
బెంగళూరు: కశ్మీర్ గొడవల్లో చనిపోయిన జవాన్లు, స్థానికులు, ఉగ్రవాదుల కుటుంబాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ శుక్రవారం ఒక్కచోటుకు చేర్చారు. పైగామ్–ఎ–మొహబ్బత్ (ప్రేమ సందేశం) పేరుతో ఆయన బెంగళూరులో ఓ కార్యక్రమం నిర్వహించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సాంత్వన కలిగించేందుకు, వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి దాదాపు 200 బాధిత కుటుంబాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ప్రియమైన వారిని పోగొట్టుకున్న వీరి హృదయాలు బాధను అనుభవిస్తుంటాయనీ, ఓదార్చి గాయాలను మాన్పకపోతే వీరూ హింసా మార్గంలో వెళ్లే వీలుందని రవిశంకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment