Stink
-
కొడుకు శవంతో 4 రోజులు వృద్ధుడి సహవాసం.. దుర్వాసన రావటంతో..!
చండీగఢ్: పిల్లలు లేకపోవటంతో బాలుడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు ఓ 82 ఏళ్ల వృద్ధుడు. అమాయకత్వం, ఇతరులతో కలుపుగోలుగా ఉండకపోవటంతో పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అయితే, అనారోగ్యంతో దత్తత తీసుకున్న కుమారుడు నాలుగు రోజుల క్రితం మృతి చెందగా.. ఏం చేయాలో తెలియని వృద్ధుడు శవం వద్దే ఉండిపోయాడు. నాలుగు రోజుల తర్వాత ఇంట్లోంచి దుర్వాసన రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అపస్మారక స్థితిలో మృతదేహం వద్ద పడిపోయి ఉన్న వృద్ధుడిని సోమవారం రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘సమాచారం అందుకోవటంతో అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాం. మృతదేహం వద్దే వృద్ధుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన ఏమీ చెప్పటం లేదు. మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఆయనకు అంతగా ఏమీ తెలిసేలా కనిపించటం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.’ అని పోలీసు అధికారి పాల్ చంద్ తెలిపారు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. మృతి చెందిన సుఖ్విందర్ సింగ్ అనే వ్యక్తి బల్వాంత్ సింగ్‌కు దత్తపుత్రుడిగా స్థానికులు తెలిపారు. ‘వారిని ఇటీవల ఎవరైనా పలకరించారా అనే విషయం తెలియదు. గత నెల రోజులకుపైగా వృద్ధుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందో మాకు తెలియదు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాం.’ అని వెల్లడించారు స్థానికులు. ఇదీ చదవండి: చెల్లి శవంతో 4 రోజులు సహవాసం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. -
RJ Malishka: ముంబై కీ రాణీ.. ఆమె స్పెషాలిటీ ఏంటంటే!
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త కుండీలో చెత్త పేరుకుపోయి, దుర్గంధం వెలువడుతుంటే ముక్కు మూసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోతాం. కానీ రేడియో జాకీ మలిష్క అలా చేయదు. ఆ చెత్తనంతటిని క్లియర్ చేసే అధికారులు వచ్చేంత వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటుందామె. రేడియో జాకీ మలిష్క మెండన్సా ఆర్జే అయ్యిండి చెత్త గురించి మాట్లాడటం ఏంటీ? అని అంతా అనుకునేవారు. కానీ ముంబైలో పరిష్కారం కాని అనేక సమస్యలు.. సరిగా లేని రోడ్లు, వర్షంనీటితో నిండిపోయిన కాలనీలు... ఏవైనా సరే వాటి గురించి వెంటనే మలిష్క తన షోలో చెప్పేస్తుంది. అది మున్సిపల్ అధికారులకు చేరగానే వాటిని సరిచేస్తారు. కొన్నిసార్లు మలిష్క పద్ధతి అధికారులకు కోపం తెప్పించినప్పటికీ తను ఏమాత్రం వెనక్కు తగ్గదు. ఒకపక్క దేశంలోనే నంబర్ వన్ ఆర్జేగా శ్రోతల్ని అలరిస్తూ, మరోపక్క సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దీంతో మలిష్కను సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలో అవుతున్నారు. వినేకొద్ది వినాలనిపించే స్వరం, తన మాటల గారడీతో శ్రోతల్ని కట్టిపడేసే మలిష్క ముంబైలో పుట్టిపెరిగిన అమ్మాయి. పదమూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. దీంతో ఆమె తల్లి లిల్లీ మెండన్సా అన్నీ తానై మలిష్కను పెంచారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, ముంబై యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్లో మాస్టర్స్ చేసింది మలిష్క. ముంబైకీ రాణీ చిన్నప్పటి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే మలిష్క చాలా యాక్టివ్‌గా స్టేజ్ మీద మంచి ప్రతిభ కనబరిచేది. స్కూల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది, భరత నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకోవడంతో.. టీచర్స్‌డే, చిల్డ్రన్స్ డేకు తప్పకుండా తన ఫెర్ఫార్మెన్స్ ఉండి తీరేది. కాలేజీ రోజుల్లో కాలేజ్ బ్యాండ్‌లో గాయనిగా రాణించింది. చదువు పూర్తయిన వెంటనే, అడ్వరై్టజింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరింది. బాలీవుడ్ దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్ దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, మానేసి హిందీ డిస్కవరి ఛానెల్లో వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఇలా రెండేళ్లు్ల పనిచేసాక...‘‘విన్ 94.6 ఎఫ్ఎమ్’’ లో ఆర్జేగా అవకాశం వచ్చింది. దీంతో మలిష్క ఆర్జే ప్రయాణం మొదలైంది. దీనిలో రెండేళ్లు చేసిన తరువాత రెడిఫ్ రేడియోకు మారింది. ఇక్కడ కొన్ని నెలలు మాత్రమే ఉంది. తరువాత రెడ్ ఎఫ్ఎమ్లో చేరింది. ఇక్కడ తను పాల్గొనే షోలలో మాటలతో గారడీ చేస్తూ, ముంబైలోని సామాజిక అంశాలపై మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. తన షోకు వచ్చే కాలర్స్‌ను అలరిస్తూ ‘ముంబై కీ రాణి’గా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం రెడ్ ఎఫ్ఎమ్ 93.5లో ఆర్జేగా పనిచేస్తో్తంది. మలిష్క చేసిన.. మార్నింగ్ నంబర్ వన్ విత్ మలిష్క, ఎమ్ బోలే షోలు బాగా పాపులర్ అయ్యాయి. హిందీలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ షో గా ‘మార్నింగ్ వన్’ నిలిచి వరుసగా నాలుగేళ్లపాటు ఇండియన్ ఎక్స్‌లెన్స్ రేడియో అవార్డులను అందుకుంది. అంతేగాక ఓటీటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అవార్డుల కార్యక్రమంలో ‘డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు మలిష్కకు దక్కింది. 2019లో తొలిసారిగా దాదాసాహేబ్ ఫాల్కే ఆర్జే అవార్డులను ప్రవేశపెట్టగా.. తొలి అవార్డుని మలిష్క అందుకుంది. ఆర్జేగానేగాక.. రేడియో జాకీగా పనిచేస్తూనే మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, తుమారి సులులో విద్యాబాలన్ ఆర్జేగా నటించేందుకు మలిష్క శిక్షణ ఇచ్చింది. హాలీవుడ్ సినిమాలు ద ఇన్క్రెడి బుల్స్, మిరాగే, థోర్: రంగ్రూక్, స్క్రేపర్ –14 వంటి వాటికి హిందీలో డబ్బింగ్చెప్పింది. సామాజిక కార్యకర్తగా.. రాజకీయ నాయకులు, ముంబై మున్సిపల్ అథారటీ, బీఎమ్సీ కేంద్రంగా సమస్యలపై రేడియో కేంద్రంగా తన గళమెత్తడమేగాక, ప్రేమ పెళ్లిళ్ల గురించి యువతీ యువకులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఈక్రమంలోనే సెక్స్ వర్కర్ల పిల్లలను కలవడానికి షారుఖ్ ఖాన్‌ను, చార్ బాటిల్ రాజ్ కా క్యాంపెయిన్‌కు సల్మాన్‌ఖాన్‌ను, అమితాబ్ బచన్ గార్డెన్ లో ధారావి మురికివాడల పిల్లలను ఆహ్వానించేలా కృషిచేసింది. గత పదిహేనేళ్లుగా ముంబై రెడ్ ఎఫ్ఎమ్లో సక్సెస్‌పుల్ రేడీయో జాకీగా... నంబర్‌వన్ ఆర్జేగా నిలుస్తూ ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణనిస్తోంది. -
ఒంటి దుర్వాసనతో కుంగి పోతున్నాను
హెయిర్ అండ్ స్కిన్ కౌన్సెలింగ్ నాకు చాలా ఎక్కువగా చెమట పడుతుంటుంది. చెమట దుర్వాసన కూడా ఎక్కువేనని ఫ్రెండ్స్ అంటున్నారు. ఈ సమస్య నన్ను చాలా వేధిస్తోంది. నలుగురిలో కలవలేక మానసికంగానూ కుంగిపోయేలా చేస్తోంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి. – ఆర్. వేణుప్రసాద్, రాజమండ్రి చెమట పట్టడంతో ఒంటి నుంచి దుర్వాసన రావడం అన్నది కొందరిలో సాధారణం కంటే మరింత ఎక్కువ. ఇలా చెమట కారణంగా ఒంటి నుంచి దుర్వాసన రావడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. ఉదాహరణకు... ∙ఇక స్థూలకాయంతో ఉన్నవారు, ఇతర చర్మ సమస్యలు / ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి దుర్వాసన సమస్య అధికం. ముఖ్యంగా ఇంటెర్ట్రిగో, ట్రైకోమైసోసిస్, ఎరిత్మా సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య మరీ ఎక్కువ. ∙ఇక కొందరిలో దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం, గౌట్, మూత్రపిండాలు, కాలేయం సమస్యలు, టైఫాయిడ్ ఉన్నప్పుడు కూడా వారి నుంచి చెడువాసన వస్తుంటుంది. అలాగే శుభ్రత విషయంలో బద్దకంగా ఉండేవారిలోనూ, మద్యం సేవించేవారి దగ్గర్నుంచి, పెన్సిలిన్, బ్రోమైడ్స్ వంటి మందుల వాడకం వల్ల కూడా మేని నుంచి దుర్గంధం వెలువడటం అనే సమస్య తలెత్తవచ్చు. ఆహారం వల్ల... కొందరు తీసుకునే ఆహారంలో వేపుళ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, కొన్ని రకాల ఆకుకూరలు, కెఫిన్ ఉన్న పానీయాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. దుర్వాసన తొలగించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు ముందుగా తమకు ఏ కారణం చేత ఒంటి నుంచి దుర్వాసన వస్తోందో తెలుసుకోవాలి. సాధారణంగా ఆ సమస్య (అండర్లైయింగ్ ప్రాబ్లమ్)ను పరిష్కరించుకుంటే మేని దుర్వాసన సమస్య ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఇక అందరూ పాటించదగ్గ సూచనలు ఇవి... ∙ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేయడం ∙ బాహుమూలాలను సబ్బుతో బాగా శుభ్రం చేసుకోవడం ∙చెమట అధికంగా పట్టే ప్రదేశాలను పొడిగా, శుభ్రంగా ఉంచుకోవడం ∙తొడుక్కునే దుస్తులు చెమటను పీల్చుకునేవి, శుభ్రమైనవి, పొడిగా ఉండేవి ధరించడం ∙బాక్టీరియా సంఖ్యను తగ్గించేది, చర్మతత్వానికి సరిపడే డియోడరెంట్స్ వాడటం ∙అలాగే వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా వాసనకు కారణమయ్యే బాహుమూలాల్లోని వెంట్రుకలను తొలగించుకోవాలి. యాంటీసెప్టిక్ సబ్బులను స్నానానికి ఉపయోగించాలి. శరీర దుర్వాసనను పెంచే ఆహారపదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలి ∙తాజా ఆహారం తీసుకోవడం, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కేవలం ఒంటి దుర్వాసన సమస్యే కాకుండా, ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. శరీరానికి పూసే లేపనాలతో... సాధారణంగా చెమటలు పట్టేవారు యాంటీపెర్స్పిరెంట్స్, డియోడరెంట్స్ అనే శరీరానికి పూసే లేపనాలతో తమ శరీర దుర్వాసనను తగ్గించుకుంటుంటారు. యాంటీ పెర్స్పిరెంట్స్ అన్నవి పేరును బట్టి చెమట పట్టడాన్ని తగ్గించవు. కానీ ఇందులో ఉండే అల్యూమినియమ్ క్లోరోహైడ్రేట్, అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియమ్ ఫీనాల్ సల్ఫొనేట్, అల్యూమినియమ్ సల్ఫేట్, జిర్కోనియమ్ క్లోరో హైడ్రేట్స్ వంటి లవణాలు ఉంటాయి. ఇవి చెమటగ్రంథి ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేసి, చెమట తక్కువగా పట్టేలా చేస్తాయి. వాటి ప్రభావం తగ్గాక మళ్లీ చెమటపడుతుంది. ఇలా తాత్కాలికంగా చెమటగ్రంథిని మూసేస్తుంది కాబట్టి దీన్ని యాంటీపెర్స్పిరెంట్స్ అంటారు. అందుకే యాంటీపెర్స్పిరెంట్స్ను శరీరంలో చెమట ఎక్కువగా స్రవించే ప్రాంతాల్లో పూస్తారు. ఇక డియోడరెంట్స్ విషయానికి వస్తే వీటిని అటు బాహుమూలాలతో పాటు చర్మంపైన ఏ ప్రాంతంలోనైనా పూయవచ్చు. డియోడరెంట్స్‌లో ఉండే అమోనియమ్ అలమ్, పొటాషియమ్ అలమ్ తాత్కాలికంగా చెమటలోని వాసన కలిగించే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. వాటి ప్రభావం తొలిగాక ఆ బ్యాక్టీరియా మళ్లీ పుడుతూనే ఉంటుంది. ఎలాంటి షాంపూ వాడితే మేలు? మార్కెట్లో చాలారకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి కదా. వాటిలో ఏది ఎంచుకోవాలా అనే అంశంపై మాకు కొంచెం అయోమయంగా ఉంది. సాధారణంగా మంచి షాంపూను ఎంచుకోవడానికి ఎలాంటి మార్గదర్శకాలు పాటించవచ్చో వివరించండి. – డి. మాధవీలత, హైదరాబాద్ సాధారణంగా అందరి వెంట్రుకలూ ఒక్కలా ఉండవు కాబట్టే... అందరి షాంపూ అవసరాలూ ఒకేలా ఉంటాయని చెప్పలేం. మన అవసరాలను బట్టి మార్కెట్లోకి రకరకాల షాంపూలు అందుబాటులోకి వచ్చాయి.ఇంకా వస్తున్నాయి. మన అవసరాలను బట్టి మనం ఎలాంటి షాంపూలను ఎంచుకోవచ్చో చూద్దాం. అందరూ వాడదగ్గవి: ఇందులో శుభ్రపరిచే సామర్థ్యం (క్లెన్సింగ్ ఎబిలిటీ) నార్మల్‌గా ఉంటుంది. నార్మల్ హెయిర్ కోసం వాడాల్సిన ఈ షాంపూలు సాధారణంగా లారిల్ సల్ఫేట్ అనే నురగవచ్చే పదార్థంతో తయారవుతాయి. ఇందులో ఆ రసాయనంతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు ఉత్పత్తిదారులు రకరకాల సుగంధ ద్రవ్యాలను చేర్చి వాటిని మంచి సువాసన వచ్చేలా రూపొందిస్తారు. ఇవి ఎవరైనా వాడవచ్చు. కాబట్టి మార్కెట్లో ఉన్న రకరకాల బ్రాండ్స్‌ను వాడుతూ (ట్రై చేస్తూ) మీకు ఏది అనువైనదో, సౌకర్యమో అది వాడుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఛాయిస్ షాంపూను మీ సంతృప్తి మేరకు కొనసాగించవచ్చు. పొడి వెంట్రుకలు ఉండేవారికి: వెంట్రుకలు చాలా పొడిగా ఉండేవారికోసం తయారయ్యే షాంపూల్లో రోమాన్ని శుభ్రపరిచే రసాయనాలు మరీ తీవ్రంగా లేకుండా చూస్తారు. అంటే మైల్డ్ క్లెనింగ్ ఏజెంట్స్‌ను ఉపయోగించి చేస్తారు. దాంతో పాటు వెంట్రుక కండిషనింగ్ కోసం అందులో సిలికోన్ వంటి ఏజెంట్స్, కెటాయినిక్ పాలిమర్స్‌ను కలుపుతారు. వాటిని ఉపయోగించాక ఆ సిలికోన్ పొడి వెంట్రుకల మీద సమంగా విస్తరించి ఒక కోటింగ్‌లా ఏర్పడుతుంది. కాబట్టి పొడి వెంట్రుకలు ఉన్నవారికి సిలికోన్, కెటాయినిక్ పాలిమర్స్ ఇంటి ఇన్‌గ్రేడియెంట్స్ ఉన్నవి మంచి షాంపూలుగా పరిగణించవచ్చు. మీరు పొడి వెంట్రుకలు కలవారేతే... పేన చెప్పిన ఇన్‌గ్రేడియెంట్స్ షాంపూలో ఉన్నాయో లేవో చూసి తీసుకోవచ్చు. జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి: ఇక జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి అవసరమైన షాంపూలను మాడుపైన, వెంట్రుకపైన ఉన్న అదనపు సీబమ్‌ను తొలగించేలా డిజైన్ చేస్తారు. ఇందులో క్లెన్సింగ్ ఏజెంట్‌గా లారిల్ సల్ఫేట్‌తో పాటు అదనపు నూనెవంటి స్రావాలను తొలగించడానికి సల్ఫోసక్సినేట్ వంటి రసాయనాలు ఉండేలా తయారు చేస్తారు. అయితే జిడ్డు కురులు ఉన్నవారికి రూపొందించే షాంపూలలో కండిషనింగ్ తక్కువగా ఉండేలా చూస్తారు. కాబట్టి పైన పేర్కొన్న కాంబినేషన్స్ ఉన్నవి జిడ్డు కురుల వారు ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే కురులు మరీ నిర్జీవంగా మారిపోతాయి. పీచులా కనిపించే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ఎంత తరచుగా వాడాలన్నది కేవలం మీ విచక్షణ (డిస్క్రిషన్) మేరకే ఉంటుంది. డాక్టర్ స్వప్నప్రియ డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
చెడు వాసన దూరం
బట్టలు ఉతికాక అందులో కొన్ని చుక్కల వైట్ వెనిగర్ వేసి నానబెట్టి, పది నిమిషాల తర్వాత ఆరేయాలి. ఇలా చేస్తే బట్టల దుర్వాసన వదులుతుంది. ఇంట్లో పొగ, ఇతర మాడు వాసన త్వరగా పోవాలంటే వైట్ వెనిగర్‌ను ఒక చిన్న గిన్నెలో పోసి గదిలో ఉంచాలి. అర సగం నిమ్మ ముక్కను ఉప్పులో అద్ది, దాంతో వంటగదిలోని పొయ్యి గట్టు తుడిచి కడిగితే క్రిములు, దుర్వాసన దరిచేరకుండా ఉంటాయి.డ్రై వాష్ నుంచి తెచ్చిన దుస్తులను అలాగే ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచకుండా, తీసి అల్మరాలో భద్రపరచాలి. కొన్నాళ్లుగా ప్లాస్టిక్ బ్యాగులో దుస్తులు అలాగే ఉంచితే చెడువాసన రావడంతో పాటు అవి అక్కడక్కడా పసుపు రంగుమారే అవకాశం ఉంది. కొత్త షూస్ బిగుతుగా ఉంటే లోపలివైపు హెయిర్ డ్రయ్యర్‌తో వెచ్చగా చేసి, కొద్దిగా అటూ ఇటూ లాగి వదలాలి. ఇలా చేయడం వల్ల షూస్ వదులు అవుతాయి. పాదాలకు నొప్పి ఉండదు. రోజూ వాడుతున్న షూస్‌కి ఇలా అప్పుడప్పుడు హెయిర్ డ్రయ్యర్‌ని ఉపయోగిస్తే షూ దుర్వాసన తగ్గుతుంది. వానకాలం తడిగా అయిన లెదర్ చెప్పులు, షూష్లోపల చెమ్మను పోగొట్టాలంటే డ్రయ్యర్‌ని ఉపయోగిస్తే త్వరగా పొడిబారుతాయి. -
ఇంటిప్స్
రిఫ్రిజిరేటర్లో దుర్వాసన రాకుండా ఉండాలంటే తాజా బ్రెడ్ స్లైస్‌ని ఫ్రిజ్‌లో ఉంచాలి. చెడువాసనను బ్రెడ్ పీల్చుకుని ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచుతుంది.ఏదైనా పదార్థాలను డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్‌కి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను కలిపితే నూనెను ఎక్కువగా పీల్చుకోవు. వండటం పూర్తయ్యాక కూరలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వెంటనే ఒక బంగాళా దుంపని ఉడికించి, చిదిమి గ్రేవీలో వేస్తే ఉప్పును పీల్చేస్తుంది. గ్రేవీ పలుచగా ఉన్నా కూడా ఉడికించిన బంగాళాదుంపను మాష్ చేసి వేయాలి. -
రుచికే కాదు... ఆరోగ్యానికి కూడా!
తీపి వంటకాల్లో యాలకులను వేయడం వల్ల వాటికి మంచి రుచి, వాసన వస్తాయి. దీంతో ఆయా వంటకాలను తినాలనిపిస్తుంది. అయితే యాలకులు కేవలం వంటలకు రుచినివ్వడమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక లాభాలు చేకూరుస్తాయి. అవేమిటో చూద్దాం... ►భోజనం చేసిన వెంటనే ఒకటి రెండు యాలకులను నములుతూ ఉంటే నోటి దుర్వాసన పోతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ►ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో యాలకులు మెరుగ్గా పనిచేస్తాయి. రోజుకు మూడు, నాలుగుసార్లు కొన్ని యాలకులను తీసుకుని బాగా నమిలి చప్పరిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ►యాలకులను రోజూ తింటుంటే గుండె సమస్యలు పోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. ►రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ యాలకులను తినాలి. దీంతో రక్తం పెరుగుతుంది. ►శరీరంలో ఉన్న విష, వ్యర్థపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. ►రెండు, మూడు యాలకులు, లవంగాలు, చిన్న అల్లం ముక్క, ధనియాలను తీసుకుని పొడి చేసి, గ్లాస్ వేడినీటిలో కలుపుకుని తాగితే అజీర్ణ సమస్య పోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. ►సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. -
ఎన్నాళ్లీ.. దుర్గంధం !
♦ అపరిశుభ్రంగా ఏడీఏ కార్యాలయం ♦ స్వచ్ఛత మరచిన అధికారులు ♦ మురుగు, పిచ్చిమొక్కలను తొలగించాలని సిబ్బంది వేడుకోలు సూర్యాపేట వ్యవసాయం : స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా మారుతు న్నా.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల వ్యవసాయ డివిజన్ కార్యాలయం మాత్రం అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. ఈ కార్యాలయంలో ఏడీఏతోపాటు ఏఓ విధులు నిర్వహిస్తుంటారు. వీరికోసం ప్రతిరో జూ రైతులు వచ్చిపోతుంటారు. కానీ వ్యవసాయం కార్యాలయ ఆవరణలో పిచ్చి మొక్కలు మొలిచి కనిపిస్తోంది. దీనికితోడు కార్యాలయం ప్రవేశద్వారం ముందు లోపల గోడ పక్కనే ముగురునీరు నిలిచి ఉండడంతో దుర్వాసన వస్తోంది. ఫలితంగా ముక్కు మూసుకుని కార్యాలయంలోనికి వెళ్లాల్సిన పరిస్ధితి నెలకొందని కార్యాలయానికి వచ్చే రైతాంగంతో పాటు సిబ్బంది పేర్కొం టున్నారు. వర్షాకాలం కావడంతో పాములు ఇతర క్రిమికీటకాలు వచ్చే ప్రమాదముందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించి నీడనిచ్చే చెట్లను నాటి, మురికి నీరు కార్యాలయంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. మున్సిపాలిటీ వారికి చెప్పాం.. కార్యాలయం ముందు భాగంలో ఉన్న మురికి కాల్వ గుండా నీరు సరిగ్గా పోకపోవడంతో నిత్యం నిల్వ ఉంటోంది. దీంతో దుర్గంధం వ్యాపిస్తోంది, మురికి కాల్వలో చెత్తాచెదారం తొలగించి మురుగు పోయేలా చూడాలి. ఈ విషయాన్ని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కానీ వారు పట్టించుకోవడంలేదు. మరోసారి వారికి తెలియపరుస్తాం. – శంక్ర్రాథోడ్, ఏడీఏ సూర్యాపేట -
రాగి వస్తువులు మెరవాలంటే...
ఇంటిప్స్ రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దాలి. అలా చేస్తే అవి కొత్త వాటిలా మెరవడం ఖాయం.ప్లాస్క్‌లో గంటల తరబడి టీ కానీ కాఫీ కానీ పోసి ఉంచడం వల్ల అది శుభ్రపరిచేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఆ దుర్వాసనను పోగొట్టాలంటే డిష్వాషర్ కంటే ముందు దాన్ని మజ్జిగతో శుభ్రం చేయాలి. పచ్చి కొబ్బరి చిప్పలు ఒక వారం పాటు తాజాగా ఉండాలంటే రోజూ నిమ్మరసాన్ని ఆ చిప్పలకు రుద్దితే చాలు. రోజూ చేసుకునే వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడి కలిపితే వంట రుచిగా ఉండటంతో పాటు తినే వారికి విటిసిన్-సి అందుతుంది.పావుకప్పు బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని వెండిసామానుకు రాసి, మెత్తని కాటన్ క్లాత్‌తో తుడిస్తే తళతళ మెరుస్తాయి. -
ఇంటిప్స్
రిఫ్రిజిరేటర్లో దుర్వాసన రాకుండా ఉండాలంటే తాజా బ్రెడ్ స్లైస్‌ని ఫ్రిజ్‌లో ఉంచాలి. చెడువాసనను బ్రెడ్ పీల్చుకుని ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచుతుంది. బాదం పప్పులను ఒక నిమిషం వేడినీటిలో నాననిస్తే, పొట్టు త్వరగా వచ్చేస్తుంది.అల్లం, వెల్లుల్లి పేస్టులో అల్లం నలభై శాతం, వెల్లుల్లి అరవై శాతం వేసుకుంటే కూరలు రుచిగా ఉంటాయి. వండటం పూర్తయ్యాక కూరలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వెంటనే ఒక బంగాళ దుంపని ఉడికించి, చిదిమి గ్రేవీలో వేస్తే ఉప్పును పీల్చేస్తుంది. పలచగా ఉన్నా కూడా ఉడికించిన బంగాళదుంపను చిదిమి అందులో వేయాలి. ఏదైనా పదార్థాలను డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్‌కి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను కలిపితే నూనెను ఎక్కువగా పీల్చుకోవు. మెత్తగా, దూదిపింజెల్లాంటి ఇడ్లీలు కావాలంటే పిండిని ప్లేట్లలో వేసేటప్పుడు కలపకుండా ముందురోజే బాగా కలిపి ఉంచుకోవాలి. కూరగాయలను తొక్కతోపాటుగా ఉడికిస్తే అందులోని పోషకాలు పోకుండా ఉంటాయి. అప్పడాలను పాలిథిన్ కవర్లో పెట్టి పప్పులు, బియ్యంతోపాటు పెడితే విరిగిపోకుండా ఉంటాయి. -
కాలుష్య కోరల్లో పల్లెలు
-తరచూ రోగాల బారిన ప్రజలు ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి రాత్రి వేళల్లో పరిస్థితి మరీ అధ్వానం -పట్టించుకోని అధికారులు కొండాపూర్: రాత్రి పూట ఘాటైన వాసనలు.శ్వాస పీల్చుకొంటే ముక్కుపుటలు అదిరిపోయేలా వచ్చే దుర్వాసన వలన తరచూ ఆయా గ్రామాల ప్రజలు రోగాల పాలవుతున్నారు. అయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు చూసీ చూడనట్లు వ్యవహరిçస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఆయా పరిశ్రమలు విడుదల చేసే పొగతో పాటు, వ్యర్థ పదార్థాలను సైతం బయటకు కాలువల ద్వారా మల్లెపల్లి చెరువులోకి వదిలేస్తున్నారు.దీంతో గ్రామాల్లో వ్యవసాయ బోర్లు వేస్తే కలర్ మారిన రంగు నీళ్ళే వస్తున్నాయనీ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ కొండాపూర్ మండలంలోని తేర్పోల్, చెర్లగోపులారం, ఎదురుగూడెం గుంతపల్లి గ్రామాల ప్రజల పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి, తేర్పోల్, గొల్లపల్లి, గుంతపల్లి తదితర గ్రామాల్లో సుమారు నాలుగు మద్యం పరిశ్రమలు, పది టైర్ల పరిశ్రమలు ఉన్నాయి. మద్యం పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం వల్ల చేనులో ఏమాత్రం పంటలు పండడంలేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.టైర్ల పరిశ్రమల ఇతర ప్రాంతాల నుంచి టైర్లను తీసుకువచ్చి వాటిని కాల్చి ఆయిల్‌ను తీస్తారు.ఈ టైర్లను కాల్చేటప్పుడు ముక్కుపుటలదిరేలా భరించలేని దర్గుంధం వస్తుందని చుట్టూ పక్కల గ్రామస్థులు చెబుతున్నారు. పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ఆయా పరిశ్రమలు యథేచ్ఛగా వ్యర్థ కాలుష్యాన్ని బయటకు వదులుతున్నాయి. దీంతో ఆ ఘాటైన వాసనలు పీల్చుకోలేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.రాత్రి వేళ్ళల్లో అయితే పరిస్థితి మరీ దారుణం.ఆ ఘాటైన వాసనలు రావడం ద్వారా నిద్రకూడా రావడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థ జలాలను కాలువల ద్వారా మల్లెపల్లి చెరువులోకి పంపిస్తుండడంతో చుట్టూ పక్కల భూములన్నీ నల్లగా మారి బీటలుగా ఏర్పడుతున్నాయి. కాగా ఈ టైర్ల పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం వల్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మహిళ గర్భస్రావం జరిగినట్లు గ్రీవెన్స్‌డే లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. మద్యం పరిశ్రమలు సాయంత్రం వేళలో విడుదల చేసే పొగ ద్వారా చిన్నచిన్న రేణువులు కంట్లోపడి కళ్ళు ఎర్రగా మారి వాహనాలు నడపడానికి ఇబ్బందిగా వుందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కాలుష్యాన్ని విడుదల చేసే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
మీ పిల్లలకైతే పెడతారా?
♦ మధ్యాహ్న భోజనానికి ముగ్గిన బియ్యం ♦ బియ్యం నిండా పురుగులే.. ♦ శుక్రవారం నుంచి వండాల్సిందేనంటున్న ఓ ఉద్యోగి ♦ నిరాకరిస్తున్న వంట ఏజెన్సీ నిర్వాహకులు ♦ వద్దన్నా వినకుండా బియ్యం పంపారు: హెచ్ఎం బియ్యం నిండా పురుగులు.. భరించలేని దుర్వాసన.. సగానికిపైగా గడ్డకట్టిన బియ్యం.. మూట విప్పితే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న మధ్యాహ్న భోజనానికి వినియోగించే బియ్యాన్ని వండి విద్యార్థులకు పెడితే ఏమైనా ఉందా, ఇక అంతే.. ఆసుపత్రిపాలు కాకతప్పదు. రైల్వేకోడూరు మండలం కే.బుడుగుంటపల్లె పాఠశాలలో ఉన్న బియ్యం పరిస్థితి ఇది. ఈ బియ్యం వద్దన్నా అధికారుల చెవికెక్కడం లేదు. పేదపిల్లలంటే ఇంత చులకనా.. వీటిని మీ పిల్లలకైతే పెడతారా.. అంటూ అధికారులపై గ్రామస్తులు మండిపడుతున్నారు. కె.బుడుగుంటపల్లె(రైల్వేకోడూరు రూరల్) : పేద విద్యార్థుల ఆకలి తీర్చాలనే ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంపై పాలకుల పర్యవేక్షణ కొరవడింది. ముగ్గిన బియ్యం, దాని నిండా పురుగులతో పాఠశాలలకు చేరడంతో ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ వారు అవాక్కయ్యా రు. వివరాల్లోకెళితే... రైల్వేకోడూరు మం డలం బుడుగుంటపల్లెలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వేసవి సెలవులకు ముందు అధికారులు ముగ్గిన బియ్యం దింపి వెళ్లారు. అక్కడున్న వారు వద్దంటున్నా వినకుండా ఓ గదిలో మధ్యాహ్న భోజనానికి వినియోగించే సుమారు వందకుపైగా బియ్యం బస్తాలు దించారు. అప్పటి నుంచి అవి అక్కడే నిల్వ ఉన్నాయి. సెలవుల అనంతరం తలుపులు తెరిచి చూస్తే బియ్యంలో కుప్పలు తెప్పలుగా పురుగులు కనిపించాయి. బస్తాలను తెరిచి చూసిన వంట ఏజెన్సీవారు వండలేమని చేతులెత్తేశారు. కానీ ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఓ కిందిస్థాయి ఉద్యోగి శుక్రవారం నుంచి ఎలాగైనా వాడాలని తెలపడంతో వారు మీడియాను ఆశ్రయించారు. శుక్రవారం నుంచి పురుగుల బియ్యాన్ని శుభ్రం చేసి వండి విద్యార్థులకు వడ్డించాలని ఓ ఉద్యోగి అంటున్నారని తెలిపారు. తాము ఇక్కడే 15 సంవత్సరాలుగా వంట ఏజెన్సీ నిర్వహిస్తున్నామని, అలా చేయలేమని వాపోయారు. ప్రధానోపాధ్యాయురాలు మాత్రం ఆ బియ్యాన్ని వెనక్కి తీసుకెళ్లమని లెటర్ పెట్టినా స్పందన లేదని, ఆ బియ్యం తమకు వద్దని, మార్చాలని చెబుతున్నారు. పేద విద్యార్థులంటే అంత చులకనా.... ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులంటే ఇంత చులకనా.. ఎవరికీ పనికిరాని బియ్యం చేర్చారని, వాటిని వండి వడ్డించితే ఇంకేమైనా ఉందా? అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మధ్యాహ్న భోజ నాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డా రు. గోదాము నుంచి అలాంటి బియ్యాన్ని పాఠశాలలకు ఎలా పంపుతారని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని వాటిని వెనక్కు పంపి మంచి బియ్యం సరఫరా చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఒక్క పాఠశాలలోనే ఇన్ని బియ్యం బస్తాలు నిల్వ ఉంటే మరి జిల్లాలో మిగిలిన పాఠశాల్లో ఎలా ఉ న్నాయో అధికారులు పరిశీలించాల్సి ఉంది. పురుగులున్న బియ్యం వండలేను పురుగులు ఉండి, వాసన వస్తున్న బియ్యం వండి విద్యార్థులకు పెట్టలేను. అవే వండాలని ఒత్తిడి చేస్తున్నారు. పదేళ్లుగా ఎప్పుడూ ఇలాంటి బియ్యం రాలేదు. దయచేసి బియ్యం మార్చి విద్యార్థులకు మంచి బియ్యం అందించండి. - జయమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు బియ్యం వద్దన్నా వినలేదు బియ్యం మాకు వ ద్దని లెటర్ పెట్టినా వినలేదు. బియ్యం దింపారు. ఇప్పుడు బియ్యం నిండా పురుగులు ఉన్నాయి. ఇలాంటి బియ్యం వాడలేం. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని బియ్యం మార్చి వేరే బియ్యం వేసేలా చూడాలి. - కోమలాదేవి, ప్రధానోపాధ్యాయురాలు, ప్రభుత్వ పాఠశాల, రైల్వేకోడూరు -
ఇంటిప్స్
అవెన్ని శుభ్రపరిచే స్పాంజి దుర్వాసన వస్తుంటే స్పాంజిని శుభ్రంగా కడిగి కొద్దిసేపు అవెన్‌లో పెట్టి కొద్దిగా వేడయ్యాక తీసేయాలి. ఇలా చేస్తే కనుక స్పాంజిలో బాక్టీరియా చనిపోతుంది. అప్పుడు ఆ స్పాంజితో అవెన్ శుభ్రం చేస్తే అనారోగ్యాలు రావు. అవెన్‌లో మాడి, అంటుకుపోయిన పదార్థాలను తొలగించాలంటే ఉప్పు నీటిలో ముంచిన స్పాంజ్‌తో తుడవాలి. అవెన్‌లోని జిడ్డు, మరకలు పోవాలంటే చల్లబడితన తర్వాత మరకలపై ఉప్పు నీటిని చల్లి తుడవాలి. -
శరీర దుర్వాసనను గుర్తించే యాప్
న్యూయార్క్: సాధారణంగా మన శరీరం నుంచి వచ్చే దుర్వాసనను, చెమట కంపును మనం గుర్తించలేం. ఆ వాసనకు మన ముక్కు అలవాటుపడటమే అందుకు కారణం. దీంతో చుట్టుపక్కలవారు ఇబ్బంది పడుతుంటారు. ఈసమస్యను తీర్చే యాప్‌ను చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారుచేసే సంస్థ నివియా తయారు చేసింది. ‘నోస్’ అనే పేరున్న ఆ యాప్ మన శరీర దుర్వాసనను గుర్తించి మనల్ని హెచ్చరిస్తుంది.యాప్‌ను మరింత పరీక్షించి, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. -
ఇంటిప్స్
వంటింట్లో చిన్న చిన్న కిటుకులు పాటిస్తే పెద్ద సమస్యగా అనిపించేవి కూడా పరార్ అవుతాయి. ఎలా అంటే...నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుకర్ అడుగు భాగాన వేసి, రుద్ది చక్కగా శుభ్రపడటమే కాదు, దుర్వాసన కూడా రాదు. కందిపప్పులో స్పూన్ నూనె వేస్తే త్వరగా ఉడుకుతుంది. కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే త్వరగా పులుపెక్కదు.క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయాలి. నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లి, తర్వాత శుభ్రపరచాలి. పిండి నూనెను త్వరగా పీల్చేస్తుంది.కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పు రాసి, నీళ్లు చల్లి గంటసేపు ఉంచితే చేదు తగ్గుతుంది. వెల్లుల్లిపాయను మెత్తగా దంచి, కొన్ని నీళ్లు కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచాలి. పిండిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే, వడియాలు తెల్లగా వస్తాయి. నూనె పొంగకుండా ఉండాలంటే కాగేటప్పుడు చిన్న ఉండ చింతపండు వేయాలి. ఎండుకొబ్బరి చిప్ప చింతపండు డబ్బాలో వస్తే త్వరగా పురుగు పట్టదు. -
నిమ్మ ముక్కతో దుర్వాసన మాయం
ఇంటిప్స్ వంటగదిలో దుర్వాసన పోవాలంటే చిన్న గిన్నెలో నీళ్లు పోసి, నిమ్మముక్క వేసి మరిగించాలి. ఈ నీళ్లు చల్లారక స్టౌ, కిచెన్ గట్టు, అవెన్.. వంటివి తుడిచి, ఆ తర్వాత పొడిక్లాత్‌తో తుడవాలి. మరకలు ఉండవు. కిచెన్‌లో ఉపయోగించే స్పాంజ్‌లను బేకింగ్ సొడా కలిపిన నీటిలో రాత్రిపూట ఉంచి, మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రపరచాలి. ఇలా చేస్తే బాక్టీరియా నశించి, చక్కగా శుభ్రపడతాయి.రోజూ రాత్రి వేళ అవెన్ లోపల తడి స్పాంజ్‌తో తుడిచి, 3 నిమిషాలు ఆన్ చేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల బాక్టీరియా వృద్ధి చెందదు. ఇలాగే, రాత్రిపూట కూరగాయలు కట్ చేసే బోర్డులు, కత్తులు శుభ్రపరిచి, పొడి క్లాత్‌తో తుడిచి ఉంచాలి. చంటి పిల్లలు పార్క్ లేదా బీచ్‌లలో ఇసుకలో ఆడుతుంటారు. అలా వదిలేస్తే మట్టి అంటుకుంటుందని తల్లులు వారిస్తుంటారు. బేబీ పౌడర్ని పిల్లల కాళ్లకు, చేతులకు రాసి, వదలాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము అంతగా అంటుకోకుండా ఉంటుంది. -
చెడు వాసన పోవాలంటే...
ఇంటిప్స్ పొగ, ఇతర మాడు వాసన త్వరగా పోవాలంటే వైట్ వెనిగర్‌ను ఒక చిన్న గిన్నెలో పోసి గదిలో ఉంచాలి.బట్టలు ఉతికాక అందులో కొన్ని చుక్కల వైట్ వెనిగర్ వేసి నానబెట్టి, పది నిమిషాల తర్వాత ఆరేయాలి. ఇలా చేస్తే బట్టల దుర్వాసన వదులుతుంది. అర సగం నిమ్మ ముక్కను ఉప్పులో అద్ది, దాంత్తో వంటగదిలోని పొయ్యి గట్టు తుడిచి కడిగితే క్రిములు, దుర్వాసన దరిచేరకుండా ఉంటుంది. వాష్ నుంచి తెచ్చిన దుస్తులను అలాగే ప్లాస్టిక్ బ్యాగ్‌లు ఉంచకుండా, తీసి అల్మరాలో భద్రపరచాలి. కొన్నాళ్లుగా ప్లాస్టిక్ బ్యాగులో దుస్తులు అలాగే ఉంటే అవి అక్కడక్కడా పసుపు రంగుమారే అవకాశం ఉంది.లేజర్‌తో కాళ్ల రోమాలను షేవ్ చేయాలనుకుంటే సబ్బు ఒక్కటే కాకుండా కొద్దిగా జుట్టుకు ఉపయోగించే కండిషనర్‌ని కూడా ఉపయోగించాలి. ఇలా చేస్తే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. -
ఇంటి సౌఖ్యం... మన బాధ్యత
ఇంటిప్స్ ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటే ఈ చిట్కా ఉపయోగించండి. బిర్యానీ ఆకును పౌడర్‌గా వేసి బొద్దింకలు వచ్చే చోట చల్లండి. ఆ వాసనకే అవి చచ్చిపోతాయి. {ఫిజ్‌లో క్రిములు చేరకుండా ఉండాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటే చాలు. దాన్ని చిన్న బౌల్లో పోసి ఫ్రిజ్‌లో స్ప్రే చేయాలి. అలా చేస్తే అది బ్యాక్టీరియాను చంపడమే కాకుండా దుర్వాసన రాకుండా చూస్తుంది. ఇంట్లో చీమల్ని వదిలించడానికి మహిళలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అవి బారులు బారులుగా ఉన్న చోట కొద్దిగా మిరియాల పొడి చల్లితే చాలు.ఆ ఘాటు వాసనకు అవి దూరంగా వెళ్లిపోతాయి.పండ్లు, కూరగాయలపై ఉండే రసాయనిక మందులు ఊరికే నీళ్లతో కడిగితే పోవు. అందుకే ఉప్పు కలిపిన నీటితో వాటిని కడిగితే ఆ కెమికల్స్ పూర్తిగా తొలగిపోతాయి. -
ఫ్రిడ్జ్‌లో దుర్వాసన పోవాలంటే...
ఇంటిప్స్ కొన్ని కాఫీ గింజలను ఫ్రిడ్జ్ షెల్ఫ్‌లో ఓ మూలన ఉంచితే దుర్వాసన సమస్య ఉండదు. షవర్‌బాత్ చేసిన తర్వాత షవర్‌ను తుడిచి, ప్లాస్టిక్ కవర్ని చుట్టాలి. ఇలా చేయడం వల్ల షవర్ రంధ్రాల గుండా క్రిములు లోపలికి చేరవు. స్టీల్ తుప్పు పట్టదు.మార్బుల్, టైల్స్ మీద పడిన నెయిల్ పాలిష్ మరకలు పోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఉపయోగించాలి.ఉడెన్ ఫర్నీచర్ ఎక్కడైనా దెబ్బతింటే ఆ ప్రాంతంలో వాల్నట్ కవర్‌ను అతికించి బాగు చేసుకోవచ్చు.కిచెన్ లేదా బాత్రూమ్ సింక్ కింద కర్టన్రాడ్ను అమర్చితే టాయ్‌లెట్ క్లీనింగ్ వస్తువులను చక్కగా అమర్చుకోవచ్చు. వాడేసిన ఇంగువ డబ్బాలో కారం పోసి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొద్దిపాటి కాలిన గాయాలకు బాగా మగ్గిన అరటిపండు గుజ్జు రాస్తే ఉపశమనం లబిస్తుంది.బాదం పప్పు పై పొట్టు త్వరగా తొలగించాలంటే 15 నిమిషాలు వేడినీటిలో నానబెట్టాలి. కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి, ఫ్రిజ్‌లో ఉంచాలి. బోరిక్ పౌడర్ని కిచెన్ మూలల్లో, కప్బోర్డ్ మూలల్లో ఉంచితే బొద్దింకల బెడద తప్పుతుంది.గిన్నెలో కొన్ని ఉల్లిముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి మరిగిస్తే అడుగు భాగంలోని జిడ్డు త్వరగా వదిలిపోతుంది.కొత్తిమీర, పుదీనా ఆకులను ఎండబెట్టి, పొడి చేసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకుంటే కూరలు, చట్నీల్లోకి వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే తొడిమలు వలచి, ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవాలి. -
ఇంట్లో దుర్వాసన తగ్గాలంటే..
ఇంటిప్స్ తలుపులు, కిటికీలు తెరిచి ఉంచి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూడాలి.రాత్రిపూట కార్పెట్‌పై బేకింగ్ సోడా చల్లి, మరుసటి రోజు ఉదయం వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరచాలి.బకెట్ వేడి నీళ్లలో కప్పు అమోనియా కలిపి, ఆ నీళ్లతో ఫ్లోర్ తుడవాలి.అమోనియా కలిపిన వేడి నీటిలో డోర్‌మ్యాట్స్ నానబెట్టి, ఉతకాలి. ఫ్లోర్ తడి లేకుండా జాగ్రత్తపడాలి.ఫర్నీచర్, కార్పెట్స్, కర్టెన్స్ శుభ్రంగా ఉంచాలి. కిచెన్ సింక్‌లో క్యారట్, ఉల్లి, బంగాళదుంప తొక్కలు మిగిలిపోతే దుర్వాసన వస్తుంది. కొద్దిగా ఐస్‌ను గ్రైండ్ చేసి వేయాలి. దాని మీద బొరాక్స్ పౌడర్‌ను చల్లి, పై నుంచి నీళ్లు పోయాలి. సింక్‌లో నీళ్లు పోయే పైప్ దగ్గర మూత వేసి, దాంట్లో ఒక అంగుళం మేర వేడి నీళ్లు పోయాలి. దాంట్లో పిడికెడు బేకింగ్ సోడా వేయాలి. తర్వాత ఆ నీటిని వదిలేయాలి. వేడినీళ్లు, బేకింగ్ సోడా వల్ల సింక్‌లో దుర్వాసన వదులుతుంది. ఈ జాగ్రత్తలు ఇంటిని దుర్వాసన నుంచి విముక్తి చేస్తాయి. -
ఇంటిప్స్
వంటపాత్రలు తోమేందుకు ఉపయోగించే సింక్, డిష్వాషర్ వంటి వాటి నుంచి దుర్వాసన వస్తుంటే, వాటిలో నీరు నిల్వలేకుండా చూడాలి. ఆ తర్వాత వాటిలో కాస్త వెనిగర్ పోసి వదిలేయాలి. కొద్దిసేపట్లోనే దుర్వాసన దూరమవుతుంది. పాతబడ్డ ఇళ్లలోని గదులు, టాయిలెట్స్‌లో తరచు దుర్వాసన వ్యాపిస్తుంటుంది. చెల్లాచెదురుగా పడిన చెత్త, ఆహార వ్యర్థాల వంటివి దుర్వాసనకు కారణమవుతుంటాయి. ముందుగా అలాంటివి గుర్తించి, వాటిని తొలగించాలి. ఆ తర్వాత గదుల మూలల్లో కలరా ఉండలు ఉంచాలి. బాత్రూమ్లో దుర్వాసనగా ఉంటే, గాఢమైన పరిమళం గల ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా తీసుకుని, కాటన్బాల్స్పై వేసి, వాటిని బాత్రూమ్ మూలల్లో ఉంచితే చాలు. దుర్వాసన పోతుంది.పాతబడిన పరుపులు దుర్వాసన వస్తుంటే, వాటిపై బేకింగ్‌సోడా చల్లి దాదాపు రెండు గంటలు అలాగే వదిలేయండి. తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయండి. అవి తాజాగా మారుతాయి. -
ఛీ.. కంపు కంపు!
సైదాబాద్: ప్రధాన ర హదారిని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన, వ్యర్థాల పారబోత వల్ల స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుర్వాసనను భరించలేక నిత్యం అవస్థల పాలవుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గడ్డిఅన్నారం నుంచి సరూర్‌నగర్ వెళ్లే దారిలో గంగా థియేటర్ పక్కనే కొంత ఖాళీ స్థలం ఉంది. దీనికి ఆనుకుని ప్రహరీ నిర్మించి వదిలేశారు. ఈ దారి గుండా వెళ్లే వారు ఈ స్థలాన్ని మూత్ర విసర్జనకు అడ్డాగా మార్చేశారు. ఫలితంగా ఈ రూట్లో వెళ్లేందుకు మహిళలు జంకుతున్నారు. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్వాసనతో చుట్టుపక్క అపార్ట్మెంట్లవాసులు ఇక్కట్ల పాలవుతున్నారు. వేసవికాలంలో కనీసం బాల్కనీలో కూర్చోలేకుండా పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలికి వ్యాపిస్తున్న కంపుతో ఇంటి తలుపులు కూడా తెరవలేకపోతున్నామని చెబుతున్నారు. దుర్గంధంతో తమ దుకాణాలు, హోటళ్ల వద్దకు ఎవరూ రావడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పక్కనే ఉన్న గల్లీలోని డ్రైనేజీని పూడిక తీయకపోవడంతో ఈ ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. దీనికి ఎదురుగానే సాయిరాంనగర్ కాలనీకి చెందిన బస్టాప్ ఉంది. నిత్యం ఇక్కడి నుంచి ఎంతో మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఎదురుగా టాయిలెట్స్ పోస్తుండటంతో బస్టాప్‌లో నిలబడేందుకు మహిళలు, యువతులు ఇబ్బంది పడుతున్నారు. ముక్కు మూసుకుని బస్సులు, ఆటోల కోసం వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. వేసవిలోనే ఇలా ఉంటే వర్షాలు పడితే తమ పరిస్థితి ఏమిటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అక్కడి ప్రహరీ చుట్టూ రక్షణ చర్యలు చేపట్టి, మట్టితో చదును చేసి టాయిలెట్స్ పోయకుండా గోడ రాతలతో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భరించలేని వాసన ఖాళీ స్థలం చుట్టు ఉన్న గోడ వద్ద నిత్యం వందల సంఖ్యలో బాటసారులు, వాహనదారులు, ఆటోవాలాలు మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో ఇక్కడ వ్యాపారం చేసుకునే వారితో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. - విజయేందర్, కాలనీ సభ్యుడు అధికారులు స్పందించాలి అవసరాల నిమిత్తం దుకాణాలకు వచ్చే వినియోగదారులు ఇక్కడ క్షణం కూడా నిలబడలేక పోతున్నారు. పక్క హోటల్ పరిస్థితి కూడా ఇదే. ఖాళీ స్థలాలు టాయిలెట్స్‌కు అడ్డాగా మారుతున్నాయి. కాలనీ మధ్యలో మూత్రశాలలు ఇబ్బంది పెడుతున్నాయి. అధికారులు స్పందించాలి. - రవి, దుకాణ యజమాని -
వేసవి.. దుర్వాసనకు చెక్...
వేసవిలో పాదాలు, బాహుమూలల్లో చెమట అధికంగా పడుతుంది. దుర్వాసన కూడా వస్తుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా వెనిగర్, నీళ్లు సమాన భాగాలుగా కలిపి, స్ప్రే చేసి, తుడుచుకోవాలి. తర్వాత డియోడరెంట్ వాడాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన, ఎలాంటి ఇరిటేషన్ సమస్య రాదు. ఎండ వల్ల చర్మం నిస్తేజంగా కనిపిస్తే... రెండు టీ స్పూన్ల తేనెలో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు రాసుకొని మసాజ్ చేయాలి. ఎండ వల్ల పొడిబారిన చర్మానికి జీవకళ వస్తుంది. మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్య లేపనంలా పనిచేస్తుంది.