Compromise
-
లైంగిక వేధింపుల కేసు.. రాజీ కుదుర్చుకున్నా రద్దు చేయలేం: సుప్రీం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు గురువారం కీల కీలకతీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో ఫిర్యాదుదారుల కుటుంబంతో నిందితుడు రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది. ఈ కేసులోనిందితుడికి ఉపశమనం కలిగిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం కొట్టివేసింది. 2022లో జస్థాన్‌లోని గంగాపూర్ నగరంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్ బాలిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) కేసులు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడు విమల్ కుమార్ గుప్తా స్టాంప్ పేపర్‌పై బాలిక కుటుంబం నుంచి ఓ వాంగ్మూలాన్ని తెచ్చాడు.అందులో తాము నిందితుడిని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇకపై ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని బాధిత కుటుంబం పేర్కొన్నట్టుగా ఉంది. పోలీసులు దీనిని అంగీకరించి కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే కింది కోర్టు ఈ చర్యను తోసిపుచ్చింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధిత కుటుంబం వాంగ్మూలాన్ని అంగీకరించిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని పోలీసులను ఆదేశించింది.అయితే హైకోర్టు తీర్పును రామ్‌జీ లాల్ బైర్వా అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు గమనించిన జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది. రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును రద్దు చేయలేమని స్పష్టం చేసింది.అలాగే ఈ కేసును తిరిగి విచారించాలని ఆదేశించింది. -
'రాజీకి రావాలని మాపై ఒత్తిడి ఉంది'.. రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు..
ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణల కేసులో నిరసనలు కొనసాగిస్తున్న తమపై తీవ్రమైన ఒత్తిడి ఉందని రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పారు. రాజీకి రావాలని నిందితుని మనుషులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదును వెనుకకు తీసుకోవాలని ఒత్తిడి చేసినందునే మైనర్ రెజ్లర్ తండ్రి మాట మార్చారని అన్నారు. 'నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేయించాలని మొదటి నుంచి మేం కోరుతున్నాం.. బయట ఉండడం వల్ల కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు' అని ఆమె ఆరోపించారు. బ్రిజ్ భూషణ్‌పై చేసింది తప్పుడు ఫిర్యాదని బాధిత మైనర్ రెజ్లర్ తండ్రి మీడియాకు తెలిపడంతో అంతా అవాక్కయ్యారు. 2022లో అండర్-17 ఛాంపియన్షిప్ ట్రయల్స్ ఫైనల్స్‌లో తన కూతురు ఓడిపోయిందని తెలిపారు. ఆ పోటీలో తన కూతురు ఓటమికి కారణమైన రెఫరీని డబ్ల్యూఎఫ్ డిప్యూటేషన్ మీద పంపించిందని, దాని అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కాబట్టే ఆయనపై కోపంతో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను ఎలాగైనా ఆ సీటు నుంచి దించే ఉద్దేశంతో నిరసనలు కొనసాగిస్తున్న రెజ్లర్లు.. కేంద్రం నుంచి లభించిన హామీతో ఓ మెట్టు దిగారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో సమావేశమైన అనంతరం జూన్ 15వ తేదీ దాకా ఆందోళనలను చేపట్టబోమని ప్రకటించారు. అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. అలా అయితే.. ఆసియా గేమ్స్ ఆడబోము.. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణల కేసులో తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ ఏడాది వచ్చే ఆసియా గేమ్స్ ఆడబోమని రెజ్లర్లు అల్టిమేటం జారీ చేశారు.ప్రతిరోజూ మానసికంగా తాము వేదనను అనుభవిస్తున్నామని తెలిపారు. హరియాణాలోని సోనిపట్‌లో ఈ రోజు నిర్వహించిన కాప్ పంచాయత్‌లో టాప్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో రెజ్లర్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఐదు డిమాండ్లను వారు కోరారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలను స్వతంత్రగా నిర్వహించాలని, బ్రిజ్ కుటుంబ సభ్యులెవరూ అందులో పాల్గొనకుండా చూడాలని కేంద్రాన్ని రెజ్లర్లు కోరినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తమపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను వాళ్లు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహిళా రెజ్లర్ల భద్రతను ప్రధానాంశంగా పరిగణిస్తామని, అలాగే.. వాళ్లపై ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకుంటామని మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం చర్చల సారాంశాన్ని మీడియాకు తెలిపారు. అయితే.. బ్రిజ్ అరెస్ట్‌పై మాత్రం ఇరువర్గాలు స్పందించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి:రెజ్లర్ల పోరాటానికి ఊహించని షాక్.. అసలు నిజం ఇదేనా? -
వెనక్కి తగ్గేదేలే! రాజీపడం అంటున్న తైవాన్.... చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్
తైపీ: బీజింగ్‌లో ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్‌పై బలప్రయోగాన్ని ఎప్పటికి వదులుకోమని కరాఖండిగా చెప్పారు. అలాగే హాంకాంగ్‌పై పట్టు సాధించి నియంత్రణలోకి తెచ్చుకున్నామని తర్వాత తైవానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తైవాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. తన సార్వభౌమాధికారం, స్వేచ్ఛపై రాజీపడేదే లేదని, వెనక్కి తగ్గమని తెగేసీ చెప్పింది తైవాన్. ఈ మేరకు తైవాన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి స్థిరత్వాన్ని కాపాడుకోవటం ఇరుపక్షాల భాద్యత అని నొక్కిచెప్పింది. యుద్ధం ఒక్కటే ఆప్షన్ కాదని తేల్చి చెప్పింది. తైవాన్‌లో సుమారు 23 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, వారికి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. అలాగే తాము బీజింగ్ ఏకపక్ష నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని తెగేసి చెప్పింది. వాస్తవానికి 2016లో ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ తొలిసారిగా ఎన్నికైనప్పటి నుంచి చైనాతో ఉన్న సంబంధాలను కట్టడి చేసింది. రాజీకీయాలతో దిగ్బంధం చేసి సైనిక బలగాలతో బలవంతంగా అధీనంలోకి తెచ్చుకోవాలనే కుట్రలను విడిచిపెట్టాలని చైనీస్ కమ్యూనిస్ట్ అధికారులకు పిలుపినిచ్చింది తైవాన్. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్ విషయంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయని, తైవాన్‌ని స్వతంత్ర దేశంలా ఉంచే క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ ఆరోపణలు చేశారు. పైగా శాంతియుత పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తాం కానీ యుద్ధం చేయమని హామీ ఇవ్వం అని చెప్పారు. (చదవండి: హాంకాంగ్‌పై నియంత్రణ సాధించాం.. తర్వాత తైవానే.. జిన్‌పింగ్ కీలక ప్రకటన) -
Russia-Ukraine war: డోన్బాస్‌పై రాజీకి రెడీ
లివీవ్: యుద్ధానికి తెర దించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఉక్రెయిన్ కీలక ప్రతిపాదనలు చేసింది. ఆయన డిమాండ్ చేస్తున్నట్టు ఉక్రెయిన్ను తటస్థ దేశంగా ప్రకటించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. అంతేగాక ఎనిమిదేళ్లుగా రష్యా అనుకూల వేర్పాటువాదుల అధీనంలో ఉన్న తూర్పు ప్రాంతం డోన్బాస్ హోదాపై రాజీకి కూడా సిద్ధమన్నారు. ‘‘రష్యా సేనలు మా దేశాన్ని పూర్తిగా వీడటం అసాధ్యమని అర్థమైంది. అందుకే అవి వెనక్కు తగ్గి డోన్బాస్కు పరిమితం కావాలి’’ అని కోరారు. తద్వారా, ఆ ప్రాంతాన్ని రష్యాకు వదులుకుంటామనే సంకేతాలిచ్చారు. తక్షణం యుద్ధం ఆపి శాంతిని నెలకొల్పితే పుతిన్ కోరుతున్నట్టుగా అణ్వస్త్రరహిత దేశ హోదాకు ఒప్పుకోవడంతో పాటు ఇతర భద్రతా హామీలు కూడా ఇస్తామన్నారు. యుద్ధం ముగిశాక ఈ డిమాండ్లపై రిఫరెండం నిర్వహించి జనాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామంటూ ముక్తాయించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మంగళవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్ర రష్యా మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్, తాను ముఖాముఖీ చర్చిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. నాటోలో చేరొద్దన్న డిమాండ్‌కు అంగీకరిస్తామని జెలెన్స్కీ ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కీలకాంశాలన్నింటి మీదా ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే పుతిన్–జెలెన్స్కీ భేటీ సాధ్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ పునరుద్ఘాటించారు. నిలిచిన రష్యా దళాలు రష్యా దళాలు గత 24 గంటల్లో ఉక్రెయిన్‌లో ఏ ప్రాంతంలోనూ పెద్దగా ముందుకు చొచ్చుకుపోలేదు. ఆహారం, ఇంధనం తదితర నిత్యావసరాల తీవ్ర కొరత, అతిశీతల పరిస్థితులు, ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటనతో ఎక్కడివక్కడే రక్షణాత్మక పొజిషన్లలో ఉండిపోయినట్టు ఇంగ్లండ్ పేర్కొంది. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా దళాలను చాలావరకు డోన్బాస్ కేసి మళ్లిస్తున్నట్టు ఆ దేశ అత్యున్నత సైనికాధికారి ఒకరు చెప్పారు. రష్యాపై యుద్ధనేరాల ఆరోపణలను విచారించేందుకు సంయుక్త విచారణ బృందం ఏర్పాటుకు పోలండ్, లిథువేనియా, ఉక్రెయిన్లకు సాయపడ్డట్టు యూరోపియన్ యూని యన్ సమన్వయ సమితి యూరోజస్ట్ పేర్కొంది. మరోవైపు పుతిన్ ఇంకెంతమాత్రమూ అధికారంలో ఉండొద్దన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్నట్టు రష్యా పేర్కొంది. రూబుల్ చెల్లింపులు చేయం: జీ7 గ్యాస్ ఎగుమతుల చెల్లింపులను రూబుల్స్‌లోనే చేయాలన్న రష్యా డిమాండ్‌ను తిరస్కరించాలని జీ7 బృందం నిర్ణయించినట్టు జర్మనీ ఇంధన మంత్రి రాబర్ట్ హెబక్ ప్రకటించారు. ‘‘ఇది ఒప్పందాలకు విరుద్ధం. మాకెవరికీ అంగీకారయోగ్యం కాదు’’ అని చెప్పారు. నెదర్లాండ్స్‌కు చెందిన బ్రూవరీ దిగ్గజం హెన్‌కెన్ కూడా రష్యా నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. రష్యాపై ఆంక్షలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చైనా మరోసారి చెప్పింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ వచ్చే వారం భారత్‌లో పర్యటించే అవకాశముంది. భారత్‌కు సరఫరా చేస్తున్న ఇంధనానికి, మిలటరీ హార్డ్‌వేర్‌కు చెల్లింపులు రష్యా కరెన్సీ రూబుల్స్‌లో చేయాలని ఈ సందర్భంగా కోరవచ్చంటున్నారు. ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ కూడా గురువారం భారత్ రానున్నారు. -
అపార్ట్మెంట్ న్యూసెన్స్ కేసు : నిహారిక భర్త చైతన్య క్లారిటీ
Niharika Husband Chaitanya Clarity On Case Filed: షేక్‌పేట్‌లోని అపార్ట్మెంట్ వాసులతో జరిగిన వివాదంపై నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య క్లారిటీ ఇచ్చారు. అపార్ట్మెంట్ వాసులు గొడవ చేయడం వల్లే పీఎస్‌లో ఫిర్యాదు చేశానని తెలిపిన చైతన్య.. అందరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిపారు. అయితే ముందు తనమీదే కేసు నమోదైనట్లు వార్తలు రావడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఆగస్టు 10లోగా ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు ముందే ఓనర్‌కి చెప్పినట్లు పేర్కొన్నారు. 'ఫ్లాట్ తీసుకున్నప్పుడే ఆఫీస్ పర్పస్ కోసమని ఓనర్‌కి చెప్పాం, అయితే అపార్ట్మెంట్ అసోసియయేషన్‌కు క్లారిటీ లేకపోవడంతో వాదనకు దిగారు' అని చైతన్య గొడవపై వివరణ ఇచ్చారు. ఇక ఇదే విషయంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్‌ను నిహారిక దంపతులు కమర్షియల్‌గా వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆఫీస్ కోసమని ఫ్లాట్ తీసుకున్న విషయం తమకు తెలియదని, దీంతో వాదన జరిగినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు అందరం కలిసి సమస్యను పరిష్కరించుకున్నామని వివరించారు. కాగా చైతన్య అర్ధరాత్రిపూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న చైతన్య అక్కడే ఆఫీస్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడట. గత కొన్ని రోజులుగా ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని, వారు మద్యం తాగి నానా హంగామా సృష్టిస్తున్నట్లు అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వాసులపై కూడా చైతన్య తిరిగి ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్మెంట్ వాసులు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరువురి వాదనలు విన్న పోలీసులు విచారణ జరిపి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.కాగా చైతన్య జొన్నలగడ్డతో నిహారిక కొణిదెల వివాహం డిసెంబర్ 9న ఉదై విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. -
'నాగచైతన్యతో గొడవలు'.. సీక్రెట్స్ బయటపెట్టేసిన సమంత!
ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటుంది. ప్రస్తుతం సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సీరీస్‌లో నటిస్తుంది. త్వరలోనే ఈ సీరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా షరవేగంగా ప్రమోషన్లలో పాల్గొంటుంది. రీసెంట్గా అభిమానులతో ముచ్చటించిన సమంత తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ప్రతి వ్యక్తికి తన ఇష్టాలేంటో తెలుసుకోవడం చాలా అవసరమని చెప్పిన సమంత..ముందు తమను తాము ప్రేమించుకున్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడపగలమని చెబుతుంది. ఇక తన విషయానికి వస్తే నవ్వు, కళ్లు, తన శరీర బలం అంటే తనకు చాలా ఇష్టమని, ఈ మూడు లక్షణాలు తనకు బాగా నచ్చుతాయి అని సమంత పేర్కొంది. ప్రస్తుతం కరోనా సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో దృడంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందుకే ప్రతి రోజు ఓ గంట సమయాన్ని వ్యాయామం లేదా యోగాకు కేటాయించాలని దాని వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలమని పేర్కొంది. ఇక తన భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని.. అయితే ప్రతిసారి మొదట కాంప్రమైజ్ అయ్యేది మాత్రం తానే అని బయటపెట్టేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం సినిమా చేస్తోండగా, నాగ చైనత్య థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా చిత్రాల్లో నటిస్తున్నారు. చదవండి : ఆ హీరోతో నటించాలనుంది : సమంత ఆకాశంలోకి చూస్తూ బన్నీ పిల్లలకి ఏం చెబుతున్నారో చూడండి.. -
నగ్నచిత్రాల కేసులో ఇరుపక్షాల రాజీ!
తెనాలి రూరల్: తనతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి తన కుమార్తె స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో చిత్రీకరించాడని పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన మహిళ రూరల్ ఎస్పీకి స్పందన కార్యక్రమంలో సోమవారం ఫిర్యాదు చేసింది. కేసు తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఎస్పీ కార్యాలయం పంపగా, ఫిర్యాది, నిందితుడిని పోలీసు అధికారులు పిలిపించి మాట్లాడారు. ఇరు పక్షాలు రాజీ పడినట్టు తెలిసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకోకుండానే కూతురితో కలసి అప్పటికే వివాహమై పిల్లలు ఉన్న వ్యక్తితో 2009 నుంచి సహజీవనం చేస్తోంది. సదరు వ్యక్తి కూడా భార్య నుంచి విడాకులు పొందలేదు. మహిళ కుమార్తె, తన కుమార్తెను అతనే బీటెక్ చదివించాడు. ఇరువురు కుమార్తెల పెంపకం విషయంలో ఘర్షణలు జరుగుతున్నాయి. అప్పటి వరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివశించిన వీరు మూడేళ్ల క్రితం త్రీ టౌన్ పరిధిలోని ఇందిరా కాలనీకి వచ్చారు. ఇరువురి మధ్య వివాదం నడుస్తున్న క్రమంలో తన కుమార్తె స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడంటూ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే సీఐ బి.హరికృష్ణ ఇరువురినీ పిలిపించి మాట్లాడారు. ఇరు పక్షాలు రాజీ అయ్యాయని, కేసు ఉద్దేశపూర్వకంగానే పెట్టినట్టు భావిస్తున్నామని సీఐ వివరించారు. -
అగ్గితెగులును అడ్డుకునేందుకు కొత్త మార్గం...
వరిపంటకు అగ్గితెగులు సోకితే పంట సగానికిపైగా నష్టపోవాల్సిందే. కీటకనాశినులకూ ఒకపట్టాన లొంగని ఈ తెగులు వ్యాప్తికి చెక్ పెట్టేందుకు యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ శాస్త్రవేత్తలు సరికొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. తెగులుకు కారణమైన శిలీంధ్రంలో కేవలం ఒక్క ప్రొటీన్ ఉత్పత్తిని నిలిపివేస్తే దీన్ని సమర్థంగా అడ్డుకోవచ్చునని వీరు గుర్తించారు. ప్రపంచంలో మూడొంతుల మందికి వరి కీలకమైన ఆహారమైన విషయం తెలిసిందే. ఈ తెగులు కారణంగా ఏటా దాదాపు ఆరు కోట్ల మంది కడుపు నింపగల వరి నాశనమవుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలోనే తాము దీనిపై పరిశోధనలు చేపట్టామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నిక్ టాల్బోట్ అంటున్నారు. అగ్గి తెగులుకు కారణమైన శిలీంధ్రం వరి మొక్కల కణాలను ఎలా నియంత్రిస్తోందో.. తద్వారా మొక్క కణాల మధ్య ఎలా నివసించగలుగుతోందో తాము తెలుసుకోగలిగామని ఆయన చెప్పారు. ఇదంతా కేవలం పీఎంకే1 అనే ఒకే ఒక్క ప్రొటీన్‌తోనే సాధ్యమవుతోందని అన్నారు. రసాయన పద్ధతుల ద్వారా ఈ ప్రొటీన్ ఉత్పత్తిని నిలిపివేసి శిలీంధ్రాన్ని ఒక్క కణంలోకి పరిమితం చేయగలిగారు శాస్త్రవేత్తలు. తమ పరిశోధన ఫలితంగా తెగులును అరికట్టేందుకు కొత్తకొత్త మార్గాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు నిక్ టాల్బోట్! -
కశ్మీర్ బాధిత కుటుంబాలతో రవిశంకర్ భేటీ
బెంగళూరు: కశ్మీర్ గొడవల్లో చనిపోయిన జవాన్లు, స్థానికులు, ఉగ్రవాదుల కుటుంబాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ శుక్రవారం ఒక్కచోటుకు చేర్చారు. పైగామ్–ఎ–మొహబ్బత్ (ప్రేమ సందేశం) పేరుతో ఆయన బెంగళూరులో ఓ కార్యక్రమం నిర్వహించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సాంత్వన కలిగించేందుకు, వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి దాదాపు 200 బాధిత కుటుంబాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ప్రియమైన వారిని పోగొట్టుకున్న వీరి హృదయాలు బాధను అనుభవిస్తుంటాయనీ, ఓదార్చి గాయాలను మాన్పకపోతే వీరూ హింసా మార్గంలో వెళ్లే వీలుందని రవిశంకర్ అన్నారు. -
రాజీ మార్గమే రాజ మార్గం
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమా చక్రవర్తి డోన్ టౌన్: రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమా చక్రవర్తి అన్నారు. డోన్ మున్సిఫ్ కోర్టులో పోలీస్, రెవెన్యూ అధికారులతో ఆమె మంగళవారం సమావేశమయ్యారు. వచ్చే నెల 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్మయంతో కృషిచేయాలన్నారు. కక్షిదారులను రాజీకి ఒప్పించి వాటి వల్ల వనకూరే ప్రయోజనాల గురించి వివరించాలన్నారు. మున్సిఫ్ కోర్టు మెజిస్ట్రేట్లు కరిముల్లా, సూరికృష్ణ, డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులు గౌడ్, తహసీల్దార్ మునికృష్ణయ్య, ఎస్ఐలు శ్రీనివాసులు, జయశేఖర్, రామసుబ్బయ్య పాల్గొన్నారు. -
రాజీ తప్పలేదట!
‘‘ఒక్క ఛాన్స్ కావాలా? అయితే ‘అడ్జస్ట్’ అవ్వాలి. రాజీపడటానికి రెడీగా ఉండాలి’’... ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి కాలు బయటపెట్టే మహిళల్లో చాలామందికి ఎదురయ్యే స్థితి ఇది. సినిమా పరిశ్రమలో ఈ పరిస్థితి కొంచెం ఎక్కువ ఉంటుందని చాలామంది అంటుంటారు. ఈ విషయం గురించి ఇటీవల కొంతమంది కథానాయికలు నిర్భయంగా మాట్లాడారు కూడా. వాళ్లల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. కథానాయికల ‘కాంప్రమైజ్’ గురించి మీరేం చెబుతారు? మీకలాంటి పరిస్థితి ఎదురైందా? అనే ప్రశ్న కాజల్ అగర్వాల్ ముందుంచితే – ‘‘నిజానికి నాకలాంటి సిచ్యుయేషన్ ఎదురు కాలేదు. అయితే దాని గురించి విన్నాను. కొంతమంది హీరోయిన్లు తమకు ప్రతిభ ఉండి కూడా అవకాశాల కోసం ఎలా రాజీపడాల్సి వచ్చిందో చెప్పారు. అది బాధాకరం’’ అన్నారు. పాటల్లో కథానాయికలను అభ్యంతరకరంగా చూపించే విషయం గురించి ప్రస్తావిస్తే – ‘‘ఇది నాక్కూడా జరిగింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకేం తెలిసేది కాదు. అందుకని అభ్యంతరకరంగా ఉండే దృశ్యాలు చేశాను. ఆ తర్వాత తప్పు తెలుసుకున్నాను. ఇక ఆ దారిలో వెళ్లకూడదని ఫిక్సయ్యాను. అప్పటి నుంచి పాత్రలను చాలా కేర్‌ఫుల్‌గా ఎంపిక చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఉన్న ఈ స్థాయి నాకు చాలా ఆనందంగా, సౌకర్యవంతంగా ఉంది. నాకేం నచ్చిందో అది చేసే హక్కు నాకుంది. ఎవరో కోసం రాజీపడటంలో అర్థం లేదని తెలుసుకున్నాను’’ అని కాజల్ అన్నారు. -
రాజీ పడితే మంచిది!
ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్. చటుక్కున తినేయాలి.. చిటుక్కున పనుల్లో పడిపోవాలి. అంతా వేగం. బంధాలకు ప్రాధాన్యం ఇవ్వలేనంత బిజీ బిజీగా కొంతమంది ఉంటున్నారు. త్వరగా స్నేహం చేయడం... త్వరగా విడిపోవడం, ఈజీగా లవ్‌లో పడటం... అంతే సులువుగా విడిపోవడం, ఇష్టపడి పెళ్లాడటం... చిన్ని చిన్ని మనస్పర్థలకే విడిపోవడం... మొత్తం మీద బంధాలకు విలువ లేకుండాపోతోంది. బంధాల గురించి ఇంత లెక్చరర్ దేనికీ అనుకుంటున్నారా? ‘రిలేషన్షిప్స్’ గురించి శ్రుతీహాసన్ ఓ మంచి మాట చెప్పారు. అందుకే అన్నమాట. శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తమే. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే జీవితం బాగుంటుంది. ముఖ్యంగా బంధాలను కాపాడుకోవాల్సిన విషయంలో రాజీ పడాల్సిందే. అక్కడ లేనిపోని గొప్పలకు పోతే ఆ బంధం తెగిపోతుంది. ఒకప్పుడు స్నేహంలో అయినా, వివాహ బంధంలో అయినా రాజీ అనేది ఉండేది. సర్దుకుపోయేవాళ్లు. ఇప్పుడలా ఇష్టపడటంలేదు. రాజీపడటం తగ్గింది కాబట్టి.. విడిపోవడాలు ఎక్కువైపోయాయి. చిన్నపాటి రాజీవల్ల ఓ బంధం నిలబడుతుందనుకున్నప్పుడు సర్దుకుపోవాలి. ఒకవేళ ఆ బంధం వల్ల జీవితాంతం ఇబ్బందులపాలు కావల్సి వస్తుందనిపిస్తే అప్పుడు రాజీ పడకూడదు’’ అని అన్నారు. -
కత్తులు వదిలేసి.. చేతులు కలిపి
– లోక్‌అదాలత్‌లో దుర్వేశి, చిందుకూరు ఫ్యాక్షన్ నేతలు రాజీ – ప్రమాణం చేయించిన డీఎస్పీ – పోలీస్, న్యాయమూర్తుల చొరవ నంద్యాల: దశాబ్దాలుగా పగ, ప్రతీకారాలతో జీవితాలను నాశనం చేసుకున్నారు. ముఠాల పోరులో కొందరు బలి కాగా.. మరికొందరు జైలు పాలయ్యారు. చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. ఫ్యాక్షన్‌తో జీవితాలు నాశనమవుతాయే కాని సాధించిందేమీ లేదని తెలుసుకున్న ముఠా నేతలు రాజీ పడ్డారు. కత్తులను పక్కకు విసిరేసి, చేతులు కలిపారు. ఇకపై చంపుకోవడం, నరుక్కోవడం వద్దని ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా జడ్జి మోహన్‌రావు, డీఎస్పీ హరినాథరెడ్డి, న్యాయమూర్తులు పోలీసు అధికారి సమక్షంలో గడివేముల మండలంలోని ఫ్యాక్షన్ గ్రామాలైన చిందుకూరు, దుర్వేశి గ్రామాల్లోని ఇరువర్గీయులు రాజీపడ్డారు. ఇకపై ఎలాంటి పగ, ప్రతీకారాలకు వెళ్లకుండా ప్రశాంత జీవితాన్ని గడుపుతామని ప్రతిజ్ఞ చేశారు. గడివేముల మండలం చిందుకూరులో గతంలో సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉండేవి. గడివేములలో ఒక రెవెన్యూ అధికారి ఇంట్లో ఉన్న వెంకటేశ్వరరెడ్డిపై వెంకటకృష్ణారెడ్డి వర్గం దాడి చేసి హత్య చేసినట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. ఈ హత్య జరిగిన వెంటనే గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటంతో వెంకటకృష్ణారెడ్డి వర్గానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. వెంకటేశ్వరరెడ్డి హత్యా అనంతరం ఆయన భార్య అనసూయమ్మ రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీటీసీగా గెలిచారు. తర్వాత ఈమె వర్గీయులు దారి కాచి వెంకటకృష్ణారెడ్డి వర్గానికి చెందిన నలుగురిని హత్య చేశారు. వెంకటేశ్వరరెడ్డి హత్య కేసును కోర్టు కొట్టి వేసింది. కాని తనదనంతరం జరిగిన హత్య కేసుల్లో కొంత మంది నిందితులు జీవిత ఖైదు శి„క్షను కూడా అనుభవించి, బయటకు వచ్చారు. దుర్వేశి గ్రామంలో గతంలో సర్పంచ్ శివారెడ్డిని నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ జంక్షన్ సమీపంలో ప్రత్యర్థులైన దుర్వేశి గొల్ల కృష్ణుడు వర్గీయులు హత్య చేశారు. దీని ప్రతీకారంగా శివారెడ్డి వర్గీయులు జరిపిన ప్రతీకార దాడుల్లో 8 మంది హత్యకు గురయ్యారు. ఈ కేసుల్లో కూడా కొంత మంది శిక్షను అనుభవించారు. పోలీసు, న్యాయమూర్తుల సమక్షంలో రాజీ: ఫ్యాక్షన్‌తో అయిన వారికి దూరమై, జైలు పాలై కొంత మంది నరకాన్ని ప్రత్యక్షంగా చూశారు. మరికొందరు ఆర్థికంగా చితికి పోయి, పేదరికం కష్టాలను అనుభవిస్తున్నారు. దీంతో దుర్వేశి గ్రామానికి చెందిన ప్రత్యర్థులు గొల్ల కృష్ణుడు, దామోదర్‌రెడ్డి వర్గీయులు కొందరు చిందుకూరు గ్రామంలోని అనసూయమ్మ, వెంకటకృష్ణారెడ్డి వర్గీయులు వీరు రాజీ పడాలని లోక్ అదాలత్‌కు హాజరయ్యారు. జిల్లా జడ్జి మోహన్‌రావు, సబ్ జడ్జి నాగేశ్వరరావు, జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శైలజ, డీఎస్పీ హరినాథరెడ్డి సమక్షంలో వీరు తాము రాజీ పడుతున్నామని చెప్పారు. ఇకపై ఎలాంటి గొడవలకు, ప్రతీకారాలకు వెళ్లమని, ప్రశాంత జీవితాన్ని గడుపుతామని చెప్పారు. డీఎస్పీ హరినాథరెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఫ్యాక్షన్ గ్రామాల నేతలు రాజీ కావాలని, ప్రశాంత జీవితాన్ని గడపుతూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో ఎనిమిది జంటలు రాజీ
కర్నూలు: కుటుంబ కలహాలతో పోలీసులను ఆశ్రయించిన భార్యాభర్తలకు మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 13 జంటలు కౌన్సెలింగ్‌కు హాజరయ్యాయి. డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ సభ్యులు రాజేశ్వరి, హిందుమతి, నాగశేషయ్య, లెనిన్‌బాబు, పాపయ్యగుప్త తదితరులు వారి వాదనలు విన్నారు. విడిపోవడంతో జరిగే అనర్థాలను వివరించారు. సర్దుకుపోతేనే సంసారం సాఫీగా సాగుతుందని నచ్చజెప్పారు. దీంతో 8జంటలు కలిసి కాపురం చేసేందుకు అంగీకరించాయి. మరో ఐదు జంటలు విడిపోవడానికి మొగ్గు చూపడంతో వచ్చే వారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించి పంపారు. -
ఆరెంజ్కౌంటీతో టీసీఎస్ రాజీ..
2.6కోట్ల డాలర్లు చెల్లించిన టీసీఎస్ న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల సంస్థ టీసీఎస్ అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఆరెంజ్ కౌంటీతో న్యాయస్థానంలో కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. 2.6కోట్ల డాలర్లు (దాదాపు రూ. 175 కోట్లు) చెల్లించేందుకు ఆరెంజ్ కౌంటీ(స్థానికంగా ఓ జిల్లా)తో అంగీకారానికి వచ్చింది. ఈ మేరకు టీసీఎస్తోపాటు, ఈ సంస్థ అమెరికా విభాగం టీసీఎస్ అమెరికాలు కలిసి ఆరెంజ్ కౌంటీకి 2.6 కోట్ల డాలర్లు చెల్లించాయి. టీసీఎస్, ఆరెంజ్‌కౌంటీ సంయుక్తంగా అభివృద్ధి చేయాల్సిన ఆస్తి పన్ను నిర్వహణ విధానంపై కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు టీసీఎస్ అధికార ప్రతినిధి ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఆరెంజ్కౌంటీతో సుదీర్ఘ న్యాయ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని మేజిస్ట్రేట్ జడ్జి గాంధీ మధ్యవర్తిత్వంతో ఇరు సంస్థలు రాజీ కుదుర్చుకున్నట్టు టీసీఎస్ ప్రతినిధి వెల్లడించారు. వ్యాజ్యాలు రద్దవుతాయి: ఆరెంజ్‌కౌంటీ ఆటోమేటెడ్ ప్రాపర్టీ ట్యాక్స్ సిస్టమ్‌కు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు టీసీఎస్, దాని అమెరికా విభాగం 2.6 కోట్ల డాలర్లు చెల్లించినట్టు ఆరెంజ్ కౌంటీ ప్రకటించింది. ట్యాక్స్ సిస్టమ్ 2010లో పూర్తయినప్పటికీ దాన్ని టీసీఎస్ డెలివరీ చేయలేకపోయినట్టు తెలిపింది. కాంట్రాక్టు విలువ 64 లక్షల డాలర్లు కాగా, పరిహారం మాత్రం ఇంతకు నాలుగురెట్లుగా ఉందని పేర్కొంది. పరి హారం చెల్లించినందున టాటాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన వ్యాజ్యం రద్దు అవుతుందని, అదే విధంగా తమపై దాఖలైన పిటిషన్ కూడా రద్దు అయిపోతుందని వివరించింది. ఆరెంజ్‌కౌంటీ ఆరోపణలు ‘ప్రాపర్టీ ట్యాక్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసే విషయంలో మోసం, ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యపూరితంగా తప్పుదోవ పట్టించడం, కాంట్రాక్టును ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై 2013లో ఈ సంస్థ టాటాలకు వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేసింది. దానిపై ఈ నెల 2న న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
కౌన్సెలింగ్‌లో దంపతుల రాజీ
రాయదుర్గం టౌన్: మనస్పర్థలతో విడిపోయిన దంపతులకు కుటుంబ సంక్షేమ సలహా కేంద్రం (ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్) సభ్యులు శనివారం కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ చేయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ అధ్యక్షుడు ఇ.రామాంజనేయులు వెల్లడించారు. రాయదుర్గానికి చెందిన వడ్డే తిప్పేస్వామికి కర్ణాటకలోని నాగసముద్రం గ్రామానికి చెందిన రాజేశ్వరితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తిప్పేస్వామి తాగుడుకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో విసుగెత్తిపోయిన రాజేశ్వరి నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన కాపురాన్ని నిలబెట్టాలని తిప్పేస్వామి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించాడు. ఈ మేరకు ఇరుపక్షాల పెద్దలనూ పిలిపించి కౌన్సెలింగ్ ద్వారా దంపతుల మధ్య రాజీ చేయించి, వారి కాపురాన్ని చక్కదిద్దారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రామాంజనేయులతోపాటు సభ్యులు బండి కిష్టప్ప, న్యాయవాదులు వసుంధర, రవిచంద్ర పాల్గొన్నారు. -
నటి శ్రీవాణి వివాదం సుఖాంతం
వికారాబాద్: బుల్లితెర నటి శ్రీవాణి ఆస్తి తగాదా వ్యవహారం సుఖాంతమైంది. శ్రీవాణి వదిన అనూషకు న్యాయం చేస్తామని ఆమె కుటుంబ సభ్యులు హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అనూష అంగీకారంతో సీఐ నిర్మల సయోధ్య కుదిర్చారు. శుక్రవారం పోలీసులు.. వాణి కుటుంబ సభ్యులను, అనూషను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనూషకు న్యాయం చేస్తామని వాణి కుటుంబ సభ్యులు చెప్పారు. అనూషకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కొంత గడువు కావాలని వాణి కుటుంబ సభ్యులు కోరారు. అనూష అంగీకారంతో కుటుంబసభ్యుల మధ్య రాజీకుదిరింది. రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన అనూష, శ్రీవాణి ఇంటి స్థలం విషయంలో గొడవకు దిగడంతో పాటు ఘర్షణ పడి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐ నిర్మల నిన్న వివాదాస్పద ఇంటి స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. -
నటి శ్రీవాణి వివాదం సుఖాంతం
-
విధినిర్వహణలో రాజీ ప్రసక్తే లేదు
మచిలీపట్నం (చిలకలపూడి) : ‘విధినిర్వహణలో రాజీ పడేది లేదు.. గత 14 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగిగా నేను పనిచేసిన ప్రాంతాల్లో ప్రశంసలే తప్ప లోపాలు లేవు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకాన్నయినా అర్హులందరికీ అందేలా కృషి చేయటంలో భాగంగా అధికారులు సహాయసహకారాలు అందించాలి. పనిచేయడానికి బాధపడేవారి విమర్శలు పట్టించుకోను’ సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాబు.ఎ చేసిన వ్యాఖ్యలివి. సమావేశాలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న కలెక్టర్‌పై పలువురు ఉద్యోగులు అసంతృప్తి వెళ్లగక్కుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటివరకు తాను మండల పరిధిలోని కార్యాలయాల్లోనే తనిఖీలు చేశానని, ఇకపై జిల్లా కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తానని చెప్పారు. పీహెచ్‌సీలు, పాఠశాలల్లో లోపాల గుర్తింపు... ఇప్పటివరకు తాను చేసిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఎన్నో లోపాలు గుర్తించినట్లు కలెక్టర్ చెప్పారు. ముసునూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాను నిర్వహించిన తనిఖీల్లో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. మూడు నెలల్లో పది కేసులు మాత్రమే నమోదవుతున్నాయని, ఈ ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ ఉన్నా ప్రజలు రాకపోవడానికి ప్రధాన కారణం వైద్యాధికారులు లేకపోవటమేనని ఆయన చెప్పారు. ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంత నిధులు ఉన్నాయో నివేదికలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు. కొన్ని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గదులు తాళాలు వేసి ఉంటున్నాయని, అవి ఎవరి వద్ద ఉన్నాయని సిబ్బందిని అడిగితే ఏమీ చెప్పలేకపోతున్నారని తెలిపారు. స్మార్ట్ విలేజ్‌లకు ప్రత్యేకాధికారులుగా నియమితులైన జిల్లా అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించేటప్పుడు కార్యాలయ ప్రధాన అధికారి చాంబర్ నుంచి ఆ కార్యాలయంలో ఉండే మరుగుదొడ్ల నిర్వహణ వరకు పర్యవేక్షణ చేపట్టి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయి సమస్యలు ఆన్లైన్ చేయాలి... కలెక్టరేట్లోని సమావేశపు హాలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తొలుత రాష్ట్రస్థాయి సమస్యలను ఆన్లైన్ చేయటంపై శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 12 శాఖల సమస్యలు మాత్రమే ఆన్లైన్ చేశారని, మిగిలిన శాఖల్లో ఎటువంటి సమస్యలూ లేవా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కొక్క అధికారిని సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిన శాఖల అధికారులు కూడా వెంటనే రాష్ట్రస్థాయి సమస్యలను ఆన్లైన్ చేయాలన్నారు. వాటిని ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని, సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని ఆయన చెప్పారు. మండలాల ప్రత్యేకాధికారులు మరుగుదొడ్ల నిర్మాణ పనులను అంచెలంచెలుగా పర్యవేక్షించాలన్నారు. ఈ నెల 23 నుంచి మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.చంద్రుడు, డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, డీపీవో ఎ.నాగరాజువర్మ, డీఈవో కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘రాజీ’కి వచ్చిన అత్తమామలపై దాడి
రామగుండం: పెళ్లయిన మూడు నెలలకే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా హింసించడంతో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన 2011లలో మండలంలోని లింగాపూర్‌లో చోటు చేసుకుంది. భార్య మృతికి కారకుడైన భర్తపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ట్రయల్‌కు రావడంతో సదరు ఉపాధ్యాయుడు అత్తమామలతో రాజీ కుదుర్చుకునేందుకు రావడంతో చెల్లిని చంపి రాజీకి వచ్చారా? అంటూ మృతురాలి సోదరుడు అత్తామామలపై గొడ్డలితో దాడికి పాల్పడిన ఘటన ఆదివారం లింగాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై విద్యాసాగర్ కథనం.. లింగాపూర్ గ్రామానికి చెందిన గాలిపెల్లి ఎల్లయ్య కూతురు శ్యామలను 2011లో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలంలోని చిన్నబోజాల గ్రామానికి చెందిన మేనల్లుడు మోకెనపల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశాడు. పెళ్లయిన మూడు నెలలకే శ్రీనివాస్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చాక శ్యామలను అదనపు కట్నం పేరుతో శారీరకంగా, మానసికంగా హింసించడంతో ఆమె జూలై 2012న తల్లి గారిల్లైన లింగాపూర్‌కు వచ్చి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు కూతురు మృతికి కారణమైన అల్లుడిపై గాలిపెల్లి ఎల్లయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మోకెనపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచులు భూమక్క, నర్సక్కలపై 498(ఎ), 304(బి) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కేసు జిల్లా సెషన్‌కోర్టులో నడుస్తోంది. ఈ మధ్యలో ట్రయల్ రావడంతో మోకెనపల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులు మోకెనపల్లి రాజలింగం, దేవమ్మలతో పాటు లింగాపూర్‌కు చెందిన సమీప బంధువులు మోకెనపల్లి నారాయణ, మోకెనపల్లి బాలకృష్ణ, గోగెర్ల శేఖర్ తదితర పెద్దమనుషుల సహాయంతో ఆదివారం మృతురాలి తల్లిదండ్రులతో రాజీ కుదుర్చుకొని కేసును కొట్టివేయించుకునేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న మృతురాలి సోదరుడు గాలిపెల్లి శ్రీనివాస్ ఒక్కసారి ఆవేశానికి లోనయ్యాడు. చెల్లెలు మృతికి కారకుడై ఉండీ కేసును కొట్టేయించుకునేందుకు రాజీకి వచ్చారా? అంటూ మోకెన పల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో గోదావరిఖనికి తరలించారు. డాక్టర్లు ఎలాంటి ప్రాణపాయం లేదని తెలిపారు. అనంతరం దేవమ్మ, రాజలింగంను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. -
నేను కాంప్రమైజ్ అయ్యే రకం కాదు: చంద్రబాబు
తెలుగు ప్రజలకు సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు హైదరాబాద్: ‘నేను ఒక్కసారి కమిటైతే కాంప్రమైజ్ అయ్యే రకం కాదు..’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి రాష్ట్ర పర్యటనకు వెళ్లే ముందు.. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని దేశ విదేశాల్లో ఉంటున్న తెలుగువారికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘చరిత్రను తిరగరాసే సంధికాలంలో ఉన్నాం. తెలుగువారి సత్తా ఏంటో లోకానికి చాటే మహత్తర అవకాశం మన ముందుంది. భావితరాలకు బంగారు ఆంధ్రప్రదేశ్‌ను అందించేందుకు మరోసారి సంక్రాంతి శుభ సమయంలో సంకల్పం చెప్పుకుందాం. నవలోకం వైపు నడిపిస్తా నాతో రండి. ఒక గొప్ప రాష్ట్రాన్ని నిర్మించుకుందాం..’ అని ఒక ప్రకటనలో కోరారు. ‘రైతు కష్టాలు తెలుసు కాబట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింప చేయకుండా రూ.50 వేలలోపు రుణాలను పూర్తిగా రద్దు చేశాం. రాజధానికి భూములిచ్చిన రైతులకు మంచి ప్యాకేజీ ప్రకటించాం. గృహావసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వ్యవసాయానికి ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కొత్తగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ తీసుకున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
రాజీమార్గం..సత్వర న్యాయం
కామారెడ్డి : కోర్టుల్లో కేసులు ఏళ్లతరబడిగా నడవడం వల్ల అటు బాధితులు, ఇటు కక్షిదారులు ఇబ్బందులు పడుతుంటారు. పెండింగ్ కేసులు పెరుగకుండా న్యాయమూర్తులు ప్రయత్నిస్తున్నా సాక్షులు, ఆధారాలను సరైన సమయంలో అందించకపోవడం, తదితర కారణాలతో కేసులు పెండింగ్ అవుతూనే ఉంటాయి. చిన్నచిన్న కేసుల్లో కూడా ఏళ్ల తరబడి తిరుగుతుంటారు. దీంతో బాధితులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. కక్షిదారులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. రవాణా ఖర్చులు, ఫీజులు, ఇతర ఖర్చులు పెరిగిపోయి ఇబ్బందుల పాలవుతుంటారు. అయితే ఇరువర్గాల వారు ఏదో రకంగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం ద్వారా కేసులు తగ్గిపోతాయి. రాజీ కుదరించి.. ఇరువర్గాలు పంతాలకు వెళ్లి ఎవరూ పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు లోక్ అదాలత్‌లను నిర్వహించి.. పైసా ఖర్చు లేకుండా, రాజీమార్గంలో బాధితులు, కక్షిదారులతో మాట్లాడి కేసులను పరిష్కరిస్తున్నాయి. ఏళ్ల నుంచి కొలిక్కిరాని ఎన్నో కేసులను లోక్ అదాలత్‌లు సులువుగా పరిష్కరిస్తున్నాయి. దీంతో చాలామంది బాధితులు లోక్ అదాలత్‌లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటి స్థానం గత ఏడాది నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌ల ద్వారా కేసుల పరిష్కారంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గత యేడాది 129 సివిల్ కేసులు, 2834 క్రిమినల్కేసులు, 10,324 విద్యుత్తు కేసులు, 2963 ఇతర కేసులు పరిష్కారమయ్యాయి. ఈ ఏడాది కూడా జిల్లాలో భారీ సంఖ్యలో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు గాను న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. నేడు దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా శనివారం(డిసెంబర్ 6) మెగా లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. వేలాది పెండింగ్ కేసుల పరిష్కారం లక్ష్యంగా ఈ మెగా లోక్ అదాలత్‌ను చేపడుతున్నారు. అందులో భాగంగా జిల్లాలో 23 లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భిచ్కుందలల్లో ఉన్న కోర్టుల ఆవరణల్లో లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. కామారెడ్డిలో నాలుగు బెంచ్‌లను ఏర్పాటు చేసినట్టు న్యాయమూర్తులు తెలిపారు. ఎలాంటి కేసులు.. లోక్ అదాలత్‌లో భార్యాభర్తలకు సంబంధించిన వివాదాలు, తల్లితండ్రులకు సంబంధించిన జీవనభృతి, క్రిమినల్, సివిల్ కేసులు, మోటర్ వాహనాల కేసులు, ఎక్సైజ్ కేసులు వంటి అన్ని రకాల కేసులను పరిష్కరిస్తున్నారు. ఈ కే సుల్లో ఇరువర్గాలు రాజీ చేసుకునే వెసలుబాటు కల్పించడంతో పాటు రాజీ చేసుకున్న కేసులను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. ఇలా లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పులపై హైకోర్టు, సుప్రీంకోర్టు వంటి కోర్టులకు అప్పీలకు పోయే అవకాశం లేదు. లోక్ అదాలత్ తీర్పు తుది తీర్పుగా భావించబడటంతో చాలామంది కక్షిదారులు లోక్ అదాలత్‌లను ఆశ్రయించి కేసులను రాజీ చేసుకుంటున్నారు. ఇటీవల బ్యాంకులు సైతం రుణాలు పొంది తిరిగి చెల్లించని వ్యక్తులకు లోక్ అదాలత్ ద్వారా నోటీసులు జారీ చేస్తూ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుంటున్నాయి. -
కొత్త తలుపులు
ఇంట్లోకి అడుగుపెట్టాలంటే తలుపు తెరవాలి. ముందు మన కంట్లో పడేది తలుపులే కాబట్టి వాటి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాణ్యతతో పాటు డిజైన్లు కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా మెయిన్‌డోర్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. తలుపు ఎంత అందంగా ఉంటే మన తలపులు అంత స్పెషల్‌గా ఉంటాయను కుంటున్నారో ఏమో...వాటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి మరీ డిజైన్ చేయించుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న తలుపుల్ని చూశారు కదా, ఎంత అందంగా ఉన్నాయో! అందమొక్కటే ఇక్కడ విషయం కాదు..వెరైటీని కూడా కోరు కుంటున్నారు. గుర్రం మొదలు ఏనుగు వరకూ అన్ని జంతువుల్ని తలుపులెక్కించేస్తున్నారు. ఒక్క జంతువులనే కాదు గడియారం మోడల్, మెట్లు...ఆకారంలో కూడా తలుపుల్ని తయారుచేయించుకుంటున్నారు. రకరకాల రంగుల్లో వచ్చే గ్లాస్డోర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాని వుడ్‌తో చేయించుకునే తలుపుల్లో వచ్చే వెరైటీలే ఎక్కువ ఆకర్షణగా ఉంటాయి. మీ కొత్తింటి కోసం తయారు చేయించుకునే తలుపులు ఇలా ఉండేలా ప్లాన్ చేసుకోండి.