ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు జరగకపోవచ్చని భావించినా స్థానికులతో భర్తీ చేయబడే రెవెన్యూ శాఖలోని వీఆర్‌ఏ, వీఆర్వో పోస్టులకు మాత్రం దీని నుంచి మి నహాయిస్తూ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి శనివారం హైదరాబాద్‌లో పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గు ర్తించకున్నా ప్రభుత్వ విధివిధానాల ప్రకార మే ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
వీఆర్వో 58, వీఆర్‌ఏ 83 పోస్టులు..
ఏడాది కిందట జిల్లాలో భర్తీ చేసిన వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా జిల్లాలో 58 వీఆ ర్వో, 83 వీఆర్‌ఏ పోస్టులను నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. రా ష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో ఆరువేల పో స్టులను భర్తీ చేయనుండగా అందులో వీఆ ర్వో 1657, వీఆర్‌ఏ 4305 పోస్టులు ఉన్నా యి. వీఆర్వోకు ఇంటర్మీడియెట్, వీఆర్‌ఏకు ఎస్సెస్సీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈనెల 28న కలెక్టర్‌తో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యా ప్తంగా ఏకకాలంలో ఈ నియామకాలను చే పట్టనున్నారు. జనవరి 12వ తేదీ వరకు ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న ట్లు సమాచారం. ఫిబ్రవరి 2న రాత పరీక్ష, 20న ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
నిరుద్యోగులకు శుభవార్త
Published Sun, Dec 22 2013 3:20 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement