శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో తొలిసారిగా నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ వేడుకల్లో పాల్గొన్న యువత అత్యంత ఉత్సాహంగా 2024కు స్వాగతం పలికారు.
నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి కశ్మీర్ యువత లాల్‌చౌక్ వద్దకు చేరుకుని ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా అధికసంఖ్యలో లాల్‌చౌక్ వద్దకు తరలివచ్చారు. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ముందుగానే పలు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు ఉత్తర కాశ్మీర్‌లో ఎప్పుడూ మంచుతో నిండిపోయే గుల్‌మార్గ్ శీతాకాలపు ఎండలో మెరిసిపోయింది. నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఉదయం నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. గుల్‌మార్గ్‌లో రోజంతా సందడి నెలకొంది. వివిధ సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకులు ఆనందంగా నృత్యాలు చేస్తూ కనిపించారు.
తొలిసారిగా ప్రభుత్వం లాల్‌చౌక్ దగ్గర భారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహించింది. గతంలో స్థానిక హోటళ్ల నిర్వాహకులు మాత్రమే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు మొదటి సారిగా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. తమ కొత్త సంవత్సరం 2024 ఇలాంటి స్వర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: వినూతన వేడుకలు..
This is #SrinagarSquare, #LalChowk right now! A city life never seen before. The celebration, the vibrancy like never before!
— Athar Aamir Khan (@AtharAamirKhan) December 31, 2023
This is the probably the biggest alibi to the transformation that Srinagar city has witnessed with the implementation of #SrinagarSmartCity projects!… pic.twitter.com/f3mL69RjFF
Comments
Please login to add a commentAdd a comment