ఇంట్లో దుర్వాసన తగ్గాలంటే..
ఇంటిప్స్
తలుపులు, కిటికీలు తెరిచి ఉంచి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూడాలి.రాత్రిపూట కార్పెట్‌పై బేకింగ్ సోడా చల్లి, మరుసటి రోజు ఉదయం వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరచాలి.బకెట్ వేడి నీళ్లలో కప్పు అమోనియా కలిపి, ఆ నీళ్లతో ఫ్లోర్ తుడవాలి.అమోనియా కలిపిన వేడి నీటిలో డోర్‌మ్యాట్స్ నానబెట్టి, ఉతకాలి. ఫ్లోర్ తడి లేకుండా జాగ్రత్తపడాలి.ఫర్నీచర్, కార్పెట్స్, కర్టెన్స్ శుభ్రంగా ఉంచాలి.
కిచెన్ సింక్‌లో క్యారట్, ఉల్లి, బంగాళదుంప తొక్కలు మిగిలిపోతే దుర్వాసన వస్తుంది. కొద్దిగా ఐస్‌ను గ్రైండ్ చేసి వేయాలి. దాని మీద బొరాక్స్ పౌడర్‌ను చల్లి, పై నుంచి నీళ్లు పోయాలి. సింక్‌లో నీళ్లు పోయే పైప్ దగ్గర మూత వేసి, దాంట్లో ఒక అంగుళం మేర వేడి నీళ్లు పోయాలి. దాంట్లో పిడికెడు బేకింగ్ సోడా వేయాలి. తర్వాత ఆ నీటిని వదిలేయాలి. వేడినీళ్లు, బేకింగ్ సోడా వల్ల సింక్‌లో దుర్వాసన వదులుతుంది. ఈ జాగ్రత్తలు ఇంటిని దుర్వాసన నుంచి విముక్తి చేస్తాయి.