securiry
-
బాణసంచా కాల్చేవారిపై పోలీసుల దృష్టి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బాణసంచా కాల్చేవారిపై పోలీసులు నిఘా సారించారు. గల్లీగల్లీని నిశింతగా పరిశీలిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను స్వీకరిస్తూ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.దీపావళి వేళ నగరంలో బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది. ఇది అమలయ్యేలా చూసేందుకు ప్రభుత్వం 377 పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. బాణాసంచా నిషేధం అమలయ్యేలా చూసేందుకు సాధారణ దుస్తుల్లో పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు.ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 14న నగరంలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, కొనుగోళ్లను నిషేధించింది. ఇది వచ్చే ఏడాది జనవరి ఒకటి వరకు అమలులో ఉంటుంది. దీపావళి రోజున చాందినీ చౌక్, సరోజినీ నగర్, లజ్‌పత్ నగర్, గ్రేటర్ కైలాష్, ఆజాద్‌పూర్, ఘాజీపూర్ వంటి మార్కెట్లలో భారీ రద్దీ నెలకొనడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా డీసీపీ అపూర్వ గుప్తా మాట్లాడుతూ దీపావళి వేళ మార్కెట్లు, మాల్స్, వివిధ సంస్థలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటెన్సివ్ పెట్రోలింగ్, అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై కూడా పోలీసులు నిఘా సారించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) పెట్రోలింగ్ బృందాలు ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది కూడా చదవండి: కాలుష్యంలేని, నిశ్శబ్ద దీపావళి సాధ్యమేనా? ఈ టిప్స్ పాటిద్దాం! -
వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు
దేశంలోని చాలామంది తీర్థయాత్రలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తుంటారు. తమకు మంచి జరగాలని కోరుకుంటూ దేవాలయాలకు వెళ్లి, దేవుని దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వైష్ణోదేవి ఆలయ సందర్శనకు వస్తున్న భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు యాత్రను కొద్దిసేపు నిలిపివేసింది. కొద్దిసేపటి తరువాత భక్తుల రద్దీని నియంత్రించి, దర్శనాలకు అనుమతినిచ్చింది. మాతా వైష్ణో దేవి ఆలయం జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో త్రికూట పర్వతంపై ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు! #WATCH | Reasi, J&K: Devotees throng the Holy Cave Shrine of Shri Mata Vaishno Devi temple in Katra pic.twitter.com/Z0R1fYy3Zj — ANI (@ANI) January 1, 2024 -
జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం
శ్రీనగర్: ఇజ్రాయెల్- పాలస్తీనా సంస్థ హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్‌లో సంక్షోభం చోటు చేసుకుంది. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్లో నిరసనలకు దారితీసే ముప్పును మరింతగా పెంచుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా శ్రీనగర్‌లోని 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సమావేశం జరిగింది. భద్రతా ప్రణాళికల గురించి ఈ సమావేశంలో చర్చించామని, రాబోయే రోజుల్లో నిరసనలు తలెత్తితే, వాటిని ఎలా నిరోధించాలనే దానిపై దృష్టి పెట్టామని ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం దిశగా సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఈ అత్యున్నత సమావేశంలో విదేశీ ఉగ్రవాదుల పాత్రపై కూడా చర్చ జరిగింది. ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో హతమైన 46 మంది ఉగ్రవాదుల్లో 37 మంది పాకిస్తానీలేనని అధికారిక సమాచారం. 9 మంది మాత్రమే స్థానికులు ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లోని 33 ఏళ్ల ఉగ్రవాద చరిత్రలో స్థానిక ఉగ్రవాదుల కంటే విదేశీ ఉగ్రవాదుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం దాదాపు 130 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా శ్రీనగర్‌లో జరిగిన ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు, ఉత్తర కమాండ్ ఆర్మీ కమాండర్ ఉపేంద్ర ద్వివేది అధ్యక్షత వహించారు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చినార్ కార్ప్స్ కమాండర్,రాష్ట్ర పరిపాలన, భద్రతా సంస్థల ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఎన్నికల బరిలో ‘మిజోరం’ కోటీశ్వరులు -
క్షిపణి దాడుల మధ్య వార్ జోన్‌కు బైడెన్ ఎలా చేరారు? సెక్యూరిటీ విధానమేమిటి?
ఇజ్రాయెల్‌కు, ఉగ్ర సంస్థ హమాస్‌కు మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుద్ధ మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇప్పటి వరకు 3500 మందికి పైగా జనం మరణించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ సందర్శించారు. ఒకపక్క క్షిపణుల వర్షం కురుస్తున్నా... జోబైడెన్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ చేరుకున్నారు. ఎలా? ఆయన భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సురక్షితంగా టెల్ అవీవ్ ఎలా చేరుకున్నారు? యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధంలో దెబ్బతిన్న దేశాన్ని సందర్శించడం ఇదేమీ మొదటిసారి కాదు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య గత ఏడాది యుద్ధం మొదలైన తరువాత కూడా ఆయన ఉక్రెయిన్ లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలుసుకుని, రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా జో బైడెన్.. ఇజ్రాయెల్‌లోని వార్ జోన్‌ను సందర్శించారు. ఆ దేశ అధినేత బెంజమిన్ నెతన్యాహు స్వయంగా బైడెన్‌కు స్వాగతం పలికారు. అయితే ఒకపక్క క్షిపణులు ప్రమాదకరంగా ఎగురుతున్న తరుణంలోనే జో బైడెన్ వార్‌జోన్‌కు ఎలా చేరుకున్నాడనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. దీనికి సమాధానం అమెరికా అధ్యక్షుని పర్యటన వివరాలు చాలా గోప్యం అనే చెప్పాలి. అతికొద్ది మందికి మాత్రమే ఆయన ఇజ్రాయెల్ పర్యటన వివరాలు తెలుసు. ఈ పర్యటన షెడ్యూల్ లీక్ కాకుండా సీక్రెట్ సర్వీస్ పలు జాగ్రత్తలు తీసుకుంది. ఉక్రెయిన్ పర్యటనలో సమయంలోనూ బైడెన్ రహస్యంగానే వెళ్లారు. ఎవరికీ ముందస్తు సమాచారం లేదు. ప్రత్యేక రైల్లో ఆయన ఉక్రెయిన్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో అతని భద్రతా విభాగంలో పలువురు అధికారులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నారు. అదేరీతిలో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంలోనూ భద్రత కల్పించారు. అయితే బైడెన్ విమాన మార్గం ద్వారా సరిహద్దులు దాటి ఇజ్రాయెల్ చేరుకున్నారా? లేక రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా వెళ్లారా అనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అమెరికా అధ్యక్షుని కాన్వాయ్‌లో ఏ క్షిపణి ప్రభావానికి గురికాని బీస్ట్ వంటి కార్లు ఉన్నాయి. అంతేకాకుండా బైడెన్ విమానంలో ప్రయాణించిన పక్షంలో దానికి భద్రతగా ముందు వెనకల యుద్ధ విమానాలను కూగా మోహరిస్తారు. ఈ యుద్ధ విమానాలు ఎటువంటి దాడులనైనా తిప్పికొడతాయి. ఇది కూడా చదవండి: హమాస్‌లో ‘మ్యాన్ ఆఫ్ డెత్’ ఎవరు? టాప్ కమాండర్ల పనేమిటి? -
షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబానికి వై ప్లస్ భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల షారుక్‌ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు పంపారు. దీంతో షారుక్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో షారుక్ ఫ్యామిలీకి వై ప్లస్ భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఇది చదవండి: 'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!) పఠాన్ సాంగ్ వివాదం గతంలో రిలీజైన పఠాన్ ‘బేషరమ్ రంగ్’ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటకు దీపికా పదుకొణె కుంకుమపువ్వు బికినీ ధరించడంపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అప్పట్లో చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ ఫ్యామిలీకి వీఐపీ భద్రతా విభాగానికి చెందిన ఆరుగురు శిక్షణ పొందిన కమాండోలతో రక్షణ కల్పిస్తారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నలుగురు సాయుధ పోలీసు అధికారులు ఉన్నారు. తాజాగా మళ్లీ బెదిరింపులు రావడంతో భద్రత స్థాయిని పెంచింది. గతంలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు భద్రత కల్పించారు. బాలీవుడ్ ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్‌లకు భద్రతను పెంచారు. కాగా.. ఇటీవలే షారుక్ నటించిన జవాన్ చిత్రం రిలీజైన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాలీవుడ్లో అత్యధికంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: 'నా ఎలిమినేషన్‌కు కారణం అతనే'.. శుభశ్రీ కామెంట్స్ వైరల్!) -
నేపాల్‌లో దాక్కున్న చైనా ‘పెంగ్’.. భారత్‌లోకి అక్రమంగా చొరబడుతూ..
భారత్- నేపాల్ సరిహద్దుల మీదుగా నకిలీ ధృవపత్రాలతో భారత్‌లోకి చొరబడేందుకు ఒక చైనా పౌరుడు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి డార్జిలింగ్ మీదుగా భారత్ సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమై ఆ వ్యక్తిని అరెస్టు చేశాయి. ఉమేష్‌గా మారిన పెంగ్ యోంగ్జిన్ మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం భారత్-నేపాల్ సరిహద్దులోగల డార్జిలింగ్ స్పెషల్ సర్వీస్ బ్యూరో(ఎస్ఎస్బీ) పానీటంకీ అవుట్‌పోస్ట్ వద్ద ఒక చైనా పౌరుడిని అరెస్టు చేసింది. అతను అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్‌ఎస్‌బీఈ చర్య చేపట్టింది. అరెస్టయిన ఆ చైనా పౌరుని పేరు పెంగ్ యోంగ్జిన్. ఇతను నేపాల్‌లో ఉమేష్ అనే నకిలీ పేరుతో నివసిస్తున్నాడు. ఇదే పేరుతో నేపాల్‌లో పాస్‌పోర్టు కూడా చేయించుకున్నాడు. ఈ పాస్‌పోర్టు ఆధారంగానే ఆ చైనా పౌరుడు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశాడు. భారత్‌లోకి చొరబాటు వెనుక.. ఎస్ఎస్బీ తెలిపిన వివరాల ప్రకారం నేపాల్‌లో ఉంటున్న ఆ చైనా పౌరుడు అక్కడ పాస్‌పోర్ట్ పొందేందుకు స్థానికులు సహాయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఎస్ఎస్బీ అదుపులో ఉన్న ఆ చైనా పౌరుడిని విచారిస్తున్నారు. అతను అక్రమంగా భారత్‌లోకి ఎందుకు ప్రవేశించాలనుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నేపాల్‌లో ఉంటూ.. భారత్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని పానీటంకీ ప్రాంతం నేపాల్‌లోని కకర్‌వీటా పరిధిలోని డోక్లామా చికెన్ నెక్కు సమీపంలో ఉంది. ఈ సున్నిత ప్రాంతంలో ఇన్నాళ్లూ నివాసమున్న ఈ చైనా పౌరుడు అక్కడ ఎటువంటి కార్యకలాపాలు సాగించాడో తెలుసుకునేందుకు ఎస్ఎస్బీ ప్రయత్నిస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దు 1850 కిలోమీటర్ల మేర ఉంది. అయితే ఆ చైనా యువకుడు తాను ఉండేందుకు డార్జిలింగ్ సమీపంలోని ప్రాంతాన్నే ఎందుకు ఎన్నుకున్నాడనేది అధికారుల ముందున్న ప్రశ్న. ఈ డోక్లామ్ రీజియన్ విషయంలో భారత్-చైనాల మధ్య వివాదం రగులుతోంది. ఏడేళ్లుగా మారుపేరుతో.. భారత్‌లోకి పాక్ నుంచి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ ఉదంతం సంచలనంగా మారిన నేపధ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. రక్షణ బలగాలు తనిఖీలు మరింత ముమ్మరం చేశాయి. కాగా పెంగ్ తన పేరు, గుర్తింపును మార్చుకుని నేపాల్‌లో అక్రమంగా గడచిన ఏడేళ్లుగా ఉంటున్నాడు. తాజాగా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన అతనిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ సర్వీస్ బ్యూరో అతనిని సుదీర్ఘంగా విచారిస్తోంది. ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి -
నా ట్యాక్స్‌లోంచి కంగనకు భద్రతా కల్పించారా?
ముంబై : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు వై-ప్లస్ కేటగిరి భద్రత కలిపించడంపై నటి కుబ్రాసైథ్ అసహనం వ్యక్తం చేశారు. తన ట్యాక్స్‌లోంచి వీటికి డబ్బులు వెళ్లడం లేదు కదా అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కంగనా సోదరి రంగోలి సైతం ధీటుగా సమాధానమిచ్చారు. క్యురియాసిటీ (ఉత్సుకత)తో అడుగుతున్నా..ఇంతకీ ఎంత ట్యాక్స్ కడుతున్నారేంటి అంటూ చురకలంటించారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ వర్గం కంగనాకు మద్దుతుగా ఉంటే, మరో వర్గం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓ సాధారణ నటికి వై- ప్లస్ క్యాటగిరీ కల్పించడంపై రాజకీయ కోణమేదైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌లోని 25 ప్రముఖ వ్యక్తులకు డ్రగ్స్‌తో సంబంధాలున్నాయని రియా పేర్కొన్న సంగతి తెలిసిందే. (మహరాష్ట్ర సీఎం ఠాక్రేను హెచ్చరించిన కంగనా) తదనంతర కస్టడీ కోరుతూ ఎన్సీబీ రియాను అదుపులోకి తీసుకోవడంతో పలువురు బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు జస్టిస్ ఫర్ రియా అంటూ క్యాంపెయిన్ నడుపుతుండటం గమనార్హం.ఇక కంగనా కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తన ఇంటిలో ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టలేదని, కోవిడ్ కారణంగా సెప్టెంబర్ 30 వరకూ కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించిందని కంగనా ట్వీట్ చేశారు. ఫాసిజం ఎలా ఉంటుందో బాలీవుడ్ ఇప్పుడు గమనిస్తోందని కంగనా బీఎంసీ చర్యపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కంగనాకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇండియా విత్ కంగనా అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ అభిమానులు కంగనాకు బాసటగా నిలిచారు. (ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత) Just checking, is it going out my taxes? https://t.co/z6xYxXPqEv — Kubbra Sait (@KubbraSait) September 7, 2020 -
నిఘా నేత్రం.. కట్టుదిట్టం
అలంపూర్ రూరల్ : ప్రజాభద్రతే లక్ష్యంగా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే అలంపూర్ స్టేషన్ పరిధిలో 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించామని కలెక్టర్ రజత్‌కుమార్‌సైని, ఎస్పీ విజయ్‌కుమార్ అన్నారు. గురువారం అలంపూర్ పోలీస్‌స్టేషన్‌లో వారు సీసీల కెమరాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందని ప్రజలనుంచి ప్రశంసలు వస్తున్నాయని, శాంతి భద్రతల విషయంలో అందరికీ ఒకేగాడిన పెడుతున్నామన్నారు. ఇకపై నియోజకవర్గ కేంద్రంలో జరిగే ప్రతి కదలికను పోలీసులు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. నివేదన యాప్ జిల్లా ప్రజల కోసమే తీసుకొచ్చామని, ఏ సమస్య అయినా క్లిప్పింగ్‌లు, ఫొటోలు పంపిస్తే పరిష్కరిస్తామన్నారు. అనంతరం నేతాజీ ఫ్రెండ్స్ చైతన్య సేవాసమితి కార్యదర్శి వెంకట్రామయ్య శెట్టి ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్, ఎస్పీలను మెమోంటోలతో గౌరవించారు. కార్యక్రమంలో డీఎస్పీ సురేందర్‌రావు, డీఆర్వో వేణుగోపాల్‌రావు, సీఐ రజిత, ఎస్ఐ వాసా ప్రవీన్‌కుమార్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికా బద్ధ్దంగా చదివితేనే ఉత్తమ గ్రేడ్ గద్వాల అర్బన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివితే మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని కలెక్టర్ రజత్‌కుమార్‌సైని అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర, ఆనంద నిలయంలో కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు దుప్పట్లు, తివాచీలు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షలంటే ఆందోళనకు గురికావద్దని, ఏకాగ్రతతో చదివితే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఉన్నత చదువులకు పదవ తరగతి తొలిమెట్టని, తల్లిదండ్రుల కలలు, ఆకాంక్షలను నెరవేర్చేలా కష్టపడి చదవాలన్నారు. వార్డెన్లు కూడా టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం నాణ్యతతో భోజనం పెట్టించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల అధికారి రాములు పాల్గొన్నారు. సమగ్ర నివేదిక తయారుచేయాలి : జోషి సాక్షి, గద్వాల: సమగ్ర భూ సర్వే అనంతరం రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేసి ఇవ్వాల్సి ఉన్నందున జిల్లాలో ఖాతానెంబర్లు, ఫొటోలు, ఆధార్‌కార్డు నెంబర్లు అన్నీ సరిపోయేటట్లు సమగ్ర నివేదిక తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌జోషి ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి కలెక్టర్లతో మాట్లాడారు. మార్చిలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసేవరకు ఎలాంటి పొరపాట్లు లేకుండా నివేదికలు కంప్యూటరీకరించి పంపాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ప్రత్యేక కలెక్టర్ కరుణ, సంయుక్త కలెక్టర్ సంగీత పాల్గొన్నారు. దళారుల ఆటలు కట్టించండి : పార్థసారధి గద్వాల అర్బన్: కంది పంట రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఎఫ్‌సీఐ, హాకా సంస్థల ద్వారా కొనుగోలు చేస్తుంటే దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని జీఏడీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్లతో సమీక్షించారు. ప్రభుత్వం కందులకు రూ.5,450 మద్దతు ధర కల్పిస్తోందని, దళారులు గోదాముల్లో నిల్వ ఉంచిన కందులు, ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన కందులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలతో అమ్ముతున్నట్లు తెలిసిందని, తక్షణమే దాడులు నిర్వహించి వారి ఆట కట్టించాలని ఆదేశిం చారు. అనంతరం కలెక్టర్ రజత్‌కుమార్‌సైని వివరాలు వెల్లడించారు. జిల్లాలో 1.5లక్షల క్వింటాళ్ల కందులు దిగుబడి కాగా దాదాపు 50శాతం కందులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశామని తెలిపారు. వీసీలో జిల్లా సంయుక్త కలెక్టర్ సంగీత, మార్కెట్ శాఖ అధికారిణి పుష్పలత, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్ పాల్గొన్నారు. -
అమెరికాలోనూ మోదీ.. మోదీ.. నినాదాలు!
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమెరికాలో అడుగుపెట్టిన భారత ప్రధాని నరేంద్రమోదీకి అద్భుతమైన స్వాగతం లభించింది. భారతదేశంలో ఉన్నట్లే అక్కడ కూడా 'మోదీ.. మోదీ' అంటూ నినాదాలు మిన్నంటాయి. ఆయన బసచేసిన హోటల్ బయట భారీగా వచ్చిన అభిమానులు ఆయనను అభినందించేందుకు పోటీలు పడ్డారు. వారిని చూసిన మోదీ కూడా భద్రతను పక్కన పెట్టేసి నేరుగా వాళ్లలోకి వెళ్లిపోయారు. దాంతో భద్రతాధికారులు నోళ్లు వెళ్లబెట్టారు. విమానాశ్రయం నుంచి కాన్వాయ్‌లో బయల్దేరిన మోదీ.. కారు దిగిపోయి అభిమానులలో కలిసిపోయి వారికి చేతులు ఊపుతూ, ప్రతినమస్కారాలు చేస్తూ ముందుకెళ్లారు. భద్రత అత్యంత ఎక్కువగా ఉండే న్యూయార్క్ నగరంలో.. అదీ భారత ప్రధాని లాంటి వీవీఐపీల విషయంలో ఇలా జరగడం అసాధారణం. ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం దాదాపు 140 మంది ప్రధానమంత్రులు, వివిధ దేశాల అధ్యక్షులు ఈ నగరానికి వచ్చినా, ఎవరి విషయంలోనూ ఇలా జరగలేదు. మోదీ బస చేస్తున్న న్యూయార్క్ ప్యాలెస్ హోటల్ బయట ట్రాఫిక్ మొత్తాన్ని బ్లాక్ చేసేశారు. హోటల్లోకి వచ్చేవాళ్లు కూడా విమానాశ్రయాల్లో ఉన్నట్లుగా ఫెడరల్ ఏజెంట్లు క్షుణ్ణంతా తనిఖీ చేసిన తర్వాతే వెళ్లాల్సి ఉంటుంది.