చెడు వాసన పోవాలంటే...
ఇంటిప్స్
పొగ, ఇతర మాడు వాసన త్వరగా పోవాలంటే వైట్ వెనిగర్‌ను ఒక చిన్న గిన్నెలో పోసి గదిలో ఉంచాలి.బట్టలు ఉతికాక అందులో కొన్ని చుక్కల వైట్ వెనిగర్ వేసి నానబెట్టి, పది నిమిషాల తర్వాత ఆరేయాలి. ఇలా చేస్తే బట్టల దుర్వాసన వదులుతుంది. అర సగం నిమ్మ ముక్కను ఉప్పులో అద్ది, దాంత్తో వంటగదిలోని పొయ్యి గట్టు తుడిచి కడిగితే క్రిములు, దుర్వాసన దరిచేరకుండా ఉంటుంది.
వాష్ నుంచి తెచ్చిన దుస్తులను అలాగే ప్లాస్టిక్ బ్యాగ్‌లు ఉంచకుండా, తీసి అల్మరాలో భద్రపరచాలి. కొన్నాళ్లుగా ప్లాస్టిక్ బ్యాగులో దుస్తులు అలాగే ఉంటే అవి అక్కడక్కడా పసుపు రంగుమారే అవకాశం ఉంది.లేజర్‌తో కాళ్ల రోమాలను షేవ్ చేయాలనుకుంటే సబ్బు ఒక్కటే కాకుండా కొద్దిగా జుట్టుకు ఉపయోగించే కండిషనర్‌ని కూడా ఉపయోగించాలి. ఇలా చేస్తే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు.