Doors
-
శివనామస్మరణలతో కేదార్నాథ్ తలుపులు మూసివేత
రుద్రప్రయాగ: శివనామస్మరణల మధ్య చార్ధామ్లలో ఒకటైన కేదార్నాథ్ ధామ్ తలుపులను ఈరోజు (ఆదివారం) మూసివేశారు. శీతాకాలంలో ప్రతీయేటా ఈ తంతు కొనసాగుతుంటుంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కేదార్‌నాథ్‌లో మహాశివునికి ఘనంగా పూజలు జరిగాయి. ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులను మూసివేశారు. ఇకపై కేదారనాథుడు ఉఖిమఠ్‌లో ఆరు నెలల పాటు దర్శనం ఇవ్వనున్నారు. భయ్యా దూజ్ సందర్భంగా ఈ రోజున తలుపులు మూసివేశారు. ఈ సందర్భంగా పంచముఖి విగ్రహాన్ని సంచార విగ్రహ డోలీలో కొలువుదీర్చారు. అనంతరం ఈ విగ్రహం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్‌కు ఊరేగింపుగా తరలిస్తారు. ఈ ఏడాది 16 లక్షల మంది యాత్రికులు కేదార్నాథ్ ధామ్‌ను సందర్శించుకున్నారు. #WATCH | Uttarakhand: The portals of Shri Kedarnath Dham closed for the winter season today at 8:30 am. The portals were closed with Vedic rituals and religious traditions amidst chants of Om Namah Shivay, Jai Baba Kedar and devotional tunes of the Indian Army band.(Source:… pic.twitter.com/vCg2as6aJ7— ANI (@ANI) November 3, 2024కేదార్‌నాథ్‌ను ఇక్కడ చివరిసారిగా దర్శనం చేసుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని 10 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈరోజు కేదార్‌నాథ్‌లోని పంచముఖి విగ్రహాన్ని మొబైల్ విగ్రహం డోలీ ద్వారా ఉఖిమత్‌కు పంపనున్నారు. నిన్ననే(శనివారం) గంగోత్రి ధామ్ తలుపులు మూసివేశారు. ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రిలో గంగమ్మను పూజిస్తారు. ఇది కూడా చదవండి: త్వరలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం -
Chardham Yatra: తెరుచుకున్న బద్రీనాథ్ .. భారీగా తరలివచ్చిన భక్తులు!
మంగళ వాయిద్యాల నడుమ మధ్య బద్రీనాథ్ తలుపులు ఈరోజు(ఆదివారం) తెరుచుకున్నాయి. ఇకపై భక్తులకు బద్రివిశాల్ స్వామి ఆరు నెలల పాటు దర్శనమివ్వనున్నాడు. బద్రీనాథ్ తలుపులు తెరిచే సమయానికి దాదాపు పది వేల మంది భక్తులు ధామ్ ముందు బారులు తీరారు. అఖండ జ్యోతి దర్శనం కోసం 20 వేల మంది యాత్రికులు నేటి సాయంత్రం నాటికి బద్రీనాథ్ చేరుకునే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి ధామ్ నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా బద్రీనాథ్ ధామ్‌కు చేరుకుంటుంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మే 10న తెరుచుకున్నాయి. బద్రీనాథ్ పుష్ప సేవా సమితి ధామ్‌ను 15 క్వింటాళ్ల బంతి పూలతో అలంకరించింది. ధామ్‌లోని పురాతన మఠాలు, దేవాలయాలను కూడా అందంగా అలంకరించారు.బద్రీనాథ్ ధామ్‌లో పాలిథిన్ వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడి వ్యాపారులు పాలిథిన్ కవర్లను వినియోగించరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయంలో పూజలు ప్రారంభమైనట్లు బీకేటీసీ మీడియా ఇన్ఛార్జ్ డాక్టర్ హరీశ్‌గౌడ్ తెలిపారు. ముందుగా లక్ష్మీ అమ్మవారిని గర్భగుడి నుండి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించాక, ధామ్‌లో ఆశీనురాలిని చేయించారు. బద్రివిశాల్ స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం.. చతుర్భుజుడైన స్వామివారికి నెయ్యితో అలంకారం చేశారు. ఆరు గంటలకు భక్తుల సందర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. #WATCH | Chamoli, Uttrakhand: The doors of Shri Badrinath Dham were opened for the devotees today at 6 am amidst the melodious tunes of the Army Band, with complete rituals, Vedic chanting and slogans of 'Badri Vishal Lal Ki Jai'. pic.twitter.com/lPSCXxKfvx— ANI (@ANI) May 12, 2024 -
ఎన్కోర్–ఆల్కమ్ కొత్త ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీ కంపెనీ ఎన్కోర్–ఆల్కమ్ రూ.60 కోట్లతో గుజరాత్‌లోని సూరత్ వద్ద అత్యాధునిక ప్లాంటు నెలకొల్పుతోంది. అల్యూమినియం డోర్స్, విండోస్ విభాగంలో భారత్‌లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ ఇదేనని సంస్థ ఫౌండర్, సీఎండీ అవుతు శివకోటిరెడ్డి బుధవారం తెలిపారు. ‘1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలో అతిపెద్ద కేంద్రం ఇదే. జర్మనీ సాంకేతికతతో రోజుకు 30,000 చదరపు అడుగుల తయారీ సామర్థ్యంతో మార్చికల్లా రెడీ అవుతుంది. ఇప్పటికే సూరత్‌లో అల్యూమినియం డోర్స్, విండోస్ ప్లాంటు ఉంది. కస్టమర్ కోరుకున్నట్టు ఆర్కిటెక్చరల్ ఉత్పాదనలు మా ప్రత్యేకత. 60 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని మోకిల వద్ద ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ మార్చికల్లా ప్రారంభం అవుతాయి. ఎన్కోర్ ఇప్పటికే వుడ్ డోర్స్ తయారీలో ఉంది. దక్షిణాదిన ఎన్కోర్, ఉత్తరాదిన ఆల్కమ్ బ్రాండ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాం’ అని వివరించారు. హైటెక్స్‌లో జనవరి 19 నుంచి జరిగే ఏస్‌టెక్ ట్రేడ్ ఫెయిర్‌లో విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తామని ఆల్కమ్ డైరెక్టర్ జయంతి భాయ్ మనుభాయ్ తెలిపారు. ఎన్కోర్–ఆల్కమ్ ఫౌండర్ అవుతు శివకోటిరెడ్డి -
Ayodhya Ram Mandir: అయోధ్య ఆలయ నిర్మాణంలో హైదరాబాదీలు
తండ్రీ కొడుకుల ఆప్యాయతకు.. అన్నదమ్ముల అనుబంధానికి.. ఆలూమగల అనురాగానికి.. ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామ చంద్రుడు. ఆ దైవాంశ సంభూతుడికి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిర నిర్మాణ వైభవం, కళాత్మకత, నగిషిల రూపకల్పన తదితర అంశాలపై యావత్ దేశంతో పాప్రపంచమంతా చర్చించుకుంటోంది. అయోధ్య రామమందిరం ఈ నెల 22న అత్యంత వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు కొందరు నగరవాసులు. ప్రధానంగా అయోధ్య రామమందిర ద్వారాల రూపకల్పన చేసే అరుదైన అవకాశం నగరంలోని బోయిన్‌పల్లికి చెందిన అనురాధ టింబర్స్కు దక్కింది. శ్రీరాముని పాదుకల తయారీ కూడా నగరం వేదికగానే జరగడం విశేషం. రామ మందిర అక్షింతలను ప్రతి ఇంటికీ చేర్చడం వంటి పలు కార్యక్రమాల్లోనూ నగరం తన ప్రత్యేకతను చాటుకుంది. అయోధ్య వేదికగా 1990, 1992లలో చేపట్టిన పరిక్రమలో సైతం ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో కరసేవకులు పాల్గొన్నారు. ఆనాటి నుంచే కొనసాగుతున్న అయోధ్యతో సంబంధం ప్రస్తుత రామ మందిర నిర్మాణంలోనూ భాగ్యనగరం తన పాత్ర పోషించింది. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం. గతంలోనే సుప్రసిద్ధ అనంత శేష శయన మహా విష్ణు కళాఖండాన్ని సృష్టించిన అనురాధ టింబర్స్ ఆధ్వర్యంలో అయోధ్య రామమందిర ద్వారాల రూపకల్పన చేపట్టారు. స్తపతి కుమారస్వామి రమేశ్ ఆధ్వర్యంలో 60 మంది కళాకారులు ఆరు నెలలుగా శ్రమిస్తూ అయోధ్య రామమందిర ద్వారాలను రూపొందిస్తున్నారు. గతంలో యాదాద్రి, రామేశ్వరం వంటి ఆలయాలకు ప్రధాన ద్వారాలను అనురాధ టింబర్స్ రూపొందించింది. ఇంతటి అరుదైన ఘనత సాధించిన అనురాధ టింబర్స్ నిర్వాహకులు శరత్‌బాబు, కిరణ్ కుమార్‌లను సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్వయంగా వచ్చి అభినందించడం గమనార్హం. పరిక్రమ కోసం ప్రాణాలే పణంగా.. 1990లో అయోధ్యలో తలపెట్టిన మొదటి పరిక్రమలో ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పాల్గొన్నాం. దీని కోసం నగరం నుంచి ఆలె నరేంద్ర నేతృత్వంలో ప్రత్యేక బృందం పాల్గొంది. పరిక్రమ తేదీ కన్నా ముందే అయోధ్యకు చేరుకోవాలని రైలులో ప్రయాణిస్తున్న మమ్మల్ని మధ్యప్రదేశ్‌లో ఆపేశారు. అక్కడి నుంచి వారణాసికి మళ్లీ ప్రయాణించాం. కరసేవకుల సమాచారం ముందే తెలుసుకుని అక్కడ కూడా అడ్డుకోవడంతో నేపాల్ సరిహద్దుల్లోని అడవుల్లో తలదాచుకున్నాం. ఈ ప్రయాణంలో భాగంగా లాఠీచార్జ్‌లు, ఫైరింగ్‌లు, వాటర్ ఫైరింగ్‌లను ఎదుర్కొన్నాం. ఒకానొక సమయంలో అరెస్టు చేసి లక్నో జైలులో నిర్బంధించారు. అక్కడి నుంచి తప్పించుకున్న నన్ను మళ్లీ అరెస్టు చేసి వారణాసి నైనీ జైలులోనూ (సుభాష్ చంద్రబోస్‌ను ఉంచిన కారాగారం) నిర్బంధించారు. నేను 30 ఏళ్ల వయసులో మా పోరాటం ఇప్పుడు సఫలీకృతం కావడం మహదానందం. – నాయిని బుచ్చి రెడ్డి, అప్పటి కరసేవకుడు మాది సాంకేతిక సహకారం మాత్రమే.. రామాలయ ప్రధాన ద్వారాల రూపకల్పనలో తాము సాంకేతిక సహకారం మాత్రమే అందిస్తున్నాం. అయోధ్య ట్రస్టు మార్గదర్శకత్వంలో టాటా కన్సలి్టంగ్ ఇంజినీరింగ్, ఎల్అండ్టీ సంస్థల సమన్వయంతో కలపతో చేసిన తలుపుల పనుల్లో భాగస్వాములమయ్యాం. తమిళనాడులోని మహాబలిపురం ప్రాంతానికి చెందిన స్తపతి కుమార స్వామి రమేశ్ బృందం ఆధ్వర్యంలో ఆరు నెలలుగా అయోధ్య ఆలయ ప్రాంగణంలోనే తలుపుల తయారీ చేయిస్తున్నాం. తొలుత 18 ప్రధాన ద్వారాలకు తలుపులు తయారు చేశాం. అనంతరం మరో 100కు పైగా అంతర్గత ద్వారాలకూ తలుపులు రూపొందిస్తుం. – శరత్ బాబు, అనూరాధ టింబర్స్ నిర్వాహకులు రఘురాముడి పాదుకల తయారీలో.. ►సాధారణ ఇత్తడి బిందెలు తయారు చేసే పిట్లంపల్లి రామలింగాచారి నిబద్ధతతో కూడిన శిల్పిగా మారి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని పాదుకలను తయారు చేసే అవకాశాన్ని పొందారు. అయోద్య శ్రీరాముని పాదుకలు 12 కిలోల 600 గ్రాముల పంచలోహాలతో తీర్చిదిద్దారు. వాటిపై బంగారు తాపడం చేశారు. నిత్యం నిగనిగలాడేలా పాదుకలపై శంకు, చక్రం, శ్రీరాముని బాణం, దేవాలయంపై ఉండే జెండా వంటివి ఏర్పాటు చేసి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఒక్కో పాదుక 6.3 కిలోలు ఉండేలా తయారు చేశారు. 12 తులాలకు పైగా బంగారు తాపడం చేశారు. వందేళ్లకు పైగా పాదుకలు చెక్కు చెదరకుండా తయారు చేయడంలో రామలింగాచారి సఫలీకృతుడయ్యారు. 1987లో బెంగళూరులోని రీజినల్ డిజైన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్లో రెండేళ్లు లోహ శిల్ప విద్యలో పట్టా అందుకున్న ఆయన.. 1993లో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని హస్మత్‌పేటలో శ్రీ మది్వరాట్ కళా కుటీర్‌ను ఏర్పాటు చేసుకుని లోహ శిల్పాల తయారీలో నిమగ్నమయ్యారు. ► అద్భుతమైన కళా నైపుణ్యంతో దేవతా మూర్తులు, గాలి గోపురాలు, కంఠాభరణాలు, నాగాభరణాలు, మండపాల నిర్మాణాలు రూపొందించడంలో నిష్ణాతులుగా మారారు. రామలింగాచారి పనితనం తెలుసుకుని భాగ్యనగర సీతారామ సేవా ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చర్ల శ్రీనివాస శాస్త్రి అయోధ్య రామాలయంలోని గుర్భగుడిలో ఏర్పాటు చేసే శ్రీరాముని పాదుకలను తయారీ పనులను ఆయనకు ప్రత్యేకంగా అప్పగించారు. 25 రోజుల పాటు నియమ నిష్టలతో ఎంతో శ్రమకోర్చి పాదుకలను తయారు చేశారు రామలింగాచారి. అయోధ్య శ్రీ రాముని పాదుకలతో వెలుగులోకి వచి్చన రామలింగాచారికి అమెరికాలో నిర్మిస్తున్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి మూల విరాట్లు, కలశాలు, మకర తోరణాలు, గాలిగోపురాలు వంటివి రూపొందించే అవకాశం వచి్చంది. విశ్వకర్మలకూ నంది అవార్డులివ్వాలి.. ఉగాదిని పురస్కరించుకుని సినిమా వాళ్లకు ఇస్తున్న నంది అవార్డుల మాదిరిగానే శిల్పాలను సృష్టిస్తున్న విశ్వకర్మలకు అవార్డులను అందిస్తే మరింత బాధ్యతగా శిల్పాలను సృష్టించగలుగుతారు. కళాకారుల శ్రమను గుర్తించి మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. – రామలింగాచారి, లోహశిల్పి ఇదో మహదావకాశం.. చారిత్రక అయోధ్య రామాలయ ద్వారాల రూపకల్పన అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. మహాబలిపురంలోని ప్రభుత్వ కళాశాలలో ఎనిమిదేళ్ల పాటు శిల్పశా్రస్తాన్ని నేర్చుకుని 2000 సంవత్సరంలో డిగ్రీ పొందా. 20 ఏళ్లుగా అనురాధ టింబర్స్తో కలిసి పనిచేస్తున్నా. 2005లో రామేశ్వరం దేవాలయ ద్వారాలు రూపొందించాం. 2008లో కాంచీపురం ఏకాంబేశ్వరన్ టెంపుల్ రథాన్ని తయారు చేశాం. 2015లో శ్రీరంగం దేవాలయంలో కలప పనులు చేశాం. 2019లో మలేసియాలోని మురుగన్ టెంపుల్ బంగారు రథం, 2020లో లండన్‌లోని ధనలక్ష్మి దేవాలయ బంగారు రథం, 2021లో జర్మనీలోని గణేశ్ దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కలప పనులు చేశాం. – స్తపతి కుమార స్వామి రమేశ్ -
భాగ్య నగరి నుంచి... ఆయోధ్యా పురికి!
హైదరాబాద్: అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. యావత్ దేశం ఇందులో పాలు పంచుకుంటోంది. అయోధ్య రాముని ఆలయానికి తలుపులు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సంస్థే ఈ పనిని చేపట్టింది. గర్భగుడి తలుపులతో పాటు ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న అన్ని తలుపులను రూపొందిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన అనురాధ టింబర్ డిపో ఆలయ తలుపులను సిద్ధం చేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఈ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. సంస్థ డైరెక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ.. గర్భగుడి తలుపు 5 ఏళ్ల రాముడి విగ్రహాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. తలుపులు 8 అడుగుల పొడవు,12 అడుగుల వెడల్పు, ఆరు అంగుళాల మందంతో బలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆలయం చుట్టూ 100 ఫ్రేమ్‌లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 118 తలుపులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయోధ్య రామాలయ తలుపులు తమిళనాడుకు చెందిన హస్తకళాకారులు నిర్మించారు. తామర, నెమళ్లు సంప్రదాయ భారతీయ సాంస్కృతిక చిహ్నాలతో నగారా శైలిలో తయారు చేశారు. నగారా అనేది ఉత్తర భారతీయ ఆలయ నిర్మాణ శైలి. ఇది గుప్తుల కాలంలో మూడవ శతాబ్దంలో ప్రారంభమై ముస్లింల ఆగమనం వరకు కొనసాగింది. తలుపులకు మహారాష్ట్రకు చెందిన బలార్షా టేకు చెక్కను ఉపయోగించారు. ఈ చెక్క భాగం బంగారు రేకుతో కప్పబడి ఉంటుంది. రామాలయ తలుపులు నిర్మించడానికి దేశంలో ప్రధాన సంస్థలకు ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన సంస్థకే ఈ పనిని అప్పగించారు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఆలయ మొదటి అంతస్తు వరకు నిర్మాణం పూర్తైంది. ప్రస్తుతం అలంకరణల పని జరుగుతోంది. ఇదీ చదవండి: 'రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు' -
మెట్రో రైలు డోర్లో చీర ఇరుక్కుని.. మహిళ మృతి
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. మెట్రో రైలు డోర్లో చీర ఇరుక్కుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీలోని ఇంద్రలోక్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలపాలైన మహిళను ఢిల్లీలోని సఫ్జర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించి బాధిత మహిళ మరణించిటు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రీనా(35) అనే మహిళ ఇంద్రలోక్ రైల్వే స్టేషన్లో మెట్రో రైలు దిగే క్రమంలో ఆమె చీర డోర్లో ఇరుక్కుంది. కానీ రైలు ముందుకు వెళ్లడంతో మహిళ రైలు కింద పడిపోయింది. ఈ ఘటనలో బాధిత మహిళ తీవ్ర గాయాలపాలైంది. తీవ్ర గాయాలపాలైన రీనాను ఢిల్లీలోని సఫ్జర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు మహిళ బంధువు విక్కీ తెలిపారు. రీనా భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని విక్కీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ దయాళ్ తెలిపారు. ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి -
‘సిటీ ఆఫ్ డోర్స్’ అంటే ఏమిటి? మనదేశంలోని ఆ నగరానికి ఎందుకంత ప్రత్యేకత?
మనం ఎప్పటికీ గుర్తుంచుకునే కథలు కొన్ని ఉంటాయి. అవి కాలక్రమేణా మరుగుపడుతుంటాయి. అయితే మన దేశ చరిత్రకు సంబంధించిన విషయం అయినప్పుడు దానిని తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాం. అలాంటి ఒక అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోని ఆ నగరంలోకి ప్రవేశించాలంటే ఎవరైనా 52 తలుపులు దాటాలి. ఈ నగరానికున్న చరిత్ర చాలా పురాతనమైనది. ఈ నగరంలో అసాధారణ రీతిలో తలుపులు ఉన్నాయి. ఇంతకీ ఆ నగరం ఎక్కడుందో, ఆ నగరానికి సంబంధించిన విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ‘సిటీ ఆఫ్ డోర్స్’ పేరుతో ప్రసిద్ధి ఇతర నగరాల కంటే భిన్నంగా ఉన్నప్పుడు ఆ నగరానికి ప్రత్యేకమైన పేరు ఏర్పడుతుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరాన్ని ‘తలుపుల నగరం’ అని అంటారు. ఈ నగరం తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది. ఈ నగరంలోకి ప్రవేశించాలంటే 52 తలుపులు దాటుకుంటూ రావాలి. ఈ సమాచారం ఔరంగాబాద్ జిల్లా ప్రభుత్వ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ నగరంలోని తలుపులు, వాటికి సంబంధించిన కథలు ఎంతో ప్రసిద్ధిపొందాయి. 500 సంవత్సరాల చరిత్ర ఔరంగాబాద్ నగర చరిత్రను పరిశీలిస్తే ఈ నగరం 500 సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఔరంగాబాద్‌లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియాన్ని చూడవచ్చు. దీనిలో శివాజీ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు కనిపిస్తాయి. అలాగే అప్పట్లో యుద్ధంలో ఉపయోగించిన 500 ఏళ్ల క్రితంనాటి దుస్తులు కూడా కనిపిస్తాయి. మొఘల్ పాలకుడు ఔరంగజేబు తన స్వహస్తాలతో రాసిన ఖురాన్ కాపీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ నగరం పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా భాసిల్లుతోంది ఔరంగాబాద్ మీదుగా వెళుతున్నవారు ఈ నగరాన్ని చూస్తే వినూత్న అనుభూతికి లోనవుతారు. నగరం అంతటా పురాతన తలుపులు కనిపిస్తాయి. ఇది ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది కూడా చదవండి: India vs Bharat: తెగ నవ్విస్తున్న మీమ్స్! -
డోర్లు, టైర్లు లేని కారు, షాకవుతున్న నెటిజన్లు: వీడియో చూడండి!
సాధారణంగా కారు కొనాలనుకున్న వారు సేఫ్టీ ఫీచర్లు, మైలేజీ, ధర లాంటి వివరాలను పరిశీలించి తమకిష్టమైనకారును సొంతం చేసుకుంటారు. కానీ డోర్లు, టైర్లు లేని కారును ఎక్కడైనా చూశారా? ప్రపంచంలోనే అతి చిన్నకారుగా పిలుస్తున్న ఈ కారుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, దానుకనుగుణంగా కొత్త ఫీచర్లు, డిజైన్లతో స్టైలిష్ కార్లతోపాటు, బడ్జెట్ కార్లపై కార్మేకర్లు దృష్టిపెడుతున్న క్రమంలో ఈ బుల్లి కారు సోషల్ మీడియా యూజర్లను భలే ఆకట్టుకుంటోంది. 37 మిలియన్ల వ్యూస్‌తో, లైక్స్, రీట్వీట్స్తో దూసుకుపోతోంది. బహుశా ఇది మిస్టర్ బీన్ కోసం మిస్టర్ బీన్ కనిపెట్టాడేమో అంటూ ఒకరు కమెంట్ చేశారు. అలాగే నమ్మశక్యం కాని డిజైన్ వెనుక ఉన్న సృజనాత్మకతను అభినందిస్తున్నారు. "మాస్సిమో" ట్విటర్ ఖాతాలో గత నెల 26న ఈ వీడియోను షేర్ చేసింది. వైరల్ వీడియోలో, సియాన్ కలర్కారును చూస్తే, టైర్లు లేదా తలుపులు లేవు. దీంతో నిజంగా ఇదే కారేనా అన్న అనుమానం కూడా కలుగకమానదు.వాస్తవానికి, ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ కారమాఘెడన్ పోస్ట్ చేసింది. The lowest car in the world [📹 carmagheddon (IT): https://t.co/9z0IrZySua]pic.twitter.com/AvExqIFJnA — Massimo (@Rainmaker1973) June 25, 2023 -
దొంగతనానికి వచ్చి..డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు
ఒక ఇంటిలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఒక దొంగ ఏమి దొరక్కా.. ఆ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మరువక మునేపే అలాంటి మరో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చోరీ చేసేందుకు వచ్చి డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు ఒక దొంగ. ఈ ఘటన వారణాసిలో సార్నాథ్ ప్రాంతంలోని డానియాల్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలపిని కథనం ప్రకారం....నిజాం అనే వక్తి విద్యుత్ యంత్రాలతో పనిచేసే మగ్గం సెంటర్లోకి చోరబడేందుకు యత్నించాడు. వాస్తవానికి ఆ సెంటర్ సరైన పని లేక గత రెండు రోజులుగా మూతబడి ఉంది. ఐతే ఈ దొంగ ఆ సెంటర్లో చోరీ చేసేందుకు వచ్చాడు. ఐతే ఆ సెంటర్‌ను బద్దలుగొట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న తలుపుల్లో దొంగ తన తలను పెట్టడంతో అతడి తల ఇరుక్కుపోయింది. ఆ తలుపులు పైన తాళం వేసి ఉందని తెలియక చోరబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతని తల రెండు డోర్ల మధ్య ఇరుక్కుపోయింది, అతడి మిగతా శరీర భాగం బయటవైపు ఉండిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృదొ చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తిని పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న 30 ఏళ్ల జావేద్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మహిళ చేతివాటం.. మాటల్లో దింపి రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది) -
ఉత్తరపు గది
నిరుడు వేసవి వెళ్లాక ఆ ఇంట్లోకి వచ్చారు వాళ్లు. కనుక వేసవిలో ఆ ఇంట్లో ఎలా ఉంటుందో తెలీదు. వేసవి వచ్చింది. కనుక ఇప్పుడు తెలుస్తోంది! అద్దె ఇల్లు అది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలకు సరిగ్గా సరిపోతుంది. సామాను తక్కువగా ఉంటే కొంచెం పెద్ద ఇల్లుగా కూడా అనిపిస్తుంది. పదేళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకు, ఇరవై ఏళ్లకే భార్య అయిన అమ్మాయి, పాతికేళ్లలోపే భర్త అయిన అబ్బాయి.. ఇదీ ఆ ఇంట్లో ఉన్న కుటుంబం. అతని పేరు అమిత్. మంచి ఉద్యోగం. సమృద్ధిగా జీతం. ‘గృహస్థు యవ్వనాన్ని’ అతడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లల్ని ఆడిస్తాడు. భార్యని ఆటపట్టిస్తాడు.ఆమె పేరు పున్నమి. యాక్టివ్‌గా ఉంటుంది. పిల్లలు, భర్తే ఆమె ఉద్యోగం. వాళ్ల సంతోషమే ఆమె జీతం. వీళ్లింట్లో.. వీళ్లు కాకుండా ఉత్తరం వైపున ఒక గది ఉంది. ఇంట్లో వీళ్లున్నప్పుడు ఇంట్లో ఉత్తరంగా గానీ, దక్షిణంగా గానీ, మిగతా రెండు వైపులా గానీ ఉన్న గది కూడా వీళ్లదే అవ్వాలి కదా! అవ్వాలి కానీ, ‘ఆ గదిని ఇవ్వను’ అన్నాడు ఇంటి ఓనరు.. వీళ్లు ఆ ఇంట్లో చేరేముందు. ‘‘అదేం మీకు అడ్డు కాదు. అదేం మీకు అదనపు కంఫర్ట్ కూడా కాదు. దాన్నొదిలేసి మిగతా గదులన్నీ వాడుకోండి’’ అని కూడా అన్నాడు.ఆ ఉత్తరపు గదికి తాళం వేసి ఉండదు. సన్నటి ఇనుప వైరు చుట్టి ఉంటుంది. తీస్తే వచ్చేసేలా ఉంటుంది. కానీ వాళ్లెప్పుడూ దానిని తియ్యాలనుకోలేదు. అసలు ఆ గది గురించి కానీ, గది లోపల ఏముంటుందని కానీ ఆ భార్యాభర్తలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు.క్రితం రోజు రాత్రి కనుక.. వేసవిలో ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలియకపోయుంటే.. అసలు ఎప్పటికీ ఆ ఉత్తరపు గది గురించి మాట్లాడుకునేవారే కాదు! క్రితం రోజు రాత్రి.ఎవరి మంచాలపై వాళ్లు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ ఒక మంచం. పక్కనే కొద్ది దూరంలో పిల్లలిద్దరూ ఒక మంచం. పిల్లలింకా నిద్రపోలేదు. కనుక ఇద్దరూ అమ్మానాన్నకు చెరో పక్కా ఉన్నారు. ‘టప్’మని పెద్ద శబ్దంతో భుజం మీద కొట్టుకున్నాడు అమిత్. ‘‘ఏమైంది డాడీ?’’ పకపకా నవ్వి అడిగింది భవ్య. ‘‘దోమ’’ అన్నాడు అమిత్. ‘‘ఇంత చిన్న దోమను అంత పెద్దగా కొట్టాలా డాడీ’’ అంది.అమిత్ నవ్వాడు. కూతురు నుదుటిపై ముద్దు పెట్టాడు. ‘‘దోమ చిన్నదేరా. కుట్టిన చోట చురుక్కుమనగానే నాకు తెలియకుండానే పెద్దగా కొట్టేశాను’’ అన్నాడు.భార్య అతడి వైపు చూసింది. ‘‘ఇంత ఆవిర్లొస్తుంటే ఇంట్లోకి ఈ దోమలెలా వస్తున్నాయండీ. మనకంటే ఎలాగూ తప్పదు. అద్దె ఇస్తున్నాం’’ అంది పున్నమి. ‘‘సొంత ఇల్లయితే దోమలు ఉండవా మమ్మీ’’ అన్నాడు వినోద్. ‘‘దోమలకు అన్నీ సొంత ఇళ్లేరా’’ అంది భవ్య. అమిత్ నవ్వాడు. పున్నమి ఎండ గురించి మాట్లాడుతుంటే పిల్లలు దోమల టాపిక్‌లోకి వెళ్లిపోయారు. ఎండ తెలిసే వయసా మరి!‘ఎండాకాలం వచ్చేసిందండీ’ అని ఆ ఉదయమే భర్తతో అంది పున్నమి. ఆ సాయంత్రం మళ్లీ.. కిచెన్ నుంచి కొంగుతో మెడ కింద తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి.. ‘‘ఉదయం మార్చి, మధ్యాహ్నం మే, సాయంత్రం ఏప్రిల్’’ అంది. ‘‘నిజమే’’ అని నవ్వాడు అమిత్. పిల్లలు అమ్మానాన్నలకు అటు ఇటు ఛేంజ్ అయ్యారు. పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది.‘‘ఇది ఫ్యాన్ గాలిలా లేదు. ఎండ గాలిలా ఉంది’’ అన్నాడు అమిత్. పున్నమి మౌనంగా ఉంది. పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్?’’ అన్నాడు.‘‘ఆ ఉత్తరపు గది తలుపు తీస్తే కాస్త చల్లగాలి వస్తుందేమో’’ అంది పున్నమి.‘‘నేనూ అదే అనుకుంటున్నా’’ అన్నాడు అమిత్. పిల్లలిద్దర్నీ నిద్దట్లోనే పక్కనున్న మంచం మీద పడుకోబెట్టాడు. తర్వాత వెళ్లి ఉత్తరపు గది తలుపులకు ఉన్న వైరును తొలగించాడు! ఆ ఉత్తరపు గదికి ఒక కిటికీ కూడా ఉంది. ఆ కిటికీ వీళ్లకు బయటి నుంచి కనిపిస్తుంటుంది. ఇప్పుడు గది తలుపులు తియ్యగానే ఇంట్లోంచి కనిపిస్తోంది. వెళ్లి, ఆ కిటికీ కూడా తెరిచాడు అమిత్. ఒక్కసారిగా చల్లటి గాలి లోపలికి వచ్చింది.అయితే గాలి మాత్రమే రాలేదని ఆ కొద్దిసేపటికే.. మంచంపై పడుకుని ఉన్నప్పుడు అమిత్, పున్నమి ఎవరికి వారే గ్రహించారు. ‘‘నీకూ అలానే అనిపించిందా?’’ అన్నాడు అమిత్, ‘‘మీకేమైనా అనిపిస్తోందా?’’ అని పున్నమి అడిగినప్పుడు. ఇద్దరూ అలా పడుకునే, తలతిప్పి ఉత్తరపు గదిలోని ఆ కిటికీ గుండా బయటికి చూశారు. కిటికీ అవతల అంతా ఖాళీ స్థలం. ఓ పెద్ద వేప చెట్టు. చీకట్లో ఆ చెట్టు.. చెట్టులా లేదు. చెట్టు నీడే లేచి కూర్చున్నట్లుగాఉంది!ఆ ఉదయం పిల్లలు లేచే ముందే మళ్లీ ఆ ఉత్తరపు గది తలుపులు మూసి, ఎప్పటిలా వైరు చుట్టేశాడు అమిత్. ‘‘అందుకే అన్నాడంటారా.. ఆ ఇంటి ఓనరు.. ఉత్తరపు గది తలుపులు తియ్యొద్దని?!’’ అంది పున్నమి.. ఆ మధ్యాహ్నం అమిత్ భోజనానికి వచ్చినప్పుడు. అతడి ఆఫీస్.. ఇంటికి దగ్గరే. దగ్గరగా ఉంటుందనే ఆ ఇంటిని ఎంపిక చేసుకున్నారు భార్యాభర్తలు. ‘‘ఛ.. ఛ.. అలాంటిదేమీ అయి ఉండదు. ఏదో భ్రమలాగనిపిస్తోంది.’’ అన్నాడు అమిత్. ‘‘ఇద్దరికీ ఒకే భ్రమా?!’’ అంది పున్నమి. ‘అయుండొచ్చు. నువ్వూనేను వేర్వేరు కాదు కదా’’.. నవ్వుతూ అన్నాడు. పున్నమీ నవ్వింది. ‘‘పిల్లలతో అనేవు. భయపడతారు’’ అన్నాడు అమిత్.. మళ్లీ ఆఫీస్‌కు బయల్దేరుతూ. ఆ రాత్రి పిల్లలిద్దరూ చాలాసేపు నిద్రపోలేదు.అమ్మానాన్న దగ్గరే పడుకుంటామని పట్టుబట్టారు! అమిత్ నిద్రలోకి జారుకుంటుండగా భవ్య అడిగింది.. ‘‘డాడీ.. రాత్రి నీ పక్కన, మమ్మీ పక్కన పడుకున్న ఆ బాబూ, పాప ఎవరు?’’ అని!!ఒక్కసారిగా పున్నమి నిద్ర కూడా వదిలిపోయింది. ‘‘అవును మమ్మీ.. నేను కూడా చూశాను. మధ్యరాత్రిలో మీ మంచం మీద ఎవరో బాబు, పాప ఉన్నారు’’ అన్నాడు వినోద్. - మాధవ్ శింగరాజు -
తెరుచుకున్న శబరిమల ఆలయం
శబరిమల: వార్షిక మండలం–మకరజ్యోతి ఉత్సవాల కోసం ప్రఖ్యాతిగాంచిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. బుధవారం సాయంత్రం తంత్రి (ఆలయ ప్రధాన పూజారి) మహేశ్ మొహన్నరు గుడి తలుపులను తెరిచారు. విరీచికం (మలయాళ నెల తొలి రోజు) సందర్భంగా గురువారం ఉదయం తంత్రి అష్టద్రవ్య మహా గణపతి హోమం నిర్వహించి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆలయం తెరవడంతో దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. 41 రోజులపాటు నిర్వహించే మండల పూజ కార్యక్రమం డిసెంబర్ 26న పూర్తికానుంది. అదే రోజు పూజ తర్వాత గుడి తలుపులు మూసి డిసెంబర్ 30న తెరుస్తారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనం అయిన వారం తర్వాత ఆలయ తలుపులు మూసేస్తారు. -
శ్రీశైలేశుడికి స్వర్ణకాంతులు
- రూ.కోటితో అంతరాలయ ద్వారాలకు బంగారు పూత – ఈఓ భరత్ గుప్త శ్రీశైలం: భ్రమరాంబామల్లికార్జున స్వామి వార్ల అంతరాలయ ద్వారాలు దాతల సహకారంతో బంగారుమయం కానున్నాయని ఈఓ నారాయణ భరత్ గుప్త సోమవారం తెలిపారు. స్వామి వారి అంతరాలయంలోని రెండు ద్వారాలకు, అమ్మవారి గర్భాలయ ద్వారానికి బంగారు తాపడం చేయనున్నట్లు చెప్పారు. దాతల సహకారంతో దాదాపు కోటి రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని 3 నెలలుగా 230 కేజీల రాగి ఉపయోగించి ద్వార బంధాలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. వాటిపైనున్న మూర్తుల ఆర్నమెంటల్ వర్క్ కూడా పూర్తి చేసి ద్వారాలను ఫిట్ చేసి టెస్టింగ్ చేశామన్నారు. ఇక మిగిలింది మలచిన ఈ రాగి రేకులను చెన్నైకు పంపించి అక్కడ కేజిన్నరకు పైగా బంగారంతో 2.69 మైక్రాన్ల మందంతో బంగారు తాపడం చేసే పని ఉందన్నారు. బహుశా శ్రావణ మాసం మొదటి వారంలో ఈ కార్యక్రమం పూర్తి చేసి సంప్రోక్షణాది పూజలను నిర్వహించి అంతరాలయ ద్వారాలను అమర్చనున్నట్లు చెప్పారు. కాగా మల్లికార్జున స్వామి గర్భాలయ విమాన గోపురం 2007లో స్వర్ణమయం అయిందని, అది పూర్తి అయ్యాక ఆరేళ్లకు అమ్మవారి గర్భాలయ గోపురం సువర్ణ శోభను సంతరించుకుందన్నారు. -
తలుపులు పగలగొట్టిన పోలీసులు షాక్..!
ఆమ్స్టర్డ్యామ్: డచ్ పోలీసులకు ఇటీవల వింత అనుభవం ఎదురైంది. ఓ ఇంట్లో మహిళ ఉరేసుకుందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి మరీ ఆమెను కాపాడటానికి ప్రయత్నించారు. అయితే ఆ తరువాతే తెలిసింది వారికి అసలు విషయం. తూర్పు ఆమ్స్టర్డ్యామ్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న కొందరు వ్యక్తులు ఓ ఫ్లాట్‌లో మహిళ ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. కిటికీలోంచి స్పష్టంగా వేలాడుతూ కనిపిస్తున్న ఆ మహిళ కొన్ని గంటలుగా అలా కదలకుండా ఉండటంతో.. వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సైతం ఇదే దృశ్యాన్ని చూసి మహిళ ఉరేసుకుందని భావించారు. కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ స్పందించకపోవటంతో చివరికి తలుపులు పగలగొట్టి.. ఇంట్లోకి ప్రవేశించారు. ఆ మహిళను దగ్గరగా పరిక్షించి చూస్తేగానీ తెలియలేదు.. అది గాలితో నింపిన ఒట్టి బొమ్మ అని. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ అనుభవాన్నంతా మీడియాకు వెల్లడించిన పోలీసులు.. అది బొమ్మ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో సెక్స్ వర్క్‌కు చట్టబద్ధత ఉంది. అక్కడ సెక్స్ షాపుల్లో ఇలాంటి సెక్స్ టాయ్స్ విరివిగా లభిస్తాయి. అయితే బొమ్మకు ఎందుకు ఉరివేశారు అనే విషయం మాత్రం తెలియరాలేదు. -
యూపీవీసీతో లుక్కే వేరు!
♦ ఇంటి అందాన్ని రెట్టింపు చేసేది సింహద్వారమే ♦ దర తక్కువ, మన్నికెక్కువ దేశంలో తలుపులు, కిటికీల మార్కెట్ పరిమాణం ఏటా రూ.15 వేల కోట్లుగా ఉండగా, ఇందులో యూపీవీసీ తలుపులు, కిటికీల వాటా 20 శాతం వృద్ధి రేటుతో రూ.3 వేల కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. సాక్షి, హైదరాబాద్: ఎవరు ఇంటికొచ్చినా ముందుగా వారికి స్వాగతం పలికేవి ఇంటి తలుపులే. అందుకే సింహద్వారం ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్లయితే కలపతో చేయించిన తలుపులు, కిటికీలను వాడేవారు. అయితే ఇవి కొన్నేళ్లయితే చెదలు పట్టడం, పాడవటం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో యూపీవీసీ తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పును తెచ్చాయి. వీటి ధరలు అందుబాటులో ఉండటం, మన్నిక కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో యూపీవీసీ తలుపులు, కిటికీలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. అన్‌ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్‌ను సంక్షిప్తంగా యూపీవీసీ అంటాం. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు. సౌకర్యాలెన్నో.. ♦ యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం. యూపీవీసీ తలుపులు, కిటికీలు 2,400 పీఏ ఒత్తిడి (సుమారుగా గంటకు 230 కి.మీ.వేగం)ని కూడా తట్టుకుంటాయని బ్రిటిష్ ప్రమాణాల్లో తేలింది. ♦ సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీ లు 300 పీఏ వరకు నీటిలో తడిసినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారుగా 30 ఏళ్లు. ♦ యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తుప్పు పట్టడం వంటివి పట్టవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వే యాల్సిన అవసరం కూడా లేదు. ♦ అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినా మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. దీంతో నష్టం చాలా వరకు త గ్గుతుంది. ♦ యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్దాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్దాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీంతో ఇంట్లో విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ♦ సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అంటే యూపీవీసీ తలుపులు, కిటికీలు పర్యావరణహితమైనవి. అంతేకాకుండా యూపీవీసీ తలుపులు, కిటికీలకు ఉండే స్క్రూలు, గ్రిల్స్ బయటికి కన్పించవు. దీంతో దొంగలు వీటిని ఛేదించడం అంత సులువు కాదు. -
మసీదులోకి మహిళల ఎంట్రీకీ ఓకే!
తిరువనంతపురం: కేరళలోని ఓ ప్రసిద్ధ మసీదు ఓ చారిత్రక పరిణామానికి నాందిగా నిలిచింది. మసీదులోకి ప్రవేశానికి ముస్లిం మహిళలకు మొదటిసారి అనుమతి లభించింది. ప్రసిద్ధ తజతంగడి జుమ్మా మసీదు లో మొట్టమొదటిసారిగా కమిటీ తీసుకున్న నిర్ణయంతో ముస్లిం మహిళలు కూడా ప్రార్థనలు చేసుకునే అవకాశం కలిగింది. ఈ మేరకు ముస్లిం పెద్దలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. "తాజ్ జుమ మసీద్ " గా ప్రసిద్ధి చెందిన ఈ మసీదులోకి మహిళల ప్రవేశానికి ద్వారాలు తెరుస్తూ మసీదు కమిటీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల సాంప్రదాయానికి చరమ గీతం పాడుతూ మసీదు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. స్థానిక ముస్లిం కార్యకర్తలు నిరంతర ప్రచారం , ఉద్యమం తర్వాత ఈ ఘన విజయాన్ని సాధించారు కాగా మీనచిల్ నది ఒడ్డున కొట్టాయం కు సమీపంలో ఉన్న ఈ మసీదు భారత దేశంలోని అత్యంత పురాతనమైన మసీదులలో ఒకటి.1000 సంవత్సరాల కంటే ప్రాచీనమైన ఇది నిర్మాణ శోభకు,కొయ్య చెక్కడాలలో అందానికి ప్రసిద్ధి చెందింది. ఈ మసీదు ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ అనుచరులచే కేరళకు వారి మొదటి ప్రయాణాల సందర్భంగా నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. -
ఇంట్లో దుర్వాసన తగ్గాలంటే..
ఇంటిప్స్ తలుపులు, కిటికీలు తెరిచి ఉంచి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూడాలి.రాత్రిపూట కార్పెట్‌పై బేకింగ్ సోడా చల్లి, మరుసటి రోజు ఉదయం వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరచాలి.బకెట్ వేడి నీళ్లలో కప్పు అమోనియా కలిపి, ఆ నీళ్లతో ఫ్లోర్ తుడవాలి.అమోనియా కలిపిన వేడి నీటిలో డోర్‌మ్యాట్స్ నానబెట్టి, ఉతకాలి. ఫ్లోర్ తడి లేకుండా జాగ్రత్తపడాలి.ఫర్నీచర్, కార్పెట్స్, కర్టెన్స్ శుభ్రంగా ఉంచాలి. కిచెన్ సింక్‌లో క్యారట్, ఉల్లి, బంగాళదుంప తొక్కలు మిగిలిపోతే దుర్వాసన వస్తుంది. కొద్దిగా ఐస్‌ను గ్రైండ్ చేసి వేయాలి. దాని మీద బొరాక్స్ పౌడర్‌ను చల్లి, పై నుంచి నీళ్లు పోయాలి. సింక్‌లో నీళ్లు పోయే పైప్ దగ్గర మూత వేసి, దాంట్లో ఒక అంగుళం మేర వేడి నీళ్లు పోయాలి. దాంట్లో పిడికెడు బేకింగ్ సోడా వేయాలి. తర్వాత ఆ నీటిని వదిలేయాలి. వేడినీళ్లు, బేకింగ్ సోడా వల్ల సింక్‌లో దుర్వాసన వదులుతుంది. ఈ జాగ్రత్తలు ఇంటిని దుర్వాసన నుంచి విముక్తి చేస్తాయి. -
కొత్త తలుపులు
ఇంట్లోకి అడుగుపెట్టాలంటే తలుపు తెరవాలి. ముందు మన కంట్లో పడేది తలుపులే కాబట్టి వాటి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాణ్యతతో పాటు డిజైన్లు కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా మెయిన్‌డోర్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. తలుపు ఎంత అందంగా ఉంటే మన తలపులు అంత స్పెషల్‌గా ఉంటాయను కుంటున్నారో ఏమో...వాటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి మరీ డిజైన్ చేయించుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న తలుపుల్ని చూశారు కదా, ఎంత అందంగా ఉన్నాయో! అందమొక్కటే ఇక్కడ విషయం కాదు..వెరైటీని కూడా కోరు కుంటున్నారు. గుర్రం మొదలు ఏనుగు వరకూ అన్ని జంతువుల్ని తలుపులెక్కించేస్తున్నారు. ఒక్క జంతువులనే కాదు గడియారం మోడల్, మెట్లు...ఆకారంలో కూడా తలుపుల్ని తయారుచేయించుకుంటున్నారు. రకరకాల రంగుల్లో వచ్చే గ్లాస్డోర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాని వుడ్‌తో చేయించుకునే తలుపుల్లో వచ్చే వెరైటీలే ఎక్కువ ఆకర్షణగా ఉంటాయి. మీ కొత్తింటి కోసం తయారు చేయించుకునే తలుపులు ఇలా ఉండేలా ప్లాన్ చేసుకోండి.