lal chowk
-
శ్రీనగర్ లాల్‌చౌక్ కోసం మామ- మేనల్లుడు పోటీ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 90 అసెంబ్లీ స్థానాల్లో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ సీటు కీలకమైన సీటుగా పేరొందింది. సెప్టెంబర్ 25న లాల్ చౌక్ స్థానానికి రెండో దశలో పోలింగ్ జరగనుంది. ఈ సీటు నుంచి ఇతర అభ్యర్థులతో పాటు మామ, మేనల్లుడు కూడా తలపడుతున్నారు.లాల్ చౌక్ నుంచి అప్నీ పార్టీ సీనియర్ నేత అష్రఫ్ మీర్, పీడీపీ యువ అభ్యర్థి జుహైబ్ యూసుఫ్ మీర్ తలపడుతున్నారు. వీరిద్దరూ వరుసకు మామా- మేనల్లుడు. గతంలో అష్రఫ్ మీర్ పీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుండి పోటీచేసి, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఓడించారు. అయితే 2018లో బీజేపీ, పీడీపీ కూటమి తెగిపోవడంతో అష్రఫ్ మీర్ పీడీపీని వీడి అల్తాఫ్ బుఖారీ సొంత పార్టీ అయిన అప్నీలో చేరారు. కాగా జుహైబ్ బ్రిటన్ నుంచి ఆర్థికశాస్త్రంలో పీజీ పట్టా పొందారు. మెహబూబా ముఫ్తీ అతనికి లాల్ చౌక్ నుండి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చారు. దీంతో లాల్ చౌక్‌లో మామ- మేనల్లుడు పోరు ఆసక్తికరంగా మారింది.మరోవైపు జమ్ము కశ్మీర్ చరిత్రలో ఏనాడూ ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఈసారి లాల్ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన బలాన్ని చాటే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి అజాజ్ హుస్సేన్ ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించి, ఇక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత బీజేపీ ఇక్కడ పలు అభివృద్ధి పనులు చేసిందని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ -
లాల్‌చౌక్‌లో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు!
శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో తొలిసారిగా నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ వేడుకల్లో పాల్గొన్న యువత అత్యంత ఉత్సాహంగా 2024కు స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి కశ్మీర్ యువత లాల్‌చౌక్ వద్దకు చేరుకుని ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా అధికసంఖ్యలో లాల్‌చౌక్ వద్దకు తరలివచ్చారు. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ముందుగానే పలు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉత్తర కాశ్మీర్లో ఎప్పుడూ మంచుతో నిండిపోయే గుల్మార్గ్ శీతాకాలపు ఎండలో మెరిసిపోయింది. నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఉదయం నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. గుల్మార్గ్లో రోజంతా సందడి నెలకొంది. వివిధ సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకులు ఆనందంగా నృత్యాలు చేస్తూ కనిపించారు. తొలిసారిగా ప్రభుత్వం లాల్‌చౌక్ దగ్గర భారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహించింది. గతంలో స్థానిక హోటళ్ల నిర్వాహకులు మాత్రమే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు మొదటి సారిగా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. తమ కొత్త సంవత్సరం 2024 ఇలాంటి స్వర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వినూతన వేడుకలు.. This is #SrinagarSquare, #LalChowk right now! A city life never seen before. The celebration, the vibrancy like never before! This is the probably the biggest alibi to the transformation that Srinagar city has witnessed with the implementation of #SrinagarSmartCity projects!… pic.twitter.com/f3mL69RjFF — Athar Aamir Khan (@AtharAamirKhan) December 31, 2023 -
‘ప్రధాని మోదీ వల్లే అది సాధ్యమైంది’
న్యూఢిల్లీ: ఆదివారం జమ్ము కశ్మీర్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్ లాల్ చౌక్‌లో జాతీయ జెండా ఎగరేశారు ఆ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ. అయితే.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్లే రాహుల్ గాంధీ అలా జెండా ఎగరేయడం సాధ్యమైందని బీజేపీ ఎంపీ రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ‘అసలు రాహుల్ గాంధీ అంత ప్రశాంతంగా లాల్ చౌక్‌లో జెండా ఎలా ఎగరేయగలిగారు? ఆ పరిస్థితులకు కారణం ఆర్టికల్ 370 రద్దు కావడం. అది చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం. కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ గడ్డపై ఉగ్రవాదం, ప్రజల భయాందోళనలు మాత్రమే కనిపించేవి. కానీ, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అక్కడ శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. అధిక సంఖ్యలో పర్యాటకులు క్యూ కడుతున్నారు అని రవిశంకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ రాజ్యవర్థన్ రాథోడ్ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ గర్వంగా జాతీయ జెండాను ఎగరేశారు. అలాంటి పరిస్థితులు అక్కడ నెలకొనడానికి కారణం ప్రధాని మోదీ అని ఉద్ఘాటించారు. జమ్ము కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాత్రం ఆ క్రెడిట్‌ను ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షాకు సైతం దక్కుతుందని పేర్కొన్నారు. ఏడు వసంతాల తర్వాత నెహ్రూ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి శ్రీనగర్ లాల్ చౌక్‌లో జెండా ఎగరేశాడు. ఈ ప్రాంతంలో ప్రశాంతత, సోదర భావం పెంపొందడానికి మోదీ, షాలే ముఖ్యకారకులు అని రైనా పేర్కొన్నారు. ఇదీ చదవండి: నేటితో భారత్ జోడో యాత్రకు ముగింపు -
నేటితో ముగియనున్న జోడో యాత్ర
శ్రీనగర్: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సోమవారం జమ్మూ కశ్మీర్లో ముగియనుది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ క్లాక్ టవర్ వద్ద అత్యంత కటుదిట్టమైన భద్రత నడుమ ఆయన ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948లో ఇక్కడే జాతీయ పతాకాన్ని ఎగరేయడం విశేషం. రాహుల్ మాట్లాడుతూ దేశ ప్రజలకు తానిచ్చిన హామీని నెరవేర్చుకున్నానని చెప్పారు. సెప్టెంబర్ 7న మొదలైన రాహుల్ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 4 వేల కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. మతసామరస్యమే ప్రధాన ఎజెండా సాగిన ఈ యాత్ర విజయవంతం కావడంతో రాహుల్ ఉల్లాసంగా కనిపించారు. సోమవారం ర్యాలీతో యాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లోని ఎస్కే స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు 23 ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. బీజేపీపై పోరుకు విపక్షాలు ఏకం విపక్షాల మధ్య విభేదాలున్నా, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై పోరులో అవి ఐక్యంగా ఉంటాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జోడో యాత్రలో పాల్గొనబోమని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ చెప్పడంపై ఆయన స్పందించారు. జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తర భారతానికి చేరినప్పటికీ ఫలితం మాత్రం దేశమంతటా ఉందన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ల విద్వేషం, అహంకారంల స్థానంలో తమ యాత్ర దేశానికి సోదరభావమనే ప్రత్యామ్నాయాన్ని చూపిందని అన్నారు. -
చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను శుక్రవారం భద్రత లోపాల దృష్ట్యా సడెన్‌గా నిలిపివేసిన సంగతి తెలిసింది. ఆ తదనంతరం శనివారం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామ జిల్లాల కట్టుదిట్టమైన భద్రత నడుమ పునః ప్రారంభమైంది. ఇక ఈ యాత్ర ముగుస్తున్న తరుణంలో రాహుల్ శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా తోపాటు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు కేటాయించిన భద్రతను కాంగ్రెస్ నేతలకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంతేగాదు గత రాత్రి నుంచే లాల్ చౌక్‌కు వెళ్లే అన్ని రహదారులను మూసివేసి, వాహానాల రాకపోకలను నియంత్రించారు. ఈ యాత్ర బౌలేవార్డ్ ప్రాంతంలోని నెహ్రు పార్క్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఎంఏ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఎస్కే స్టేడియంలో బహిరంగ ర్యాలీ నిర్వహిస్తారు. దీనికి 23 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యూకుమారి నుంచి ప్రారంభమై సుమారు 75 జిల్లాలు పర్యటించి దాదాపు 3,570 కి.మీ పాదయాత్ర చేశారు రాహుల్. #WATCH | Jammu and Kashmir: Congress MP Rahul Gandhi unfurls the national flag at Lal Chowk in Srinagar. pic.twitter.com/I4BmoMExfP — ANI (@ANI) January 29, 2023 (చదవండి: భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం) -
శ్రీనగర్‌లో ఉద్రిక్తత
-
‘లాల్‌చౌక్‌లో జెండా ఎగరేస్తాం’
సాక్షి, జమ్మూ : ధైర్యముంటే లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరేయండన్న ఫారుక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. ‘ఫరుఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలను సవాలుగా తీసుకుంటున్నాం.. లాల్‌చౌక్‌లో జెండా ఎగరేస్తామని’ శివసేన జమ్మూ కశ్మీర్ విభాగం బుధవారం ప్రకటించింది. లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరేసేందుకు ఇప్పటికే ప్రత్యేకమైన టీమ్‌ను పంపినట్లు శివసేన జమ్మూ కశ్మీర్ విభాగం చీఫ్ డింపీ కోహ్లీ తెలిపారు. రేపు లాల్ చౌక్‌లో భారత జాతీయ జెండా రెపరెపలాడుతుంది.. దీనిని ధైర్యమున్నవారు ఆపొచ్చు అని ఆయన సవాల్ విసిరారు. -
ధైర్యముంటే జెండా ఎగరేయండి: ఫరూక్
జమ్మూ: కేంద్రానికి ధైర్యముంటే శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో జాతీయ జెండాని ఎగురవేయాలని కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని కేంద్రం, బీజేపీ మాట్లాడుతున్నాయి. ధైర్యం ఉంటే ముందుగా లాల్ చౌక్‌లో ఎగురవేయండి. పీవోకే భారత్‌లో అంతర్భాగం కాదన్నది వాస్తవం’ అని అన్నారు. భారతీయుల మనోభావాలను కించపరిచేందుకు ఇలాంటి వ్యాఖ్యలను తాను చేయడంలేదని చెప్పారు. ఫరూక్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ మండిపడ్డారు. -
ఉత్సాహంపై నీళ్లు.. జాన్వీకి చుక్కెదురు!
శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి.. దేశభక్తి చాటుకోవాలనుకున్న లుధియానా బాలిక జాన్వీ బెహల్ (15)కు చుక్కెదురైంది. ఆదివారం శ్రీనగర్ కు వచ్చిన ఆమెను, ఆమె మద్దతుదారులను భద్రతాదళాలు ఎయిర్ పోర్టులోనే నిలువరించాయి. లాల్ చౌక్ లో జెండా ఎగురవేయాలన్న ఆమె ప్రయత్నాన్ని వేర్పాటువాదులు అడ్డుకునే అవకాశం ఉండటంతో వారిని ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపించారు. దీంతో జాన్వీ భారత అనుకూల నినాదాలు చేస్తూ శ్రీనగర్ నుంచి వెనుదిరిగారు. జాతి వ్యతిరేక నినాదాల విషయంలో జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ కు సవాలు విసరడం ద్వారా జాన్వీ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జాతి వ్యతిరేక నినాదాల విషయంలో కన్హయ్యకుమార్ కు దమ్ముంటే తనతో చర్చకు రావాలని ఆమె సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేసి తన దేశభక్తిని చాటుకోవాలని జాన్వీ భావించారు. అయితే, తన మిషన్ పూర్తికాకపోవడం నిరాశను కలిగించిందని జాన్వీ తెలిపారు.