ఇంటిప్స్
కిచెన్ షెల్ఫులు, తలుపులు రోజూ శుభ్రం చేస్తున్నా కూడా జిడ్డు పడుతుంటాయి. నెలకొకసారి లీటరు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ అమోనియా, రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్లో పోసుకుని జిడ్డుగా ఉన్న ప్రదేశాలలో స్ప్రే చేసి తడి పీల్చుకునే పొడి వస్త్రంతో తుడవాలి. గార పట్టేసిన సింకులు, టైల్స్, బాత్టబ్బులను శుభ్రం చేయడానికి నాలుగు లీటర్ల వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ అమోనియా కలిపి వాడాలి.
అవెన్ శుభ్రం చేయాలంటే ముందు అవెన్‌ను ఆన్ చేసి 65డిగ్రీల వేడి వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. ఒక కప్పులో సగం వరకు అమోనియా పోసి అవెన్‌లో పై అరలో ఉంచాలి. ఒక పెద్ద గిన్నెలో వేడినీళ్ళు పోసి కింద అరలో పెట్టి అవెన్ మూసివేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే అమోనియా కప్పు, వేడి నీటి గిన్నెలను బయటకు తీసి కొద్ది సేపు అవెన్‌ను ఓపెన్ చేసి ఉంచాలి. ఒక లీటరు వేడి నీటిలో పాత్రలు శుభ్రం చేసే లిక్విడ్ కొంచెం, ఒక టేబుల్ స్పూను అమోనియా కలిపిన మిశ్రమంలో క్లాత్‌ను ముంచి అవెన్ అంతా తుడవాలి.