యూపీవీసీతో లుక్కే వేరు! | different look with upvc | Sakshi
Sakshi News home page

యూపీవీసీతో లుక్కే వేరు!

Published Sat, Apr 30 2016 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

యూపీవీసీతో లుక్కే వేరు!

యూపీవీసీతో లుక్కే వేరు!

ఇంటి అందాన్ని రెట్టింపు చేసేది సింహద్వారమే
దర తక్కువ, మన్నికెక్కువ

దేశంలో తలుపులు, కిటికీల మార్కెట్ పరిమాణం ఏటా రూ.15 వేల కోట్లుగా ఉండగా, ఇందులో యూపీవీసీ తలుపులు, కిటికీల వాటా 20 శాతం వృద్ధి రేటుతో రూ.3 వేల కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా.

సాక్షి, హైదరాబాద్: ఎవరు ఇంటికొచ్చినా ముందుగా వారికి స్వాగతం పలికేవి ఇంటి తలుపులే. అందుకే సింహద్వారం ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్లయితే కలపతో చేయించిన తలుపులు, కిటికీలను వాడేవారు. అయితే ఇవి కొన్నేళ్లయితే చెదలు పట్టడం, పాడవటం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో యూపీవీసీ తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పును తెచ్చాయి. వీటి ధరలు  అందుబాటులో ఉండటం, మన్నిక కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో యూపీవీసీ తలుపులు, కిటికీలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.

 అన్‌ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్‌ను సంక్షిప్తంగా యూపీవీసీ అంటాం. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు.

 సౌకర్యాలెన్నో..
యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం. యూపీవీసీ తలుపులు, కిటికీలు 2,400 పీఏ ఒత్తిడి (సుమారుగా గంటకు 230 కి.మీ.వేగం)ని కూడా తట్టుకుంటాయని బ్రిటిష్ ప్రమాణాల్లో తేలింది.

 సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీ లు 300 పీఏ వరకు నీటిలో తడిసినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారుగా 30 ఏళ్లు.

 యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తుప్పు పట్టడం వంటివి పట్టవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వే యాల్సిన అవసరం కూడా లేదు.

 అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినా మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. దీంతో నష్టం చాలా వరకు త గ్గుతుంది.

 యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్దాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్దాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీంతో ఇంట్లో విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.

 సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అంటే యూపీవీసీ తలుపులు, కిటికీలు పర్యావరణహితమైనవి. అంతేకాకుండా యూపీవీసీ తలుపులు, కిటికీలకు ఉండే స్క్రూలు, గ్రిల్స్ బయటికి కన్పించవు. దీంతో దొంగలు వీటిని ఛేదించడం అంత సులువు కాదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement