకే వచ్చారు. ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయా టీచర్లు కొత్త పాఠశాలల్లో జాయిన్ అయ్యేందుకు పరుగులు పెట్టారు. ఉదయం పదిన్నర గంటల సమయంలోనే డీఈవో కార్యాలయాలకు వచ్చి రిపోర్టు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 32, మేడ్చల్‌లో 19, కరీంనగర్లో 12 బదిలీలు జరిగాయి. మిగతా బదిలీలు నల్లగొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో జరిగినట్టు తెలిసింది. స్థానికులకు అన్యాయమే! ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీల వ్యవహారంతో స్థానిక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరగనుంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నిరుద్యోగులు ఎక్కువగా నష్టపోనున్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే స్థానిక, స్థానికేతర ఉపాధ్యాయుల నిష్పత్తి పరిమితికి మించి ఉంది. సాధారణంగా 20 శాతం ఉండాల్సిన స్థానికేతర నిష్పత్తి.. 40 శాతాన్ని మించింది. తాజాగా మరిన్ని అంతర్ జిల్లా బదిలీలు కావడంతో జిల్లాలో ఉన్న ఖాళీలు తగ్గిపోనున్నాయి. దీంతో నియామకాల సమయంలో స్థానిక అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోనున్నాయి. మండిపడ్డ సంఘాలు.. రేపు డైరెక్టరేట్ ముట్టడి అడ్డదారి బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ఎస్టీయూ, యూటీఎఫ్, టీటీఎఫ్, టీపీటీఎఫ్, టీపీఆర్టీయూ సంఘాల నేతలు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచి ప్రభుత్వమే ఇలా అడ్డదారిలో బదిలీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కార్యాలయం కేంద్రంగా పైరవీ బదిలీలు జరగడం దారుణమన్నారు. ఈ బదిలీల రద్దుకు ఆందోళన చేస్తామని ప్రకటించారు. జాక్టో, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించాయి. -
కశ్మీర్ బాధిత కుటుంబాలతో రవిశంకర్ భేటీ
బెంగళూరు: కశ్మీర్ గొడవల్లో చనిపోయిన జవాన్లు, స్థానికులు, ఉగ్రవాదుల కుటుంబాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ శుక్రవారం ఒక్కచోటుకు చేర్చారు. పైగామ్–ఎ–మొహబ్బత్ (ప్రేమ సందేశం) పేరుతో ఆయన బెంగళూరులో ఓ కార్యక్రమం నిర్వహించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సాంత్వన కలిగించేందుకు, వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి దాదాపు 200 బాధిత కుటుంబాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ప్రియమైన వారిని పోగొట్టుకున్న వీరి హృదయాలు బాధను అనుభవిస్తుంటాయనీ, ఓదార్చి గాయాలను మాన్పకపోతే వీరూ హింసా మార్గంలో వెళ్లే వీలుందని రవిశంకర్ అన్నారు. -
పుట్టిన బిడ్డ ఏలియన్స్‌లా ఉన్నాడని..
లక్నో: పండంటి బిడ్డ పుడతాడని ఆశించిన తల్లిదండ్రులు పుట్టిన బిడ్డను చూసి షాక్‌తిన్నారు. శారీరక వైకల్యంతో జన్మించిన పిల్లలను పెంచిపెద్ద చేయడం కత్తి సాము లాంటిదే. అలాంటి పిల్లలు ఆరోగ్యకరమైన సాధారణ జీవితం గడపాలంటే అటు కుటుంబ సభ్యులనుంచి ఇటు సమాజం నుంచి సంపూర్ణ మద్దతు చాలా అవసరం. ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్‌కు కు చెందిన దంపతులు వింత ఆకారంతో పుట్టిన బిడ్డపట్ల బాధ్యతగా వ్యవహరించి, అక్కున చేర్చుకుని ఆదర్శంగా నిలిచారు. అలీగడ్‌కు చెందిన దంపతులు తమ బిడ్డను చూసి భయపడిపోయారు. ముక్కు చెవులు లేకుండా.. కళ్లు పెద్దవిగా బయటకు పొడుచుకు వచ్చినట్టుగా ఉన్న పిల్లవాడి ఆకారాన్ని చూసి చలించిపోయారు. కానీ ఇది భగవంతుడి దయ అంటూ బిడ్డను స్వీకరించారు. ఏదో ఒక అద్భుతం జరిగి తమ కొడుకు జీవితం బాగు పడుతుందని ఆశతో ఇంటికి తీసుకెళ్లారు. అటు గ్రామస్తులు మాత్రం గ్రహాంతరవాసి (ఏలియన్స్) లా వింతగా ఉన్నాడంటూ బిడ్డను చూడడానికి తరలివచ్చారు. కాగా 2 కేజీల బరువుగా పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడని, ప్రమాదమేమీలేదని వైద్యులు తెలిపారు. కాగా ఈ దంపతులకు ఇప్పటికే రెండు సంవత్సరాల కుమార్తె ఉంది. -
ధర్నాచౌక్ ప్రజల ప్రాథమిక హక్కు: లక్ష్మణ్
హైదరాబాద్: ధర్నాచౌక్ రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ధర్నాచౌక్ వద్ద జరిగిన ఘటనలపై ఆయన స్పందిస్తూ.. స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిమితితో కూడిన ధర్నా చౌక్‌ను కొనసాగించాలి. ప్రత్యామ్నాయ మార్గం చూయించాలి. ధర్నాచౌక్ అంశాన్ని అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. తెలంగాణ కొరకు అనేక ఆందోళనలు, ఉద్యమాలు చేసిన అనుభవం ప్రజలకు ఉందని అన్నారు. -
ప్రభుత్వమే నడిపిస్తోంది: వీహెచ్
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్ద కాలనీవాసులు ఎవరూ ఆందోళన చేయడంలేదని, ప్రభుత్వమే ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు అన్నారు. సోమవారం ఆయన జేఏసీ పిలుపు మేరకు మద్దతు తెలుపుతూ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్నాచౌక్ వద్ద బైఠాయించి సేవ్ ధర్నాచౌక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఏమీ తెలియనట్టుగా నటిస్తోందన్నారు. ఏదిఏమైనా ధర్నాచౌక్‌ను ఇక్కడి నుంచి తరలించకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. -
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత
-
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ సోమవారం పోటాపోటీ ఆందోళనతో దద్దరిల్లింది. ధర్నా చౌక్ తరలింపుపై అనుకూల, ప్రతికూల వర్గాల నినాదాలతో హోరెత్తింది. ధర్నాచౌక్ తరలింపును నిరసిస్తూ టీజేఏసీ చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అలాగే ధర్నాచౌక్ తరలించాలంటూ స్థానిక కాలనీవాసులు చేపట్టిన ఆందోళనకూ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఉదయం టీ. జేఏసీ నేతలు, వామపక్షాల నేతలతో పాటు స్థానికులు కూడా ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. ధర్నాచౌక్‌ను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నినాదాలు చేస్తుండగా.. సీపీఐ కార్యకర్తలు ధర్నా చౌక్‌ను తరలించొద్దని పెద్ద ఎత్తున దూసుకురావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు, కర్రలు, జెండాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో స్థానికులకు పలువురు వాకర్స్‌కు గాయాలయ్యాయి. మఫ్టీలో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఇరు వర్గాల వారి నినాదాలు, దాడుల మధ్య ఇందిరాపార్క్ రణరంగాన్ని తలపిస్తోంది. కాగా ఇరు వర్గాలు సంయమనం పాటించి తమ సమస్యలను శాంతియుతంగా చెప్పుకోవాలని పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండు నెలలుగా ధర్నాచౌక్‌లో ఎలాంటి ఆందోళనలకు అనుమతి ఇవ్వడంలేదని... అయితే ఈ ఒక్క రోజు మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా... చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
నకిలీ జ్యోతిష్యుడి ఆటకట్టు
చెన్నూరు : ‘మీకు శనిదోషం ఉంది. మృత్యు కళ ముఖంలో కనపడుతుంది. వారం రోజుల్లో చనిపోతారు. ఎంత డబ్బు వచ్చినా రాహుకాల దోషం వల్ల నిలవడటం లేదు. అందుకు విరుగుడుగా తాయత్తు కట్టాలి. ఇంటికి దోష పరిహారం చేయాలి. లేకపోతే చాలా అరిష్టం’ అంటూ ప్రజలను భయపెట్టి, మోసం చేస్తున్న నకిలీ జ్యోతిష్యుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన చెన్నూరులోని సరస్వతినగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడపకు చెందిన రామాంజనేయులు15 రోజులుగా కాటి కాపరుడి వేషం వేసుకొని గ్రామంలో తిరుగుతూ పురుషులు లేని ఇంటిలోకి నేరుగా వెళ్తాడు. మహిళలకు జ్యోతిష్యం పేరుతో మాయమాటలు చెప్పి, భయపెట్టి వారి వద్దనున్న సొమ్మును దోచుకునే వాడు. ఒంటిరిగా ఉన్న వారిని మభ్యపెట్టి తాయత్తు కచ్చితంగా వేసుకో, మంచి జరుగుతుందని, లేకపోతే అరిష్టం అంటూ చెప్పేవాడు. దీంతో భయపడి తాయత్తు వేయించుకొంటే రూ. 200 నుంచి రూ.500 వరకు తీసుకునే వాడు. దుకాణాల వద్దకు వచ్చి బెదిరించే వాడు. మద్యం సేవించి, దక్షిణ వేయాలని లేకపోతే మీ కథ చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో సరస్వతీనగర్‌కు చెందిన ప్రజలు శుక్రవారం విషయాన్ని పోలీసులకు చెప్పారు. అతన్ని వారు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సాయంత్రం వరకు పెట్టుకుని, అతని వద్ద ఉన్నది దోచుకొని పంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఏఎస్ఐ యల్లంరాజును ‘సాక్షి’ వివరణ కోరగా.. ప్రజలు కాటికాపారుడిని అప్పగించిన విషయం వాస్తవమేనని, అతన్ని మందలించి పంపామని తెలిపారు. -
బీహార్‌లో పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ
-
పిచ్చికుక్కల స్వైరవిహారం
నెమ్లి(బీర్కూర్): మండలంలోని నెమ్లి గ్రామంలో పిచ్చికుక్కలు సోమవారం స్వైర విహారం చేశాయి. గ్రామానికి చెందిన పోశబోయి, సాయబోయితో పాటు దత్తు, అంజి అనే విద్యార్థులపై దాడి చేసి గాయపర్చాయి. వీరిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కలను స్థానికులు గ్రామం నుంచి తరిమికొట్టారు. -
నిఘా నీడలో పల్లె
గుర్రాలగొందిలో అక్రమాలకు చెక్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చిన్నకోడూరు: అక్రమాలు, నేరాలు, ప్రమాదాలు జరగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సాధారణంగా పోలీసులు చేపడతారు. కానీ ఇక్కడ దాతల సహకారంతో స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని సురక్షితంగా ఉండటానికి ఆ పల్లెవాసులు చేసిన ప్రయత్నం ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నకోడూరు మండలంలో గుర్రాలగొంది మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో ఎక్కువ శాతం మంది ప్రభుత్వం ఉద్యోగులు, రైతులు ఉన్నారు. సుమారు 1800 జనాభా ఉంది. స్థానికులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో దోపిడీలు, దొంగతనాలు, అక్రమ దందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా అందరూ భద్రంగా ఉండేందుకు శ్రీకారం చుట్టారు. దానికి మంత్రి హరీశ్‌రావు సహకారంతో కరీంనగర్ గ్రానైట్ కంపెనీ ప్రతినిధి రాజేశ్వర్‌రావు ముందుకువచ్చారు. రూ. 1.30 లక్షలు వెచ్చించి గ్రామ ప్రధాన కూడళ్లలో 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలో రికారై్డన పుటేజీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హార్డ్ డిస్క్‌లో భద్రంగా ఉంటుంది. గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాలను పరిశీలించడానికి ఆపరేటర్‌ను సైతం నియమించారు. అక్రమాలకు చెక్... గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో దొంగతనాలు, దోపిడీలు, అక్రమ దందాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. గ్రామంలో కొత్త వ్యక్తులు సంచరించినా వారిని గుర్తించి పోలీసులకు అప్పగించేందుకు వీలు కలుగుతుంది. అపరిచిత వ్యక్తులు గ్రామంలో కాలు మోపగానే క్షణాల్లో ఇట్టే గుర్తుపట్టొచ్చు. దోపిడీలు, దొంగతనాలు, అక్రమ దందాలు వంటి వాటికి గ్రామంలో ఫుల్స్టాప్ పడినట్టే. సీసీ కెమెరాలతో పోలీసులకు పనిభారం తగ్గుతుంది. దొంగతనాలు జరిగినప్పుడు నేరస్తులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు కీలక ఆధారంగా మారనున్నాయి. కాగా గ్రామంలో ఇటీవల ఓ షాప్‌లో దొంగ తనానికి పాల్పడిన వ్యక్తిని సీసీ పుటేజీ ద్వారా కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అందరి సహకారంతోనే.. మంత్రి హరీష్‌రావు సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నా. ఈ విషయంలో ప్రజల సహకారం మరువలేనిది. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో అక్రమాలకు, దొంగతనాలకు అడ్డుకట్ట పడింది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో గడిపేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఆంజనేయులు, సర్పంచ్ -
దొంగకు దేహశుద్ధి.. తీవ్రగాయాలతో మృతి
తూప్రాన్(మెదక్): అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఓ దొంగను స్థానికులు చితకబాదడంతో మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం హైదర్‌గూడలో ఆదివారం అర్ధరాత్రి దాటక జరిగింది. గ్రామంలోని పోచయ్య ఇంట్లోకి రాత్రి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించడంతో అప్రమత్తమైన ఆయన.. స్థానికులతో కలిసి దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే స్పృహ కోల్పోయి పడి ఉన్న అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యుల నిర్ధరించారు. మృతుడు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన బాజీరావు(35)గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సంగీత వాయిద్యాలకు పని చెప్పిన మోదీ
షిల్లాంగ్: మేఘాలయలో స్థానికులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ శనివారం సందడి చేశారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని మాఫ్లాంగ్ గ్రామం చేరుకున్న మోదీ అక్కడి స్థానికులతో కలిసి వారి సమస్యలపై చర్చించారు. అనంతరం సంస్కృతిక కార్యక్రమాల్లో స్థానికులతో కలిసి పాల్గొన్నారు. దీనిలో భాగంగా వారితో కలిసి సంప్రదాయక నృత్యం చేశారు. వారి సంగీత వాయిద్యాలను కూడా వాయించారు. -
అక్కాతమ్ముళ్లపై దాడి..
సంతోష్‌నగర్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అక్కాతమ్ముళ్లపై ఓ వర్గానికి చెందిన యువకులు దాడిచేసిన సంఘటన బుధవారం హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... ఉప్పుగూడ సాయిబాబానగర్ ప్రాంతానికి చెందిన ఆయేషా అలియాస్ కవిత మల్లేష్ అక్కాతమ్ముడు. కవిత కొన్ని నెలల క్రితం ఆటో డ్రైవర్ ఆసీఫ్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా కవిత తన పేరును ఆయేషాగా మార్చుకుంది. ఇదిలా ఉండగా బుధవారం మిధాని చౌరస్తాలో కవిత, మల్లేష్లు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా... స్థానికంగా ఉండే ఓ వర్గానికి చెందిన యువకులు బుర్ఖాలో ఉన్న ఆయేషాను చూసి అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావని గొడవ పడ్డారు. తమ సోదరిని తీసుకెళ్తున్నానని చెబుతుండగానే తీవ్రస్థాయిలో దుర్భాషలాడి ఇద్దరిని చితకబాదారు. ఈ సంఘటనలో గాయాలపాలైన మల్లేష్, ఆయేషాలుపోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎంను అడ్డుకున్న గ్రామస్తులు
దాద్రి: యూపీతో పాటు దేశవ్యాప్తంగా చిచ్చురేపిన దాద్రి ఘటన రేపిన దుమారం రోజురోజుకు ముదురుతోంది. శనివారం గ్రామానికి వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఒక్క కేజ్రీవాల్ మాత్రమే కాదు.. తమ గ్రామంలోకి మీడియా కూడా ప్రవేశించడానికి వీల్లేదంటూ తెగేసి చెబుతున్నారు. గోమాంసం తిన్నారనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్‌లో బిషాదా గ్రామంలో ఇఖ్లాక్ అనే వ్యక్తిని కొంతమంది గ్రామస్తులు సామూహికంగా దాడిచేసి కొట్టి చంపారు. స్థానిక బీజేపీ నేత కొడుకు ఈ ఘటనకు పురిగొల్పాడనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అటు విపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ముందస్తు ప్రణాళికతోనే చేసిన హత్య అని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరులు కూడా ఆ ఘటనపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని కేంద్రం అంటోంది. మరోవైపు ఈ ఘటనలో హత్యకు గురైన డానిష్ కుటుంబ సభ్యులు తమను ప్రశాంతంగా జీవించనివ్వండంటూ మీడియాను, ప్రజలను కోరారు. జరిగిన ఘోరాన్ని, తాము చెప్పాల్సిన విషయాలను ఇప్పటికే అందరికీ తెలిపామంటోంది. కాగా ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు!
పుల్కల్: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు తాము వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మిచుకునేందుకే తవ్వకాలు జరుపుతున్నామని చెబుతున్నా.. కాదు గుప్త నిధులకోసమే తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మండలంలోని శివ్వంపేట గ్రామంలో బండ బోయిని నర్సింలు ఇంటి సమీపంలోని స్థలంలో 50 నుంచి 60 ఫీట్ల లోతులో ఐదు వారాలుగా గుంత తీస్తున్నారు. రాత్రి పూట తవ్వకాలు జరుపుతుండటంతో ఆ ప్రాంతంలోని వారు ఆందోళనకు గురవుతున్నారు. బాత్ రూం నిర్మాణం కోసమైతే పగలు తవ్వకాలు నిర్వహిస్తారు. అయినా తొమ్మిది ఫీట్ల కంటే ఎక్కువ లోతు తీసే పరిస్థితి ఉండదు. కాని ఏకంగా 50 ఫీట్లకు పైగా తవ్వకాలు నిర్వహించడంతో అనుమానాలకు దారి తీస్తోంది. అది ఎవ్వరికీ అనుమానం రాకుండా చుట్టూ దడి నిర్మించి తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటికీ సుమారుగా 50 ఫీట్లకు పైగా తీయడం వల్ల గుంతల్లో నీరు ఊరుతుంది. అయినా తవ్వకాలు కొనసాగిస్తునే ఉన్నారు. -
స్కూల్‌పై దాడి.. నిప్పు
-
తల్లడిల్లిన తండ్రి గుండె
ఆయనకు ఒక్కగానొక్క కూతురు.. పెంచి.. పెద్దచేసి కుమార్తె క్షేమం కోసం ఏరికోరి నచ్చిన మనువు ఇచ్చాడు. భర్త వేధింపులు ఆమెను బలి తీసుకుంటాయని ఊహించలేకపోయాడు. బిడ్డ పడుతున్న కష్టాలు చూసి తండ్రి కలతచెందాడు. అల్లుడి వేధింపులు తాళలేక కూతురు ఆత్మహత్యకు పాల్పడింది.. ఇది జీర్ణించుకోలేని ఆ తండ్రి కూడా పురుగుల మందు తాగి తనువు చాలించాడు. బిజినేపల్లి (తిమ్మాజిపేట): భర్త వేధింపులకు తాళలేక కూతురు ఆత్మహత్యకు ఒడిగట్టింది. కళ్లముందే కుమార్తె విగతజీవిగా మారవడంతో తానూ పురుగుమందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఈ విషాదకర సంఘటన శనివారం బిజినేపల్లి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కన్నె కాశన్న(64), కొండమ్మకు ఒక్కగానొక కూతరు బాలమణి(30). ఆమెను బిజినేపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన స్వామికి ఇచ్చి పెళ్లిచేశారు. వారికి కొడుకు ఉన్నాడు. ఇంతలో సాఫీగా సాగుతున్న సంసారంలో వేధింపుల చిచ్చు మొదలైంది. స్వామి తరుచూ భార్యను చితకబాదేవాడు. ఇదిలాఉండగా, బుధవారం కుమ్మెర జాతరలో కూతురు బాగోగులు తెలుసుకున్న తల్లిదండ్రులు కుమార్తె, అల్లుడిని ఇంటికి రమ్మని కోరారు. అందుకు స్వామి నిరాకరించడంతో బాలమణిని తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి అత్తవారింటికి వెళ్లమని తల్లిదండ్రులు ఆమెను కోరారు. ‘చావనైనా.. చస్తాను కానీ కాపురానికి వెళ్లను’ అని బాలమణి మొండికేసి ఇంటినుంచి వెళ్లిపోయింది. తండ్రి కాశన్న కూతురు కోసం పొలం వద్దకు వెళ్లి చూడగా పురుగుమందు తాగి విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించాడు. దీంతో తల్లడిల్లిన తండ్రి అక్కడే ఉన్న పురుగుమందు తాగాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి వెళ్లేలోగా ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రతిగుండె తల్లడిల్లింది. సీఐ గిరిబాబు, ఎస్ఐ దస్రూనాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘చచ్చేంత’ నిర్లక్ష్యం
తొట్టంబేడు: తెలుగుగంగ అధికారుల నిర్లక్ష్యం.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ బాలిక గల్లంతుకు కారణమరుుంది. తెలుగుంగ కాలువ వద్ద ప్రవూద సూచికలు పెట్టాలని, కాలువ మెట్లు పూడ్చి వేయూలని పదేపదే స్థానికులు మొత్తుకుంటున్నా గంగ అధికారులు నిద్ర వుత్తు వీడలేదు. ఫలితంగా వుంగళవారం తెలుగుగంగ కాలువ వద్ద ఓ బాలిక గల్లతైంది. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి వుండలంలోని ఇనగలూరు దళితవాడకు చెందిన ధనయ్యు, గంగాదేవి మొదటి కువూర్తె భువనేశ్వరి(12) స్థానిక ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. తొట్టంబేడు వుండలంలోన గురప్పనాయుుడుకండ్రిగలో అవ్మువ్ము కర్మక్రియులకు తల్లితో పాటు హాజరైంది. ఈ క్రవుంలో వుంగళవారం తల్లి గంగాదేవితో పాటు పక్కనే ఉన్న తెలుగుగంగ కాలువలో దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. గంగ కాలువకు ఏర్పాటు చేసిన మెట్లపై తల్లి, కూతురు దుస్తులు ఉతుకుతుండగా భువనేశ్వరి ప్రవూదవశాత్తు అదుపుతప్పి కాలువలో పడిపోరుుంది. కాలువలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో బాలిక వేగంగా కొట్టుకుపోరుుంది. కువూర్తె కొట్టుకుపోతున్న విషయూన్ని గుర్తించిన గంగాదేవి రక్షించాలంటూ కేకలు వేసింది. దీంతో సమీపంలో ఉన్న కొందరు రైతులు హుటాహుటిన కాలువలో దూకి గాలించారు. అప్పటికే భువనేశ్వరి కాలువలో కనపడకుండా కొట్టుకుపోరుుంది. ఈ విషయుం గ్రావుంలో తెలియుడంతో బంధువులు, గ్రావుస్తులు కాలువ వెంబడి భువనేశ్వరి ఆచూకీ కోసం చూస్తున్నారు. అరుుతే కాలువలో నీటి ఉధృతికి భువనేశ్వరి వుృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కళ్ల ఎదుటే కన్న పేగు కొట్టుకుపోతుంటే కాపాడలేక గంగాదేవి తల్లడిల్లిపోరుుంది. గురప్పనాయుుడుకండ్రిగలోని అవ్ము ఇంటి వద్ద గంగాదేవిని ఎంతవుంది ఓదార్చినా ఆమె వేదనను ఆపలేకపోయూరు. ఆమె రోదన చూపరులను కలచి వేసింది. అవ్మువ్ము అంత్యక్రియులకు వచ్చి భువనేశ్వరి గల్లంతరుుందనే వార్తతో గురప్పనాయుుడుకండ్రిగలో విషాదం అలువుుకుంది. వుుందే హెచ్చరించిన ‘సాక్షి’ తెలుగుగంగ కాలువ వద్ద ప్రవూద సూచికలు లేవు. మెట్ల వద్ద స్నానాలు చేసేందుకు, దుస్తులు ఉతికేందుకు వెళుతున్న అవూయుకులు నీటిలో కొట్టుకుపోరుు ప్రాణాలు కోల్పోతున్నారని, నివారణ చర్యలు చేపట్టాలని ‘సాక్షి’లో పదే పదే కథనాలు ప్రచురించినా అధికారుల్లో ఎలాంటి చలనం కలగపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. ఈ నెల 5వ తేదీ ‘ఇంకా ఎంతవుంది గల్లంతుకావాలి ? అనే కథనం కూడా ప్రచురితమైంది. గడచిన నాలుగేళ్లలో సువూరు 42 వుందికి పైగా వుండలంలోని తెలుగుగంగ కాలువలో కొట్టుకుపోరుు వుృతి చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
శివ శివా ఎంత నిర్లక్ష్యం
నాడు గాలిగోపురం కూలింది నేడు మండపం కుంగింది కొబ్బరిచిప్పలు, నూనెడబ్బాలు పిచ్చిమొక్కలతో దెబ్బతిన్న ఆలయం స్తపతుల ఆదేశాలు సరే.. ఆచరణ మాటేంటో? శ్రీకాళహస్తి: గోపురం కూలినా, ఆలయపైకప్పు పెచ్చులూడి పడుతున్నా కాళహస్తీశ్వరాలయూధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్ల కిందట ఆలయగోపురమే కూలిపోగా, శుక్రవారం ఆల యంలో ఒకమండపం కుంగిపోయింది. ఆలయం పైభాగంలో పిచ్చిమొక్కలు మొలిచినా పట్టించుకోకపోవడం, నూనె డబ్బాలు, కొబ్బరిచిప్పలు ఎండబెట్టడం కారణంగా ఆలయగోడలు దెబ్బతింటున్నాయి. శ్రీకాళహస్తి దేవస్థానంతో పాటు పలు మండపాలు, గోపురాలు మరమ్మతులు చేయించాలని రెండేళ్ల క్రితమే అప్పటి రాష్ట్ర దేవాదాయశాఖ స్తపత్తులు వేలు, సుందరాజన్ పలుసార్లు ఆల యాన్ని పరిశీలించి ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. చిన్నపాటి వర్షాలకే ఆలయగోడలు తడి సి ముద్దవుతున్నాయి. పిచ్చిమొక్కల కారణంగా ఆలయ గోడలు పగుళ్లు వస్తున్నాయి. ఆలయ గాలిగోపురం 2010 మే 26వ తేదీ కుప్పకూలిపోయింది. నాలుగేళ్లు గడుస్తున్నా గోపురం పనులు పునాదులకే పరిమితమయ్యూయి. ఆ తరువాత ఆరు నెలల వ్యవధిలోనే కైలాసగిరి కొండల్లో వేయిలింగాల కోనలోని సహస్రలింగేశ్వరస్వామి ముఖద్వార గాలిగోపురం కుప్పకూలే దిశలో ఉందని స్థానికులు గుర్తించడంతో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజుల వ్యవధిలోనే జ్ఞానప్రసూనాంబ, భిక్షాలగోపురం పైభాగం నుంచి కలశరాళ్లు, ఆలయంలోపల దక్షిణామూర్తి పైభాగం నుంచి రాళ్లు, గురుదక్షిణామూర్తి వద్ద ఆలయ పైకప్పు పెచ్చులు ఊడిపడిన విషయం తెలిసిందే. అయినా అధికారులు ఆ సమయం లో మాత్రమే స్పందించడం.. .హంగామా చేయడం ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. తాజాగా అష్టోత్తరలింగం మండపం కుంగడం..కూలడానికి సిద్ధంగా ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. కుంభాభిషేకం చేయాలని భావిస్తున్నాం... ఆలయంలో త్వరలో కుంభాభిషేకం చేయాలని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయించాలని రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులకు తెలియజేశాం. వారు సానుకూలంగా స్పందిం చారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. -శ్రీనివాసరావు, ఆలయ ఈవో -
పట్టపగలే ఆభరణాల అపహరణ
షాపు తెరుస్తుండగా ఎత్తుకెళ్లిన దుండగులు చోరీ సొత్తు రూ.8 లక్షలు ఎస్.రాయవరం : మండల కేంద్రం ఎస్.రాయవరం బజారులో బుధవారం పట్టపగలే దుండగులు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ సంఘటనపై స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలివి. గ్రామంలోని బజారు షాపింగ్ కాంప్లెక్స్‌లో పర్సవేది వెంకటరమణ సాయి జ్యుయలరీ పేరిట బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం వెంకటరమణ షాపు తెరచేందకు వచ్చారు. తన చేతిలోని ఆభరణాల బ్యాగును పక్కనపెట్టి షట్టరు తెరచేందుకు ప్రయత్నించారు. ఇంతలో దొంగలు గుట్టుచప్పుడు కాకుండా బ్యాగును అపహరించుకు పోయారు. షాపు తెరచి వెంకటరమణ బ్యాగుని గమనించే సరికి బ్యాగు కనిపించలేదు. ఆ బ్యాగులో సుమారు రూ 8 లక్షలు విలువచేసే బంగార వస్తువులు, రూ 10 నగదు ఉన్నాయంటూ యజమాని లబోదిబోమన్నాడు. రోజూ షాపు మూసే ముందు విలువైన బంగారం నగలు బ్యాగులో సర్దుకుని ఇంటికి తీసుకెళ్లి, మర్నాడు ఉదయం షాపు తెరచేముందు షాపుకి తీసుకువస్తామని పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న యలమంచిలి సీఐ మళ్లేశ్వరరావు, నర్సీపట్నం ఏఎస్పీ సత్యేసుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ చోరీ మిస్టరీని ఛేదించి బాధితునికి న్యాయం చేస్తామని ఏఎస్పీ విలేకరులకు తెలిపారు. కాగా ఆభరణాల బ్యాగును ఎత్తుకెళ్లిన దుండగులు మోటారు సైకిల్‌పై పరారయినట్టు స్థానికులు చెబుతున్నారు. -
ఎందరో ఆపద్బాంధవులు!
తెల్లవారుజామునే మంటలు.. చుట్టుముడుతున్న అగ్ని కీలలు.. ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలి 16 మంది మరణించగా.. ఇంకా ఎంతోమంది ఆస్పత్రులలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దారుణ పరిస్థితుల్లో ఎంతోమంది ఉదారంగా ముందుకొచ్చారు. బూడిదకుప్పల నడుమ, మాంసపుముద్దల మధ్య నుంచి వెళ్తూ.. తమకు చేతనైనంత సాయం చేశారు. కూర్చున్నవాళ్లు కూర్చున్నట్లే మరణించినా, ఇంట్లో పడుకున్న తల్లీబిడ్డలు పడుకున్నట్లే ప్రాణాలు కోల్పోయినా.. అలాంటివాళ్ల మృతదేహాలను బయటకు తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక క్షతగాత్రుల పరిస్థితి మరీ దారుణం. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మాంసపు ముద్దల్లా పడి ఉన్న అనేకమందిని బయటకు తీసుకొచ్చి, వారిని ఆస్పత్రులకు తరలించడం కూడా కష్టమే. అక్కడున్న పోలీసు సిబ్బంది, వైద్యసిబ్బంది చాలా తక్కువమంది. అలాంటి తరుణంలో స్థానికులు మేమున్నామంటూ ముందుకొచ్చారు. పోలీసులకు, వైద్య సిబ్బందికి తమకు చేతనైన సాయం చేశారు. బాధితులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా.. తమంతట తాముగా ముందుకొచ్చి వారిని ఆస్పత్రులకు తరలించారు. తమ చేతులమీదుగా వారిని తీసుకొచ్చి, వీలైనంత వరకు కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. వీరి సేవలను పోలీసులు కూడా ప్రశంసించారు. స్థానికుల సాయం లేకపోతే తాము అంత త్వరగా బాధితులను తరలించలేకపోయేవారిమని డీఎస్పీ వీరారెడ్డి కూడా మీడియాతో అన్నారు. స్థానికులు ఫోన్ చేసి ఇక్కడ ప్రమాదం సంభవించిందని చెప్పినప్పుడు ముందుగా స్పందించినది డీఎస్పీ వీరారెడ్డే. ఆయన హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, బాధితులను కాపాడేందుకు ప్రయత్నించారు. -
అరవింద్‌కు కన్నీటి వీడ్కోలు
సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు పాల్గొన్న పలువురు ప్రముఖులు వనస్థలిపురం: హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి గోనూరు అరవింద్‌కుమార్ మృతదేహానికి బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య శుక్రవారం వనస్థలిపురం సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అరవింద్‌కుమార్ బియాస్ నదిలో కొట్టుకుపోయి గల్లంతై గురువారం మృతదేహంగా లభ్యమైన సంగతి తెలిసిందే. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి అరవింద్‌కుమార్ మృతదేహాన్ని విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చి అక్కడి నుంచి వనస్థలిపురంలోని నివాసానికి మధ్యాహ్నం 1.30 గంటలకు తీసుకువచ్చారు. అరవింద్‌కుమార్ మృతదేహం వస్తున్న విషయం తెలుసుకుని అప్పటికే బంధువులు, స్నేహితులు, స్థానికులు, నాయకులు వందలాదిగా అక్కడికి చేరుకున్నారు. మృతదేహం రావడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అరవింద్‌కుమార్ తల్లిదండ్రులు శశిలత, వినోద్‌కుమార్, తమ్ముళ్లు సంతోష్, అభిషేక్, తాత సంగప్ప, ఇతర కుటుంబసభ్యులు, తోటి స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం 2.30 గంటల సమయంలో అరవింద్‌కుమార్ మృతదేహాన్ని సాహెబ్‌నగర్ శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
ఫిరంగుల ప్రదర్శన
గుత్తి, న్యూస్‌లైన్: చరిత్రాత్మకమైన గుత్తి కోటలో అప్పటి పాలకులు వినియోగించిన ఫిరంగులను కొంత కాలం క్రితం స్థానికులు వెలికి తీశారు. వీటిపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిరంగులను వెలికితీసేందుకు కృషి చేసిన ట్రాన్స్‌కో సిబ్బంది, కోట పరిరక్షణ సమితి నాయకులు, ప్రజలను పూలమాలలతో అభినందించారు. ఈ సందర్భంగా కోట పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ ఫిరంగులకు కోట క్రింద భాగంలో ఉన్న సమాధుల వద్ద ఉంచి రక్షణ కల్పిస్తామని తెలిపారు.ర్యక్రమంలో కోట పరిరక్షణ సమితి నాయకులు జయరంగారెడ్డి,నాగేంద్ర ప్రసాద్,చిన్నా,108 శ్రీనా, రఫీ,ఆచారి పాల్గొన్నారు. -
స్వగ్రామం వారికే వీఆర్ఏ పోస్టు
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) ఉద్యోగాల భర్తీలో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం వీఆర్ఏ పోస్టుకు ఆ గ్రామవాసులే అర్హులవుతారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వీఆర్ఏ పోస్టులకు మండలంలోని ఏ గ్రామస్తులైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇతర గ్రామాలవారు వీఆర్ఏలుగా నియమితులైతే గ్రామం గురించి పూర్తి సమాచారం తెలియదనే భావంతో రెవెన్యూ శాఖ ఈ సవరణ చేసింది. ఈ నెలాఖరులోపు వీఆర్ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నియామకాల్లో సవరణ చేసినందుకు తెలంగాణ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు శివశంకర్, ఆంధ్రా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.