స్వగ్రామం వారికే వీఆర్‌ఏ పోస్టు | Only locals Qualifiers for VRA Posts | Sakshi
Sakshi News home page

స్వగ్రామం వారికే వీఆర్‌ఏ పోస్టు

Published Sat, Dec 21 2013 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

Only locals Qualifiers for VRA Posts

 సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) ఉద్యోగాల భర్తీలో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం వీఆర్‌ఏ పోస్టుకు ఆ గ్రామవాసులే అర్హులవుతారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వీఆర్‌ఏ పోస్టులకు మండలంలోని ఏ గ్రామస్తులైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇతర గ్రామాలవారు వీఆర్‌ఏలుగా నియమితులైతే గ్రామం గురించి పూర్తి సమాచారం తెలియదనే భావంతో రెవెన్యూ శాఖ ఈ సవరణ చేసింది. ఈ నెలాఖరులోపు వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నియామకాల్లో సవరణ చేసినందుకు తెలంగాణ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు శివశంకర్, ఆంధ్రా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement