Happy New Year 2023
-
వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు
దేశంలోని చాలామంది తీర్థయాత్రలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తుంటారు. తమకు మంచి జరగాలని కోరుకుంటూ దేవాలయాలకు వెళ్లి, దేవుని దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వైష్ణోదేవి ఆలయ సందర్శనకు వస్తున్న భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు యాత్రను కొద్దిసేపు నిలిపివేసింది. కొద్దిసేపటి తరువాత భక్తుల రద్దీని నియంత్రించి, దర్శనాలకు అనుమతినిచ్చింది. మాతా వైష్ణో దేవి ఆలయం జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో త్రికూట పర్వతంపై ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు! #WATCH | Reasi, J&K: Devotees throng the Holy Cave Shrine of Shri Mata Vaishno Devi temple in Katra pic.twitter.com/Z0R1fYy3Zj — ANI (@ANI) January 1, 2024 -
దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు!
నూతన సంవత్సరం-2024 సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అందరికీ శ్రేయస్సు, శాంతి, మంచి ఆరోగ్యం సమకూరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మైక్రో-బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ‘ప్రతి ఒక్కరికీ 2024 అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, మెరుగైన ఆరోగ్యం సమకూరాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 అందరికీ సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను. సమ్మిళిత, స్థిరమైన, అభివృద్ధికి దోహదపడే కొత్త నిబద్ధతతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం’ అని ఆమె ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఇలా రాశారు ‘ప్రతి భారతీయునికి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను. భారతదేశ పురోగతి, శ్రేయస్సుకు దోహదపడే దృఢ నిబద్ధతతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం’ అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘2024 నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అని రాశారు. భారతదేశంతో పాటు ప్రపంచమంతా 2024కు ఘనంగా స్వాగతం పలికింది. ఇది కూడా చదవండి: 2024.. దునియాలో ఏం జరగనుంది? "Wishing everyone a splendid 2024": PM Modi extends New Year wishes to people Read @ANI Story | https://t.co/mlu0Wa1zb2#PMModi #NewYear #NewYears2024 pic.twitter.com/k4j6q3NyPn — ANI Digital (@ani_digital) January 1, 2024 -
లాల్‌చౌక్‌లో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు!
శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో తొలిసారిగా నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ వేడుకల్లో పాల్గొన్న యువత అత్యంత ఉత్సాహంగా 2024కు స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి కశ్మీర్ యువత లాల్‌చౌక్ వద్దకు చేరుకుని ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా అధికసంఖ్యలో లాల్‌చౌక్ వద్దకు తరలివచ్చారు. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ముందుగానే పలు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉత్తర కాశ్మీర్లో ఎప్పుడూ మంచుతో నిండిపోయే గుల్మార్గ్ శీతాకాలపు ఎండలో మెరిసిపోయింది. నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఉదయం నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. గుల్మార్గ్లో రోజంతా సందడి నెలకొంది. వివిధ సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకులు ఆనందంగా నృత్యాలు చేస్తూ కనిపించారు. తొలిసారిగా ప్రభుత్వం లాల్‌చౌక్ దగ్గర భారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహించింది. గతంలో స్థానిక హోటళ్ల నిర్వాహకులు మాత్రమే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు మొదటి సారిగా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. తమ కొత్త సంవత్సరం 2024 ఇలాంటి స్వర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వినూతన వేడుకలు.. This is #SrinagarSquare, #LalChowk right now! A city life never seen before. The celebration, the vibrancy like never before! This is the probably the biggest alibi to the transformation that Srinagar city has witnessed with the implementation of #SrinagarSmartCity projects!… pic.twitter.com/f3mL69RjFF — Athar Aamir Khan (@AtharAamirKhan) December 31, 2023 -
కొత్త ఏడాది తొలి రోజునే సూర్య ఆసక్తికర పోస్టు
టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ నూతన సంవత్సర వేడుకలను తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. కొత్త సంవత్సరం తొలి రోజున ముంబైలోని ప్రఖ్యాత సిద్ది వినాయక గుడిని సందర్శించి దీవెనలు అందుకున్నాడు. సిద్ది వినాయక ఆశీర్వాదాలు అందుకున్నా.. ఈ ఏడాది అంతా మంచి జరగాలని కోరకున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేసి క్యాప్షన్ జత చేశాడు. ఇక సూర్యకుమార్ గతేడాది అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా టి20 క్రికెట్లో తనదైన మార్క్ చూపించిన సూర్యకుమార్ ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. మిస్టర్ 360 పేరును సార్దకం చేసుకున్న సూర్యకుమార్ గతేడాది టి20 క్రికెట్లో 1164 పరుగులు చేసి 2022లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తొలిస్థానంలో నిలిచాడు. అంతేకాదు 2022లో టి20 క్రికెట్లో 68 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. రెండు సెంచరీలు సహా తొమ్మిది హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. ఇక టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌లు కలిపి 189 స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా సూర్యకుమార్ తన ఫామ్‌ను కంటిన్యూ చేసి టీమిండియాను వన్డే వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాలని కోరుకుందాం. As we enter the year 2023, with unexplainable gratitude in my heart, I thank you for all the love and support you have showered upon me this year ♥️ Here’s hoping for an even greater year ahead, wishing you all a very happy new year 🤩 pic.twitter.com/mu44f5Mz41 — Surya Kumar Yadav (@surya_14kumar) December 31, 2022 చదవండి: ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం మహిళా అథ్లెట్ కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడామంత్రిపై కేసు -
న్యూ ఇయర్ సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు
-
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
-
TS: నూతన సంవత్సరం ప్రగతికి బాటలు వేయాలి: సీఎం కేసీఆర్
హైదరాబాద్: నూతన సంవత్సరం 2023 సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవ డం ద్వారానే నూతనత్వం వస్తుంది. ఎన్నో అవాంతరాలు, వివక్షను ఎదుర్కొంటూ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అందరికీ ఆదర్శం. సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రారి్థస్తున్నా. నూతన సంవత్సరం అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలి. – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చదవండి: ఇదేమైనా బాహుబలి సినిమానా? -
ప్రతి కుటుంబం వర్థిల్లు గాక!
కాలం చల్లటి నీడనిచ్చే చెట్టు కావాలి. వడగాడ్పు నుంచి, ఊపి కొట్టే వాన నుంచి, గడ్డ కట్టే చలి నుంచి అది మనుషులను కాయాలి. పంటలు సమృద్ధిగా పండాలి. తియ్యటి మామిడిపండ్లు బండ్ల కొద్దీ మండీలకు చేరాలి. పూలు సలీసుగా దొరకాలి. కొలనుల్లో చేపల వీపులను తామరతూడులు తడమాలి. నదులు ఒండ్రుమట్టిని ఒడ్డుకు తోస్తూ ప్రవహించాలి. సముద్రాలు శాంత వచనాలు పలకాలి. మహమ్మారులు తోకలు ముడవాలి. ఒకటీ అరా మాత్రలతో తగ్గియే రోగాలే చలామణిలో ఉండాలి. నాలుగు గోడలు లేపినవాడు పైకప్పు వేసుకోగలగాలి. గూడే లేని వాడు ఇంత జాగా సంపాదించుకోవాలి. ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా చేతికందాలి. కాయకష్టం చేసేవాడు బువ్వకు లోటెరగక ఉండాలి. పాలకులు పెద్ద మనసు చేసుకోవాలి. కట్నాలు, లాంఛనాల జంజాటాలు లేక అప్పుల బెంగ ఎరగని పెళ్ళిళ్లు జరగాలి. ఆడపిల్లలు సగౌరవంగా, సురక్షితంగా ఉండాలి. స్త్రీల గెలుపు గాథలు వినిపించాలి. యువతీ యువకుల సబబైన ఇష్టాలు చెల్లుబాటు కావాలి. రహదారులు క్షేమమార్గాలుగా విలసిల్లాలి. సమాజం శాంతితో నిండాలి. అశాంతి కొరకు ప్రయత్నించే ప్రతి చర్యా చతికిలపడాలి. హేతువుకు చోటు దక్కాలి. ప్రతి ఇల్లు పాలు తేనెల సమృద్ధితో నిండాలి. తాతయ్య, నానమ్మలు కులాసాగా ఉండాలి. అమ్మ చెప్పినట్టు అందరూ వినాలి. నాన్న జేబు ఎప్పుడూ నిండుగా ఉండాలి. పిల్లలు సదా పకపకలాడాలి. చదువులెన్నో బుద్ధిగా చదవాలి. బంధువులందరూ బలగంగా ఉండాలి. స్నేహితులందరూ శక్తిగా మారాలి. కొత్త సంవత్సరం అందరికీ శుభాలు తేవాలి. ప్రతి కుటుంబం వర్థిల్లాలి. మంచిని తలుద్దాం. విశ్వం వింటుంది. గట్టిగా అనుకుందాం. తప్పక నెరవేరుతుంది. హ్యాపీ న్యూ ఇయర్. -
2023: సంతోషంగా స్వాగతం పలుకుదాం!
ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనంతో నవనవోన్మేషంగా ఉండడం సృష్టి లక్షణం. అనుదినం తన బిడ్డలకు కొత్తదనాలనూ, కొత్త భోగవస్తువులనూ, కొత్త అనుభవాలనూ కానుక చేయడం భగవంతుడికి వాడుక, వేడుక. కాబట్టే తెల్లారేసరికి మన చుట్టూ ఎన్నో కొత్త చిగుళ్లూ, కొత్త మొగ్గలూ, కొత్త ఆరంభాలూ కళకళ లాడుతూ, కిలకిల నవ్వుతూ కనిపిస్తాయి. ఎన్నో కొత్త అందాలూ, పోకడలూ, విచిత్రాలూ, కొత్త వేష భాషలూ, వస్తువాహనాలూ, ప్రయోగాలూ, ధోరణులూ ఎదురౌతాయి. ప్రకృతి ధర్మంగా వచ్చి పలకరించే కొత్తదనాల సందడిని సుహృద్భావంతో స్వాగతించే ధీరుడు వాటిని ఆనందంగా ఆస్వాదించగలుగుతాడు. పరిచితమైనదనే పక్షపాతంతో పాతనే పట్టుకు పాకులాడుతూ, అపరిచితమైన నవ్యతకు అకారణంగా జంకుతూ ఉండే భీరువు, నిరంతమైన నిరాశతో నిరుత్సాహానికి నెలవుగా ఉంటాడు. నిన్నటి కొత్తే నేటి పాత. నేటి కొత్త రేపటికి పాత. అయినప్పుడు అన్నీ మన మంచికే. లోక క్షేమం కోసం కొత్త నీరుప్రవహిస్తూ వస్తుంటే భయమెందుకు, కొత్త సమస్యలు మోసు కొస్తుందేమోననా? సమస్య వెంటే పరిష్కారం వస్తుంది అని చరిత్ర మనకు పదే పదే చెప్పిన పాఠం. గతంలో ఇలా అనవసరంగా ముందు భయపెట్టిన సమస్యలెన్నిటినో మనం అలవోకగాదాటివచ్చిన వాళ్ళమే గదా! సృష్టి కర్త ఉన్నాడనీ, ఆయన కరుణామయుడనీ, కాలగమనానికి ఆయనే కారణం గనక కాలగతి కలిగించే ఒడుదొడుకులన్నీ ఆయన అను గ్రహంతో అధిగమించగలమనీ విశ్వసించే వారు, నవ్యతను ఆశాభావంతో ఆహ్వానించకుండా ఉండలేరు. ఎన్నో కొత్తదనాలు మన ముందు ఆవిష్కరించేందుకు, మరో నూతన సంవత్సరం మన ముంగిట నిలిచిన శుభవేళలో, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాక్ భవేత్ (అందరూ సుఖంగా ఉండాలి, అందరూ అనారోగ్యానికి దూరంగా ఉండాలి, అందరికీ శుభాలు జరగాలి, ఎవ్వరూ దుఃఖానికి ఆశ్రయం కాకూడదు) అన్న ఆర్షేయమైన ఆశీస్సు మనసారా మరోసారి మననం చేసుకొందాం. కొత్త ఏడాదిలో అందరూ ధర్మాన్ని రక్షిస్తూ, దానివల్ల సురక్షితులై సుఖశాంతులతో ఉండాలనీ, దుఃఖహేతువులైన దుర్మార్గాలకు దూరంగా ఉండాలనీ ఆకాంక్షిస్తూ, రెండు వేల ఇరవై మూడుకు సంతోషంగా స్వాగతం పలుకుదాం! – ఎం. మారుతి శాస్త్రి -
మనసు గెలిచే న్యూ ఇయర్ గిఫ్ట్
కొత్త సంవత్సరం అందరికీ ఉంటుందనుకుంటాం.. కానీ కొందరికి దాని గురించే తెలియకపోవచ్చు. ఆ పూటకు కడుపు నిండుతుందో లేదో తెలియని పేదలకు కొత్త సంవత్సరం గురించి పెద్దగా ఆలోచించే అవకాశం ఉండదు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కొత్త సంవత్సరం వేళ వారి మనస్సుల్లో ఆనందం నింపే ప్రయత్నం చేసింది ఓ కార్పోరేట్ కంపెనీ. హైర్ ఐటీ, స్టాఫింగ్లీ అనే మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్పోరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఐదు వందల మంది పేదవారికి న్యూ ఇయర్ గిఫ్ట్‌లు ఇచ్చింది. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో రాజు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎవరైనా దయ చూపితేనే ఆకలి తీరుతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రాజు దగ్గరికి వెళ్లారు హైర్ ఐటీ పీపుల్ మరియు స్టాఫింగ్లీ ఉద్యోగులు. అతనికి రుచికరమైన తినుబండారాలను ఇచ్చి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. అలాంటి వారే మరికొందరు. గాంధీ హాస్పటల్ సమీపంలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయిన రాముని దివ్యాంగురాలైనా ఆమె తల్లి వీల్‌ఛైర్‌లో కూర్చొబెట్టుకుని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. పెద్దమ్మ తల్లి టెంపుల్ సమీపంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారు మరికొందరు. ఇలాంటి వారితో పాటు హైదరబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్లు, జ్యూస్, మంచినీటితో కూడిన రుచికరమైన తినుబండారాలను అందజేశారు. -
న్యూఇయర్ గ్రీటింగ్స్.. బెస్ట్ వాట్సాప్ స్టేటస్లు కావాలా?
కొత్త సంవత్సరం రాబోతోందంటే.. మనలో ఏదో నూతనోత్సాహం. ఏదో తెలియని అనుభూతి. గడిచిపోయిన ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికి.. కొత్త ఏడాది సరికొత్తగా ప్రారంభించాలనే తపన. ఉప్పొంగే ఉత్సాహం.. అలుపెరగని ఉల్లాసం.. పాత ఒక రోత.. కొత్త ఓ వింత అనేది కూడా ఇక్కడ సరిపోతుంది. చేసుకుంటేనే కొత్త ఏడాది రాదు.. చేసుకున్నా చేసుకోకపోయినా కొత్త ఏడాది అనేది కామన్. స్థానిక సంప్రదాయాల ప్రకారం వేరే సంవత్సరాదులను కలిగి ఉన్నా.. ఆంగ్ల సంవత్సరాది సంబరాల్లో భారతీయులు ఉత్సాహంగా జత కలుస్తారు. పాత సంవత్సరానికి ముగింపు పలికే సందర్భం వచ్చేసింది కాబట్టి కొత్త ఏడాది అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని రావాలని, నయా జోష్‌తో నిండిపోవాలని కోరుకుందాం. మనం ఫ్రెండ్స్ అయినందుకు చాలా సంతోషిస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్ 2023 2022కి వీడ్కోలు పలుకుతూ, కొత్త ఆశలు, కలలు, ఆశయంతో ముందుకు సాగాలని వెల్ కమ్ 2023.. హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం పూర్తిగా ఆనందంతో నిండిపోవాలని ఆశిస్తున్నాను.. హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరం పూర్తిగా ఆనందంతో నిండిపోవాలని ఆశిస్తూ బై బై 2022 వెల్ కమ్ 2023 మీరు ఏడాది పొడవునా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఆనందం, విజయం, శ్రేయస్సు అందించాలని కోరుకుంటూ.. వెల్ కమ్ 2023 గత బాధలను మరచి ఆనందంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టండి. వెల్ కమ్ 2023 దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, విజయం, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి రోజు ఉత్తమమైన రోజు కావాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 మీ అందమైన కుటుంబానికీ వెల్కమ్ 2023... ఆనందాలు, సంతోషాలు కలిగించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూఇయర్ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ.. పాత సంవత్సరానికి బై చెపుతూ మీకు, మీ కుటుంబానికీ.. హ్యాపీ న్యూఇయర్ 2023 ఈ సంవత్సరం అందర్నీ ప్రేమతో ఏకం చెయ్యాలి. అందరూ సంతోషంగా వేడుకలు జరుపుకోవాలి.. హ్యాపీ న్యూఇయర్ 2023 సకల సౌభాగ్యాలను, సుఖ సంతోషాలను దేవుడు మీ ఇంట ఆహ్వానించాలని కోరుకుంటూ వెల్కమ్ 2023 2022కి బై బై వేడుకల్లో అందరూ ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ వెల్కమ్ 2023 2022 అనే గత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. వెల్ కమ్ 2023 అని చెప్పాల్సిన టైం వచ్చింది.. హ్యాపీ న్యూ ఇయర్ 2023 నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్యం, సంపద మరియు ఆనందాన్ని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ ... నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాత్రులు చీకటిగా ఉన్నాయి, కానీ రోజులు వెలుగుగా ఉంటాయి, మీ జీవితం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి భయపడకండి, ఎందుకంటే దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని బహుమతిగా ఇచ్చాడు.నూతన సంవత్సర శుభాకాంక్షలు! నూతన సంవత్సర శుభాకాంక్షలు! రాబోయే సంవత్సరం గొప్ప సాహసాలు మరియు అవకాశాలతో నిండి ఉండండి. చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ, సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరపురాని స్నేహితుడితో ఆనందం, నవ్వు మరియు మరపురాని జ్ఞాపకాలతో నిండిన మరో సంవత్సరం ఇక్కడ ఉంది! కొత్త సంవత్సరం వేళ.. కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ.. మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం కలకాలం మీతోనే ఉండిపోవాలని.. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు.. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ మార్గాన్ని సానుకూల గమ్యస్థానానికి మార్గనిర్దేశం చేయడానికి కొత్త సంవత్సరం మీకు వెచ్చదనం, ప్రేమ మరియు కాంతిని తెస్తుంది గతంలోని జ్ణాపకాలను గుర్తుచేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ.. కొత్త ఏడాది శుభాకాంక్షలు పాత సంవత్సరం ముగియనివ్వండి మరియు నూతన సంవత్సరం ఆకాంక్షల వెచ్చగా ప్రారంభమవుతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు! నూతన సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధ భరితం.. ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని కోరుకుంటూ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు.. నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!! కష్టాలెన్నైనా సరే రానీ.. సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ.. కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం.. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సుమం సుగంధభరితం, ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం! విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ 2023 క్రొత్త ఆరంభాలు క్రమంలో ఉన్నాయి మరియు క్రొత్త అవకాశాలు మీ దారిలోకి రావడంతో మీరు కొంత ఉత్సాహాన్ని అనుభవిస్తారు. ఈ న్యూ ఇయర్ విషెస్, మెసేజెస్, కోట్స్‌ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు షేర్‌చాట్, వాట్సాప్, ఫేస్బుక్, మెసేజ్ రూపంలో పంపుకోండి. మీ ఆనందాన్ని వారితో పంచుకోండి. -
మందుబాబులకు హెచ్చరిక..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఎంతో జోష్‌తో జరుపుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా వేడుకలపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. అటు ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం వేడుకలపై ఫోకస్ పెట్టారు. న్యూ ఇయర్ వేడుకలపై మందుబాబులపై ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టి 26 స్ట్రైకింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈవెంట్లలో డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు. ఇక, డిసెంబర్ 31 సందర్బంగా రాత్రి 12 గంటల వరకు వైన్స్, ఒంటి గంట వరకు బార్లకు అనుమతి ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కూడా మందుబాబులను హెచ్చరించారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు. ఓఆర్ఆర్, వంతెనలు బంద్ నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతి ఇస్తారు. అలాగే దుర్గం చెవురు కేబుల్ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నం–45, సైబర్ టవర్, ఫోరంమాల్–జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్‌రామ్ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్‌పాస్‌లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదు. -
ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలని, మంచి ఆరోగ్యం అందించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం తన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు. -
Happy New Year 2023: న్యూఇయర్‌కు స్వాగతం.. ప్రారంభమైన సెలబ్రేషన్స్
అక్లాండ్: ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర జోష్ నెలకొంది. సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. ఆంగ్ల సంవత్సరాది కోసం భారత్‌లోనూ కోలాహలం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. సంబురాలు చేసుకోవాలనే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆక్లాండ్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో న్యూజిలాండ్ 2023లోకి అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌లో ముందుగా రోజు ప్రారంభమవుతుందన్న విషయం తెలిసిందే కదా. అక్కడి నుంచి కాలమానం ప్రకారం.. ఒక్కో దేశం వేడుకలు చేసుకుంటుంది. ఇక చివరగా అమెరికా సమీపంలోని జనావాసాలు లేని బేకర్, హౌలాండ్ ద్వీపాలు చివరగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. భారత కాలమానం ప్రకారం .. ఆ టైం జనవరి 1 సాయంత్రం 5:30 గంటలని ఒక అంచనా. Greetings from the future. I’m glad to report that 2023 is pretty awesome. Happy New Year to all! #Auckland pic.twitter.com/HB9WPDB9TR — Marcos Balter (@MarcosBalter) December 31, 2022 -
New Year 2023: న్యూ ఇయర్‌కు ఫస్ట్ వెల్కమ్ చెప్పే దేశమేదో తెలుసా?
న్యూ ఇయర్ వచ్చిందంటే ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటుంది. ప్రస్తుత ఏడాదికి ముగింపు పలికి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతుంది. ఈ సందర్భగా డిసెంబర్ 31న బాణసంచా కాల్చి, విందు, వినోదాలతో ఉత్సాహంగా కన్పిస్తారు ప్రజలు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టవు. కొన్ని దేశాలు ముందుగా, మరికొన్ని దేశాలు కొన్ని గంటల తర్వాత న్యూఇయర్‌లోకి ప్రవేశిస్తాయి. అందుకే డిసెంబర్ 31 మొత్తం 25 గంటల పాటు కొత్త సంవత్సర వేడుకలు జరుగుతాయి. న్యూ ఇయర్ వేడుకలకు ప్రాచీన చరిత్ర ఉంది. 4,000 ఏళ్ల క్రితం ఇరాక్‌లోని బేబీలాన్ ప్రాంతం అందరికంటే ముందు కొత్త ఏడాదికి స్వాగతం పలికేది. కాలానుగుణంగా మార్పులు రావడంతో పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఓసియానియా (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను కలిపే ప్రాంతం) ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ముందు 2023కు స్వాగతం పలుకుతుంది. టోంగా, కిరిబతి, సమోవా వంటి పసిఫిక్ ఐలాండ్ దేశాలు ఓసియానాలోనివే. అందుకే ప్రపంచంలోని ఇతర దేశాలకంటే ముందుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 గంటలకే ఓసియానియాలో సంబరాలు ప్రారంభమవుతాయి. చివరగా ఏ దేశంలో? అమెరికా సమీపంలోని జనావాసాలు లేని బేకర్, హౌలాండ్ ద్వీపాలు న్యూయర్కు చివరగా స్వాగతం పలుకుతాయి. భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే జనవరి 1 సాయంత్రం 5:30 గంటలకు ఈ ప్రాంతం కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతుంది. చదవండి: Happy New Year 2023: మెరిసేనా.. ఉరిమేనా? -
Happy New Year 2023: మెరిసేనా.. ఉరిమేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి మరో ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఇరవై రెండు జ్ఞాపకాల పుటల్లోకి వెళ్లిపోతుంది. జ్ఞాపకం ఎప్పుడూ గుర్తుగానే మిగిలిపోతుంది. టైమ్ మెషీన్లో వెనక్కు వెళ్లి అనుభవంలోకి తెచ్చుకోలేము. కొన్ని జ్ఞాపకాలు కంటినుంచి జారిపడ్డ మెరుపుల్లాగా పెదవులపై చిరునవ్వులు వెలిగిస్తాయి. మరికొన్ని కన్నీటి చుక్కల్లా అప్రయత్నంగా ఒలికిపోయి ఘనీభవిస్తాయి. అప్పుడప్పుడు భయపెడతాయి. 2020, 2021 సంవత్సరాలు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపి మానవాళికి అంతులేని విషాదాన్ని, నిర్వేదాన్ని, మానసిక ఒత్తిడిని మిగిల్చి వెళ్లాయి. 2022 ఆశాజనకంగానే ఆరంభమై భయంభయంగానే అయినా మందహాసంతో మందగమనంగా కొనసాగుతున్న వేళ ఒకరి రాజ్యకాంక్ష యుద్ధ రూపంలో విరుచుకుపడింది. యుద్ధం తాలూకు దుష్పరిణామాలు ప్రపంచాన్ని నిర్దాక్షిణ్యంగా మాంద్యంవైపు నెట్టాయి. ఏడాది చివర్లో కంటికి కనిపించని వైరస్ ఒకటి మరోసారి రాబోయే గడ్డు పరిస్థితులను కళ్లకు కట్టడం మొదలుపెట్టింది. ఉగాది పచ్చడిలా తీపి, చేదులను రుచి చూపించిన 2022 మానవాళికి కొంతలో కొంత ఉపశమనం కలిగించి వెళ్లిపోతోంది. మరి 2023 కొత్త ఆశలకు ఊపిరులూదుతుందా, లేక ఉన్న ఉసురూ తీస్తుందా? చూడాల్సిందే! వెళ్లిపోనున్న ఈ ఏడాది ప్రభావం రానున్న ఏడాదిపై ఎంతమేరకు పడనుందో ఒకసారి చూద్దాం... మాంద్యం... ముంచుకొస్తోంది! రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో చుక్కలవైపు దూసుకెళుతున్నాయి. కరోనా భయాలు, ఆంక్షలు రెండేళ్లపాటు ప్రపంచ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి వృద్ధి రేటును పాతాళంలోకి నెట్టేశాయి. ఫలితంగా ఈ ఏడాది ద్రవ్యోల్బణం గత దశాబ్దంలోకెల్లా గరిష్టానికి చేరుకుంది. ఇది వచ్చే ఏడాది మరింత పైపైకి ఎగబాకి దాదాపు ప్రపంచాన్ని యావత్తూ మాంద్యంలోకి నెడుతుందని విశ్లేషకుల అంచనా. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం మాంద్యానికి మరింత ఆజ్యం పోస్తుందని వారి విశ్లేషణ. ద్రవ్యోల్బణాన్ని అరికడితే మాంద్యం బారిన పడకుండా బయటపడే అవకాశం ఉంటుందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు వడ్డీరేట్లు పెంచాయి. వచ్చే ఏడాది కూడా వడ్డీరేట్లు మరింత పెరిగే అవకాశముంది. అమెరికాలో ద్రవ్బోల్బణం ఈ ఏడాది ఒక దశలో గత 40 ఏళ్లలో గరిష్టంగా ఏకంగా 9 శాతానికి ఎగబాకడం ప్రపంచ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం సగటు మనిషికి కోలుకోని దెబ్బే. పెట్రో ధరలు పెరగడం మధ్యతరగతి జీవితాలను పెనంమీది నుంచి పొయ్యిలోకి నెట్టింది. ఒకవైపు ద్రవ్యోల్బణం వేడి, మరోవైపు మాంద్యం బూచి పలు కార్పొరేట్ సంస్థలను తీవ్ర ఆలోచనలో పడేయడంతో ఖర్చు తగ్గించుకునేందుకు అవి ఉద్యోగాల కోతవైపు దృష్టి సారించాయి. ఫలితంగా పలు దేశాల్లో నిరుద్యోగిత మరింత పెరిగింది. అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతుంటే భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటం గమనార్హం. భారత్‌లో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 5.9 శాతంగా ఉంది. అయితే వచ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందని ఆశించలేం. అంతో ఇంతో మాంద్యం ఊబిలో చిక్కక తప్పని పరిస్థితులు ఎదురవ్వవచ్చు. వచ్చే ఏడాది బడ్జెట్లో దేశ ఆర్థిక వ్యవస్థను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏ మేరకు సరిచేస్తారో వేచి చూడాల్సిందే. ప్రపంచంలోని మిగతా దేశాల పరిస్థితి కూడా ఊగిసలాటగానే ఉంది. మరీ శ్రీలంకలాగా దిగజారకున్నా వచ్చే ఏడాది అన్ని దేశాలపైనా మాంద్యం కత్తి వేలాడుతూనే ఉంటుంది. వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ ఏడాదంతా ఊదరగొట్టిన అధ్యయన సంస్థలు, అది కొంచెం కష్టమేనని తాజాగా అంగీకరిస్తుండటం గమనార్హం. మాంద్యం భయం అంచనాలనూ తారుమారు చేస్తోంది! యుద్ధం... వెన్ను విరుస్తోంది! నిజం చెప్పాలంటే ఈ ఏడాది జనవరి నెల ఒక్కటే ప్రశాంతంగా గడిచింది. కరోనా రక్కసి పీడ పోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో యుద్ధం మరో దయ్యంలా దాపురించింది. 2020, 2021ల్లో మానవాళిని కరోనా వెంటాడితే ఈ ఏడాదిని రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజ్యకాంక్ష వెంటాడింది. ఫిబ్రవరిలో రష్యా ఉన్నట్టుండి ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి తన యుద్ధోన్మాదాన్ని ప్రపంచంపై రుద్దింది. తన అదృశ్య స్నేహితుడు చైనాతో కలిసి రష్యా ఒకవైపు, అమెరికా వత్తాసుతో ఉక్రెయిన్ మరొకవైపు మోహరించాయి. ఇప్పుడు డిసెంబరులో ఉన్నాం. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త సంవత్సరంలోకీ అడుగు పెడుతోంది. ముమ్మరమా.. ముగింపా.. చెప్పలేం! రెండేళ్లుగా తూర్పు ఆఫ్రికాలో కొనసాగుతున్న యుద్ధం దాదాపు ఆరు లక్షల మందిని కబళించినా ఇంకా కొలిక్కి రాలేదు. వస్తుందనే నమ్మకమూ దరిదాపుల్లో లేదు. మరోవైపు సిరియా, యెమన్లలో జరుగుతున్న అంతర్యుద్ధాల పరిస్థితీ ఇదే. వాటి పర్యవసానాలు ఆయా దేశాలకే పరిమితమైనా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా దేశాలు తటస్థంగా ఉన్నప్పటికీ ఈ యుద్ధం ప్రపంచాన్ని రెండు శిబిరాలుగా చీల్చింది. మరోవైపు పెట్రో ధరలపైనా, గోధుమ, మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాల ధరలపైనా తీవ్ర ప్రభావం చూపింది. క్రూడాయిల్ ఎగుమతుల్లో రష్యా (14 శాతం), గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ (25 శాతం) అగ్ర భాగాన ఉన్న సంగతి తెలిసిందే. వీటిపైనే ఆధారపడ్డ చాలా దేశాలు ఇప్పటికే చమురు కొరతను, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొటున్నాయి. వచ్చే ఏడాది ఇది మరింత తీవ్రతరం కానుంది. ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలన్న ఉద్దేశం పుతిన్, జెలెన్స్కీల్లో ఏ కోశానా ఉన్నట్టు కన్పించడం లేదు. యుద్ధం విషాదమే గానీ ఆపే ఉద్దేశం లేదని పుతిన్ ఇటీవలే బాహాటంగా స్పష్టం చేశారు. రష్యా ముందు సాగిలపడటానికి ససేమిరా అంటున్న జెలెన్స్కీ పోరాడితే పోయేదేమీ లేనట్టు ముందుకు సాగుతున్నారు. దౌత్య చర్చలకు మొగ్గు చూపుతూనే అదనపు ఆయుధ సమీకరణకు నాటో మిత్ర దేశాల వైపు చూస్తున్నారు. ఇటీవలే అమెరికా వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవడమే గాకుండా తన ఆయుధపొదిలో పేట్రియాటిక్ క్షిపణులను సమకూర్చుకున్నారు. సంధి కోసమో, కనీసం యుద్ధ విరామం కోసమో ప్రయత్నించాల్సిన అమెరికా లాంటి దేశాలు చోద్యం చూస్తూ కూర్చున్నాయే తప్ప ఆ దిశగా ఎలాంటి చొరవా చూపడటం లేదు. మరోవైపు యుద్ధాన్ని రష్యా తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌పై రోజుల తరబడి క్షిపణుల వర్షం కురిపిస్తోంది. గురువారం ఒక్క రోజే 120కి పైగా క్షిపణులను ప్రయోగించిందంటే రాబోయే రోజుల్లో యుద్ధం ఏ దశకు చేరుకోనుందో ఊహించవచ్చు. 2023లోకి అడుగు పెడుతున్న యుద్ధం 2024ను కూడా పలకరించేలా కన్పిస్తోంది. కరోనా... వణికిస్తోంది! గడచి రెండేళ్లు (2020, 2021) కరోనా నామ సంవత్సరాలైతే ఈ ఏడాది (2022) కరోనా ఫ్రీ సంవత్సరమని చెప్పుకోవచ్చు. అయితే అది నవంబర్ వరకే. డిసెంబర్లో చైనా మళ్లీ కొత్త వేరియంట్‌తో సరికొత్త కరోనా బాంబు పేల్చింది. కరోనా వైరస్ మానవ సృష్టేనన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ చైనా పాలిట భస్మసుర హస్తమైంది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు అంటూ చైనా నుంచి వస్తున్న వార్తలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేట్టు చేశాయి. చైనాలో వైరస్ ఉనికి కనిపించిన ఒకట్రెండు నెలలకు ప్రపంచానికి వ్యాపించడం, లేదా విస్తరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలో ప్రత్యక్షమైన కొత్త వేరియంట్ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలోగా ఇతర దేశాలకు పాకడం ఖాయమని వైద్య నిపుణుల అంచనా. కరోనాతో సహజీవనం చేసిన చాలా దేశాల్లోని జనాలకు ఈ కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ కొంతమేరకు ఇబ్బంది పెట్టే అవకాశముందని వారి విశ్లేషణ. చైనా ప్రజలు రెండేళ్లుగా కరోనా వైరస్‌కు అల్లంత దూరాన తమను తాము బందీ చేసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తికి దూరమయ్యారు. ఇప్పడు ఒక్కసారిగా కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో వైరస్ ప్రభావం నుంచి తప్పించుకోలేక సతమతమవుతున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా తాజాగా చైనా ఆంక్షలు ఎత్తేయడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు చైనానుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్ష తప్పనిసరి చేశాయి. చైనా ప్రపంచానికి వెల్లడించింది ఒక్క వేరియంట్ గురించేనని, నిజానికి అక్కడ మరో డజనుకు పైగా కొత్త వేరియంట్లు పుట్టకొచ్చాయని వార్తలు వినవస్తున్నాయి. అదే నిజమైతే ఏ వైపునుంచి ఏ వేరియంట్ వచ్చి మీద పడుతుందో ఊహించడం కష్టం. టీవీలు, వార్తా పత్రికలు ఊదరగొడుతున్నట్టుగా చైనాలో గడ్డు పరిస్థితులేమీ లేవని, అదంతా పశ్చిమ దేశాల కుట్రేనన్నది మరో వాదన. కరోనా వ్యాక్సీన్లను అమ్ముకోవడానికి ఫార్మా కంపెనీలు అల్లుతున్న కట్టుకథలేనన్నది ఇంకో వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పటికైతే ఇంకా కఠినమైన కరోనా ఆంక్షలేవీ అమల్లోకి రాలేదు. అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు అనుమానిస్తున్నారు. అదే జరిగితే వచ్చేది మరో కరోనానామ సంవత్సరమే అవుతుమంది. లేదంటే కరోనా ఫ్రీ ఏడాదిగా అందరి ముఖాలపై ఆనందాన్ని వెలిగిస్తుంది! -
న్యూ ఇయర్ విషెస్ ఇలా తెలియజేయండి మీ సన్నిహితులకు
Happy New Year 2023: మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరం 2023లో మనం అడుగుపెట్టబోతున్నాం. ప్రపంచం మొత్తం జరుపుకునే సెలబ్రేట్ చేసుకునే వేడుకల్లో ఆంగ్ల సంవత్సరాది ఒకటి. ఏంటీ అప్పుడే 2022 గడిచిపోయిందా? అనే సందేహం వస్తోందా! అంతే కదండీ.. కాలం.. పల్లె ఆర్డినరీ బస్లా కాకుండా జెట్ స్పీడ్ బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్లినట్లుగా గడిచిపోతోందంతే! ఈ వేడుక మన ఆలోచనలు, భావజాలానికి కూడా కొత్తదనాన్ని తెస్తుంది. జీవితంలో మరింత మెరుగ్గా ఉండేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోని ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఈ న్యూ ఇయర్ ప్రారంభంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. మీకు, మీ కుటుంబ సబ్యులకు ఆరోగ్యం, ఆనందం, సంపద, జ్ఞానం, శాంతి, శ్రేయస్సు ఈ నూతన సంవత్సరంలో కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. క్రింద ఇవ్వబడిన విషెష్ తో మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి.. మీ జీవితంలో ఈ కొత్త సంవత్సరం సరికొత్తగా ఉండాలి. మీ జర్నీ ఆనందంగా సాగాలి. మీరు సరికొత్త గమ్యాలను చేరుకోవాలి. మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023. ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ 2023 ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు 2023 అద్భుతమైన మరియు సంతోషకరమైన సంవత్సరం కావలని ప్రార్థిస్తున్నాను! మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..కొత్త సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 కోట్స్: నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు! చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మధురమైన ప్రతిక్షణం.. నిలుస్తుంది జీవితాంతం. రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!! ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కన్నీటిని జారవిడవకు. చిరునవ్వు చెదరనివ్వకు. ఇది సంతోషమయం హ్యాపీ న్యూ ఇయర్ 2023. హ్యాపీ న్యూ ఇయర్ 2023 విషెస్ నువ్వు మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి. ఆయురారోగ్యాలతో జీవించాలి. అభివృద్ధి సాధించాలి. హ్యాపీ న్యూ ఇయర్ 2023. ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలు, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023. ఈ ఏడాది మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రకరకాలుగా విషెష్ చెబుతుంటారు. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూమీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 !! ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు 2023!! హ్యాపీ న్యూ ఇయర్ 2023 మెసేజ్ లు ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!! కష్టాలెన్నైనా సరే రానీ.. సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ.. కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం.. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సుమం సుగంధభరితం, ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం! విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ 2023 క్రొత్త ఆరంభాలు క్రమంలో ఉన్నాయి మరియు క్రొత్త అవకాశాలు మీ దారిలోకి రావడంతో మీరు కొంత ఉత్సాహాన్ని అనుభవిస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ 2023 గ్రీటింగ్స్ గతంలోని జ్ణాపకాలను గుర్తుచేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ.. కొత్త ఏడాది శుభాకాంక్షలు పాత సంవత్సరం ముగియనివ్వండి మరియు నూతన సంవత్సరం ఆకాంక్షల వెచ్చగా ప్రారంభమవుతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు! నూతన సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధ భరితం.. ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని కోరుకుంటూ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు.. నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు! హ్యాపీ న్యూ ఇయర్ 2023 వాట్సాప్ స్టేటస్ మరపురాని స్నేహితుడితో ఆనందం, నవ్వు మరియు మరపురాని జ్ఞాపకాలతో నిండిన మరో సంవత్సరం ఇక్కడ ఉంది! కొత్త సంవత్సరం వేళ.. కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ.. మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం కలకాలం మీతోనే ఉండిపోవాలని.. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు.. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ మార్గాన్ని సానుకూల గమ్యస్థానానికి మార్గనిర్దేశం చేయడానికి కొత్త సంవత్సరం మీకు వెచ్చదనం, ప్రేమ మరియు కాంతిని తెస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ 2023 వాట్సాప్ డీపీ నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్యం, సంపద మరియు ఆనందాన్ని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ ... నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాత్రులు చీకటిగా ఉన్నాయి, కానీ రోజులు వెలుగుగా ఉంటాయి, మీ జీవితం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి భయపడకండి, ఎందుకంటే దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని బహుమతిగా ఇచ్చాడు.నూతన సంవత్సర శుభాకాంక్షలు! నూతన సంవత్సర శుభాకాంక్షలు! రాబోయే సంవత్సరం గొప్ప సాహసాలు మరియు అవకాశాలతో నిండి ఉండండి. చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ, సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.