న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బాణసంచా కాల్చేవారిపై పోలీసులు నిఘా సారించారు. గల్లీగల్లీని నిశింతగా పరిశీలిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను స్వీకరిస్తూ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
దీపావళి వేళ నగరంలో బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది. ఇది అమలయ్యేలా చూసేందుకు ప్రభుత్వం 377 పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. బాణాసంచా నిషేధం అమలయ్యేలా చూసేందుకు సాధారణ దుస్తుల్లో పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 14న నగరంలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, కొనుగోళ్లను నిషేధించింది. ఇది వచ్చే ఏడాది జనవరి ఒకటి వరకు అమలులో ఉంటుంది. దీపావళి రోజున చాందినీ చౌక్, సరోజినీ నగర్, లజ్‌పత్ నగర్, గ్రేటర్ కైలాష్, ఆజాద్‌పూర్, ఘాజీపూర్ వంటి మార్కెట్‌లలో భారీ రద్దీ నెలకొనడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు.
ఈ సందర్భంగా డీసీపీ అపూర్వ గుప్తా మాట్లాడుతూ దీపావళి వేళ మార్కెట్లు, మాల్స్, వివిధ సంస్థలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటెన్సివ్ పెట్రోలింగ్, అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై కూడా పోలీసులు నిఘా సారించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) పెట్రోలింగ్ బృందాలు ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: కాలుష్యంలేని, నిశ్శబ్ద దీపావళి సాధ్యమేనా? ఈ టిప్స్ పాటిద్దాం!
Comments
Please login to add a commentAdd a comment