ఇంట్లోకి అడుగుపెట్టాలంటే తలుపు తెరవాలి. ముందు మన కంట్లో పడేది తలుపులే కాబట్టి వాటి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాణ్యతతో పాటు డిజైన్లు కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా మెయిన్‌డోర్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదు.
తలుపు ఎంత అందంగా ఉంటే మన తలపులు అంత స్పెషల్‌గా ఉంటాయను కుంటున్నారో ఏమో...వాటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి మరీ డిజైన్ చేయించుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న తలుపుల్ని చూశారు కదా, ఎంత అందంగా ఉన్నాయో! అందమొక్కటే ఇక్కడ విషయం కాదు..వెరైటీని కూడా కోరు కుంటున్నారు. గుర్రం మొదలు ఏనుగు వరకూ అన్ని జంతువుల్ని తలుపులెక్కించేస్తున్నారు.
ఒక్క జంతువులనే కాదు గడియారం మోడల్, మెట్లు...ఆకారంలో కూడా తలుపుల్ని తయారుచేయించుకుంటున్నారు. రకరకాల రంగుల్లో వచ్చే గ్లాస్‌డోర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాని వుడ్‌తో చేయించుకునే తలుపుల్లో వచ్చే వెరైటీలే ఎక్కువ ఆకర్షణగా ఉంటాయి. మీ కొత్తింటి కోసం తయారు చేయించుకునే తలుపులు ఇలా ఉండేలా ప్లాన్ చేసుకోండి.
కొత్త తలుపులు
Published Thu, Nov 28 2013 12:11 AM | Last Updated on Thu, May 24 2018 2:36 PM
Advertisement
Advertisement