VRA Post
-
మనుగొండలో కుల బహిష్కరణ
ఆత్మకూరు(పరకాల): వీఆర్ఏ కొలువు విషయంలో నెలకొన్న వివాదం ఓ దళిత కుటుంబం కుల బహిష్కరణకు దారితీసింది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన తుప్పరి సమ్మయ్య కొంత కాలంగా కుల పరంగా వీఆర్ఏగా విధులు నిర్వర్తి స్తున్నాడు. గతంలో ఏటా అదే కులంలోని ఒకరు ఈ విధులు నిర్వర్తించేవారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎవరు ఆ విధుల్లో ఉంటే వారికే ఆ ఉద్యోగం వచ్చింది. దీంతో వీఆర్ఏ ఉద్యోగం విషయమై గొడవలు మొదలయ్యాయి. సమ్మయ్యతోపాటు అతడి భార్య యశోద, కూతురు పవిత్ర, కుమారుడు ఉదయ్‌శంకర్‌ను సదరు కులం పెద్దలు శనివారం బహిష్కరించారు. వారితో ఎవరైనా మాట్లాడితే రూ.500 జరిమానా విధిస్తామని తీర్మానించారు. ‘తమను హోటళ్లకు కూడా వెళ్లనీయడం లేదు.. కుల పెద్దలు తమను గతం నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. గతంలో తమ చేలను ధ్వంసం చేశారు.. పెళ్లిళ్లు.. చావులకు రానీయడం లేదు.. పొదుపు సంఘం నుంచి తొలగించారు..’అంటూ బాధిత కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. -
వీఆర్వో పోస్టులకు 13 లక్షల దరఖాస్తులు
1,650 పోస్టులు.. 13 లక్షల దరఖాస్తులు వీఆర్ఏలకు 62,277 మంది దరఖాస్తు వచ్చే నెల 2న రాత పరీక్షలు సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఈ పోస్టులకు దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసింది. ఈ పోస్టులకు 14,51,728 లక్షల మంది ఫీజు చెల్లించగా.. 14,08,998 మంది దరఖాస్తులను సమర్పించారు. 1,650 వీఆర్వో, 4,305 వీఆర్ఏ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 1,650 వీఆర్వో పోస్టులకు 13,08,916 మంది.. 4,305 వీఆర్ఏ పోస్టులకు 62,277 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో డిగ్రీ, పీజీలు చేసిన వారు ఎక్కువగానే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పోస్టులకు ఫిబ్రవరి 2న రాత పరీక్షలు నిర్వహించ నున్నారు. 2వ తేదీ ఉదయం వీఆర్వోలకు, మధ్యాహ్నం వీఆర్ఏలకు పరీక్షలు జరగనున్నాయి. కాగా, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. -
నిరుద్యోగులకు శుభవార్త
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు జరగకపోవచ్చని భావించినా స్థానికులతో భర్తీ చేయబడే రెవెన్యూ శాఖలోని వీఆర్ఏ, వీఆర్వో పోస్టులకు మాత్రం దీని నుంచి మి నహాయిస్తూ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి శనివారం హైదరాబాద్‌లో పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గు ర్తించకున్నా ప్రభుత్వ విధివిధానాల ప్రకార మే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వీఆర్వో 58, వీఆర్ఏ 83 పోస్టులు.. ఏడాది కిందట జిల్లాలో భర్తీ చేసిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా జిల్లాలో 58 వీఆ ర్వో, 83 వీఆర్ఏ పోస్టులను నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. రా ష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో ఆరువేల పో స్టులను భర్తీ చేయనుండగా అందులో వీఆ ర్వో 1657, వీఆర్ఏ 4305 పోస్టులు ఉన్నా యి. వీఆర్వోకు ఇంటర్మీడియెట్, వీఆర్ఏకు ఎస్సెస్సీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈనెల 28న కలెక్టర్‌తో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యా ప్తంగా ఏకకాలంలో ఈ నియామకాలను చే పట్టనున్నారు. జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ ఫీజు చెల్లింపు, 13 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న ట్లు సమాచారం. ఫిబ్రవరి 2న రాత పరీక్ష, 20న ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. -
స్వగ్రామం వారికే వీఆర్ఏ పోస్టు
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) ఉద్యోగాల భర్తీలో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం వీఆర్ఏ పోస్టుకు ఆ గ్రామవాసులే అర్హులవుతారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వీఆర్ఏ పోస్టులకు మండలంలోని ఏ గ్రామస్తులైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇతర గ్రామాలవారు వీఆర్ఏలుగా నియమితులైతే గ్రామం గురించి పూర్తి సమాచారం తెలియదనే భావంతో రెవెన్యూ శాఖ ఈ సవరణ చేసింది. ఈ నెలాఖరులోపు వీఆర్ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నియామకాల్లో సవరణ చేసినందుకు తెలంగాణ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు శివశంకర్, ఆంధ్రా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.