దేశంలోని చాలామంది తీర్థయాత్రలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తుంటారు. తమకు మంచి జరగాలని కోరుకుంటూ దేవాలయాలకు వెళ్లి, దేవుని దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.
వైష్ణోదేవి ఆలయ సందర్శనకు వస్తున్న భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు యాత్రను కొద్దిసేపు నిలిపివేసింది. కొద్దిసేపటి తరువాత భక్తుల రద్దీని నియంత్రించి, దర్శనాలకు అనుమతినిచ్చింది.
మాతా వైష్ణో దేవి ఆలయం జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో త్రికూట పర్వతంపై ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు!
#WATCH | Reasi, J&K: Devotees throng the Holy Cave Shrine of Shri Mata Vaishno Devi temple in Katra pic.twitter.com/Z0R1fYy3Zj
— ANI (@ANI) January 1, 2024
Comments
Please login to add a commentAdd a comment