
ఇంటిప్స్
అవెన్‌ని శుభ్రపరిచే స్పాంజి దుర్వాసన వస్తుంటే స్పాంజిని శుభ్రంగా కడిగి కొద్దిసేపు అవెన్‌లో పెట్టి కొద్దిగా వేడయ్యాక తీసేయాలి. ఇలా చేస్తే కనుక స్పాంజిలో బాక్టీరియా చనిపోతుంది. అప్పుడు ఆ స్పాంజితో అవెన్ శుభ్రం చేస్తే అనారోగ్యాలు రావు.
అవెన్‌లో మాడి, అంటుకుపోయిన పదార్థాలను తొలగించాలంటే ఉప్పు నీటిలో ముంచిన స్పాంజ్‌తో తుడవాలి. అవెన్‌లోని జిడ్డు, మరకలు పోవాలంటే చల్లబడితన తర్వాత మరకలపై ఉప్పు నీటిని చల్లి తుడవాలి.