ఇజ్రాయెల్‌కు, ఉగ్ర సంస్థ హమాస్‌కు మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుద్ధ మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇప్పటి వరకు 3500 మందికి పైగా జనం మరణించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ సందర్శించారు. ఒకపక్క క్షిపణుల వర్షం కురుస్తున్నా... జోబైడెన్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ చేరుకున్నారు. ఎలా? ఆయన భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సురక్షితంగా టెల్ అవీవ్ ఎలా చేరుకున్నారు?
యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధంలో దెబ్బతిన్న దేశాన్ని సందర్శించడం ఇదేమీ మొదటిసారి కాదు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య గత ఏడాది యుద్ధం మొదలైన తరువాత కూడా ఆయన ఉక్రెయిన్ లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలుసుకుని, రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా జో బైడెన్.. ఇజ్రాయెల్‌లోని వార్ జోన్‌ను సందర్శించారు. ఆ దేశ అధినేత బెంజమిన్ నెతన్యాహు స్వయంగా బైడెన్‌కు స్వాగతం పలికారు.
అయితే ఒకపక్క క్షిపణులు ప్రమాదకరంగా ఎగురుతున్న తరుణంలోనే జో బైడెన్ వార్‌జోన్‌కు ఎలా చేరుకున్నాడనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. దీనికి సమాధానం అమెరికా అధ్యక్షుని పర్యటన వివరాలు చాలా గోప్యం అనే చెప్పాలి. అతికొద్ది మందికి మాత్రమే ఆయన ఇజ్రాయెల్ పర్యటన వివరాలు తెలుసు. ఈ పర్యటన షెడ్యూల్ లీక్ కాకుండా సీక్రెట్ సర్వీస్ పలు జాగ్రత్తలు తీసుకుంది.
ఉక్రెయిన్ పర్యటనలో సమయంలోనూ బైడెన్ రహస్యంగానే వెళ్లారు. ఎవరికీ ముందస్తు సమాచారం లేదు. ప్రత్యేక రైల్లో ఆయన ఉక్రెయిన్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో అతని భద్రతా విభాగంలో పలువురు అధికారులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నారు. అదేరీతిలో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంలోనూ భద్రత కల్పించారు. అయితే బైడెన్ విమాన మార్గం ద్వారా సరిహద్దులు దాటి ఇజ్రాయెల్ చేరుకున్నారా? లేక రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా వెళ్లారా అనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.
అమెరికా అధ్యక్షుని కాన్వాయ్‌లో ఏ క్షిపణి ప్రభావానికి గురికాని బీస్ట్ వంటి కార్లు ఉన్నాయి. అంతేకాకుండా బైడెన్ విమానంలో ప్రయాణించిన పక్షంలో దానికి భద్రతగా ముందు వెనకల యుద్ధ విమానాలను కూగా మోహరిస్తారు. ఈ యుద్ధ విమానాలు ఎటువంటి దాడులనైనా తిప్పికొడతాయి.
ఇది కూడా చదవండి: హమాస్‌లో ‘మ్యాన్ ఆఫ్ డెత్’ ఎవరు? టాప్ కమాండర్ల పనేమిటి?
Comments
Please login to add a commentAdd a comment