న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం(నవంబర్ 1) తెల్లవారుజామున పొగ కమ్మేసింది. గురువారం రాత్రి దీపావళి సందర్భంగా ఢిల్లీ వాసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మరీ టపాసులు కాల్చారు. దీంతో ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారింది.
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని నోయిడా, గురుగ్రామ్‌లో వాయు కాలుష్యం ఒక్కసారిగా ఒక్కసారిగా పెరిగిపోయింది. రోడ్లపై విజిబిలిటీ తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)పై వాయునాణ్యత శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 395(వెరీపూర్)గా నమోదైంది. ఈ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీతో పాటు పొరుగునే ఉన్న పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ వాయునాణ్యత ఒక్కసారిగా క్షీణించింది.
#WATCH | Delhi: A thin layer of smog engulfs the National Capital as the air quality continues to deteriorate.
As per the CPCB, the AQI of the area is 317, in the 'very poor' category.
(Visuals from India Gate) pic.twitter.com/nKvFMOPZrd— ANI (@ANI) November 1, 2024
కాగా, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పంజాబ్, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఢిల్లీ కాలుష్యం శీతాకాలం ప్రారంభమవగానే పెరిగిపోతోంది. పంట వ్యర్థాలకు తోడు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే డీజిల్ వాహనాలు కూడా కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం దీపావళి రోజు టపాసులను కాల్చడాన్ని నిషేధించింది. అయితే ఢిల్లీ వాసులు ఈ నిషేధాన్ని పట్టించుకోకుండా టపాసులు కాల్చి పండుగ జరుపుకోవడంతో కాలుష్యం పెరిగిపోయింది.
ఇదీ చదవండి: బాణసంచా కాల్చేవారిపై పోలీసుల దృష్టి
Comments
Please login to add a commentAdd a comment